Home

»

Latest News

హేటర్స్‌ కి అల్లు అర్జున్ అదిరిపోయే  కౌంటర్.. పిచ్చెక్కించే వైరల్ స్పీచ్

Jul 28, 2026 3:08PM

 

నయా పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి అభిమానులంటే ఎంత ప్రేమో, అభిమానులకి అల్లు అర్జున్ అంటే ఎంత ప్రేమో తెలిసిందే. ఏకంగా అల్లు అర్జున్ తన అభిమానులని అల్లు ఆర్మీ అని పిలుచుకుంటాడు. రీసెంట్ గా అల్లు అర్జున్  తన అభిమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసాడు. ఆ సమావేశంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. 

అల్లు అర్జున్ మాట్లాడుతు 'నా కోసం ఒక ప్రత్యేక అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇంతటి ప్రేమని , అభిమానాన్ని, ఆదరణ  చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరున  కృతజ్ఞతలు. అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్పడం సాధ్యం కాకపోయినా,నా  అభిమానులందరూ ఎప్పుడు నా గుండెల్లో పదిలంగా ఉంటారు. "Keep the Fire on '
ప్రతి ఒక్కరి జీవితంలోను రోజువారీ సమయం, ఎనర్జీ చాలా విలువైనవి.  మానవుడికి ప్రతి రోజూ 100 శాతం ఎనర్జీ  సమయం లభిస్తాయి. ఆ లభించిన శక్తిని, సమయాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా మన వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

Also read: కంటెంట్ బాగోకపోతే కట్టుకున్నపెళ్ళాం కూడా నీ సినిమా చూడదు.. దర్శకుడికి చేదు అనుభవం  

ఎవరైనా మీకు నచ్చకపోతే వారిని ద్వేషిస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ మీ అమూల్యమైన సమయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా చేసుకోవద్దు. మీ వద్ద ఉన్న సమయం, ఎనర్జీ, అవకాశాలు చాలా పరిమితమైనవి. కాబట్టి వాటిని మీకు నచ్చిన పనికే, మీ ఎదుగుదలకే పూర్తిస్థాయిలో వినియోగించండి. మీకు నచ్చని వ్యక్తులు లేదా విషయాల కోసం మీకున్న శక్తిలో ఒన్ పర్సెంట్  కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం 'రాకా' తో బిజీగా ఉన్నాడు.

Allu Arjun, Raaka, Fans

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com