LATEST NEWS
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే! మూడేళ్లుగా తనను కంటికి రెప్పలా చూసుకున్న ఆ తల్లిదండ్రులు కనిపించకపోవడంతో ఆ చిన్నారి గుండె తల్లడిల్లింది. నాన్నను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మను తలుచుకుంటూ ఇంటికి తీసుకెళ్లమని వేడుకున్నాడు. పెద్దల మధ్య నడిచిన చట్టపరమైన వివాదంలో మూడేళ్ల పసివాడు పడిన వేదన అందరినీ కంటతడి పెట్టించింది. చివరకు న్యాయస్థానం జోక్యం, అధికారుల చొరవతో ఆ చిన్నారి మళ్లీ తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు. మూడేళ్ల అనుబంధం.. ఒక్కసారిగా దూరం.! జగిత్యాల పట్టణానికి చెందిన శ్రీనివాస్, సరిత దంపతులకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. తమ జీవితంలో చిన్నారి అడుగుపెడితే బాగుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన రెండు నెలల పసికందును మూడేళ్ల క్రితం హిందూ సంప్రదాయ పద్ధతిలో దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారే వారి ప్రపంచమయ్యాడు. బుడిబుడి అడుగులు, ముద్దు మాటలు, చిలిపి చేష్టలతో ఆ ఇల్లు సందడిగా మారింది. కన్నబిడ్డ కాకపోయినా.. కంటికి రెప్పలా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతోకాలం నిలవలేదు. ఎవరో అజ్ఞాత వ్యక్తులు చేసిన ఫిర్యాదుతో శిశు సంక్షేమ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదన్న కారణంతో మూడేళ్లుగా ఆప్యాయంగా పెంచుకుంటున్న బాలుడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని శిశు విహార్‌కు తరలించారు. అప్పటివరకు అమ్మానాన్నల ఒడిలో ఆడుకున్న చిన్నారి ఒక్కసారిగా వారందరికీ దూరమయ్యాడు. బిడ్డ లేని ఇల్లు బోసిపోయింది. ఆ దంపతుల గుండెల్లో తీరని వేదన మిగిలింది. కోర్టు ఉత్తర్వులున్నా.. తప్పని ఎదురుచూపులు.! తమ బిడ్డను తిరిగి తమ ఒడికి చేర్చుకోవాలని ఆ దంపతులు న్యాయపోరాటానికి దిగారు. ఈ కేసును విచారించిన హైకోర్టు అక్టోబర్ 16న బాలుడిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ అధికారిక ప్రక్రియలు, ఇతర అనుమతుల పేరుతో అప్పగింతలో జాప్యం జరిగినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. కోర్టు ఉత్తర్వులు వచ్చినా తమ బిడ్డ తమ వద్దకు చేరకపోవడంతో ఆ దంపతుల ఆవేదన మరింత పెరిగింది. ఈ క్రమంలో తమ బిడ్డను చూసేందుకు వారు కరీంనగర్‌లోని శిశు గృహానికి వెళ్లారు. అక్కడే అందరి హృదయాలను పిండేసిన ఘటన చోటుచేసుకుంది. తనకు ఎంతో ఇష్టమైన నాన్నను చూడగానే ఆ చిన్నారి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రి మెడను గట్టిగా చుట్టుకుని.. 'నాన్నా.. నేను వస్తా.. నాకు భయమేస్తోంది.. అమ్మా.. నన్ను ఇంటికి తీసుకెళ్లు!' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ పసివాడి ఆర్తనాదాలు చూసి అక్కడున్నవారి కళ్లు చెమర్చాయి. సోషల్ మీడియాలో వైరల్.. అధికారులపై విమర్శలు.! మూడేళ్ల బాలుడు తన పెంపుడు తల్లిదండ్రుల కోసం తల్లడిల్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి అమాయకపు మాటలు, ఇంటికి వెళ్లాలంటూ చేసిన వేడుకోలు చూసి నెటిజన్లు చలించిపోయారు. చట్టపరమైన ప్రక్రియలు ఎంత ముఖ్యమైనా.. వాటి మధ్య పసివాళ్ల మనోభావాలను మరిచిపోవద్దంటూ పలువురు అభిప్రాయపడ్డారు. చిన్నారిని తల్లిదండ్రులకు దూరం చేసిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ఇంటికి చేరిన కంటిపాప.! ఈ ఉదంతంపై తీవ్ర స్పందన వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం రాత్రి అధికారులు ఆ చిన్నారిని క్షేమంగా పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించారు. ఎన్నో రోజుల ఎదురుచూపుల తర్వాత తమ బిడ్డ తిరిగి ఇంటికి చేరడంతో శ్రీనివాస్, సరిత దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ కంటి వెలుగు మళ్లీ ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఆ దంపతులు ఆనందభాష్పాలు రాల్చారు. తమ కష్టకాలంలో అండగా నిలిచిన మీడియా, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టాలు, నిబంధనలు సమాజ క్రమబద్ధతకు అవసరమే. కానీ వాటిని అమలు చేసే క్రమంలో చిన్నారుల మనసులను, వారి భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మూడేళ్ల బాలుడికి కావాల్సింది పెద్దల వాదనలు కాదు.. తనను అక్కున చేర్చుకునే అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!       [ Jagtial Adoption Case, Telangana High Court, Child Welfare Committee, Shishu Vihar, Foster Parents, Jagtial News, Child Adoption Controversy, Telangana News, Emotional Story ]
  ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల పోరులో భాగంగా కృష్ణా జిల్లాలోని పెడన మున్సిపాలిటీలో జనసేన పార్టీ తన తొలి విజయాన్ని నమోదు చేసుకుని ఘనమైన బోణీ కొట్టింది. పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానానికి జరిగిన హోరాహారీ పోరులో జనసేన అభ్యర్థి జ్యోత్స్నరాణి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తన సమీప ప్రత్యర్థి అయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై ఏకంగా 4,380 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొత్తం 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 19, జనసేన 6 వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మిత్రపక్షాల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే పొత్తులో భాగంగా పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ అభ్యర్థి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన నాటి నుంచి పెడనలో జనసేన అభ్యర్థికి ఓటర్ల నుంచి మద్దతు లభించింది. రౌండ్లవారీగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన జ్యోత్స్నరాణి, చివరకు భారీ ఓట్ల తేడాతో విజయం ఖాయం చేసుకున్నారు. దీంతో స్థానిక కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ విజయంతో పెడన పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఇతర ఫలితాల్లోనూ కూటమి అభ్యర్థులు దూసుకుపోతుండటం పార్టీ కేడర్‌లో జోష్ నింపుతోంది. మరోవైపు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో మాత్రం ఈ ఫలితాలతో నిరాశాజనక వాతావరణం నెలకొంది. కొన్ని కీలక స్థానాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్థానిక నాయకులు ఆత్మపరిశీలనలో పడ్డారు. ప్రజల నాడిని అంచనా వేయడంలో విఫలమయ్యామనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఈ విజయాలు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు స్థానిక ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. పెడన మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకున్న జనసేన పార్టీ, రాబోయే కాలంలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి, పట్టణాభివృద్ధికి పునాది వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. [ Janasena, Pedana Municipal Elections, Jyotsna Rani, AP Municipal Results, TDP BJP Janasena Alliance, Janasena Party, Deputy CM Pawan Kalyan, Telugu One, Telugu News ]
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో పలు చోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్‌ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ అభ్యర్థి తొలి రౌండ్‌లోనే ఆధిక్యం సాధించడం ఆసక్తికరంగా మారింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి టి. గీతా కుమారి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.ఎస్. ప్రమీలపై 419 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో గీతా కుమారికి 5,060 ఓట్లు రాగా, ప్రమీలకు 4,641 ఓట్లు వచ్చాయి. మరో 259 ఓట్లు చెల్లనివిగా నమోదవగా, 40 ఓట్లు నోటాకు పడ్డాయి. మొత్తం 10 వేల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో నిలిచారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మేయర్, ఛైర్‌పర్సన్‌ పీఠాల కోసం పోటీ పడిన 520 మంది అభ్యర్థులతో పాటు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా బరిలో నిలిచిన 10,105 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యం నేడు తేలనుంది. సుమారు 60 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు వెల్లడికానుంది. రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరిగిన 13 మేయర్ స్థానాల్లో కూటమి తరఫున టీడీపీ 10 చోట్ల, జనసేన రెండు చోట్ల, బీజేపీ ఒకచోట పోటీ చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 13 స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దించింది. మరోవైపు 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాలకు గాను 17 చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. మిగిలిన 70 స్థానాల్లో కూటమి నుంచి టీడీపీ 49 చోట్ల, జనసేన 17 చోట్ల, బీజేపీ నాలుగు చోట్ల పోటీ చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పులివెందులలో టీడీపీ సాధించిన తొలి రౌండ్ ఆధిక్యం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మిగిలిన రౌండ్ల ఫలితాలు, రాష్ట్రవ్యాప్తంగా వెలువడే తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.       [ Pulivendula Results, TDP, Geetha Kumari, YSRCP, AP Municipal Elections, Counting Results, Chandrababu Naidu, Jagan Mohan Reddy, Andhra Pradesh Politics ]
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  విజయవాడ మేయర్ స్థానానికి సంబంధించిన ఫలితాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అధికారిక  తెలుగుదేశం కూటమి అభ్యర్థి  అభ్యర్థి, జనసేన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ స్పష్గమైన ఆధిక్యిన్ని ప్రదర్శిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతులో మేయర్ అభ్యర్థిగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక పోతే వంగవీటి రాధాకృష్ణ బెజవాడ నగరంలో తనకున్న విస్తృతమైన ప్రజాదరణకు తోడు కూటమి శ్రేణుల బలం తోడవడంతో ఆరంభం నుంచీ గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. ఒక్కో రౌండుకూ వంగవీటి రాధా ఆధిక్యం పెరుగుతూ వస్తున్నది. అలాగే విజయవాడ నగరంలోనిమెజారిటీ డివిజన్లలో తెలుగుదేశం కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు.   ఇక విజయవాడ మేయర్ బరిలో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు   రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మేధావులు, వామపక్షాల మద్దతుతో పాటు నగరంలోని విద్యావంతులైన ఓటర్ల మద్దతును పొందడంలో ఆయన సక్సెస్ అయ్యారని అవగతమౌతుంది. ఈ ప్రతిష్ఠాత్మక స్థానంలో వైసీపీ   అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడో స్థానానికి పరిమితమౌతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావించినప్పటికీ, నగర ఓటర్లు కూటమి అభ్యర్థికే జైకొడుతున్నారని కౌంటింగ్ లో వెల్లడౌతున్న ఫలితాన్ని బట్టి స్పష్టమౌతోంది.   ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణ,  ఏబీ వెంకటేశ్వరరావు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు పోకుండా హుందాతనంతో వ్యవహరించడం విశేషం. నగరాభివృద్ధికి సంబంధించి మేధావుల, అనుభవజ్ఞుల సలహాలను స్వీకరిస్తానని రాధా ప్రకటించగా, ఇది కేవలం సిద్ధాంతాల పోరాటమని ఏబీవీ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎన్నికల పోరులో బెజవాడ ప్రజల మొగ్గు తెలుగుదేశం కూటమి వైపే ఉన్నట్లు ఓటింగ్ ను బట్టి స్పష్టంగా అవగతమౌతోంది.  తుది రౌండ్ల లెక్కింపు కూడా త్వరలోనే పూర్తయిన అనంతరం  విజయవాడ కొత్త మేయర్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.   [Vijayawada Mayor Election Results, Vangaveeti Radha Leading, AB Venkateswara Rao, Second Place, Vijayawada Corporation Counting, AP Local Body Polls, Telugu One] 
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీల ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతోంది. అధికార తెలుగుదేశం కూటమి  ప్రారంభం నుంచే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ పలు స్థానాలను కైవసం చేసుకుంటున్నది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వెలువడుతున్న ఫలితాలు అధికార కూటమికి హవాకు అద్దం పడుతున్నాయి. పుర పోరులో భాగంగా  పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన సిబ్బంది, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది. ఇక్కడ మెజారిటీ వార్డులను కైవసం చేసుకోవడంతో పాటు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలోనూ కూటమి అభ్యర్థులు   విజయం సాధించారు. ఇక ఉమ్మడి  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కూటమి అభ్యర్థులు తమ ప్రాబల్యాన్ని చాటుతున్నారు. పెద్దాపురం లాంటి ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించగా, మిగిలిన అర్బన్ లోకల్ బాడీస్‌లోనూ కూటమి పార్టీల మధ్య సమన్వయం సత్ఫలితాలను ఇస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించిన కూటమి నాయకత్వం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడమే ఈ విజయాలకు ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు, కొన్ని తీర ప్రాంతాల్లో మాత్రం ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల ప్రభావం కౌంటింగ్ ప్రక్రియపై పడింది. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తుఫాను ప్రభావం కారణంగా ఓట్ల లెక్కింపులో  స్వల్ప ఆలస్యం చోటుచేసుకుంది. అయినప్పటికీ అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి భద్రతా ఏర్పాట్లతో కౌంటింగ్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పోలీసుల పటిష్ట నిఘా నడుమ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా తుది ఫలితాలు పూర్తిగా వెలువడే కొద్దీ ఏయే పురపాలక సంఘాలు ఏ పార్టీ  ఖాతాలో  చేరనున్నాయనే అంశంపై స్పష్టత రానుంది.   [AP Municipal Election Results, Vote Counting, TDP Jana Sena BJP Alliance, AP Local Body Elections, Telugu One] 
ALSO ON TELUGUONE N E W S
Suriya is reportedly planning to make his landmark 50th film a major cinematic event, and several interesting filmmaker combinations are doing the rounds. Mani Ratnam, Arun Matheswaran, Lokesh Kanagaraj and RJ Balaji are said to be among the names being considered for the prestigious project.  RJ Balaji recently delivered a blockbuster, Karuppu, delivering big blockbuster for Suriya after 13 years. It is stated that Dream Warrior Pictures, the producer of the film has asked Balaji to direct Karuppu 2 as 50th film. On the other, Arun Matheswaran, who delivered blockbuster with DC, is also in talks for it.   If not 50th, Suriya will definitely do a film with him. On the other hand, at the Scene Telugu event, he openly stated that if Rolex has to happen, Lokesh needs to meet him. He asked them if they want to see him in a negative role and accepted he will do one. So, if Lokesh is ready, Suriya might wait and make Kaithi 2 his 50th. Now, Mani Ratnam is said to be planning a huge multi-starrer with him and Dhanush. While there is no clarity about his 50th, he did start shooting for his next with TJ Gnanavel. Currently, he is busy with promotions of Scene, and he is hoping to make it a hat-trick blockbuster comeback year. Nazriya Nazim and Naslen are playing key roles in this Jithu Madhavan cop comedy thriller.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమా.. అన్ని అంశాలని స్పృశిస్తూ వెళ్లే అపురూపమైన దృశ్య కావ్యం.. అందుకే తరాలు మారిన ఎన్నో దృశ్యాలు మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. సందర్భాన్ని బట్టి   వెండితెరపై ఒక కథ పండాలన్నా,ప్రేక్షకుడి గుండెని తాకాలన్నా ఎమోషన్ చాలా ముఖ్యం. అందులోనూ ఒక ప్రాణం భూమిపైకి వచ్చే ఘట్టం అంటే ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతాయి.  అయితే ఈ మధ్య కాలంలో మన భారతీయ సినిమాల్లో, ముఖ్యంగా టాలీవుడ్ ,బాలీవుడ్ చిత్రాల్లో ప్రసవ ఘట్టాలను (Delivery Scenes) చూపించే తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు నాలుగు డోర్ల వెనుక, తెల్లటి దుస్తుల్లో ఉన్న డాక్టర్ బయటకు వచ్చి "కిలకిలా నవ్వే బాబు పుట్టాడు" అని చెప్పే సన్నివేశాల నుండి, ఈరోజు లేబర్ రూమ్‌లో తల్లి పడే నరకయాతనని, విజువల్‌గా అత్యంత వివరంగా చూపించే వరకు సినిమాల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఈ మార్పుని  కొందరు ప్రేక్షకులు సహజత్వానికి అద్దం పడుతోందని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం అసౌకర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. చలనచిత్ర చరిత్రను పరిశీలిస్తే, 1970లు మరియు 80ల నాటి సినిమాల్లో ప్రసవ ఘట్టాలను కేవలం ఒక సెంటిమెంట్ అస్త్రంగా మాత్రమే వాడేవారు. అప్పట్లో దాదాపు 90 శాతం సినిమాల్లో కాన్పు సన్నివేశాలు గది తలుపులు మూసివేసి, బయట తండ్రి లేదా కుటుంబ సభ్యులు ఆందోళనగా అటు ఇటు తిరగడంతోనే పూర్తయ్యేవి. కానీ 2000 సంవత్సరం తర్వాత పరిస్థితి వేగంగా మారింది. ముఖ్యంగా 2006లో వచ్చిన '3 ఇడియట్స్' సినిమాలో టేబుల్ టెన్నిస్ టేబుల్‌పై వాక్యూమ్ క్లీనర్‌తో ప్రసవం చేసే సన్నివేశం దాదాపు 10 నిమిషాల పాటు సాగి, థియేటర్లలో ప్రేక్షకులకు తీవ్రమైన ఉత్కంఠను కలిగించింది. ఆ తర్వాత నుంచి దర్శకులు డెలివరీ సీన్లను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు. ఇది కూడా చదవండి: హీరోయిన్ ఊహ మేనమామ ఎవరో తెలుసా? నాలుగు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన స్టార్ నటుడు! ఇటీవలి కాలంలో వచ్చిన చిత్రాల్లో ఈ ధోరణి ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు, 2022లో వచ్చిన 'మిమి' చిత్రంలో కృతి సనన్ నటించిన ప్రసవ సన్నివేశం లేదా 'ఆర్ఆర్ఆర్' మరియు ఇతర పాన్-ఇండియా సినిమాల్లోని భావోద్వేగ ఘట్టాలు మహిళల ప్రసవ వేదనను కళ్లకు కట్టినట్లు చూపించాయి. రీసెంట్ సర్వేల ప్రకారం, గత 5 సంవత్సరాల్లో వచ్చిన బిగ్ బడ్జెట్ చిత్రాలలో దాదాపు 35 శాతం సినిమాల్లో లేబర్ రూమ్ సీన్లు సుదీర్ఘంగా, నటీమణుల హావభావాలను క్లోజప్ షాట్స్‌లో చూపిస్తూ తీశారు.  ఇక రీసెంట్ చిత్రాలైన ప్యారడైజ్, రణబాలి చిత్రాల్లో అయితే డెలివరీ సీన్స్ చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. నెటిజన్ల నుండి వస్తున్న కామెంట్లను గమనిస్తే, 60 శాతానికి పైగా యువత ఈ తరహా విజువల్స్ వల్ల ప్రసవ సమయంలో మహిళ పడే కష్టాన్ని సమాజం అర్థం చేసుకుంటుందని మద్దతు ఇస్తున్నారు. అయితే, దాదాపు 40 శాతం మంది ప్రేక్షకులు మాత్రం కుటుంబంతో కలిసి చూసేటప్పుడు ఇటువంటి రా (Raw) మరియు అత్యంత తీవ్రమైన సన్నివేశాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. సినిమా నిపుణుల ప్రకారం, ఈ సన్నివేశాల్లో వచ్చే 100 శాతం మార్పు వెనుక రియలిస్టిక్ సినిమా వైపు దర్శకుల మొగ్గు ఉండటమే ప్రధాన కారణం. గతంలో కేవలం సున్నితమైన సెంటిమెంట్‌గా చూపించిన అంశాలను, నేడు అత్యంత వాస్తవికంగా, వైద్యపరమైన అంశాలను కూడా జోడించి తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల కామెంట్లు మరియు విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ప్రసవ ఘట్టాల చిత్రీకరణ అనేది తెరపై తల్లి ప్రేమ మరియు త్యాగానికి ఇచ్చే అత్యున్నత గౌరవంగా దర్శకులు భావిస్తున్నారు. ఈ మార్పు మున్ముందు రాబోయే సినిమాల్లో ఇంకెన్ని రకాల కొత్త అనుభూతులను అందిస్తుందో వేచి చూడాల్సిందే. మెజారిటీ సినీ ప్రియులు, నెటిజెన్స్ మాత్రం ప్రతి మనిషి జనన రహస్యం తెలిసిందే. అలాంటప్పుడు ఎందుకు ఆ ప్రక్రియని చూపించాలని కామెంట్స్ చేస్తున్నారు.     [Cinema Delivery Scenes Changing Trends, movie delivery scenes, childbirth scenes in cinema, indian cinema trends, audience reaction, realistic cinema, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]  
  'ఊహల పల్లకిలో ఊరేగుతున్నదీ వధువు...చిరు చిరు పెదవులపై ఊరుతున్నదీ మధువు'అంటూ హీరో శ్రీకాంత్ చేత పాడింది తన వాడ్ని గా చేసుకున్న హీరోయిన్ ఊహ. మెగా స్టార్ చిరంజీవికి సోదరిగా 'అల్లుడా మజాకా'లో కూడా  చేసి మెప్పించిన ఊహ ప్రముఖ అగ్ర నటుడు మేనకోడలనే విషయం చాలా మందికి తెలియదు.  తెలుగు తెరపై తన కట్ అవుట్ కి ప్రత్యేక ముద్ర వేసిన నటుడు పీఎల్ నారాయణ.  ఖైదీ లో చిరంజీవికి తండ్రిగా, రుద్రవీణలో చిరంజీవి మావయ్య గా, ఘరానా మొగుడులో చిరంజీవికి తోడు ఉండే కార్మికుడిగా చేసారంటే  పిఎల్ నారాయణ ట్రాక్ రికార్డు ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ చిత్రాల ద్వారా బాగా  పేరు సంపాదించాడు.  అసలు పి ఎల్ నారాయణ రౌద్రంగా ఒక డైలాగ్ చెప్తే ఆ రోజుల్లో థియేటర్స్ లో విజిల్స్ సైతం మొగేవి.  లాయర్, ఉపాధ్యాయుడు, రాజకీయ నాయకుడు, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు వంటి వైవిధ్యమైన పాత్రల్లో జీవించిన పీఎల్ నారాయణ, తెలుగు మరియు తమిళ భాషల్లో కలిపి మొత్తం సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులని  అలరించారు.  'యజ్ఞం' సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకున్నారు.  పి ఎల్ నారాయణకి  ఊహ స్వయానా మేనకోడలు అవుతారు.  పీఎల్ నారాయణ మలయాళీ కుటుంబానికి చెందినవారైనా, గుంటూరులో జన్మించి బాపట్ల, ఒంగోలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. నాటకరంగంపై మక్కువతో ఆయన వేసిన 'కుక్క' అనే నాటకానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారం దక్కింది. ఆ గుర్తింపుతోనే వెండితెరకి పరిచయమయ్యారు. ఇది కూడా చదవండి: క్రేజీ డైరెక్టర్‌తో సూర్య 50వ సినిమా: మీరు ఊహించిన పాన్ ఇండియా డైరెక్టర్!     ఇలా నాలుగు దశాబ్దాలకు పైగా సినీ చరిత్ర కలిగిన నటుడైన  పీఎల్ నారాయణ కుటుంబం నుంచే, ఆయన మేనకోడలిగా ఊహా  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అద్భుతమైన హీరోయిన్ గా వెలుగొండటం విశేషం.ఊహా అసలు పేరు శివరంజని.   [Ooha Maternal Uncle Pl Narayana, Ooha, PL Narayana, Srikanth wife Ooha, Tollywood senior actors, Ooha maternal uncle, Telugu cinema facts, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]
దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు నటుడిగా కూడా వెండితెరపై సందడి చేయబోతున్నారా? ఇప్పటికే బుల్లితెరపై రెండు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, త్వరలో ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అది కూడా విశ్వక్ సేన్ నటిస్తున్న క్రేజీ సీక్వెల్‌లో కావడం విశేషం. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఈ నగరానికి ఏమైంది 2'. మొదటి భాగం 'ఈ నగరానికి ఏమైంది' యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. నలుగురు స్నేహితుల మధ్య సాగే ఫన్, కామెడీ, ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే ఫన్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు 'ఈఎన్ఈ రిపీట్' పేరుతో సీక్వెల్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో అనిల్ రావిపూడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయన ఇందులో కూడా దర్శకుడి పాత్రలోనే కనిపిస్తారట. ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్.. అనిల్ రావిపూడిని కలిసే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమఠం, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. రూట్ నోడ్ సినిమా, ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇది కూడా చదవండి: తెలుగులో సోనీ కొత్త టీవీ ఛానెల్.. ఆ ఛానెళ్లకు షాక్ తప్పదా.?     [Anil Ravipudi In Ee Nagaraniki Emaindi 2, Anil Ravipudi In ENE Repeat, Ee Nagaraniki Emaindi 2, ENE Repeat, Anil Ravipudi, Vishwak Sen, Tharun Bhascker, Telugu Film News]  
తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి మరో కొత్త ఛానెల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనీ.. ఇప్పుడు తెలుగు టెలివిజన్ రంగంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఏర్పాటు చేసే దిశగా సంస్థ గట్టిగానే బ్యాక్‌ఎండ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు వంటి ఛానెళ్లు సీరియళ్లు, రియాలిటీ షోలు, ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోనీలివ్ కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త తరహా సీరియళ్లు, రియాలిటీ షోలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఇప్పటికే ఉన్న ఛానెళ్లకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొత్త ఛానెల్ ఎప్పుడు ప్రారంభం కానుంది? ఎలాంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి సోనీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే తెలుగు బుల్లితెరపై మరో కొత్త పోటీ మొదలైనట్టే. ఇది కూడా చదవండి: సాయి ధరమ్ తేజ్ పెళ్లి డేట్ ఫిక్స్.. వధువు ఎవరు.?       [Sony Telugu Entertainment Channel, Sony Telugu TV Channel, Sony New Channel, Sony Telugu Channel, ETV Telugu, Zee Telugu, Star Maa, Telugu News]  
Yash is set to present a distinctive interpretation of Ravana in director Nitesh Tiwari's ambitious adaptation of Ramayana. While Ranbir Kapoor plays Lord Rama and Sai Pallavi essays Sita, Yash has approached the legendary antagonist by exploring his psychological depth, internal contradictions and multiple personalities rather than merely relying on his larger-than-life image. Speaking about his interpretation, Yash revealed that he conceptualised the ten heads as distinct identities, each with its own physical appearance and voice. "I wanted to have a different voice. I could have played it in the same voice, but the idea was to imagine that each personality could speak or look differently," he explained. He further added, "No matter how we present ourselves, we have so many dilemmas in our head. We wanted our interpretation to be a very unique, epic and special one." Interestingly, the actor also found a personal connection with the character's multifaceted personality. "All my friends say that it's quite like my head. I do multiple jobs, I like taking on new things," he shared. Yash also explored Ravana's behavioural nuances, including his patience and sarcasm.  "Ravana is ready with an answer but lets others complete. He doesn't respect yet he tries to not show it. Like this, we took a grounded approach." Reflecting on the experience, he said, "What we bring in as an actor is to understand the person who he was, and I think I had a blast in understanding Ravana." Produced by Namit Malhotra, DNEG and Yash on a lavish scale, Ramayana is scheduled for a worldwide theatrical release on November 5. The film has generated tremendous anticipation, with advance bookings reportedly witnessing a phenomenal response across markets. Dil Raju's SVC is distributing the film in the Telugu states. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  స్టార్ హీరో సూర్య  ఈ నెల 6 న 'సీన్'మూవీతో సెల్యులాయిడ్ కి హాయ్ చెప్తున్న విషయం తెలిసిందే. సూర్య వరుస విజయాలతో జోరు మీద ఉండటం, మలయాళ హిట్ మేకర్ జీతూ మాధవన్ దర్శకుడు కావడంతో సీన్ పై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రచార చిత్రాలు కూడా ఒకే రేంజ్ లో ఉన్నాయి. సూర్య కెరీర్ లో సీన్ మూవీ 47 . దీంతో ప్రతిష్టాత్మక 50 వ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిఫరెంట్ మేకింగ్ స్టైల్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సూర్య తన 50వ ప్రాజెక్ట్ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. సూర్య తన సినీ ప్రయాణంలో వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని ఎంచు కుంటాడనే విషయం తెలిసిందే. అరుణ్ మాతే శ్వరన్ తెరకెక్కించిన చిత్రాలలోని రా అండ్ రస్టిక్ మేకింగ్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక రేంజ్ లో ఉంటాయి. పాన్ ఇండియా ప్రేక్షకులు సైతం  అరుణ్ మాతేశ్వరన్ సినిమాల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.  ఇప్పుడు అదే స్థాయిలో సూర్యతో ఈ కాంబినేషన్ సెట్ అయితే స్క్రీన్ పై విజువల్ వండర్ చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  ఇది కూడా చదవండి: గ్లామర్ ఫోటోషూట్స్ చూసి అలా అనుకోవద్దు: దిశా పటానీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్     ఇది కేవలం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక రూమర్ మాత్రమే. సూర్య ప్రస్తుతం తన లైనప్‌లో భాగంగా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా మారబోయే 50వ సినిమాకిఅరుణ్ మాతేశ్వరన్ పేరు బలంగా వచ్చి చేరడంతో ఈ కాంబినేషన్ నిజమవుతుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ ప్రీవియస్ మూవీ 'డీసీ' తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.   [Suriya 50 Th Movie Arun Matheswaran Rumours, Suriya 50, Arun Matheswaran, Suriya 50th movie, Kollywood news, Suriya upcoming movies, Tamil cinema updates,TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]  
మెగా మేనల్లుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత కొంతకాలంగా ఆయన పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా నిశ్చితార్థం, పెళ్లి తేదీలు కూడా ఖరారయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా అభిమానుల్లో ఈ వార్త ఆసక్తికరంగా మారింది. నవంబర్ 5న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. అయితే సాయి తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాల్ని వివాహం చేసుకోబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 10న సాయి ధరమ్ తేజ్ వివాహం జరగనుందట. పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర సన్నిహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'సంబరాల ఏటి గట్టు' సినిమాతో బిజీగా ఉన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: మహేష్ బాబు మరో కొత్త బిజినెస్!       [Sai Dharam Tej Wedding Date, Sai Dharam Tej Marriage Date, Sai Dharam Tej Engagement, Sai Durgha Tej Marriage, Sai Dharam Tej, Sambharala Yeti Gattu, Telugu Film News]  
    పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన సాహూ, కల్కి 2898 ad చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న భామ దిశా పటానీ. బాలీవుడ్ లో హిట్ ట్రాక్ తో దూసుకుపోతూ ఉంది. ఇక గ్లామర్ ప్రపంచంలో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే హీరోయిన్స్ లో  సైతం దిశా పటానీ పేరు ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో తను షేర్ చేసే హాట్ అండ్ గ్లామరస్ ఫోటోషూట్స్ చూసి చాలా మంది ఆమె గ్లామర్ ప్రదర్శనకి ఎలాంటి మొహమాటపడని భామగా భావిస్తుంటారు.  తెరపై ఎంతటి గ్లామరస్ క్యారక్టర్ లో కనిపించినా, నిజ జీవితంలోనూ ఆమె అలాగే ఉంటుందని, నిత్యం పార్టీలు, పబ్బ్‌లు, హ్యాంగౌవర్‌లతో కాలం గడుపుతుంటుందని సాధారణ జనాలతో పాటు నెటిజన్లు గట్టిగా నమ్ముతుంటారు. కానీ, తాజాగా ఈ బ్యూటీ తన గురించి బయట ప్రచారంలో ఉన్న ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ ఒక ఆసక్తికరమైన క్లారిటీ ఇచ్చింది. తాను బయట అనుకుంటున్నట్టుగా పార్టీలు తిరిగే రకం కాదని కుండబద్దలు కొట్టింది. నిజ జీవితంలో చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటానని, ఎవరితోను త్వరగా కలవలేను. సోషల్ మీడియాలో కనిపించే తన ఇమేజ్‌కి, అసలు సిసలైన తన నిజ జీవిత స్వభావానికి చాలా వ్యత్యాసం ఉందని ఆమె వెల్లడించింది. బయట ప్రజలు తనను ఒక పార్టీ లవర్‌గా లేదా పబ్ కల్చర్‌కు అలవాటు పడిన అమ్మాయిగా భావిస్తారని, కానీ ఆ అంచనాలన్నీ పూర్తిగా తప్పని ఆమె తేల్చిచెప్పింది. తనకు రాత్రింబవళ్లు పార్టీలు చేసుకోవడం, జనంతో కలిసి ఎంజాయ్ చేయడం లాంటి హాబీలు అసలే లేవని, ఖాళీ సమయం దొరికితే ఇంట్లోనే ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చింది.   ఇది కూడా చదవండి: రిలీజ్ కి ముందే రామాయణకి పైరసీ సెగ: బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ!     వెండితెరపై కనిపించే పాత్రలు కేవలం నటనలో భాగమని, వాటిని వ్యక్తిగత జీవితానికి ఆపాదించడం సరికాదని దిశా పటానీ అభిప్రాయపడింది. తన వృత్తిపరమైన బాధ్యతల్లో భాగంగా గ్లామర్ పాత్రలు పోషిస్తున్నప్పటికీ, పర్సనల్ లైఫ్‌లో మాత్రం తాను పూర్తిగా వేరేలా ఉంటానని ఆమె పేర్కొంది. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా పుస్తకాలు చదువుకోవడం, జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేయడం, తన పెంపుడు జంతువులతో సమయం గడపడం అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని ఆమె తెలిపింది. ఈ వ్యాఖ్యలతో ఇప్పటివరకు ఆమెపై ఉన్న ముద్ర పూర్తిగా మారిపోవడంతో, ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారాయి.     [I Am Not A Party Type Girl Disha Patani, Disha Patani latest Comments, disha patani, disha patani news, disha patani party type, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]    
మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'రామాయణ' వరల్డ్ వైడ్ గా ఈ నెల 5న రిలీజ్‌కి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వ ప్రతిభ,   రాముడిగా  రణబీర్ కపూర్, సీతమ్మ వారుగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ ఎలా మెస్మరైజ్ చేయబోతున్నారనే క్యూరియాసిటీ అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకుల్లో చాలా బలంగా ఉంది.   అయితే ఈ దివ్య చరితంపై పైరసీ భూతం ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా మేకర్స్‌కు ఊరటనిస్తూ బాంబే హైకోర్టు కీలకమైన మధ్యంతర రక్షణ (Interim Protection) కల్పించింది. గోడ్‌పవర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కాపీరైట్ ఉల్లంఘన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ మాధవ్ జే జమ్‌దార్ నేతృత్వంలోని బాంబే హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రానికి సంబంధించిన ట్రిల్లర్లు, మేకింగ్ వీడియోలు మరియు విడుదలకు ముందే కొన్ని దృశ్యాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం పట్ల మేకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా స్క్రిప్ట్, పాత్రలు, ఫుటేజ్, పాటలు, సౌండ్ రికార్డింగ్‌లకు కూడా పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టుని  కోరారు. దీనిపై స్పందించిన కోర్టు, తెలియని వ్యక్తులు, పలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ సినిమాను అనధికారికంగా రికార్డ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, లేదా సోషల్ మీడియాలో ప్రసారం చేయడాన్ని నిరోధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.   ఇది కూడా చదవండి: సినిమా టిక్కెట్ల కోసం రికమండేషన్ చేసే రోజులు మళ్ళీ వస్తాయా? లేక గత చరిత్రేనా?       అంతేకాకుండా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) మరియు గూగుల్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు, సోషల్ మీడియా మధ్యవర్తులు పైరసీ లింక్‌లు లేదా కాపీరైట్ ఉల్లంఘించే కంటెంట్‌ను తక్షణమే బ్లాక్ చేయాలని లేదా తొలగించాలని ఆదేశించింది. కేవలం ఒరిజినల్ లింక్‌లే కాకుండా, ఆ తర్వాత పుట్టుకొచ్చే మిర్రర్ వెబ్‌సైట్ల (Mirror Websites) పై కూడా కఠిన నిఘా ఉంచాలని, గోడ్‌పవర్ మీడియా నుంచి రాతపూర్వక ఫిర్యాదు అందిన వెంటనే స్పందించాలని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మేకర్స్ , అభిమానులు,సినీ ప్రియులు, సినీ వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.     [Bombay High Court Protects Ramayana From Piracy, Bombay High Court About Ramayana, Ranbir Kapoor Ramayana, anti piracy order, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆహారం తినేటప్పుడు ఒక్కోసారి పొరపాటున నాలుక పంటికి తగిలి కొరుకుడు పడుతూ ఉంటుంది. సాధారణంగా ఇది తొందరపాటులో తినడం వల్ల జరుగుతుందని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది కేవలం అజాగ్రత్త వల్ల మాత్రమే కాకుండా, పంటి వరుస సరిగ్గా లేకపోవడం, నోటి ఆరోగ్యంలో సమస్యలు లేదా శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల కూడా జరుగుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం.  అసలు ఇలా పదే పదే కొరుక్కోవడం అనేది ఎందుకు జరుగుతుంది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. నాలుక మన నోటిలో ఎంతో సున్నితమైన భాగం. ఇది ఆహారాన్ని నమలడానికి, మింగడానికి , మాట్లాడడానికి చాలా ముఖ్యం. అందువల్ల తరచూ నాలుక కొరుక్కునే సమస్య ఎదురైతే, దాని వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. దీన్ని పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. పంటి అమరిక.. పంటి అమరిక సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొన్నిసార్లు పన్ను సరిగ్గా లేకపోయినా, పంటి అంచు చాలా పదునుగా ఉన్నా, లేదా పంటికి చేసిన డెంటల్ ట్రీట్మెంట్  సరిగ్గా అమరకపోయినా భోజనం చేసేటప్పుడు నాలుక ఆ భాగంలో తగిలి గాయమవుతుంది. అలాగే దంతాల వరుస సరిగ్గా లేని సందర్భాలలో ఆహారం నమిలేటప్పుడు నాలుక పళ్ల మధ్యకు వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో దంత వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం మంచిది. విటమిన్ల లోపం.. కొన్నిసార్లు శరీరంలో విటమిన్ల లోపం వల్ల కూడా నాలుకకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి 12, ఫోలెట్ లేదా ఐరన్  లోపించినప్పుడు నాలుక మీద మంట, నొప్పి లేదా వాపు రావడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి సరైన పోషకాహారం తీసుకోవాలి. తొందరగా తినడం.. భోజనం చేసేటప్పుడు తొందరపడటం, ఎక్కువ వేగంగా నమలడం, లేదా తినే సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడుతూ తినడం వల్ల కూడా నాలుక కొరుక్కునే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా, నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అనుకోకుండా నాలుక కొరుడుపడి గాయమైతే వెంటనే శుభ్రమైన నీటితో నోటిని కడుక్కోవాలి. రక్తం వస్తుంటే మెత్తటి గుడ్డతో కొద్దిగా ఒత్తిపట్టాలి. గాయం పూర్తిగా తగ్గే వరకు కారంగా, పుల్లగా లేదా చాలా వేడిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ రక్తం ఆగకపోతే, గాయం పెద్దదిగా ఉంటే లేదా వాపు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                             *రూపశ్రీ.  
ఉపవాసం అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తువచ్చేది ఏదో ఒక పూట భోజనం మానివేయడం లేదా దేవుడి పేరుతో చేసే పూజా కార్యక్రమాలు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం , మన పురాతన కాలం నాటి ఆచారాలు కూడా ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మనం పాటించే చిన్న ఉపవాస పద్ధతి శరీరం లోపల ఎన్నో అద్బుతమైన మార్పులకు కారణమవుతుంది. ఉపవాసం గురించి మూర్ఖంగా వాదించే వారు కూడా ఉంటారు.  అలాంటి వారు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోవాలి.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి.. శరీరానికి ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటే జీర్ణవ్యవస్థ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం, కణాల పనితీరు మందగించడం జరుగుతుంది. అదే మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణక్రియకు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతుంది. ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు.. బరువు నియంత్రణ.. మనం తినడం ఆపినప్పుడు శరీరం శక్తి కోసం మొదట గ్లూకోజ్ ను, ఆ తర్వాత నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల అనవసరమైన కొవ్వు సులభంగా కరిగిపోయి బరువు అదుపులోకి వస్తుంది.   రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఉపవాస సమయాల్లో శరీరం పాత , దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. కొద్దిసేపు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, మధుమేహం అదుపులో ఉండేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది. మెదడు చురుకుదనం.. ఉపవాసం ఉన్న సమయంలో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి , ఏకాగ్రత మెరుగుపడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజం తెలుసుకోవాలి.. అయితే ఉపవాసం అంటే రోజంతా పస్తులు ఉండమని కాదు. మన శరీర తత్వానికి తగినట్లుగా, నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతూ తేలికపాటి పద్ధతిలో ఉపవాసం ఉండటం మంచిది. ఒకసారి ఈ చిన్న అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే, అనారోగ్యాలొచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయి నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి  ఉపవాసాన్ని కేవలం ఆచారంలా కాకుండా ఆరోగ్య రహస్యంగా భావించి పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది.                                                                                                                                        *రూపశ్రీ.
రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? రక్త ప్రసరణ సరిగా జరగడం లేదా? రక్తనాళాల్లో బ్లాకులు ఎందుకు ఏర్పడతాయి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుందా? మన వంటింట్లోనే దొరికే నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు? ఈ చూర్ణంలో ఉపయోగించే దినుసులు ఏమిటి? వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఆయుర్వేద, వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వివరించారు. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి గల కారణాలు, కొలెస్ట్రాల్ సమస్యలు, రక్త ప్రసరణకు సంబంధించిన విషయాలు, నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణం తయారీ విధానం గురించి డాక్టర్ మధుసూదన శర్మ గారి వివరణను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రక్తనాళాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు, రక్త ప్రసరణ గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ వీడియోను చూడండి. ముఖ్య గమనిక: రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ఆయుర్వేద చూర్ణం లేదా ఇతర ఇంటి వైద్యాలను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపకూడదు. రక్తనాళాల్లోని బ్లాకులకు మందులు లేదా స్టెంట్ అవసరమా అనే విషయాన్ని వైద్యులే నిర్ణయించాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)