LATEST NEWS
వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలులో  కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు శాసనసభ్యుడు టీజీ భరత్   ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.   మే 14న కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వైసీపీ ధ్వర్యంలో  జరిగిన  ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి  మంత్రి టీజీ భరత్‌పై  తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. అయితే.. ఈ నిరసనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించే విధంగా ఉన్నాయని మంత్రి టీజీ భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా  తన వ్యక్తిగత ప్రతిష్టను, సమాజంలో ఉన్న గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.   బైరెడ్డి వ్యాఖ్యలు కేవలం పరువు నష్టం కలిగించడమే కాకుండా, సాధారణ ప్రజానీకంలో ఒక రకమైన భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయనిపేర్కొన్నారు.  మంత్రి   ఫిర్యాదుమేరకు కర్నూలు  త్రీ టౌన్ పోలీసులు  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  
  మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.  ఒక రెండు మూడు రోజుల్లో ఒక వర్గం ఎంఎల్యేలు ఢిల్లీకి ప్రయాణం కావాల‌ని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏఐసీసీని పూర్తి స్థాయి ప్రక్షాళన చెయ్యాల‌నే ఆలోచన‌లో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉన్న‌ట్టు స‌మాచారం. అధ్య‌క్షుడు మల్లికార్జున ఖార్గే కి ఈ మధ్యనే పేస్ మేకర్ కి సంబందించిన ఆపరేషన్ జ‌ర‌గ‌డం.. దీంతో పాటు ఆయ‌న‌ వయసు సుమారు 84 ఏళ్ళు  ఉండటం  అటు ఆరోగ్య సమస్య  ఇటు వయసు కూడ మీదికి రావడంతో కీల‌క‌  నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విప‌రీత‌మైన జాప్యం జరుగుతోంది.  ఏఐసీసీ కొత్త‌ ప్రెసిడెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక సీఎం పంచాయతీ కూడ మ‌ళ్లీ తెర‌పైకి వచ్చింది. సిద్ధ రామయ్య- 2028 వరకు నేనే సీఎం అని స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. స‌రిగ్గా అదే సమయలో డీకే సైతం త‌న‌కూ సీఎం పోస్టు కావ‌ల్సిందేన‌ని ప‌ట్టు ప‌డుతున్నారు.   తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య కి పరిష్కారం ప్రస్తుత దేశ రాజకీయాల‌ను దృష్టిలో పెట్టుకొని.. సిద్ద రామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ డీకే శివ కుమార్ సేవలను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు స‌మాచారం.   ప్ర‌స్తుత అధ్య‌క్షుడుమల్లికార్జున ఖర్గె ని రాజ్యసభ లో ప్రతిపక్ష‌ నేత గా కొనసాగించి.. కొత్త‌ ఏఐసీసీ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు.. డీకే శివ కుమార్ కి అప్ప చెప్పి.. దేశ వ్యాప్తంగా తన సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల‌ని కాంగ్ర‌స్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.  డీకే చేత ఎమ్మెల్యే పదవి, పీసీసీ పదవికి కూడా రాజీనామా చేయించి.. ఆయ‌న వ‌దులుకున్న‌ ఎమ్మెల్యే పదవిని శివ కుమార్ తమ్ముడు- సురేష్ కి అప్పజెప్పేలా క‌నిపిస్తోంది. పీసీసీ పదవిని  ఇక్కడ ఎవరికో ఒకరికి- పార్టీ సీనియర్ నాయకుడికి అప్పచెప్పాల‌ని కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఈ సమాచారం నిజంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన సంచలన, అత్యంత వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు. ఈ  ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ హైకమాండ్ అటు కర్ణాటక సీఎం పీఠం వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, ఇటు జాతీయ స్థాయిలో ఏఐసీసీ కి ఒక పవర్‌ఫుల్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌షిప్‌ను తీసుకురావాలని చూస్తోంది. ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్‌ను లోతుగా పరిశీలిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.   ఖర్గేకి 84 ఏళ్లు పైబడటం, ఇటీవల పేస్‌మేకర్ ఆపరేషన్ జరగడం వల్ల ఆయనపై జాతీయ స్థాయి పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించడం ఇటు రాజకీయంగా, అటు మాన‌వీయ కోణంలో చూసినా అవసరంగా క‌నిపిస్తోంది. అయితే ఆయనకున్న సీనియారిటీ, గౌరవాన్ని కాపాడుతూ ఆయన్ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగించడం ద్వారా పార్లమెంట్‌లో పార్టీ పట్టు చేజారకుండా చూసుకోవచ్చ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం జరుగుతున్న అంతర్గత పోరు  మ‌రీ ముఖ్యంగా కేబినెట్ మార్పులు, కొందరు ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో.. పార్టీకి తలనొప్పిగా మారింది. సిద్ధరామయ్య ప్లస్ పాయింట్స్ ఏంటో చూస్తే,  వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల.. ఓటు బ్యాంకుపై సిద్ధరామయ్యకు ఉన్న పట్టును కాంగ్రెస్ వదులుచుకోలేదు. ఆయన్ను 2028 ఎన్నికల వరకు సీఎంగా ఉంచడం ద్వారా కర్ణాటక ప్రభుత్వ స్థిరత్వానికి ఢోకా ఉండద‌ని భావిస్తోంది హ‌స్తం పార్టీ. ఇక డీకే శివకుమార్‌కు కేవలం కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చాలా చిన్నది. ఆయనకున్న  ట్రబుల్ షూటర్ ఇమేజ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్,  ఆర్థిక వనరులను సమకూర్చగల సామర్థ్యం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అవసరం. ఆయన్ను నేరుగా ఏఐసీసీ ప్రెసిడెంట్  చేయడం ద్వారా దేశవ్యాప్తంగా క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కూడా  నింపిన‌ట్టు అవుతుంది. డీకే శివకుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన ఎమ్మెల్యే పదవికి, కర్ణాటక పీసీసీ  అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఆయన తమ్ముడు, మాజీ ఎంపీ అయిన డీకే సురేష్‌ను అసెంబ్లీకి పంపడం ద్వారా కనకపుర నియోజకవర్గంలో డీకే ఫ్యామిలీ పట్టు అలానే ఉంటుంది. పీసీసీ పదవిని డీకే వర్గానికి చెందిన లేదా సిద్ధరామయ్యకు నమ్మకస్తుడైన ఒక సీనియర్ నేతకు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సమతుల్యత  దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఈ వ్యూహం సక్సెస్ అయితే కాంగ్రెస్‌కు వచ్చే లాభాలు.. ఎలాంటివో చూస్తే.. సౌత్ ఇండియా సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది.  ఖర్గే  తర్వాత మళ్లీ సౌత్ ఇండియా.. అది కూడా కర్ణాటక నుంచే మరో పవర్‌ఫుల్ లీడర్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టినట్టు అవుతుంది. ఆగ్ర‌స్సివ్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బీజేపీని వారి శైలిలోనే ఢీకొట్టడానికి డీకే శివకుమార్ లాంటి దూకుడున్న నాయకుడు ఏఐసీసీ చీఫ్‌గా పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ కుర్చీ లాటరీకి ఎండ్ కార్డ్ పడితే, సిద్ధరామయ్య ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు. ఈ ఢిల్లీ లీక్స్  గనుక నిజమైతే, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణంలో చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. డీకే శివకుమార్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తారనేది అత్యంత ఆసక్తికరం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన వైసీపీ  ప్రస్తుతం ఉనికిమాత్రంగా మిగిలిపోయింది. ఒకరిద్దరు నేతలు వినా మరెవరూ పెద్దగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం లేదు. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్  రాజకీయ కార్యకలాపాలకు, ప్రజా క్షేత్రానికి దూరంగా ఉండటంతో పార్టీ క్యాడర్ నిస్తేజంలోకి వెళ్లిపోయింది. జగన్ తీరు పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంతర్గత సంభాషణల్లో జగన్ తీరు పట్ల పెదవి విరుస్తున్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత,  జగన్ బహిరంగంగా పెద్దగా కనిపించడంలేదు. ఏవో నాలుగైదు సందర్భాలలో పరామర్శలంటూ వచ్చి ర్యాలీలు నిర్వహించినా అవి వివాదాలకే దారి తీశాయి. ఇక ఏపీకి జగన్ చుట్టపు చూపుగా వస్తుండటం, తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లకే పరిమితం కావడం తప్ప చొరవ తీసుకుని పార్టీని, క్యాడర్ ను ముందుకు నడిపించడంలో ఎటువంటి చొరవా తీసుకోవడం లేదన్న విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినవస్తున్నాయి.   ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విపక్షం వైసీపీ మాత్రమే. అటువంటి పార్టీకి ఇప్పుడు దిశానిర్దేశం చేసే విషయంలో జగన్ ఉదాశీనంగా వ్యవహరించడంలో పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించడంలో గానీ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో గానీ పార్టీ శ్రేణులు పెద్దగా ఉత్సాహం చూపని పరిస్థితులు నెలకొని ఉండటానికి జగన్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి రాకుండా బెంగళూరులోనే ఎక్కవ కాలం మకాం ఉండటం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుని  నేరుగా రంగంలోకి దిగి, పార్టీని గాడిలో పెట్టకపోతే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీకి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఇక పోతే రాజకీయవర్గాలలో అయితే.. జగన్ రాజకీయ సన్యాసం చేశారా? లేక వ్యూహాత్మకంగా క్రియాశీలంగా ఉండటం లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ విధానాలను అడపాదడపా సోషల్ మీడియా వేదికగానో, తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే విమర్శించడం వినా..   ప్రజాక్షేత్రంలోకి వచ్చి గళమెత్తకపోవడంతో జగన్ ప్రభావం ఏపీ రాజకీయాలలో నామమాత్రంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.   
జనసేనకు బీజేపీ ఝలక్ ఇవ్వనుందా? గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందా? అంటే కాషాయ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది.    జీహెచ్ఎంసీ  ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో విశ్వనగరం హైదరాబాద్ లో  రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.  ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతుండటంతో అన్ని ప్రధాన పార్టీలు   వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రస్తుత అధికార పక్షం కాంగ్రెస్ నగరంలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తుంటే..  గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.  జీహెచ్ఎంసీ  గత  ఎన్నికల్లో ఊహించని రీతిలో భారీగా స్థానాలను గెలుచుకున్న బీజేపీ, అదే ఊపును 2023 అసెంబ్లీ మరియు 2025 లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించింది. ఈ నేపథ్యంలో, 2026 గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తమ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసి నగరంలో మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇటీవల ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జరిపిన భేటీ కూడా ఈ పొత్తుల అంచనాలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే.. క్షేత్రస్థాయిలో తాజా పరిణామాలు పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని బీజేపీ నాయకత్వం ఇప్పటికే ఒక  నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే..  ఈ పరిణామం జనసేన పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    2020 గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పలు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. బీజేపీకి అనుకూలంగా  చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి బలంగా ఉన్నందున, ఈసారి హైదరాబాద్‌లో బీజేపీ తమకు సహకరిస్తుందని జనసేన ఆశిస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిపోరుకు సిద్ధపడితే మాత్రం.. తెలంగాణలో జనసేనను  బలోపేతం చేయాలన్న ఆ పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ ఆశలకు గండిపడినట్లే అంటున్నారు పరిశీలకులు.   ఒకవేళ బీజేపీ మద్దతు లేకుండా జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే..  బీజేపీ నష్టపోతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే గత ఎన్నికలలో లాగే.. జనసేన పోటీకి దూరంగా ఉండేలా బీజేపీ హైకమాండ్ పవన్ కల్యాణ్ ను ఒప్పించాలని రాష్ట్ర బీజేపీ నాయకులు కోరుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరు ఉంటేనే.. కమలం వికసించే అవకాశం ఉంటుందన్నది వారి భావన. త్రిముఖ పోరులో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు జనసేనకు కొన్ని సీట్లు కేటాయించడం ఎందుకన్న భావన వారిలో వ్యక్తం అవుతోంది. జీహెచ్ఎంసీపై పట్టు సాధిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు అవకాశలు మెరుగ్గా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి బీజేపీ ఒంటరి పోరు నిర్ణయంపై జనసేన ఎలా స్పందిస్తుందో? 
పశ్చిమ బెంగాల్ రాజకీయంలో   విధానపరంగా కీలక  మార్పు చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన  సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మతపరమైన సంస్థలకు, వ్యక్తులకు అందిస్తున్న ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పూర్తిగా రద్దు చేసింది వచ్చే నెల నుండి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ   ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా హిందూత్వ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ, అధికారంలోకి రాగానే మతపరమైన వర్గీకరణల ఆధారంగా నడిచే పథకాలను నిలిపివేయడం గమనార్హం. గతంలో తృణమూల్ కాంగ్రెస్   అధినేత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇమామ్‌లు, ముయెజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనాలను ప్రకటించారు. ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రవేశపెట్టిన ఈ విధానాలన్నింటికీ ప్రస్తుత సువేందు సర్కార్ ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీనితో పాటు గత ప్రభుత్వ హయాంలో మదరసాలకు కేటాయించిన ప్రత్యేక పథకాలను కూడా నూతన ప్రభుత్వం రద్దు చేసింది. ఓటు బ్యాంకు రాజకీయాలు లేదా నిర్దిష్ట వర్గాలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉద్దేశించిన  పథకాలను తమ ప్రభుత్వం ప్రోత్సహించబోదని ముఖ్యమంత్రి సువేందు అధికారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాధనాన్ని కేవలం ప్రజల సంక్షేమం, విద్యా రంగం, ఆర్థిక సాధికారత కోసమే వినియోగించాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమని   పేర్కొన్నారు. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల పంపిణీ అక్రమాలపై విచారణ జరిపేందుకు సువేందు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. గతంలో కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఉదంతంతో పాటు సందేశ్‌ఖాలీలో వెలుగుచూసిన మహిళలపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో, నూతన ప్రభుత్వం మహిళా రక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారంలో తాము ఇచ్చిన  భత్, నాట్ భత్తా   అంటే.. ఉచిత భత్యాలు కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముఖ్యం  అనే నినాదానికి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సువేందు అధికారి స్పష్టంగా చెప్పారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును మతపరమైన కార్యక్రమాలకు కాకుండా, ప్రజా సంక్షేమానికి మళ్లించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్న భామ భాగ్యశ్రీ బోర్సే. కానీ విజయం అనేది మాత్రం దక్కడం లేదు. అయినా కూడా వరుస క్రేజీ ఆఫర్స్ ని దక్కించుకుంటూ ముందుకెళ్తుంది.   కమల్ హాసన్‌కి  చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' ఆర్. మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్న భారీ యాక్షన్ రూరల్ డ్రామా 'సెయాన్'.ఈ చిత్రంలో  భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైంది. ఇటీవల భాగ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నెమలి పించం పట్టుకుని ఎంతో ప్రశాంతంగా, అందంగా కనిపిస్తున్న భాగ్యశ్రీ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మురుగన్ (కార్తికేయ) దేవుడికి చిహ్నమైన నెమలి పించాన్ని చూపించడం ద్వారా ఈ సినిమాలో డివోషనల్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయనే హింట్ ఇచ్చారు మేకర్స్. 'తాయి కిళవి' ఫేమ్ దర్శకుడు శివకుమార్ మురుగేశన్  దర్శకత్వం వహిస్తున్నాడు. మధురై గ్రామీణ నేపథ్యంలో, అక్కడి సంప్రదాయ 'మాసి కలరి' పండుగ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గారూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ ఒక ఆర్మీ సోల్జర్‌గా కనిపిస్తారని, ఆ తర్వాత ఊరి ప్రజల కోసం పోరాడే యాక్టివిస్ట్‌గా మారతారని కోలీవుడ్ వర్గాల సమాచారం. మ్యూజిక్ మేజిషియన్' సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, వివేక్ విజయకుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Also read: Dragon: డ్రాగన్ గ్లింప్స్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్స్  శివకార్తికేయన్ గత చిత్రం పరాశక్తి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ ఆయనకు ఎంతో కీలకంగా మారింది. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం అక్కినేని అఖిల్ సరసన భారీ బడ్జెట్ చిత్రం 'లెనిన్' లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు భాగ్యశ్రీ కెరీర్‌ను మలుపు తిప్పుతాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 'సెయాన్' ని  2026 అక్టోబర్ నెలలో దసరా కానుకగా భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.    
  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వన్ మాన్ షో డ్రాగన్(Dragon)నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.  . సుమారు నాలుగు నిమిషాల నిడివితో ఉండగా డ్రాగన్ గా ఎన్టీఆర్ విశ్వరూపాన్ని మరో సారి చూడబోతున్నామని స్పషంగా తెలియచేస్తుంది. ఫ్యాన్స్ అయితే  గ్లింప్స్ అనే పేరేగాని  ఫుల్ మీల్స్ పెట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ప్రశాంత్ నీల్  గ్లింప్స్ తోనే  డ్రాగన్ కథతో పాటు క్యారెక్టర్స్ యొక్క లక్ష్యాన్ని చెప్పేసాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు డ్రాగన్  గ్లింప్స్ పై స్పందిస్తు గ్లింప్స్ ఒక రేంజ్ లో ఉంది.  ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం. ముఖ్యంగా ఎన్టీఆర్ నుంచి వచ్చిన డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎప్పుడెప్పడు థియేటర్స్ లోకి డ్రాగన్ అడుగుపెడుతుందా అని చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు. డ్రాగన్ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో జూన్ 11 న విడుదల కానుంది.   
మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ అఫీషియల్ టైటిల్‌ను ప్రకటిస్తూ, మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ గ్లింప్స్‌ను మే 19వ తేదీ అర్ధరాత్రి 11 గంటల 52 నిమిషాలకు చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు 'డ్రాగన్' (Dragon) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు విడుదలైన 'డ్రాగన్ ప్రిల్యూడ్ గ్లింప్స్' (Dragon Prelude Glimpse) ఆ అంచనాలను వంద రెట్లు పెంచేసిందని చెప్పాలి. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే ప్రశాంత్ నీల్ సృష్టించిన ఆ డార్క్ యాక్షన్ ప్రపంచం చూసి నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ అద్భుతమైన గ్లింప్స్ మేకింగ్ మరియు కథాంశం విషయానికి వస్తే, దర్శకుడు ప్రశాంత్ నీల్ తన మార్క్ సిగ్నేచర్ స్టైల్ నరేషన్‌తో వీడియోను ప్రారంభించారు. భారతదేశంలో బ్రిటిష్ వలసరాజ్యాల కాలం నాటి మూలాలను వెలికితీస్తూ కథను ఎంతో ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఆ నల్లటి చీకటి సామ్రాజ్యంలో ఓపియం (నల్లమందు) కోసం బ్రిటిష్ వారు మన దేశంలోకి ఎలా ప్రవేశించారనే చారిత్రక నేపథ్యంతో ఈ డ్రాగన్ ప్రపంచాన్ని ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్‌లో చిత్రంలోని కీలక పాత్రలను ఎంతో పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. ముందుగా హీరోయిన్ రుక్మిణి వసంత్ లుక్‌ను చూపించగా, ఆ తర్వాత అంతర్జాతీయ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న భయంకరమైన విలన్ల గ్యాంగ్‌ను ఎలివేట్ చేశారు. అలాగే, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఈ చిత్రంలో ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టం చేశారు. అయితే, వీరందరి కంటే హైలైట్‌గా నిలిచింది ఎన్టీఆర్ రా అండ్ రస్టిక్ అవతారమే. గ్లింప్స్ చివరి భాగంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా ఒక భయంకరమైన, క్రూరమైన అసస్సిన్ (హంతకుడు) పాత్రలో దర్శనమిచ్చారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పూర్తి లీన్ అండ్ సిక్స్ ప్యాక్ చేజ్డ్ బాడీతో కొత్త మేకోవర్‌లోకి మారిపోయారు. శవాల దిబ్బల మధ్య, రక్తం ఏరులై పారుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ థియేటర్లను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. "ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే చాలు.. ఇక సమస్తం మర్చిపోవాల్సిందే" అంటూ ఎన్టీఆర్ తన బేస్ వాయిస్‌తో చెప్పిన డైలాగ్, ఆయన కళ్లల్లోని రౌద్రం ప్రేక్షకుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో రవి బస్రూర్ అందించిన మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్, కెమెరా పనితనం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026-2027 మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా నిలిచింది. ఈ గ్లింప్స్ చూస్తుంటే థియేటర్లలో బ్లడ్ బాత్ అండ్ మాస్ విద్వంసం గ్యారెంటీ అని స్పష్టమవుతోంది.
To celebrate NTR’s birthday, fans were treated to a massive 4-minute and 28-second glimpse from his highly anticipated film, Dragon. Produced on a grand scale by Mythri Movie Makers and Nandamuri Taraka Ramarao Arts, the project boasts a formidable ensemble. The film, directed by Prashanth Neel, features NTR in the lead role of Luger, sharing the screen with celebrated actors like Anil Kapoor as Raghuveer Rathod, Ashutosh Rana as Dada Sarkar, Biju Menon as Jameel, and Rukmini Vasanth. With this extensive glimpse, director Prashanth Neel seems to have consciously corrected a narrative misstep from Salaar Part-1: Ceasefire. By choosing not to hold back the heavy lore, he avoids the trap of confusing the theatrical audience with too much information at once. Instead, he smartly uses this exposition-heavy video to introduce the dense background of the story and set it up clearly. This allows the audience to easily digest the complex history long before stepping into the cinema. The ambitious scale and expansive detailing of Neel's vision take center stage in this setup. Grounded in a 1967 backdrop involving the global opium trade, the dark aesthetics undeniably feel like an extended Salaar premise. Furthermore, Neel remains firmly in his familiar KGF zone, taking a smuggler as his hero and elevating him to the terrifying status of a devil. The world is filled with massive stakes and dangerous players, but the narrative focus remains firmly anchored to the central anti-hero. What truly stands out, however, is Prashanth Neel's impressive ability to present a completely different NTR. As Luger, NTR completely sheds the familiar aura of his previous films, stepping into a rugged, intense, and menacing avatar. His raw, dark look perfectly matches the brutal world Neel has crafted, leaving a striking impact and promising a ruthless character that audiences have never witnessed before. Ravi Basrur BGM feels International and the Dragon is releasing globally on 11th June 2027.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రాకింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే.. ‘ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను సూపర్ మ్యాన్‌ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం. వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుంది. అలా ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించు కుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు. అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టాం. నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే. ‘ఐక్య’ ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది? నియమాలు ఏంటి? ‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదు. మేం ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ‘ఐక్య’కి ఇతర వివరాల్ని ఎప్పుడు ప్రకటిస్తారు? జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో ‘రక్షక్’ చిత్రం ఉంటుంది. అందులో నేను డీసీపీగా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాను. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను. అంతలోపు ‘ఐక్య’ కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటాను. మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది? కథల ఎంపికలో పూర్తి నిర్ణయం మీదేనా? నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన విజయ్ కనకమేడల గారికి, కార్తిక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు ప్రతీ స్క్రిప్ట్, కథని నేనే విన్నాను. నేనే ఓకే చేశాను. ఇప్పుడు కూడా నేనే వింటాను. నాకు నచ్చిన కథల్నే చేస్తాను. నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య గానీ, ఆమె వృత్తిపరమైన జీవితంలోకి నేను గానీ వెళ్లం. మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరిని గౌరవించుకుంటాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు. మే 20 అంటే ఎన్టీఆర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టిన రోజు కూడా కదా..? నా పుట్టిన రోజుని తారక్ అన్నతో, స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. సిరివెన్నెలగారికి అంతం అంటూ ఉండదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనలోనే ఉంటారు. ‘డేవిడ్ రెడ్డి’ ఎలా ఉండబోతోంది? నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పేకంటే రేపు (మే 20) సాయంత్రం గ్లింప్స్ రాబోతోంది. మాటల కంటే మన పని చెబితేనే బెటర్. షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. హనుమా రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఈ మధ్యే షూటింగ్ చేసి వచ్చాం. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. ‘వాట్ ది ఫిష్’ పరిస్థితి ఏంటి? ‘వాట్ ది ఫిష్’ ఇప్పుడు రావడం లేదు. అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. నేను, సత్య, వెన్నెల కిషోర్ అందరం కలిసి చేయాల్సిన సినిమా. చివరి నిమిషంలో చాలా మందికి వీసా ప్రాబ్లం వచ్చింది. స్క్రిప్ట్ బాగుంది. మిగిలిన అన్ని పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి. ‘మోహన రాగ మ్యూజిక్’ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ‘మోహన రాగ మ్యూజిక్’ చాలా బాగా వస్తుంది. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సింగర్లు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పాటలు రికార్డ్ అయ్యాయి. మరో నాలుగు పాటలు రెడీ కావాల్సి ఉంది. ఇంకో రెండు, మూడు నెలల సమయం పట్టేలా ఉంది. ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి చెప్పండి? మౌనిక గారు ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారు. త్వరలోనే బెంగళూరులో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆమెకు నేను జస్ట్ సపోర్ట్‌గా ఉంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పండి? ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్‌లు ఈ నెలలోనే వస్తాయి. ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నాను. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా వెలిగిన జయప్రద పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తన నటనతో మరియు అందంతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెండితెరపై సుదీర్ఘ కాలం అలరించిన ఈ అందాల నటి, ప్రస్తుతం రాజకీయ రంగంలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్‌తో ఉన్న అనుబంధాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన అద్భుతమైన అనుభవాలను పంచుకున్నారు. సినిమా మేకింగ్‌లో దర్శకుడి పాత్ర అత్యంత కీలకమని జయప్రద పేర్కొన్నారు. డైరెక్టర్ సీనియర్ అయినా లేదా కొత్తవారైనా సరే, వారు చెప్పిన సూచనలను గౌరవించి పాటించడమే ఒక నిజమైన నటుడి బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. కథను నమ్మి దర్శకుడి విజన్‌కు అనుగుణంగా నడుచుకున్నప్పుడే మంచి అవుట్‌పుట్ వస్తుందని వివరించారు. రాజేంద్ర ప్రసాద్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాయి, అలరించాయి. అయితే, దాదాపు 36 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు సీనియర్ నటులు మళ్లీ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం రీయూనియన్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తెరకెక్కించిన ‘లవ్ ఎట్ 65’ (Love at 65) అనే చిత్రంలో వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. మారుతున్న కాలానికి మరియు నేటి ట్రెండ్‌కు తగినట్లుగా విభిన్నమైన సబ్జెక్టులతో వచ్చే చిత్రాల్లో నటించడం తనకు ఎంతో ఎనర్జీని ఇస్తుందని జయప్రద తెలిపారు. ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండరీ నటులు, దర్శకుల పర్యవేక్షణలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని, ప్రతి సినిమా షూటింగ్ సెట్ నుండి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు. జయప్రద అసలు పేరు లలితా రాణి కాగా, ఆమె రాజమండ్రిలో జన్మించారు. క్లాసికల్ డాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆపై టాలీవుడ్, బాలీవుడ్‌లలో అగ్ర నటిగా ఎదిగిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈ సీనియర్ స్టార్స్ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం చూసి ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు అభిమానులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్, జయప్రద కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ సీనియర్ నటి మరిన్ని విభిన్నమైన పాత్రలతో వెండితెరపై మెరిసి, ప్రేక్షకులను అలరించాలని సినీ ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త కంటెంట్‌తో వస్తున్న వెబ్ సిరీస్‌లకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్లకు ఓటీటీ ప్రియుల్లో ఎప్పుడూ ఉండే క్రేజే వేరు. ఈ క్రమంలోనే విద్యావ్యవస్థలోని లోపాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో వచ్చిన ఒక సరికొత్త వెబ్ సిరీస్ ఇప్పుడు డిజిటల్ దునియాను ఊపేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు 'ఎగ్జామ్: ది సిస్టమ్ ఎక్స్‌పోజ్‌డ్'. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్, కేవలం వారం రోజుల్లోనే దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఇండియన్ టాప్ 10 లిస్టులో ఏకంగా మూడో స్థానంలో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సిరీస్ కథాంశం విషయానికి వస్తే.. నేటి పోటీ పరీక్షల ప్రపంచంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం సంవత్సరాల తరబడి శ్రమించే అభ్యర్థుల జీవితాలు ఒకే ఒక్క పేపర్ లీకేజీతో ఎలా రోడ్డున పడుతున్నాయనేది హార్ట్ టచింగ్‌గా ఆవిష్కరించారు. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కొందరు చేసే మోసాలు, ఈ నెట్‌వర్క్ వెనుక ఉండే పెద్ద తలకాయలు ఎవరనే కోణంలో కథ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ సిరీస్‌లో దుషారా విజయన్, అదితి బాలన్ వంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. పుష్కర్-గాయత్రి సమర్పణలో, సర్గుణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను వాల్‌వాచర్ ఫిల్మ్స్ నిర్మించింది. నటీనటుల పర్‌ఫార్మెన్స్, రియలిస్టిక్ టేకింగ్ ఈ సిరీస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నీట్ (NEET) ఎగ్జామ్ పేపర్ లీక్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న తరుణంలో, సరిగ్గా అదే పాయింట్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సిరీస్ రావడం దీనికి మరింత ప్లస్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ సిరీస్‌పై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో పాటు ప్రముఖ రేటింగ్ సంస్థ 'ఐఎమ్‌డీబీ' (IMDb)లో కూడా ఈ సిరీస్‌కు ఏకంగా 8.4/10 రేటింగ్ లభించడం విశేషం. ఈ మధ్య కాలంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు ఈ స్థాయి రేటింగ్ రావడం చాలా అరుదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి సస్పెన్స్, సమాజానికి అవసరమైన సందేశంతో కూడిన రియలిస్టిక్ డ్రామాను చూడాలనుకునే వారికి ఈ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు ఆడియెన్స్ కోసం తెలుగు ఆడియోలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్ వాచ్ కోసం ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోండి!
RawKing Manoj Manchu held a heartfelt and extensive press meet where he spoke about AIKYA DHAIRYA SENA SAMITHI, social responsibility, freedom of speech, films, politics, women empowerment, upcoming projects and more. Starting the interaction, Manoj spoke about the beginning of the organization and the thought behind its formation. “So we thought to go statewide and started with blood camps. On the first day, we launched it at Kukatpally in Hyderabad. Then we did it at Kurnool, and I thank everyone who came forward. It was also conducted in Kakinada. Then it was conducted at Tirupati, Vizag and some other places. This will not stop. It shall continue, and I really wish to continue it. It will be a platform for the people who want to give back and serve society. And it shall become a voice for the people who are voiceless in society. And the reason we named it AIKYA DHAIRYA SENA SAMITHI is because I strongly believe that if we keep getting divided, it is going to end badly. This division is the gift left behind by the Britishers. So we have to stay united, and that is why AIKYA. We ourselves wanted to hold strong respect, responsibility and fear for this trust, so we named it after our children Dhairav and Devasena. AIKYA DHAIRYA SENA SAMITHI is also our own child, and it shall be brought up with such care and concern.” The interaction then continued with a detailed Q&A session. Q: Do you have any agenda? Protocols? Manoj: “As of now, no andi. We are seeking professionals to shape up everything. We started in a very unorganized way, and now we have started organizing it. And it’s not like we are limited to only this; we are open to everything. People are reaching out to us for various sorts of help. For example, yesterday we had an influencers’ meet. They mentioned that if they raise their voice against biggies, they are putting video strikes on us, and we are getting threatening calls. And I told them that the AIKYA organization will stand by them. We shall take it legally forward and also assured them that we shall safeguard their freedom of speech. We are going to be very strong about such things. We are not going to step back.” Q: So we know Manoj as a hero, Rocking Star, and then we saw you as a co-star and antagonist. So what is Manoj now? Manoj: “I’m an actor. Just an actor.” Q: Do you want to come into politics? Manoj: “What is there to newly come into it when I’m born in it? On the people’s side.” Q: Who is the decision-maker for your things? Manoj: “I stopped agreeing to do films in 2016 because too many people were getting involved. So, Manoj is the only person that gets involved, and it is solely mine only. Even my wife Mounika stands as support to me, but we don’t make decisions for each other.” Q: Do you have any strong support, or are you doing it on your own? Manoj: “Of course, we are doing it on our own. If there are certain things that are beyond our capacity, we are reaching out for support and raising fundraisers. Like I said before, we are structuring it into an organization.” Q: So is there any political agenda to this? Manoj: “Absolutely no. We have been doing the service for a very long time. It’s just that we felt it’s time to shape it as an organization and make it a platform. That’s all. No political agenda.” Q: Can you speak about the women empowerment aspect of your organization? Manoj: “I always stand up for women’s issues. Then, now and always. If I say that I stand up for everyone, it includes women too. I don’t have to specifically mention it.” Q: Did you put in your own money for this? Manoj: “Yes, for now we are bringing in our own money. For the future, we have to figure it out.” Q: How special is your birthday? Manoj: “Well, I have to say it is very special. Usually, I celebrate with Tarak gaaru and legendary Sirivennela Seetharama Sastry gaaru, whom we are missing very badly. He is immortal.” Q: You are very active on social media to raise your voice. Recently, you also spoke about the Bandi Bhageerath issue too. How do you plan on reaching out and being available to everyone and every issue? Manoj: “See, I’m not a superhero who can be available to everyone and everything all the time. I have my own life and things to take care of, and that is the reason this organization is formed. And this trust functions regardless of my availability.” Q: Well, what about the social issues? Manoj: “One hundred percent, we will be the voice for the voiceless.” Q: How can people reach out to your organization? Manoj: “On June 7th, with God’s grace, we are starting the movie *Rakshak. It shall have a grand ceremony. It is a women empowerment story, and I play a DCP. It addresses certain issues in society, how to handle them and how to take them forward. Director Naveen wrote a brilliant movie. He is debuting with this film, and he has been working on this for the last three years.* And along with that film opening, we shall announce the trust details, contact numbers, emails, and I shall put forward our rules of functioning.” Q: Is it limited to one place? Manoj: “It works for Telugu people anywhere.” Q: Tell us about David Reddy. Manoj: “The film’s glimpse is going to come out in a couple of days. That itself will do the talking. We are done with 40% of the shoot. It is a very big large-scale film. Hunman Reddy and Venu Acharya are not compromising on any aspect. Recently, we went to Indore for a 20-day schedule. The CM of the state and the official authorities took care of us very well. I thank the MP and Indore government for supporting us.” Q: Are you choreographing anything in these projects? Manoj: “We have an excellent team, so there wasn’t that need for me. They are coming out really well.” Q: Speak about your physical transformation. Manoj: “Everything is hard when it comes to transformation, and even physical transformation comes with challenges. It was really hard to control myself during the first three weeks. Once that phase is crossed, you are good.” Q: What did your father say? Manoj: “How can anyone do anything without that? Of course, I have my father’s blessing.” Q: Are your family issues resolved? Manoj: “If you know whom to ask, ask them.” Q: What about the movie What The Fish? Manoj: “Unfortunately, the film is not happening. Me, Satya and Vennela Kishore were very much excited, but due to some casting issues it got cancelled. We tried a lot, but it didn’t happen.” Q: Can you speak about Mohana Raga? Manoj: “It is coming out really good. We are making an album with very good musicians and technicians. Four songs are already recorded, and four more are left to go. It might take another two to three months to come out.” Q: Tarak’s birthday and your birthday are on the same day, and both teasers are releasing on the same day. Everyone is waiting for them. How do you feel about it? Manoj: “I’m excited. When there is good content, it doesn’t matter how many are coming.” Q: You started a toy-making company and said you wanted to expand it. Talk about that. Manoj: “Yes, *Namasthe Toys is the name and Namasthe World is the brand. Mounika gaaru is starting it in the Telugu states and Bengaluru with sports toys. It is also a platform, and within a couple of weeks we shall come up with complete details about it, and she herself shall speak about it.” Q: Your family has a political legacy too. Are you guys planning to get into politics directly? Manoj: “My wife will definitely get into direct politics and actively contest in the next elections.” Q: Do you plan to stand for MAA elections? Manoj: “No. Not for me!” Closing the interaction on a grounded yet optimistic note, 'RawKing' Manoj Manchu reiterated that both his social initiatives and cinematic journey are moving forward with equal passion and responsibility. With AIKYA DHAIRYA SENA SAMITHI gradually expanding its reach across regions, Manoj emphasized that the organization will continue evolving as a people-first platform dedicated to service, support and social responsibility. On the professional front, Manoj currently has an exciting and diverse slate of projects in progress. While the large-scale action film David Reddy is progressing rapidly with nearly 40% of the shoot completed, Rakshak is gearing up for its grand launch ceremony on June 7th. Balancing Cinema, social responsibility and public outreach simultaneously, 'RawKing' Manoj Manchu appears to be entering a new phase - one driven not just by screen presence, but by purpose, accountability and connection with the people. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా నటుడిగా సంచలనాలు సృష్టించిన దళపతి విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు కలుస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆయన విజయ్‌కు ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రులను కలిసినప్పుడు విలువైన జ్ఞాపికలు, శాలువాలు లేదా విగ్రహాలు బహుమతిగా ఇవ్వడం చూస్తుంటాం. కానీ వెంకట్ ప్రభు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించారు. విజయ్‌తో కలిసి తాను చేసిన 'గోట్' (The Greatest Of All Time) సినిమాలోని ఒక ఆసక్తికరమైన వస్తువును ఆయనకు కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. 'గోట్' సినిమాలో హీరో విజయ్ వాడిన ఒక లగ్జరీ కార్ నంబర్ ప్లేట్. అవును, ఆ సినిమాలో విజయ్ నడిపే కారుకు 'TN 07 CM 2026' అనే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్ ఫోటోను చక్కగా ఫ్రేమ్ కట్టించి మరీ సీఎం విజయ్ చేతుల్లో పెట్టారు వెంకట్ ప్రభు. ప్రస్తుతం ఈ అరుదైన గిఫ్ట్‌కు సంబంధించిన పిక్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. నిజానికి 'తమిళ వెట్రి కళగమ్' పార్టీని స్థాపించిన కొత్తలోనే విజయ్ 'గోట్' సినిమాలో నటించారు. ఆ సమయంలోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు భవిష్యత్తును ముందే ఊహించి, 2026 ఎన్నికల్లో విజయ్ గెలవడం ఖాయమని నమ్మారు. అందుకోసమే సినిమాలో కారు నంబర్‌లో 'CM 2026' వచ్చేలా డిజైన్ చేశారు. ఆయన ఊహించినట్లే ఎన్నికల ఫలితాల్లో విజయ్ ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దీంతో వెంకట్ ప్రభు విజన్‌ను, ఆయన ముందే ఊహించిన తీరును కోలీవుడ్ వర్గాలు తెగ అభినందిస్తున్నాయి. తన మనసుకు నచ్చిన హీరో కమ్ సీఎంకు ఈ ప్రత్యేక జ్ఞాపికను అందించడంపై వెంకట్ ప్రభు సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ కూడా ఈ వెరైటీ గిఫ్ట్ చూసి ఎంతగానో మురిసిపోతూ, ఆనందంగా స్వీకరించారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో బయటకు రాగానే దళపతి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. "మా అన్న ఎప్పుడో సీఎం అవుతాడని డైరెక్టర్ ముందే ఫిక్స్ అయ్యాడు.. ఇదీ అసలైన విజన్ అంటే" అంటూ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. వెంకట్ ప్రభు మేకింగ్ లోనే కాదు, ఇలాంటి గిఫ్ట్‌లు ఇవ్వడంలోనూ చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
రాకింగ్ స్టార్ మనోజ్ మంచు (Manoj Manchu) ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే.. ‘ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను సూపర్ మ్యాన్‌ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం. వాయిస్ లెస్‌కి వాయిస్‌గా ఈ ట్రస్ట్ ఉంటుంది. అలా ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టడానికి చాలా కారణాలున్నాయి. ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. విభజించుకుంటూ వెళ్తే చివరకు ఏమీ మిగలదు. అందుకే అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్య అని పెట్టాం. నా కొడుకు పేరు ధైరవ్, నా బిడ్డ పేరు దేవ సేన ఇలా అందరి పేర్లు కలిపి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పెట్టాం. ఈ ట్రస్ట్ కూడా మాకు ఓ బిడ్డ లాంటిదే. ‘ఐక్య’ ట్రస్ట్ ఎలా వర్క్ చేస్తుంది? నియమాలు ఏంటి? ‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. ఎప్పటి నుంచో ఇలాంటి ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి సంబంధించిన నియమాల్ని ఇంకా రూపొందించలేదు. మేం ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం మేం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాం. ‘ఐక్య’కి ఇతర వివరాల్ని ఎప్పుడు ప్రకటిస్తారు? జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళా సాధికారత నేపథ్యంలో ‘రక్షక్’ చిత్రం ఉంటుంది. అందులో నేను డీసీపీగా పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాను. ఆ మూవీ ప్రారంభోత్సవం నాడే ‘ఐక్య’కి సంబంధించిన అన్ని విషయాల్ని అధికారికంగా ప్రకటిస్తాను. అంతలోపు ‘ఐక్య’ కోసం మీడియా వారి నుంచి కూడా సలహాలు తీసుకుంటాను. మీ సినీ ప్రయాణం ఎలా సాగుతోంది? కథల ఎంపికలో పూర్తి నిర్ణయం మీదేనా? నాకు సినిమాల్లో మళ్లీ పునర్జన్మను ఇచ్చిన విజయ్ కనకమేడల గారికి, కార్తిక్ ఘట్టమనేని గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం అన్ని రకాల పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. కెరీర్ ప్రారంభం నుంచీ ఇప్పటి వరకు ప్రతీ స్క్రిప్ట్, కథని నేనే విన్నాను. నేనే ఓకే చేశాను. ఇప్పుడు కూడా నేనే వింటాను. నాకు నచ్చిన కథల్నే చేస్తాను. నా వృత్తిపరమైన జీవితంలోకి నా భార్య గానీ, ఆమె వృత్తిపరమైన జీవితంలోకి నేను గానీ వెళ్లం. మేం పరస్పరం ఆ విషయంలో ఒకరినొకరిని గౌరవించుకుంటాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం అని ఏముంది. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ చేస్తారు. మే 20 అంటే ఎన్టీఆర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టిన రోజు కూడా కదా..? నా పుట్టిన రోజుని తారక్ అన్నతో, స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉంటుంది. సిరివెన్నెల గారికి అంతం అంటూ ఉండదు. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు. మనలోనే ఉంటారు. ‘డేవిడ్ రెడ్డి’ ఎలా ఉండబోతోంది? నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పేకంటే రేపు (మే 20) సాయంత్రం గ్లింప్స్ రాబోతోంది. మాటల కంటే మన పని చెబితేనే బెటర్. షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. హనుమా రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఈ మధ్యే షూటింగ్ చేసి వచ్చాం. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మా అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. ‘వాట్ ది ఫిష్’ పరిస్థితి ఏంటి? ‘వాట్ ది ఫిష్’ ఇప్పుడు రావడం లేదు. అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. నేను, సత్య, వెన్నెల కిషోర్ అందరం కలిసి చేయాల్సిన సినిమా. చివరి నిమిషంలో చాలా మందికి వీసా ప్రాబ్లం వచ్చింది. స్క్రిప్ట్ బాగుంది. మిగిలిన అన్ని పరిస్థితులు కూడా కలిసి రావాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి. ‘మోహన రాగ మ్యూజిక్’ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ‘మోహన రాగ మ్యూజిక్’ చాలా బాగా వస్తుంది. అద్భుతమైన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సింగర్లు పని చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు పాటలు రికార్డ్ అయ్యాయి. మరో నాలుగు పాటలు రెడీ కావాల్సి ఉంది. ఇంకో రెండు, మూడు నెలల సమయం పట్టేలా ఉంది. ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి చెప్పండి? మౌనిక గారు ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారు. త్వరలోనే బెంగళూరులో, రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఆమెకు నేను జస్ట్ సపోర్ట్‌గా ఉంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి చెప్పండి? ప్రస్తుతం నా చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్‌లు ఈ నెలలోనే వస్తాయి. ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నాను. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాను.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక విలువైన సంబంధం. అయితే ఈ బంధం  ఎప్పుడూ తగాదాలు,  వాదనలతో నిండి ఉంటుంది.  కానీ గొడవ అయినా, తగాదాలు అయినా  భర్త పదేపదే  అబద్ధం చెప్పడం చాలా ఇబ్బందికర విషయం.  ఇలా  అబద్ధాలు చెప్పడం భార్యను బాధకు గురిచేస్తుంది. భర్త చెప్పేవి అబద్దాలు అని తెలిసినా సరే.. కొందరు భార్యలు తమ భర్తల విషయంలో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉంటారు. మరికొందరు గొడవ పడుతుంటారు. అయితే ఇలా గొడవ పడటం వల్ల భార్యాభర్తల బంధానికే ముప్పు వాటిల్లుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భర్త ఇంకోసారి అబద్దం చెప్పకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.  వాటిని ఫాలో అయితే భర్తలు అబద్దం చెప్పడం మానేస్తారు.  అవేంటో తెలుసుకుంటే.. భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటును ఎలా వదిలించాలి..  భర్త  భార్యకు  అబద్ధం చెబితే, అది సంబంధానికి పెద్ద సమస్యగా మారవచ్చు. అబద్ధం చెప్పడం వల్ల భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతుంది.  సంబంధంలో చీలిక ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి  కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు.  భర్తతో బహిరంగంగా మాట్లాడవచ్చు.. భర్త అబద్దాలు చెబుతుంటే భార్య వాటిని ఊరికే సహించడం చేయకుండా నేరుగా  భర్తతో ఓపెన్ గా  మాట్లాడాలి. అబద్ధం ఎంత ప్రమాదకరమూ,  అది భార్యను  ఎలా బాధపెడుతుందో వివరించాలి. ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు భర్తకు ఆ విషయాలు అర్థం కావడం కోసం కొన్నిఉదాహరణలు కూడా చెప్పవచ్చు. అతను చెప్పిన అబద్దాల వల్ల ఏ సందర్భంలో ఎంత బాధ అనుభవించారనేది చెప్పవచ్చు.  ఇలా చేస్తే భర్తలో ఆలోచనలు కలిగి అతను అబద్దం చెప్పడం మానుకునే అవకాశం ఉంటుంది. కారణాలు అర్థం చేసుకోవాలి.. భర్త అబద్దం చెప్పడం అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. అతను ఎలాంటి సందర్బంలో, పరిస్థితిలో అబద్దం చెప్పాడు అనే విషయాన్ని కూడా కూడా అర్థం చేసుకోవడం భార్య బాధ్యత.  ఇలా అర్థం చేసుకుంటే  తన భావాలను భార్య అర్థం చేసుకుంటోందని అతను గ్రహిస్తాడు.  అతని అబద్ధాల వెనుక గల కారణాలను అర్థం చేసుకుంటే ఆ తరువాత అతను ఎప్పుడైనా అర్థం చెప్పినా అదంత బాధ లేదా కోపాన్ని కలిగించదు.   పరిష్కారం.. భార్య భర్తకు ఎలాంటి పరిస్థితిలో అయినా  అండగా ఉన్నారని,  ఏవైనా సమస్యలు వస్తే వాటి పరిష్కార మార్గాలు కనుగొనడంలో అతనికి సహాయం చేస్తారని అతనికి  అర్థమయ్యేలా చేయాలి. ఇలా చేస్తే భర్త ఏ సమస్య వచ్చినా తన భార్య కూడా తనకు సమస్య పరిష్కారంలో తోడు ఉంటుందనే భరోసాతో అబద్దాలు చెప్పకుండా ఏ విషయాలు దాపరికం లేకుండా ఉంటారు.   బయటి నుండి సహాయం.. పైన చెప్పుకున్న చిట్కాలన్నింటినీ అనుసరించిన తర్వాత కూడా భర్త ప్రవర్తన మెరుగుపడకపోతే.. భార్య  మంచి సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు భర్త అబద్ధం చెప్పడం మానేయడానికి  అతను చేస్తున్నది ఎంత  తప్పు అనే విషయం  అర్థం చేసుకునేలా చేయడానికి  అతనితో సమయం గడపాలి. దగ్గరి వ్యక్తుల  సహాయం..   భర్త అబద్దాలు చెప్పడం అనే  సమస్యను కుటుంబానికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు,   స్నేహితులు,  ఆత్మీయులు మొదలైనవారితో  చర్చించవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు.  కాబట్టి కొంత ప్రశాంతంగా ఉండాలి.  భార్యాభర్తల బంధంలో అబద్దాలు చెప్పడం బంధాన్ని ఎంత ప్రమాదంలో పడేస్తుందో అతనికి అర్థమయ్యే వరకు వేచి ఉండాలి.                                *రూపశ్రీ.
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే.. పాత బంధాల ప్రస్తావన.. కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది. కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం.. పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఫిర్యాదులు.. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి. స్వేచ్ఛ.. పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.                               *రూపశ్రీ.
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం నుండి లభించే పోషకాలు రక్తంలోకి శోషించబడేది కూడా ప్రేగుల ద్వారానే. శరీరంలో ఇంత ముఖ్యమైన విధులు నిర్వర్తించే ప్రేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.  ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉంటే పైన పేర్కొన్న విధులు మందగిస్తాయి. శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందా లేదా తెలుసుకోవచ్చు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచించే లక్షణాలు.. ఆహారం తిన్న తర్వాత.. ఆహారం తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నా, బరువుగా అనిపించినా ప్రేగు ఆరోగ్యంగా బలహీనంగా ఉందని  అర్థం.  అయితే భారీ ఆహారం తీసుకున్నప్పుడు సాధారణంగానే ఉబ్బరంగా లేదా బరువుగా అనిపిస్తుంది. కానీ సాధారణ ఆహారం తీసుకున్నప్పుడు కూడా బరువుగా అనిపించడం, అది కూడా తరచుగా అనిపిస్తూ ఉంటే.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని అర్థం. మలబద్దకం.. ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఉండే అతిపెద్ద లక్షణం మలబద్దకం.  మలం గట్టిగా రావడం లేదా మలవిసర్జన చేసేటప్పుడు గట్టిగా బలవంతంగా విసర్జన చేయడానికి ప్రయత్నించడం వంటివి ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తాయి. అలాగే మలవిసర్జన ప్రతి రోజూ ఒకే సమయానికి కాకుండా అస్తవ్యస్తంగా రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. గ్యాస్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న గ్యాస్, ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు అన్నీ కేవలం ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వస్తున్నాయని అనుకుంటారు చాలామంది. కానీ ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉంటేనే ఈ సమస్యలు వస్తాయి. అది కూడా గ్యాస్,  ఎసిడిటీ,  ఛాతీలో మంట వంటి సమస్యలు పదే పదే వస్తాయి. నోటి ఆరోగ్యం.. నాలుక పైన తెల్లటి పూత రావడం, నోటి దుర్వాసన రావడం కూడా ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉందని చెప్పడానికి ఒక సూచన. చాలామందికి నోరు ఎంత శుభ్రం చేసుకున్నా నాలుక మీద తెల్లని పూత,  నోటి దుర్వాసన వస్తుంది. ఇలాంటి వారిలో ప్రేగు ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆకలి.. ఆకలి సరిగా లేకపోయినా లేదా  అతిగా ఆకలి వేసినా కూడా ప్రేగు ఆరోగ్యం సరిగా లేదని అర్థం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.                           *రూపశ్రీ.
మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం. వాటిలో అత్యంత కీలకమైనది పొటాషియం (Potassium). మన గుండె లయబద్ధంగా కొట్టుకోవాలన్నా, నరాలు మరియు కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా శరీరంలో పొటాషియం స్థాయిలు సమతుల్యంగా ఉండాలి. అయితే, చాలా మందికి దీని ప్రాముఖ్యత తెలియదు. రక్తంలో పొటాషియం స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువైనా లేదా తక్కువైనా అది నేరుగా ప్రాణాలకే ముప్పు తెస్తుంది.  ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ పాపారావు గారు తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ద్వారా అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO మీకోసం: 1. హైపర్ కలేమియా (Hyperkalemia) అంటే ఏమిటి? (పొటాషియం పెరగడం) రక్తంలో పొటాషియం శాతం సాధారణ స్థాయి కంటే పెరిగిపోవడాన్ని వైద్య పరిభాషలో 'హైపర్ కలేమియా' అంటారు. ప్రధాన కారణాలు: మనం తినే ఆహారంలోని అదనపు పొటాషియంను మూత్రపిండాలు (Kidneys) వడపోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రక్రియ సరిగ్గా జరగదు. దీనివల్ల పొటాషియం రక్తంలోనే పేరుకుపోతుంది. అలాగే కొన్ని రకాల బిపి (BP) మందుల వల్ల కూడా ఇది రావచ్చు. ప్రమాదాలు: పొటాషియం మోతాదు మించితే అది నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు (Arrhythmia) వస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో ఇది గుండె ఆగిపోవడానికి (Cardiac Arrest) దారితీస్తుంది. 2. హైపోకలేమియా (Hypokalemia) అంటే ఏమిటి? (పొటాషియం తగ్గడం) రక్తంలో పొటాషియం స్థాయిలు ఉండాల్సిన దానికంటే పడిపోవడాన్ని 'హైపోకలేమియా' అంటారు. ప్రధాన కారణాలు: శరీరానికి సరిపడా పొటాషియం ఉన్న ఆహారం తీసుకోకపోవడం, తీవ్రమైన విరేచనాలు (Diarrhea) మరియు వాంతులు (Vomiting) అవ్వడం వల్ల శరీరంలోని పొటాషియం బయటకు వెళ్ళిపోతుంది. విపరీతంగా చెమటలు పట్టడం లేదా కొన్ని రకాల మూత్రవిసర్జన మందులు (Diuretics) వాడటం వల్ల కూడా పొటాషియం తగ్గుతుంది. లక్షణాలు: పొటాషియం తగ్గినప్పుడు కండరాల బలహీనత, విపరీతమైన నీరసం, అలసట, కండరాలు పట్టేయడం (Muscle Cramps) మరియు మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది కూడా గుండె లయను దెబ్బతీస్తుంది. డాక్టర్ పాపారావు గారి ముఖ్యమైన సూచనలు: రక్త పరీక్షలు అవసరం: కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, బీపీ మందులు వాడుతున్న వారు క్రమం తప్పకుండా డాక్టర్ సలహాతో 'సిరమ్ ఎలక్ట్రోలైట్స్' (Serum Electrolytes) పరీక్ష చేయించుకోవాలి. ఆహార నియమాలు: కిడ్నీ సమస్యలు ఉన్న రోగులు పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు (కొబ్బరి నీళ్లు, అరటిపండ్లు, ఆకుకూరలు, బంగాళాదుంపలు) వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి.మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)