LATEST NEWS
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బీజేపీ అధిష్ఠానం ఇటీవలే పార్టీ నూతన జాతీయ కార్యవర్గాన్ని  ప్రకటించింది. అలాగే ఇప్పుడు దేశ వ్యాప్తంగా భర్తీ చేయాల్సిన ఉన్న ఐదు రాష్ట్రాల గవర్నర్ లను భర్తీ చేయాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ ఐదు గవర్నర్ పదవులలో రెండింటిని ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కేటాయించాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలోనూ ఒకటి ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ సమాచారాన్ని ఆయన ఇప్పటికే చంద్రబాబుకు అందించారని అంటున్నారు.   ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు. ఇప్పుడు 5 రాష్ట్రాల భర్తీలో మరో 2 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని కేంద్రం డిసైడ్ అవ్వడంతో, రెండో గవర్నర్ పదవి కూడా టీడీపీ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం తరఫున మరో గవర్నర్ పదవికి ఎవరు ఎంపికౌతారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కాగా గవర్నర్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో  సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ యనమలరామృష్ణుడు, అలాగే మరో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, అలాగే సీనియర్ నాయకుడు కేఈ క్రిష్ణమూర్తిలు ఉన్నారు. వీరిలో యనమల, కేఈ బీసీ వర్గానికి చెందిన వారు కాగా, ప్రతిభా భారతి ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత. ఈ ముగ్గురూ కూడా ఆరంభం నుంచీ తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉండి కీలక బాధ్యతలలో సేవలందించిన వారే. వీరి ముగ్గురిలో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి, ఉత్కంఠా సర్వత్రా నెలకొని ఉంది.   Another Governer post for TDP,  NDA Governor Appointments, Yanamala Ramakrishnudu, Pratibha Bharati, KE Krishnamurthy, Chandrababu Naidu, TeluguOne
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,  వైసీపీ అధినేత  వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో   ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సందర్భంగా  ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, కటౌట్లు   హాట్ టాపిక్‌గా మారాయి. వైఎస్ జగన్ ఏదో బీఆర్ఎస్ నాయకుడా అన్నట్లుగా ఆ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఉన్నాయి.  ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి. గతంలో వైసీపీ, బీఆర్ఎస్  మధ్య ఉన్న రాజకీయ సంబంధాలు, ఇరు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యం దృష్ట్యా ఇప్పుడీ పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, పొలిటికల్ చర్చకు తెరలేపాయి.  జగన్ పర్యటనలూ ర్యాలీలలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలు.. తెలంగాణలో వైసీపీ, బీఆర్ఎస్ ల పొత్తకు సంకేతాలా అన్న చర్చకు తెరలేచింది. తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్, వైసీపీల మధ్య పొలిటికల్ అలయెన్స్ ఏదైనా కుదిరిందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే తెలంగాణ స్థానిక పోరులో  ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలంటే.. అందుకు జనసేన రంగంలో ఉండటం ఒక విధంగా జనసేన పోటీ బీఆర్ఎస్  విజయావకాశాలకు గండి కొట్టే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏపీకి చెందిన వారు జనసేన వైపు మొగ్గు చూపుతారనీ, అలా జరగకుండా అడ్డుకోవాలంటే..జగన్ సహకారం అవసరమనీ బీఆర్ఎస్ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కూడా అందుకు సుముఖంగానే ఉండటంతో రానున్న రోజులలో వైసీపీ, బీఆర్ఎస్ పోత్తుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఆశ్వర్యం లేదని అంటున్నారు.  YS Jagan Hyderabad Visit, BRS YSRCP Flexis Begumpet, Jagan Jalavihar Wedding Visit, Telangana Politics Updates, KCR KTR YS Jagan Cutouts
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, ఐఏఎస్ వ్యవస్థలోనూ అత్యంత ప్రభావమంతమైన అధికారిగా గుర్తింపు పొందిన 1994 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ జగన్ హయాంలో వ్యవహరించిన తీరు కారణంగా ప్రతిష్ఠను మసకబార్చుకున్నారు. చివరికి స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. జగన్ హయాంలో తన పరిధులను మరిచి వ్యవహరించిన ఆయన తీరా వైసీపీ 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకు అధికారం కోల్పోయిన తరువాత.. తప్పులను గ్రహించి.. ఆ తప్పులకు శిక్ష తప్పదన్న భయంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.   సెప్టెంబర్ 30, 2024న ఆయన ఇలా రాజీనామా చేయగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అలా  ఆమోదించేసింది. అప్పుడు గానీ ఆయనకు తాను చేసినది తొందరపాటు చర్య అని గ్రహింపునకు రాలేదు. రాజీనామాను వెనక్కు తీసుకుని తిరిగి సర్వీసులో చేరుదామని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆయన తన స్వరాష్ట్రమైన యూపీకి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.    ఏపీలో   2019 నుండి 2021 వరకు ప్రవీణ్ ప్రకాష్  అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ముఖ్యమంత్రి సీఎంవోలో  క్రియాశీల  అధికారిగా, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన  మోస్ట్ పవర్ ఫుల్ బ్యూరోక్రాట్‌గా పేరొందారు. జగన్‌ హయంలో ఆయన ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కంటే జగన్‌కు, వైసీపీ నమ్మకస్తుడైన ఓ పొలిటికల్ అసిస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో వ్యవహరించిన తీరుతో తీవ్ర విమర్శల పాలయ్యారు.   ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పారు. ఇలా ఒకటనేంటి ఆయన తన చర్యలతో చేష్టలతో బోలెడంత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో  వైసీపీ ప్రభుత్వం దిగిపోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవీణ్ ప్రకాష్ కు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు మూడు నెలలు వేచి చూసి ప్రవీణ్ ప్రకాష్ చేసిన రాజీనామాను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆమోదించింది.  అటువంటి ప్రవీణ్ ప్రకాష్ తాజాగా కాంగ్రెస్ గూటికి చేరి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగుపెట్టారు.   Praveen Prakash join Congress, Ex IAS Praveen Prakash, Andhra Pradesh IAS VRS, UP Congress Politics, contravarsies, Ap Politics  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైపీపీ అధినేత ప్రెస్ మీట్ అనగానే వైసీపీ నేతలు, శ్రేణుల గుండెల్లో గుబులు మొదలౌతుంది. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు, నెటిజనులకు, మీమర్లకు పండుగ వస్తున్నదన్నంత ఆనందం మొదలౌతుంది. జగన్.. పర్యటనలు, ప్రకటనలు, మీడియా సమావేశాలు ఎప్పుడూ రాజకీయ సంచలనమే. ఆయన ఏం మాట్లాడినా నెటిజనులకు, విమర్శకులకు, ప్రత్యర్థులకు ఎప్పుడూ అడ్డంగా దొరికి పోతుంటారు. వాస్తవ దోషాలు, తప్పులు, తడబాటు ఇవే జగన్ రెడ్డి ప్రసంగాలనూ, ప్రెస్ మీట్లనూ ప్రత్యేకంగా నిలుపుతాయి.     తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ, డీఎస్సీ రెండూ ఒకటేనంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తలలుపట్టుకునేలా చేస్తే.. ఆయన ప్రత్యర్థులు, నెటిజనులు, మీమర్లు పండుగ చేసుకున్నారు. కనీసమైన ప్రాథమిక పరిజ్ణానం లేని వ్యక్తా ఐదేళ్ల పాటు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసింది అంటూ నెట్టింట జగన్ తెగ ట్రోలింగ్ కు గురయ్యారు.  డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి మధ్య ఉన్న  తేడా తెలియని వ్యక్తికి రాజకీయాలెందుకు? అంటూ  తెలుగుదేశం  కూటమి నేతలు, నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు.   గతంలో వైసీపీ సోషల్ మీడియా, మీడియా లోకేష్ ఆహార్యం, ఆహారం, భాష ఇలా ప్రతి విషయంలోనూ ట్రోల్ చేసేది. బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడేది కాదు. అయితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. దీంతో వైపీపీయులు జగన్ ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటే మేలని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ప్రెస్ మీట్ లనేమిటి అసలు బయటకు రాకుండా సైలంట్ గా ఉంటే పార్టీకి మేలు జరుగుతుందనీ,  అలా కాకుండా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠ కూడా మంటగలిసేలా ఉందన్న భయం వైసీపీయుల్లో వ్యక్తమతోంది.   YS Jagan pressmeets worrying YCp, YSRCP Politics, Jagan Press Meet Controversies, AP Politics News, Jagan Mohan Reddy Speeches
తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేతత్రి కల్వకుంట్ల కవిత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను అనుసరిస్తున్నారు. ఎన్నికల బరిలో దిగిన తొలి ప్రయత్నంలోనే  ఘన విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించిన టీవీకే అధినేత విజయ్ అడుగు జాడల్లో నడుస్తూ కవిత కూడా తెలంగాణ రక్షణ సేనను గెలుపు బాటలో నడిపించి తెలంగాణ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నారు.  ఇందుకోసం ఆమె తాజాగా తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.  తమిళనాడు రాజకీయాల్లో రిక్కీ రాధన్ పండిట్ పాత్ర   కీలకమైనదిగా భావిస్తారు. ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రతికూలంగా వ్యాఖ్యానించినప్పటికీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ  విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారని రికీ రాధన్  జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో రిక్కీ రాధన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. విజయ్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాధన్‌ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా నియమించారు. అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారనుకోండి అది వేరే విషయం. అయితే విజయ్ రాజకీయ నిర్ణయాల్లో రాధన్ పండిట్ సలహాలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని అంటారు.  ఇటువంటి రాధన్ పండిట్ చెన్నై నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   కవిత తన కుమారుడితో కలిసి రిక్కీ రాధన్ పండిట్‌ను శాలువాతో సత్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి.   తెలంగాణ రక్షణ సేన భవిష్యత్తు, రాబోయే రోజుల్లో కవిత రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోందనే అంశాలపైనే  కవిత రాధన్ పండిట్ సలహాలు కోరినట్లు తెలుస్తోంది.    తమిళనాడులో విజయ్‌కి తిరుగులేని రాజకీయ విజయం లభిస్తుందని ముందుగానే జోస్యం చెప్పిన  రాధన్ పండిట్ ను కవిత ఆశ్రయించారని అంటున్నారు.  తమిళనాడు సీఎం విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై కవిత  ఇటీవల  బహిరంగంగానే ప్రశంసలు కురిపించడం, తెలంగాణలో  అమ్మ పాలన  అందిస్తామని ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాధన్ పండిట్ తో కవిత భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   Kalvakuntla Kavitha follows Tamilnadu CM Vijay, Ricky Radhan Pandit, CM Vijay Astrologer, Kavitha Ricky Radhan Meeting, Telangana Rakshana Samithi, Telangana Politics
ALSO ON TELUGUONE N E W S
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన భావోద్వేగ భక్తిరస చిత్రం 'ఇరుముడి' ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి తొలి ఆట నుంచే విశేష ఆదరణతో బ్లాక్‌బస్టర్ టాక్ వైపు దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద రవితేజకు సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం పూనకాలు తెప్పిస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజే వీక్షించిన టాలీవుడ్ ప్రముఖ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంపై కురిపించిన ప్రశంసల వర్షం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఎమోషన్ మరియు డివోషన్ల ప్యూర్ సెలబ్రేషన్ అని అభివర్ణిస్తూ, ఈ తరంలో ప్రతీ ఒక్కరూ తప్పక చూడాల్సిన అత్యంత ప్రత్యేకమైన చిత్రమని సందీప్ రెడ్డి వంగా చాలా స్పష్టంగా స్పష్టం చేశారు. సందీప్ రెడ్డి వంగా తన సమీక్షలో పేర్కొంటూ, మాస్ మహారాజా రవితేజ, చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర మరియు దర్శకుడు శివ నిర్వాణ ముగ్గురూ కలిసి ప్రేక్షకులను ఒక మర్చిపోలేని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకువెళ్లారని ప్రశంసించారు. ఈ సినిమాలోని ఎమోషన్లు మనసులోని అత్యంత లోతైన భావాలను సున్నితంగా తాకుతాయని, థియేటర్లో ఎండ్ క్రెడిట్స్ మరియు రోలింగ్ టైటిల్స్ పడిపోయాక కూడా ఈ అనుభూతి ప్రేక్షకుడి మనసులో నిలిచిపోతుందని అన్నారు. ఆడియన్స్‌ను ఇంతగా వెంటాడే కథనం రూపొందించినందుకు రవితేజ, శివ నిర్వాణలకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సందీప్ రెడ్డి వంగా లాంటి ఇంటెన్స్ విజనరీ డైరెక్టర్ నుంచి 'ఇరుముడి' చిత్రానికి ఈ స్థాయిలో అపూర్వమైన రివ్యూ లభించడం చూసి చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహాన్ని పొందుతోంది. బాక్సాఫీస్ వద్ద సుమారు ₹45 కోట్ల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమాకి వస్తున్న విశేష స్పందనను చూసి నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ శనివారం నేరుగా రవితేజ మరియు శివ నిర్వాణలను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. మాస్, ఎమోషన్, మరియు భక్తి రసాల కలబోతగా వచ్చిన ఈ 'ఇరుముడి' సినిమా ఈ తరం తెలుగు చిత్రసీమలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టాలీవుడ్ చిత్రసీమ పురోగతిని, వ్యాపార విస్తరణను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సరికొత్త ఉత్తర్వులను (GO) అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నూతన సినీ విధానంపై పరిశ్రమ వర్గాలు విశేష సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) దీనిని ఒక ప్రగతిశీల నిర్ణయంగా అభివర్ణిస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. నేడు మన తెలుగు చిత్రాలు ఐమాక్స్, డాల్బీ సినిమా, హెచ్‌డీఆర్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందుతున్నాయి. కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రాల నిర్మాణ వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవడానికి సరైన నమూనా అవసరం. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పాలసీ ద్వారా అర్హత గల సినిమాలకు టికెట్ ధరల పెంపునకు నిబంధనలతో కూడిన దరఖాస్తు విధానం సులభతరమైంది. అయితే, ఈ జీవో కేవలం టికెట్ ధరల పెంపుతోనే ముగిసిపోలేదు. ప్రతి థియేటర్ లోనూ (మల్టీప్లెక్స్ సహా) కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీకి రిజర్వ్ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల అన్ని వ‌ర్గాల ప్రేక్షకులకూ సినిమాలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, రోజుకు 5 ప్రదర్శనలకు (5 Shows) ప్రభుత్వం అనుమతించడం పెద్ద సినిమాలకు ఎంతో ఉపకరిస్తుంది. మొదటి కొద్ది రోజుల్లోనే భారీ డిమాండ్ నెరవేరి, ఆ తర్వాత థియేటర్లు ఖాళీ అవుతాయి. దీనివల్ల చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు తగినన్ని స్క్రీన్లు దక్కే అవకాశం మెరుగవుతుంది. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, నిరంతరం శ్రమించే సినీ కార్మికుల సంక్షేమానికి ఈ కొత్త విధానం పెద్దపీట వేస్తోంది. ఈ నిర్ణయాల వల్ల చిత్రసీమలో పెట్టుబడులు పెరగడమే కాకుండా వేలాది మంది కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రత చేకూరుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడింది. ఈ కొత్త నిర్ణయం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయంతో మున్ముందు రాబోయే భారీ పాన్-ఇండియా సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల సమీకరణాలు మరింత ఊపందుకోనున్నాయి.
ప్రముఖ నటి శ్రీమతి షావుకారు జానకి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నటి శ్రీమతి జానకి గారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400 చిత్రాల్లో నటించారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించారు. శ్రీమతి షావుకారు జానకి గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. (పవన్ కళ్యాణ్) ఉప ముఖ్యమంత్రి
తెలుగు సినీ పరిశ్రమ ట్రెండ్‌ను పూర్తిగా తిరగరాసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, సృష్టించిన సంచలనం చిన్నది కాదు. అయితే ఈ క్లాసిక్ బోల్డ్ మూవీ రూపొందడానికి ముందు దర్శకుడికి, చిత్ర బృందానికి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, అలాగే 'అర్జున్ రెడ్డి' నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథను వివిధ ప్రొడ్యూసర్లకు వినిపించే సమయంలో ఎదురైన సవాళ్లను ఆయన గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలో తీవ్ర నిరాశలో ఉన్న హీరో తన కామ వాంఛను, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్యాంటులో ఐస్ క్యూబ్స్ వేసుకునే ఒక అత్యంత బోల్డ్ సీన్ ఉంటుంది. కథా చర్చల్లో ఈ పాయింట్ రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేకపోయేవారట. వెంటనే నెరేషన్ ఆపేసి, "ఇక మేం ఏమీ వినాల్సిన అవసరం లేదు, కథ ఇక్కడితో ఆపేయండి" అని చెప్పి పంపించేసేవారని ప్రణయ్ వెల్లడించారు. అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & రియలిస్టిక్ అప్రోచ్ చూడకపోవడంతో రిస్క్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాలేదు. కానీ సందీప్ మాత్రం తన విజన్, క్యారెక్టరైజేషన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు. చివరికి బయటి నిర్మాతలు ఎవరూ నమ్మకపోవడంతో, తమ సొంత మామిడి తోటను అమ్మి భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలైన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఏ దృశ్యం చూసి నిర్మాతలు వెనకడుగు వేశారో, అదే సీన్స్, బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సందీప్ రెడ్డి వంగాను నేడు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రణయ్ రెడ్డి వంగా చేసిన ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు, ఫాన్స్ ఈ పాత జ్ఞాపకాలను రీట్వీట్ చేస్తూ "సందీప్ వంగా విజన్ ముందే ఊహించలేక ఆ నిర్మాతలు గొప్ప అవకాశాన్ని వదులుకున్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' అనే భారీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక చిన్న సినిమాగా మొదలై ఇండియన్ సినిమాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన అర్జున్ రెడ్డి ప్రయాణం ఎందరో యువ దర్శకులకు ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'ఓయ్!' వంటి యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన చాక్లెట్ బాయ్ సిద్ధార్థ్, విభిన్నమైన పాత్రలతో దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇటీవల విడుదలైన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' వెబ్ సిరీస్‌లో స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా పాత్రలో అద్భుతమైన అభినయంతో మెప్పించిన ఆయన, తాజాగా సమాజం పట్ల ఒక నటుడిగా తనకున్న బాధ్యతలు, సినీ నైతిక విలువలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో మహిళలను కేవలం ఒక వస్తువులా చిత్రీకరించే ధోరణిపై, ప్రత్యేకించి ఐటెమ్ పాటల సంస్కృతిపై సిద్ధార్థ్ స్పందిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఒక మహిళ చుట్టూ నలభై మంది మగవారు చేరి ఆమెతో ఎలాగైనా ప్రవర్తించవచ్చనే భావన కలిగించే ఐటెమ్ సాంగ్స్‌లో నేను నా కెరీర్‌లో ఎన్నడూ భాగం కాలేదు, ఇకముందు కూడా చేయను" అంటూ తన నిశ్చిత అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు. సినిమాల్లో పాత్రల ఎంపికలో తనకు కొన్ని స్పష్టమైన నియమాలు, హద్దులు ఉన్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్ వివరించారు. తాను కేవలం హీరో పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదని, కథ డిమాండ్ చేస్తే పూర్తిస్థాయి విలన్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. అయితే చెడు పాత్రలను గొప్పగా చూపించి, ప్రేక్షకులకు తప్పుడు సందేశం ఇవ్వడం తనకు ఏమాత్రం నచ్చదని చెప్పారు. ఒకవేళ తాను అలాంటి నెగెటివ్ షేడ్స్ లేదా అసభ్యకర సన్నివేశాల్లో కనిపించాల్సి వస్తే, అది పూర్తిస్థాయి క్రూరమైన విలన్ పాత్ర అయినప్పుడే ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. ఎందుకంటే అలాంటి కథల్లో చివర్లో ఆ విలన్ ఘోరమైన శిక్షను అనుభవిస్తాడు కాబట్టి అది సరైన సందేశాన్ని ఇస్తుందన్నారు. సమాజంలో చెడు పాత్రలను ఆదర్శంగా చూపే చిత్రాల్లో భాగం కావడం నటుడిగా తన నైతికతకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' చిత్రంతో వెండితెరకు పరిచయమై, అనేక కుటుంబ కథా చిత్రాలు, లవ్ స్టోరీలతో లవర్ బాయ్‌గా అలరించిన సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సినిమా రంగంలో కమర్షియల్ విలువల కంటే సామాజిక బాధ్యతకే ప్రాధాన్యమిచ్చే నటులు అరుదుగా ఉంటారని నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బాక్సాఫీస్ ఫలితాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేసే సిద్ధార్థ్, తన తదుపరి సినిమాలతో కూడా అదే బాటలో ప్రయాణించనున్నారు. ఒక నటుడిగా ఆయన వ్యక్తపరిచిన ఈ సూటి ఆలోచనలు రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలో కథల ఎంపికపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
మాస్ మహారాజా రవితేజ, క్లాస్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ఎమోషనల్ డివోషనల్ యాక్షన్ డ్రామా 'ఇరుముడి' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రవితేజ యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్లు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ చిన్నారే కేరళకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర. సినిమాలో 'మణికంఠ' అలియాస్ 'మణెమ్మ' పాత్రలో ఆమె చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా రవితేజతో వచ్చే తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ సీన్లలో ఆమె సహజమైన అభినయం ఆడియన్స్‌తో కంటతడి పెట్టిస్తోంది. తొలి తెలుగు చిత్రమే అయినప్పటికీ ఎంతో ఆత్మవిశ్వాసంతో నటించిన ఈ చిన్నారి, తన పాత్రకు సొంతంగా తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న లక్కీ ఆఫర్ ఈ చిన్నారికి ఎలా వచ్చిందనే విషయంపై రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నక్షత్ర ఆసక్తికర విశేషాలను వెల్లడించింది. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న నక్షత్రకి సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట. అలా ఆమె చేసిన కొన్ని రీల్స్ చూసిన దర్శకుడు శివ నిర్వాణ, ఈ కథలోని అమాయకమైన, బలమైన పాత్రకు నక్షత్ర అయితే సరిగ్గా సరిపోతుందని భావించి ఆఫర్ ఇచ్చారని తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో, మాస్ రాజా రవితేజ వంటి పెద్ద హీరోతో కలిసి నటించడం తన అదృష్టమని నక్షత్ర సంతోషం వ్యక్తం చేసింది. షూటింగ్ సమయంలో రవితేజ, ప్రియా భవానీ శంకర్ తనను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, దర్శకుడు శివ నిర్వాణ ప్రోత్సాహంతో ఆడుతూ పాడుతూ తన పాత్రను పూర్తి చేశానని వెల్లడించింది. చిన్న వయసులోనే దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి.. పృథ్వీరాజ్ సుకుమారన్, శివరాజ్ కుమార్ వంటి అగ్ర కథానాయకులతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. స్కూల్ టీచర్లు, తల్లిదండ్రుల సహకారంతో చదువును, నటనను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 'ఇరుముడి' విజయంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్రపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఈ చిన్నారికి భవిష్యత్తులో టాలీవుడ్‌లో మరింత మంచి అవకాశాలు వచ్చి వెండితెరపై ముద్ర వేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.   Baby Nakshatra Irumudi Movie, Ravi Teja Irumudi Child Artist, Baby Nakshatra Instagram Reels, Siva Nirvana Irumudi Movie Update, Baby Nakshatra Telugu Dubbing
భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. "మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు. మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు. "ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అంటూ నందమూరి బాలకృష్ణ తన హృదయపూర్వక నివాళులర్పించారు.         Sowcar Janaki, Nandamuri Balakrishna, Shavukaru Janaki  
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్‌ఫుల్ అండ్ డివైన్ రోల్‌లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే భారీ ఓటీటీ డీల్ క్లోజ్ కావడం సినీ ప్రియుల్లో, నయనతార ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో ఏడు దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ నటి, పద్మశ్రీ షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె మరణవార్త పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగమైన సందేశాన్ని పోస్ట్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "ప్రముఖ నటి, పద్మశ్రీ షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది. ‘షావుకారు’ చిత్రంతో మొదలైన ఆమె సుదీర్ఘ సినీ ప్రస్థానం తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో దాదాపు ఏడు దశాబ్దాల పాటు కొనసాగింది" అంటూ ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. "వైవిధ్యమైన పాత్రలకు తన సహజమైన నటనతో ప్రాణం పోసి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నటి ఆమె. భారతీయ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. షావుకారు జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి." అంటూ చిరంజీవి నివాళులర్పించారు. https://x.com/KChiruTweets/status/2090746829365530722       Sowcar Janaki, Chiranjeevi, Shavukaru Janaki  
కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించిన రాకింగ్ స్టార్ యష్.. ఇప్పుడు తన తదుపరి పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. బిగ్ స్క్రీన్‌పై యష్‌ను సరికొత్త డార్క్ అవతార్‌లో చూడటానికి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. చిత్రంలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సీన్లు, డార్క్ థీమ్‌ను పరిగణనలోకి తీసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. విశేషమేమిటంటే, సినిమాలో ఎలాంటి ప్రధాన సన్నివేశాలపై కట్స్ విధించకుండా బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కేవలం ఒకటి రెండు సంభాషణల్లోని పదాలను మ్యూట్ చేయడం, చట్టబద్ధమైన హెచ్చరికలను స్పష్టంగా ప్రదర్శించడం వంటి చిన్నచిన్న మార్పులను మాత్రమే సూచించారు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా రన్‌టైమ్ 3 గంటల 12 నిమిషాలుగా లాక్ అయినట్లు అధికారిక సమాచారం. నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, కథనంలోని ఇంటెన్సిటీ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ హింసాత్మక సన్నివేశాలున్న చిత్రాలకు సెన్సార్ బోర్డ్ తీవ్రమైన కోతలు విధించిన సందర్భాలున్నాయి. అయితే 'టాక్సిక్' చిత్రంలో ఉన్న రా వయొలెన్స్‌కు ఒక్క కట్ కూడా పడకపోవడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో విపరీతంగా చర్చనీయాంశమైంది. స్వయంగా యష్ కూడా గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా కేవలం పెద్దల కోసమే రూపొందించబడిన కథ అని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి ప్రసిద్ధ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటం సినిమాకు మరింత గ్లామర్, క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. పవర్ ఫుల్ కాస్టింగ్ తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ప్రస్తుతం అన్ని వైపులా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా శరవేగంగా ప్రారంభమవుతుండటంతో యష్ అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని టాలీవుడ్ సహా పాన్-ఇండియా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   Yash, Toxic Censor Certificate, Toxic Movie Runtime, Geethu Mohandas Toxic Movie Update, TeluguOne TMDB Movie Updates
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం.  అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి.  దీని గురించి చాలామంది పట్టించుకోరు.  ఇదేమైనా ఆరోగ్య సమస్య ఏమో అని కొందరు సందేహ పడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదిశరీరంలో ఏదో అనారోగ్యానికి సంకేతం కాదని,  కానీ.. శరీరంలో ఏదో ఒక సమస్యను మాత్రం ఖచ్చితంగా సూచిస్తుందని అంటున్నారు.  చాలా వరకు ఎన్ని సార్లు నీరు తాగినా మళ్లీ దాహం వేయడానికి అసలు కారణం శరీరం డీహైడ్రేషన్ అవ్వడమే.. ఎక్కువ శారీరక కష్టం చేయడం.. అధికంగా చెమట పట్టడం, ఎండకు గురికావడం లేదా అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివన్నీ శరీరాన్ని డీహైట్ర్ అయ్యేలా చేసి ఎక్కువ దాహం వేయడానికి కారణం అవుతాయి.  కానీ ఎక్కువ దాహం కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. మధుమేహం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తరచుగా చాలా దాహం వేయడం అనేది మధుమేహానికి ఒక తొలి లక్షణం కావచ్చని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది, ఈ ప్రక్రియలో నీరు కూడా విసర్జించబడుతుంది, దీనివల్ల తరచుగా దాహం వేస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం.. మూత్రపిండాలు శరీరంలో నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, ఈ సమతుల్యతకు భంగం వాటిల్లి, తరచుగా దాహం వేయడానికి దారితీస్తుంది. ఈ లక్షణం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యను కూడా సూచించవచ్చు. డయాబెటిస్ ఇన్సిపిడస్.. డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది శరీరంలో ఒక నిర్దిష్ట హార్మోన్ లోపించడం వల్ల కలిగే సమస్య. దీనివల్ల అధిక దాహం , తరచుగా మూత్రవిసర్జన కలుగుతాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్ కు భిన్నంగా ఉంటుంది, కానీ దీని లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. నోరు పొడిబారడం.. కొన్నిసార్లు, తగినంత లాలాజలం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎప్పుడూ దాహం కలుగుతుంది, ఈ పరిస్థితిని నోరు పొడిబారడం అంటారు. దీనివల్ల నోరు, గొంతు, నాలుక పొడిబారవచ్చు, కొన్నిసార్లు పెదవులు కూడా పగలవచ్చు. ఈ సమస్య కొన్ని మందుల దుష్ప్రభావంగా కూడా ఎదురవుతుంది. వైద్యుడిని ఎప్పుడుసంప్రదించాలి? పై లక్షణాలు కొనసాగితే, ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల వ్యాధి లేదా హార్మోన్ల సమస్యలు వంటి ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు పిల్లలు , వృద్ధులలో మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సకాలంలో రోగ నిర్ధారణ , సరైన చికిత్స చాలా అవసరం.                                                                                                                                                 *రూపశ్రీ.  
రెస్టారెంట్లలో భోజనం తర్వాత స్వీట్ సొంపు ఇస్తుంటారు.  చాలామందికి ఈ సొంపు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.  కొందరు ఇంట్లో కూడా భోజనం తర్వాత స్వీట్ సొంపు తినడం లేదా సొంపు కండ చెక్కర కలిపి తినడం చేస్తుంటారు.  చాలా మంది స్వీట్ సొంపును కేవలం మౌత్ ప్రెషనర్ అనుకుంటారు.  అందుకే భోజనం తర్వాత నోరు తాజాగా అనిపించడం కోసం దీన్ని ఇస్తారని అనుకుంటారు.  కానీ భారతీయ వంటకాల్లో భోజనం తర్వాత సోంపును తినడం ఎప్పటినుండో ఉందట.  ఇది కేవలం మౌత్ ప్రెషనర్ గా కాకుండా..  చాలా రకాల  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. సొంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. జీర్ణక్రియకు.. భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. జీర్ణ సంబంధిత అసౌకర్యాలు తగ్గించడంలో సోంపు సహాయపడుతుందని చెబుతారు. అయితే దీని ప్రభావం అందరికీ ఒకే విధంగా ఉండదు. నోటిని తాజాగా ఉంచడానికి.. సోంపు లో ఉండే సహజ సువాసన , రుచి భోజనం తర్వాత వచ్చే దుర్వాసనను తాత్కాలికంగా తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే దీనిని  రెస్టారెంట్లలో తరచుగా మౌత్ ఫ్రెషనర్‌గా అందిస్తారు.  ఫైబర్ మూలం.. సోంపు గింజలలో పీచుపదార్థం ఉంటుంది.  కొంచెం సొంపు తిన్నా సరే.. అందులో  లభించే పీచుపదార్థం చాలా ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ప్రభావవంతగా పనిచేస్తుంది.  ఆహారం తినగానే సొంపు తింటాం కాబట్టి ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు.. సోంపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానకి చాలా సహాయపడతాయి. కండ చక్కెర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. చాలా రెస్టారెంట్లలో స్వీట్ సొంపు ఇస్తుంటారు. అయితే  కొన్ని చోట్ల మాత్రం ప్లెయిన్ సొంపును కండచెక్కర తో కలిపి ఇస్తుంటారు.  ఈ కండ చక్కెరను మిశ్రీ అని కూడా అంటారు.  ఇందులో ప్రధాన పదార్థం చక్కెర. అందువల్ల ఇది తియ్యగా ఉంటుంది.  కొంతమంది భోజనం తర్వాత సోంపు గింజలతో మిశ్రీని కలిపి తినడానికి ఇష్టపడతారు.  ఇధి రుచిని మెరుగుపరుస్తుంది. అయితే.. మిశ్రీని ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు.. మిశ్రీ లో తీపిదనం ఆరోగ్యానికి మంచిది కాదు. దీన్ని మితంగా తీసుకుంటే బాగనే ఉంటుంది. కానీ అధికంగా తీసుకోకూడదు. డయాబెటిస్ పేషంట్లు దీని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.                                                                                                                                                 *రూపశ్రీ.