LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు,  నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్  వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు.  ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్..  ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి  లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు..  కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు  మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా    లేదని చెప్పారు.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్..  అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని..  కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ..  కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని  వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్‌షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో..  క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ కేసు తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న యువకుడు సాయికృష్ణ అదృశ్యం కావడం లేదా మరణించి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఈ కేసులో  వైసీపీ చేస్తున్న విమర్శల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం,  హిడెన్ అజెండా ఉందన్నారు   ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, తెలుగుదేశం కూటమి అధికార ప్రతినిథి అప్పసాని రాజేష్.  తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.   కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ఉదంతంపై కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే విఆర్  కు పంపి, ఆపై సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే..  జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని  విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోనే  సిట్ విచారణ అత్యంత వేగంగా సాగుతోందని  గుర్తు చేశారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు అందాయని, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్టు చేశారనీ.. త్వరలోనే ఈ విచారణ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు..  జగన్మోహన్ రెడ్డి ఇటికి చేరే అవకాశం ఉందని అన్నారు.   ఈ మద్యం కుంభకోణం విచారణను పక్కదారి పట్టించడానికి, సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీపీ రాజశేఖర్ బాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే వైసీపీ  ఈ కేసును  రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని అప్పసాని  రాజేష్ అన్నారు. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆనాడు పౌర హక్కుల ఉల్లంఘనలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు హఠాత్తుగా మానవ హక్కుల నేతగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందనీ, జూన్ 29వ తేదీ నాటికి పోలీసులు కోర్టుకు సమర్పించే నివేదికతో అసలు నిజాలు అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కేసులో ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ..  తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ కమిషన్ కూడా ఏర్పాటైందనీ..  బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒక యువకుడి అదృశ్యం కేసును అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్  డ్రామాను ప్రజలు గమనిస్తున్నారనీ, విచారణ పూర్తయితే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని అప్పసాని చెప్పారు. 
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ విజయవాడలో చోటుచేసుకున్న సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం  వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. పోలీస్ కస్టడీలోనే ఈ ఘోరం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో, ప్రభుత్వంపై విమర్శల దాడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని, బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టటే   ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత అతను అనుమానాస్పద రీతిలో అదృశ్యం కావడం, అతని మృతదేహం కూడా లభించకపోవడంతో ఇది కస్టోడియల్ డెత్   అనే ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. పోలీసులు విచారణ పేరిట థర్డ్ డిగ్రీ ఉపయోగించి, అతడి మరణానికి కారణమయ్యారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుడు ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఈ సున్నితమైన ఉదంతంపై అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.   మరోవైపు, ఈ దురదృష్టకర ఘటనను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యవ్యమవుతోంది. ఒక వ్యక్తిగత కేసును లేదా కొందరు పోలీసులు చేసిన అతిని మొత్తం ఒక సామాజిక వర్గంపై జరిగిన దాడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీనియర్ రాజకీయ నాయకుడు సాంబశివరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన  సామాజిక వర్గాల ముసుగులో చేసే రాజకీయాలు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తాయని  హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ అసలు ఎక్కడున్నాడు? సజీవంగా ఉన్నాడా లేదా అనే కోణంలో నిష్పక్షపాత విచారణ జరగాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే పోలీసుల వైఫల్యం ఉంటే వారిని కోర్టుకు అప్పగించి కఠినంగా శిక్షించడమే ఏకైక మార్గమన్నారు. సమాజంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన సామాజిక వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోకుండా, ప్రజలు కూడా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం త్వరితగతిన ఈ కేసుపై స్పష్టతనిచ్చి బాధితులకు న్యాయం చేయడమే కాకుండా, శాంతిభద్రతలను కాపాడటంలో తన నిబద్ధతను నిరూపించుకోవాల్సి ఉందన్నారు.
తెలంగాణ ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని   పరిశీలిస్తే ఒక  చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా చలామణి అవుతున్న శక్తుల మధ్య స్పష్టమైన పొలిటటికల్ వాక్యూమ్  ఏర్పడిందని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి, కాదంటే..  బలమైన ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఉన్నాయా? అన్నచర్చ రాష్ట్రరాజకీయాలలో జోరుగా  సాగుతోంది.  దేశవ్యాప్తంగా లేదా ఇతర రాష్ట్రాల్లో ఒక పార్టీ బలహీనపడితే మరో పార్టీ పుంజుకోవడం సాధారణం..  కానీ తెలంగాణలో  అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటిపైనా ప్రజల్లో  అసంతృప్తి వ్యక్తమవున్న పరిస్థితి. ఇక ఈ రెండూ కాకుండా బీజేపీ కూడా తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నట్లుకనిసిస్తున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. హైదరాబాద్మినహాయిస్తే.. బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది.   దీంతో ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తరహా కేంద్రీకృత పాలనకు భిన్నమైన పరిపాలనను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో ఆ మార్పులు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.  తెలంగాణ మౌలిక ప్రయోజనాలను, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల తెలంగాణ సమాజంలోని మేధావులు, ఉద్యమకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.  మరోవైపు, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్  పరిస్థితి కూడా ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకత్వం తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లోనే కనిపిస్తోంది.  ముఖ్యంగా పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేటీఆర్ శైలి తెలంగాణ సంస్కృతికి, ఇక్కడి మట్టి మనుషుల ఆలోచనలకు దూరంగా కార్పొరేట్ తరహాలో ఉంటోందనే విమర్శలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వస్తున్నాయి4.  ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత సొంతంగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. అయితే ఆమే ముందుకు సాగడానికి  పాత నీడలు,  వివాదాలు ఆమెను వెన్నాడుతున్నాయి. ఆమె జోరుకు ఇవిసహజంగానే అవరోధాలుగా ఉన్నాయి. దీంతో  టీఆర్ఎస్,  బీఆర్‌ఎస్కు  ప్రత్యామ్నాయంగా ఎదిగే  విషయంలో వెనుకబడుతోంది.  ఈ వ్యూహాత్మక రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జరిగిన కొన్ని చారిత్రక ప్రయోగాలను మేధావులు గుర్తుచేస్తున్నారు. గతంలో దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఏర్పాటైన 'మహాజన ఫ్రంట్' తరహా ప్రయోగం ప్రస్తుత తెలంగాణలో అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మైనారిటీ వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి, మహిళా లోకాన్ని భాగస్వామ్యం చేస్తూ ఒక బహుజన ఫ్రంట్ లేదా విస్తృత సామాజిక వేదికను ఏర్పాటు చేయడానికి తెలంగాణలో స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నికల వేళ సీట్ల సర్దుబాట్లు, సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఒక చక్కని వేదిక కాగలదని విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ అధికారమే పరమావధిగా కాకుండా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వం కోసం ఒక పటిష్టమైన ఎజెండాతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు.  ఈ అనుకూల సమయాన్ని సామాజిక శక్తులు సరిగ్గా ఉపయోగించుకోకపోతే, తెలంగాణ రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే  కీలకమైన రాజ్యాంగ బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందాలంటే.. ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహాలకు పదును పెట్టి సొంతంగా మెజారిటీ సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.  లోక్‌సభలో కేవలం సాధారణ మెజార్టీతో సరిపెట్టుకోకుండా, ఏకంగా రెండు బై మూడు వంతుల తిరుగులేని మెజార్టీని సాధించాలని భారతీయ జనతా పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. దేశ భవిష్యత్తును మార్చే డీలిమిటేషన్  అదే నియోజకవర్గాల పునర్విభజన , అలాగూ మహిళా రిజర్వేషన్ వంటి   కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా..  స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం. ఇండియా కూటమి ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో, అధికార ఎన్డీఏ కూటమి తన రూట్‌ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం 540 మంది సభ్యులు ఉన్న లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీల బలం ఉంది. అయితే, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే సభలో కనీసం 360 మంది ఎంపీల (అనగా 2/3 వంతు) మద్దతు తప్పనిసరి.   ప్రస్తుత లెక్కల ప్రకారం చూస్తే ఎన్డీఏ కూటమికి ఇంకా 67 మంది ఎంపీల కొరత స్పష్టంగా ఉంది. ఈ భారీ అంతరాన్ని ఎలాగైనా అధిగమించేందుకు బీజేపీ చాణక్య వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల్లోని అసంతృప్త, రెబల్ ఎంపీలను తమ వైపు తిప్పుకునేందుకు తెర వెనుక వేగంగా పావులు కదుపుతోంది. ఈ ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ప్రధానంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలపై బీజేపీ  దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు, అలాగే మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నుంచి  6గురు ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, సొంత పార్టీలపై అసంతృప్తి,  వ్యక్తిగత రాజకీయ ఆకాంక్షలే ఈ పరిణామాలకు ప్రధాన కారణాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాల నుండి ఆశించిన విధంగా 26 మంది ఎంపీలు ఎన్డీఏ గూటికి చేరితే, అప్పుడు కూటమి   బలం 319 స్థానాలకు చేరుకుంటుంది. అయినప్పటికీ లక్ష్యానికి ఇంకా 41 మంది ఎంపీల మద్దతు అవసరమవుతుంది. ఈ మిగిలిన లోటును భర్తీ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ పై బీజేపీ చూపు పడింది. యూపీలో అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్‌లతో కూడిన సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీల బలం ఉంది. అయితే అక్కడ అంతర్గత విభేదాలు, టికెట్ల పంపకాలపై అసంతృప్తి, స్థానిక నాయకత్వ వివాదాల కారణంగా కొందరు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్.  వీరిలో కనీసం 10 నుండి 15 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతు ఇచ్చినా కూటమి బలం 330 నుండి 335 మార్కును తాకుతుంది. అప్పుడు కేవలం పాతిర నుండి 30 స్థానాల  అంతరం మాత్రమే మిగులుతుంది, దీనిని ఇతర చిన్న పార్టీలు లేదా స్వతంత్రుల ద్వారా సులభంగా సాధించవచ్చని బీజేపీ యోచన. ఈ వ్యూహం గనుక నూటికి నూరు శాతం ఫలించి ఎన్డీఏకు 2/3 మెజార్టీ వస్తే, దేశంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. డీలిమిటేషన్ వంటి సున్నితమైన అంశాలను ప్రతిపక్షాల ఆందోళనలతో నిమిత్తం లేకుండా ముందుకు తీసుకెళ్లవచ్చు. అయితే, ఈ వ్యూహం వెనుక చట్టపరమైన, నైతికపరమైన ప్రశ్నలు కూడా  ఉన్నాయి.  ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ ఇలా ఎంపీలను ఆకర్షించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో..  ఉత్తరాది ఎంపీల బలంతో ఈ బిల్లులను ఆమోదిస్తే దేశంలో ఉత్తర-దక్షిణ విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వార్తలు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఒక షాకింగ్ గాసిప్ తీవ్ర కలకలం రేపుతోంది. వైవిధ్యమైన నటనతో మెప్పించే స్టార్ హీరో ధనుష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తోందని ప్రచారం జరిగిన ప్రేమాయణం ఇప్పుడు ముగిసిందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించిన ఊహాగానాలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధనుష్, మృణాల్ తమ బంధానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారట. ఎవరి కెరీర్‌పై వారు దృష్టి పెట్టేందుకు పరస్పర అంగీకారంతోనే ఈ క్రేజీ జంట సైలెంట్‌గా విడిపోయినట్లు ట్రెండ్ అవుతున్న వార్తల సారాంశం. అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, అప్పుడే విడిపోవడానికి దారితీసిన కారణాలు ఏంటనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి. ఈ విడిపోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఈ ప్రచారంపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. గతంలో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ధనుష్ సందడి చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు తారలు పలుమార్లు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లి దుస్తుల ఏఐ ఫొటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రముఖ నిర్మాత మురళీమోహన్ సమాజం పట్ల తనకున్న బాధ్యతను మరోసారి చాటుకున్నారు. ఎప్పుడూ ఆడంబరాలకు పోకుండా అర్థవంతంగా వేడుకలు జరుపుకునే ఆయన, తాజాగా తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఆదర్శనీయంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ప్రముఖ "దేవనార్ బ్లైండ్ స్కూల్" వేదికగా ఈ ప్రత్యేక వేడుకలు జరిగాయి. ప్రతి ఏటా తన పుట్టినరోజుతో పాటు కుటుంబ సభ్యుల వివాహ దినోత్సవాలను ఇక్కడి అంధ విద్యార్థుల మధ్యే సెలబ్రేట్ చేసుకోవడం మురళీమోహన్‌కు ఒక అలవాటు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది కూడా ఆయన తన సతీమణితో కలిసి చూపులేని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారితో కాసేపు సరదాగా సమయాన్ని గడిపారు. ఈ వేడుకలో పాఠశాల చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుక సందర్భంగా స్కూలులో ఒక ప్రత్యేక సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ గాయకుడు గంగాధర శాస్త్రి, అలాగే దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఎంతో చక్కగా భగవద్గీత శ్లోకాలను ఆలపించడం అక్కడికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. "నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందడం చూసి సంతోషిస్తున్నాను. అన్ని అవయవాలు బాగున్న మన పిల్లలనే మనం ఒక్కోసారి సరిగ్గా చూసుకోలేము, అలాంటిది చూపులేని ఈ చిన్నారులను ఎంతో బాధ్యతగా, ప్రేమగా పెంచుతున్న సాయిబాబా గౌడ్ గారి కృషి అభినందనీయం. ఈ పిల్లలు భగవద్గీతను నేర్చుకుని పాడుతుంటే ముచ్చటేసి, ప్రత్యేకంగా గంగాధర శాస్త్రి గారిని ఇక్కడికి ఆహ్వానించాను" అని ఎమోషనల్ అయ్యారు. నటుడిగా 'జయభేరి' సంస్థ ద్వారా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన మురళీమోహన్, కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం మరియు చిన్నారులతో పెళ్లి రోజు జరుపుకున్న తీరుపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు మురళీమోహన్ దంపతులకు 61వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిరుపేదలు, అంధులకు ఆయన అందిస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినీ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మురళీమోహన్, రాబోయే రోజుల్లో తన జయభేరి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘#Arasan’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ వెలుగులోకి వచ్చింది. దర్శకుడు వెట్రిమారన్ తన కెరీర్ ఆరంభంలో ధనుష్‌తో తెరకెక్కించిన 'పొల్లాదవన్' షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ‘అరసన్’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారట. అప్పట్లోనే పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఇన్నాళ్లకు ఈ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ పట్టాలెక్కుతుండటంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూర్తిగా నార్త్ చెన్నై రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. తన ప్రతి సినిమాలో పాత్రల కోసం ఎంతో కష్టపడే హీరో శింబు, ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌తో నటనలో మరో విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ కథలోని విభిన్న టైమ్‌లైన్స్‌కు అనుగుణంగా శింబు మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో వెట్రిమారన్, ధనుష్ కాంబోలో వచ్చిన ‘పొల్లాదవన్’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు శింబు ఇంటెన్స్ పవర్‌ఫుల్ మేకోవర్, దానికి తోడు వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ స్క్రీన్‌ప్లే తోడవడంతో ‘అరసన్’ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ కాంబినేషన్ గురించిన చర్చలు ఊపందుకున్నాయి. ఇక ఈ భారీ యాక్షన్ డ్రామాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో మెరిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్ మరియు అధికారిక వివరాలు వెలువడనున్నాయి.
సినీ తారలు వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నిరంతరం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటారు. అయితే ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి, తమ పర్సనల్ లైఫ్‌కు ప్రాధాన్యత ఇవ్వడానికి కొంతమంది తారలు డిజిటల్ ప్రపంచానికి కాస్త విరామం ఇస్తుంటారు. తాజాగా ఇదే బాటలో పయనిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన ముద్దుగుమ్మ కయాదు లోహర్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా గుడ్‌బై చెప్పేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. నిరంతర ఆన్‌లైన్ ప్రెజెన్స్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు 'సోషల్ మీడియా డెటాక్స్' వైపు మొగ్గు చూపినట్లు ఈ బ్యూటీ స్పష్టం చేసింది. ఈ మేరకు నెటిజన్లతో ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకుంటూ.. కేవలం శరీరానికే కాదు, మనసుకు కూడా సరైన విశ్రాంతి ఎంతో అవసరమని పేర్కొంది. అందుకే కొద్దిరోజుల పాటు డిజిటల్ నెట్‌వర్క్‌కు దూరంగా జరగాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. గత కొంతకాలంగా నెట్టింట యాక్టివిటీని తగ్గించుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పిన కయాదు, మొబైల్ స్క్రీన్‌కు అవతల ఉన్న నిజ‌మైన జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించాలనేదే తన తాజా లక్ష్యమని వెల్లడించింది. తనతో తాను క్వాలిటీ టైమ్ గడపడానికి ఈ బ్రేక్ ఉపయోగపడుతుందని నమ్ముతోంది. ఇప్పటివరకు తనకు నిరంతరం సపోర్ట్ అందిస్తూ వస్తున్న ఫ్యాన్స్, వెల్‌విషర్స్ అందరికీ ఈ సందర్భంగా ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే కయాదు అకౌంట్ క్లోజ్ అయినప్పటికీ, ఆమెకు సంబంధించిన సినిమా ముచ్చట్లు మరియు అఫీషియల్ అప్‌డేట్స్‌ను ఆమె పీఆర్ టీమ్ నిరంతరం సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అభిమానులకు అందజేస్తుందని భరోసా ఇచ్చింది. అందరూ ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, త్వరలోనే మళ్లీ కొత్త ఉత్సాహంతో తిరిగి వస్తానంటూ ఈ యంగ్ హీరోయిన్ తన సందేశాన్ని ముగించింది. కెరీర్ పరంగా చూస్తే కయాదు లోహర్ ప్రస్తుతం మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. ఇటీవల తమిళ చిత్రం 'డ్రాగన్', మలయాళంలో 'పల్లిచట్టంబి' చిత్రాలతో మెప్పించిన ఈమె చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైస్' చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా రాబోతున్న 'ఐ యామ్ గేమ్' సినిమాలోనూ ఈమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇవే కాకుండా కోలీవుడ్‌లో మరి సెల్వరాజ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మంజనతి', జీవీ ప్రకాశ్‌తో 'ఇమ్మోర్టల్' వంటి చిత్రాలతో బిజీగా ఉంది. కయాదు లోహర్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉంటూ ఇలాంటి ఒత్తిడిని జయించడానికి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచి విషయమేనంటూ నెటిజన్లు ఆమెకు అండగా నిలుస్తున్నారు. "మీ ఆరోగ్యం, ప్రశాంతత మాకు ముఖ్యం.. త్వరగా మరింత ఎనర్జీతో తిరిగి రండి" అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న కయాదు లోహర్, సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరమైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద తన చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటుంది. ఈ క్రేజీ ప్రాజెక్టులతో ఈ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.
Satyadev has built a reputation for taking unconventional roles and Rao Bahadur looks set to continue that trend. Directed by Venkatesh Maha and presented by Mahesh Babu, the upcoming psychological drama has already generated strong curiosity with its trailer and first single Sundari. With the film gearing up for release on July 3rd, the makers have now unveiled the second single, Desa Sanchari. Unlike conventional promotional songs, Desa Sanchari embraces an old-school rock and roll identity while giving it a visually theatrical presentation. The track acts as a tribute to retro music and vintage performance styles, while still fitting into the dark and immersive world that the film appears to promise. One of the biggest highlights of the song is Satyadev’s surprising screen transformation. Styled with shades reminiscent of classic rock performers, the actor takes on demanding ballroom-inspired choreography with confidence and fluidity. The entire song being staged inside a cage adds an unusual visual texture and reflects Venkatesh Maha’s attempt to create something symbolic rather than straightforward. Musically, Smaran Sai delivers a composition packed with rhythm and energy while balancing retro influences with contemporary presentation. Hemachandra’s deep vocal texture drives the track effectively and Priyanka Gajanan’s voice adds additional character to the arrangement. The choreography further enhances the mood by focusing on movement, poses and flexibility rather than large-scale spectacle. Produced by Anurag Reddy, Sharath Chandra and Chinta Gopalakrishna Reddy, Rao Bahadur is positioning itself as a psychological drama with a distinctive visual and musical identity.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
The controversy around viral bikini visuals falsely linked to actress Rukmini Vasanth has now moved beyond social media discussion into legal action. In a major development on June 20, Bengaluru Cyber Crime Police arrested three people accused of creating and circulating AI-generated images and videos using the actress’s identity. The issue first exploded in May after manipulated visuals began spreading online claiming to show Rukmini in a poolside bikini shoot. The actress quickly responded and clarified that the content was completely fabricated using AI and deepfake tools. She called it a serious violation of privacy and announced legal action against those responsible. Following her complaint, cyber authorities opened an investigation and traced multiple accounts involved in creating and amplifying the content. Earlier this month, FIRs had reportedly been registered against 29 social media accounts across platforms as investigators expanded the digital trail and sought platform cooperation. Now, police have confirmed the arrest of three accused allegedly connected to generating and distributing the manipulated visuals. Reports state that mobile phones used in creating and sharing the content were seized as part of the probe. The accused were produced before a judicial magistrate and remanded while further investigation continues into whether additional people were involved. The development marks one of the stronger responses seen in a celebrity deepfake case in India. While there is no final court verdict yet, the arrests indicate that authorities are treating AI-driven impersonation and digital character assassination with increasing seriousness. Rukmini had earlier stated that such misuse of technology does not affect only public figures but can become a wider issue for women online. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana) దంపతుల గారాల పట్టి, మెగా ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల (Klin Kaara) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు(జూన్ 20న) క్లీంకార తన మూడవ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అదిరిపోయే సర్ప్రైజ్ లభించింది. ఎట్టకేలకు క్లీంకార ముఖం స్పష్టంగా కనిపించేలా ఉన్న ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఫోటోను రామ్ చరణ్, ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటో నెట్టింట అడుగుపెట్టడమే ఆలస్యం, క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. మెగా వారసురాలిని పూర్తి రూపంలో చూడాలనే ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫోటోలో క్లీంకార ఎంతో క్యూట్‌గా ఉంది. ఈ బర్త్ డే సెలబ్రేషన్ పిక్ వెనుక ఒక అందమైన కుటుంబ బంధం కనిపిస్తోంది. ఫోటోలో రామ్ చరణ్, ఉపాసన తమ ముద్దుల కుమార్తెను ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. క్లీంకార మూడవ ఏట అడుగుపెట్టిన శుభ సందర్భంలో, ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.  సాధారణంగానే స్టార్ కిడ్స్ ఫోటోల కోసం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ రామ్ చరణ్ కుమార్తె కావడంతో, పుట్టినప్పటి నుంచి ఆమెపై దేశవ్యాప్తంగా మీడియా ఫోకస్ ఉంది. కానీ ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ క్లీంకార ముఖం నేరుగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు 3rd బర్త్ డే రోజున అధికారికంగా పిక్ రిలీజ్ చేయడంతో మెగా క్యాంప్‌లో పండగ వాతావరణం నెలకొంది. క్యూట్ లుక్స్‌తో ఉన్న మెగా వారసురాలికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.   https://www.instagram.com/p/DZzlrOjMaFF/
Sree Vishnu has steadily built a strong image as an entertainer with films that connected across sections of audiences. But with Comrade Kalyan, the actor seems to be stepping into a noticeably different space. Directed by Janakiram Marella, the film places him in a rural setting and presents him in an extremist-inspired character backdrop, marking a departure from the urban entertainers he has been associated with in recent years. The makers have now released the film’s latest single, Oriya Pilla, and the track instantly stands out for its breezy energy and youthful charm. Rather than focusing on intensity, the song reveals the softer and more playful side of Sree Vishnu’s character as he openly expresses his affection towards leading lady Mahima Nambiar. The village backdrop and vibrant visuals give the song a refreshing identity. Musically, Vijay Bulganin delivers a tune that feels instantly accessible while carrying strong repeat value. The composition blends peppy rhythm with Carnatic influences and gets an emotional lift through Sid Sriram’s rendition. His vocals bring warmth and depth to the romantic portions while maintaining the energetic momentum of the track. On screen, Sree Vishnu appears comfortable in the rustic atmosphere and his dance moves add liveliness to the frames. Mahima Nambiar looks convincing in the village setting and the chemistry between the lead pair becomes one of the major highlights of the song. The choreography and colourful presentation further elevate the experience. Produced by Venkata Krishna Karnati and Seetha Karnati, Comrade Kalyan is gearing up for a theatrical release this August. Going by the promotional material so far, the film appears to be aiming for a fresh flavour while retaining the entertaining qualities that audiences expect from Sree Vishnu. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత (Samantha), రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram). సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజై ఆడియెన్స్‌ను అల‌రిస్తోంది.  సినిమా తొలి ఆట నుంచే ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల నుంచి బ్లాక్‌బస్టర్ రివ్యూలు అందుకుంటోంది. ముఖ్యంగా సమంత చేసిన పెర్ఫార్మెన్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆమె చేసిన ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమా ఓవర్సీస్ మార్కెట్లలో స్ట్రాంగ్ ప్రీ సేల్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు వచ్చిన బ్లాక్‌బస్టర్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా ఈ వీకెండ్ సినిమా చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా తొలి ఆప్ష‌న్‌గా మారింది.  మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి సమంత కెరీర్‌లో హ‌య్య‌స్ట్ ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళలు, ఈ సినిమాలోని మాస్ హంగామా, హై-ఆక్టేన్ యాక్షన్, మొదటి నుండి చివరి వరకు ఎమోషన్‌తో నిండిన ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూడటానికి థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ మూవీకి వ‌చ్చిన అద్భుతమైన ఓపెనింగ్ ట్రేడ్ అనలిస్టులను కూడా ఆశ్చర్యపరిచింది. వీరి అభిప్రాయం ప్రకారం ఈ సినిమా వీకెండ్‌తో పాటు తర్వాత కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ తన జోరును కొనసాగించే అవకాశముంది. మెయిన్ సెంట‌ర్స్‌లో స్ట్రాంగ్ ఆక్యుపెన్సీ, అలాగే సూప‌ర్ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా ప‌లు ప్రాంతాల్లో అదనపు షోస్‌ కూడా పెంచుతున్నారు. హౌస్‌ఫుల్ థియేటర్లు, ఉత్సాహభరితమైన ప్రేక్షకుల స్పందన, అలాగే సోషల్ మీడియాలో వస్తోన్న సూప‌ర్బ్ రెస్పాన్స్ తో ‘మా ఇంటి బంగారం’ ఈ సంవత్సరంలోనే అతిపెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా మారుతోంది. ఈ వీకెండ్‌లో కలెక్షన్స్ గణనీయంగా పెరుగుతాయని ఇండ‌స్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే, రాబోయే రోజుల్లో ఈ సినిమా అనేక బాక్సాఫీస్ రికార్డులను సాధించే దిశగా దూసుకుపోతోంది. మా ఇంటి బంగారం సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు.ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ధ‌ర్మేంద్ర కాక‌ర్ల ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.  
Mega Power Star Ram Charan and Upasana Kamineni have always maintained a careful balance between public life and personal privacy. While both remain active on social media for important updates and professional milestones, they have consciously stayed away from oversharing family moments. As parents too, they have consistently chosen to protect their daughter from unnecessary public exposure. For a long time, fans had been requesting the couple to reveal their daughter Klin Kaara’s face. On her birthday, Ram Charan and Upasana finally decided to share a heartwarming family picture, introducing their little one to the world for the first time. Sharing the adorable moment, they wished her with the message, “Happy Birthday Klin Kaara, our precious little one.” The post instantly caught attention and spread rapidly across social media platforms. Recently, Klin Kaara had already become a talking point among fans after a cute voice message wishing her father’s film Peddi a grand success surfaced online.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.