LATEST NEWS
  ఉత్తరాఖండ్‌ వరదల్లో 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో వరద ఉధృతికి ధరాలీలోని హార్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది. అయితే ఆ సమయంలో క్యాంప్‌లో ఉన్న జేసీవో సహా ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లు వార్తలు విస్తృతం అయ్యాయి. మరోవైపు.. వరదల విషయం తెలిసిన వెంటనే అక్కడకు వచ్చిన ఆర్మీ జవాన్లు 20 మంది పౌరులను కాపాడారు.  హర్షిల్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. ప్రస్తుతం ధరాలీ గ్రామంలో NDRF, SDRF సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ ప్రకృతి విలయంలో 60 మందికి పైగా ప్రజలు గల్లంతైన విషయం తెలిసిందే. 20-25 హోటళ్లు, నివాసాలు నెలమట్టమయ్యాయి. రంగంలోకి దిగిన సైన్యం సహాక చర్యలు చేపట్టింది.
  మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందించారు.  మంత్రి పదవిపై తన సోదరుడు రాజగోపాల్‌ రెడ్డికి హామీ ఇచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు.  తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్టేజ్‌లో తాను లేనంటూ వెంకట్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌లో తాను సీనియర్‌ మంత్రి అయినప్పటికీ హైకమాండ్‌ నిర్ణయమే కీలకమని చెప్పారు.  సీఎం, పీసీసీ చీఫ్‌ కలిసి పదవులపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు. తాను మంత్రి పదవి ఇచ్చే.. ఇప్పించే పరిస్థితుల్లో లేనని తెలిపారు. అంతా హైకమాండ్‌, రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని అన్నారు. నేనే కాదు, ఎవరూ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.  కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారని మంత్రి అన్నారు. సినీ కార్మికుల వేతనాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందని నిర్మాతలు మొండిగా ఉండకుదన్నారు. కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకొని, జీతాలు పెంచాలని సూచించారు.ఇదే విషయంపై పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
  సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌ కోర్టులో గోపాలపురం పోలీసులు హాజరుపర్చారు. కస్టడీలో సంచలన విషయాలను పోలీసులు రాబట్టారు. పిల్లలను అమ్మే గ్యాంగులతో నమ్రత లింకులు పెట్టుకున్నట్టు గుర్తించారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రాకు చెందిన గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు.  అంతే కాకుండా ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి అక్రమాలు జరిపినట్టు నిర్దారించారు. . గతంలో పిల్లల్ని అమ్ముతూ.. అరెస్ట్ అయిన నందిని, హర్ష, పవన్ అనే వ్యక్తులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఒక్కొక్క పిల్లాడిని రూ.3 నుంచి రూ.5 లక్షల రూపాయలకు నమ్రత కొనుగోలు చేసినట్లు పోలీసులు వివరించారు. పిల్లల అమ్మకాలతో పాటు యువతి యువకులను కూడా నమ్రత గ్యాంగ్ ట్రాప్ చేసిందని చెప్పారు.  యువతి , యువకుల వీర్యకణాలు అండాలను సేకరించి అమ్మేవారని పోలీసులు స్పష్టం చేశారు. నమ్రత ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహణ లైసెన్స్‌ను తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ 2021లో పొడిగించలేదు. దీంతో తాను ఆ వృత్తి నిర్వహించట్లేదంటూ నమ్రత లేఖ కూడా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని గోపాలపురంలో నాలుగు అంతస్తుల భవనంతోపాటు మరో మూడు చోట్లా అక్రమంగా యూనివర్సల్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. అయితే తన పేరుతో కాకుండా డాక్టర్‌ సూరి శ్రీమతి పేరుతో ముద్రించిన లెటర్‌ హెడ్స్‌తో కథ నడిపించారు
  దేశంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  కారు గుర్తును పోలిన సింబ‌ల్స్ దాదాపు 9 వ‌ర‌కు ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు 2019 ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరిలో 5 వేల ఓట్ల‌తో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి గెలిచారు. త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేసిన బూర న‌ర్స‌య్య ఓడిపోయారు. కారు గుర్తును పోలిన రోడ్డు రోల‌ర్‌కు 27 వేల ఓట్లు వ‌చ్చాయి.  ఇలా ఎన్నో సంద‌ర్భాల్లో మా పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రిగింది. మొన్న జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 14 స్థానాల్లో 6 వేల కంటే త‌క్కువ ఓట్ల‌తో ఓడిపోయాం. కారు గుర్తును పోలిన గుర్తుల వ‌ల్లే న‌ష్టం జ‌రిగింది.  ఆ గుర్తులను కేటాయించవద్దని ఈసీకి కేటీఆర్ విన్నవించారు. అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే, జ‌ర్మ‌నీ, ఇట‌లీ కానీ, ఇంకా చాలా దేశాలు కొంత‌కాలం వ‌ర‌కు ఈవీఎంల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేసిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల్లో వాటిపై విశ్వాసం లేకుండా పోయింది.  ఈ క్ర‌మంలో ఈవీఎంల‌ను ర‌ద్దు చేసి పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మైన భార‌త్‌లో దాదాపు 100 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతున్న‌దని కేటీఆర్ తెలిపారు. పార్టీలు ఎన్నికల వాగ్థనాలు విస్మరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కేటీఆర్ కోరారు.  
  మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో 33/11 కేవి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.  వేల కోట్లు దోచుకునే వాళ్ళకే పెద్ద పదవులు కావాలి. నేను అందరిలాగా పైరవీలు చేసి దోచుకునే వాడిని అయితే కాదని హాట్ కామెంట్స్ చేశారు.  తనకు మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా అనేది అధిష్టానం ఇష్టమని ఇంతకంటే దిగజారి బతకలేన్నారు. జూనియర్లకు మంత్రిపదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారని  రాజగోపాల్‌రెడ్డి వాపోయారు. పార్టీలు మారిన వాళ్లకు పదవులు ఇచ్చి తనలాంటి సీనియర్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాళ్లు మొక్కి పదవులు తెచ్చుకోదలచుకోలేదన్నారు. మనసు చంపుకొని బతకడం తన వల్ల కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.   పదవి, పైసలు అన్ని వారే తీసుకుపోతున్నారని, కనీసం పదవి లేకున్నా పైసలు మునుగోడుకు రావాలి కదా అని కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీపడేది లేదని డిసైడ్ అయ్యానని, మీరు కూడా (ప్రజలు) డిసైడ్ అయ్యారా లేదా అంటూ ప్రశ్నించారు.  
ALSO ON TELUGUONE N E W S
Producer Naga Vamsi has been actively promoting his film, Kingdom, starring Vijay Deverakonda and Satyadev, Bhagyashree Borse. He has been giving interviews and he participated in a round table with different media personalities. In that video, he commented on a Youtube Reviewer, Barbell's review, indirectly.  He commented that how can a person go to watch RRR, when they have made Kingdom. These comments have hurt the Youtuber and he released a reply video. In that Barbell, made some shocking revelations and stated that Naga Vamsi, himself approached him for an interview and then appreciated some of his negative reviews for other films. Barbell further slammed him stating that he is trying to control freedom of speech and even manipulating Industry reviewers. He further remarked that he did not like the way, he shouted talking about his comments. He stated that Naga Vamsi has been maintaining double standards by encouraging "negativity" for others while hoping only "positive" words for his films.  The Youtuber further stated that he is no longer looking to be in contact with the producer. He revealed that he is already been facing court cases against him from Telugu Cinema personalities and he would never give up on his right for free speech.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Megastar Chiranjeevi has been asked to be designated elderly figure in Telugu Cinema, after the death of Dasari Narayana Rao. He has been meeting politicians and discussing with Industry bigwigs about problems within and for the support from government. Now, producers have met him at his residence about Workers Strike.  Producers C. Kalyan, Supriya Yarlagadda, Allu Aravind, Mythri Ravi Shankar, and Suresh Babu have met him. After their discussion, C. Kalyan stated that Chiranjeevi asked the producers to not stop shootings immediately. He asked them time to meet Federation and Union representatives. On the other hand, Telangana Cinematography Minister, Komatireddy Venkatreddy supported workers' demands and stated that Hyderabad has been becoming expensive, hence Workers' demands are justifiable. He stated that after Delhi tour, he will talk to producers and workers. He remarked that Government as asked Dil Raju to talk to both parties.  Chiranjeevi might also meet them in one or two days and then, he will take the matters into his hands to solve the issue amicably. With Government supporting workers, it looks like there will be more or less hand twisting for producers from Unions. We have to wait and see, how things will be solved.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్ లకు హాజరయ్యేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, ఒకేసారి అంత శాతం పెంచడం కుదరదని నిర్మాతలు చెబుతున్నారు. అవసరమైతే యూనియన్ తో సంబంధం లేకుండా వర్కర్స్ ని తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతలు సమావేశమయ్యారు. చిరంజీవిని కలిసిన వారిలో సి. కళ్యాణ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, మైత్రి రవి శంకర్, సుప్రియ యార్లగడ్డ ఉన్నారు.    చిరంజీవితో భేటీ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ.. "మేము చిరంజీవి గారిని కలసి సమస్య చెప్పాము. 'షూటింగ్స్ సడెన్ గా ఆపడం భావ్యం కాదు. మీ సమస్యలు చెప్పారు, అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను. రెండు మూడు రోజులు చూసి, పరిస్థితి చక్కబడకపోతే నేను జోక్యం చేసుకుంటాను' అని చిరంజీవి గారు చెప్పారు." అని తెలిపారు.    ఇక సినీ కార్మికుల ఆందోళనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. "కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది. హైదరాబాదులో బతకాలంటే జీతాలు పెరగాలి. ఢిల్లీ పర్యటన తర్వాత కార్మికులతో నేను మాట్లాడతాను. ఈ అంశాలన్నిటిని కూడా దిల్ రాజు కు అప్పగించాము, ఆయన చర్చిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.. టికెట్ల ధరలు పెంచేందుకు మేము అనుమతులు ఇస్తున్నాం. కార్మికులు అడుగుతున్న డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి." అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.   
  మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం 'మాస్ జాతర'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకుడు. శ్రీలీల హీరోయిన్. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా విడుదలైన 'తు మేరా లవర్' ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా 'ఓలే ఓలే' విడుదలైంది. (Mass Jathara)   రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన 'ధమాకా' మూవీ విజయంలో భీమ్స్ మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు 'మాస్ జాతర' కోసం కూడా ఎనర్జిటిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ముఖ్యంగా తాజాగా విడుదలైన 'ఓలే ఓలే' సాంగ్ మాస్ ని దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా ఉంది. ఇక భాస్కర్ యాదవ్ అందించిన లిరిక్స్ అయితే సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి. "ఓలే ఓలే గుంట. నీ అయ్య కాడ ఉంటా. నీ అమ్మ కాడ తింటా. నీ ఒళ్ళోకొచ్చి పంటా. బుద్ధి లేదు.. జ్ఞానం లేదు.. సిగ్గు లేదు.. శరము లేదు.. మంచి లేదు.. మర్యాద లేదు" అంటూ ఊర నాటు భాషలో ఈ సాంగ్స్ లిరిక్స్ ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో, రోహిణి సోరట్ ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాటను ఆలపించారు. ఇక లిరికల్ వీడియోలో వింటేజ్ రవితేజ కనిపించాడు. శ్రీలీల కూడా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ తో ఆకట్టుకుంది. మొత్తానికి థియేటర్లలో ఈ సాంగ్ ఒక ఊపేలా ఉంది.   కాగా, 'మాస్ జాతర' చిత్రం ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ తన ల్యాండ్ మార్క్ మూవీతో మాస్ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.  
  'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్.   పవన్ కళ్యాణ్ తో దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్ శంకర్.. "మాటిస్తే నిలబెట్టుకోడం. మాట మీదే నిలబడ్డం. మీరు పక్కనుంటే.. కరెంటు పాకినట్టే" అని రాసుకొచ్చారు. అలాగే, పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో విజయవంతంగా 'ఉస్తాద్ భగత్ సింగ్' షెడ్యూల్ పూర్తయిందని తెలిపారు. అంతేకాదు, "ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అని హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. హరీష్ శంకర్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.   కాగా, ఇటీవల 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. సెప్టెంబర్ 25న 'ఓజీ'తో థియేటర్లలో అడుగు పెట్టనున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముంది.    
  75 ఏళ్ళ వయసులోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆగస్టు 14న 'కూలీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అలాగే 'జైలర్-2' చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా.. టాలీవుడ్ కి చెందిన బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.   తెలుగులో 'శౌర్యం', 'దరువు' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ.. తమిళ్ లో అజిత్ తో చేసిన 'వీరం', 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం' సినిమాలతో మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరు పొందాడు. ఆ తర్వాత రజినీకాంత్ తో అన్నాత్తే(పెద్దన్న) చేయగా, అది పరాజయం పాలైంది. ఇక గత చిత్రం 'కంగువా'ను సూర్యతో చేయగా.. అది డిజాస్టర్ అయింది. అయినప్పటికీ శివకి రజినీతో మరో సినిమా చేసే అవకాశం వచ్చిందట.   శివ తనకు ఫ్లాప్ ఇచ్చినప్పటికీ, ఆయనతో మరో సినిమా చేయడానికి రజినీకాంత్ రెడీ అవుతున్నట్లు వినికిడి. ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మించనున్నారని తెలుస్తోంది.  
  భారతదేశంలో అత్యంత పారదర్శకమైన, ల్యాబ్ టెస్టులు చేసిన, అమెరికా ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన హెల్త్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో 'ఆల్ఫాలీట్' బ్రాండ్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగరంలోని ట్రైడెంట్ హోటల్‌లో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ వేడుకలో సోనూ సూద్ ముఖ్య అతిథిగా పాల్గొని, 'ఆల్ఫాలీట్' బ్రాండ్‌ను ఆవిష్కరించారు.   ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోనూసూద్ తో పాటు మాజీ మిస్ ఇండియా మానస ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. "Authentic - Exclusive - Performance" అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చిన ఆల్ఫాలీట్, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అత్యుత్తమ సప్లిమెంట్లను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.   ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. "ఆల్ఫాలీట్ వంటి ఒక అద్భుతమైన బ్రాండ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఫౌండర్లు సురేష్ శుక్లా, శ్రవణ్ ఘంటలకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజుల్లో యువత ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపుతోంది. అయితే, మార్కెట్లో కల్తీ సప్లిమెంట్ల బెడద కూడా అదే స్థాయిలో పెరిగింది. సరైన సప్లిమెంట్స్ తీసుకోకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా, తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే ఆల్ఫాలీట్ సంకల్పం ప్రశంసనీయం. ఆల్ఫాలీట్ నాణ్యత విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, వినియోగదారుల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుంది. ఈ బ్రాండ్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని అన్నారు.   ఆల్ఫాలీట్ ఫౌండర్ & సీఈఓ సురేష్ శుక్లా మాట్లాడుతూ, "భారతదేశ సప్లిమెంట్ మార్కెట్‌లో విశ్వసనీయత, పారదర్శకత కొరవడింది. ఈ లోటును పూడ్చేందుకే ఆల్ఫాలీట్‌ను స్థాపించాం. అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి, ఫిట్‌నెస్, బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో, భారతీయ వినియోగదారులకు 100% అసలైన, క్యూఆర్-కోడ్ వెరిఫైడ్, యూఎస్ ప్రమాణాలతో కూడిన ల్యాబ్-టెస్టెడ్ సప్లిమెంట్లను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్‌ను ప్రారంభించాం" అని వివరించారు.   ఆల్ఫాలీట్ కో-ఫౌండర్, సీఎఫ్ఓ శ్రవణ్ ఘంట మాట్లాడుతూ, "సురేష్ శుక్లా ఆలోచన, ఆశయం నచ్చి ఈ ప్రయాణంలో భాగస్వామి అయ్యాను. నాణ్యత విషయంలో రాజీలేని, సమాజ శ్రేయస్సును కాంక్షించే నమ్మకమైన బ్రాండ్‌ను నిర్మించడమే మా ధ్యేయం. ఆల్ఫాలీట్ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యానికి, సాధికారతకు పాటుపడే ఒక ఉద్యమం" అని పేర్కొన్నారు.   పూర్తిగా ల్యాబ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే తమ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని, నాణ్యతలో అమెరికా ప్రమాణాలను పాటిస్తామని నిర్వాహకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫిట్‌నెస్ నిపుణులు, హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్లు పాల్గొన్నారు.  
  చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమా ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది.    ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆది శేషగిరి రావు ఘట్టమనేని, కేఎస్ రామారావు, డైరెక్టర్ పి. మహేష్ బాబు, కేఎల్ నారాయణ, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి గోపాలకృష్ణ, బి గోపాల్, కోటగిరి వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సురేష్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.   ముహూర్తపు సన్నివేశానికి రమేష్ ప్రసాద్ అక్కినేని స్క్రిప్ట్‌ను అందించగా.. ఆది శేషగిరి రావు క్లాప్ కొట్టారు. కేఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మహేష్ బాబు.పి గౌరవ దర్శకత్వం వహించారు.    నేపాల్ దేశ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది. స్టీఫెన్, ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అజయ్ అబ్రహం జార్జ్, ఎడిటింగ్ గా విజయ్ ముక్తవరపు వ్యవహరిస్తున్నారు. కొండల్ జిన్నా సహ నిర్మాత. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.   
The dynamic pairing of Ravi Teja and Sreeleela is back to set the cinematic world ablaze with their latest track, "Ole Ole." This high-energy dance number, following the massive success of "Tu Mera Lover," is quickly establishing itself as a certified dance banger. The song's undeniable appeal lies in the electrifying on-screen chemistry of the lead actors. Ravi Teja delivers his signature vintage moves, while Sreeleela's effortless energy elevates the entire performance, making their combined presence a visual spectacle that's second to none.   The infectious groove of "Ole Ole" is a testament to the musical genius of **Bheems Ceciroleo**, whose signature hook and beats are meticulously crafted to ignite a frenzy among audiences. The track, featuring Bheems's vocals alongside the talented Rohini Sorrat, promises to be a mass celebration. The peppy, catchy lyrics by Bhaskar Yadav Dasari perfectly complement the song's energetic mood. Director Bhanu Bhogavarapu deserves commendation for expertly setting the tone for this mass entertainer. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, the film, *Mass Jathara*, has been generating significant buzz since its announcement. With the release of "Ole Ole," the anticipation for this full-fledged mass entertainer, scheduled to hit theaters on August 27th, has reached new heights.
భారతీయ సినీప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'దీపికా పదుకునే'(Deepika padukone). బాలీవుడ్ లో దాదాపుగా అగ్ర హీరోలందరి సరసన నటించి తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న 'దీపికా' గత ఏడాది ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కల్కి 2898 ఏడి' తో తన సత్తా చాటింది.ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో చేస్తుంది. దీపికా క్యారక్టర్ కి సంబంధించి, మేకర్స్ రిలీజ్ చేసిన  వీడియోతో, దీపికా ఒక శక్తీ వంతమైన పాత్రలో కనిపించబోతున్న విషయం అర్ధమవుతుంది. కొన్ని రోజుల క్రితం ఒక అంతర్జాతీయ హోటల్ చైన్ తో కలిసి ‘ఇట్ మ్యాటర్స్ వేర్ యు స్టే'(It Maaters where you stay)ప్రచారంలో భాగంగా ఒక రీల్ ని దీపికా 'ఇన్ స్టాగ్రామ్'(Instagram)లో పోస్ట్ చేసింది. ఎనిమిది వారాల క్రితం చేసిన ఆ  రీల్ ఇప్పటి వరకు 190 కోట్ల వ్యూస్ ని రాబట్టింది. దీంతో ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తరుపున ఉన్న అత్యధిక వ్యూస్ రికార్డుని దీపికా అధిగమించి,ప్రపంచంలోనే అత్యధికంగా చూసిన రీల్ గా రికార్డు సృష్టించింది. దీపికాకి ఇన్ స్టాగ్రామ్ లో  80 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.  దీపికా ఇటీవల హాలీవుడ్ కి చెందిన 'వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటిగా నిలిచిన విషయం తెలిసిందే. 2006 లో ఉపేంద్ర హీరోగా కన్నడంలో తెరకెక్కిన  ఐశ్వర్య మూవీతో  దీపికా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2007 లో కింగ్ ఖాన్ షారుక్ ఖాన్(Shah Rukh Khan)తో కలిసి చేసిన 'ఓం శాంతి ఓం' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. యాపిల్ పండులో ఉండే పోషకాలకు సమానమైన పోషకాలు ఉండటం వల్ల,  యాపిల్ పండు కంటే తక్కువ ధరలో దొరకడం వల్ల జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. జామపండు పోషకాల నిధి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జామపండు మధ్యలో విత్తనాల భాగం అంటే చాలామందికి నచ్చదు.   ఈ విత్తనాల భాగాన్ని తొలగించి కండ భాగాన్ని తింటుంటారు.  అయితే జామపండులో నిజమైన బలం దాని మధ్యలో ఉంటుందట. పరిశోధకులు దాని విత్తనాలపై పరిశోధన చేసి ఇందులో చాలా  శక్తి ఉంటుందని స్పష్టం చేశారు.  దీని  గురించి తెలుసుకుంటే.. జామ గింజలు ఎందుకు పారేస్తారు? కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయంతో చాలా మంది జామ గింజలను పారేస్తుంటారు. కానీ జామ విత్తనాల గురించి చేసిన పరిశోధనలు చాలా షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి. ప్రయోజనాలు.. జామ గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రమాదకరమని నిరూపించే ALT,  AST ఎంజైమ్‌ల స్థాయిలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది . జామ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు  వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. అంటే జామ పండ్లను బాగా తినేవారికి వృద్దాప్యం తొందరగా రాదు. జామ గింజల్లో కాల్షియం, జింక్, కాపర్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలకు చాలా అవసరం. లేకపోతే బలహీనత మొదలవుతుంది. ఇది తీవ్రంగా మారితే  బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. . ఈ వ్యాధిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి, సులభంగా విరిగిపోతాయి. జామపండు మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది రెండు రకాల ఫైబర్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సరైన జీర్ణక్రియ ఉంటే  ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, పైల్స్ మొదలైన సమస్యల ప్రమాదం దానికదే తగ్గుతుంది. ఈ లాభాలతో  పాటు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది. విత్తనాలను ఇలా కూడా.. జామ విత్తనాలను నేరుగా జామ పండుతో తినడం ఇష్టం లేకపోతే..  జామ విత్తనాలను పండు నుండి వేరు చేయాలి.  వీటిని ఎండబెట్టాలి.  తరువాత వీటిని దోరగా వేయించి నిల్వచేసుకోవాలి.  వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. అంతే కాకుండా ఈ విత్తనాలను స్పైసీ పౌడర్ లా కూడా తయారుచేసుకుని తీసుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి దాదాపు ప్రతి వ్యక్తి లైఫ్ లో  భాగంగా మారింది. పని ఒత్తిడి, సామాజిక అంచనాలు, సంబంధాల సమస్యలు,  భవిష్యత్తు గురించి అసంతృప్తి.. మొదలైనవన్నీ  మానసిక ఆరోగ్యంపై నిరంతరం ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి మరియు ఆందోళన మీ మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, నిద్ర లేకపోవడం, జీర్ణ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,   అలసట వంటి  శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి.  దినచర్యలో కొన్ని చిన్న,  సులభమైన మార్పులు చేయడం ద్వారా  ఒత్తిడి,  ఆందోళన నుండి బయటపడవచ్చని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడే మూడు మార్పుల గురించి తెలుసుకుంటే.. వ్యాయామం, శారీరక శ్రమ.. ఒత్తిడిని తగ్గించడానికి మొదటి సులభమైన మార్పు క్రమం తప్పకుండా వ్యాయామం. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వేగంగా నడవడం, యోగా లేదా స్ట్రెచింగ్  వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అనులోమ-విలోమ వంటి  ప్రాణాయామం,  ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇంట్లో తేలికపాటి ఏరోబిక్స్ లేదా డాన్స్  కూడా ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సమతుల ఆహారం,  హైడ్రేషన్.. సమతుల్య ఆహారాన్ని స్వీకరించడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ లో ఉంచవచ్చు. చేపలు, వాల్‌నట్‌లు,  అవిసె గింజలు వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. విటమిన్ బి,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు, అరటిపండ్లు,  బాదం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కెర,  కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆందోళనను పెంచుతుంది. కాబట్టి వాటిని తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నివారించవచ్చు.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. మైండ్ఫుల్నెస్.. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి మూడవ మార్పు  మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం,  బాగా నిద్రపోవడం. 5-10 నిమిషాల లోతైన శ్వాస పద్ధతులు వంటి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నీలి కాంతి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, నిద్రవేళకు ముందు స్క్రీన్ సమయాన్ని (మొబైల్, టీవీ) తగ్గించాలి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.  మెదడును రీఛార్జ్ చేస్తుంది. నిద్రవేళకు ముందు గోరువెచ్చని నీరు త్రాగడం లేదా పుస్తకం చదవడం నిద్రను మెరుగుపరుస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..