Home

»

Latest News

నా కెరీర్ నిలబెట్టింది ఆయనే: జయప్రద వ్యాఖ్యలు వైరల్! 

Oct 26, 2026 6:27PM


జయప్రద లాంటి అందగత్తెని చూడలేదని చెప్పిన వాళ్ళల్లో అభిమానులే కాదు,  సినీ మేధావులు, ఉద్దండులు సైతం ఎంతో మంది ఉన్నారు. అలాంటి జయప్రద మన తెలుగు వారవ్వడం మనకెంతో గర్వకారణం. తన సమకాలీనులైన బడా హీరోయిన్స్ సైతం తట్టుకొని జయప్రద సృష్టించిన 'ఆరా' అమోఘం. ఆ చరిత్ర గురించి చెప్పుకుందామంటే అభిమానులు, ప్రేక్షకులే ఆ  చరిత్ర చెప్పేస్తారు. కాబట్టి లేటు చెయ్యకుండా జయప్రద  రీసెంట్ గా ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలని చూసేద్దాం.

ఆమె మాట్లాడుతు 'కృష్ణ గారితో 45 చిత్రాలలో కలిసి నటించడం నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. చెప్పక్కర్లేదు ఇంకా.. ఆయన ఆల్మోస్ట్ నా లైఫ్ లో నాకు సపోర్ట్ చేసింది కృష్ణ గారే. యాక్టర్ గా డైరెక్టర్ గా ఒక మంచి మనిషిగా చూశాను నేను" ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు. మహేష్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారితో కూడా నాకు  మంచి అనుబంధం ఉందని, శోభన్ బాబు గారు తనను అత్త అని పిలిచే వాళ్ళు. కెరీర్ ప్రారంభంలో అడవి రాముడు సినిమాతో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం, తొలి షాట్ సమయంలో కలిగిన భయాన్ని, ఆ తర్వాత ఆయన ఇచ్చిన ప్రశంసలను ప్రస్తావించారు.

దర్శకుడు దాసరి నారాయణ రావు గారితో తన అనుబంధం గురించి చెబుతూ, మేఘసందేశం సినిమా షూటింగ్‌లో బికినీ ధరించడానికి నిరాకరించిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. దాసరి గారు తనకు గురువులాంటివారని, ఆయన మాట వినలేక ఏడ్చానని, అయితే ఆ తర్వాత ఆయన తనకు నచ్చజెప్పి టైరులో కూర్చోబెట్టి ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారని తెలిపారు. ఆ సంఘటన తర్వాత తాను ఎప్పుడూ బికినీ ధరించకూడదని నిర్ణయించుకున్నానని, దాదాపు 30 ఏళ్లుగా ఆ నియమాన్ని పాటిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆసిన్ కూతురు సంచలనం: ఇది మాములు రికార్డు కాదు!

 


 కెరీర్‌లోని ఐకానిక్ పాటలైన ఆరేసుకోబోయి పారేసుకున్నాను, చిలక కొట్టుడు కొడితే యమగోల వంటివాటి గురించి జయప్రద మాట్లాడారు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట చిత్రీకరణ సమయంలో ఒక చెవిటి ఏనుగు కారణంగా ఎదురైన ఆలస్యాన్ని,ఎన్టీఆర్ గారు సహనంతో ఎదుర్కొన్న తీరు వివరించారు. ఈ పాట అప్పట్లో కోటి రూపాయలు వసూలు చేసిందని, ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఆ పాటని గుర్తుచేసుకుంటారని ఆమె తెలిపారు. చిలక కొట్టుడు పాట చిత్రీకరణలో ఎన్టీఆర్ గారి ఉత్సాహం, బాలు, సుశీల గార్ల గానం గురించి ప్రస్తావించారు. ఇప్పటి సినిమాల గురించి మాట్లాడుతూ ఆచార్య, అఖండ వంటి చిత్రాలని చూశానని, ఓటీటీలలో వస్తున్న కంటెంట్‌ను కూడా గమనిస్తున్నానని జయప్రద తెలిపారు. నటిగా తాను ఇప్పటికీ ప్రతి షాట్ విషయంలో టెన్షన్ పడతానని, అది ఒక మంచి క్వాలిటీ అని చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేయాలనే దానిపై ఆమె స్పష్టతను వ్యక్తం చేశారు. గతంలో సాగర సంగమం వంటి పాత్రలు చేయాలని ఉన్నప్పటికీ, ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సవాలుతో కూడిన పాత్రలు చేయాలనుకుంటున్నానని తెలిపారు. కాశ్మీర్ ఫైల్స్ వంటి చిత్రాల స్ఫూర్తితో, "వెరీ వైగరస్, వెరీ వయలెంట్ అండ్ వెరీ కరేజియస్" అయిన క్యారెక్టర్స్ చేయాలని తన కోరికని వెల్లడించారు. 

 

 

[Jayaprada About Super Star Krishna, Jayaprada latest interview, jayaprada latest comments, jayaprada hit movies, jayaprada, Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com