LATEST NEWS
ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే సంఘటన కేరళం  సీఎంగా సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆవిష్కృతమైంది.  రాజకీయ ప్రత్యర్థులంటే బద్ధ శత్రువులు అన్నట్లుగా మారిపోయిన నేటి పరిస్థితుల్లో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి హాజరు కావడం మాత్రమే కాకుండా ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వేదికపైకి వెళ్లి కొత్త ముఖ్యమంత్రిని అభినందించడం ప్రస్తుత కాలంలో అత్యంత అరుదనే చెప్పాలి. ఆ ఆరుదైన సంఘటన  కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం (మే 18)జరిగింది.  కేరళం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికలలో ఎల్ డీఎఫ్ పరాజయం పాలై.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా సతీశన్ సోమవారం (మే 18) ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా హాజరయ్యారు. రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ అధికారిక కార్యక్రమంలో  మాజీ సీఎం పినరయి విజయన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ఉన్న ఇతర ప్రముఖులు, నూతన ప్రభుత్వ ప్రతినిధులతో ఆయన ఎంతో సానుకూలంగా మాట్లాడారు. ఇరుపక్షాల నేతలు పరస్పరం పలకరించుకుంటూ, నవ్వుతూ ముచ్చటించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేరళలో చోటుచేసుకున్న ఈ పరిణామం ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వాతావరణానికి వేదికగా నిలిచింది. రాజకీయ సిద్ధాంతాలు, ఎన్నికల వ్యూహాలు వేరైనా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొత్త ప్రభుత్వానికి గౌరవం ఇవ్వాలనే సత్సంప్రదాయాన్ని పినరయి విజయన్ ఈ విధంగా  పాటించి ఆదర్శంగా నిలిచారు.  ఈ  రాజకీయ హుందాతనం కేరళం రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. పంతాలు, పట్టింపులకు పోకుండా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజల్లోకి కూడా ఒక సానుకూల సందేశం వెళ్తుందని విశ్లేషకులు అంటున్నారు.  కేరళం జనం మాత్రం ఈ అరుదైన రాజకీయ కలయికను సానుకూల దృక్పథంతో ఆహ్వానిస్తున్నారు. రాజకీయాలు అంటేనే నిరంతర వైరుధ్యాలు, ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శల ప్రతివిమర్శలు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే వ్యూహ ప్రతివ్యూహాలు మాత్రమే గుర్తొస్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో నాయకుల మధ్య కనిపించే వ్యక్తిగత, రాజకీయ శత్రుత్వం ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఈ రాజకీయ రణరంగంలో అప్పుడప్పుడు కొన్ని అత్యంత అరుదైన, అందరినీ ఆశ్చర్యపరిచే హృదయపూర్వక దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం ఇటీవల కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకలో చోటుచేసుకుంది. అధికారాన్ని కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి, సరికొత్తగా పీఠాన్ని అధిరోహిస్తున్న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్వయంగా హాజరవడం అక్కడ ఉన్నవారినే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులను సైతం విశేషంగా ఆకర్షించింది. సాధారణంగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని రాజకీయ వాతావరణం ఉన్న ఈ రోజుల్లో, పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలపడానికి వేదికపైకి రావడం ప్రజాస్వామ్యానికే ఒక గొప్ప అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రమాణ స్వీకార వేదికపై నూతన ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేస్తున్న సమయంలో, సభా ప్రాంగణంలో ఉన్న ప్రముఖుల వరుసలో మాజీ ముఖ్యమంత్రి ప్రశాంతమైన చిరునవ్వుతో కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం హాజరవడమే కాకుండా, ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే కొత్త ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఆత్మీయంగా కరచాలనం చేసి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అరుదైన దృశ్యం చూసిన అభిమానులు, రాజకీయ కార్యకర్తలు ఆనందంతో చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని, ప్రజా తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పనిచేయాలనే ఉన్నతమైన సంస్కారాన్ని ఈ సంఘటన ప్రతిబింబించింది. నిజానికి ఇటువంటి పరిణామాలు భారతీయ రాజకీయాల్లో ఆరోగ్యకరమైన వాతావరణానికి నాంది పలుకుతాయి. ఎన్నికల యుద్ధం ముగిసిన తర్వాత ప్రతిపక్షం, అధికారపక్షం అనే తేడా లేకుండా రాష్ట్ర ప్రగతి కోసం చేతులు కలపాలనే సందేశాన్ని ఈ ఇద్దరు నేతలు తమ ప్రవర్తన ద్వారా చాటిచెప్పారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తూ సాగిన ఈ అరుదైన దృశ్యం, సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల మనసులను గెలుచుకుంది. అధికార మార్పిడి ఎంత ప్రశాంతంగా, హుందాగా జరగాలో చూపించడానికి ఈ ఘట్టం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. పంతాలు, పట్టింపుల కంటే ప్రజా హితమే ముఖ్యమని నిరూపించిన ఈ అరుదైన పొలిటికల్ మూమెంట్, భవిష్యత్ తరాల నాయకులకు ఒక గొప్ప మార్గదర్శకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొత్త విద్యా సంవత్సరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.  ఈ ఏడాది జూన్ నుంచి 2026-27 విద్యాసంవత్సరం ఆరంభాన్ని ఓ భారీ విద్యాపండుగగా నిర్వహించేందుకు సమాయత్తమౌతోంది. ఆ రోజు అంటే రానున్న విద్యాసంవత్సరం మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుల్లోనూ  ఏకకాలంలో మూడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అవేంటంటే అదే రోజున తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాలో జమచేయనుంది. అలాగే అదే రోజు అంటే పాఠశాలలె తెరిచిన తొలి రోజునే విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రిని అందించనుంది. అలాగే అదే రోజు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నూ నిర్వహించనుంది.  బడులు తెరిచిన తొలి రోజే విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడంతో పాటు, వారి తల్లుల ఖాతాల్లోకి 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనితెలుగుదేశం కూటమి సర్కార్ పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి, పేద విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పించడమే లక్ష్యంగా ఇవి అమలు చేయనున్నారు.  వైసీపీ హయాంలో  పాఠశాలలు ప్రారంభమై నెలలు గడిచినా పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందేవి కావనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అమ్మఒడి నిధుల కోసం లబ్ధిదారులు మరుసటి ఏడాది వరకు నిరీక్షించాల్సి వచ్చేది. ఈ లోపాలకు స్వస్తి పలుకుతూ, విద్యా సంవత్సరం మొదటి రోజే అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 15,000 చొప్పున నగదు జమ చేయడానికి సర్కారు నిధులు సిద్ధం చేసింది.  కేవలం నగదు బదిలీ మాత్రమే కాకుండా, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా అదే రోజు స్టూడెంట్ కిట్ల పంపిణీని కూడా పూర్తి చేయనుంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, మూడు జతల యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బూట్లు, సాక్స్‌లతో కూడిన  విద్యా కిట్‌ను విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థుల చేతుల్లో పెట్టేలా అధికారులు  ఏర్పాట్లు  చేస్తున్నారు. దీనివల్ల కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.  ఇక అదే రోజున అంటే.. జూన్ 19న రాష్ట్రవ్యాప్తంగా  మెగా పేరెంట్-టీచర్ మీట్  నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా కార్పొరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన ఈ సంస్కృతిని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం ద్వారా, పిల్లల విద్యా ప్రణాళికలు, డిజిటల్ లెర్నింగ్,  వారి ప్రవర్తనపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒకే వేదికపై చర్చించే అవకాశం లభిస్తుంది. విద్యావ్యవస్థలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రత్యక్షంగా పెంచడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. నిధుల విడుదల, విద్యా కిట్ల పంపిణీ, మరియు ఉపాధ్యాయ-తల్లిదండ్రుల సమావేశం.. ఈ మూడింటినీ ఒకే రోజున సంపూర్ణంగా నిర్వహించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం   పెరుగుతుందని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. సకాలంలో అందుతున్న ఈ ప్రోత్సాహకాల వల్ల  డ్రాపౌట్స్  సంఖ్య గణనీయంగా తగ్గి, రాష్ట్రంలో అక్షరాస్యత రేటు మరింత మెరుగవుతుందని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపైసర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో  ఘన విజయం సాధించిన తమిళ స్టార్ హీరో , టీవీకే అధినేత విజయ్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన విజయ్ విజయం చారిత్రాత్మకంగా అభివర్ణించారు.  ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో   విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అద్భుతమైన విజయంతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి విదితమే. అయితే ఆ విజయం తరువాత తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యవహరించిన తీరు పలు విమర్శలకు దారి తీసింది. ఎన్నికలలో పరాజయం పాలైన డీఎంకే అధినేత స్టాలిన్ నివాసానికి వెళ్లి మరీ పలకరించి, పరామర్శించిన రజనీకాంత్, ఘన విజయం సాధించిన టీవీకే విజయ్ కు అభినందించలేదు. మరో పక్క.. కమల్ హసన్ స్వయంగా విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. కానీ రజనీకాంత్ మాత్రం విజయ్ కు మర్యాదపూర్వకంగా కలవకపోవడం, కనీసం అభినందనలు తెలియజేయకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.  రజనీకాంత్ అసూయతో విజయ్‌ను అభినందించలేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు మరియు అసూయ వార్తలపై రజనీకాంత్  స్పందించారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు, తమిళనాడులోని రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని విజయ్ ఈ ఘన విజయాన్ని సాధించారంటూ మీడియా ఎదుట విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సాధించిన విజయాల కంటే విజయ్ సాధించిన విజయం ఎంతో గొప్పదన్నారు. విజయ్ విజయం సాధించడం, ముఖ్యమంత్రి కావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదనీ, రాజకీయాలకు దూరమై చాలా కాలమైందని చెప్పారు. ఇక విజయ్ పై తాను అసూయ చెందుతున్నానని వస్తున్న వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేసిన రజనీకాంత్, తమ ఇద్దరి మధ్యా పాతికేళ్లకు పైన వయస్సు తూడా ఉందని గుర్తు చేశారు.  యువకుడైన విజయ్, రాజకీయాలకు అతీతంగా   స్వయంకృషితో, సొంత బలంతో రెండు పెద్ద పార్టీలను ఎదిరించి ఈ గుర్తింపు తెచ్చుకున్నాడని  ప్రశంసించారు. ఇక స్టాలిన్‌ను కలవడంపై వస్తున్న విమర్శలకు కూడా రజనీకాంత్ సమాధానం చెప్పారు. స్టాలిన్ తో తన స్నేహం రాజకీయాలకు సంబంధించినది కాదన్నారు.  కొలత్తూరులో స్టాలిన్ పరాజయం పాలు కావడం తనను ఎంతగానో బాధించిందని, అందుకే స్నేహపూర్వకంగా ఆయన్ను పరామర్శిం చానన్నారు.   ముఖ్యమంత్రిగా విజయ్ విజయం సాధించిన వెంటనే తాను ఫోన్ ద్వారా అభినందనలు తెలియజేశానని, ఇందులో దాచడానికి ఏమీ లేదన్న రజనీకాంత్..  ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలో తమిళనాడు  ప్రగతి పథంలో పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్వల్ప వ్యవధిలోనే..  పలు కీలక నిర్ణయాలతో రాజకీయాలకు అతీతంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు.   ఈ తరుణంలో  ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన  కోలత్తూరులో  ఊహించని రీతిలో ఓటమి పాలైన స్టాలిన్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.  అదలా ఉంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు   తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్  తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా త్వరలోనే తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.  ఈ ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీకి దిగి.. విజయ్‌తో  నేరుగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు..  డీఎంకే శ్రేణులు కూడా ఈ స్థానంపై తీవ్రంగా దృష్టి సారించాయి. తిరుచ్చి సౌత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ మేరకు కీలక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.  తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా పోటీ చేయాలని పార్టీ స్థానిక నాయకత్వం, శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని వారు అంటున్నారు. అయితే, ఈ స్థానంలో పోటీ చేయడం స్టాలిన్‌కు అంత తేలికైన విషయం కాదు. ఇది ఒక రకంగా అతిపెద్ద జూదమనే చెప్పాలి. ఎందుకంటే..  విజయ్ నేతృత్వంలోని టీవీకే కి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా స్టాలిన్ ఓటమి పాలైతే, అది ఆయన రాజకీయ జీవితంలో   కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. కాగా ఈస్ట్ తిరుచ్చి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారన్న అధికారిక ప్రకటన అయితే ఇంత వరకూ రాలేదు. ఈ స్థానం నుంచి స్టాలిన్ నిజంగానే బరిలోకి దిగుతారా అన్న విషయంలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  
తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో యూటర్న్ తీసుకున్నారా?  అన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  గతంలో సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన..  తాజాగా  తాను సమాజంలో కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, దేవాలయాలలో పూజా విధానాలు, ప్రజల మత స్వేచ్ఛకు తాను వ్యతిరేకంగా కాదనీ పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది.  ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమి పాలైనప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్  తన పాత పంథాను వీడలేదు.   తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలనే డిమాండ్‌ను ఆయన మళ్లీ గట్టిగా వినిపించారు. అయితే..  ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై   తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  అలాగే తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) కూడా ఉదయనిథి స్టాలిన్ కు గట్టి రిటార్డ్ ఇచ్చింది. సనాతన ధర్మ నిర్మూలన అంటే   అర్థం ఏమిటో, దానిపై ఉదయనిథి స్టాలిన్ కు ఉన్న ఖచ్చితమైన అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. అధికార పక్షం నుండి ఊహించని విధంగా ఒత్తిడి రావడంతో ఉదయనిధి స్టాలిన్ డిఫెన్స్ లో పడ్డారు. టీవీకే డిమాండ్ పై స్పందించిన ఆయన తన స్వరం మార్చి..  తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు.  ఉదయనిధి స్టాలిన్ హఠాత్తుగా ఇలా యూటర్న్ తీసుకోవడంపై కూడా నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.  సనాతన ధర్మం పట్ల నిజంగానే ఆయనకు అంత మృదువైన అభిప్రాయం ఉంటే..  దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఎందుకు  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిలదీస్తున్నారు.   రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన అప్పట్లో మాట్లాడారని దుమ్మెత్తి పోస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం అఫీషియల్ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ సినిమా జర్నీ గురించి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో ఒక రెజ్లర్ (పహిల్వాన్) పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ముంబై మీడియా ప్రతినిధులతో చరణ్ మాట్లాడుతూ.. ఈ కథ విన్న వెంటనే తనకు శారీరకంగా ఇది ఎంతో సవాలుతో కూడుకున్నదని అర్థమైందని చెప్పారు. గతంలో బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్', అమీర్ ఖాన్ 'దంగల్' వంటి సినిమాలతో పహిల్వాన్ పాత్రలకు ఒక ట్రెండ్ సెట్ చేశారని, వారి స్ఫూర్తితోనే తాను కూడా ఈ కఠినమైన ప్రయాణాన్ని నమ్మి ముందుకు సాగానని చరణ్ వివరించారు. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం దర్శకుడు బుచ్చిబాబు నిజమైన పహిల్వాన్లను రంగంలోకి దించారని చరణ్ వెల్లడించారు. షూటింగ్ సమయంలో ఒరిజినల్ రెజ్లర్లు గట్టిగా పట్టుకోవడంతో చరణ్ మోకాలి కార్టిలేజ్ దెబ్బతిందని, అయినప్పటికీ ఆ నొప్పినంతా మర్చిపోయి కష్టపడ్డానని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేచి వర్కవుట్ చేసి సెట్స్‌కు వెళ్లేవాడినని, స్కూల్ పిల్లాడిలా ఉత్సాహంగా షూటింగ్‌ను ఎంజాయ్ చేశానని తెలిపారు. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చూసిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌తో అన్న మాటలను ఈ వేదికపై గుర్తుచేసుకున్నారు. "చరణ్.. ఇలాంటి అద్భుతమైన కథలు, సినిమాలు ఒక నటుడి కెరీర్‌లో దశాబ్దానికి ఒకసారి మాత్రమే వస్తాయి. ప్రతి ఏటా 'మగధీర' లేదా 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు రావు. కాబట్టి ఈ సినిమాలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చెయ్, ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ నీకు మళ్లీ దొరకకపోవచ్చు" అని చిరంజీవి చెప్పినట్లు చరణ్ ఎమోషనల్ అయ్యారు. 'మగధీర' తర్వాత 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' రావడానికి పదేళ్లు పట్టిందని, కానీ 'పెద్ది' రూపంలో తనకు చాలా త్వరగా మరో మైల్‌స్టోన్ లాంటి సినిమా దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌పై చరణ్ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. గతంలో చిరంజీవి గారు, శ్రీదేవి గారి కాంబినేషన్ వెండితెరపై సృష్టించిన మ్యాజిక్‌ను, తామిద్దరూ మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు గుర్తుచేస్తామని నమ్మకంగా చెప్పారు. జాన్వీ ముంబైలో ఉంటూనే సైలెంట్‌గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి, తనకంటే 100 రెట్లు అద్భుతంగా డ్యాన్స్ చేసిందని, ఆమె డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానని చరణ్ కొనియాడారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చరణ్ కొనియాడారు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఒక మనిషి తన ఉనికిని (Identity) ఎలా వెతుక్కున్నాడనే ఒక బలమైన స్ఫూర్తిదాయకమైన కథతో వస్తున్న 'పెద్ది' చిత్రం తన లైబ్రరీలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా అని చరణ్ ముగించారు  
కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya) నటించిన లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా 'కరుప్పు' (karuppu) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తోందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రికార్డు స్థాయి వసూళ్లతో సూర్య తన ఒకప్పటి బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. గత కొన్నేళ్లుగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ వర్సటైల్ యాక్టర్, ఈ చిత్రంతో ఊహించని రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చారు.  థియేటర్లలో సూర్య మాస్ యాక్షన్, గాడ్ మోడ్ పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరి గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఒక స్టార్ హీరోకి సరైన కమర్షియల్ బొమ్మ పడితే థియేటర్ల వద్ద వసూళ్ల జాతర ఎలా ఉంటుందో సూర్య క్లియర్ గా చూపించారు. సూర్య తన బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపించడంతో ఇప్పుడు అందరి దృష్టి మరో వెర్సటైల్ కోలీవుడ్ హీరో విక్రమ్ (Vikram) వైపు మళ్లింది. వైవిధ్యమైన పాత్రలకు, అద్భుతమైన నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన విక్రమ్ కూడా ఒక భారీ కంబ్యాక్ కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ మార్కెట్‌ను చాలా కాలం క్రితమే క్రేజీ హిట్లతో కొల్లగొట్టిన రికార్డు విక్రమ్ సొంతం. తెలుగు ప్రేక్షకులకు విక్రమ్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. 'అపరిచితుడు' సినిమాతో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటికీ తెలుగు సినీ ప్రియుల గుండెల్లో బలంగా నాటుకుపోయింది.  తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కూడా ఎన్నో స్ట్రాంగ్ కమర్షియల్ హిట్లు, ఇండస్ట్రీ రికార్డులు సాధించిన ఘనత ఆయనకు ఉంది. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే కాకుండా, సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మాస్ స్టోరీ విక్రమ్ కి పడితే బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయమని ట్రేడ్ వర్గాలు సైతం విశ్లేషిస్తున్నాయి. సినిమా కోసం ఎంతో కష్టపడే విక్రమ్ లాంటి నటుడికి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ పడాలే కానీ, వసూళ్ల సునామీ సృష్టించడం పెద్ద విషయమేమీ కాదు. ఆయన రెగ్యులర్ సినిమాల కలెక్షన్లతో పోలిస్తే, ఒక రైట్ స్క్రిప్ట్ పడిన రోజున వచ్చే బాక్సాఫీస్ గ్రోత్ ఊహకందని రేంజ్ లో ఉంటుంది.  సూర్య 'కరుప్పు' సినిమాతో క్రియేట్ చేసిన మాస్ డిస్ట్రక్షన్ లాగే, విక్రమ్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో విక్రమ్ ఎలాంటి కంబ్యాక్ తో థియేటర్లను షేక్ చేస్తారో చూడాలి.  
The highly anticipated trailer for Ram Charan’s rural sports spectacle, Peddi, was unveiled at a grand event in Mumbai, drawing an incredible response from fans and the media alike. The launch was a lively affair, attended by Ram Charan, Janhvi Kapoor, AR Rahman, director Buchi Babu Sana, Divyenndu, and producer Venkata Satish Kilaru. Speaking at the event, legendary composer AR Rahman expressed his joy at returning to a direct Telugu project. He playfully called Buchi Babu a tough taskmaster and heaped praise on Ram Charan, describing his intense performance as world-class and mind-blowing. Janhvi Kapoor echoed this sentiment, sharing how the director's unique approach opened her up as an actor and calling Ram Charan a monster on screen. For Ram Charan, the film clearly holds a deeply special place. He called Peddi the most inspiring story he has ever heard, comparing its rarity to career milestones like Magadheera, Rangasthalam, and RRR. He also shared a touching piece of advice from his father, Megastar Chiranjeevi, who watched a few portions and told him to relish every moment of playing such a rare character. Embracing the intense physical toll of the two-year shoot, Charan smiled and called his injuries a small gift to remember the film by. With producer Venkata Satish Kilaru going all out for his debut and the technical team delivering top-tier visuals and music, Ram Charan promised audiences a massive commercial blast. Peddi is gearing up to offer a memorable theatrical experience when it hits screens worldwide on June 4th.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    మిస్ పూణే కిరీటం, ఎంబీఏ పట్టా, ఉన్నత చదువులు, కార్పొరేట్ మార్కెటింగ్‌లో మంచి కెరీర్, యోగా ట్రైనర్‌గా ప్రశాంతమైన జీవితం. చూసే ఎవరికైనా ట్విషా  శర్మ(Twisha sharma)జీవితం ఎంతో అందంగా, ఆదర్శంగా కనిపించేది. కానీ, వివాహ బంధం అనే కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిన కేవలం ఐదు నెలలకే ఆ జీవితం చిన్నాభిన్నమైపోయింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో మే 12 రాత్రి జరిగిన ట్విషా  మరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌ తో ట్విషా  పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరు  గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. సమర్థ్ తల్లి గిరిబాలా సింగ్  రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి. కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే అసలు రంగు బయటపడింది. ఉన్నత విద్యావంతురాలైన ట్విషాని ఆమె అత్తగారు, భర్త తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. ఉద్యోగం మానేసినందుకు 'నువ్వొక దండగమారివి', 'మాపై భారం' అంటూ ప్రతిరోజూ సూటిపోటి మాటలతో వేధించేవారు. త్విషా తండ్రి ఆమె పేరు మీద ఉంచిన 20 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను తన పేరిట బదిలీ చేయాలంటూ భర్త సమర్థ్ సింగ్ నిరంతరం ఒత్తిడి తెచ్చేవాడని త్విషా సోదరుడు, ఇండియన్ ఆర్మీ మేజర్ హర్షిత్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు అక్కడితో ఆగలేదు. గర్భం దాల్చిన ట్విషాని  ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి తెచ్చారని, గర్భంలో ఉన్న బిడ్డపై లేనిపోని నిందలు వేస్తూ ఆమె శీలాన్ని శంకించారని కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయిన రోజు రాత్రి కూడా త్విషా తన తల్లితో ఫోన్లో మాట్లాడుతూ, తాను ఇక్కడ ఇరుక్కుపోయానని, భోపాల్ వదిలి నోయిడా వచ్చేస్తానని ఏడ్చింది. కానీ, అంతలోనే భర్త గదిలోకి రావడంతో ఫోన్ కట్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె శ్వాస తీసుకోవడం లేదంటూ అత్తగారి నుండి ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే త్విషా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పోస్ట్‌మార్టం నివేదిక ఈ కేసులో మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. త్విషా మరణం ఉరి వేసుకోవడం వల్లే జరిగిందని ప్రాథమికంగా తేలినా, ఆమె శరీరంపై మొద్దుబారిన వస్తువులతో దాడి చేయడం వల్ల ఏర్పడిన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, ఉరి వేసుకోవడానికి ఉపయోగించారంటున్న బెల్ట్‌ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారని, చట్టం తెలిసిన రిటైర్డ్ జడ్జి కుటుంబం కావడంతో నిందితులను కాపాడుతున్నారని త్విషా కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. త్విషా మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భోపాల్‌లో ముఖ్యమంత్రి నివాసం వెలుపల బంధువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. Also read: Salman Khan: సల్మాన్ ఖాన్ కన్నీళ్లు.. పదిహేను కోట్ల విరాళం ఇచ్చాడు మరి        చట్టాన్ని రక్షించాల్సిన రిటైర్డ్ మహిళా జడ్జి, న్యాయవాది అయిన ఆమె భర్తే ఇప్పుడు ట్విషా మృతి కేసులో నిందితులుగా మారడం సమాజంలో కట్నపు వేధింపుల మహమ్మారి ఎంతలా వేళ్లూనుకుందో చెప్పడానికి ఒక నిదర్శనం.ట్విషా 2021 లో తెలుగులో  ముగ్గురు మొనగాళ్లు అనే  చిత్రంలో హీరోయిన్ గా చేసింది
తెలుగు సినీ పరిశ్రమలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజీ పద్ధతి అమలుపై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తోంది. సింగిల్ స్క్రీన్స్‌లో కూడా పర్సంటేజీ విధానాన్ని తీసుకురావాలని ఎగ్జిబిటర్లు గట్టిగా పట్టుబడుతుండగా, దీనివల్ల భారీ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య జరిగిన తాజా సమావేశంలో తీవ్ర దుమారం రేగినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 21 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రెండు నెలల్లో ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం కనుగొనాలని ఈ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లోపే నిర్మాతల మండలి తరఫున సుమారు 17 చిత్రాలకు పాత పద్ధతిలోనే మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఒక జాబితాను సిద్ధం చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ లిస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వైరల్ జాబితా చూసిన సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలకు మినహాయింపులు కోరడంలో న్యాయం ఉందని వారు భావిస్తున్నారు. కానీ, అసలు పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోని, కనీసం సెట్స్ పైకి కూడా వెళ్ళని చిత్రాలను సైతం ఈ లిస్ట్‌లో చేర్చడంపై థియేటర్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ మూవీ, నేచురల్ స్టార్ నాని-సుజీత్ క్రేజీ ప్రాజెక్ట్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రాలు ఇంకా ప్రీ-ప్రొడక్షన్ దశలోనే ఉన్నాయి. వీటికి తోడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ల భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ఇలాంటి అన్‌అనౌన్స్‌డ్, అండర్-ప్రొడక్షన్ సినిమాలకు కూడా ఇప్పుడే పర్సంటేజీ మినహాయింపులు ఎలా అడుగుతారంటూ ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలోకి వచ్చినప్పుడు కలెక్షన్ల షేరింగ్ విషయంలో గొడవలు రావడం సహజం. గతంలో కూడా పలు చిత్రాల విడుదలైప్పుడు నిర్మాతలకు, పంపిణీదారులకు మధ్య ఇలాంటి బేధాభిప్రాయాలు వచ్చాయి. కానీ, ఈసారి ఏకంగా ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే ఈ రేంజ్‌లో వివాదం చెలరేగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో సైతం సినీ అభిమానులు ఈ పర్సంటేజీ సిస్టమ్ వ్యవహారంపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, పరిశ్రమ మనుగడ సాగించాలంటే అటు నిర్మాతలు, ఇటు ఎగ్జిబిటర్లు ఇద్దరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి రాబోయే రెండు నెలల్లో ఫిలిం ఛాంబర్ కమిటీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో, ఈ క్రేజీ స్టార్ల సినిమాల భవిష్యత్తు బిజినెస్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.
తెలుగు చిత్రపరిశ్రమలో తన అద్భుతమైన సాహిత్యంతో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మళ్లీ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సమాజంలో మహిళల ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఒక వినూత్నమైన లేడీ ఓరియంటెడ్ కథాంశంతో ఆయన మెగాఫోన్ పట్టారు. ఈ చిత్రానికి 'లలిత' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో సరికొత్త నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నారు జొన్నవిత్తుల. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ నందిని ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. "గర్ల్‌ఫ్రెండ్‌ అంటే బానిస కాదు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కోసం పోరాడే ఒక సామాజిక నేపథ్యమున్న మహిళ కథగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కాస్మిక్‌ పవర్ క్రియేట్స్ ఎల్.ఎల్.పి. పతాకంపై పి. సుధీర్‌ రాజు, డి. వైష్ణవి నేహా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నందిని కథానాయికగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. అభిలాష్‌, అఖిల్‌ వివాన్‌ హీరోలుగా పరిచయం అవుతున్నారు. కేవలం దర్శకత్వమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలతో పాటు పాటలను కూడా జొన్నవిత్తుల స్వయంగా సమకూరుస్తుండటం విశేషం. గతంలో జొన్నవిత్తుల దర్శకత్వం వహించిన 'పెళ్ళాం పిచ్చోడు', 'సోంబేరి' సినిమాలు మంచి వినోదాన్ని పంచాయి. అయితే, ఆ చిత్రాలకు భిన్నంగా ఈసారి ఒక సామాజిక బాధ్యత గల సబ్జెక్ట్‌ను ఆయన ఎంచుకున్నారు. అంతేకాకుండా, గత చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్, గాయకుడు మనో వంటి వారిని సంగీత దర్శకులుగా పెట్టి ప్రయోగాలు చేసిన ఆయన.. ఈ సినిమా కోసం మణి-నాగరాజు అనే మ్యూజికల్ కపుల్‌ను ఎంపిక చేసుకున్నారు. నాగరాజు గారు ప్రసిద్ధ వేణు వాదకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఈ చిత్రంలో రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్, డీడీ శ్రీనివాస్, వి. ఝాన్సీ మేఘనా వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రష్టి వర్మ ఈ చిత్రానికి నృత్య దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. జొన్నవిత్తుల కలం నుంచి వస్తున్న ఈ సామాజిక చిత్రంపై ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సినిమా ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మరియు మరిన్ని వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Ahead of his birthday, ‘RawKing’ Manchu Manoj, along with his wife Bhuma Mounika, hosted a blood donation drive and a special gathering in Hyderabad where they officially announced the launch of their new social service organization, AIKYA DHAIRYA SENA SAMITHI, carrying the motto: Unity, Courage, Service, Impact. The event was attended by several prominent personalities, supporters, volunteers, and fans, with Jubilee Hills MLA Naveen Yadav attending as one of the chief guests. Addressing the gathering, Manoj emotionally welcomed everyone and spoke about the values of service and compassion that he and Mounika inherited from their elders and family members. Explaining the intention behind the organization, he said the vision was always to create a larger platform for people who believe in collective welfare and social responsibility. “Hello all, I heartily welcome everyone here. You all know how we have always remained at the forefront when it comes to service. Standing by others and society is something that both my wife Mounika and I have strongly learned from our family and elders. We have done many service activities before, but we wanted to form an organization, a trust for people who share similar ideologies and provide a platform for such individuals. The name of the organization will be announced by my brother and close aide, MLA Naveen Yadav, at the end. But before that, I want Mounika to speak a few words, because this idea truly came from her. She wanted to take this to the public and build a sense of unity. Along with the blood donation drive, from today onwards, we also want to adopt five children and support their education. And it will not stop with this. It shall spread across every town and every village in both Telugu states, beginning from today. If there is any true achievement in our life, it will only be when someone receives help through this organization,” said Manoj. Speaking at the event, Mounika shared that the initiative became possible through the blessings and guidance of her parents and elders. She also revealed that the trust would focus not only on blood donation drives, but also on women empowerment and employment opportunities. “Hello everyone. I heartily welcome you all to this event. Today, with good intentions and heartfelt purpose, Manoj and I are coming forward with this cause, and it has been possible only because of the blessings of my parents. They have shown us a path to follow, not only for ourselves, but also a path that our children should follow. This trust will not only focus on blood donation, but also on women empowerment and employment. We have also started a company called Namaste World, and in collaboration with that, employment opportunities for women will be created through toy-making courses. Along with this, we also have many other plans to serve society and reach the public. We request all your blessings upon us, and now I request Naveen anna to launch the trust,” said Mounika. MLA Naveen Yadav then officially announced the name AIKYA DHAIRYA SENA SAMITHI and appreciated the couple for choosing to dedicate the occasion to meaningful social service initiatives. “Thank you all. First of all, I want to welcome everyone to this event, especially the fans of Manoj anna who organized it. My family and Manoj anna’s family share a bond of over 30 years. Since childhood, we have been like brothers, and he has carried this sense of service from a very young age itself. On the eve of his birthday, sister Mounika’s unique approach towards serving society by forming this trust is truly appreciable. Please give a round of applause for her. The name of the trust is AIKYA DHAIRYA SENA SAMITHI — with the motto Unity, Courage, Service, Impact. The name itself reflects their ideology and the spirit behind the movement. I also sincerely want to appreciate Mounika for her thoughtful decision to adopt children and create women employment opportunities through toy-making courses. Manoj anna mentioned that he plans to implement this across the Telugu states, and I promise that I will extend my complete support to him, his work, and his cause. I also want to wish all the volunteers of this organization the very best,” said Naveen Yadav. The event concluded on a heartfelt note with Manoj thanking everyone who contributed towards making the initiative successful. “I want to thank everyone who organized this event and made it successful. I want to thank everyone who came forward to donate blood. I would also like to thank Kishore Reddy of Amor Hospital for helping us conduct this initiative. I want to thank my friends, family, and fans. It is because of all of you that I am standing here today. Thank you,” Manoj concluded. On the professional front, Manoj is currently entering one of the most powerful and transformative phases of his career. He recently made a strong comeback with Mirai, where he played the powerful antagonist Mahabir Lama, also known as Black Sword. The film performed well at the box office, and Manoj’s intense performance was widely appreciated by audiences and critics alike. It was yet another reminder of the physical intensity and emotional conviction he brings to his roles. Looking ahead, Manoj is gearing up for one of the most ambitious films of his career, David Reddy, a large-scale pan-India period action drama directed by Hanuma Reddy Yakkanti and produced by Nallagangula Venkat Reddy and Bharat Motukuri. Set during the British colonial period between 1897 and 1920, the film follows a fierce warrior who rises against oppression. The cast includes international actress Maria Ryaboshapka, and the project is being mounted on a grand scale for audiences across India. Manoj has also been drawing major attention for his intense physical transformation and disciplined “Real Stunts Mode” training journey for the film. His recent workout updates and transformation posts quickly gained traction across social media, with fans praising his renewed focus, determination, and commitment toward authentic action filmmaking. The recently released David Reddy glimpse has already crossed 10 Million Digital Views, building strong buzz and raising anticipation around Manoj’s powerful new avatar. Apart from David Reddy, Manoj also has several other exciting projects in the pipeline, signalling a busy and defining new phase in his career one driven not only by cinematic ambition and transformation but now also by a growing commitment toward service, humanity, and meaningful social impact through AIKYA DHAIRYA SENA SAMITHI.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కోలీవుడ్‌లో విభిన్న కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో శివకార్తికేయన్ (SK) సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'సేయోన్' (Seyon) తాజాగా అధికారికంగా ప్రారంభమైంది. పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ దర్శకుడు శివకుమార్ మురుగేసన్ తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'తాయ్ కిజవి' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడమే కాకుండా, శివకార్తికేయన్ స్వయంగా ఆ సినిమాను నిర్మించడం విశేషం. ఇప్పుడు అదే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ సరికొత్త యాక్షన్ డ్రామాతో మళ్లీ జతకట్టింది. దీంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు మరో అతిపెద్ద ఆకర్షణ లోకనాయకుడు కమల్ హాసన్. ఆయనకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మితమవుతోంది. 'అమరన్' వంటి సూపర్ హిట్ తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ నటిస్తున్న రెండో చిత్రం కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్, సినిమా స్కేల్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం.. ఎలాంటి విరామం లేకుండా ఒకే షెడ్యూల్‌లో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. లొకేషన్ల మార్పులు, అనవసరపు గ్యాప్‌ల వల్ల సినిమా ఫ్లో దెబ్బతినకుండా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక సెట్స్ వేసి కంటిన్యూటీ మెయింటైన్ చేయనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో శివకార్తికేయన్ దట్టమైన గడ్డం, సీరియస్ లుక్‌తో ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నారు. పక్కనే పెద్ద మంటలతో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇది కేవలం సాఫ్ట్ స్టోరీ మాత్రమే కాదు, పక్కా హార్డ్‌కోర్ యాక్షన్ డ్రామా అని స్పష్టమవుతోంది. గతంలో లవర్ బాయ్, కామెడీ పాత్రల్లో మెప్పించిన ఎస్కే.. 'మావీరన్', 'అమరన్' విజయాల తర్వాత పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండడం విశేషం. 'కబాలి', 'కాలా' చిత్రాలకు రా అండ్ రస్టిక్ మ్యూజిక్ ఇచ్చిన సంతోష్.. ఈ పల్లెటూరి యాక్షన్ కథకు ఎలాంటి అదిరిపోయే ట్యూన్స్ ఇస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే వివేక్ విజయకుమార్ డీఓపీగా, సుప్రీమ్ సుందర్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ ప్రారంభం రోజే పవర్‌ఫుల్ పోస్టర్‌తో సినిమా రేంజ్ ఏంటో చూపించిన 'సేయోన్' టీమ్, రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ మరియు ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi)ట్రైలర్ కొంచం సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో సరికొత్త రికార్డులు సాధించే దిశగా బిజీ మోడ్ లో ఉంది. ఫ్యాన్స్ అయితే ట్రైలర్ సూపర్ గా ఉందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ తో సరికొత్త విషయం ఒకటి అర్థమైందని సినీ పరిశీలకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ కొత్త విషయమేంటో చూద్దాం. చరణ్ కుస్తీ తో పాటు క్రికెటర్ గా కనిపిస్తున్నాడని ఇన్ని రోజుల నుంచి చేసిన ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తో  పరుగు పోటీల్లో కూడా తన సత్తా చాటబోతున్నాడని ఆర్డమవుతుంది. ముఖ్యంగా మన దేశం తరుపున పెద్ది పోటీల్లో పాల్గొనబోతున్నాడని ట్రైలర్ చివరలో తెలియడంతో ఇప్పటి వరకు ఉన్న లుక్ మొత్తం మారిపోయి సరికొత్త ఇమేజ్ ని పెద్ది  పొందాడు. పర్ఫెక్ట్ పాన్ ఇండియా సినిమా అనే టాగ్ లైన్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. Also read: Peddi: ఊరమాస్ జాతర మొదలైంది.. రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ ఎలా ఉందంటే  
మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'సతీ లీలావతి' (Sathi Leelavathi). మే 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిజిటల్ లవర్స్‌ను పలకరించేందుకు చాలా వేగంగా ఓటీటీ బాట పట్టింది. సాధారణంగా థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ, 'సతీ లీలావతి' చిత్రం మాత్రం థియేటర్స్ రిలీజ్ అయిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. నటి లావణ్య త్రిపాఠి కెరీర్‌లో ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన 'సతీ లీలావతి' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను Sun NXT సొంతం చేసుకుంది. ఈ సినిమాను మే 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా Sun NXT ప్రకటించింది. థియేటర్లలో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన ఈ మూవీ, ఓటీటీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. కథ ఏంటంటే.. లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా డైరెక్టర్. లీలావతి కెరీర్‌తో బిజీగా ఉంటూ తనకు సమయం కేటాయించడం లేదని, విడాకులు కావాలని ఆమె భర్త రామ్ (దేవ్ మోహన్) కోరతాడు. అంతేకాకుండా తాను నికోలా (మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని షాక్ ఇస్తాడు. భర్తను వదులుకోవడం ఇష్టం లేని లీలావతి, అతన్ని ఇంట్లోనే కట్టేసి తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? రామ్ మనసు మారిందా? లీలావతి-రామ్ ఒక్కటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. Also Read: 'సతీ లీలావతి' మూవీ రివ్యూ
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే.. పాత బంధాల ప్రస్తావన.. కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది. కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం.. పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఫిర్యాదులు.. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి. స్వేచ్ఛ.. పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.                               *రూపశ్రీ.
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా మూత్రపిండాలు క్రమంగా దెబ్బతింటాయి. నేటికాలంలో ఆహారపు అలవాట్లు,  తీసుకునే పానీయాలు,  జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. గతంతో పోలిస్తే.. నేటికాలంలో మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువ అయ్యారు. మూత్రపిండాల పనితీరు బలంగా ఉండాన్నా,  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని అలవాట్లు చాలా బాగా సహాయపడతాయి.   రోజువారీ జీవితంలో పాటించదగిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. నీరు.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం చాలా సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. నీరు మూత్రం ద్వారా శరీరం నుండి విషపదార్థాలను , అదనపు ఉప్పును బయటకు పంపడానికి సహాయపడుతుంది. చాలా తక్కువ నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు , మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడానికి దారితీస్తుంది. సగటు వ్యక్తికి రోజుకు 2–3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.  ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉప్పు.. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్, ఊరగాయలు , ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు అధికంగా ఉంటుంది.   ఉప్పు తక్కువగా తీసుకునేందుకు  ప్రయత్నించాలి. అలాగే  తాజాగా, ఇంట్లో వండిన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం మూత్రపిండాలపై భారాన్ని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జంక్ ఫుడ్.. జంక్ ఫుడ్‌లో అధికంగా నూనె, ఉప్పు, చక్కెర  ఉంటాయి, ఇవి క్రమంగా శరీరానికి , మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు , మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు ,  ఇంట్లో వండిన పోషకాలతో కూడిన  భోజనం తినడం ఉత్తమం. ధూమపానం.. ధూమపానం శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీసి, మూత్రపిండాలకు తగినంత రక్త సరఫరాను అడ్డుకుంటుంది. సిగరెట్లలోని విష పదార్థాలు క్రమంగా మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తాయి. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం ఆపేయడం వల్ల  గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక శరీరాన్ని చురుకుగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది , రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా నడవడం మధుమేహం , ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎక్కువ కాలం  మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.                            *రూపశ్రీ.
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో తల తిరగడం సమస్యకు మన ఇంట్లో ఉండే ధనియాలతో (Coriander Seeds) సులభమైన మరియు ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు: తల తిరగడానికి కారణాలు: అసలు వెర్టిగో లేదా తల తిరగడం ఎందుకు వస్తుంది? ధనియాల ప్రాముఖ్యత: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు శరీరంలోని వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుస్తాయి? రెమెడీ తయారీ విధానం: ధనియాలను ఏ విధంగా ఉపయోగిస్తే తల తిరగడం తక్షణమే తగ్గుతుంది? ముందు జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి: సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!