LATEST NEWS
ఎన్నికల వ్యూహకర్తగా ఇండియన్ పోలిటికల్ ఫీల్డ్ లో  ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనున్నారు. సొంతంగా జన్ సూరజ్ పార్టీ  స్థాపించి ఇటీవలి బీహార్ ఎన్నికలలో ఘోరంగా విఫలమైన ప్రశాంత్ కిశోర్.. ఆ ఎన్నికలలో  తాను బరిలోకి దిగలేదు కానీ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.  తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో  ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా    ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.   బీహార్‌లోని అ ప్రతిష్టాత్మక బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికలో తాను బరిలోకి దిగి పోటీ చేయనున్నట్లు ప్రశాంత్ కిశోర్ స్వయంగా చెప్పారు.  పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు.  బంకీపూర్..   2006  నుండి ఈ స్థానం నుంచి బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి   బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ విజయం సాధించారు. అయితే  ఆ తరువాత  అంటే ఈ ఏడాది ఏప్రిల్ లో  రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది.  రెండు దశాబ్దాలుగా బీజేపీకి   కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ నిర్ణయించుకున్నారు.   కాగా తన పోటీ విషయాన్ని ప్రకటించిన మీడియా సమావేశంలోనే.. ప్రశాంత్ కిశోర్ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ కు రెఫరెండంగా అభివర్ణించారు. మార్పు కోరుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అంతే కాకుండా.. ఈ ఉప ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలను సైతం ప్రశాంత్ కిశోర్ కోరారు. అవపకమైతే అధికార బీజేపీని తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతానని ప్రశాంత్ కిశోర్ అన్నారు.  అయితే బంకీపూర్ స్థానం నుంచి బరిలోకి దిగుతామని ఆర్జేడీ ఇప్పటికే ప్రకటించింది. ఇక బీజేపీ సొంత స్థానం అయిన బకీంపూర్ ను ప్రశాంత్ కిశోర్ కు మద్దతు ఇచ్చి వదులుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఈ పరిస్థితుల్లోబంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ ఏ మేరకు రాణిస్తారన్న విషయంపై రాజకీయవర్గాలు పెదవి విరుస్తున్నాయి.   Bankipur by election, Jan Suraaj Party, Bihar politics, Nitin Nabin
పశ్చిమ బెంగాల్ లో పొటిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని హౌస్ అరెస్టు చేశారంటూ టీఎంసీ నేతల ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  దక్షిణ 24 పరగణాల జిల్లా బారుయిపూర్‌లో హత్యాచారానికి  గురైన  12 ఏళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆమెను హౌస్ అరెస్టు చేశారని టీఎంసీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిని, ఆమె సొంత రాష్ట్రంలోనే కదలకుండా నిర్బంధించడం దారుణమని మండిపడుతున్నాయి.  కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని  మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద   భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.  మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను  టీఎంసీ ఎంపీలు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  బాధితురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించకుండా అడ్డుకోవడానికే  సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మమతను హౌస్ అరెస్టు చేశారని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి,   మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకురాలి పట్ల   అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మహువా మొయిత్రా విమర్శించారు.   ఇలా ఉండగా,   బారుయిపూర్ లో మైనర్ బాలికపై హత్యాచార   ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను  అరెస్ట్ చేశారు. ఈ  కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్  ఏర్పాటు చేశామని, దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ  గృహనిర్బంధం ఆరోపణలను   టీఎంసీ ఆడుతున్న రాజకీయ నాటకాలుగా  ప్రభుత్వం కొట్టిపారేసింది.   MC leaders allegations, West Bengal politics, Mahua Moitra, Baruipur case
  అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రాంతీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత చరిష్మా పార్టీల జయాపజయాలను శాసిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి రాజకీయ అడుగులపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, టోన్ న్యూస్‌ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.  పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకుంటూనే, తన భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. రాజకీయ వ్యూహం మరియు అంతరార్థాలు ప్రభాకర్ చౌదరి సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ, జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవులను నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ మరియు ప్రజాదరణ ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న శాసనమండలి (MLC) స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.  గతంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఇది ఒక రకంగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని చెబుతూనే, తన సీనియారిటీకి మరియు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తగిన గుర్తింపు దక్కాలనే ఆకాంక్షను ఆయన బలంగా వినిపించారు. ఒకవేళ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తే చట్టసభల్లో ప్రజా సమస్యలపై గళమెత్తడానికి సిద్ధంగా ఉన్నానని, ఇవ్వకపోయినా ఒక సాధారణ కార్యకర్తలా పార్టీలోనే కొనసాగుతానని చెప్పడం వెనుక రాజకీయ పరిణతి కనిపిస్తుంది. రాజకీయ పరిణామాలు మరియు అంతస్సూత్రాలురాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న ఫ్యాక్షనిజం తీరుపై, ప్రస్తుత స్వార్థపూరిత రాజకీయాలపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో ఫ్యాక్షనిజానికి కులం, మతం లేవని, గ్రూపుల మధ్య మాత్రమే వైషమ్యాలు ఉండేవని పేర్కొన్నారు. కానీ నేడు రాజకీయం కలుషితమై ఫ్యాక్షన్‌ను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తులు ఎదిగే అవకాశం కనుచూపు మేరలో లేదని, సంప్రదాయ వారసత్వ పార్టీలే రాజ్యమేలుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు రావడానికి మరింత సమయం పడుతుందనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు.  ఈ పరిణామాలు అనంతపురం జిల్లాలో టిడిపి అంతర్గత గ్రూపు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభాకర్ చౌదరికి తగిన ప్రాధాన్యత దక్కకుంటే జిల్లాలో పార్టీ క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంరానున్న రోజుల్లో ప్రభాకర్ చౌదరి భవిష్యత్తు పూర్తిగా టిడిపి అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే, అనంతపురం జిల్లాలో పార్టీ మరింత పుంజుకుంటుంది. ఒకవేళ అధిష్టానం ఆయనను విస్మరిస్తే, స్థానిక సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఆయన పార్టీ మారే యోచనలో లేనప్పటికీ, ద్వితీయ శ్రేణి నాయకులు మరియు అనుచరుల ఒత్తిడి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయానికైనా దారితీయవచ్చు. పూర్తి చర్చను టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్..  2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే..  2019 ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.  2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి  కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత  వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.   దీంతో   2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్  వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.  దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.   ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆ దిశగా ఇప్పటికే  జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.   Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone
  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి చేరి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. రెండు దశాబ్దాల తన ప్రజా జీవితం మరుపురాని మధుర జ్ఞాపకం అని ఆయన కొనియాడారు. కేవలం రేవంత్ రెడ్డి అనే పేరుతో ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలు ఆదరించి 'రేవంతన్న'గా తమ గుండెల్లో నిలిపిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభమైన తన తొలి రాజకీయ అడుగులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా మిడ్జిల్ లో మొదలైన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో రాజకీయ పరిణామాలు, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అయితే ప్రతి కష్టకాలంలోనూ, ప్రతి మలుపులోనూ ప్రజలు తనకు అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాదరణ, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనేదే తన ఏకైక సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక సామాన్య శ్రామికుడిగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే ఒక నమ్మకమైన సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార గర్వం లేకుండా, కేవలం ప్రజల మనిషిగా, అందరి 'రేవంతన్న'గా ప్రజా హృదయాల్లో మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే తన ఆశయమని ఆయన ఈ మైలురాయి సందర్భంగా ఉద్ఘాటించారు. 2006 నుంచి 2026 వరకు సాగిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒంటరి పోరాటాలు చేసి, చివరకు ప్రజా బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం.  
ALSO ON TELUGUONE N E W S
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత నాని లైనప్‌లో అనేక క్రేజీ కాంబినేషన్లు లైన్లో ఉన్నాయి. తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో నాని ఒక సరికొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే విషయంలో ఒక ఆసక్తికరమైన సమీకరణం తెరపైకి వచ్చింది. నాని లైనప్‌లో దర్శకుడు సుజీత్‌తో 'బ్లడీ రోమియో' అనే హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే అనౌన్స్ అయింది. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో దాదాపు 80 శాతం షూటింగ్ జరుపుకోవడానికి ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ కోసం సుజీత్ ఇప్పటికే లండన్‌లో లొకేషన్ స్కౌటింగ్ కూడా పూర్తి చేశారు. కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఒకవేళ సుజీత్ ముందే ప్లాన్ చేసుకున్నట్లుగా 'బ్లడీ రోమియో' సినిమాను మొదలుపెడితే, నాని-వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోయే చిత్రం కొంచెం ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సుజీత్ తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'OG 2' కథా చర్చలు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. ఒకవేళ సుజీత్ 'బ్లడీ రోమియో' కంటే ముందే పవన్ కళ్యాణ్ 'OG 2' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటే మాత్రం నాని లైనప్ పూర్తిగా మారిపోతుంది. సుజీత్ 'OG 2' బిజీలోకి వెళ్తే, నాని తన 'బ్లడీ రోమియో' షూటింగ్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టి, అంతకంటే ముందే వెంకీ అట్లూరి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు ఆప్షన్లలో ఏది ముందు జరిగినా, నేచురల్ స్టార్ నాని ఖాతాలో మాత్రం ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా బ్లాక్‌బస్టర్ లైనప్ సిద్ధంగా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అటు సుజీత్ మార్క్ ఇంటర్నేషనల్ స్టైలిష్ యాక్షన్ డ్రామా 'బ్లడీ రోమియో', ఇటు వెంకీ అట్లూరి మార్క్ క్లాసిక్ ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ డ్రామా.. ఈ రెండూ నాని నటనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించేందుకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి.  ప్రస్తుతం 'ది పారడైజ్' మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా నాని వర్క్ చేస్తున్నారు. ఆ సినిమా ముగిసిన వెంటనే సుజీత్ లేదా వెంకీ అట్లూరి ప్రాజెక్టులలో ఏది ముందు ప్రారంభం కానుందనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నాని ప్లానింగ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద నేచురల్ స్టార్ విధ్వంసం మామూలుగా ఉండదని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Nani, The Paradise, Sujeeth, Bloody Romeo, Venky Atluri, TeluguOne  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  'పుష్ప 2 ది రూల్' ప్రీమియర్ షో సమయంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట ఉదంతం టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనకి  సంబంధించిన కేసు విచారణ  నాంపల్లి కోర్టులో కీలక దశకు చేరుకుంది.గత వాయిదా సమయంలో అల్లు అర్జున్ తరఫు న్యాయవాది కోర్టులో ఒక ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. బన్నీ ప్రస్తుతం తన తదుపరి సినిమాల షూటింగ్‌ల నిమిత్తం ముంబైలో ఉన్నారని, అందుకే వ్యక్తిగతంగా హాజరుకాలేని పరిస్థితి ఉందని కోర్టుకు వివరించారు. ఆడియో-వీడియో ఎలక్ట్రానిక్ విధానం ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో, న్యాయస్థానం అందుకు అంగీకరించింది. దీంతో అల్లు అర్జున్ ముంబై నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. నిందితుల కొంత మంది వ్యక్తిగత కారణాలతో విచారణకి  హాజరు కాకపోవడంతో కోర్టు  తదుపరి విచారణ 29 కి వాయిదా వేసింది.  23 మంది నిందితులకి  500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలని పీపీ అందించాడు. దీంతో 29 న వచ్చే తీరుపై అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది.  Also read: Nagarjuna: నిర్మాతగా నాగార్జున అందుకున్న హిట్, ప్లాప్స్ ఇవే   
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ ట్రెండ్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఒకప్పుడు థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాటు, విడుదలైన సమయంలో కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా, ఆ తర్వాత కాలంలో కల్ట్ క్లాసిక్ హోదాను సొంతం చేసుకున్న సినిమాలను సైతం మేకర్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా వారి పాత సినిమాలను పెద్ద తెరపై ప్రదర్శిస్తుండటంతో అభిమానులు థియేటర్లను పండగ వాతావరణంగా మారుస్తున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలు రీ-రిలీజై బాక్సాఫీస్ వద్ద హల్‌చల్ చేయగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆయన కెరీర్‌లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘పంజా’ వచ్చి చేరింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు సరికొత్త బర్త్‌డే ట్రీట్ సిద్ధమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన ‘పంజా’ చిత్రం 2011 లో విడుదలైంది. ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లవుతున్నా, ఇందులో పవన్ కళ్యాణ్ చూపించిన అల్ట్రా మోడ్రన్ మేకోవర్, డిఫరెంట్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ సెన్స్ ఇప్పటికీ అభిమానుల్లో ఒక క్రేజ్‌గా నిలిచిపోయాయి. రాబోయే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను 4K ఫార్మాట్‌లో భారీ ఎత్తున రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పెద్ద తెరపై పవన్ స్టైలిష్ అవతారాన్ని, యాక్షన్ సీక్వెన్స్‌లను మరోసారి వీక్షించేందుకు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అప్పుడే సందడి మొదలుపెట్టారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ‘పంజా’ ఆడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా అందించిన అద్భుతమైన పాటలు, హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ పరంగా కూడా హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌ను తలపించేలా విష్ణువర్ధన్ ఈ చిత్రాన్ని అప్పట్లోనే అత్యద్భుత విజువల్స్‌తో తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో సారా-జేన్ డియాస్, అంజలి లవానియా కథానాయికలుగా నటించగా.. బ్రహ్మానందం, అలీ తమ కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. ‘పంజా’ కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథాంశం అంతా కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. నగరంలో తిరుగులేని మాఫియా డాన్‌గా చలామణి అయ్యే భగవాన్ (జాకీ ష్రాఫ్) వద్ద జై (పవన్ కళ్యాణ్) అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడిగా, కుడిభుజంగా ఉంటాడు. భగవాన్ పట్ల ఎంతో విశ్వాసంతో ఉండే జై జీవితంలోకి.. భగవాన్ కొడుకైన మున్నా (అడివి శేష్) ప్రవేశిస్తాడు. మున్నా తీవ్ర ఉన్మాదంతో చేసే అరాచకాలు శృతిమించడంతో.. పరిస్థితులు జైని తన సొంత బాస్‌కు వ్యతిరేకంగా నిలబడేలా చేస్తాయి. నమ్మిన సిద్ధాంతాల కోసం, ప్రాణ సమానంగా చూసుకున్న బాస్‌పైనే జై ఎదురు తిరిగి ఎలా పంజా విసిరాడు, అతడి అరాచకాలకు ఎలా చెక్ పెట్టాడు అనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. సరికొత్త స్క్రీన్‌ప్లేతో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సెప్టెంబర్ 2న థియేటర్లలో రీ-ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     Pawan Kalyan, Panjaa rerelease, Panjaa 4K, Panjaa movie, Yuvan Shankar Raja, Director Vishnuvardhan 
  తెలుగు సినీ అగ్ర హీరోల్లో కింగ్  నాగార్జున(Nagarjuna)ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుంచే తెలుగు సినిమాకి పాన్ ఇండియా సొగసులు అద్దిన తొలి హీరో. తన తండ్రి నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన 'అన్నపూర్ణ స్టూడియోస్' బ్యానర్‌ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తు నటుడిగానే కాకుండా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా తనదైన ముద్ర వేశారు. ప్రయోగాత్మక చిత్రాలని నిర్మించడంలో కూడా వెనకాడలేదు. నిర్మాతగా ఇప్పటివరకు దాదాపు 30కి పైగా సినిమాలని  నిర్మించగా, వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి, మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆడక డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. గ్రేట్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్స్ మనం స్టూడియోస్ పై కూడా  నాగార్జున సొంతంగా నిర్మించిన సినిమాల్లో దాదాపు 18కి పైగా విజయాలు సాధించగా, 10కి పైగా  పరాజయాన్ని చవిచూశాయి.  నిర్మాతగా నాగార్జున కెరీర్‌ని  మలుపు తిప్పిన మైలురాయి చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. 1996లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని  సాధించడమే కాకుండా, ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుని గెలుచుకుంది. ఆ తర్వాత 2002లో వచ్చిన 'మన్మథుడు', 2004లో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'మాస్' బాక్సాఫీస్‌ని  షేక్ చేసి నిర్మాతగా నాగార్జునకి  భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా నాగార్జున, నాగచైతన్య, ఏఎన్నార్ మూడు తరాల హీరోలతో కలిసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2014లో నిర్మించిన 'మనం' మూవీ  తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్లకి పైగా షేర్ వసూలు చేసి అటు విమర్శకుల ప్రశంసలని, ఇటు కలెక్షన్లని కొల్లగొట్టింది. ఆ తర్వాత 2016లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం దాదాపు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి నాగార్జున ప్రొడక్షన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది. also read: Prabhas: ప్రభాస్ ఫౌజీపై నాగవంశీ కామెంట్స్ వైరల్  అయితే, నిర్మాతగా నాగార్జునకి  అన్ని రోజులు ఒకేలా సాగలేదు. ప్రయోగాల కోసం ఆయన పెట్టిన పెట్టుబడులు కొన్నిసార్లు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. 2013లో వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'భాయ్'  అన్నపూర్ణ స్టూడియోస్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్‌. డిస్ట్రిబ్యూటర్లకి అయితే  దాదాపు 70 శాతం వరకు నష్టాలను మిగిల్చింది.  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మించిన 'మన్మథుడు 2' (2019)  కూడా ఫ్యాన్స్, ప్రేక్షకులని  ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమై బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. తన కుమారులు నాగచైతన్య, అఖిల్‌లను హీరోలుగా పెట్టి నిర్మించిన 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' చిత్రాలలో 'రారండోయ్' మంచి విజయం సాధించగా,  'హలో' మాత్రం యావరేజ్ టాక్‌తో కమర్షియల్‌గా నష్టాలని  తెచ్చింది. అయినప్పటికీ, 2022లో వచ్చిన 'బంగార్రాజు' సినిమాతో మళ్లీ నిర్మాతగా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇలా దాదాపు 60 శాతం సక్సెస్ రేటుతో టాలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్‌గా నాగార్జున ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. ఈ నెల 10 న మరో మారు తనయుడు అఖిల్ లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ కూడా వన్ ఆఫ్ ది పార్టనర్.    nagarjuna, akhil akkineni, lenin, bhagyashri borse  
కోలీవుడ్ లో వినూత్నమైన కథలతో, ట్రెండీ ఆలోచనలతో యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తారు. 'PR షో' అనే బ్యానర్‌ను స్థాపించి, మొదటి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసే ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపారు. సాధారణంగా ఒక సినిమాకు ఒకే దర్శకుడు ఉంటారు, ఒక్కోసారి ఇద్దరు కలిసి పని చేయడం చూస్తుంటాం. కానీ ప్రదీప్ రంగనాథన్ ఏకంగా ఆరుగురు రైటర్-డైరెక్టర్లను ఒకే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆరుగురు దర్శకుల బృందాన్ని ఆయన "ఆల్ఫా యూనిట్" అని పిలుస్తున్నారు. ఈ ఆరుగురు కలిసి ఉమ్మడిగా కథను సిద్ధం చేసుకోవడమే కాకుండా, సినిమాను కూడా సంయుక్తంగా తెరకెక్కిస్తుండటం విశేషం. గతంలో 1999లో వచ్చిన తమిళ చిత్రం 'స్వయంవరం' (Suyamvaram) కోసం పలువురు దర్శకులు కలిసి పని చేసినప్పటికీ, ఈ సినిమా పూర్తి భిన్నమైన ఫార్మాట్‌లో సరికొత్త టెక్నాలజీతో రాబోతోంది. కేవలం ఒకే ఫీచర్ ఫిల్మ్ కోసం ఆరుగురు దర్శకులు కలిసి పనిచేయడం అనేది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను తాజాగా విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మమితా బైజు రౌద్ర రూపాన్ని చూపించబోతున్నట్లు ప్రోమో ద్వారా స్పష్టమైంది. వీడియో గ్లింప్స్‌లో మమితా రక్తం అంటిన కత్తిని పట్టుకుని, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న అశ్విత్ మారిముత్తుపైకి విసరడం చూస్తుంటే.. ఒక యువతికి , ఒక శక్తివంతమైన పోలీస్ అధికారికి మధ్య జరిగే హోరాహోరీ పోరాటమే ఈ సినిమా అని అర్థమవుతోంది. ఈ సినిమాలో మమితా బైజు, అశ్విత్ మారిముత్తుతో పాటుగా కీలక పాత్రల్లో శివాజీ సొంటినేని, స్వాసిక నటిస్తుండగా, ఈ చిత్రం ద్వారా అనామిక మహి అనే సరికొత్త నటి ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇక ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా దూసుకుపోతున్న సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. దర్శకుడిగా, నటుడిగా తన మార్క్ చూపించిన ప్రదీప్ రంగనాథన్, నిర్మాతగా తన తొలి అడుగులోనే ఇలాంటి విభిన్నమైన, ప్రయోగాత్మకమైన చిత్రాన్ని ఎంచుకోవడం ఆయన సినీ అభిరుచికి అద్దం పడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాపై అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.     Pradeep Ranganathan, PR Show Banner, Six Directors, The Alpha Unit, Mamitha Baiju  
రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ మోస్ట్ 'ఫౌజీ'. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ వాల్యూతో 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తుండగా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంతో, యుద్ధం  ప్రేమ అనే బలమైన భావోద్వేగాల చుట్టూ తిరిగే కధాంశాలతో తెరకెక్కుతుంది. తాజాగా  ఫౌజీ' పై స్టార్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ 'ఫౌజీ' నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ నాకు 'ఫౌజీ'కి సంబంధించిన కొన్ని కీలక రషెస్ (షూటింగ్ విజువల్స్) చూపించారు. ఆ విజువల్స్ చూసినప్పుడు నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. స్క్రీన్ మీద విజువల్స్ అంత అద్భుతంగా, రిచ్‌గా వచ్చాయి , హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. మనం ఊహించని స్థాయిలో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా రూపొందిస్తున్నారు అంటూ చిత్రబృందాన్ని ప్రశంసించారు. సాధారణంగా ప్రతి సినిమాను ఎంతో నిశితంగా గమనించే నాగవంశీ లాంటి అగ్ర నిర్మాత ఈ స్థాయి ఎలివేషన్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తుంది. Also read: Lenin: లెనిన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే తొలి మైల్‌స్టోన్ హిట్ అందుకోబోతుందా! డిసెంబర్‌లో  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ శరవేగంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకునట్టుగా తెలుస్తుంది. టీజర్ అండ్ ఫస్ట్ లుక్  కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.  సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మెలోడీలతో పాటు అంతకు మించిన గ్రాండియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌  సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  Naga vamsi, prabhas, fauzi, hanuraghavapudi  
Prabhas' Fauzi has been carrying massive expectations ever since director Hanu Raghavapudi announced the ambitious period action drama. While the makers have maintained complete secrecy around the project, producer Naga Vamsi has now added more fuel to the anticipation with his latest comments. Speaking at a recent event, Naga Vamsi revealed that he got an opportunity to watch a few episodes of Fauzi and described the experience as "mind-blowing." Though he refrained from revealing any story details, his reaction has quickly gone viral among Prabhas fans, who are eagerly waiting for the film's first promotional material. The statement has generated fresh excitement because Vamsi is known for being selective with his praise. His comments suggest that Hanu Raghavapudi has crafted something visually rich and emotionally engaging, staying true to the director's signature storytelling style while mounting it on a much bigger scale with Prabhas. Fauzi is one of the most awaited films in Prabhas' lineup as it marks his first collaboration with Hanu Raghavapudi. The period drama is expected to present the pan-India star in a never-seen-before avatar, with grand production values from Mythri Movie Makers and an emotional narrative at its core. Imanvi is playing leading lady and huge ensemble cast is part of this huge actioner.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు ఐడెంటిటీని ప్రేక్షకుల్లోకి చొచ్చుకొని పోయేలా చేయగల నటి భాగ్యశ్రీ బోర్సే. రవితేజతో చేసిన తొలి చిత్రం 'మిస్టర్ బచ్చన్' ప్లాప్ అయినా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించింది. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన కాంత, 'ఆంధ్రా కింగ్ తాలూకా' కింగ్ డమ్ ల పరిస్థితి కూడా అంతే. ఇలాంటి తరుణంలో  రేపు 10  న విడుదల కాబోతున్న 'లెనిన్' మూవీపైనే ఈ ముద్దుగుమ్మ తన ఆశలన్నీ పెట్టుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే 'భారతి' అనే కీలకమైన రోల్ లో  కనిపించబోతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ కథలో మహాభారత ఛాయలు, ఫ్రెండ్‌షిప్, లవ్, రివోల్ట్ మరియు వార్ వంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ కట్‌ను బట్టి స్పష్టమవుతోంది. "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు" అనే పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అఖిల్ అక్కినేని మాస్ అవతార్‌తో పాటు ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పాత్ర కూడా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే బలమైన ఎమోషనల్ కోర్‌తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని నాగార్జున, నిర్మాత నాగవంశీలతో పాటు చిత్ర బృందం మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. స్క్రీన్ మీద అఖిల్ కనిపించడు, కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక మహాభారతం ఇదని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. Also read: Rao bahadur: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రావు బహదూర్.. మూడురోజులకి ఎంతంటే! థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, "సోల్ ఆఫ్ లెనిన్", "జయ మంగళం" వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాగ్యశ్రీ బోర్సే నటనకు, అందానికి మంచి మార్కులే పడుతున్నప్పటికీ బాక్సాఫీస్ సక్సెస్ అనేది ఆమెకు కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల క్రేజీ ప్రాజెక్ట్ 'కాంత'తో పాటు తమిళంలో 'సేయోన్' వంటి సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ, తెలుగులో పూర్తి స్థాయి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే 'లెనిన్' విజయం ఆమెకు ఎంతైనా అవసరం. మరి లెనిన్  భాగ్యశ్రీ  కెరీర్‌లో ఫస్ట్ మైల్‌స్టోన్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.   
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధికారికంగా ప్రకటించారు. కానీ, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. గత కొంత కాలంగా ఎలాంటి అధికారిక అప్‌డేట్స్ కూడా రాకపోవడంతో.. ఇక ఆ సినిమా అటక ఎక్కినట్లే అని అందరూ భావించారు.  మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇప్పుడొక ఊహించని న్యూస్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ తన కొడుకు అరంగేట్రం కోసం ఒక పక్కా మాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఈ రేస్‌లోకి వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్.  ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ద్వారా మోక్షజ్ఞను గ్రాండ్ లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నాట. అందుకే బోయపాటి శ్రీను అయితేనే నందమూరి వారసుడిని వెండితెరపై అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించగలరని బాలయ్య బలంగా నమ్ముతున్నారు. ఈ ఊహించని కాంబినేషన్ వెనుక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'NBK ఫిలిమ్స్' బ్యానర్‌పైనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారట. మోక్షజ్ఞ కోసం బోయపాటి శ్రీను ఇప్పటికే ఒక అద్భుతమైన, హై-వోల్టేజ్ మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి బాలయ్యను ఒప్పించారని సమాచారం.  ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక అధికారికంగా లాక్ అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై నందమూరి కాంపౌండ్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.     Nandamuri Mokshagna, Boyapati Srinu, Nandamuri Balakrishna, TeluguOne  
    కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షక పట్టాభిషేకం ఎలా ఉంటుందో నిరూపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్నాడు రావు బహదూర్. సత్యదేవ్ విలక్షణ నటన, క్రేజీ డైరెక్టర్ వెంకటేష్  దర్శకత్వ ప్రతిభకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన    ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులని  సృష్టిస్తోంది.    మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 3.11 కోట్లు రాగా రెండు రోజుల్లోనే 5 కోట్ల మార్కుని అందుకుంది. మూడో రోజైన ఆదివారం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ఓవర్సీస్ లోను అదే పరిస్థితి. దీంతో మూడు రోజుల  వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్  8.52 కోట్ల మార్కుని  తాకి సంచలనం సృష్టించింది.  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ సినిమా అత్యధికంగా 2.80 కోట్ల వసూళ్లను సాధించి టాప్ ప్లేస్‌లో నిలవగా కర్ణాటకలో 33 లక్షలు, తమిళనాడులో 2 లక్షల కలెక్షన్లని  రాబట్టింది.  Also read: పెళ్లి రోజు గిఫ్ట్ అంటు విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్  ప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. సత్యదేవ్ నటించలేదని, జీవించాడని కొనియాడారు. ఈ సినిమా మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేయడం సినిమాకి  మరింత ప్లస్ అయింది. సత్యదేవ్ ఈ లుక్ కోసం ఏకంగా 70 రోజుల పాటు ప్రతిరోజూ 5 గంటల పాటు మేకప్ వేసుకోవడం ఆయన పడ్డ కష్టానికి, సినిమాపై ఉన్న అంకితభావానికి నిదర్శనం. ప్రస్తుతం ఈ సినిమా వీక్‌డేస్‌లోనూ మంచి హోల్డ్‌తో దూసుకుపోతోంది. హీరోయిన్ దీపా థామస్ పెర్ఫార్మ్ కి కూడా ప్రేక్షక లోకం బ్రహ్మ రధం పడుతుంది  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)