LATEST NEWS
   బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న *యువ సంగ్రామ సభ' కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్  పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విచారణ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కార్యక్రమం నిర్వహించేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెంటనే అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇస్తూనే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ కారణంగా జాతీయ రహదారి లేదా ఇతర ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలను దిగ్బంధించరాదని స్పష్టం చేసింది.  అలాగే సభ నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, సభ నిర్వాహకులు పోలీసులు సూచించే అన్ని నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, జనస మ్మర్ద నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కూడా సూచించింది. హైకోర్టు అనుమతితో శనివారం (జూలై 18) సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు, యువ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సభ నిర్వహణకు పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశముంది. BRS Youth Sangram Sabha, Telangana High Court, Saroornagar Indoor Stadium, BRS Party, KCR, KTR, CM Revanth reddy
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది.   కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.   ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.   ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.    public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ   రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. నేడో రేపో  రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  సాగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి  నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరశన చేపట్టారు. ఇలా ఉండగా ఆయన నిరవధిక నిరశన శుక్రవారం (జులై 17) నాటికి 20వ రోజుకు చేరింది. ఇలా ఉండగా  పార్లమెంట్ భవనం  ముట్టడించేందుకు కూడా  సోనమ్ వాంగ్‌చుక్   బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కీలక తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్‌చుక్  మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో  ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే ఆప్ అధినేత,  దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి  మద్దతు  ప్రకటించారు. కేజ్రీవాల్ పర్యటనతో ఈ ఉద్యమానికి   రాజకీయ బలం చేకూరింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణాదిలో అత్యంత బలమైన నేత  రేవంత్ రెడ్డి స్వయంగా హస్తిన వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్  కు, ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించనుండటంతో..  కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఈ ఉద్యమ వేదికపైకి పంపించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ది బలమైన వాయిస్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన, సోనమ్ వాంగ్‌చుక్‌తో భేటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన ఖరారైందని అంటున్నాయి.     Telangana CM, Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, TeluguOne 
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. అధికార పక్షాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొని బలపడాల్సిన తరుణంలో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు మరియు బలహీనమైన వ్యూహాలు పార్టీని మరింత రక్షణాత్మక ధోరణిలోకి నెడుతున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. రాజకీయ పరిస్థితి మరియు లోపించిన సునిశితత్వంప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ అనేక క్షేత్రస్థాయి సమస్యలను తన రాజకీయ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతోంది. విజయవాడ లాకప్ డెత్ (సాయికృష్ణ కేస్) వంటి తీవ్రమైన సమస్యలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం పార్టీ వ్యూహాత్మక లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలలో మొదట హడావుడి చేయడం, ఆ తర్వాత బాధితులను లేదా ఆందోళనకారులను సమన్వయం చేసుకోలేక మధ్యలోనే వదిలేయడం జగన్ నాయకత్వానికి బలహీనతగా మారింది. స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించకుండా, క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటాలు నిర్మించకుండా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవ్వడం వైస్సార్సీపీకి శాపంగా మారింది.  సమగ్ర అధ్యయనం లేకుండా మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విమర్శలకు, మీమ్స్ మరియు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి.వైఎస్సార్సీపీ బలహీన వ్యూహాలు మరియు పరిణామాలుపూర్వపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ శైలిని గమనిస్తే, ఆయన ఏ ప్రజాసమస్యపైనైనా పోరాడేముందు క్షేత్రస్థాయిలో పనిచేసే మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ నేతలతో మాట్లాడి పూర్తి అవగాహనతో ముందడుగు వేసేవారు. అయితే, ప్రస్తుత వైఎస్సార్సీపీలో అటువంటి నిర్మాణాత్మక చర్చలు లేకపోవడం ప్రధాన లోపం. రావణ ఎపిసోడ్ వంటి సందర్భాల్లో మొదట మైనారిటీల తరఫున నిలబడతామని ప్రకటించి, ఆపై కేంద్ర నాయకత్వానికి (NDA) దూరం కాకూడదనే భయంతోనో లేదా హిందూ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందనే ఆందోళనతోనో వెనక్కి తగ్గడం ఆ పార్టీలో నెలకొన్న సిద్ధాంతపరమైన గందరగోళాన్ని సూచిస్తోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు బెంగళూరు నుండి వచ్చి కేవలం పరామర్శలు చేసి వెళ్ళిపోవడం వల్ల శ్రేణుల్లో నమ్మకం సడలుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఒక పద్ధతి ప్రకారం నిరసనలు, ఉద్యమాలు చేపట్టలేకపోవడం వైఎస్సార్సీపీ వైఫల్యానికి అద్దంపడుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంనిర్మాణాత్మక వ్యూహాలు, క్షేత్రస్థాయి శ్రేణులతో బలమైన సమన్వయం లేకపోతే వైఎస్సార్సీపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కేవలం గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే 'యాక్టివ్ అపోజిషన్' వైఖరి పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తుంది. తప్పులను ఆత్మవిమర్శ చేసుకుని, చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతల అనుభవ శైలిని గమనించి రాజకీయ పరిణతి సాధించాల్సిన అవసరం జగన్ కి ఎంతైనా ఉంది. పార్టీని గందరగోళం మరియు అయోమయ పరిస్థితుల నుంచి బయటపడేసి, క్యాడర్‌లో భరోసా నింపకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ మరింత ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'జూనియర్ ఎన్టీఆర్' (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కేవలం ఒక సాధారణ ఊహాగానం కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేయగల ఒక బలమైన శక్తీకరణ..  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తే తెలుగునాట ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. ఈ అంశంపై టోన్ న్యూస్ "వాస్తవ వేదిక" చర్చా కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. ఒకవైపు సినిమా రంగంలో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్, మరోవైపు తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే అంశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చర్చనీయాంశాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన రాజకీయ శక్తులు బలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు తెలుగుదేశం పార్టీ (TDP) ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరులో, ఒక కొత్త మరియు అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడి అవసరం ఉందనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.  చారిత్రకంగా చూస్తే, ఎన్టీఆర్ కుటుంబానికి ప్రజాక్షేత్రంలో ఉండటం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ పరిస్థితుల్లోనైతే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో, నేటి రాజకీయ పరిస్థితులు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి అనుకూలంగా మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన నేటివరకు ఎలాంటి ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలు లేదా పూర్తిస్థాయి రాజకీయ కార్యాచరణను ప్రకటించకపోవడం గమనార్హం. అయినప్పటికీ, ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం పట్ల ఉన్న విశ్వసనీయత ఏమాత్రం తగ్గలేదు. వ్యూహాలు మరియు అంతర్గత సమీకరణాలుజూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం వెనుక అనేక వ్యూహాత్మక కోణాలు దాగి ఉన్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి సమకాలీన రాజకీయ నేతల పాత్ర కూడా ఈ సరికొత్త సమీకరణాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు తరహా రాజకీయ ఫార్ములా—అనగా కేవలం చలనచిత్ర చరిష్మాతో నేరుగా అధికారం సాధించడం—ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఆర్థిక బలంతో సంబంధం లేకుండా కేవలం ప్రజాదరణ, బలమైన భావజాలం మరియు సరైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తే విజయం సాధ్యమని ఇటీవలి రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.  తారక్ రాజకీయాల్లోకి వస్తే అది తెలుగుదేశం పార్టీ (TDP) లోని అంతర్గత సమతుల్యతను దెబ్బతీస్తుందనే భయంతో, కొందరు దీనిని వ్యతిరేకిస్తూ మరియు ఇది తారక్ స్వయంకృతం కాదనే ప్రచారాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంభవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, అది కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైఎస్సార్సీపీ మరియు టీడీపీల ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా తారక్ సరికొత్త మూడవ శక్తిగా లేదా టీడీపీకి అసలైన వారసుడిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.  ఆయనకు ఉన్న అశేష యువత, అభిమాన గణం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల సమీకరణను మలుపు తిప్పగలవు. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, తెలుగునాట సాంప్రదాయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా పక్కకుపోయి, సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ రాజకీయ భూకంపం ఏ తీరానికి చేరుతుందనేది తారక్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
ALSO ON TELUGUONE N E W S
సెలబ్రిటీలంటే కేవలం వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో వారు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై కూడా అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు వారు చేసే చిన్నపాటి సున్నితమైన పనులు సమాజంలో చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గ్లామర్‌కు మాత్రమే కాకుండా, అపారమైన మానవత్వానికి కూడా తను కేరాఫ్ అడ్రస్ అని శ్రియ మరోసారి నిరూపించుకున్నారు. ఒక చిన్నారి పట్ల ఆమె చూపించిన అమితమైన ఆప్యాయత ఇప్పుడు ఇంటర్నెట్‌లో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటోంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో శ్రియ శరణ్ కెమెరాల ముందుకు వచ్చి ఫోటోలకు ఎంతో ఉత్సాహంగా పోజులిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో, చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకున్న ఒక చిన్నారి ఆమెను చూసి చాలా ఆనందంగా, ఉద్వేగంతో ఆమె వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే, ఆ హడావుడిలో పాప బ్యాలెన్స్ తప్పి, చేతిలో ఉన్న ఐస్‌క్రీమ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్ నేలపాలు కావడంతో ఆ చిన్నారి తీవ్ర నిరాశకు గురై అక్కడికక్కడే బావురుమంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఉన్న వారంతా ఏం జరుగుతుందో అని చూస్తుండగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రియ వెంటనే స్పందించారు. తన స్టార్ హోదాని, చుట్టూ ఉన్న కెమెరాలను పక్కనబెట్టి, శ్రియ వెంటనే ఆ చిన్నారి వద్దకు వెళ్లారు. ఎంతో ఆప్యాయంగా ఆ పాపను తన చేతుల్లోకి ఎత్తుకుని ఓదార్చడం మొదలుపెట్టారు. తనను హత్తుకుని, ఎంతో ప్రేమగా బుజ్జగిస్తూ, ముచ్చటైన మాటలతో ఆ చిన్నారిని నవ్వించడానికి శ్రియ ప్రయత్నించారు. శ్రియ చూపించిన ఆత్మీయతతో ఆ పాప ఏడుపు ఒక్క నిమిషంలోనే ఆగిపోయింది. ఆ చిన్నారి పెదవులపై మళ్లీ అందమైన చిరునవ్వు పూసింది. ఈ అరుదైన, హృదయాన్ని హత్తుకునే క్షణాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండింగ్‌గా మారింది. నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీల చిన్న చిన్న కదలికలు కూడా నెగెటివ్ కోణంలో చర్చకు వస్తుంటాయి. కానీ ఎలాంటి హంగు, హార్బాటాలు లేకుండా శ్రియ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రియల్ స్టార్ అంటే ఇలాగే ఉండాలి" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, "చిన్న పిల్లల మనసును గెలుచుకోవడం అందరికీ సాధ్యం కాదు, శ్రియ మనసు చాలా గొప్పది" అని మరికొందరు కొనియాడారు. కేవలం లైక్‌ల కోసం స్టంట్లు చేసే కాలంలో, మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న సాయం లేదా ప్రేమపూర్వక ప్రవర్తన ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుందని శ్రియ శరణ్ ఈ సంఘటన ద్వారా చాటి చెప్పారు. ఈ మధుర క్షణం అభిమానుల గుండెల్లో శ్రియపై ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు చేసింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన బ్లాక్‌బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కొన్ని ప్రతిష్టాత్మక సినిమాలు అట్టహాసంగా ప్రారంభమై కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. సత్యాగ్రాహి, కోబలి వంటి చిత్రాల జాబితాలో అభిమానులను ఇప్పటికీ తీవ్రంగా నిరాశపరిచే మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ప్రిన్స్ ఆఫ్ పీస్' (Prince of Peace). లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, జీసస్ క్రైస్ట్  బయోపిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలని ఒక అద్భుతమైన భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. యేసుక్రీస్తు పవిత్ర జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి ఆయన అందించిన ప్రేమ, శాంతి సందేశాలను నేటి తరానికి చాటిచెప్పాలనే బలమైన ఆశయంతో ఈ కథ రూపుదిద్దుకుంది. ఈ మహా ప్రాజెక్ట్ కోసం ప్రముఖ రచయిత జె.కె. భారవి అద్భుతమైన స్క్రిప్ట్ వర్క్‌ను సిద్ధం చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ కథలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఒక పవర్‌ఫుల్ రోల్‌ను డిజైన్ చేశారు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ పోషించాల్సింది జీసస్ పాత్ర కాదని, కానీ కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన, శక్తివంతమైన పాత్ర అని స్వయంగా దర్శకుడే వెల్లడించారు. ఈ భారీ చిత్రంలో కథానాయికగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఎంపిక చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ చిత్రాన్ని 2010లో అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. 'ప్రిన్స్ ఆఫ్ పీస్' చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దే క్రమంలో పవన్ కల్యాణ్, సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఏకంగా ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి అంతర్జాతీయ చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. యేసుక్రీస్తు నడయాడిన ఆయా పవిత్ర ప్రాంతాలలో లొకేషన్ల వేటను ముమ్మరంగా నిర్వహించారు. విజువల్ వండర్‌గా, అత్యంత సహజంగా ఈ సినిమాను తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయి, ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై సెట్స్ పైకి వెళ్తుందనగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా అర్ధాంతంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిపోయిన బడ్జెట్. అంతర్జాతీయ లొకేషన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, అగ్ర నటీనటుల రెమ్యునరేషన్ల కారణంగా మొదట అనుకున్న బడ్జెట్ అంచనాలు పూర్తిగా దాటిపోయి నిర్మాణ వ్యయం ఊహించని స్థాయికి పెరిగింది. అంతటి భారీ బడ్జెట్‌ను భరించడం అప్పట్లో అంత సులభం కాకపోవడంతో దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి తోడు స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు రెండేళ్లకు పైగా సుదీర్ఘ సమయం పట్టడంతో పవన్ కల్యాణ్ కూడా తన తదుపరి కమిట్‌మెంట్స్, ఇతర సినిమాలతో బిజీగా మారిపోయారు. అలా ఒక అంతర్జాతీయ స్థాయి విజువల్ వండర్ కావాల్సిన పవన్, సింగీతంల కలల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే నిలిచిపోయింది.     Pawan Kalyan, Singeetham Srinivasa Rao, Anushka Shetty 
తెలుగు సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ గీత రచయితగా తనదైన ముద్ర వేసుకున్న చంద్రబోస్ తన కెరీర్‌లో వేల పాటలతో శ్రోతలను అలరించారు. సందర్భం ఏదైనా సరే, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. భాషాభిమానంతో పాటు జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను ఆభరణాలుగా మార్చుకుని ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌లో వేలాది హృదయాలను కదిలించేలా పాటలు రాసిన ఈ గొప్ప లిరిసిస్ట్‌ను కూడా కంటతడి పెట్టించిన ఒక ప్రత్యేకమైన పాట ఉంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'రంగస్థలం' లోని 'ఓరయ్యో నా అయ్యో' అనే అత్యంత భావోద్వేగభరితమైన గీతం. ఈ పాట కేవలం ఒక రచన మాత్రమే కాదని, అది తన హృదయంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చంద్రబోస్ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి వివరించారు. ఈ పాట‌ను స్వ‌యంగా చంద్ర‌బోస్ ఆల‌పించ‌డం మ‌రో విశేషంగా చెప్పుకోవ‌చ్చు.  ఈ అద్భుతమైన 'ఓరయ్యో' పాట ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఈ పాట రచన దుబాయ్‌లో జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు సుకుమార్‌ల సమక్షంలో చంద్రబోస్‌కు ఈ పాటను రాసే అవకాశం లభించింది. చిత్ర దర్శకుడు సుకుమార్ ఆ సన్నివేశానికి సంబంధించిన ఎమోషన్‌ను వివరించిన వెంటనే, చంద్రబోస్ మనసు చలించిపోయింది. ఆ క్షణంలో తన మనసులో మెదిలిన తీవ్రమైన దుఃఖాన్ని, భావాలను కాగితంపై నిక్షిప్తం చేసి దేవి శ్రీ ప్రసాద్‌కు అందజేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఆ పదాలకు ప్రాణం పోస్తూ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ స్వయంగా ఆ పాటను పాడి వినిపించారు. ఆ సమయంలో పాటను పాడుతుండగానే తన మనసులో ఏదో తెలియని ఒక పెద్ద బాధ, గుండెను పిండేసే దుఃఖం కలిగాయని, కళ్ల నుంచి తెలియకుండానే కన్నీళ్లు ఉబికి వచ్చాయని ఆయన ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన ఇంట్లో వంటగదిలో వంట చేసుకుంటున్న తన భార్యకు ఈ పాటను వినిపించారు. ఆ పాట వింటూనే ఆమె కంటతడి పెట్టుకోవడం చూసి, ఈ పాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని చంద్రబోస్‌కు బలమైన నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య కూడా ఈ పాట విని తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం విశేషం. చంద్రబోస్ తన 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రంగస్థలం చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చంద్రబోస్ రాసిన పాటల సాహిత్యాన్ని అద్భుతంగా ప్రశంసిస్తూ, “మీ పెన్నుకు వెన్నువంచి నమస్కారం చేస్తున్నాను” అని చెప్పిన మాటలు తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. ఈ ప్రయాణంలో తానేమీ పూలబాటపై నడవలేదని, కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, అలాగే చీత్కారాలే సత్కారాలుగా మార్చుకుని ఎంతో సహనంతో ముందుకు సాగానని యువతకు స్ఫూర్తినిచ్చారు. తెలుగు భాషపై అచంచలమైన ప్రేమ కలిగిన చంద్రబోస్, ఆంగ్ల భాషలో కేవలం రెండున్నర లక్షల పదాలు మాత్రమే ఉండగా, మన తెలుగు భాషలో ఏకంగా ఆరున్నర లక్షల పదాల అపార సంపద ఉందని ఒక అద్భుతమైన గణాంకాన్ని పంచుకున్నారు. భాష బలహీనమైతే సమాజంలో బంధాలు కూడా బలహీనమవుతాయని, తల్లి భాషను కాదంటే కన్నతల్లిని కాదన్నట్టేనని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా రెండు పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఒకరికొకరు ఇచ్చుకునే మద్దతు, సహకారం వంటివి బాలీవుడ్‌లో ఎంతమాత్రం కనిపించవని ఆమె తన మనసులోని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం ముంబైలో లోపించిందనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ తనను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసుకుందని రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్‌లో తోటి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఒకరినొకరు ఎంతగానో ప్రోత్సహించుకుంటారని ఆమె కొనియాడారు. ఒకరి సినిమా ట్రైలర్ విడుదలైనా, పాటలు విడుదలైనా మరొకరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తారని రకుల్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్లకు అందరూ కలిసికట్టుగా వెళ్తారని, సినిమాలు మంచి విజయాలు సాధించినప్పుడు సక్సెస్ పార్టీలను కూడా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని ఆమె వివరించారు. టాలీవుడ్‌లో తాము ఇతరుల చిత్రాల ప్రత్యేక స్క్రీనింగులు, ప్రీమియర్ షోలకు ఎంతో ఆనందంగా వెళ్తామని, అక్కడ సినిమాలు చూసి ఒకరికొకరు తోడుగా నిలబడతామని ఆమె చెప్పారు. అయితే బాలీవుడ్‌లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్రమైన పోటీతత్వం, అభద్రతాభావం (ఇన్‌సెక్యూరిటీ) చాలా ఎక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతరుల సినిమాలను సపోర్ట్ చేయడానికి అక్కడి వారు పెద్దగా ఇష్టపడరని రకుల్ సంచలన నిజాన్ని బయటపెట్టారు. తాను హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లి అక్కడ స్థిరపడిన తర్వాతే ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించానని ఆమె అన్నారు. బాలీవుడ్‌లో కూడా టాలీవుడ్ లాంటి ఆరోగ్యకరమైన, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటే ఇండస్ట్రీకి ఎంతో బాగుంటుందని రకుల్ ఆకాంక్షించారు. కానీ, బాలీవుడ్ జనాల్లో ఉన్న విపరీతమైన అభద్రతాభావం వల్ల అక్కడ అలాంటి సపోర్టివ్ వాతావరణం సాధ్యం కావడం లేదని రకుల్ విశ్లేషించారు. చిత్ర పరిశ్రమ ఏదైనా సరే, ఈ విధమైన పరిస్థితిని మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందని ఆమె గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే చిత్ర పరిశ్రమలు మరింత బలంగా, ఆరోగ్యకరంగా మారుతాయని తాను బలంగా నమ్ముతానని రకుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     Rakul Preet Singh, Interview, Tollywood, Bollywood  
టాలీవుడ్ ప్రేక్షకులకు నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పట్లో నమిత గ్లామర్‌కు, ఆమెకున్న భారీ ఫాలోయింగ్‌కు ఇండస్ట్రీ సైతం ఫిదా అయిపోయింది. బొద్దు బొద్దుగా ఉంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ క్వీన్, 2017 లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరమయ్యారు. ఆపై 2022 లో 41 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన నమితను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆమె మునుపటి రూపానికి, ఇప్పటి రూపానికి అస్సలు సంబంధమే లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల నమిత ఒక జిమ్‌లో వర్కౌట్ చేస్తూ రికార్డ్ చేసిన మిర్రర్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో నమిత మునుపటి కంటే చాలా నాజుగ్గా, స్లిమ్‌గా కనిపిస్తున్నారు. గ్రే కలర్ క్రాప్ టాప్, డార్క్ గ్రే టైట్స్ ధరించి అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను స్టన్ చేస్తున్నాయి. పెళ్లయి, ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా నమిత ఇంత కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన బాడీని పూర్తిగా మార్చేసుకోవడం నిజంగా అభినందనీయమంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే "ఈమె మన పాత నమితనేనా? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం" అంటూ పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా గర్భధారణ తర్వాత మహిళల్లో బరువు పెరగడం సహజం. అయితే నమిత తన ప్రసవానంతరం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడి కఠినమైన డైట్, క్రమం తప్పకుండా జిమ్ సెషన్లు చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. నమిత వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంతటి డెడికేషన్ చూపించి భారీగా బరువు తగ్గడం సామాన్యమైన విషయం కాదు. ఈ కొత్త అవతారంలో ఆమె మళ్లీ వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో నడుస్తోంది. ఏది ఏమైనా, నమిత లేటెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. https://www.instagram.com/reel/Da0FN_qp43M/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==  
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం 'పళ్ళబురుసు'. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, మట్టి మనుషుల జీవన విధానం నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. ఉదయ్ చౌహాన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విడుదలైన 34 సెకన్ల టైటిల్ గ్లింప్స్ లో పల్లెటూరి ఉదయపు అందాలు, పచ్చని పొలాలు, కాలువ ప్రవాహం వంటి విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్ లో వినిపించే సంభాషణలు సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచుతున్నాయి. ఒక వృద్ధుడు(సుధాకర్ రెడ్డి) పొలంలో నిలబడి "ఆ.. ఏందిరా పళ్ళబురుసా.. తేలేదు ఆ కొడుకు" అని అరవడం, అలాగే బైక్ పై వెళ్తున్న యువకులు "పల్లబురుసు ఇంకా తేలేదా" అని మాట్లాడుకోవడం చూస్తుంటే ఈ 'పళ్ళబురుసు' అనే పదం చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందని అర్థమవుతోంది. గ్లింప్స్ చివర్లో సుధాకర్ రెడ్డి వేప పుల్లతో పళ్ళు తోముతూ.. "వీడు పళ్ళబురుసు లేడు, నాకు నొప్పి తక్కువ కాదు." అంటాడు. ఇక మురళీధర్ గౌడ్ బైక్ స్టార్ట్ చేస్తూ "నా బిడ్డ పెళ్లి.. మా అయ్య లొల్లి.. ఏందో ఈ పళ్ళబురుసు" అంటూ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ తో గ్లింప్స్ ను ముగించారు.  ఈ చిత్రానికి పవన్ సీహెచ్ సంగీతం అందిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉంది. ఈ సినిమాను 2026 ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.     Annapurna Studios, Pallaburusu, Title Glimpse, TeluguOne  
  టాలీవుడ్‌లో విభిన్నమైన క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు తిరువీర్ ఈ రోజు  టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తో కలిసి ‘ఓ సుకుమారి’(O sukumari)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. భరత్ దర్శన్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ కామెడీ డ్రామా మూవీపై టాలీవుడ్‌లో మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందనే ఒక వింత వినూత్నమైన ఆలోచన ప్రధాన కాన్సెప్ట్‌. ఈ రోజు థియేటర్ల వద్ద పబ్లిక్ టాక్ ,రివ్యూస్ చూస్తే మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చాలా మంది ప్రేక్షకులు బాగోలేదని సోషల్ మీడియా వేదికగా కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కథనంలో లోపాలు. ఒక క్రేజీ ఐడియాతో కథని మొదలుపెట్టినప్పటికీ, దర్శకుడు దానిని పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాడనేది సగటు సినిమా అభిమాని మాట. ఫస్ట్ హాఫ్ ఒక మాదిరిగా ఉన్నా    సెకండాఫ్‌లో కథనం చాలా నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకి కాస్త బోర్ కొట్టించింది. ప్రతి పాత్రకు ఒక ముగింపు ఇవ్వాలనే తాపత్రయంలో క్లైమాక్స్ వైపు వెళ్లేసరికి సినిమా చాలా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. రేటింగ్స్ పరంగా చూసుకున్నా చాలా వెబ్‌సైట్లు  5 కి 2 , 1 .5  రేటింగ్స్ ఇస్తున్నాయి. Also read: అల్లు అర్జున్‌కి అవమానం.. చిరంజీవి ఏం చేసాడంటే? తిరువీర్,  ఐశ్వర్య రాజేష్ తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.  కానీ కథ ప్రకారం కథనాన్ని, క్యారక్టరయిజేషన్స్ ని రాసుకోవడంలో దర్శకుడు భరత్ దర్శన్ విఫలమయ్యాడని మెజారిటీ ప్రేక్షకులు చెప్తున్నారు.  Thiruveer,  o sukumari, Aishwarya Rajesh, tollywood
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటనపై తనకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. తన రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్న ఈ బాలీవుడ్ బ్యూటీ, ప్రస్తుతం 7 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటికీ, ఆమె తన వృత్తిపరమైన బాధ్యతలను ఏమాత్రం విస్మరించకుండా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రాకా' చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తన ప్రసూతి సెలవులకు (మెటర్నిటీ లీవ్) వెళ్లడానికి ముందే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని దీపికా పట్టుదలతో ఉన్నారు. సినిమా వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, 'రాకా' సినిమా షెడ్యూల్‌ను వేగంగా ముగించడం కోసం దీపికా పదుకొణె ఏకంగా నైట్ షిఫ్ట్‌లలో కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, ఏడు నెలల గర్భవతిగా ఉండి కూడా శారీరకంగా ఎంతో శ్రమతో కూడిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆమె నటిస్తుండటం సెట్స్‌లోని చిత్ర యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంట్లో అప్పటికే ఉన్న చిన్న పాపను చూసుకుంటూ, మరోవైపు తన రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో కూడా ఆమె ఏకకాలంలో రెండు భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తున్నారు. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'రాకా' చిత్రంతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' సినిమాలోనూ దీపికా కీలక పాత్ర పోషిస్తున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో దీపికా పదుకొణె ఇలాంటి కఠినమైన యాక్షన్ సీన్లు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో తన మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా గ్లోబల్ హిట్ చిత్రం 'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాప్ డ్రామా 'సింగం అగైన్' చిత్రంలో అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో ఆమె పాల్గొని మెప్పించారు. దీపికా మాత్రమే కాకుండా, చిత్రసీమలో నేటి తరం కథానాయకులు వివాహం, మాతృత్వం తర్వాత హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటుందనే పాత ఆలోచనలను బద్దలు కొడుతున్నారు. గతంలో నటి కియారా అద్వానీ తన కుమార్తె సరాయా గర్భంలో ఉన్నప్పుడు 'టాక్సిక్' సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. అలాగే స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం తన మొదటి కుమార్తె రాహా గర్భంలో ఉన్న సమయంలోనే హాలీవుడ్ డెబ్యూ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్' కోసం అత్యంత రిస్కీ యాక్షన్ సన్నివేశాలలో నటించి సరికొత్త సరిహద్దులను చెరిపేశారు.     Deepika Padukone, Raaka Movie, Allu Arjun, Atlee  
  రంగస్థలంతో తెలుగు సినిమాకి సరికొత్త సొగసుని అద్దారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్. దీంతో ఆ ఇద్దరు కలిసి చేస్తున్న RC17 (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.  తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే కథగా ప్రచారం జరుగుతుండగా అక్టోబర్ లో లాంచింగ్ ఉంటుందనే టాక్ వినపడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బలంగా, రా అండ్ రస్టిక్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే  తెలంగాణ బ్యాక్‌డ్రాప్ రూటెడ్ స్టోరీకి భాగ్యశ్రీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి సుకుమార్ భావిస్తున్నట్టుగా ఏ క్యారక్టర్ లో అయినా ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇవ్వగలదని భాగ్యశ్రీ నిరూపిస్తూ ఉంది. ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కి విజయదుందుభి మోగిస్తున్న లెనిన్. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి భాగ్యశ్రీ బోర్సే కనుక  చరణ్ మూవీలో  ఫైనలైజ్ అయితే, ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లడం ఖాయం.  Also read: జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే!  ఈ వార్త విన్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో #RC17 కాస్టింగ్ పై జోరుగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. భాగ్యశ్రీ గ్లామర్, చరణ్ మాస్ ఇమేజ్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వెర్షన్స్ ని లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులని  90% పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ram charan, Bhagyashri Borse, sukumar, mythri movie makers
ప్రపంచవ్యాప్తంగా సినిమా పిచ్చి ఉన్న అభిమానులను మనం ఎంతో మందిని చూసి ఉంటాం. తమకు ఇష్టమైన హీరోల సినిమాలు వస్తే థియేటర్ల ముందు కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం లాంటివి చూశాం. కానీ ఒక హాలీవుడ్ దర్శకుడి సినిమా కోసం ఏకంగా తన ప్రెగ్నెన్సీనే వాయిదా వేసుకున్న ఒక మహిళ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సినిమా చరిత్రలోనే ఇది ఒక నమ్మశక్యం కాని సరికొత్త క్రేజ్‌గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో, ఎందుకు అలా చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతి సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉంటుంది. తాజాగా నోలన్ దర్శకత్వంలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ'. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. ఆ సినీ పిచ్చి ప్రపంచంలో భాగమైన కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల టెక్ ఎడిటర్ ఆంబర్ కనాగన్ అనే మహిళ నోలన్‌కు వీరాభిమాని. ఆమెకు ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నాడు. తన భర్తతో కలిసి రెండో సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్న సమయంలో, క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' విడుదల తేదీ ఖరారైంది. దాంతో ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను ఎలాగైనా సరే విడుదలైన మొదటి రోజే, అదీ 70 ఎంఎం భారీ ఐమాక్స్ (IMAX 70mm) స్క్రీన్‌పైనే చూడాలని ఆంబర్ బలంగా నిశ్చయించుకుంది. అయితే ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఐమాక్స్ థియేటర్ లేదు. ఆ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆమె ఏకంగా 3 గంటల పాటు సుదీర్ఘంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయితే, ఆ సమయంలో అంత దూరం ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళ్లడం ఏమాత్రం సాధ్యం కాదు. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే అలసట, ప్రయాణ ఇబ్బందుల వల్ల తన డ్రీమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతుందని ఆమె భయపడింది. అందుకే, నోలన్ సినిమాను థియేటర్లో చూసేంత వరకు తన ప్రెగ్నెన్సీని కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవాలని భర్తను ఒప్పించింది. ఒక వైపు భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది ఒడిస్సీ' సినిమాకు థియేటర్ల దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్, రివ్యూలు వస్తున్నాయి. ఇండియాలో కూడా మన టాప్ స్టార్ల సినిమాల రేంజ్‌లో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంబర్ కనాగన్ చేసిన ఈ సాహసోపేతమైన ప్రకటన మీడియాలో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "సినిమాపై అభిమానంలో ఇది నెక్స్ట్ లెవెల్ పిచ్చి" అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఒక అద్భుతమైన సినిమా అనుభూతి కోసం జీవితంలో ఎంతో ముఖ్యమైన మాతృత్వాన్ని కూడా కొన్ని రోజులు పక్కన పెట్టిన ఆంబర్ క్రేజ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం.   గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది.   కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల  గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.  ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి,  గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు.  ఈ మొక్కలు  గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా  పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి.  చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక  మొక్క పీస్ లిల్లీ..  ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి.  కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే  డిటర్జెంట్లు, పెయింట్లు,  గమ్ లలో  ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి  గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని,  ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో  పెంచుకుంటే ఇంటి వాతావరణం,  ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది.                                   *రూపశ్రీ.  
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)