LATEST NEWS
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి.  అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..   జాతీయ స్థాయిలో కీలకంగా మారిన  ఇండియా కూటమితో   జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.    గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో  సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు.    [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు  కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన. సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి  ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని  విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు,  యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ,  పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన  నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు.   ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల  ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి..  కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని   స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి..  సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు.    [Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics,  Vijayasai Reddy announcement, Teluguone]
తమిళనాడు రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న అసభ్య,  ద్వంద్వార్థ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీ వేదికగా ‘ఆమె’పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  అసెంబ్లీలో పోలీసు శాఖ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్..  మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని  ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.   రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చని..  కానీ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం క్షమించరాని నేరమన్నారు. ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా  మహిళలను లక్ష్యంగా చేసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య  పదజాలం వాడటం  ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విజయ్..  అటువంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాగా అసెంబ్లీ వేదికగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం డిఎంకె అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ గత నెలలో జరిగిన  కావేరి నిరసనల సమయంలో   నటి,  త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని పరిశీలకలు అంటున్నారు.  త్రిషపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలపై గత  4న చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, తంజావూరుకు తరలించి విచారించిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత ఆయన స్టేషన్ బెైల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఈ నేపథ్యంలోనే  సీఎం విజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై నేరుగా అసెంబ్లీలో   ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, రాజకీయ హద్దులు దాటి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడే ధోరణి ఇకపై చెల్లదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు.  [CM Vijay Mass Warning On Untoward Comments women, Trisha remarks row, Udhayanidhi Stalin, Tamil Nadu Assembly, Vijay on women safety, double meaning comments]
తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారు.  ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, ముఖ్యంగా మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడం ద్వారా అధిష్ఠానం వద్ద తన పలుకుబడి ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్న రేవంత్ రెడ్డి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా గ్రిప్ సాధించారు, కొండా సురేఖ బర్త్ రఫ్ తరువాత.. పార్టీలో రేవంత్ వ్యతిరేకులలో, మరీ ముఖ్యంగా అసమ్మతి, అసంతృప్తి నేతల తీరులో, వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు గోచరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ బర్త్ రఫ్ అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారాయి.  ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడమే కాకుండా, రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవి విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని తాజాగా విస్పష్టంగా వెల్లడించి తనలో మార్పును తెలియజేశారు.  తనకు మంత్రిపదవి విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అంతే కాకుండా.. కొండా బర్త్ రఫ్ కు ముందు వరకూ.. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలతో అనుచిత సంబోధనలతో విరుచుకుపడిన కొండా సుశ్మిత.. తన తల్లి కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన తరువాత మీడియా ముందు భోరుమని విలపించారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సబబు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్  ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. తన లండన్ పర్యటన కారణంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆమె చెబుతున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి జోరందుకోకుండా నివారించడంలో వైఫల్యం కారణంగా పార్టీ హైకమాండే ఆమెను తప్పించిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలోనే జోరుగా సాగుతోంది. ఈ నెల 13న ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రత్యేక కోర్సు అభ్యసించేందుకు లండన్ బయలు దేరుతున్నారు. కనీసం ఆమె పది నెలల పాటు రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఇప్పటి వరకూ ఆమె స్థానంలో మరో ఇన్ చార్జిని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అంటు ఆమె అందుబాటులో ఉండని ఈ పది నెలల కాలం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలలో సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆధిపత్యం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.   [Revanth Reddy Tightens grip On Party And Government, Telangana Congress, Konda Surekha, Komatireddy Rajagopal Reddy, Cabinet Expansion, Telangana Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
A video featuring actor Ravi Mohan and Keneeshaa Francis has gone viral on social media, triggering another round of criticism against the actor. The footage shows the two smoking together, and several social media posts are alleging that they were consuming drugs. However, there is no verified evidence at this point to establish that what they were smoking was an illegal substance. The video has gained attention largely because it comes amid the actor’s highly publicised personal dispute with his estranged wife Aarti. Ravi Mohan and Aarti have been involved in an increasingly bitter public fallout, with statements and allegations from both sides becoming a recurring topic on social media. Ravi Mohan’s relationship with Keneeshaa has also remained under scrutiny ever since his separation from Aarti became public. Their association has attracted considerable discussion, with the singer herself facing criticism and online trolling over the relationship. The latest video has now added another layer to the ongoing controversy. While some users are strongly condemning Ravi Mohan over the footage, others are questioning whether the claims accompanying the video are being exaggerated without proper verification. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Vijay Deverakonda and Rashmika Mandanna are coming together for the first time post their marriage with Ranabaali. The movie directed by Rahul Sankritiyan is about a rebellion happened between 1876 - 1878 with Britishers. Vijay is playing the leading cheftain who runs his forces against the Britishers.  This is the first ever folk lore for the actor and Rashmika's photo with him close to the times did go viral. The movie shoot has been almost completed and makers have locked 16th October release date. Now, they announced that the first teaser will be unveiled on 9th September.    The film also stars international actor Mummy fame, Arnold Vosloo as Sir Theodore Hector, a British officer. Ajay-Atul are composing music for the film and their back ground score is impressive for the announcement. Mythri Movie Makers are producing the film with T-Series presenting it.  Vijay Deverakonda needs a big success at the box office to regain some of the lost market with his continuous underperformers. With Rashmika back as leading lady, the makers are expecting Geetha Govindham magic will work as it is not a complete out-of-box film like Dear Comrade.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనదైన మార్క్ దర్శకత్వంతో పాటు అద్భుతమైన విలనిజంతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ఎస్‌జే సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాను తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ అండ్ బ్లాక్‌బస్టర్ సినిమా 'ఖుషీ'కి, నేటి రాజకీయ పరిణామాలకు ఉన్న ఒక అపూర్వమైన కనెక్షన్‌ను ఆయన గుర్తుచేసుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కార్తీ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ యాక్షన్ సీక్వెల్ 'సర్దార్ 2' ప్రమోషన్స్‌లో భాగంగా హీరో మంచు మనోజ్ నిర్వహించిన ఒక టాక్ షోలో ఎస్‌జే సూర్య, కార్తీ పాల్గొన్నారు. ఈ సరదా సంభాషణలో ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. "నేను ఒకే కథతో తమిళంలో 'ఖుషీ' (2000), తెలుగులో 'ఖుషీ' (2001) చేశాను. అప్పట్లో నా దర్శకత్వంలో నటించిన ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కాగా, మరొకరు తమిళనాడులో సీఎం అయ్యారు" అంటూ చమత్కరించారు. ఈ వ్యాఖ్యలు వినగానే పక్కనే ఉన్న కార్తీ "వాట్ ఏ కనెక్షన్ సర్!" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. నిజానికి తమిళంలో దళపతి విజయ్, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకులుగా నటించిన 'ఖుషీ' చిత్రాలు రెండు పరిశ్రమల్లోనూ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఒకే దర్శకుడి చేతుల మీదుగా ఒరిజినల్, రీమేక్ చిత్రాలు చేసిన ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు తమ సొంత రాష్ట్రాల రాజకీయాల్లో అత్యున్నత స్థానాల్లోకి వెళ్లడం నిజంగా ఒక అరుదైన మైలురాయి అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఎస్‌జే సూర్య కేవలం దర్శకుడిగానే కాకుండా, నటుడిగా కూడా వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. 'సర్దార్ 2' చిత్రంలో ఆయన 'బ్లాక్ డాగర్' అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రంలో 'భైరవుడు'గా మెప్పించిన ఎస్‌జే సూర్య, ఈ కొత్త పాత్రలో అంతకుమించిన తీవ్రమైన విలనిజం చూపిస్తారని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. తన డబ్బింగ్ తానే చెప్పుకుంటూ ప్రతి పాత్రకు ప్రాణం పోసే ఎస్‌జే సూర్య, ఒకవైపు తెరపై విలన్‌గా మెప్పిస్తూనే.. మరోవైపు తన కెరీర్‌లోని గోల్డెన్ మెమొరీస్‌ను నేటి పొలిటికల్ రియాలిటీతో ముడిపెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.     [SJ Suryah Comments On Pawan Kalyan, SJ Suryah Thalapathy Vijay Kushi Movie Coincidence, Pawan Kalyan Deputy CM Vijay Political Connection, Karthi Sardar 2 Interview SJ Suryah, Telugu Film Industry Latest Viral Cinema News]
భారతీయ సినీ పరిశ్రమలో పాత్ర ఏదైనా సరే.. అందులో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కట్టిపడేసే నటులలో మనోజ్ బాజ్‌పాయ్ ఒకరు. గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్, సత్య నుంచి రీసెంట్‌గా డిజిటల్ స్పేస్‌లో సంచలనాలు సృష్టిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వరకు ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తెరపై నటుడు కనిపించకుండా కేవలం ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా చేయడం ఆయన ప్రత్యేకత. ఇప్పుడు ఈ వర్సటైల్ యాక్టర్ తన సినీ ప్రయాణంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అలాగే ఎంతో కఠినమైన ఛాలెంజ్‌కు సిద్ధమవుతున్నట్లు బి టౌన్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీ జీవిత నేపథ్యం లేదా ఆయన చారిత్రక ఘట్టాల ఆధారంగా తెరకెక్కే ప్రాజెక్ట్‌లో మనోజ్ బాజ్‌పాయ్.. గాంధీజీ పాత్రను పోషించబోతున్నారనే వార్త ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహాత్మా గాంధీ లాంటి చారిత్రక ఐకానిక్ వ్యక్తిత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటే సాదాసీదా విషయం కాదు. ఇది కేవలం బాడీ లాంగ్వేజ్ లేదా మేకప్‌తో ముడిపడి ఉన్న అంశం మాత్రమే కాదు. నడక, సంభాషణల శైలి, ముఖ కవళికలతో పాటు ఆ యుగం నాటి గాంభీర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెరపై ప్రతిబింబించాలి. భారతీయ ప్రేక్షకుల మనసుల్లో గాంధీజీ ఇమేజ్ చాలా స్పష్టంగా ముద్రపడి ఉన్నందున, ఈ పాత్రను రీ-క్రియేట్ చేయడం మనోజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా నిలవనుంది. గతంలో కూడా అనేకమంది దిగ్గజ నటులు గాంధీజీ పాత్రల్లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే మనోజ్ బాజ్‌పాయ్ తనదైన నాచురల్ యాక్టింగ్ స్టైల్‌తో ఈ పాత్రకు ఎలాంటి కొత్త కోణాన్ని జోడిస్తారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ సీనియర్ నటుడికి ఇది మరొక మైలురాయిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే అవకాశముంది. మనోజ్ బాజ్‌పాయ్ గాంధీజీగా కనిపిస్తే మాత్రం థియేటర్లలో విజువల్ డ్రామా విశ్వరూపం చూడటం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.       [Manoj Bajpayee Mahatma Gandhi Role, Manoj Bajpayee Transformation Movie, Manoj Bajpayee Upcoming Bollywood Movie, Manoj Bajpayee Career Best Role, Indian Cinema Historical Biopics]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘వేదం’ సినిమా టాలీవుడ్‌లో ఎంతటి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేబుల్ రాజుగా బన్నీ చూపించిన అద్భుతమైన నటన, క్రిష్ ఎమోషనల్ మేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం వచ్చి దాదాపు 16 ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఇప్పుడు మళ్లీ బన్నీ కాంపౌండ్‌లో క్రిష్ పేరు గట్టిగా వినిపిస్తుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో డైరెక్టర్ క్రిష్ ఒక భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బిగ్ ఆఫర్ వెనుక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సానుకూల ప్రోత్సాహం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 'వేదం' సమయం నుంచే బన్నీ, క్రిష్ మధ్య మంచి మైత్రి ఉందనే సంగతి తెలిసిందే. ఈ సారి క్రిష్ ఒక సరికొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. దేవి నవరాత్రుల నేపథ్యం మరియు పౌరాణిక కథాంశంతో ఒక భారీ యానిమేషన్ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు 'మహిషాసురమర్దిని' అనే శక్తివంతమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో 'గమ్యం', 'వేదం', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి వైవిధ్యమైన చిత్రాలతో క్రిష్ తన ప్రతిభను చాటుకున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన దర్శకత్వం వహించిన కొన్ని ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ, క్రిష్ మేకింగ్ మరియు విజువల్ డ్రామా పై ఇండస్ట్రీలో ఉన్న గౌరవం తగ్గలేదు. ఈ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అవకాశం రావడం ఆయన కెరీర్‌కు మంచి బూస్టింగ్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో డివోషనల్,  పౌరాణిక యానిమేషన్ చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలో విశేష ఆదరణ లభిస్తోంది. స్టార్ క్యాస్టింగ్‌తో సంబంధం లేకుండా బలమైన కాన్సెప్ట్, పురాణ కథలతో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకునే గీతా ఆర్ట్స్, క్రిష్ కాంబోలో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ విజువల్ వండర్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని అల్లు అర్జున్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు సినీ ప్రియులను 90ల నాటి తీపి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లేందుకు ఓ సరికొత్త వింటేజ్ విలేజ్ డ్రామా సిద్ధమవుతోంది. అభిషేక్, కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'గోల్డ్ స్పాట్'. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను చిత్ర బృందం ఈరోజు అధికారికంగా విడుదల చేసింది. విజువల్స్ పరంగా ఈ గ్లింప్స్ ప్రేక్షకుల మనసులను హత్తుకుంటోంది. ర్యాడిక్స్ సినిమాస్ పతాకంపై రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని కథ, స్క్రీన్‌ప్లే మరియు సంభాషణలు అందించారు. ఆయన శిష్యుడు వేణు కార్తికేయన్ ఈ వింటేజ్ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా పరిచయమవుతుండటం విశేషం. పచ్చని పల్లెటూరి వాతావరణం, టీ కొట్లు మరియు స్నేహబంధాల కలబోతగా ఈ ఫస్ట్ లుక్ విజువల్స్ ఎంతో రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. విడుదలైన గ్లింప్స్ వీడియో ఆధారంగా, ఈ కథ బాల్యం, స్నేహం మరియు చిన్ననాటి ప్రేమానుబంధాల చుట్టూ తిరుగుతుందని స్పష్టమవుతోంది. చిన్నప్పుడు ఒకే ఊరిలో కలిసి ఆడుకుంటూ పెరిగిన స్నేహితులు, పెద్దయ్యాక మళ్ళీ అదే ప్రదేశానికి చేరుకున్నప్పుడు కలిగే భావోద్వేగాలను చాలా సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. 90వ దశకంలో పెరిగిన ప్రతి ఒక్కరికీ ఈ సీన్లు తమ సొంత అనుభవాలను గుర్తుచేసేలా ఉన్నాయి. ఇటీవలే క్లాసిక్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన రూరల్ డ్రామాలు టాలీవుడ్‌లో వరుస విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాటి గ్రామీణ వాతావరణం, అమాయకత్వంతో కూడిన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అదే తరహాలో రూపొందుతున్న 'గోల్డ్ స్పాట్' కూడా కచ్చితంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 'గోల్డ్ స్పాట్' ఫస్ట్ లుక్ గ్లింప్స్ నెటిజన్ల నుంచి మంచి స్పందనను రాబడుతోంది. సహజమైన లొకేషన్లు, ఆహ్లాదకరమైన విజువల్స్ పట్ల సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో వింటేజ్ ఫీల్‌తో వస్తున్న ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతానికి మేకర్స్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచినప్పటికీ, విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. అతి త్వరలోనే ఈ మూవీ టీజర్, ట్రైలర్ మరియు థియేట్రికల్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు సమచారం.     [Gold Spot Movie, Gold Spot First Look, Dushyanth Katikaneni, Gold Spot Glimpse, Telugu Movie News]
బాలీవుడ్ అందాల భామ అమీషా పటేల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో ఆమె డేటింగ్‌లో ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ అఫైర్ రూమర్లపై ఈ భామ ఎంతో ఘాటుగా స్పందించి, రూమర్లు క్రియేట్ చేసిన నెటిజన్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చారు. ముంబైలోని ఓ ప్రఖ్యాత హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో అమీషా, హార్దిక్ పాండ్యా కలిసి కనిపించారు. ఆ సమయంలో తన మిత్రులకు హార్దిక్‌ను పరిచయం చేస్తూ అమీషా అతడి భుజంపై చేయి వేశారు. ఈ చిన్న క్షణాన్ని కెమెరాలో బంధించిన కొందరు నెటిజన్లు, ఆ వీడియో ఆధారంగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు షికార్లు చేసేలా పోస్టులు పెట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమీషా పటేల్, సదరు నెటిజన్ చేసిన పోస్ట్‌ను స్క్రీన్‌షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. "అవును, నువ్వు చెప్పింది నిజమే.. దేవుడా ఎంత కరెక్ట్‌గా కనిపెట్టావ్! నా చేయి అతనిపై నిజంగానే చాలా రొమాంటిక్‌గా ఉంది" అంటూ మొదట ఎద్దేవా చేశారు. అనంతరం మరింత కారంగా స్పందిస్తూ.. "నాకు నువ్వెవరో తెలియదు కానీ, నీ జీవితంలో కనీసం ఒక్క అమ్మాయి కూడా నీకు మంచి ఫ్రెండ్‌గా లేదని కచ్చితంగా చెప్పగలను. ఫ్రెండ్స్ మధ్య ఉండే సాధారణ సంభాషణలను ఇలాంటి రొమాంటిక్ కోణంలో చూడటం మానసిక వైకల్యానికి నిదర్శనం. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే ముందు ఒక అమ్మాయితో స్నేహం చేయడం నేర్చుకో" అంటూ గట్టిగా చురకలంటించారు. 'పవన్ కళ్యాణ్' సరసన 'బద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అమీషా పటేల్, ఆ తర్వాత నాని, నరసింహుడు వంటి చిత్రాలతో అలరించారు. హిందీలో 'గదర్' లాంటి పరిశ్రమ రికార్డులను సృష్టించిన భారీ బ్లాక్‌బస్టర్‌తో తన మార్కెట్‌ను నిలబెట్టుకున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ సీనియర్ నటి ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. మరోవైపు క్రికెటర్ హార్దిక్ పాండ్యా గతంలో నటి నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను మోడల్ మహికా శర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, గతేడాదే వీరు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సాధారణ ఫ్రెండ్‌షిప్ పిలుపును రొమాంటిక్ అఫైర్‌గా చిత్రీకరించడంపై అమీషా ఇచ్చిన ఈ బోల్డ్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్‌కు బాలీవుడ్ అభిమానులు, నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. నిజాలు తెలుసుకోకుండా ట్రోల్ చేసే వారికి ఈ తరహా స్పందన సరైనదంటూ కామెంట్లు చేస్తున్నారు.   [Ameesha Patel, Hardik Pandya, Ameesha Patel Hardik Pandya Affair, Ameesha Patel Instagram Counter, Bollywood Gossip]
OM starring Dhanush, Mammootty, Sai Pallavi, Sreeleela in the direction of Amaran fame Rajkumar Periasamy. The movie is set around red sandalwood smuggling in Chittoor and Tamil Nadu border, mainly, in Seshadri Hills. The makers have already released one glimpse introducing Dhanush's role and Alakaa lova song has become a huge chartbuster.  Now, on the birthday of Mammootty, they just dropped a brilliant teaser showcasing Mammootty character's journey from being a simple smuggler to the kingpin. Even at the age of 75, Mammootty looks stunningly fresh, stylish and has an aura of his own to become the character.  He recently won National Award for his performance as a Chathan in Bramayugam and here, he is back to aura farming as a mob head and his look is designed to fit him perfectly. With many Tamil audiences still having his Thalapathi character fresh in mind, this one is going to be a great callback and maybe an extension.  The movie shoot is going on at a rapid pace and producers did announce the film could be released in two chapters. Currently, this film is titled as OM – Chapter 1: Udhiram – The Blood Wood. The makers did announce 16th October release but Jailer 2 is releasing on 15th October. So, would they go for a new date or not is to be seen.  The movie is produced by Shraddha Agrawal, Dhanush and Azmat jagmag with a high budget. The content released till date from the movie have been highly positive suggesting a remarkable blockbuster for Dhanush and grand return to Mammootty in Tamil.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
జీవితంలో మనం అనుకునే దారులు ఒకటైతే, మన ప్రయాణం మనల్ని తీసుకెళ్లే గమ్యం ఇంకోటి అవుతుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఒక సాధారణ భారతీయ యువతి చిత్ర పరిశ్రమలో సృష్టించిన సంచలనం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తూ, జీవితంలో కార్పొరేట్ ఉద్యోగం చేయాలని కలలు కనిన ఆ యువతి, అనుకోకుండా ఒక గ్లోబల్ విజేతగా రూపాంతరం చెందింది. యూకేలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదివిన అనుప్రియ విజయగాథ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అనుప్రియ, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక స్విట్జర్లాండ్‌లో ఆర్ట్ ఇండస్ట్రీలో ఒక మంచి ఉద్యోగం చేయాలని ప్రణాళిక వేసుకుంది. అయితే ఆమె చదువు ఆఖరి సంవత్సరంలో టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించిన గొప్ప మహానుభావుల జీవితాలపై పరిశోధన చేయడం ప్రారంభించింది. ఈ అకడమిక్ రీసెర్చ్‌లోనే ఆమె యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను లోతుగా అధ్యయనం చేసింది. ఆ పరిశోధనలోనే స్టీవ్ జాబ్స్‌కు భారత్‌లోని నీమ్ కరోలీ బాబాతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం, ఆయన ఉత్తరాఖండ్‌లోని కైంచి ధామ్ సందర్శించిన విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. ప్రపంచాన్ని మార్చిన ఒక విదేశీ దిగ్గజ టెక్ వ్యవస్థాపకుడికి, ఒక భారతీయ సాధువుకు మధ్య ఉన్న ఈ ఆసక్తికరమైన సంబంధం అనుప్రియను తీవ్ర ఆలోచనలో పడేసింది. ఒక విదేశీ దిగ్గజం ద్వారా మన భారతీయ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలుసుకోవడం ఏమిటి అనే ప్రశ్న ఆమెను నిద్రాహారాలు మానకుండా బాబా జీవితంపై మరింత లోతుగా పరిశోధించేలా చేసింది. చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన అనుప్రియ నగర్‌కు అనుకోకుండా దర్శకుడు విశాల్ చతుర్వేదితో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పటికే నీమ్ కరోలీ బాబా బాల్యం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన కథను ప్రపంచానికి చూపించాలనే తపనతో, అనుప్రియ తుది నిర్ణయం తీసుకుంది. యూకేలో విద్యార్థిగా ఉన్నప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి తను సొంతంగా దాచుకున్న కష్టార్జితాన్ని ఈ సినిమా ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టడానికి ధైర్యం చేసింది. అలా లక్ష్మీ నారాయణ్ (నీమ్ కరోలీ బాబా అసలు పేరు) చిన్ననాటి జీవిత కథ ఆధారంగా ‘హనుమాన్ అంశ్’ అనే భక్తిరస చలనచిత్రం ప్రాణం పోసుకుంది. అత్యంత పరిమితమైన బడ్జెట్‌తో, కేవలం రూ. 2 కోట్ల కంటే తక్కువ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు థియేటర్లలో అతి సాధారణ స్పందనతో ప్రారంభమైన ఈ చిత్రం, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో అనూహ్యమైన ప్రభంజనాన్ని సృష్టించింది. కేవలం 31 రోజుల వ్యవధిలోనే ఈ సినిమా భారతదేశంలో ఏకంగా రూ. 122 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి బాక్స్‌ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. సాధారణంగా కళాఖండాలను సేకరించే సాంప్రదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనుప్రియ నిర్ణయం చూసి మొదట్లో ఆమె కుటుంబ సభ్యులు విస్తుపోయినప్పటికీ, ఈ ఊహించని చారిత్రాత్మక విజయం తర్వాత ఆమెను చూసి ఎంతో గర్వపడ్డారు. ఈ చిత్రాన్ని కేవలం లాభాల కోసం వ్యాపార దృక్పథంతో తీయలేదని, నీమ్ కరోలీ బాబా దివ్యమైన కథలను మరియు ఆయన విశిష్ట బోధనలను నేటి యువతరానికి అందించడమే తన ప్రధాన లక్ష్యమని అనుప్రియ ఎంతో నమ్మకంగా వెల్లడించింది. విశాల్ చతుర్వేది రాసిన ఆధ్యాత్మిక జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా నిర్మించబోతుండగా, అందులో మొదటి భాగంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ సినీ చరిత్రలోనే ఒక సంచలనాత్మక ఘట్టంగా నిలిచిపోయింది.     [Anupriya Nagar, Hanuman Ansh, Steve Jobs Inspiration, Neem Karoli Baba Movie, Hanuman Ansh Box Office, 122 Crore Success]
Bethlehem Kudumba Unit released to an unanimous positive reception with people enjoying the chemistry between leads Nivin Pauly, Mamitha Baiju. The movie's core comical characters like Glikson have clicked big time across the languages with the love story. Hence, it is set to become Malayalam's new Industry Hit.  The movie has collected Rs.265.71 crores gross worldwide and it is just 38-40 crores away from crossing last year's Onam IH, Lokah Part-1: Chandra. It is interesting to note that another Onam release is set to break the records of previous one. On Sunday, movie collected Rs.8.10 crores gross from India with Kerala contributing Rs.6.82 crores gross.  This is sensational trending for any Malayalam film as Bethlehem is continuously breaking every existing record in the book. Looking at the Monday bookings, the trade analysts are predicting the film to cross existing Kerala highest Vaazha II's Rs.129.23 crores gross, by this weekend as it is already at Rs.117.22 crores gross.  Directed by Girish AD, the movie has become a tremendous all-time blockbuster for Nivin Pauly post Premam, announcing his big comeback after Sarvam Maya. Mamitha Baiju has also proven to be a big box office sensation as her Vishwanath and Sons, Jana Nayagan have also collected big numbers at the box office.  The makers have released Telugu and Tamil dubbed versions last weekend and they are adding good value to the engine blowing on full throttle. Looks like the combination will be asked to be repeated very soon, looking at such incredible box office returns.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మానవ మెదడు వికాసం టీనేజ్ పూర్తికాగానే ఆగిపోదని, యుక్తవయస్సు మరియు 20ల మధ్యకాలం వరకు నిరంతరం మారుతూనే ఉంటుందని శాస్త్రజ్ఞులకు ఇప్పటికే తెలుసు. అయితే ఈ సుదీర్ఘ ఎదుగుదల కాలంలో మన జ్ఞాపకశక్తి సర్క్యూట్లు ఎలా పరిపక్వత చెందుతాయో వివరిస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఒక సంచలనాత్మక జీవశాస్త్ర ప్రక్రియను వెల్లడించారు. ప్లోస్ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, లేట్ అడోలెసెన్స్ లేదా లేట్ టీనేజ్ దాటాక మెదడులోని ఒక ముఖ్యమైన జ్ఞాపకశక్తి ప్రాంతం ఊహించని రీతిలో రీమోడలింగ్ లేదా పునర్నిర్మాణానికి గురవుతుందని గుర్తించారు. ఈ మార్పుల వల్ల చిన్నతనంలో లేదా టీనేజ్ ప్రారంభంలో ఏర్పడిన జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం తాత్కాలికంగా కష్టమవుతుందని, తరువాత కాలంలో అవి తిరిగి గుర్తుకొచ్చినా పూర్తి వివరాలతో కాకుండా కేవలం అనుభూతి ప్రాధాన్యతతో మాత్రమే గుర్తుంటాయని సైంటిస్టులు రుజువు చేశారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు మెదడులోని  రెట్రోస్ప్లేనియల్ కార్టెక్స్  అనే కీలక ప్రాంతంపై దృష్టి సారించారు. సుదీర్ఘకాల జ్ఞాపకాలను భద్రపరచడంలో, వాటిని క్రమబద్ధీకరించడంలో ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి సర్క్యూట్‌లను స్థిరంగా ఉంచడానికి  పెరిన్యూరోనల్ నెట్స్  అని పిలిచే రక్షణ వలయం వంటి నిర్మాణాలు సహాయపడతాయి. అయితే లేట్ అడోలెసెన్స్ సమయంలో ఈ రక్షణ వలయాలు తాత్కాలికంగా క్షీణించి, ఆ తర్వాత అడల్ట్‌హుడ్ లేదా పూర్తి పెద్దవయస్సు వచ్చేసరికి తిరిగి పునర్నిర్మించబడతాయని పరిశోధనలో తేలింది. విశేషమేమిటంటే, ఈ మార్పులు కేవలం రెట్రోస్ప్లేనియల్ కార్టెక్స్‌లోనే సంభవించాయి తప్ప, నిమిషాల వ్యవధిలో జ్ఞాపకాలను ప్రాసెస్ చేసే హిప్పోకాంపస్‌లో నమోదు కాలేదు. ఈ జీవశాస్త్ర మార్పులు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. చిన్నతనంలో లేదా ప్రారంభ అడోలెసెన్స్‌లో నేర్చుకున్న అనుభవాలు, లేట్ అడోలెసెన్స్ సమయానికి వచ్చేసరికి సరిగ్గా గుర్తుకురాకపోవడాన్ని గమనించారు. అయితే పెద్దయిన తర్వాత అదే జ్ఞాపకాలు మళ్లీ బయటకు వచ్చినా, వాటిలోని పక్కా వివరాలు మాయమై కేవలం ఆ సంఘటన వెనుక ఉన్న భావోద్వేగం మాత్రమే మిగులుతుందని తేలింది. మానవులలో కనిపించే రెమినిసెన్స్ బంప్  అనే దృగ్విషయానికి ఈ జీవ ప్రక్రియే మూలకారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. పెద్దయ్యాక మనకు టీనేజ్ అనుభవాలు ఎక్కువగా గుర్తుకురావడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ మానవ మెదడు వికాసంపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చివేస్తోంది. యుక్తవయస్సులో పాత జ్ఞాపకాలు తాత్కాలికంగా మసకబారడం వెనుక ఒక గొప్ప అంతర్లీన ప్రయోజనం ఉందనేది పరిశోధకుల అభిప్రాయం. చిన్ననాటి జ్ఞాపకాల కంటే, పెద్దయ్యే కొద్దీ ఎదురయ్యే కొత్త సవాళ్లు మరియు కొత్త జీవిత పరిస్థితులకు త్వరగా అలవాటు పడటానికి మెదడు పాత జ్ఞాపకాల యాక్సెస్‌ను తగ్గించి కొత్తవాటికి ప్రాధాన్యత ఇస్తుంది. మెదడు తను చేసే ఈ అద్భుతమైన వైరింగ్ సర్దుబాటు ద్వారానే మనుషులు వయస్సుతో పాటు కొత్త పరిజ్ఞానాన్ని, అనుభవాలను సులువుగా స్వీకరించగలుగుతున్నారు.       How brain maturation affects memory recall, Einstein study on adolescent brain memory changes.
    సిజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు  క్లోజాపైన్  అనే యాంటీసైకోటిక్ ఔషధం ఒక అత్యంత శక్తివంతమైన సంజీవనిలా పనిచేస్తుంది. ఇతర మందులకు లొంగని కఠినమైన వ్యాధి లక్షణాలను సైతం నియంత్రించడంలో ఇది ఎంతో ప్రభావవంతమైనదని వైద్య ప్రపంచం కొనియాడుతుంది. అయితే ఈ అద్భుతమైన మందు వాడే రోగులలో విపరీతమైన ఆకలి పెరగడం, తీవ్రమైన బరువు పెరగడం, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ మరియు టైప్,2 డయాబెటిస్ వంటి జీవక్రియ సమస్యలు తలెత్తడం అత్యంత ప్రధానమైన లోపంగా మారింది. బరువు పెరుగుతామనే భయంతో లేదా శారీరక రుగ్మతల వల్ల చాలామంది రోగులు మధ్యలోనే ఈ మందును వాడటం ఆపివేసి, తిరిగి తీవ్రమైన మానసిక అనారోగ్యం బారిన పడుతున్నారు. దశాబ్దాలుగా వైద్యులను వేధిస్తున్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా అమెరికాలోని యుటి సౌత్‌వెస్టర్న్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు సంచలనాత్మక పరిశోధనా వివరాలను ప్రముఖ  నేచర్ కమ్యూనికేషన్స్  జర్నల్‌లో ప్రచురించారు. శాస్త్రవేత్తల బృందం చేపట్టిన ఈ ప్రీక్లినికల్ అధ్యయనం ప్రకారం, క్లోజాపైన్ ఔషధం మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతుందో స్పష్టమైన సైంటిఫిక్ ఆధారాలతో బహిర్గతం చేసింది. మన మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో ఉండే  మెలనోకార్టిన్ 4 రిసెప్టర్  లేదా MC4R నైరూప్య నాడీ కణాలు శరీరంలో ఆకలిని అణచివేసి, కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే ఈ న్యూరాన్లలో  Kir7.1  అనే పొటాషియం ఛానల్స్ బ్రేకింగ్ సిస్టమ్‌లా పనిచేస్తాయి. క్లోజాపైన్ మరియు రిస్పెరిడోన్ వంటి మందులను శరీరానికి అందించినప్పుడు, అవి MC4R మరియు Kir7.1 మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలపరిచి, ఆకలిని నివారించే నాడీ వ్యవస్థ కార్యకలాపాలను పూర్తిగా నిష్క్రియం చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మెదడు ఆకలి సంకేతాలను ఆపలేక రోగులు ముఖ్యంగా రాత్రి వేళల్లో మితిమీరి ఆహారం తీసుకునేలా ప్రేరేపించబడుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో, 12 వారాల పాటు క్లోజాపైన్ మందును అందించినప్పుడు ఎలుకలు విపరీతంగా ఆహారాన్ని తిని, కొవ్వు పెరిగి, ఫ్యాటీ లివర్ మరియు ఇన్సులిన్ నిరోధకతను సంతరించుకున్నాయి. మెదడులోని ఈ సంకేత వ్యవస్థను పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు Setmelanotide మరియు ML418 అనే ప్రయోగాత్మక మందులను పరీక్షించారు. Kir7.1 పొటాషియం ఛానల్ బ్లాకర్ ఆధారిత చికిత్సను అందించినప్పుడు ఎలుకలలో ఆహార వినియోగం తగ్గి, బరువు గణనీయంగా నియంత్రణలోకి వచ్చింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆకలి అణచివేసే మార్గాన్ని బ్లాక్ చేయడం వల్ల క్లోజాపైన్ యొక్క అసలైన మానసిక చికిత్స సామర్థ్యం లేదా సైకోసిస్ నియంత్రణ శక్తి కొంచెం కూడా తగ్గకపోవడం గమనార్హం. ఈ నూతన పరిశోధన భవిష్యత్తులో మానసిక రోగుల సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. క్లోజాపైన్ వాడే బాధితులు మానసికంగా కోలుకుంటూనే, శారీరక బరువు మరియు జీవక్రియ రుగ్మతల బారిన పడకుండా కాపాడే కొత్త కాంబినేషన్ ఔషధాల తయారీకి ఈ అధ్యయనం పునాది వేసింది. డాక్టర్ చెన్ ల్యూ నాయకత్వంలోని శాస్త్రవేత్తల బృందం వెల్లడించిన ఈ బ్రెయిన్ సిగ్నలింగ్ మెకానిజం, ప్రపంచవ్యాప్తంగా సిజోఫ్రెనియా రోగులకు మెరుగైన, సురక్షితమైన ఉజ్జ్వల భవిష్యత్తును ప్రసాదించబోతోంది. A southwestern study on clozapine side effects,brain pathway explains antipsychotic weight gain.
    ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను వేధిస్తున్న అత్యంత తీవ్రమైన ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యలలో క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా సిఓపిడి ప్రధానమైనది. ఊపిరితిత్తులలో గాలి సరిగ్గా ఆడకపోవడం, నిరంతరం ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం అత్యంత కష్టంగా మారడం వల్ల రోగులు భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకూ గురవుతుంటారు. సాధారణంగా సిఓపిడితో బాధపడేవారు దీర్ఘకాలికంగా రకరకాల ఇన్హేలర్లు, యాంటీబయోటిక్స్ మరియు ఊపిరితిత్తుల వ్యాయామాలపై ఆధారపడుతుంటారు. అయితే, ఇటీవల వెలువడిన ఒక సరికొత్త అంతర్జాతీయ వైద్య పరిశోధన ప్రకారం, నవ్వు లేదా లాఫ్టర్ థెరపీ ద్వారా సిఓపిడి రోగులు ఎంతో సులువుగా ఊపిరి పీల్చుకోవచ్చని, వారి ఊపిరితిత్తుల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. నిరంతరం మందులు వాడటమే కాకుండా, నవ్వును ఒక సహజమైన చికిత్సా మార్గంగా అనుసరించడం వల్ల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి జీవిత నాణ్యత ఆశ్చర్యకరంగా పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. యురోపియన్ లంగ్ ఫౌండేషన్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ నివేదికల ప్రకారం, సిఓపిడి మరియు ఇతర దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న 169 మంది రోగులపై చేపట్టిన 5 వేర్వేరు సమగ్ర పరిశోధనా అధ్యయనాల ఆధారంగా ఈ ఫలితాలను ప్రామాణీకరించారు. నవ్వడం వల్ల శరీరంలో డయాఫ్రమ్ మరియు ఛాతీ కండరాలు వేగంగా సంకోచించి విస్తరిస్తాయి, ఇది ఒక రకమైన సహజమైన వ్యాయామంగా పనిచేస్తుంది. ఉల్లాసంగా నవ్వినప్పుడు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పాత, నిలిచిపోయిన గాలి బయటకు వెళ్లి, పవిత్రమైన ప్రాణవాయువు లోపలికి చేరుతుంది. లాఫ్టర్ యోగా మరియు స్టిమ్యులేటెడ్ లాఫ్టర్ థెరపీ పొందిన 100 శాతం రోగులలోనూ మానసిక ఆందోళన, నిరాశ తగ్గడమే కాకుండా వారి శ్వాసక్రియలో సుమారు 15% నుండి 20% వరకు స్పష్టమైన పురోగతి కనిపించిందని డేటా స్పష్టం చేస్తోంది. నవ్వు అనేది కేవలం పెదవులపై విరిసే పువ్వు మాత్రమే కాక, ఊపిరితిత్తుల సాంద్రతను పెంచే దివ్యౌషధమని పరిశోధకులు పేర్కొన్నారు. నవ్వు అనేది మన నాడీ వ్యవస్థపై తక్షణమే సానుకూల ప్రభావం చూపుతుంది. సిఓపిడి రోగులు శ్వాస సరిగ్గా ఆడక తీవ్రమైన పానిక్ లేదా ఆందోళన స్థితికి వెళ్లినప్పుడు, లాఫ్టర్ థెరపీ వారి మెదడులో ఎండోర్ఫిన్లను విడుదల చేసి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 15 నుండి 20 నిమిషాల పాటు గ్రూప్ లాఫ్టర్ సెషన్స్ లేదా వినోదాత్మక లాఫ్టర్ ఎక్సర్‌సైజెస్‌లో పాల్గొన్న రోగులలో నిరాశ లక్షణాలు ఏకంగా 30% వరకు తగ్గాయని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, వారి రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై తరచూ వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తీవ్రత దాదాపు 25% మేరకు తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి. శ్వాస సమస్యలతో కృంగిపోయే రోగులకు నవ్వు అనేది ఉచితంగా లభించే ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన చికిత్సగా రూపాంతరం చెందింది.     How does laughter therapy help COPD lungs. Medicalxpress COPD laughter study benefits.
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ , సాఫ్ట్ టిష్యూలకు గాయాలవడం వల్ల ఈ నొప్పి ఏ వయస్సు వారికైనా రావచ్చు. దీర్ఘకాలం పాటు వేధించే ఈ మోకాళ్ల నొప్పి మనుషులను శారీరకంగా, ఆర్థికంగా , మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. అయితే ఈ నొప్పి రాగానే నేరుగా సర్జరీ అవసరం పడుతుందని భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్స కంటే ముందే అసలు ఈ మోకాళ్ల నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో మరియు దానిని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే.. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు.. సాధారణంగా 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో మోకాళ్ల నొప్పి రావడానికి ఆస్టియోఆర్థరైటిస్ ప్రధాన కారణం. ఇందులో మోకాలి జోళ్లలోని కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల మోకాళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ రకమైన నొప్పి మోకాలి కింద లేదా ఇరువైపులా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి. మరొకవైపు, శారీరక శ్రమ మరియు వ్యాయామం ఎక్కువగా చేసే యువత లేదా క్రీడాకారులలో మోకాళ్ల నొప్పి గాయాల వల్ల వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ లేదా వర్కౌట్లు చేయడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ రావచ్చు.  తొడ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాలి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల పాటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ లేదా రన్నర్స్ నీ అనే సమస్య వస్తుంది. దీనివల్ల మోకాలిచిప్ప కింద నొప్పి అనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మోకాళ్ల నొప్పి కింద పడటం, ప్రమాదాలు జరగడం, ఆటలు ఆడేటప్పుడు లేదా వంగి పనులు చేసేటప్పుడు అకస్మాత్తుగా రావచ్చు.  మోకాలికి అయ్యే గాయాల్లో మెనిస్కస్ చిరగడం చాలా సాధారణం. ఇది మోకాలిని స్థిరంగా ఉంచే ఒక అర్ధచంద్రాకార కార్టిలేజ్. కాళ్లు అనుకోకుండా మెలిక తిరిగినప్పుడు ఇది చిరిగిపోయి తీవ్రమైన నొప్పి, వాపుకు కారణమవుతుంది. మోకాలిని అనుసంధానించే లిగమెంట్లు అతిగా సాగడం లేదా చిరగడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ప్రత్యేకించి ఎమ్‌సిఎల్ , ఏసిఎల్ అనే లిగమెంట్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పి నివారణ , సంరక్షణ మార్గాలు.. నొప్పి నెమ్మదిగా ప్రారంభమై పెరుగుతున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. నడక తీరులో లోపాలు, నడుము భాగం బలహీనంగా ఉండటం వల్ల కూడా మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నివారణ మందుల కంటే బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వాడటం వంటి తక్కువ ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయాలి. మంచి సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. వైద్య చికిత్సలు , జాగ్రత్తలు.. జీవనశైలి మార్పులు , సాధారణ మందులతో ఉపశమనం లభించనప్పుడు వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. ప్రారంభ దశలోని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు హైలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లు కొంతవరకు సహాయపడవచ్చు. ఏ చికిత్స పనిచేయనప్పుడు చివరి ఛాయిస్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మోకాళ్ల గాయాల నివారణకు ప్రథమ చికిత్స .. వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు గాయం వల్ల నొప్పి వస్తే ఆ పనిని వెంటనే ఆపేయాలి. మోకాలి చుట్టూ మంచు గడ్డలతో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. మెనిస్కస్ లేదా ఏసిఎల్ చిరిగిన సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మోకాలు పట్టు కోల్పోయినట్లు అనిపించినా, నిలబడటం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు.. వయస్సు లేదా జన్యుపరమైన అంశాలను మార్చలేము కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భార తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు పాడవుతాయనేది అపోహ మాత్రమే. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడి ఆస్టియోఆర్థరైటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కండరాలను బలంగా ఉంచుకోవడం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం  సాధ్యమవుతుంది.                *రూపశ్రీ.