Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమరావతిపై జగన్ వి డ్రామాలే.!
posted on: Jul 6, 2026 5:14PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువన్ ఇంటర్వ్యూ లో ఆమె అమరావతిపై జగన్ కుట్రలను బయటపెట్టారు. అందరూ జగన్ ను సైకో సైకో అంటారు కానీ తాను జగన్ సైకో తో పాటు శాడిస్ట్ కూడా అంటానన్నారు. ఇటీవల విజయవాడలో ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, అమరావతి రాజధాని కాదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన పరిణామాలను, దళిత ప్రతినిధులుగా తాము అనుభవించిన మానసిక క్షోభను వివరించారు.
2019 ఎన్నికల సమయంలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవి.. అప్పట్లో సర్వేల ఆధారంగా అత్యంత క్లిష్టమైన రాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. అయితే.. గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన కనీస గుర్తింపు ఇవ్వకుండా కేవలం తన బొమ్మ చూసి మాత్రమే గెలిచారంటూ చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్ వైఖరి అత్యంత దారుణంగా ఉండేదన్న ఆమె.. పరిపాలన సాగించే క్రమంలో దళిత ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఆయన ఏనాడూ గౌరవించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారన్నారు.
అధికారంలో ఉన్న పార్టీని, పదవులను వదులుకుని తాము బయటకు రావడానికి జగన్ పెట్టిన టార్చరే కారణమని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. 2023లోనే తాను వైసీపీని వీడి అప్పటి ప్రతిపక్షంలోకి రావడం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉందన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిని కల్పించారని, రాజధాని ప్రాంత రైతులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించానని పేర్కొన్నారు.
అమరావతి, మూడు రాజధానులు, వైజాగ్ కాపురం, ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే మాటలు మార్చడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఉండవల్లి శ్రీదేవి విశ్లేషించారు. నాడు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు అమరావతిలో పనులు చేస్తున్నట్లు కేవలం ఒక గంట పాటు డ్రామాలు ఆడారని, అదంతా కేవలం ప్రదర్శన కోసమేనని బయటపెట్టారు.
రాజధాని కోసం ఒక్క పైసా ఆశించకుండా 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నడూ ప్రేమ లేదన్న శ్రీదేవి ఐదేళ్ల పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్.. ఇప్పుడు మళ్లీ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే జగన్ అసలు వ్యూహమని ఆరోపించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయల్‌గా సచివాలయానికి వస్తూ, రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని శ్రీదేవి కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేసే తాత్కాలిక రాజకీయాలు ఇకపై సాగవని, ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని శ్రీదేవి అన్నారు.
Undavalli Sridevi Exclusive Interview, YS Jagan Mohan Reddy Strategy, Amaravati Capital Issue, Tadikonda Ex MLA Sridevi, Chandrababu Naidu Secretariat





