LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువన్ ఇంటర్వ్యూ లో ఆమె అమరావతిపై జగన్ కుట్రలను బయటపెట్టారు. అందరూ జగన్ ను సైకో సైకో అంటారు కానీ  తాను జగన్ సైకో తో పాటు శాడిస్ట్ కూడా అంటానన్నారు.  ఇటీవల విజయవాడలో ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, అమరావతి రాజధాని కాదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ  హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన పరిణామాలను, దళిత ప్రతినిధులుగా తాము అనుభవించిన మానసిక క్షోభను   వివరించారు. 2019 ఎన్నికల సమయంలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవి..  అప్పట్లో సర్వేల ఆధారంగా అత్యంత క్లిష్టమైన రాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. అయితే..  గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన కనీస గుర్తింపు ఇవ్వకుండా కేవలం తన బొమ్మ చూసి మాత్రమే గెలిచారంటూ చులకనగా మాట్లాడారని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్ వైఖరి అత్యంత దారుణంగా ఉండేదన్న ఆమె..   పరిపాలన సాగించే క్రమంలో దళిత ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఆయన ఏనాడూ గౌరవించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారన్నారు.  అధికారంలో ఉన్న పార్టీని, పదవులను వదులుకుని తాము బయటకు రావడానికి జగన్ పెట్టిన టార్చరే కారణమని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. 2023లోనే తాను వైసీపీని వీడి అప్పటి ప్రతిపక్షంలోకి రావడం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉందన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిని కల్పించారని, రాజధాని ప్రాంత రైతులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించానని పేర్కొన్నారు. అమరావతి, మూడు రాజధానులు, వైజాగ్ కాపురం, ఇప్పుడు కొత్తగా  మావిగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే మాటలు మార్చడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఉండవల్లి శ్రీదేవి విశ్లేషించారు. నాడు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు అమరావతిలో పనులు చేస్తున్నట్లు కేవలం ఒక గంట పాటు డ్రామాలు ఆడారని, అదంతా కేవలం ప్రదర్శన  కోసమేనని  బయటపెట్టారు. రాజధాని కోసం ఒక్క పైసా ఆశించకుండా 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నడూ   ప్రేమ లేదన్న శ్రీదేవి ఐదేళ్ల పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్..  ఇప్పుడు మళ్లీ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే జగన్ అసలు వ్యూహమని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాయల్‌గా సచివాలయానికి వస్తూ, రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని శ్రీదేవి కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేసే తాత్కాలిక రాజకీయాలు ఇకపై సాగవని, ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని శ్రీదేవి అన్నారు.    Undavalli Sridevi Exclusive Interview, YS Jagan Mohan Reddy Strategy, Amaravati Capital Issue, Tadikonda Ex MLA Sridevi, Chandrababu Naidu Secretariat  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీల కోసం ప్రాణాలర్పించే కార్యకర్తల వాస్తవ పరిస్థితిపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యక ఇంటర్య్వూలో  తెలుగుదేశం సీనియర్ కార్యకర్త సిరిపురం శ్రీధర్  మాట్లాడారు. ఎన్నికల సమయంలో, పార్టీ ఉద్యమాల్లో జెండాలు మోసి, ప్రత్యర్థులతో పోరాడే సాధారణ కార్యకర్తలు చివరకు కేసులపాలై కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వారిని పట్టించుకోవడం లేదనే చేదు నిజాన్నిఆయన ఇసుమంతైనా సంకోచం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు కార్యకర్తలను కేవలం వాడుకుని వదిలేస్తున్నాయా  అంటే ఔననే అనాలని సిరిపురం శ్రీధర్ అన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా రాజకీయ కక్ష సాధింపులు, కేసుల పరంపర విపరీతంగా పెరిగిపోయింది. పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని, ఆవేశంతో ముందుకెళ్లే యువత, కార్యకర్తలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ   సీనియర్ కార్యకర్త, బ్రాహ్మణ చైతన్య వేదిక నిర్వాహకుడు సిరిపురం శ్రీధర్  పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో భాగంగా తనపై గతంలో దాదాపు 20 కి పైగా రాజకీయ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఒకసారి కేసుల్లో ఇరుక్కున్న తర్వాత సమాజంలో, కుటుంబంలో ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల విచారణ కోసం కోర్టులకు ఫీజులు చెల్లించలేక, చివరకు తల్లిదండ్రుల దగ్గర అడుక్కుని లేదా అప్పులు చేయాల్సిన దుస్థితి కార్యకర్తలకు వస్తోందని పేర్కొన్నారు. నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ  అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప,   లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.  ప్రతి రాజకీయ పార్టీలోనూ నిజమైన ఉద్యమ స్ఫూర్తితో పనిచేసేవాళ్లు వేళ్ల మీద లెక్కపెట్టేంత మందే ఉంటారన్న ఆయన మిగిలిన వారంతా కేవలం టీవీల్లో, ఫొటోల్లో కనిపించాలనే  బ్యాచ్ మాత్రమే అని శ్రీధర్ చెప్పారు.  వ్యక్తిగత ఆస్తుల గొడవలు లేదా సంఘవిద్రోహ చర్యల వల్ల వచ్చే కేసుల గురించి తాను మాట్లాడటం లేదని..  కేవలం పార్టీ పిలుపు మేరకు ఉద్యమాల్లో పాల్గొని అన్యాయంగా జీవితాలను నాశనం చేసుకుంటున్న జెన్యూన్ కార్యకర్తల కోణంలోనే ఈ వాదన  వినిపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏదో ఒక రాజకీయ పార్టీని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని, ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలలోనూ ఇదే పంథా నడుస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్యకర్తలను వాడుకోవడం, ఆపై కేసులు కాగానే వదిలేయడం అనే సంస్కృతి మారాలని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. యువత రాజకీయ ఆవేశంలో ఊగిపోయి వివాదాల్లో చిక్కుకోకుండా, కేసులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హితవు పలికారు.   Siripuram Sridhar Interview, Political Party Workers Cases, TDP Leader Sensational Comments, Political Cases On Youth, Tone News Telugu, AP Politics Reality
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్  యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  అరెస్టు,  ఆయనపై నమోదైన సెక్షన్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గన్నవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే..  ఈ కేసులో సాధారణ  సెక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రయోగించే అత్యంత కఠినమైన చట్టం  ఉపా  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 39ను కూడా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు,  ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు. సాధారణంగా దేశద్రోహ శక్తులు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై ప్రయోగించే ఈ చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం వెనుక ఉన్న న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను ఆయన  వివరించారు.  మాజీ జడ్జి రామకృష్ణ విశ్లేషణ ప్రకారం.. ఉపా  చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి సాధారణ కోర్టుల్లో అంత సులభంగా ఉపశమనం లభించదు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను ఎన్ఐఏ  ప్రత్యేక  కోర్టులు లేదా హైకోర్టులు మాత్రమే విచారిస్తాయి. అంతే కాకుండా, ఈ చట్టం కింద నమోదైన సెక్షన్ల ప్రకారం నిందితుడికి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు.  విచారణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రావణ్ కేసులో కేవలం దూషణలు, రాజకీయ విమర్శలే కాకుండా ఉపా చట్టం పరిధిలోకి వచ్చే వ్యూహాత్మక అంశాలు లేదా ఆడియో క్లిప్పింగుల ఆధారంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను సిద్ధం చేసి ఉంటారని   అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ సెక్షన్లను ఉన్నతాధికారులు,  న్యాయస్థానాలు ప్రాథమికంగా అంగీకరిస్తే.. రావణ్‌ను ఈ కేసుల నుండి రక్షించడం చట్టపరంగా చాలా కష్టమైన విషయమని మాజీ న్యాయమూర్తి   చెప్పారు.  రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ..  మాట్లాడే భాష చట్టపరిధిని దాటినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామకృష్ణ అన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో ఈ కేసు చుట్టూ తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఈ చట్టం ప్రయోగాన్ని కక్షసాధింపుగా అభివర్ణిస్తుండగా..  చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని అధికార పక్షం వాదిస్తోంది.   పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ చానల్ లో వీక్షించండి Former Judge Ramakrishna Legal Analysis, Andhra Pradesh Police Ravan Arrest, Chandrababu Pawan Kalyan YouTuber Case, AP Politics Social Media Arrests    
ALSO ON TELUGUONE N E W S
  ప్రేక్షకులనే అభిమానులుగా చేసుకొని మొన్న 3 న  భారీ అంచనాలతో విడుదలైన మైథలాజికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'నాగబంధం: 'పెదకాపు' ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా దర్శకుడు అభిషేక్ నామా ఈ విజువల్ వండర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దాదాపు 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో అత్యున్నత నిర్మాణ విలువల కలయికగా రూపొందగా ప్రాచీన భారతదేశ చరిత్ర, బ్రహ్మకమలం రహస్య నిధిని కాపాడే ఒక యోధుడి కథాంశంతో తెరకెక్కింది.   మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద తనదైన శైలిలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.  సినిమా బాక్సాఫీస్ ప్రయాణాన్ని ఒకసారి గమనిస్తే, మొదటి రోజు 'నాగబంధం' చిత్రం దేశవ్యాప్తంగా 3,202 షోల ద్వారా రూ. 3.25 కోట్ల నెట్ కలెక్షన్లతో శుభారంభం చేసింది. తొలి రోజు థియేటర్లలో సగటున 22 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ నుంచే అత్యధికంగా 2.90 కోట్ల వసూళ్లు రావడం విశేషం. మిగిలిన భాషల్లో హిందీ వెర్షన్  20 లక్షలు, తమిళం 10 లక్షలు, మలయాళంలో 3 లక్షలు, కన్నడ వెర్షన్  2 లక్షలు చొప్పున రాబట్టాయి. సినిమా రన్‌టైమ్ 3 గంటల 16 నిమిషాలుగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి ల్యాగ్ వస్తోందనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనిని గమనించిన మేకర్స్ వెంటనే స్పందించి ఏకంగా 31 నిమిషాల నిడివిని ట్రిమ్ చేశారు. ఈ సంచలన మార్పుతో 2 గంటల 45 నిమిషాల సరికొత్త క్రిస్పీ వెర్షన్ థియేటర్లలోకి రావడంతో శని, ఆదివారాల్లో బుకింగ్స్ మెరుగయ్యాయి.  రెండో రోజు శనివారం కూడా స్థిరంగా సాగిన ఈ చిత్రం, మూడో రోజు ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టింది. దేశవ్యాప్తంగా లభించిన 1,904 షోల ద్వారా మూడో రోజు దాదాపు  3.02 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇది శనివారంతో పోలిస్తే కేవలం ఒకే ఒక్క శాతం డ్రాప్ మాత్రమే కావడం గమనార్హం.  Also read: Amitabh bachchan: అమితాబ్ బచ్చన్ ల్యాండ్‌ డీల్‌.. రాత్రి 3 గంటల ఫోన్‌ కాల్‌ వెనుక అసలు కథ! ఆదివారం నాడు తెలుగు 2D వెర్షన్‌లో సగటు ఆక్యుపెన్సీ 28.24 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం ఆటలకి  34.69 శాతం, ఈవినింగ్ షోలకు 34.54 శాతంతో థియేటర్లు నిండాయి. నైట్ షోలలో కూడా 25.77 శాతం ఆక్యుపెన్సీతో సినిమా నిలకడను చాటుకుంది.  ఈ మూడు రోజుల వీకెండ్ ముగిసేసరికి, 'నాగబంధం' చిత్రం సాధించిన మొత్తం వసూళ్ల లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా  9.47 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా, ఇండియా గ్రాస్ వసూళ్లు  11.06 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా . 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 3 రోజుల్లో మొత్తం 12.31 కోట్ల గ్రాస్ మార్కుని  అందుకుంది.  
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు వింటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత గుర్తొస్తుంది. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన 'జవాన్' చిత్రం ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, అట్లీని తిరుగులేని పాన్ ఇండియా సంచలనంగా మార్చేసింది. అంతకుముందు దళపతి విజయ్‌తో ఆయన రూపొందించిన బిగిల్, మెర్సల్, తేరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 100 శాతానికి పైగా భారీ విజయాలను నమోదు చేశాయి. ఇలాంటి బ్లాక్‌బస్టర్ హిట్ల ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు అట్లీ నుంచి సినిమా వస్తోందంటేనే యావత్ భారత చిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.  ప్రస్తుతం అట్లీ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రాకా' సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు మాస్ పల్స్ తెలిసిన స్టార్స్ కలిసి చేస్తున్న ఈ చిత్రం కచ్చితంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అటు అభిమానులు, ఇటు మీడియా వర్గాలు చాలా నమ్మకంగా చెబుతున్నాయి. ఇప్పటికే 'రాకా' చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. రాకా చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను వచ్చే ఏడాది అంటే 2027 ఆరంభంలోనే పూర్తి చేయాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు అత్యంత కీలకమైన వీఎఫ్ఎక్స్ (VFX) పనుల కోసం ఏకంగా 10 నెలల పాటు భారీ సమయాన్ని కేటాయించబోతున్నారు. అంటే దాదాపు 10 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి, 2027 చివరి నాటికి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలగా ఉంది. అయితే 'రాకా' తర్వాత అట్లీ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ ఏంటి అనే అంశంపై ఇండస్ట్రీలో ఇప్పుడే చర్చలు జోరందుకున్నాయి.  అట్లీ మైండ్‌లో ప్రస్తుతం 'జవాన్ 2' స్క్రిప్ట్ చర్చలతో పాటు, కమల్ హాసన్ మరియు సల్మాన్ ఖాన్‌ల కోసం రెడీ చేసిన భారీ మల్టీస్టారర్ స్టోరీ లైన్ కూడా ఉంది. ఈ కథల స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్‌లోనే అట్లీ మళ్లీ టాలీవుడ్ వైపే అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో అట్లీ ఒక భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో విపరీతంగా ఊపందుకుంది. నిజానికి అల్లు అర్జున్‌తో 'రాకా' సినిమా సెట్ కాకముందే.. ఎన్టీఆర్‌తో అట్లీ సినిమా దాదాపు ఖరారైందని, వీరిద్దరి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అట్లీ సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. దేవర సిరీస్, వార్ 2 చిత్రాల అనంతరం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమా చేయనున్నారు.  ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్-అట్లీ కాంబినేషన్ తెరపైకి రావడం విశేషం. అంతా అనుకున్నట్లు జరిగితే.. 2028 ఆరంభంలో ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. షూటింగ్ పూర్తి చేసుకుని దాదాపు రెండేళ్ల తర్వాత అంటే 2030 నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా అట్లీ టీమ్ ఒక పక్కా ప్లాన్‌ను సిద్ధం చేస్తోందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న 'రాకా' సినిమా గనుక బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సూపర్ హిట్ అయితే.. టాలీవుడ్‌లోని టాప్ స్టార్ హీరోలంతా అట్లీతో వర్క్ చేయడానికి క్యూ కట్టడం ఖాయం. కానీ అట్లీ మాత్రం ఇప్పటికే ఎన్టీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం, మరో హీరోతో కమిట్ అవ్వకుండా తారక్‌తోనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ భారీ కాంబినేషన్‌పై అట్లీ టీమ్ ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక క్లూస్ ఇవ్వడం లేదు.  సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని కొట్టిపారేస్తున్నప్పటికీ, నందమూరి అభిమానులు మాత్రం ఈ కాంబో వందకు వంద శాతం నిజం కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్-అట్లీ కాంబినేషన్ సెట్ అయితే గనుక బాక్సాఫీస్ వద్ద రికార్డుల ఊచకోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ లేదా అట్లీ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి!       ntr, atlee, allu arjun, raaka
Raja The Raja trailer has arrived, giving audiences a better look at what appears to be one of the more unconventional concepts among upcoming Telugu films. Starring debutant Ruthvik and Vishakha Dhiman in the lead roles, the film intertwines two timelines—one set in the past and the other in the present—while building intrigue around how they eventually connect. The trailer introduces Ruthvik in two contrasting avatars. In the historical timeline, he plays a young prince deeply in love, with Sai Kumar portraying a king who is prepared to banish him as his decisions begin affecting the kingdom. In the present, Ruthvik is seen as a cheerful youngster who dreams of becoming a fashion designer, hiding his passion from his father, played by Naresh, who wants him to pursue medicine instead. The narrative gradually hints at a mysterious link between the two worlds through a gold coin, leaving the audience guessing about how the past and present collide. Director Anil Boyiidapu seems to have built the film around this central mystery while balancing romance, emotions, humour and fantasy elements. For a newcomer, Ruthvik appears confident in handling two distinctly different characters, while Vishakha Dhiman looks convincing in both the princess and modern-day fashion model roles. The trailer also stands out for its vibrant visuals and production design, particularly in the period portions, giving the film a scale beyond its budget. Produced by Niharika Dasari, Raja The Raja looks to offer a fresh cinematic experience by blending youthful entertainment with an intriguing fantasy-driven narrative. The trailer succeeds in raising curiosity about the mystery connecting its two timelines, making the film one to watch out for. Mythri Movie Makers are distributing the film locked for 17th July release.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సంచలన కాంబినేషన్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఫామ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో వరుసగా 4 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో టాలీవుడ్‌ను శాసించిన కొరటాల శివకు, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య', 'దేవర' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు.  ముఖ్యంగా 'దేవర' పార్ట్ 1 నిరాశపరచడంతో కొరటాల శివ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్‌తో 'దేవర' పార్ట్ 2 చేయాల్సి ఉన్నప్పటికీ, తారక్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, అలాగే పార్ట్ 1 ఫలితం వల్ల కొరటాల శివ ఇప్పట్లో మెగాఫోన్ పట్టడం కష్టమేనని ఇండస్ట్రీ విశ్లేషకులు భావించారు. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో నందమూరి బాలకృష్ణ ఆయనకు ఊహించని విధంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్ద బూస్ట్ ఇచ్చారు. బాలయ్యలాంటి మాస్ హీరో ఈ క్రేజీ కాంబినేషన్‌కు ఓకే చెప్పడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజాసేవలో బిజీగా గడుపుతున్నప్పటికీ, బాలకృష్ణ సినిమాలకు ఎక్కడా బ్రేక్ పడకుండా వరుసగా డేట్లు కేటాయిస్తూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం బాలయ్య ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచేందుకు రాబోయే ఆగస్టు నెల మొత్తాన్ని (దాదాపు 30 రోజులు) పూర్తిగా కొరటాల శివకే కేటాయించారట.  ఈ ఆగస్టు షెడ్యూల్‌లోనే సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌తో పాటు మెజార్టీ షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనే పక్కా ప్రణాళికతో కొరటాల శివ ఉన్నట్లు సమాచారం. ఆచార్య, దేవర చిత్రాల ఫలితాల తర్వాత కొరటాల శివ ఈసారి ఏమాత్రం తప్పులు దొర్లకుండా ప్రతి విషయంలోనూ తీవ్ర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాలకృష్ణతో సినిమా చేసేటప్పుడు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందనే పేరు ఇండస్ట్రీలో ఉంది. ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఉపయోగించుకుని కొరటాల శివ తన పాత సక్సెస్ ట్రాక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. కొరటాల శివ గత చిత్రాలను పరిశీలిస్తే హీరో పాత్రలు మరీ ఊర మాస్ లాగా కాకుండా, క్లాస్ టచ్‌తో చాలా సెటిల్డ్‌గా, మోడరేట్ తరహాలో ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణను కూడా అదే తరహా సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారట. బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ మేనరిజమ్స్, గెటప్స్ కోరుకునే అభిమానుల కోసం కథలో అవసరమైన చోట హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ఎలివేట్ చేస్తూ, ఫ్యాన్స్‌కు 'ఫుల్ మీల్స్' లాంటి సినిమా ఇచ్చేందుకు కొరటాల ఏకంగా 4 నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ అవతార్‌లోనే కనిపిస్తూనే బాలయ్య క్యారెక్టర్ ఎంతో హుందాగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందని టాక్.      Nandamuri Balakrishna, Koratala Siva, NBK, Devara Part 2, Tollywood Movie News
    కేజీఎఫ్' తో పాన్ ఇండియా రేంజ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యష్(yash)తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లేడీస్ టీజర్ మరియు విడుదల తేదీ అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుండి సోషల్ మీడియాలో నెగెటివిటీ, వివాదాలు చుట్టుముట్టాయి. యాక్షన్ కంటెంట్ ఆశించిన అభిమానులకి  టీజర్‌లో కనిపించిన మితిమీరిన రొమాంటిక్, బోల్డ్ సీన్స్ తీవ్ర నిరాశని  మిగిల్చాయి.  నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ, విజువల్స్ కాస్త శృతిమించినట్టు ఉన్నాయంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.  ఈ క్రమంలోనే నెటిజన్లు యష్ గతంలో చేసిన ఒక సంచలన వ్యాఖ్యానాన్ని తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో ఒక టాక్ షోలో యష్ మాట్లాడుతూ, "నేను నా తల్లిదండ్రులతో కలిసి కూర్చుని చూడలేని ఏ ఒక్క సీన్ కూడా సినిమాలో చేయను, అది నా సిద్ధాంతం. ఒకప్పుడు రొమాంటిక్ సీన్స్ చేయాలంటేనే ఎంతో సిగ్గుపడేవాడిని, హెల్మెట్ పెట్టుకుని పార్కుల్లో ప్రేమికులని  గమనించి నటన నేర్చుకున్నానని కూడా నవ్వుతూ పంచుకున్నారు. కానీ ఇప్పుడు 'టాక్సిక్' సినిమాలో ఏకంగా సెన్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో, "ఆనాడు చెప్పిన మాటలు ఏమయ్యాయి యష్? మీ పాత ఒట్టును మీరే మర్చిపోయారా?" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.ఈ తీవ్రమైన ట్రోలింగ్ మరియు వివాదాలపై చిత్ర కథానాయిక హుమా ఖురేషి తాజాగా స్పందించారు. నెటిజన్లు కాస్త ఓపిక పట్టాలని, సినిమా ఇంకా ఎవరూ చూడలేదు కాబట్టి అప్పుడే ఒక అంచనాకు రావడం తగదని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, సాధారణంగా పెద్ద స్టార్ హీరోలు మహిళా దర్శకుల మాట వినడానికి ఇష్టపడరని, కానీ యష్ మాత్రం గీతూ మోహన్ దాస్ ప్రతిభను నమ్మి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని ప్రశంసించారు. మరోవైపు, ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో కొన్ని అభ్యంతరకర విజువల్స్‌పై ఇప్పటికే కర్ణాటక మహిళా కమిషన్ మరియు సెన్సార్ బోర్డ్‌కు ఫిర్యాదులు కూడా అందాయి. ఎన్నో వాయిదాల తర్వాత, మిడిల్ ఈస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇబ్బందులను దాటుకుని ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. yash, toxic, geethumohandas  
చరిత్ర ఎందరో వీరులను మనకు పరిచయం చేసింది. కానీ, దేశం కోసం, సాంకేతిక ప్రగతి కోసం అహర్నిశలు శ్రమించి కూడా కాలగర్భంలో కలిసిపోయిన అద్భుత మేధావులు కొందరు ఉంటారు. అలాంటి వారిలో కోయంబత్తూరులో జన్మించిన తెలుగు కుటుంబానికి చెందిన జీడీ నాయుడు (గోపాలస్వామి దొరస్వామి నాయుడు) అగ్రగణ్యుడు. ఆయన కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు.. భారతదేశపు ఎడిసన్‌గా కీర్తించబడిన గొప్ప ఆవిష్కర్త. బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక తిరుగులేని శక్తి ఆయన. ఆయన జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'జి.డి.ఎన్' (G.D.N). తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సత్యరాజ్, జయరామ్, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీడీ నాయుడు యునైటెడ్ మోటార్స్ సర్వీస్ (UMS) ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఆయన వ్యాపార పుస్తకాలు ఎంతో స్వచ్ఛంగా, చట్టబద్ధంగా ఉండేవి. ఆయన ఎదుగుదలను తట్టుకోలేని బ్రిటీష్ అధికారులు ఆయనను ఎలాగైనా ఇరికించాలని చూశారు. "ఆయన పుస్తకాలు క్లీన్‌గా ఉంటే.. వాటిని మీరే మురికి చేయండి" అని బ్రిటీష్ పైఅధికారులు ఆదేశించారంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోనే ఆయన జర్మనీ, నాజీలతో వ్యాపార సంబంధాలు నెరిపారు. ఇది బ్రిటీష్ కిరీటానికి వ్యతిరేకంగా చేసిన దేశద్రోహంగా భావించి బ్రిటీష్ ప్రభుత్వం ఆయనపై నిఘా పెట్టింది. బ్రిటీష్ వారే కాదు, మన దేశంలోని కొందరు స్వార్థపరులు కూడా ఆయనకు శత్రువులుగా మారారు. సరిగ్గా ఆ సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వం నాయుడుపై పన్నుల పేరుతో వేధింపులకు దిగింది. ఆయనపై అన్యాయంగా పన్నులు విధించినప్పుడే, ఆయన బ్రిటీష్ వ్యవస్థను ఎదురించి గళమెత్తారు. బ్రిటీష్ వారు ఆయన ఆస్తిలో ఏకంగా 80 శాతం జప్తు చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, జీడీ నాయుడు సామాన్యుడు కాదు. ఆత్మాభిమానం కలిగిన ఆ మేధావి, బ్రిటీష్ వారికి తలవంచలేదు. తాను కష్టపడి కనిపెట్టిన అద్భుతమైన యంత్రాలను, సాంకేతిక పరికరాలను బ్రిటీష్ వారి చేతికి చిక్కకుండా తన చేతులతోనే పగులగొట్టి ధ్వంసం చేశారు. గోవింద్ వసంత అద్భుతమైన సంగీతం, కృష్ణకుమార్ రామకుమార్ లీడ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ 'జి.డి.ఎన్' చిత్రం, చరిత్ర మరిచిన ఒక మహోన్నత భారతీయుడి కథను ప్రపంచానికి చాటిచెప్పబోతోంది. బ్రిటీష్ వారిని భయపెట్టి, సొంత దేశస్థులచే విస్మరించబడిన ఈ వీరుడి గాథ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. GDN Trailer, GD Naidu, R Madhavan, TeluguOne  
హైదరాబాద్‌ నగరానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంది. ఇక్కడి బస్తీల్లో ఉండే కుర్రాళ్ల లైఫ్ స్టైల్, వారు మాట్లాడే యాస, వారి ఆలోచనలు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని, పక్కా లోకల్ హైదరాబాదీ ఫ్లేవర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అమీర్ లోగ్' (Ameer Log) చిత్రం. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  ఈ సినిమా టీజర్ చూస్తుంటే, ఇదొక ఫుల్ లెంగ్త్ మాస్, ఎంటర్‌టైనింగ్, యూత్‌ఫుల్ డ్రామా అని స్పష్టంగా అర్థమవుతోంది. 1 నిమిషం 57 సెకన్ల నిడివి గల ఈ టీజర్, మొదటి సెకను నుంచే తనదైన హైదరాబాదీ రాపోతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. నగరంలోని లోకల్ బస్తీ వాతావరణం, అక్కడి కుర్రాళ్ల జీవన విధానాన్ని చాలా సహజంగా స్క్రీన్‌పై ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. టీజర్ లోని ప్రతి డైలాగ్, ప్రతి సీన్ చాలా క్యాచీగా ఉంది. ముఖ్యంగా "పదిహేను వందల జూతా.. ఇజ్జత్‌పై వస్తే జబ్డాపై ఖాతా" అంటూ సాగే రాప్ లిరిక్స్, అలాగే డైలాగ్స్ కుర్రాళ్లకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. హైదరాబాద్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కేవలం మాస్ మాత్రమే కాదు, ఈ తరం యువత మైండ్‌సెట్ ఎలా ఉందో కూడా చూపించబోతున్నారు. "మన హైదరాబాద్‌లో బండి నడపడం నేర్చుకుంటే, దునియాలో ఎక్కడైనా నడపొచ్చు" అనే డైలాగ్ నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. బిర్యానీ తినడం, ప్రశాంతంగా పడుకోవడం, బస్తీ దోస్తీలతో ముచ్చట్లు పెట్టడం, ప్రేమ వ్యవహారాలు.. ఇలా ఒక మిడిల్ క్లాస్ హైదరాబాదీ కుర్రాడి లైఫ్‌లో ఉండే అన్ని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో పక్కాగా మిక్స్ చేశారు. రమణ రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంసి హరి, వేధ జలంధర్, మనోజ్, శశిధర్ వంటి యువ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాప్ సాంగ్స్ విజువల్స్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. రానా దగ్గుబాటి ఈ చిన్న సినిమాను సపోర్ట్ చేయడంతో 'అమీర్ లోగ్' ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త లోకల్ రైడ్‌ను అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.      Ameer Log Teaser, Rana Daggubati, Hyderabad, TeluguOne  
టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్, విలక్షణ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఓ సుకుమారి’. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఒక అందమైన, విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఫాంటసీ అంశాలతో కూడిన ఒక వినూత్నమైన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక పక్కా వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈ నెలలోనే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా జులై 17వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా, విభిన్నమైన మలుపులతో సాగనుంది. రాజకీయ నాయకుడు కావాలని కలలు కనే ఒక సాధారణ యువకుడు, సుకుమారి అనే ఒక అమాయకపు పల్లెటూరి అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే ఇక్కడే కథలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది. అదేమిటంటే.. హీరోయిన్ సుకుమారిని ఎవరు తాకినా సరే వారికి గట్టిగా కరెంట్ షాక్ కొడుతుంది. ఈ విచిత్రమైన సమస్య చుట్టూ సాగే కథనం అత్యంత హాస్యభరితంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందని దర్శకుడు చెప్తున్నారు. ఈ సరికొత్త పాయింట్ ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తూనే, కథలో లీనమయ్యేలా చేస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నవ్వులు పూయించేందుకు సిద్ధమైన ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళంతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఒకేసారి గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ రావడంతో, ఈ సినిమా ఖచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి అంచనాలు నెలకొన్నాయి. తిరువీర్ మార్క్ యాక్టింగ్, ఐశ్వర్య రాజేష్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.       O Sukumari Movie, Thiruveer, Aishwarya Rajesh
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)