
రెండున్నర దశాబ్దాల క్రితమే తన అందంతో,నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి(shilpa shetty). బాలీవుడ్ లో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అభిమానులు, ప్రేక్షకులకి గుర్తిండే పోయే శాశ్వత రూపాల్లో ఒకటిగా నిలిచిపోయింది. తాజాగా శిల్పా శెట్టి కుంద్రా పేరుతో నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక సంచలన పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపింది.
దేశంలో అత్యంత సున్నితమైన అంశమైన కుల ఆధారిత రిజర్వేషన్ల వ్యవస్థపై శిల్పా శెట్టి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ అయింది. ఈ వైరల్ పోస్ట్‌లో "రిజర్వేషన్లను తాకవద్దు, జనరల్ కేటగిరీ వైద్యులు కేవలం జనరల్ కేటగిరీ రోగులకు మాత్రమే చికిత్స చేయనివ్వండి, అలాగే మిగిలిన వారు వారి స్వంత కులానికి చెందిన రోగులకు మాత్రమే వైద్యం చేయనివ్వండి, కొన్నేళ్ల పాటు ఇలా చేస్తే ప్రజలే స్వయంగా రిజర్వేషన్లను రద్దు చేయమని కోరుతారు, రిజర్వేషన్ల ద్వారా నైపుణ్యం రాదు" అని రాసి ఉంది.
Also read: హెటర్స్ కి అల్లు అర్జున్ అదిరిపోయే కౌంటర్..పిచ్చెక్కించే వైరల్ స్పీచ్
ఈ ఫేక్ పోస్ట్ బయటకు రాగానే నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చలకు దారితీసింది. చాలామంది అది నిజంగానే శిల్పా శెట్టి చేసిన పోస్ట్ అని భావించి ఆమెను విమర్శించడం ప్రారంభించగా, మరికొందరు ఆ స్క్రీన్‌షాట్ శిల్పాశెట్టి ది కాదని చెప్తున్నారు. వివాదం కాస్తా పెద్దదిగా మారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో, శిల్పా శెట్టి స్పందిస్తూ 'నా పేరుతో రిజర్వేషన్లపై ఫేక్ వ్యాఖ్యలను జోడించి ప్రచారం చేయడం చూసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది పూర్తిగా కల్పితం మరియు దుర్భుద్ధితో కూడిన చెత్త. ఇలాంటి తప్పుడు వార్తలని దయచేసి ఎవరూ నమ్మకండి అని చెప్పుకొచ్చింది.
Shilpa Shetty, Bollywood






