LATEST NEWS
ఏపీ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్  చేస్తున్న ఆరోపణలపై జై భీమ్ భారత్ పార్టీ అధినేత,  న్యాయవాది జడ శ్రావణ్ కుమార్  మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా ప్రభుత్వంపై బురద చల్లడం వైసీపీకే నష్టమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడానికి ముందు కనీస రుజువులు చూపించాలని సవాల్ విసిరారు. కేంద్రంలో జరిగిన నీట్   పరీక్షా పత్రాల లీకేజీకి, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ నియామకాలకు చాలా వ్యత్యాసం ఉందన్న జడ శ్రవణ్ కుమార్, నీట్ విషయంలో పేపర్ లీకైనట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్వయంగా అంగీకరించిందనీ,   ఏపీ డీఎస్సీ విషయంలో కేవలం అనుమానాలు తప్ప ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొన్నారు.  హైకోర్టులో వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్‌ను కూడా ఆధారాలు లేకపోవడంతో కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు.  డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు.  వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క సరైన డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయారనిఎద్దేవా చేసిన ఆయన.. . ఆ నాడు ఇచ్చిందల్లా 6 వేల ఒక వంద  పోస్టుల నోటిఫికేషన్ మాత్రమేననీ, అందులో కూడా 2వేల గిరిజన ప్రాంత పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా కలిపారని విమర్శించారు. దానికి నిరసనగా తాము హైకోర్టుకు వెళ్లి ఆ నిర్ణయాన్ని సవాలు చేసి, ఆ పోస్టులను మినహాయించేలా ఉత్తర్వులు తెచ్చామని గుర్తుచేశారు. అదే సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన 16 వేల పోస్టుల డీఎస్సీలోనూ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన 2వేల 800 పోస్టులను కలపడంపై తాము న్యాయపోరాటం చేస్తున్నామన్న జడ శ్రవణ్ కుమార్..  ఏ ప్రభుత్వం తప్పు చేసినా ప్రశ్నించడం తమ నైజమని, అయితే ఏ విమర్శ చేసినా ప్రాథమిక ఆధారాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు వైఎస్సార్‌సీపీకి ఉందని, అయితే ఆధారాలు లేకుండా మంత్రి రాజీనామా కోరడం కేవలం పొలిటికల్ స్టంట్ మాత్రమే అవుతుందని శ్రావణ్ కుమార్ ముగించారు. భవిష్యత్తులో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోకుండా ఉండాలంటే, గాలిలో ఆరోపణలు చేయడం మానుకొని ఆధారాలతో మాట్లాడాలని వైఎస్ జగన్‌కు హితవు పలికారు. YS Jagan Mohan Reddy, Nara Lokesh DSC, AP DSC Recruitment, TeluguOne,  AP Politics
వైసీపీ ఫేక్ ప్రచారానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై  విష ప్రమారం చేస్తూ ప్రజలను తప్పదొవ పట్టించేలా అసత్య ప్రచారాలకు పాల్పడుతోందని మండిపడిన లోకేష్.. తాజాగా పెనమలూరులో  తల్లికి వందనం పథకాన్ని స్వాగతిస్తూ అంగన్ వాడీలు చేపట్టిన కృతజ్ణతా ర్యాలీని వైపీపీ ఎలా వక్రీకరించిందో.. వివరించారు.  వివరాల్లోకి వెడితే.. ఇటీవల రాష్ట్ర   మంత్రి నారా లోకేష్ పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంలో భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్ననను   వైసీపీ అనుకూల సోషల్ మీడియా,  మంత్రి లోకేష్ పర్యటనను నిరసిస్తూ అంగన్వాడీలు ఆందోళనకు దిగారంటూ వక్రీకరించాయి.   దీనిపై  మంత్రి నారా లోకేష్  ఘాటుగా స్పందించారు. అసలు నిజాలను వెల్లడిస్తూ, వైకాపా ప్రచారంలోని డొల్ల తనాన్ని సాక్ష్యాధారా పెనమలూరులో అంగన్వాడీలు నిర్వహించినది నిరసన ర్యాలీ కాదనీ, అది కృతజ్ణతా ప్రదర్శన అని లోకేష్ స్పష్టం చేశారు.   వైకాపా హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందనీ, కనీసం  అమ్మఒడి పథకాన్ని కూడా వారికి వర్తింపజేయకుండా తీవ్ర అన్యాయం చేసిందనీ  గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి   తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ  నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు  సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు. వాస్తవానికి అక్కడ జరిగింది కృతజ్ఞత సభ అని, కానీ దానిని నిరసనగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు.  బాబాయ్ పై  గొడ్డలిపోటును  గుండెపోటుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. అదే తీరులో ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చిన జనసందోహాన్ని, కృతజ్ఞతా ప్రదర్శనలను కూడా నిరసనలుగా మార్చి చూపించేందుకు  పాల్పడుతున్నదని విమర్శించారు.   నెట్టింట వైరల్ అవుతున్న ఫేక్ చిత్రాలను, అసలైన దృశ్యాలను పక్కపక్కనే ఉంచి ఆధారాలతో సహా వాస్తవాన్ని కళ్లకు కట్టారు.  రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైకాపా శ్రేణులు కల్పిత వార్తలు, వక్రీకరించిన వీడియోలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నలోకేష్  ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే ఇటువంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు.    YSRCP Fake News, Penamaluru Anganwadi Rally, Thalliki Vandanam Scheme, AP Political News
వైసీపీ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా  అంబోలు జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించాలని నిర్ణయించడం  రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో  కలకలం రేపుతోంది. ఇటీవల రోడ్డు ప్రమాదం కేసులో చట్టపరమైన విచారణ ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న అప్పలరాజుతో ములాఖత్‌కు పార్టీ అధ్యక్షుడు స్వయంగా వెళ్లడంపై వైసీపీ సీనియర్లు పెదవి విరుస్తున్నారు. ఇక పార్టీ శ్రేణుల్లో అయితే జగన్ నిర్ణయం పట్ల బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.   శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో  మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడుపుతున్న ద్విచక్రవాహనం  ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, అసలు నిందితుడైన తన కుమారుడిని కాపాడేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు. , మరొక యువకుడిని ఈ కేసుఇరికించి దర్యాప్తును పక్కదోవ పట్టించేలా కుట్రపన్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు. సిదిరి అప్పలరాజు ప్రస్తుతం   అంబోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  .  ఈ కేసు పూర్తిగా ఒక వ్యక్తిగత కుటుంబ వ్యవహారమని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదనీ వైసీపీ సీనియర్ నేతలు చెబుతూ.. ఈ కేసులో  అప్పలరాజుకు మద్దతుగా పార్టీ అధినేత స్వయంగా జైలుకు  వెళ్లి పరామర్శించడం సరికాదని అంటున్నారు.   పార్టీలో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు వివిధ వ్యవహారాల్లో కేసులు ఎదుర్కొని  రిమాండ్ ఖైదీలుగా ఉన్న సందర్భాలను గుర్తు చేస్తూ.. ఆయా సందర్భాలలో జైలుకు వెళ్లి ఆయా నేతలను పరామర్శించని జగన్.. ఒక ప్రైవేటు కేసులో అరెస్టైన మాజీ మంత్రిని పరామర్శించడానికి బయలుదేరడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  మద్యం కుంభకోణం కేసులో పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి, కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  పలువురు ముఖ్య నాయకులు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలుతో పాటు ఇతర జైళ్లలో రోజులకు రోజులు గడిపిన సమయంలో అధినేత పరామర్శకు వెళ్లలేదన్న అంశాన్ని గుర్తుచేస్తున్నారు. పార్టీ కోసం, అధినాయకత్వం నిర్ణయాల కోసం నిలబడి జైలు పాలైన సీనియర్లను   పరామర్శించని జగన్, వ్యక్తిగత నిర్లక్ష్యం,  చట్ట ఉల్లంఘన నేరాలతో అరెస్టైన సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లడం.. తప్పుడు సంకేతాలను ఇస్తుందని అంటున్నారు.  ముఖ్యంగా యాక్సిడెంట్ చేసి.. సామాన్యుడి ప్రాణం తీసిన ఘటనలో  విచారణను తప్పుదోవ పట్టించారనే తీవ్రమైన ఆరోపణలు  ఎదుర్కొంటున్న నేతకు ప్రత్యక్ష మద్దతు తెలపడం వల్ల పార్టీ ప్రతిష్ఠ మసకబాదుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.     జగన్ ఈ ధోరణి..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   Seediri Appalaraju Arrest,  Srikakulam Ampolu Jail, YCP Internal Politics, TeluguOne 
నీట్ పేపర్ లీకేజీల నిరసనల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ఇప్పుడు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ను ఇరుకున పెట్టింది. నీట్ లీకేజీకి నిరసనగా.. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హస్తిన వేదికగా జరిగిన ఆందోళనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ,   ప్రధాన్ మస్ట్ గో’ అంటూ ప్రచారం చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆపార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాలు జంతర్ మంతర్ కు వెళ్లి మరీ కాక్రోచ్ ఆందోళనలకు సంఘీ భావం ప్రకటించారు.   ఆ సందర్భంగా  ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా   పంజాబ్‌లో  అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంలో ఇప్పటి వరకూఅంటే గత నాలుగున్నర ఏళ్లుగా  ఒక్క పేపర్ లీక్  అవ్వలేదని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా, ఒక వేళ అలా లీక్ అయి ఉంటే పంజాబ్ విద్ాయమత్రి చేత రాజీనామా చేయించి ఉండేవారమని సవాల్ చేశారు.   ఆ సవాలే ఇప్పుడు ఆప్ విద్యామంత్రి పదవికి ఎసరు తెచ్చింది.  మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన   కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్  పార్టీలు  పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో  కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు,  లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.  ఇటీవల ఫరీద్‌కోట్‌లో జరిగిన 454 ఫార్మసిస్ట్ పోస్టుల నియామక పరీక్షలో చోటుచేసుకున్న హైటెక్ కాపీయింగ్ వ్యవహారం పంజాబ్‌లో పెద్ద కలకలం రేపిన సంగతి విదితమే. అభ్యర్థులు పెన్ కెమెరాల ద్వారా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపి, వైర్‌లెస్ పరికరాల ద్వారా సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 3.5 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు లంచాలు వసూలు చేసినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది. అలాగే ఫిబ్రవరి 2023లో..  పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ 12వ తరగతి ఇంగ్లీష్ బోర్డు పరీక్ష ప్రారంభానికి   ముందు  లీక్ కావడంతో ఆ పరీక్షను అత్యవసరంగా రద్దు చేశారు. ఇవే కాకుండా,  నైబ్ తహసీల్దార్ రిక్రూట్‌మెంట్, పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష , అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పిఎస్‌ఎస్‌ఎస్‌బి గ్రూప్-బి పరీక్షలలో కూడా   కుంభకోణాలు బయటపడ్డాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, నీతికి కట్టుబడి పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ కూడా  తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్, అకాలీదళ్ నాయకురాలు హ డిమాండ్ చేస్తున్నారు.  దీంతో ప్రధాన్ మస్ట్ గో’ ఉద్యమం కాస్తా పంజాబ్‌లో  బేన్స్ రాజీనామా’ డిమాండ్ కు  దారి తీసింది. చూడాలి మరి ఇప్పుడు ఆప్ ఏ విధంగా స్పందిస్తుందో?   Harjot Singh Bains, Manish Sisodia Challenge, Punjab Paper Leak Scam, Dharmendra Pradhan Resignation, Punjab Elections
  ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ  నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, వైసీపీ నేత జోగి రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జోగి రమేష్ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, ఆయన ఎన్నికల చరిత్ర, నియోజకవర్గాల మార్పులు  గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై వసంత కృష్ణప్రసాద్  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  వర్తమాన రాజకీయ పరిస్థితికృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం, పెనమలూరు, పెడన నియోజకవర్గాలు అత్యంత కీలకమైన ప్రాంతాలు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్, 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నుంచి 43,000 పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగీ రమేష్ 2024 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 60,000 పైగా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంతో పాటు, మైలవరంలో రాబోయే రోజుల్లో 80,000 మెజారిటీతో ఓడిస్తానంటూ జోగీ రమేష్ చేసిన సవాళ్లను వసంత కృష్ణప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. వరుసగా నియోజకవర్గాలు మారుస్తూ స్థిరత్వం లేని నేతగా జోగీ రమేష్ మిగిలిపోయారని, ఎన్నికల్లో తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొన్న వ్యక్తికి తనపై మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహాలు  పరిణామాలు మైలవరం నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే, సాధారణంగా మెజారిటీలు చాలా తక్కువగా ఉంటాయి. 1972 నాటి రికార్డులను తిరగరాస్తూ 2024లో సాధించిన 43,000 ఓట్ల మెజారిటీ తన ప్రజాదరణకు నిదర్శనమని వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెండు విభిన్న పార్టీల తరఫున ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం తన రాజకీయ బలానికి నిదర్శనమని స్పష్టం చేశారు.అలాగే జోతి రమేష్ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ — 2009లో పెడన, 2014లో మైలవరం, 2019లో తిరిగి పెడన, 2024లో పెనమలూరు నుంచి పోటీ చేయడం ఆయనకున్న ఓటు బ్యాంకు లేమిని ఎత్తిచూపుతోందని విమర్శించారు.  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెడన నియోజకవర్గంలో ఇసుక మైనింగ్, చేపల చెరువులు, రెవెన్యూ పాస్ పుస్తకాల మంజూరు వంటి వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్ రాజకీయ ప్రభావంకృష్ణా జిల్లా రాజకీయాల్లో వసంత కృష్ణప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సమస్యలపై స్పందిస్తూనే, ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పికొట్టడంలో కృష్ణప్రసాద్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.  ఓటమి భారం నుంచి తేరుకోకముందే నేతల మధ్య పరస్పర ఆరోపణలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. స్థానిక నాయకత్వ పోరు: రాబోయే రోజుల్లో మైలవరం, పెనమలూరు పరిధిలో వైఎస్సార్‌సీపీ పునర్నిర్మాణం అంత సులువు కాదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వేడిని మరింత పెంచాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.     Vasantha Krishnaprasad, Jogi Ramesh, Mylavaram MLA, TDP, YSRCP, Krishna district politics, Penamalur elections, Andhra Pradesh politics, Pedana constituency, AP Politics
ALSO ON TELUGUONE N E W S
  ప్రెజెంట్ దర్శకుడు 'క్రిస్టోఫర్ నోలన్'(Christopher Nolan)తన కలల సౌధం  'ది ఒడిస్సీ'(The Odissey)తో రికార్డుల మీద రికార్డులు కొడుతూ భారీ కలెక్షన్స్ రాబడుతున్నాడు. మన దేశంలో  కూడా అదిరిపోయే కలెక్షన్స్ తో సంచలనం దిశగా దూసుకెళ్తుంది. నోలన్‌కి మన దేశంతో ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2011లో 'ది డార్క్ నైట్ రైజెస్' కోసం జోధ్‌పూర్‌లోని మెహ్రాన్‌గఢ్ కోటలో షూటింగ్ చేయడం, 2019లో 'టెనెట్' సినిమా కోసం ముంబైలో 10 రోజుల పాటు చిత్రీకరణ జరపడం, మరియు ఇటీవల 'ది ఒడిస్సీ' ప్రమోషన్ల కోసం రావడం ద్వారా భారత్ తనపై చూపించే అభిమానాన్ని పలుమార్లు ప్రశంసించాడు. క్రిస్టోఫర్ రీసెంట్ గా మన భారతీయ సినిమాకి గర్వకారంగా నిలిచిన దర్శకుడు 'సత్యజిత్ రే' పై చేసిన ప్రశంసలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతున్నాయి. .న్యూయార్క్‌లోని ప్రముఖ 'క్రైటీరియన్ క్లోసెట్'ను సందర్శించిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,000 కి పైగా అత్యుత్తమ క్లాసిక్ సినిమాల సేకరణ నుంచి ఆయన భారతీయ సినిమా రత్నమైన సత్యజిత్ రే రూపొందించిన 'ది అపు ట్రైలజీ' (The Apu Trilogy) బాక్స్ సెట్‌ను ఎంతో ఇష్టంగా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా నోలన్ మాట్లాడుతూ, 1955లో విడుదలైన సత్యజిత్ రే(satyajit Ray)మాస్టర్‌పీస్ 'పథేర్ పాంచాలి' (Pather Panchali) నన్ను  పూర్తిగా అబ్బురపరిచింది. మూవీ మొత్తం  చూశాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. గ్రామీణ బెంగాల్ నేపధ్యంలో సాగే చిన్నారి అపు జీవిత ప్రయాణం, కుటుంబ బంధాలు, పేదరికం, ఆశలు మరియు మానవీయ కోణాలని  తెరకెక్కించిన తీరు నాపై చెరగని ముద్ర వేసింది. అయితే తదుపరి చిత్రాలైన 1956 , 1959  లో వచ్చిన అపరాజితో' 'అపూర్ సంసార్' (Apur Sansar) సినిమాలని  ఇప్పటివరకు చూడలేదని నోలన్ ఒప్పుకున్నారు. అందుకే ఈ మొత్తం 'అపు ట్రైలజీ' బాక్స్ సెట్‌ను ఇంటికి తీసుకెళ్లి, అపు జీవిత కథను పూర్తిగా చూసి ఆస్వాదించాలని ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు ఉత్సాహంగా ప్రకటించారు. Also Read: హ్యాండ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, మైత్రి మూవీ మేకర్స్.. ఫ్యాన్స్ డిజప్పాయింట్  ప్రసిద్ధ రచయిత బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ్ నవలల ఆధారంగా సత్యజిత్ రే రూపొందించిన ఈ 'అపు ట్రైలజీ' భారతీయ సినిమా చరిత్రలోనే కాక, ప్రపంచ సినీ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచింది. ఈ మూడు చిత్రాలు కథనంలో ఉన్న ప్రామాణికత, సహజత్వం మరియు భావోద్వేగ తీవ్రతతో 3 జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడమే కాకుండా కాన్స్, బెర్లిన్, వెనిస్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఎన్నో ప్రసిద్ధ పురస్కారాలను కైవసం చేసుకున్నాయి. ఆస్కార్ స్థాయి హాలీవుడ్ దర్శకుడైన నోలన్ నోటి వెంట సత్యజిత్ రే క్లాసిక్స్ గురించి ఇలాంటి అపారమైన ప్రశంసలు రావడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు "ఒక దిగ్గజం మరొక దిగ్గజాన్ని గౌరవించడం అంటే ఇదే" అని సంబరపడిపోతున్నారు. ఇక భారతీయ సినిమా తన మనుగడ కొనసాగిస్తున్నంత కాలం సత్య జిత్ రే పేరు  మార్మోగిపోతూ ఉంటుంది. ఎంతో మంది దర్శకులకి సత్య జిత్ రే నుంచి వచ్చిన  కథ, కథనం, క్యారెక్టర్స్ ని ఉపయోగించుకునే తీరు ఇన్ స్పిరేషన్. christopher Nolan, Satyajit Ray, Pather Panchali    
టాలీవుడ్‌లో వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  సాధారణంగా మీడియా సమావేశాల్లో సంక్లిష్టమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలామంది దాటవేసే ప్రయత్నం చేస్తారు, కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ఎంతో ధైర్యంగా, నిజాయితీగా ఆ ప్రశ్నకు ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ కౌంటర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రెస్ మీట్ లో ఒక విలేకరి స్పందిస్తూ, "కిరణ్ అబ్బవరం గారు చూడటానికి చాలా అమాయకుడిగా కనిపిస్తారు కానీ, ఆయన పిఆర్ (PR) టీమ్ మాత్రం చాలా గట్టిది. పిఆర్ టీమ్‌ను గట్టిగా వాడుకునే ఈ సినిమాతో హిట్ కొట్టారు అని టాక్ వస్తోంది, దీనిపై మీ స్పందన ఏంటి?" అని ప్రశ్నించారు.  ఈ ప్రశ్న వినగానే అక్కడున్న నిర్వాహకులు ఆ ప్రశ్నను ఆపే ప్రయత్నం చేసినా, కిరణ్ అబ్బవరం మాత్రం ఎంతమాత్రం తగ్గలేదు. "పర్లేదు అన్న, నేను ఆన్సర్ చేస్తాను, తప్పేముంది? కెమెరా నా వైపు తిప్పండి, జవాబు చెప్తాను" అంటూ ఎంతో పరిణతితో, కూల్‌గా ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కిరణ్ అబ్బవరం సమాధానమిస్తూ, "ఒకవేళ పిఆర్ టీమ్‌తోనే హిట్లు కొట్టేట్లయితే, ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ ఒక్కరూ ప్రతీ సినిమాకు అలాగే హిట్ కొట్టవచ్చు కదా?" అని నేరుగా ప్రశ్నించారు. ఏదైనా ఒక సినిమా విజయం సాధించి సక్సెస్ వచ్చినప్పుడు, ఎవరో ఒకరిని ఏదో ఒక మాట అనాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్ అకౌంట్ ఉందనే కారణంతో ఏది పడితే అది మాట్లాడేయడం లేదా పోస్టులు పెట్టేయడం అనే విధానాన్ని తాను ఎంతమాత్రం నమ్మనని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పారు. ఏ సినిమా అయినా సరే, పిఆర్ టీమ్ ద్వారా ఎంత రుద్దినా లేదా ఎంత ప్రచారం చేసినా ప్రేక్షకులు చూడకుండా విజయం సాధించలేదని ఆయన విశ్లేషించారు. థియేటర్లకు వచ్చి, తమ కుటుంబ సమేతంగా ఇంటిల్లపాది సినిమాను చూసి ఆదరిస్తున్న సాధారణ ప్రేక్షకుల అభిరుచిని మనం ముందుగా గౌరవించాలని కోరారు. ఒక సినిమా సాధించే అసలైన విజయం పిఆర్ స్టంట్స్ వల్ల రాదని, అది కేవలం ప్రేక్షకుల ఆదరణ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బాక్సాఫీస్ విజయం వెనుక ఉన్న అసలైన శక్తి ప్రేక్షకుడే అని చాటిచెప్పిన కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.     Kiran Abbavaram, PR Team, Chennai Love Story, Success Meet  
ప్రతిభావంతులలో కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్ ఒకరు. ఆయన సృష్టించే ప్రతి దృశ్యం, ఆయన రాసే ప్రతి పాత్ర వెండితెరపై సత్యానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. మరోవైపు పాత్ర ఏదైనా సరే, అందులో పూర్తిగా లీనమైపోయి ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకునే బహుముఖ ప్రజ్ఞాశాలి 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటే చాలు, సినీ ప్రియులకు పండుగే అని చెప్పాలి. ఇప్పటికే 'విడుదల పార్ట్ 1', 'విడుదల పార్ట్ 2' చిత్రాలతో పాటు కలంబో ప్రాజెక్ట్ 'అరసన్' లోనూ వీరి ప్రయాణం సాగగా, ఇప్పుడు తాజాగా మరో బిగ్ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. వెట్రిమారన్, విజయ్ సేతుపతి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ వెనుక ఉన్న చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, 'విడుదల పార్ట్ 1' బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం సామాన్యమైనది కాదు. కేవలం పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. అందులో విజయ్ సేతుపతి పోషించిన 'పెరుమాళ్ వాధ్యార్' పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దాని కొనసాగింపుగా వచ్చిన 'విడుదల పార్ట్ 2' కూడా థియేటర్లలో భారీ స్పందనను రాబట్టి, విమర్శకుల నుండి 4/5 రేటింగ్‌లు సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. ఈ రెండు సినిమాల విజయాలు వెట్రిమారన్ మేకింగ్ శైలిని, విజయ్ సేతుపతి నటనా నైపుణ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సాధారణంగా వెట్రిమారన్ సినిమాలు అనగానే తీవ్రమైన రాజకీయ నేపథ్యం, సామాజిక పోరాటాలు, రఫ్ అండ్ టఫ్ వాతావరణం గుర్తుకొస్తాయి. 'అసురన్', 'వడ చెన్నై' వంటి కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. అయితే, ఈసారి వెట్రిమారన్ తన మార్క్ రొటీన్ ఫార్ములాకు భిన్నంగా పూర్తి స్థాయి 'ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' కథను సిద్ధం చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఎప్పుడూ సీరియస్ డ్రామాలు తీసే వెట్రిమారన్, విజయ్ సేతుపతిలాంటి సహజ నటుడితో కలసి ఒక పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రాన్ని అందిస్తే, అది బాక్సాఫీస్ వద్ద మరో 200 కోట్ల బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వెట్రిమారన్ యంగ్ హీరో శింబుతో కలసి 'అరసన్' అనే భారీ ప్రాజెక్ట్‌ను జెట్ స్పీడ్‌లో పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా విజయ్ సేతుపతి ఒక కీలకమైన రోల్‌లో కనిపించనున్నారనే వార్తలు ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. దీని తరువాత ధనుష్‌తో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'వడ చెన్నై 2' సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో చేయబోయే ఈ నూతన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే అంశంపై ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది. విజయ్ సేతుపతికి ఉన్న మాస్ మరియు క్లాస్ ఫాలోయింగ్, వెట్రిమారన్ సంభాషణల బలం కలిస్తే థియేటర్లలో మ్యాజిక్ రిపీట్ అవ్వడం ఖాయం. త్వరలోనే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.     Vetrimaaran, Vijay Sethupathi, Viduthalai 2, Arasan movie
  పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel), పాన్ ఇండియా మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers). ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తుందంటే సినీ ప్రియుల్లో ఉండే ఆసక్తే వేరు. అందుకే అందరూ ఎంతో ఆసక్తితో హారర్ థ్రిల్లర్ '418' ది ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కీర్తన్ నాడగౌడ దర్శకత్వం వహిస్తుండగా    సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగాడల్ ముఖ్యమైన క్యారక్టర్ పోషిస్తున్నారు. తాజాగా అభిమానులకి  మైత్రీ సంస్థ ఊహించని బిగ్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన  పోస్టర్‌లో "భయంకరమైన తలుపులు కొద్దిగా ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. జూలై 31, 2026న విడుదల కావాల్సిన '418 ద ఫిల్మ్' ఆ రోజు రావడం లేదు. అతి త్వరలోనే నూతన విడుదల తేదీని మీ ముందుకు తీసుకువస్తాం. మీ సహనానికి, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమనంతటినీ మరింత భయం రూపంలో మీకు తిరిగి ఇవ్వడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ ఎదురుచూపు ఖచ్చితంగా సరైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు హారర్ సినిమాలను చూసి నవ్వింది చాలు.. ఇకపై భయపడాల్సిన సమయం వచ్చింది" అని కోట్ చేస్తూ #MythriBringsHorror అనే హ్యాష్‌ట్యాగ్‌తో అధికారికంగా ప్రమోషన్ పోస్టర్‌ పంచుకున్నారు. Also read: రిజర్వేషన్ల వివాదంపై శిల్పాశెట్టి మాటలు వైరల్.. ఆ  పోస్ట్ వెనుక అసలు నిజమేంటి?  ఈ నెల 31 న విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ మేకర్స్ మొదట నిర్ణయించారు.  కానీ, మేకర్స్ ఊహించని నిర్ణయంతో ప్రేక్షకులకు తీవ్ర నిరాశ మిగిల్చారు. మూడు రోజుల క్రితమే అంటే 25 న ట్రైలర్ రిలీజ్ కావాల్సింది. కానీ ట్రైలర్ ని కూడా వాయిదా వేశారు. ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా ఉన్నాడు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ డ్రాగన్ ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. Ntr, Prashanth Neel, Mythri Movie Makers, 418 The Film  
మార్వెల్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక సూపర్ హీరో చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాకముందే సరికొత్త బాక్సాఫీస్ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. టామ్ హాలాండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ, ఓపెనింగ్ వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు $800 మిలియన్ల నుండి $825 మిలియన్ల (రూ. 6,700 కోట్లకు పైగా) గ్రాస్ వసూళ్లను సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ అంచనాలు నిజమైతే, ప్రపంచ సినిమా చరిత్రలోనే 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' ($1.223 బిలియన్లు) తర్వాత ఆల్‌టైమ్ రెండవ అతిపెద్ద గ్లోబల్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో హోరెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ హాలీవుడ్ వండర్ సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం, భారతదేశంలో ఈ చిత్రం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఇప్పటికే ఏకంగా ₹60 కోట్ల మార్కును దాటేశాయి. ఇదివరకు తొలిరోజు ఇండియాలో ₹50 కోట్ల నుండి ₹60 కోట్ల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందని భావించినప్పటికీ, నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్‌లో అడ్వాన్స్ టికెట్ల విక్రయాలు ఊహించని వేగంతో జరుగుతుండటంతో మొదటిరోజు కలెక్షన్స్ ఊహకందని స్థాయికి చేరేలా కనిపిస్తున్నాయి. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత టామ్ హాలాండ్ మళ్లీ పీటర్ పార్కర్‌గా రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే అభిమానుల్లో అంచనాలు పీక్స్‌కు చేరాయి. ప్రీమియం ఫార్మాట్ స్క్రీన్‌లకు పెరిగిన విపరీతమైన డిమాండ్, ట్రైలర్లకు వచ్చిన అనూహ్య స్పందన, ఈ చిత్రం కోసం జరుగుతున్న భారీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కలిసి ఈ 2026 నాటి బిగ్గెస్ట్ థియేట్రికల్ ఈవెంట్‌గా మార్చేశాయి.  భారతీయ ప్రేక్షకులలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ, ఈ 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' థియేట్రికల్ స్క్రీనింగ్స్‌తో పాటు మార్వెల్ తరువాతి భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' ఫస్ట్ ట్రైలర్‌ను కూడా అటాచ్ చేసి ప్రదర్శించనున్నారనే వార్తలు ఇక్కడి మార్వెల్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారాయి. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఉన్న బాక్సాఫీస్ ట్రెండ్, మాస్ క్రేజ్‌ను బట్టి చూస్తే భారతదేశంలో 'అవెంజర్స్: ఎండ్‌గేమ్' పేరిట ఉన్న ఆల్‌టైమ్ హాలీవుడ్ రికార్డులను సైతం గట్టిగా సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది.  గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద $800-$825 మిలియన్ల రికార్డు ఓపెనింగ్‌తో పాటు, ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ సినిమాల జాబితాలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సిద్ధమైంది.     Spider Man Brand New Day, Opening Weekend, Spider Man  
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే ఒక వార్త మారుమోగిపోతోంది. నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'దసరా' మూవీ ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. 2023 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ దిగ్విజయ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో 'ది ప్యారడైజ్' చిత్రంపై టాలీవుడ్ వ్యాప్తంగా అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దుమ్మురేపగా, రౌద్ర రూపంలో నాని కనిపిస్తున్న 'జడల్' క్యారెక్టర్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి టాలీవుడ్‌ను ఊపేసే ఒక సరికొత్త క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఒక అదిరిపోయే స్పెషల్ ఐటమ్ సాంగ్ ఉండబోతోందట. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ పాటను మైండ్ బ్లాకింగ్ బీట్లతో అత్యంత స్పెషల్‌గా తీర్చిదిద్దారని సమాచారం. అనిరుధ్ అందించే స్పెషల్ నంబర్స్ ఏ స్థాయిలో చార్ట్‌బస్టర్స్ అవుతాయో వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ పాటలో నానితో కలిసి కాలు కదపడానికి ఒక క్రేజీ స్టార్ హీరోయిన్ రంగంలోకి దిగబోతోంది. ఆ బ్యూటీ ఎవరో కాదు, మహానటి కీర్తి సురేష్. 'నేను లోకల్', 'దసరా' వంటి సెన్సేషనల్ సినిమాల్లో నానితో జతకట్టి వెండితెరపై తిరుగులేని కెమిస్ట్రీని పండించిన కీర్తి సురేష్, ఇప్పుడు ఈ స్పెషల్ డాన్స్ నంబర్‌తో ప్రేక్షకులు, అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమవుతోంది. సినిమా వర్గాల సమాచారం ప్రకారం, 'ది ప్యారడైజ్' కథలో ఈ పాట చాలా కీలకమైన సందర్భంలో వస్తుందట. ఈ ప్రత్యేక గీతం కోసం ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో దర్శకనిర్మాతలు సుదీర్ఘంగా ఆలోచించారు. చివరకు కీర్తి సురేష్ అయితేనే పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని భావించారు. నాని, కీర్తి సురేష్‌ల మధ్య ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహం, చనువు ఉంది. ఆ ఆప్యాయతతోనే నాని స్వయంగా కీర్తి సురేష్‌ను ఈ స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించారట. కథలోని సందర్భం, పాటలోని మాస్ ఎనర్జీకి ముగ్ధురాలైన కీర్తి సురేష్, నాని అడగ్గానే మరేమీ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దసరాతో హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబినేషన్ ఇప్పుడు స్పెషల్ సాంగ్‌తో హ్యాట్రిక్ కాంబోగా మారనుండటంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ కోసం నిర్మాతలు ఏమాత్రం రాజీ పడకుండా హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రేపటి నుంచి ఈ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ మొదలుకానుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలో చూడని రేంజ్‌లో ఈ విజువల్స్ ఉండేలా ప్లాన్ చేశారు. దాదాపు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లతో ఈ మాస్ ఫోక్ నంబర్‌ను అత్యంత వేడుకగా చిత్రీకరించబోతున్నారు. అనిరుధ్ కంపోజ్ చేసిన ఊరమాస్ బీట్లకు నాని, కీర్తి సురేష్ జోడీ ఎనర్జెటిక్ డ్యాన్స్ స్టెప్పులు తోడైతే థియేటర్లలో సీట్లు చిరగడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, భారీ యాక్షన్ సీన్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పనులకు సరైన సమయం పడుతుండటంతో కాస్త ఆలస్యమైంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతి విషయంలోనూ ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. 'దసరా' కాంబో మళ్లీ రిపీట్ కావడం, అనిరుధ్ సంగీతం, 1000 మంది డ్యాన్సర్లతో హైదరాబాద్ భారీ సెట్‌లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్ వంటి అంశాలు 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతున్న ఈ పవర్ ప్యాక్డ్ రా యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం సినీ ప్రియులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.   Nani, The Paradise, Keerthy Suresh, Srikanth Odela, Anirudh Ravichander 
తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు రాజకీయాల చుట్టూనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే అక్కడ పలువురు స్టార్ హీరోలు రాజకీయ అరంగేట్రం చేయగా, తాజాగా ప్రముఖ హీరో విశాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సరికొత్త అలజడిని సృష్టించాయి. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన రాజకీయ ప్రయాణంపై పరోక్షంగా స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో విశాల్ కూడా త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా అనే సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. సినీ రంగంలో ఇన్ని సంవత్సరాలుగా ఒక నటుడిగా కొనసాగుతూ, ప్రేక్షకుల నుండి ఎంతో ప్రేమను, ఆదరణను పొందిన తనకు, ప్రజలకు తిరిగి ఏదో ఒకటి చేయాలనే బలమైన కోరిక ఉందని విశాల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తన మార్గం ఏమాత్రం సాధారణమైనదిగా ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఎటువంటి షార్ట్‌ కట్‌లు లేకుండా, కేవలం స్ట్రయిట్ రూట్ లోనే ప్రయాణిస్తానని, ప్రజలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి చివరివరకు అండగా ఉంటానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న సంకేతం పొలిటికల్ ఎంట్రీయేనని కోలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి తమిళ చిత్రసీమలో నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇటీవల దళపతి విజయ్ తన సొంత రాజకీయ పార్టీని స్థాపించి, ఏకంగా తమిళనాడు సీఎం కుర్చీపై కూర్చున్నారు. అదే బాటలో మరో స్టార్ ధనుష్ కూడా తన పొలిటికల్ ఎంట్రీపై ఇటీవల పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ వరుసలో విశాల్ పేరు కూడా వచ్చి చేరడంతో, కోలీవుడ్ నుంచి మరో హీరో రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇదివరకు ఆర్కే నగర్ ఉపఎన్నికల సమయంలోనే పోటీకి ప్రయత్నించి సాంకేతిక కారణాలతో నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.     Actor Vishal, Political Entry, CM Vijay, Dhanush  
  రెండున్నర దశాబ్దాల క్రితమే తన అందంతో,నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి(shilpa shetty). బాలీవుడ్ లో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అభిమానులు, ప్రేక్షకులకి గుర్తిండే పోయే శాశ్వత రూపాల్లో ఒకటిగా నిలిచిపోయింది.  తాజాగా  శిల్పా శెట్టి కుంద్రా పేరుతో నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక సంచలన పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపింది.  దేశంలో అత్యంత సున్నితమైన అంశమైన కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థపై శిల్పా శెట్టి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో  షేర్ అయింది. ఈ వైరల్ పోస్ట్‌లో "రిజర్వేషన్లను తాకవద్దు, జనరల్ కేటగిరీ వైద్యులు కేవలం జనరల్ కేటగిరీ రోగులకు మాత్రమే చికిత్స చేయనివ్వండి, అలాగే మిగిలిన వారు వారి స్వంత కులానికి చెందిన రోగులకు మాత్రమే వైద్యం చేయనివ్వండి, కొన్నేళ్ల పాటు ఇలా చేస్తే ప్రజలే స్వయంగా రిజర్వేషన్లను రద్దు చేయమని కోరుతారు, రిజర్వేషన్ల ద్వారా నైపుణ్యం రాదు" అని రాసి ఉంది. Also read: హెటర్స్ కి అల్లు అర్జున్ అదిరిపోయే కౌంటర్..పిచ్చెక్కించే వైరల్ స్పీచ్  ఈ ఫేక్ పోస్ట్ బయటకు రాగానే నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చలకు దారితీసింది. చాలామంది అది నిజంగానే శిల్పా శెట్టి చేసిన పోస్ట్ అని భావించి ఆమెను విమర్శించడం ప్రారంభించగా, మరికొందరు ఆ స్క్రీన్‌షాట్ శిల్పాశెట్టి ది కాదని చెప్తున్నారు. వివాదం కాస్తా పెద్దదిగా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో, శిల్పా శెట్టి స్పందిస్తూ 'నా పేరుతో రిజర్వేషన్లపై ఫేక్ వ్యాఖ్యలను జోడించి ప్రచారం చేయడం చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది పూర్తిగా కల్పితం మరియు దుర్భుద్ధితో కూడిన చెత్త. ఇలాంటి తప్పుడు వార్తలని దయచేసి ఎవరూ నమ్మకండి  అని చెప్పుకొచ్చింది.     Shilpa Shetty, Bollywood
  నయా పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి అభిమానులంటే ఎంత ప్రేమో, అభిమానులకి అల్లు అర్జున్ అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఏకంగా అల్లు అర్జున్ తన అభిమానులని అల్లు ఆర్మీ అని పిలుచుకుంటాడు. రీసెంట్ గా అల్లు అర్జున్  తన అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసాడు. ఆ సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.  అల్లు అర్జున్ మాట్లాడుతు 'నా కోసం ఒక ప్రత్యేక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇంతటి ప్రేమని , అభిమానాన్ని, ఆదరణ  చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున  కృతజ్ఞతలు. అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పడం సాధ్యం కాకపోయినా,నా  అభిమానులందరూ ఎప్పుడు నా గుండెల్లో పదిలంగా ఉంటారు. "Keep the Fire on ' ప్రతి ఒక్కరి జీవితంలోను రోజువారీ సమయం, ఎనర్జీ చాలా విలువైనవి.  మానవుడికి ప్రతి రోజూ 100 శాతం ఎనర్జీ  సమయం లభిస్తాయి. ఆ లభించిన శక్తిని, సమయాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. Also read: కంటెంట్ బాగోకపోతే కట్టుకున్నపెళ్ళాం కూడా నీ సినిమా చూడదు.. దర్శకుడికి చేదు అనుభవం   ఎవరైనా మీకు నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా చేసుకోవద్దు. మీ వద్ద ఉన్న సమయం, ఎనర్జీ, అవకాశాలు చాలా పరిమితమైనవి. కాబట్టి వాటిని మీకు నచ్చిన పనికే, మీ ఎదుగుదలకే పూర్తిస్థాయిలో వినియోగించండి. మీకు నచ్చని వ్యక్తులు లేదా విషయాల కోసం మీకున్న శక్తిలో ఒన్ పర్సెంట్  కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాకా' తో బిజీగా ఉన్నాడు. Allu Arjun, Raaka, Fans  
ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ కేవలం మన దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో మన తెలుగు హీరోలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ అసాధారణమైనవి. అక్కడ సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అయితే ఈ స్థాయిలో గ్లోబల్ పాపులారిటీ ఉన్నప్పటికీ, మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ విదేశాల్లో లైవ్ స్టేజ్ షోలు, నాటకాలు లేదా పర్సనల్ టూర్లు చేసి ఆర్జించడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదు అనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది. ఇతర భాషల తారలు విదేశీ షోల ద్వారా భారీగా సంపాదిస్తున్న వేళ, మన హీరోలు మాత్రం ఈ తరహా ఈవెంట్లకు దూరంగా ఉండటం వెనుక ఉన్న అసలు కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అమెరికాలో నిర్వహించిన లైవ్ షోలు సాధించిన ఘనవిజయం విదేశీ మార్కెట్ సామర్థ్యాన్ని స్పష్టంగా నిరూపించింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఆయన చేసిన ప్రదర్శనలకు ఆడిటోరియాలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ ఒక్క యుఎస్ టూర్ ద్వారా నవాజుద్దీన్ బృందం రూ. 2 కోట్ల నుండి రూ. 3.5 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రదర్శన ఖర్చులు, ప్రయాణ వ్యయాలు పోనూ నవాజుద్దీనకు ఒక్కో షోకి రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు మిగిలగా, మొత్తం టూర్ ముగిసేసరికి ఏకంగా రూ. 1.5 కోట్లకు పైగానే నికర లాభం దక్కింది. నవాజుద్దీన్ లాంటి క్యారెక్టర్ నటుడికే విదేశాల్లో అంతటి భారీ స్పందన లభిస్తే, టాలీవుడ్ తిరుగులేని సూపర్ స్టార్లకు అక్కడ ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో మన టాలీవుడ్ అగ్ర కథానాయకులు విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో సహాయ నిధుల సేకరణ కోసం విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి కోట్లాది రూపాయల విరాళాలు సేకరించిన చరిత్ర ఉంది. మరోవైపు మన సంగీత దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, దేవీశ్రీ ప్రసాద్, తమన్, ఎం.ఎం. కీరవాణి వంటి వారు ఇప్పటికీ విదేశాల్లో క్రమం తప్పకుండా భారీ లైవ్ కాన్సర్ట్‌లు నిర్వహిస్తూ కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారు. కానీ, అగ్ర నటుల విషయానికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులుగా ఉంటుంది. దీని వెనుక ప్రధాన కారణం వారు ప్రస్తుతం అందుకుంటున్న భారీ పారితోషికాలు, వారి బిజీ కాల్ షీట్లు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోల రెమ్యునరేషన్ ఒక సినిమాకి రూ. 30 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టులు పెరిగిపోవడంతో హీరోల డేట్లు ఏడాది పొడవునా, కొన్నిసార్లు రెండేళ్ల ముందుగానే బుక్ అయిపోతున్నాయి. వరుస షూటింగ్‌లు, ప్రమోషన్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వీరికి, విదేశాలకు వెళ్లి నెలల తరబడి నాటకాలు లేదా లైవ్ షోల కోసం రిహార్సల్స్ చేసి సమయం కేటాయించే వీలు ఏమాత్రం కలగడం లేదు. ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే, విదేశీ షోలు మన స్టార్లకు అంత లాభదాయకంగా కనిపించడం లేదు. సినిమాల ద్వారా పదుల, వందల కోట్లు సంపాదిస్తున్న ఈ స్థాయి నటులకు, ఒక విదేశీ టూర్ కోసం అహర్నిశలు శ్రమించి లైవ్ ఈవెంట్లు చేస్తే వచ్చే రూ. 5 కోట్ల నుండి రూ. 6 కోట్ల రూపాయల నికర లాభం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. లైవ్ షోల కోసం చేసే సుదీర్ఘమైన ప్రిపరేషన్, ప్రయాణాలకు వెచ్చించే సమయాన్ని ఒక సినిమా షూటింగ్‌పై పెడితే వారికి లభించే రాబడి, స్టార్‌డమ్ ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే అత్యధిక రాబడి వచ్చే సినిమా రంగానికే తమ పూర్తి సమయాన్ని కేటాయించాలని టాలీవుడ్ అగ్ర స్టార్లు నిర్ణయించుకున్నారు.     Tollywood Stars Overseas Shows, Nawazuddin Siddiqui US Tour
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
IBS (Irritable Bowel Syndrome) సమస్యకు సహజమైన మరియు ఆయుర్వేద పరిష్కారాలు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, తరచుగా విరేచనాలు వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ లక్షణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి Irritable Bowel Syndrome (IBS). ఈ TeluguOne Health వీడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు IBS అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? IBS లక్షణాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలియజేస్తున్నారు. అలాగే IBS సమస్యను నియంత్రించడానికి సహాయపడే సహజమైన జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు, ఆయుర్వేద పద్ధతులు మరియు ఇంట్లో పాటించగల కొన్ని చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: • Irritable Bowel Syndrome (IBS) అంటే ఏమిటి? • IBS రావడానికి కారణాలు ఏమిటి? • IBS ప్రధాన లక్షణాలు • గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గించే మార్గాలు • IBS కోసం పాటించాల్సిన ఆహార నియమాలు • సహజమైన మరియు ఆయుర్వేద పద్ధతులు • ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు IBS అనేది దీర్ఘకాలిక జీర్ణ సంబంధ సమస్య కావచ్చు. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు మరియు నిపుణుల సూచనలతో దీనిని నియంత్రించుకోవచ్చు. IBS సమస్యతో బాధపడుతున్న వారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా షేర్ చేయండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.  ఆవనూనె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే విదేశీయులు,  ఆరోగ్య స్పృహ ఎక్కువ కలిగిన ధనవంతులు వంటల్లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. పైగా  ఆలివ్ నూనె గుండెకు మంచిదని అంటారు. ఆవ నూనె వందల సంవత్సరాల నుండి భారతీయ వంటకాలలో వాడుతున్నారు. కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఆవనూనెను ఉపయోగిస్తుంటారు.  మధ్యధరా ప్రాంతంలో ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే గుండె ఆరోగ్యానికి ఆవనూనె లేదా ఆలివ్ నూనె రెండింటో ఏది మంచిది? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. సరైన నూనె ఎంపిక ఎందుకు ముఖ్యం? ఒకప్పుడు నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని,  ఈ కారణంగా కొవ్వు ఎక్కువ వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోషకాహార నిపుణులు చెబుతున్న విషయం వేరు.. కొవ్వులో రెండు రకాలు ఉన్నాయని,  వీటిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి.  పదేపదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ , అధిక సంతృప్త కొవ్వులు గుండెకు హానికరం అని చెబుతారు. అయితే, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ , ఒమేగా-3 వంటి అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి , రక్తనాళాలలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే గుండె ఆరోగ్యం గురించి చర్చించేటప్పుడు ఆవ నూనె , ఆలివ్ నూనె రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారికి ఆలివ్ నూనె లేదా ఆవనూనె? గుండె జబ్బుల రోగులకు ఆలివ్ నూనెతో వంట చేయడం మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు , ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇందులో పాలీఫెనాల్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ ధమనులకు నష్టం కలిగించడంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె  మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో , చెడు కొలేస్ట్రాల్  ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు.  చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణం అవుతుందని చెబుతారు. అధికంగా ఆలివ్ నూనె తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ నూనె అన్ని రకాల వంటలకు మంచిదా? ఆలివ్ నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. భారతీయులు  ఆహారాన్ని  నూనెలో బాగా వేయిస్తారు, పోపు  వేస్తారు, లేదా ఎక్కువ సేపు అధిక వేడి మీద వండుతారు. ఇలాంటి పరిస్థితులలో, అధిక వేడి కారణంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, పోషకాలు తగ్గిపోతాయి. శుద్ధి చేసిన ఆలివ్ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఆవనూనె ఎందుకు ప్రత్యేకం.. ఆవ నూనె చాలా కాలంగా భారతీయ వంటకాలలో ఒక భాగంగా ఉంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  ఆవ నూనె వల్ల గుండెకు కలిగే సంభావ్య ప్రయోజనాలపై భారతీయ పరిశోధనలు కూడా జరిగాయి. సాంప్రదాయ ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అయితే ఆవ నూనెను మితంగా వాడాలి.                                    *రూపశ్రీ.  
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..! మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: ✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి? ✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది? ✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి? ✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి? ✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు? ✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ✅ యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి? ✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి.