LATEST NEWS
నీటి పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వరంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్రమోడీ. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు అనివార్యంగా ధర్మేంద్రప్రధాన్ చేత రాజీనామా చేయిం,చాల్సిన పరిస్థితి ఎదురుర కావడం మోడీ ప్రతిష్ట మసకబారడానికి కారణమైంది.  కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా  విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే విద్యావ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులే ఉవ్వెత్తున ఉద్యమించారు. అదలా ఉంచితే.. నరేంద్ర మోడీ తాత్కాలికంగా జోషీకి విద్యాశాఖ అప్పగించారనీ, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ బాధ్యతలు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి అప్పగించే అవవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఢిల్లీ వర్గాల సమాచారం.  గతంలో క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండంతో ప్రధాని మోడీ ఆమెవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.  నీట్   లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట బాగా మసకబారిందనడంలో సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. దీంతో ప్రధాని మోడీ నష్టనివారణపై దృష్టి పెట్టారంటున్నారు.  ఇప్పటికే మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని విద్యాశాఖను విద్యావంతురాలు, రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి  సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు బీజేపీలో చేరిన పురంధేశ్వరి..ఆ ఎన్నికలలో  రాజంపేట నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోఆమె రాజమహేందర వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగించాలని మోడీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   Daggubati Purandeswari into union cabinet, Union Education Minister, Dharmendra Pradhan resignation, Rajahmundry MP, Modi Cabinet expansion 
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు,  మాజీ మంత్రి,  ఆర్.కె. రోజా అరెస్టు కాక తప్పదా? తాజాగా పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాలలో రోజా అరెస్టు అవుతారా అన్న చర్చ జోరందుకుంది.   ఒక పాత కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు.  ఆ నోటీసులలో  ఈ నెల 30 న విచారణాధికారుల ఎదుట  హాజరుకావాలని, లేనిపక్షంలో  అరెస్ట్ చేస్తామనీ పేర్కన్నారని అంటున్నారు.  రోజా ఇటీవల కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా ఉండటం లేదు.  తాజాగా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి, వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో   రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర  క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా   క్రీడా పరికరాల కొనుగోల విషయంలో  భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై   వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో  అప్పటి మంత్రి రోజాను ప్రశ్నించడం కోసం నోటీసులు జారీ చేశారు.  ; పోలీసు నోటీసుల మేరకు రోజా ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకున్నా, విచారణలో అధికారులకు సహకరించకున్నా అరెస్టు తప్పదని ఆ నోటీసులలోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది.  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి రోజా రాజకీయంగా పెద్దగా క్రీయాశీలంగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆమె విపక్షాలపై మీడియా సమావేశాల్లో, సభల్లో పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ సందర్భంగా ఆమె అనుచిత భాషా ప్రయోగం చేసేవారన్న ఆరోపణలున్నాయి. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి, తాను కూడా స్వయంగా నగరి నుంచి పరాజయం పాలైన తరువాత నుంచి ఆమె మీడియా ముందుకు రావడం బాగా తగ్గించారు. పైగా ఎక్కువ సమయం తమిళనాడు రాజధాని చెన్నైకే పరమితమౌతూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆమె టీవీకేలో చేరేందుకు తెగ ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. సరే కేసుల భయతోనే రోజా రాజకీయంగా దూకుడు తగ్గించారని పరిశీలకులు విశ్లేషణనలు కూడా చేశారు.  గత కొంత కాలంగా చెన్నైకే పరిమితమైన రోజా.. నగరి నియోజకవర్గానికి వచ్చిన రెండు రోజులలోనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు.   కాగా రోజాకు పోలీసులు అందజేసిన నోటీసులలో  ఆడుదాం ఆంధ్ర అవకతవకలతో పాటుగా, అప్పట్లో రోజా మంత్రిగా వ్యవహరించిన  పర్యాటక  శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు కాంట్రాక్టులు, నిర్వహణ నిధుల వ్యయంలో జరిగిన కేటాయింపులపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ గతంలోనే దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. క్రీడా సామాగ్రి కొనుగోలు టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ప్రాథమిక నివేదికల ఆధారంగానే ఇప్పుడు రోజాకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.  
  అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..! ఆంధ్రప్రదేశ్ అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీలో అనూహ్య పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైఖరిపై టిడిపి అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిచేసిన ఆయన ఇటీవలి వ్యాఖ్యలు, చేష్టలపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుతో కలిసి బోండా ఉమ ఒకే వేదికను పంచుకోవడం కూటమి వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిత్యం తెలుగుదేశం, జనసేన అధినేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే ప్రత్యర్థి పార్టీ నేతతో సఖ్యతగా మెలగడం కూటమి ధర్మానికి విరుద్ధమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అంతేకాకుండా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాపు సామాజిక వర్గ ప్రయోజనాల కోసం స్వయంగా ఉద్యమిస్తానని బోండా ఉమ ప్రకటించడం కూటమి ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. గతంలో ముద్రగడ పద్మనాభం వ్యవహారాన్ని టీడీపీ సరిగ్గా అంచనా వేయకపోవడం వల్లే 2019లో ఓటమి చవిచూసిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను కుదిపివేశాయి. విజయవాడ సెంట్రల్ నుండి రెండవసారి విజయం సాధించిన బోండా ఉమామహేశ్వరరావు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిని ఆశించారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చురుగ్గా పోరాటాలు చేసిన తనకే ప్రాధాన్యం దక్కుతుందని ఆయన భావించారు. అయితే వివిధ సామాజిక, రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయనకు కేబినెట్‌లో చోటు లభించలేదు. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బోండా ఉమ, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. పరోక్షంగా అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుంటూ క్రమశిక్షణ కట్టుదాటే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉన్న సమయంలో పార్టీ నేతలే వివాదాలకు కేంద్రబిందువు కావడం తగదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించే నాయకులు ఎంతటి వారైనా సహించేది లేదనే స్పష్టమైన సంకేతాన్ని పంపేందుకే ఈ షోకాజ్ నోటీసు ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ జారీ చేసిన నోటీసుపై బోండా ఉమామహేశ్వరరావు ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అధిష్టానం తదుపరి ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. Bonda Umamaheswara Rao, Ambati Rambabu, TDP Show Cause Notice, AP Politics, Chandrababu Naidu  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల  అబ్డామినల్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.  ఈ విషయాన్ని షర్మిల స్వయంగా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. తాను ఆస్పత్రిలో కోలుకుంటున్న ఫొటోను కూడా ఆ పోస్టుకు జత చేశారు.  దీనిపై   పలువురు  రాజకీయ నాయకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపారు. అయితే.. షర్మిల సొంత అన్న, వైసీపీ అధినేత జగన్ మాత్రం స్పందించలేదు.    షర్మిల తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన కీలక సమాచారాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు. అయితే, సొంత చెల్లెలు ఆసుపత్రి పాలై, సర్జరీ చేయించుకున్న విషయం తెలిసినప్పటికీ  వైసీపీ అధినేత  జగన్  పరామర్శించకపోవడం, కనీసం సామాజిక మాధ్యమ వేదిక ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలంటూ సందేశం పోస్టు చేయడపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అదే రోజు ఉదయం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ సైనికుల త్యాగాలను స్మరిస్తూ ఎక్స్‌లో  శుభాకాంక్షలు తెలిపిన జగన్.. సొంత చెల్లెలి ఆరోగ్యంపై స్పందించకపోవడంపై వైసీపీలో కూడా ఆసంతృప్తి వ్యక్తమౌతోంది.   కుటుంబ విభేదాలు, రాజకీయ  వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. జగన్ సొంత చెల్లెలి ఆరోగ్య పరిస్థితిపై కనీస అక్కర చూపకపోవడాన్ని వైసీపీ వర్గాలే తప్పుపడుతున్నాయి.  గత కొన్ని సంవత్సరాలుగా జగన్, షర్మిల మధ్య వేభేదాలు ఉన్న సంగతి తెలిసిందే.   జగనన్న వదిలిన బాణాన్ని అంటూ.. 2019 ఎన్నికల సమయంలో వైసీపసీ విజయానికి అలుపెరుగకుండా శ్రమించి, సుదీర్ఘ పాదయాత్ర స్థాపన సమయం నుంచి అన్న విజయం కోసం అలుపెరగని పాదయాత్ర నిర్వహించిన షర్మిల, తదనంతర పరిణామాల్లో జగన్ తీరుతో విభేదించి సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.   అంతే కాకుండా షర్మిల, జగన్ మధ్య  ఆస్తుల పంపిణీకి సంబంధించిన వివాదాలు కూడా రచ్చకెరక్కాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్యా సంబంధాలు పూర్తిగా చెడ్డాయి.  అయితే ఆరోగ్యపరమైన పరిస్థితులు లేదా అత్యవసర సందర్భాలు ఎదురైనప్పుడు  వైరాన్ని పక్కనబెట్టి స్పందించపోవడంపై జగన్ తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్త మౌతున్నాయి.    ఆసుపత్రిలో  కోలుకుంటున్న   చెల్లెలు షర్మిలను ఇప్పటికైనా  జగన్ ఫోన్ ద్వారా లేదా స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడం మంచిదని వైసీపీ వర్గాలు అంటున్నాయి.  వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ  అభిమానులు కూడా జగన్  చెల్లెలికి కనీసం ఒక మర్యాదపూర్వక పరామర్శ సందేశం పంపితే బాగుండేదని అంటున్నారు.   urgery for Sharmila, rother Jagan doesnt even respond, CBN, LOKESH, messge, speedy, recovery
  కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2028లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో దక్షిణ భారత రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర చర్చ మొదలైంది. ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ, సామాన్య ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలపై నిరంతరం పోరాడతానని ఆయన పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ, సక్రియ రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తానని సిద్ధరామయ్య వెల్లడించారు. తన నిర్ణయానికి గల కారణాలను సిద్ధరామయ్య వివరిస్తూ.. ప్రస్తుత రాజకీయ వాతావరణం పూర్తిగా కలుషితమైందని, ధనప్రవాహం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీతో కూడిన రాజకీయాలకు స్థానం లేకుండా పోతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల బరిలో నిలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన వయస్సు 82 సంవత్సరాలకు చేరుకుంటుందని సిద్ధరామయ్య వివరించారు. ఈ వయస్సులో మునుపటి ఉత్సాహంతో నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేయడం కష్టమని, ఆరోగ్య రీత్యా కూడా పరిమితులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. తన సొంత నియోజకవర్గమైన వరుణ ప్రజలు మరోసారి పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ, తన నిర్ణయాన్ని మార్చుకోలేనని ఆయన స్పష్టం చేశారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రారంభమైన తన ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గెలుపోటములను చూశానని, అయితే నమ్మిన సిద్ధాంతాలకు ఎప్పుడూ విరుద్ధంగా నడుచుకోలేదని సిద్ధరామయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలందించిన సిద్ధరామయ్య, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ పార్టీలో అత్యంత ప్రభావవంతమైన నేతగా కొనసాగుతున్నారు. ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు తనపై చూపిన అభిమానానికి రుణపడి ఉంటానని, చివరి శ్వాస వరకు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, సిద్ధరామయ్య ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం వరుణ నియోజకవర్గంతో పాటు కర్ణాటక కాంగ్రెస్ రాజకీయంలోనూ కీలక మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు. తన వారసుడిగా కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు స్థానం కల్పించే దిశగా కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య సలహాలు, మార్గదర్శకత్వం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. Siddaramaiah, Karnataka politics, 2028 assembly elections, Varuna constituency, Congress party
ALSO ON TELUGUONE N E W S
Ram Charan is undergoing wrist surgery today at the renowned Ganga Hospital in Coimbatore. He got injured during the shoot of Peddi and the actor is undergoing treatment from past few months. Now, he is getting surgery to eliminate any sort of complications in future.  The procedure is being performed by noted orthopedic specialist Dr. Rajasekhar, who is known for treating several sports personalities and celebrities with complex hand and wrist injuries. In a heartwarming gesture, Megastar Chiranjeevi, his wife Surekha, and Charan's wife Upasana accompanied him to Coimbatore yesterday to be by his side during the procedure.  The family's presence has come as a source of emotional strength for the actor as he prepares to undergo surgery. While the exact nature of the wrist issue has not been officially disclosed, the surgery is said to have been planned in advance to ensure a complete recovery before Ram Charan resumes his packed professional commitments.  The actor has been juggling multiple projects, making it important to address the injury without further delay. Fans across social media have been pouring in wishes for the actor's speedy recovery.  With the surgery taking place under the supervision of one of the country's leading orthopedic experts, there is optimism that Charan will be back on sets after completing the required rehabilitation. An official update on the surgery and the actor's recovery is expected from the family or his team once the procedure is successfully completed. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన నటనా జీవితానికి ముగింపుగా నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయగన్‌' (తెలుగులో 'జన నాయకుడు'). కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే. నారాయణ నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్ ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల ప్రభంజనంతో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే దళపతి విజయ్ మాస్ స్టామిటాను నిరూపిస్తూ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజే ఇండియాలో నెట్ రూపంలో 42.70 కోట్ల భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఇండియా గ్రాస్ కలెక్షన్స్ లో 48.27 కోట్లు, ఓవర్సీస్‌లో 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో కలిపి మొదటి రోజే రూ. 80.28 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ మైలురాయిని అధిగమించింది. రెండవ రోజున వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లలో కొంత మందగమనం కనిపించి భారతదేశంలో రూ. 21.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కానీ, వీకెండ్ ప్రారంభమవ్వడంతో శనివారం మూడో రోజున మళ్లీ పుంజుకుని రూ. 28.50 కోట్ల నెట్ రాబట్టి దూకుడు ప్రదర్శించింది. ఇక నాలుగో రోజు ఆదివారం బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపిస్తూ ఏకంగా రూ. 32 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది.  దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే ఇండియాలో 'జన నాయగన్‌' చిత్రం రూ. 124.75 కోట్ల నెట్ సాధించి 100 కోట్ల క్లబ్‌లో ఘనంగా అడుగుపెట్టింది. ఇండియా గ్రాస్ పరంగా రూ.145.98 కోట్లు, ఓవర్సీస్ లో రూ.71.50 కోట్ల వసూళ్లతో కలిపి గ్లోబల్ వైడ్‌గా రూ.217.48 కోట్ల గ్రాస్ సాధించి దండయాత్ర కొనసాగిస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌తో ఈ ఏడాది కోలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ వీక్ సాధించిన టాప్ చిత్రంగా 'జన నాయగన్' నిలిచింది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా ఇదే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.     Jana Nayagan, Box Office, Thalapathy Vijay  
  -థియేటర్స్ లో తన హవా కొనసాగిస్తున్న చెన్నై లవ్ స్టోరీ  -నివి గా గౌరీ ప్రియ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మ్ చేసిందనే కితాబు  -అచ్చ తెలుగు నటి అయిన గౌరీ ప్రియ  ఇండస్ట్రీ ని శాసించబోతుందా! నటనకి గౌరవం తెచ్చే నటీమణులు అరుదుగా వస్తుంటారు. ఇప్పుడు ఆ అరుదైన నటీమణి  జాబితాలో శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya)చేరిందని 'చెన్నైలవ్ స్టోరీ'చూసిన ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్తున్నారు. నిజానికి 'నివి' అనే ఆధునిక యువతి క్యారక్టర్ లో గౌరీ ప్రియ ప్రదరించిన పెర్ఫార్మ్ అంత ఈజీ కాదు.  ముఖ్యంగా కిరణ్ అబ్బవరం పోషించిన స్టీవెన్ క్యారక్టర్ చనిపోయినప్పుడు ఫుల్ గా ఆల్కహాల్ తీసుకొని, స్టీవెన్ సమాధి దగ్గరకి వెళ్లి నా జీవితంలోకి ఎందుకు వచ్చావు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయావు అని ఏడుస్తూ ఆమె చేసే  పెర్ఫార్మ్ ఒక లెవల్ అని చెప్పవచ్చు. ఎంతో అనుభవమున్న నటీమణుల వల్లనే అది సాధ్యమవుతుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా శ్రీ గౌరీ ప్రియ పేరు మారుమోగిపోతుంది.  గౌరీ ప్రియ ప్రయాణం ఒక గాయనిగా ప్రారంభమైంది. చిన్నతనంలోనే తన గాత్రంతో ఆకట్టుకున్న ఆమె, ప్రముఖ సంగీత కార్యక్రమం 'బోల్ బేబీ బోల్' సీజన్ 2లో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్ 3లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జెమిని టీవీలో కొంతకాలం యాంకర్‌గా పనిచేసిన అనంతరం సెల్యులాయిడ్  వైపు అడుగులు వేసి  2016 లో వచ్చిన  'నిర్మలా కాన్వెంట్' తో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించి, 'మనలో ఒకడు', 'ఫిదా' , లవ్ స్టోరీ, శ్రీకారం వంటి చిత్రాల్లో స్మాల్  క్యారెక్టర్స్ లో   కనిపించింది. యూట్యూబ్ వెబ్ సిరీస్‌ 'మోడర్న్ లవ్ చెన్నై' అనే అంతర్జాతీయ ఓటీటీ సిరీస్‌లోని 'లాలాగుండా బొమ్మైగల్' ఎపిసోడ్‌ ద్వారా తనలోని అసలైన నటిని పరిచయం చేసింది. ఆ తర్వాత తమిళంలో వచ్చిన 'లవర్' చిత్రంలో నటించి, విమర్శకుల నీరాజనాలు పొందడంతో పాటు మ్యాడ్ మూవీతో క్రేజ్ సంపాదించింది. తమిళంలో చేసిన ట్రూ లవర్, హ్యాపీ రాజ్ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చెన్నై లవర్ స్టోరీ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ కైవసం చేసుకుంది. Also read: ఏంటి తంబీ ఈ కలెక్షన్స్.. చెన్నై లవ్ స్టోరీ మూడు రోజుల పరిస్థితి ఇదే!  సినీ విశ్లేషకులు సైతం గౌరీ ప్రియ గురించి మాట్లాడుతూ తన కట్ అవుట్ చూసి ప్రేక్షకులు థియేటర్స్ వెళ్లేంత క్రేజ్ పొందినట్లే అని చెప్తున్నారు. గౌరీ ప్రియ అచ్చ తెలుగు అమ్మాయి. స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ. చెన్నై లవ్ స్టోరీ   సక్సెస్ మీట్‌లో సైతం  గౌరీ ప్రియ మూవీ సాధించిన విజయం, తన రోల్ కి వస్తున్న స్పందన చూసి కన్నీళ్లు పెట్టుకుంది. Sri Gouri Priya, Chennai Love Story< kiran Abbavaram
National Award-winning actor-director Rishab Shetty has revealed that he is a long time Spider-Man fan. Ahead of the release of Spider-Man: Brand New Day, the Kantara star featured in a special video celebrating the iconic Marvel superhero. In the clip, Rishab unexpectedly crosses paths with Spider-Man before sharing his admiration for the superhero, a character he says has been a favourite for years. Rishab, who earned widespread acclaim for Kantara and has since become one of Indian cinema's most celebrated actors, brings his own enthusiasm as a fan to the collaboration. The video arrives just days before Spider-Man: Brand New Day opens in cinemas, offering audiences a crossover moment between one of Indian cinema's biggest stars and one of the world's most enduring superheroes. Speaking about his love for Spider-Man, Rishab said, "I still remember watching Spider-Man for the first time in a single-screen theatre many years ago and instantly connecting with Peter Parker. He has always reminded me that it's okay to stumble, make mistakes, and even experience heartbreak, as long as we never lose the goodness within us." The Kantara actor added, "Spider-Man also teaches us that with great power comes great responsibility, and that lesson stays relevant no matter how old you are. Over the years, my love for Spider-Man has only grown stronger, and today, he's just as special to my children. In fact, they've already made me book tickets for Spider-Man: Brand New Day so we can all experience it together on the big screen." Spider-Man: Brand New Day is set to release on 30th July in India. The Tom Holland starrer will release in English, Hindi, Tamil, Telugu, Kannada and Malayalam.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమ స్వచ్ఛమైన జీవనది లాంటిదని, అది ఏ ఒక్కరి దగ్గరే ఆగిపోదని నిరూపించిన చిత్రం చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ  పెర్ ఫార్మెన్స్ కి థియేటర్ నుంచి ప్రతి ఒక్కరు కన్నీళ్లతో బయటకి వస్తున్నారు. యువత టార్గెట్ గా తెరకెక్కించినా ఫ్యామిలీస్ కూడా సబ్జెక్టు కి కన్నీటి అవుతున్నారు. నిన్న చాలా వరకు థియేటర్స్ హౌస్ ఫుల్. హైదరాబాద్ , విజయవాడ, గుంటూరు, తిరుపతి విశాఖపట్నం లాంటి ఏరియాస్ లో అయితే  బ్లాక్ లో టికెట్స్ అమ్మారంటే మూవీపై ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. ప్రీమియర్స్ నుంచే కలెక్షన్స్ సునామీని సృష్టించగా  మొత్తం మూడు రోజులకి వరల్డ్ వైడ్ గా 30 కోట్ల  కలెక్షన్స్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు  చెప్తున్నాయి. మరి ఈ జోరు ఇలాగే కొనసాగితే ఎండింగ్ కి బాక్స్ ఆఫీస్ వద్ద తన దైన మార్క్ చూపించడం ఖాయం. తొలి రోజే  ఇండియాలో  5.69 కోట్ల గ్రాస్  ఓవర్సీస్ 2.60 కోట్ల గ్రాస్‌ కలుపుకొని  8.29 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లని రాబట్టింది. రెండవ రోజు ఇండియా గ్రాస్ వసూళ్లు  12.02 కోట్లు కాగా,ఓవర్ సీస్   1.20 కోట్లు. దీంతో  రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 15.82 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించింది. తమిళనాడు, కేరళ మరియు మిగిలిన భారతీయ ప్రాంతాల నుంచి కూడా గణనీయమైన వసూళ్లు నమోదవుతున్నాయి. రవి నంబూరి దర్శకత్వంలో సాయి రాజేష్, ఎస్ కె ఎన్  30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా నాన్థియేట్రికల్ హక్కుల రూపంలోనే 35 కోట్ల భారీ బిజినెస్ జరగడం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ (Sony LIV) భారీ ధరకి  దక్కించుకుంది. Kiran abbavaram, Sri Gouri priya, Chennai Love Story
తమిళనాట సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి ఇటీవలే 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ వరకు ఎందరో స్టార్స్ వెండితెర నుంచి ప్రజా క్షేత్రంలోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే క్రమంలో కోలీవుడ్ వర్సటైల్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన తన అభిమానులను ఉద్దేశించి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పాటు, ఆయన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. తాజాగా అభిమానులు ఏర్పాటు చేసిన ఒక భారీ రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్, తన అభిమాన సంఘాల సభ్యులను ఉద్దేశించి కీలకమైన పిలుపునిచ్చారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ, "ఇంతమంది అభిమానులు ఒకే చోట సమావేశం కావడం అనేది సాదాసీదా విషయం కాదు. ఈ ఐక్యతలో ఒక అపారమైన శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఇప్పుడు ఒక సరైన లక్ష్యాన్ని అందించాల్సిన అవసరం వచ్చింది. కేవలం సినిమాల ఆడియో విడుదల వేడుకలు, ఫ్యాన్స్ మీట్‌లకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇకపై మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వామ్యం కావాలి" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ప్రతి అభిమాని తమ స్థానిక ప్రాంతాల్లోని ప్రజల అవసరాలను, చుట్టుపక్కల ఉండే పేద కుటుంబాల పరిస్థితులను స్వయంగా అర్థం చేసుకుని వారికి సాధ్యమైనంత వరకు సాయం చేయాలని ఆకాంక్షించారు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలను విశ్లేషిస్తున్న సినీ, రాజకీయ విశ్లేషకులు ఇది ఖచ్చితంగా విజయ్ పయనించిన రాజకీయ వ్యూహాన్నే తలపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. దళపతి విజయ్ కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి ముందు తన 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' ద్వారా ఇలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు, సంక్షేమ పథకాల పేరుతో క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరయ్యారు. ఇప్పుడు ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను సామాజిక సేవా మార్గంలోకి మళ్లించడం ద్వారా భవిష్యత్తు రాజకీయ అరంగేట్రానికి పునాదులు వేస్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది.      Dhanush, Political Entry, Thalapathy Vijay  
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సుధీర్ బాబు. కథల ఎంపికలో వైవిధ్యం చూపుతూ, ఫిట్‌నెస్, యాక్షన్ సన్నివేశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నారు.  2012లో వచ్చిన 'శివ మనసులో శృతి' చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమైన సుధీర్ బాబు, తన 14 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించారు. 'ప్రేమకథా చిత్రమ్', 'సమ్మోహనం' వంటి క్లాసిక్ హిట్స్‌తో పాటు 'నన్ను దోచుకుందువటే', 'శ్రీదేవి సోడా సెంటర్', 'మా నాన్న సూపర్‌హీరో' లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.  అయితే గతేడాది భారీ అంచనాలతో తెరకెక్కిన పాన్ ఇండియా పౌరాణిక మిస్టరీ చిత్రం 'జటాధర' బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయి విజయాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలో తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సుధీర్ బాబు, ఇప్పుడొక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్ యువ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా కథారచన, దర్శకత్వ బాధ్యతలను కూడా తమ భుజస్కంధాలపై వేసుకుంటున్నారు. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని 'RAPO 23'తో డైరెక్టర్ గా డెబ్యూ అవుతున్నట్లు ప్రకటించగా, మరోవైపు యంగ్ హీరో విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ'లతో దర్శకుడిగా నిరూపించుకున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం కూడా స్వీయ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇప్పుడు ఇదే క్రమంలో సుధీర్ బాబు కూడా మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సుధీర్ బాబు గత కొన్ని నెలలుగా ఒక విభిన్నమైన, పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌పై తీవ్రంగా కసరత్తు చేశారు. ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో తన స్వంత కథను సిద్ధం చేసుకున్న ఆయన, ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించబోతున్నారు. స్వయంగా కథ రాసుకుని, హీరోగా నటిస్తూ, డైరెక్షన్ కూడా చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.  కృష్ణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, సుపర్ స్టార్ మహేష్ బాబు అండదండలు ఉన్నప్పటికీ.. సుధీర్ బాబు ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన నటనతో మెప్పిస్తున్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ పడక చాలారోజులు అవుతుండటంతో, ఈసారి ఎలాగైనా గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.      Sudheer Babu, Directorial Debut, Actor Director, Tollywood  
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ 'డ్రాగన్'. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి అత్యంత కీలకమైన షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం ప్రొడక్షన్ డిజైనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఏకంగా యూరప్ దేశాలలోని వీధులు, పురాతన నిర్మాణాలను కళ్ళకు కట్టినట్లుగా తలపించేలా ఒక భారీ సెట్‌ను నిర్మించడం విశేషం. విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయడం కంటే మనదేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ వండర్‌ని సృష్టించాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన ఈ యూరప్ స్టైల్ వింటేజ్ సెట్‌లో ఎన్టీఆర్‌పై భారీ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసి చిత్రీకరిస్తున్నారు. సినిమా కథనంలో అత్యంత కీలకమైన మలుపు తిప్పే సన్నివేశాలుగా ఇవి నిలవనున్నాయని సమాచారం.  విజువల్స్‌ పరంగా హాలీవుడ్ స్థాయి అనుభూతిని అందించేందుకు సాంకేతిక బృందం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. ఈ యాక్షన్ బ్లాక్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులు నిజంగానే యూరప్‌లో ఉన్నారా అనేంతగా ఆశ్చర్యపోయేలా ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నారు. సాధారణంగానే ప్రశాంత్ నీల్ చిత్రాల్లో యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయి మాస్ ఎలివేషన్లను కలిగి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నీల్, ఇప్పుడు 'డ్రాగన్' మూవీ ద్వారా తన మార్క్ ఎలివేషన్స్‌ని, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కి తగినట్లుగా సరికొత్తగా మలుస్తున్నారు.  ఎన్టీఆర్ రా పవర్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ కలసి వెండితెరపై మైండ్ బ్లోయింగ్ మ్యాజిక్ క్రియేట్ చేయబోతుండటంతో ట్రేడ్ వర్గాల్లోను, ప్రేక్షక లోకంలోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ బజ్ నెలకొంది. ఎన్టీఆర్ సరికొత్త అవతారంలో కనిపించనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.     Jr NTR, Prashanth Neel, Dragon Shoot, Europe set  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేసే వార్త ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న 'పెద్ది' సినిమా చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు మణికట్టుకు సర్జరీ అవసరమని వైద్యులు నిర్ధారించడంతో, మెగాస్టార్ కుటుంబం కోయంబత్తూరుకు పయనమైంది.  హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసనతో కలిసి రామ్ చరణ్ కోయంబత్తూరు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ గంగా హాస్పిటల్ లో నేడు(జూలై 27) ఆయన మణికట్టుకు డాక్టర్లు సర్జరీ నిర్వహించనున్నారు. 'పెద్ది' సినిమాలో కుస్తీ నేపథ్యంలో సాగే రిస్కీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలోనే వైద్యులు వెంటనే సర్జరీ చేయించుకోవాలని సూచించినప్పటికీ.. సినిమా నిర్మాణం, ప్రమోషన్ల పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో చరణ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. చేతికి గాయం ఉన్నా, కట్టు కట్టుకుని ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు. చరణ్ చూపిన ఈ డెడికేషన్‌పై టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సర్జరీ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ కోలుకోవడానికి కొన్ని వారాల పాటు వైద్యులు బెడ్ రెస్ట్ రికమండ్ చేశారు. దీంతో చరణ్ తదుపరి ప్రాజెక్టుల చిత్రీకరణ షెడ్యూళ్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ 'RC17' షూటింగ్ కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. అయితే రామ్ చరణ్ పూర్తిగా కోలుకుని, ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.     Ram Charan, Wrist Surgery, Coimbatore, Peddi Movie, Chiranjeevi  
బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన ప్రతిష్టాత్మక చిత్రం 'మా ఇంటి బంగారం'. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని రీతిలో రికార్డు వసూళ్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సునామీ సృష్టించింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం రూ.100 కోట్ల మైలురాయిని, ఆ ప్రతిష్టాత్మక క్లబ్‌ను అందుకుని సంచలనం నమోదు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చారిత్రాత్మక రికార్డు వెనుక ప్రముఖ దార్శనిక రచయిత, దర్శకుడు రాజ్ నిడిమోరు అందించిన అద్భుతమైన కథ, స్క్రీన్‌ప్లే అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఈ మైండ్ బ్లోయింగ్ సక్సెస్ ఇచ్చిన కొండంత ఉత్సాహంతో, రాజ్ నిడిమోరు తన భాగస్వామి కృష్ణ డీకేతో కలిసి మరొక భారీ విభిన్నమైన మహిళా ప్రాధాన్యత కలిగిన లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు వేగవంతం చేశారు. ఈ క్రేజీ మరియు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం నేషనల్ క్రష్, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మికను కథానాయికగా ఎంపిక చేసుకున్నట్లు చిత్రసీమలో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజ్-డీకే ద్వయం ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యాంశాలు, సస్పన్స్ తో కూడిన ప్రధాన కథాంశాన్ని రష్మికకు పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. విలక్షణమైన పాత్రలకు పెట్టింది పేరైన ఈ దర్శక ద్వయం వినిపించిన కథలోని లైన్ రష్మికకు అమితంగా నచ్చడంతో, ఆమె కూడా ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించేందుకు తక్షణమే సుముఖత వ్యక్తం చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రాథమిక చర్చలు అత్యంత వేగంగా జరుగుతుండగా, త్వరలోనే ఈ మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సౌత్‌లో భారీ విజ‌యాలు అందుకున్న ర‌ష్మిక.. బాలీవుడ్‌లో సైతం యానిమల్ వంటి వరుస వందల కోట్ల భారీ బ్లాక్‌బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ తన తిరుగులేని సత్తాను చాటుకున్న రష్మిక, ప్రస్తుతం తెలుగులో తన భర్త విజయ్ దేవరకొండ సరసన 'రణబాలి' అనే భారీ పీరియాడికల్ డ్రామాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలోనే మోస్ట్ వాంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ మేకర్స్ అయిన రాజ్-డీకే కాంబినేషన్‌లో రష్మిక ఒక పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ రోల్ చేయబోతున్నారనే వార్త బయటకు రావడంతోనే చలనచిత్ర ప్రియులలో, ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కితే బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల తుఫాను ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.     Raj and DK Rashmika Mandanna Maa Inti Bangaram 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 ఆవనూనె లేదా ఆలివ్ నూనె.. గుండె జబ్బుల రోగులకు ఏ నూనె మంచిది తెలుసా.! ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.  ఆవనూనె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే విదేశీయులు,  ఆరోగ్య స్పృహ ఎక్కువ కలిగిన ధనవంతులు వంటల్లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. పైగా  ఆలివ్ నూనె గుండెకు మంచిదని అంటారు. ఆవ నూనె వందల సంవత్సరాల నుండి భారతీయ వంటకాలలో వాడుతున్నారు. కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఆవనూనెను ఉపయోగిస్తుంటారు.  మధ్యధరా ప్రాంతంలో ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే గుండె ఆరోగ్యానికి ఆవనూనె లేదా ఆలివ్ నూనె రెండింటో ఏది మంచిది? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. సరైన నూనె ఎంపిక ఎందుకు ముఖ్యం? ఒకప్పుడు నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని,  ఈ కారణంగా కొవ్వు ఎక్కువ వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోషకాహార నిపుణులు చెబుతున్న విషయం వేరు.. కొవ్వులో రెండు రకాలు ఉన్నాయని,  వీటిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి.  పదేపదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ , అధిక సంతృప్త కొవ్వులు గుండెకు హానికరం అని చెబుతారు. అయితే, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ , ఒమేగా-3 వంటి అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి , రక్తనాళాలలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే గుండె ఆరోగ్యం గురించి చర్చించేటప్పుడు ఆవ నూనె , ఆలివ్ నూనె రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారికి ఆలివ్ నూనె లేదా ఆవనూనె? గుండె జబ్బుల రోగులకు ఆలివ్ నూనెతో వంట చేయడం మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు , ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇందులో పాలీఫెనాల్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ ధమనులకు నష్టం కలిగించడంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె  మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో , చెడు కొలేస్ట్రాల్  ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు.  చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణం అవుతుందని చెబుతారు. అధికంగా ఆలివ్ నూనె తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ నూనె అన్ని రకాల వంటలకు మంచిదా? ఆలివ్ నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. భారతీయులు  ఆహారాన్ని  నూనెలో బాగా వేయిస్తారు, పోపు  వేస్తారు, లేదా ఎక్కువ సేపు అధిక వేడి మీద వండుతారు. ఇలాంటి పరిస్థితులలో, అధిక వేడి కారణంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, పోషకాలు తగ్గిపోతాయి. శుద్ధి చేసిన ఆలివ్ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఆవనూనె ఎందుకు ప్రత్యేకం.. ఆవ నూనె చాలా కాలంగా భారతీయ వంటకాలలో ఒక భాగంగా ఉంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  ఆవ నూనె వల్ల గుండెకు కలిగే సంభావ్య ప్రయోజనాలపై భారతీయ పరిశోధనలు కూడా జరిగాయి. సాంప్రదాయ ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అయితే ఆవ నూనెను మితంగా వాడాలి.                                    *రూపశ్రీ.  
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..! మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: ✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి? ✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది? ✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి? ✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి? ✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు? ✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ✅ యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి? ✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి.  
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది.  భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు  ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది.  దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి.  గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం,  మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.  అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది.  దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్   వంటివి తినేవారు చాలామంది ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు.  మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు.  కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు  శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం,  సుగర్ ఉంటాయి.  ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్,  చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా,  బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు,  ప్యాక్ చేసిన చట్నీలు,  ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు..   వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా  ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు,  బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ  మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు,  ఫ్లేవర్డ్ బటర్ లో  కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది.   అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం,  టెక్చర్ కోసం  కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి.   కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...