LATEST NEWS
  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో  కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ భవిష్యత్తు కార్యచరణ, సంస్థాగత నిర్మాణం మరియు క్షేత్రస్థాయిలో కేడర్‌ను ఉత్తేజితం చేయడం వంటి అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్టీలో నెలకొన్న స్తబ్ధతను వీడి, ప్రజల్లోకి వెళ్లాలని గులాబీ బాస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే పార్టీలోని అన్ని స్థాయిల కమిటీలను రద్దు చేసి, నూతన కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. కేవలం పదవుల కోసం కాకుండా, తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాడేవారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేవలం నామమాత్రంగా కాకుండా, అత్యంత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని అధినేత ఆదేశించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని రీబ్రాండ్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా క్రియాశీలకంగా లేని నాయకులపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘సీజనల్ పాలిటిక్స్’ చేసే వారికి పార్టీలో చోటు ఉండదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టాలని, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం సాగించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయాలని వ్యూహరచన చేశారు. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ వైభవాన్ని తీసుకువచ్చే బాధ్యత సీనియర్ నేతలపై ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో ప్రతి కార్యకర్తను భాగస్వామిని చేయాలని సూచించారు. 2028 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పునాదులు పటిష్టం చేసుకోవాలని నేతలకు హితబోధ చేశారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ ప్రక్షాళన ప్రక్రియ పూర్తయ్యాక, సరికొత్త ఉత్సాహంతో ప్రజల మధ్యకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ ఇకపై మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే  కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..  ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.   గతంలో బీజేపీ,తెలుగుదేశం మధ్య విభేదాలు ఉన్నాయంటూ సాగిన ప్రచారానికి ఈ భేటీలతో ఫుల్ స్టాప్ పడింది. ముఖ్యంగా ఏపీలో కూటమి విజయం తర్వాత, ఇప్పుడు ఆ ప్రభావం తెలంగాణపై కూడా పడబోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా కాకుండా..  మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేనలను కలుపుకొని ఎన్డీయే కూటమిగా ముందుకు సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయని అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనలో నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాసాలకు స్వయంగా వెళ్లడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.   2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. ఎన్డీయే కూటమి పొత్తు అధికారికంగా లేకపోయినా..  టీడీపీ కేడర్ మద్దతు బీజేపీకి లభించడం వల్ల అక్కడ ఆ పార్టీకి ఎంపీ సీట్లు పెరిగాయని ఆయన విశ్లేషించారు.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీకి ఇప్పటికీ గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే కూటమిగా వెళ్లడమే శ్రేయస్కరమని ప్రధాని మోదీ భావిస్తున్నారని అడుసుమిల్లి చెప్పారు.  చంద్రబాబు నాయుడు, మోదీల మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ అవసరాల కోసమే కాకుండా..  రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా సాగుతోందని తెలుస్తోంది. కేంద్రం నుంచి అందుతున్న సహకారం..  పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులకు నిధుల విడుదల వంటివి రెండు పార్టీల మధ్య స్నేహాన్ని మరింత బలపరిచాయి. తెలంగాణలో కూడా ఒక సరైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసి..  కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తే ఎన్డీయే కూటమి ఇక్కడ బలమైన శక్తిగా ఎదుగుతుందని అడుసుమిల్లి విశ్లేషించారు.  
తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పాఠశాలలు, దేవాలయాలు, బస్టాండ్‌ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేస్తూ  ఆదేశాలు జారీ చేసి సంచలనం సృష్టించారు. తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.  ఎందుకంటే వీటి మూసివేతతో మిగిలిన దుకాణాల వద్ద అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. కాబ‌ట్టి   ఆదాయానికి వ‌చ్చే లోటు ఉండ‌దు. మ‌ద్యం కావాల‌నుకునేవారు ఇక్క‌డ దొర‌క్కంటే మరో చోట  కొనుక్కుంటారు.  ఇక విజయ్ వ్యూహం ఏంటో చూస్తే.. ఆయ‌న‌ లక్ష్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అయితే కాదు.  నియంత్రిత విక్రయాలు మాత్ర‌మే. ప్రజల నుంచి విమర్శలు వస్తున్న సెన్సిటివ్ ఏరియాల్లో దుకాణాలు తొలగించడం ద్వారా ఆయన ఒక క్లీన్ ఇమేజ్, సోషల్ రిఫార్మర్  గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.  అయితే..   ఇదే అంశాన్ని ఏపీలో జ‌గ‌న్ సంపూర్ణ మ‌ద్య పాన నిషేధం అని చెప్పి సాగించిన విచ్చ‌ల‌విడి విధానాల‌తో ముడి పెట్టి చూస్తున్నారు కొంద‌రు. ఆనాడు..  జ‌గ‌న్  ద‌శలవారీ నిషేధం అని చెప్పి ప్రభుత్వమే దుకాణాలు నడిపింది. అప్ప‌టి  వ‌ర‌కూ మార్కెట్లో ఉన్న పాపుల‌ర్ బ్రాండ్ల‌ను ప‌క్క‌న పెట్టి బూమ్ బూమ్ వంటి  కొత్త  ర‌కాల‌ను ప్ర‌వేశ  పెట్టింది. అంతే కాదు ఆయా లిక్క‌ర్ సిండికేట్ల‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హించి ముడుపులు తీసుకుంది. దేశంలోనే  అతి పెద్ద లిక్క‌ర్ స్కామ్  కి దారులు ప‌రిచింది నాటి వైసీపీ ప్ర‌భుత్వం.     అదే విజ‌య్ తీసుకున్న నిర్ణ‌యాలు భ‌విష్య‌త్ లో బ‌డులు, గుడులు, బ‌స్టాండ్ వంటి  బ‌హిరంగ  ప్ర‌దేశాల్లో మందుబాబుల అరాచ‌కాలు త‌గ్గి.. త‌ద్వారా విజ‌య్ ప్ర‌భుత్వం  ప‌ట్ల మ‌హిళా  ఓట‌ర్ల‌లో ఒక ర‌క‌మైన న‌మ్మ‌కం  ఏర్ప‌డే అవకాశం ఉంది. మద్యం మాఫియా, సిండికేట్లకు తావులేకుండా దుకాణాల నిర్వహణలో పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. అదే జగన్  ఏపీలో మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ప్రయోగాలు చేసి చివరకు   విమర్శలకు గురయ్యారు. విజయ్ మాత్రం ఆదాయం కంటే  ప్రజా క్షేమం  ముఖ్యమని స్పష్టమైన సంకేతం ఇచ్చారు.  అయితే, ఈ 48 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోకుండా రాష్ట్ర బడ్జెట్‌ను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌ ఆదాయం తగ్గితే, ఆ లోటును భర్తీ చేయడానికి విజయ్ ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషించాల్సి  ఉంటుందని అంటున్నారు నిపుణులు. ప‌న్నుల్లో సంస్క‌ర‌ణ‌లు తేవాల్సి ఉంటుందంటున్నారు. పారిశ్రామికాభివృద్ధి మ‌రింత‌గా విస్త‌రింప చేయాల్సి ఉంటుందనీ సూచిస్తున్నారు. ఏది ఏమైనా విజ‌య్ మార్క్ పాల‌నైతే త‌మిళ‌నాడులో షురూ అయిన‌ట్టుగానే  క‌నిపిస్తోంది.
తమిళనాడులో సోమవారం (మే 11) రాజకీయ విలువలకు అద్దంపట్టే చూడముచ్చటైన దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ స్వయంగా రాష్ట్ర మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సందర్భంగా స్టాలిన్ విజయ్ ను ఆప్యాయంగా హత్తుకున్నారు. అంతకు కొద్ది క్షణాల ముందు.. తమ నివాసానికి వచ్చిన విజయ్ కు తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టాలిన్ కుమారుడు ఉదయనిథి మారన్ ఆప్యాయంగా పలకరించి, అలింగనం చేసుకుని లోనికి తోడ్కొని వెళ్లారు. ఇటీవలి కాలంలో రాజకీయ ప్రత్యర్థులు అంటే బద్ధ శత్రువుల్లా వ్యవహరించే తీరు ఎక్కువైపోయింది. అంశాల వారీ విమర్శలు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి ప్రత్యర్థి పార్టీలు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో విమర్శల స్థాయి పాతాళానికి దిగజారిపోయిన పరిస్థితి ఉంది.  అయితే గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు.  పరిణతితో, సామాజిక బాధ్యతతో ఉండేది.  ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య  రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక ఎంపికలు ఉన్నప్పటికీ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి ఉండేది.  అయితే తరువాత తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  అయితే.. తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్…  ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.   ప్రస్తుత రాజకీయాల్లో సైద్ధాంతిక విభేదాలు వ్యక్తిగత విభేదాలుగా మారిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో విజయ్ చేసిన పని ప్రజాస్వామ్య వాదుల మన్ననలు అందుకుంటోంది. ఇటువంటి పరిస్థితి గతంలో ఉండేదని వారు గుర్తు చేస్తున్నారు. గతంలో  ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేసే నేతలు.. ఆ తర్వాత రాజకీయాలను పక్కనపెట్టేసి   అభివృద్ధిపై దృష్టి సారించేవారంటున్నారు. రాజకీయాల్లో పరస్పరం చేసుకున్న విమర్శలను ఆ తర్వాత వారు అంతగా పట్టించుకునే వారు కాదు.అసలు గతంలో రాజకీయ విమర్శలు కూడా హుందాగా, సిద్ధాంతాల ప్రాతిపదికనే ఉండేవి.   అయితే నేడు అది కనుమరుగై..  విమర్శలు అంటే వ్యక్తిగత దూషణలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అయితే తమిళనాడు సీఎం విజయ్ స్వయంగా మాజీ సీఎం ఇంటికి వెళ్లడం ద్వారా రాజకీయాలలో విలువలకే పెద్దపీట వేస్తానని చాటారు.  ఎన్నికల ప్రచారంలోనూ ఆయన శైలి భిన్నంగానే ఉంది. ప్రత్యర్థి పార్టీలపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఒక వేళ చేసినా అవి ఎక్కడా పరిధి దాటలేదు.  ఆరోగ్యకరమైన రాజకీయాలకు విజయ్ తమిళనాట తెరతీశారని పరిశీలకులు అంటున్నారు. 
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తరువాత.. అన్నాడీఎంకేలో ఒక బలమైన వర్గం టీవీకే పంచన చేరడానికి రెడీ అవుతోంది. దీంతో అన్నాడీఎంకేలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది.  అన్నాడీఎంకేలో చాలా కాలంగా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ముదిరి పాకాన పడ్డాయి.  పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్  తమిళగ వెట్రి కళగం (టీవీకే) వైపు మొగ్గు చూపుతోంది.   విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం,  ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.   గత కొంతకాలంగా అన్నాడీఎంకే నాయకత్వంపై సి.వి. షణ్ముగం వర్గం తీవ్ర అసంతృప్తి ఉండటం, ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్తం అవ్వడం, ఇప్పుడీ చర్చకు కారణమైందని అంటున్నారు.  ఇప్పటికే షణ్ముగం వర్గానికి చెందిన ప్రతినిథులు విజయ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.   
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ వెండితెరపై తన గ్లామర్‌తో యువతను ఉర్రూతలూగించిన రకుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు ఒక భారీ ప్రాజెక్టుతో అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితమైన ఈ సుందరి, తన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన పాత్రను ఎంచుకున్నట్లు సమాచారం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణ' చిత్రంలో రకుల్ ఒక కీలకమైన రోల్ పోషించబోతోందట. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక గాథలో రకుల్ ప్రీత్ సింగ్ 'శూర్పణఖ' పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాముడు, రావణుడు మధ్య జరిగే యుద్ధానికి ప్రధాన కారణమైన ఈ పాత్రను రకుల్ అంగీకరించడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్‌గా చేస్తూనే ఇలాంటి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆమె తీసుకున్న రిస్క్ అనే చెప్పాలి. గతంలో రమ్యకృష్ణ వంటి స్టార్ హీరోయిన్లు సైతం నెగటివ్ టచ్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలు చేసి మెప్పించారు. ఇప్పుడు రకుల్ కూడా అదే బాటలో ప్రయాణిస్తూ తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలని చూస్తోంది. రామాయణంలో శూర్పణఖ పాత్ర చాలా క్లిష్టమైనది, ముఖ్యంగా కథను మలుపు తిప్పే కీలక ఘట్టాల్లో ఆమె నటన అత్యంత ముఖ్యం. మరి ఈ సవాలును రకుల్ ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి. ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రావణాసురుడి పాత్రలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ అలరించనున్నారు. ఈ క్రమంలో యష్‌కు సోదరిగా రకుల్ కనిపించనుండటం విశేషం. యష్, రకుల్ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ వైరల్ అవ్వడంతో రకుల్ ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. గ్లామర్ రోల్స్ కాకుండా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేయడం వల్ల ఆమె కెరీర్ మరో స్థాయికి వెళ్తుందని కొందరు అభిప్రాయపడుతుంటే, నెగటివ్ రోల్ ప్రభావం ఎలా ఉంటుందో అని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా రకుల్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తోంది.
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి అదృష్టం తలుపు తట్టినా, కొన్ని కారణాల వల్ల అది చేజారిపోతుంటుంది. అచ్చం ఇలాంటి అనుభవమే సీనియర్ నటి ఇంద్రజకు ఎదురైంది. తొంభైల కాలంలో తనదైన నటనతో, అందంతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ, తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే, మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం మాత్రం ఆమెకు రెండుసార్లు వచ్చి చేజారిపోవడం గమనార్హం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. చిరంజీవితో కలిసి వెండితెరపై కనిపించాలని తనకు ఎంతో ఆశ ఉండేదని, కానీ విధి వైపరీత్యం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి కాదు, ఏకంగా రెండు సినిమాల్లో మెగాస్టార్‌తో ఆన్ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చినా, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆ ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఈ వార్తపై స్పందిస్తూ.. "అయ్యో.. ఇంద్రజ గారు, చిరంజీవి గారు కలిసి నటించి ఉంటే ఆ కాంబినేషన్ చాలా బాగుండేది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే, అప్పట్లో వారిద్దరి జోడీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఇన్నాళ్లకు ఈ సీక్రెట్‌ను ఇంద్రజ బయటపెట్టడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దీనిపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా ఉన్న ఇంద్రజ, అటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తూనే, ఇటు బుల్లితెరపై రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు. 
The tactical "Checkmate" move by Asian Suniel and Sirish Reddy has pushed the Nizam trade war into an endgame. By announcing that Telangana single screens will refuse ticket price hikes—even with a government GO—exhibitors have stripped distributors of their biggest revenue cushion. This is a calculated strike aimed specifically at Mythri Movie Makers to force a shift in trade dynamics. By capping single-screen potential, exhibitors are forcing production houses to abandon the traditional rental model for a 60:40 percentage-based revenue system. Exhibitors argue the rental model is no longer sustainable, while distributors view this as a direct threat to their margins. This standoff effectively holds high-budget releases hostage until a new revenue-sharing agreement is finally reached between the stakeholders. This move directly threatens Mythri’s massive upcoming slate, featuring Mega Powerstar Ram Charan’s Peddi, NTRNEEL, Fauzi, and the highly anticipated Sukumar-Charan project. The exhibitors know Mythri cannot afford a compromised or low-yield release for these high-budget tentpoles. The timing ensures that the pressure is at its peak before the June 4th worldwide theatrical release of Peddi. Mythri has also raised strong objections to the exhibition of Jet Lee being stalled by these power players to leverage the single-screen dispute. Labeling it "arm-twisting," they argue that multiplex operations are being held hostage to resolve separate trade issues. As the deadline nears, the industry is watching to see if Mythri yields or if a historic blackout looms. If Peddi gets affected many equations might change and power battle might become more and more prominent.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
                                సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిరక్షణ, కొనసాగింపుకు సంబంధించి ప్రతిపాదిత “పర్సెంటేజ్ షేరింగ్ విధానం” అమలుపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ సభ్యుల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్‌తో పాటు పలువురు ఎగ్జిబిటర్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కీలక అంశాలు, నిర్ణయాలను వెల్లడించారు. మీడియా సమావేశంలో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక నిర్మాతగా మాట్లాడాలంటే నిర్మాత తండ్రి అయితే, ఎగ్జిబిటర్ బిడ్డలాంటివాడు. అలా చూసినప్పుడే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తండ్రి ఎంత కష్టపడినా బిడ్డల సుఖం కోసమే. గత 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి గిట్టుబాటు లేక, ఆదరణ లేక పరిస్థితులు క్షీణించాయి. గత ఏడాది నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి  అస్సల్ బాలేదు. ఎగ్జిబిటర్ బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. సునీల్ నారంగ్ గారు, శిరీష్ గారు అందరూ కూడా థియేటర్ల అభివృద్ధి కోసం తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నిర్మాతగా వారికి నా 100 శాతం సపోర్ట్ ఉంటుంది. ఎగ్జిబిటర్లను బ్రతికించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య సమన్వయం చాలా ముఖ్యం. సినిమా పరిశ్రమ మరింత బలపడేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.  నిర్మాత శిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మేము పర్సెంటేజ్ విధానం గురించి మాట్లాడుతున్నామంటే ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకుపోరాటం. ఏ సినిమాను టార్గెట్ చేసి గానీ, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గానీ ఇది చేయడం లేదు. థియేటర్లను రక్షించండి. మిగిలిన రాష్ట్రాల్లో థియేట‌ర్లకు ప‌ర్సంటేజీ విధానం అమ‌లు చేసి  తెలుగులో మాత్రం ఎందుకు రెంట‌ల్ ప‌ద్ధతి లో సినిమా రిలీజ్ చేస్తున్నారో ఒకసారి ప్రశ్నించుకోవాలి. మా విజ్ఞప్తి ఒక్కటే… మమ్మల్ని వేరే కోణంలో చూడకండి. దయచేసి ఎగ్జిబిటర్లను కాపాడండి. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ఒక విషయం చెబుతున్నాం. జీవోలు వచ్చినా థియేటర్లో టికెట్  రేట్లు పెంచమని తెలియజేస్తున్నాం.  తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ.. పర్సెంటేజ్ విధానం కోసం మేము 2008 నుంచే పోరాడుతున్నాం. చివరిగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల సమయంలో కూడా పర్సెంటేజ్ అమలు చేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. మేము థియేటర్లు బంద్ చేస్తున్నామని అసత్య ప్రచారం చేశారు. మేము థియేటర్లు బంద్ చేయడం లేదు. ఎవరైతే పర్సెంటేజ్ ఇస్తారో వాళ్ల సినిమాలను ప్రదర్శిస్తామని చెబుతున్నాం. గీత, వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ విధానంలోకి వచ్చాయి. మిగిలిన వారు కూడా త్వరలో వస్తారని ఆశిస్తున్నాం. దేశమంతా పర్సెంటేజ్ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తున్నారు. మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు. పర్సెంటేజ్ విధానం ఉంటే థియేటర్లు నడుపుతాం. లేకపోతే బంద్ చేసుకోవాల్సి వస్తుంది అని సవినయంగా తెలియజేస్తున్నాను.  నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. పర్సెంటేజ్ విధానం అమలు చేస్తామని చెబుతారు కానీ అమలు చేయరు. నిర్మాతలు కూడా నష్టాల్లోనే ఉన్నారు. అందరి పరిస్థితి బాగోలేదని అంటారు. మల్టీప్లెక్సుల్లో కొత్త టెక్నాలజీలు, ఆధునిక సౌకర్యాలు తీసుకొస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాంటి సదుపాయాలు కల్పించలేకపోతున్నాం. డాల్బీ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సింగిల్ స్క్రీన్స్‌కి కూడా వస్తారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకే నష్టం. మేము ఏ సినిమాను టార్గెట్ చేయడం లేదు. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నాం. వారు హామీ ఇస్తున్నారు కానీ ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. అందుకే ఈ సమావేశం నిర్వహించాం. మీడియా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లను రక్షించే ప్రయత్నంలో మాకు సహకరించాలని కోరుకుంటున్నాను.
- వివాదంలో కమెడియన్ అలీ - హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ నెటిజన్లు ఫైర్! - అలీ క్షమాపణలు చెబుతారా? చిక్కుల్లో పడతారా? టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ (Comedian Ali) ఇప్పుడు ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన 'ఘర్ సోప్' బ్రాండ్ కు సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ యాడ్ హిందూ ధర్మాన్ని, ముఖ్యంగా లక్ష్మి దేవిని కించపరిచే విధంగా ఉందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలోనే అనేక వివాదాల్లో నిలిచిన అలీ, ఇప్పుడు ఈ 'యాంటీ హిందూ' యాడ్ అంశంతో మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. 'ఘర్ సోప్' యాడ్ లో లక్ష్మి దేవికి పూజ చేసినట్టుగా.. 'సోప్'కి పూజ చేస్తూ అలీ కనిపించారు. అంతేకాకుండా, లక్ష్మిదేవి నామాలను కూడా ఈ యాడ్ లో ఉపయోగించారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.  అలీ లాంటి సీనియర్ నటుడు ఇలాంటి యాడ్ ను చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్క్రిప్ట్ చదివినప్పుడే ఇది ఒక మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, స్క్రిప్ట్ చేంజ్ చేస్తేనే యాడ్ చేస్తానని అలీ చెప్పి ఉండాల్సిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కళాకారులు ఏ పాత్ర చేసినా, ఏ ప్రకటనలో నటించినా.. సమాజంలోని వివిధ వర్గాల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో, అలీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు ఈ 'ఘర్ సోప్' ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలనే పిలుపులు కూడా వినిపిస్తున్నాయి.  
బ్లాక్‌బస్టర్ ‘శంబాల’(Shambhala)తో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు, దర్శకుడు యుగంధర్ ముని, హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ‘శంబాల’ లాంటి మరో వినూత్నమైన కథాంశంతో వీరంతా కలిసి ఓ ప్రయోగం చేయబోతోన్నారు. యుగంధర్ ముని సమర్పణలో షైనింగ్ పిక్చర్స్ నిర్మాతలైన మహిధర్ రెడ్డి,  రాజశేఖర్ అన్నభిమోజు ఆదితో మరో సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి బృందా రవీందర్ దర్శకత్వం వహించనున్నారు. ‘శంబాల’ తరువాత మళ్లీ ఆ స్థాయిలో సినిమాని నిర్మించాలని వీరంతా కలిసి కథాన్వేషణలో పడ్డారు. ఇక అద్భుతమైన కథ తోడవ్వడంతో వీరంతా కలిసి ముందుకు వచ్చారు. ఎమోషన్స్‌తో పాటుగా ఈ సారి హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారు. భయం, ఉత్కంఠ, అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్‌తో భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన అనుభూతిని అందించేందుకు టీం సిద్దమైంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అదిరిపోయింది. ఈ పోస్టర్‌లో ఆది సాయి కుమార్ ఇంటెన్స్ లుక్, రక్తం కారుతున్న తీరు, చుట్టూ ఉన్న పువ్వులు, ఆకులు, కనిపిస్తున్న పాత కాలం నాటి స్టాంప్ ఇవన్నీ చూస్తుంటే ఓ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకు వెళ్లేలా కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ పోస్టర్‌తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కథకి మ్యూజిక్ ప్రాణం అని, సౌండింగ్‌తోనే సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించాలని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ చరణ్ పాకాలని మ్యూజిక్ డైరెక్టర్‌గా మళ్లీ తీసుకున్నారు. ఆయన వినూత్నంగా, కొత్తగా సౌండ్-డిజైన్ పద్ధతులతో ప్రయోగాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.  బీజీఎంతో ఉద్రిక్తతను పెంచుతూ, భావోద్వేగాలను రేకెత్తిస్తూ, నిశ్శబ్ద క్షణాలలో కూడా ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తామని టీం చెబుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.  
After delivering the sensational blockbuster Shambhala, the successful team is back with yet another intriguing project. Presented by Ugandhar Muni, who helmed the blockbuster Shambhala, and produced by Mahidhar Reddy and Rajasekhar Annabimoju under the banner of Shining Pictures, the film to be mounted on a massive scale marks the directorial debut of Brunda Ravindar. Featuring the versatile Aadi Saikumar in the lead role, the project also marks his second collaboration with the banner after Shambhala. The announcement poster carries a hauntingly artistic and mysterious vibe, instantly creating curiosity around the film. Aadi Saikumar appears in an intense close-up look, partially hidden behind layers of colorful flowers and dried leaves. His piercing eyes stand out sharply, while blood trickling down one side of his forehead adds a dark, unsettling edge to the otherwise visually poetic composition. After years of exploring fresh narrative possibilities, the team is now set to deliver a visually striking atmospheric horror thriller woven with a deeply emotional mystery. Blending fear, suspense, and high-tension entertainment with a strong emotional backbone, the film promises a horror experience unlike anything seen before on the Indian screen. Sound is being envisioned as the heartbeat of this cinematic world. From haunting ambient layers to unsettling sonic textures, every auditory detail is being meticulously shaped to immerse the audience in terror. Known for his intense and immersive audio craft, Sree Charan is set to experiment with entirely new haunting tones, eerie patterns, and innovative sound-design techniques that push the fear factor far beyond visuals.  Here, the soundscape isn’t merely an element- it becomes a living presence, amplifying tension, evoking emotion, and making viewers sense fear even in moments of silence. More details about this first-of-its-kind project will be unveiled soon.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నాచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise). 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ సినిమా ప్రొడక్షన్, రీషూట్ల గురించి సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఈ పుకార్లపై చిత్ర యూనిట్ అత్యంత ఘాటుగా స్పందించింది. స్పష్టత ఇచ్చిన చిత్ర యూనిట్ సినిమా అవుట్‌పుట్ సరిగ్గా రాలేదని, అందుకే చాలా సీన్లు రీషూట్ చేస్తున్నారనే వార్తలపై మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. "మొదటి రోజు ఎంత స్పష్టతతో ఈ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టామో, ఇప్పుడు కూడా అదే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ దిగ్విజయంగా పూర్తయింది" అని టీమ్ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా కోసం ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని, భవిష్యత్తులో కూడా అటువంటి ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అసత్య ప్రచారాలపై సీరియస్ వార్నింగ్ నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేసే వారికి టీమ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. "ఇకపై మా సినిమా గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే, వాటిని మేమే నేరుగా అడ్రస్ చేస్తాం. బాధ్యతాయుతమైన వార్తలను మాత్రమే నమ్మండి" అని పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా కేవలం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే వాటినే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. రిలీజ్ డేట్ ఫిక్స్! ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, టెక్నికల్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నామని తెలిపారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికే సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి టీమ్ శ్రమిస్తోంది.'ది పారడైజ్' ఆగస్టు 21న విడుదల కానుంది. వరుస హిట్లతో ఫామ్ లో ఉన్న నాని, తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా దీనిని భావిస్తున్నారు. అందుకే క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా శ్రీకాంత్ ఓదెల ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ తాజా క్లారిటీతో రీషూట్ పుకార్లకు చెక్ పడినట్లయింది. మరి ఈ 'పారడైజ్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!   https://x.com/TheParadiseOffl/status/2054155020573221279
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'ఉప్పెన' వంటి క్లాసిక్ తర్వాత బుచ్చిబాబు తీస్తున్న సినిమా కావడంతో, అసలు ఈ కథ ఎలా ఉండబోతోంది? చరణ్ పాత్ర ఏంటి? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయనగరం బ్యాక్‌డ్రాప్.. గుర్తింపు లేని ఊరు! ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరిలో రైల్వే స్టేషన్ ఉన్నప్పటికీ, అక్కడ ఒక్క ట్రైన్ కూడా ఆగదు. అసలు ఆ ఊరి ఉనికిని ఎవరూ గుర్తించరు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఊరికి ఒక గుర్తింపు తీసుకురావాలని, అక్కడి సమస్యలను తీర్చాలని స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యువకుడు చేసే పోరాటమే 'పెద్ది' కథ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.  చరణ్ నాలుగు షేడ్స్.. 10 ఏళ్ల జర్నీ ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోంది. ఒక పెద్ది అనే క్యారెక్టర్ యొక్క 10 సంవత్సరాల ప్రయాణాన్ని ఇందులో చూపించనున్నారట. ముఖ్యంగా చరణ్ ఈ సినిమాలో నాలుగు భిన్నమైన షేడ్స్‌లో కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మనం క్రికెట్ మరియు కుస్తీ (రెజ్లింగ్) నేపథ్యాలను చూశాం. వీటితో పాటు మరో రెండు వేరియేషన్స్ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనున్నాయి. దీనికోసం చరణ్ నిజమైన కుస్తీ యోధులతో కలిసి కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారట. కీలక పాత్రల్లో జాన్వీ కపూర్, జగపతి బాబు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో ఒక పక్కా పల్లెటూరి అమ్మాయిగా, చాలా రఫ్ అండ్ టఫ్ క్యారెక్ట‌ర్‌లో కనిపించబోతోంది. అలాగే, జగపతి బాబు పాత్ర సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళుతుందని తెలుస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో చరణ్‌కు కుస్తీ మాస్టర్‌గా కీలక పాత్రలో నటించడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం, శృతి హాసన్ స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. ఎమోషనల్ రైడ్.. థియేటర్లకు కళ! డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథను కేవలం స్పోర్ట్స్ డ్రామాగా మాత్రమే కాకుండా, తండ్రి-కొడుకుల ఎమోషన్ మరియు ఊరితో ఉన్న అనుబంధాన్ని మిక్స్ చేసి ఒక క్లాసిక్ ఎపిక్ లాగా తీర్చిదిద్దారు. సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టకుండా ఉండలేరని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మే 18న ఈ చిత్ర ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న స్తబ్దతను పోగొట్టి, థియేటర్లకు మళ్ళీ కళ తీసుకువచ్చే సినిమా 'పెద్ది' అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా గురించి వచ్చే ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా 'తెలుగువన్'(TeluguOne)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను పంచుకుంటూ రామ్ చరణ్ పాత్రపై చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. చరణ్ మాస్ మేకోవర్.. ఆశ్చర్యపోవడం ఖాయం! ఈ సినిమా కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్ గురించి అవినాష్ కొల్లా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "చరణ్ గారిని ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్లో చూశారు. కానీ 'పెద్ది'లో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఎంతో రా (Raw) గా ఉంటుంది. ఆయన డెడికేషన్ చూసి ఆశ్చర్యం వేసింది" అని అవినాష్ పేర్కొన్నారు. ఇది ఎవరి బయోపిక్ కాదు, కానీ ఒక లోకల్ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్ లా ఉంటుందని తెలిపారు. మే 18న వస్తున్న ట్రైలర్ చూసిన తర్వాత.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలిసి మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నారు. కథ విన్న తర్వాత 20 నిమిషాలు షాక్‌లోనే.. "దర్శకుడు బుచ్చిబాబు నాకు 'పెద్ది' కథ చెప్పినప్పుడు సుమారు 20 నిమిషాల పాటు నేను మామూలు స్థితికి రాలేకపోయాను. అంతటి బలమైన ఎమోషన్ ఈ కథలో ఉంది. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, మనుషుల మధ్య ఉండే గాఢమైన బంధాలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి కళ్లు కచ్చితంగా చెమ్మగిల్లుతాయి" అని అవినాష్ అన్నారు. 24 భారీ సెట్లు.. విజువల్ వండర్! ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరిస్తూ, సుమారు ఒక సంవత్సరం పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరిగాయని అవినాష్ తెలిపారు. "సినిమాలో సుమారు 24 భారీ సెట్లు వేశాం. కానీ అవి సెట్లు అని ఎవరూ గుర్తుపట్టలేరు. అంత సహజంగా విజయనగరం నేపథ్యాన్ని రీ-క్రియేట్ చేశాం." అని చెప్పారు.  1970-80 కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో భారీ సెట్లను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కథలో ఉండే ఎమోషన్ కు తగ్గట్టుగా విజువల్స్ చాలా నేచురల్ గా ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాకుండా, ఒక గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టేలా చూపించడానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంతో కష్టపడింది ఆయన చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు విజన్ అద్భుతమని అవినాష్ అన్నారు. బుచ్చిబాబు ఈ కథను ఎంత గొప్పగా విజువలైజ్ చేశారో అవినాష్ వివరించారు. జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఉండటంతో సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఒక పక్కా లోకల్ మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా మాటలు విన్నాక, ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద పెద్ద విధ్వంసమే సృష్టించేలా కనిపిస్తోంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్, ఈ మట్టి కథతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
  నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో "పంచదారకు బదులుగా బెల్లం వాడటం మంచిదా?" అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మరియు హెల్త్ కోచ్ ఈ వీడియోలో వివరించారు. పంచదార vs బెల్లం: ఏది బెటర్? చాలా మంది పంచదార కంటే బెల్లం ఆరోగ్యకరమని భావిస్తారు. అయితే, వాస్తవానికి పంచదార మరియు బెల్లం రెండింటికీ దాదాపు ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. గ్లైసీమిక్ ఇండెక్స్: పంచదార నేరుగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. జీర్ణం కావడం: బెల్లంలో మొలాసిస్ (Molasses) ఉండటం వల్ల, ఇది పంచదార కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది. కానీ, శరీరానికి అందే క్యాలరీలు మరియు ప్రభావం విషయంలో రెండూ దాదాపు సమానమే. సలహా: మీరు ఆరోగ్యంగా ఉండి, గ్లూకోజ్ లెవల్స్ సాధారణంగా ఉంటే పరిమితంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు రెండింటికీ దూరంగా ఉండటమే మంచిది. స్వీట్నెస్ మరియు ఆరోగ్యం ప్రకృతిలో లభించే పండ్లు మొదలైనవి మనకు అలవాటైన స్వీట్లంత తీపిగా ఉండవు. బ్రాండ్లు మరియు కంపెనీలు మనకు ఈ అధిక తీపిని అలవాటు చేశాయి. పిసిఒఎస్ (PCOS), హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెర్టిలిటీ వంటి అనేక సమస్యలకు చక్కెర ప్రధాన కారణం. డయాబెటిస్ మరియు హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే చక్కెరను డైట్ నుండి వీలైనంత వరకు తొలగించాలి. ప్రత్యామ్నాయాలు ఏవి? చక్కెరకు బదులుగా సహజసిద్ధమైన స్వీట్నర్లను వాడవచ్చు: మొంక్ ఫ్రూట్ (Monk Fruit): ఇది తక్కువ క్యాలరీలను ఇస్తుంది మరియు ఇన్సులిన్ స్థాయిలను వేగంగా పెంచదు. స్టీవియా (Stevia): దీనిపై కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ, మితంగా వాడితే ఇది సురక్షితమేనని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే బాడీ సెన్సిటివిటీని బట్టి దీనిని ఎంచుకోవాలి. బయటికి సన్నగా ఉన్నా లోపల ప్రమాదమేనా? కొందరు ఎంత తిన్నా లావు అవ్వరు (Metabolism వల్ల). కానీ వారు జంక్ ఫుడ్ లేదా అధిక చక్కెర తీసుకుంటే, అది బయటికి కనిపించకపోయినా లోపల లివర్ ఇన్ఫ్లమేషన్ (Liver Inflammation) కు దారితీస్తుంది. శరీరంలో కొవ్వును కరిగించే లేదా పెంచే ఎంజైమ్స్ లోపం వల్ల కొందరు లావు అవ్వకపోవచ్చు, కానీ వారి రక్త నాళాల్లో అడ్డంకులు (clogging) ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకరి శరీరం స్పందించే తీరు మరొకరికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇతరులను చూసి బ్లైండ్‌గా ఫాలో అవ్వకూడదు. ముగింపు: ఫిట్‌నెస్ అంటే కేవలం బరువు తగ్గడం లేదా పెరగడం మాత్రమే కాదు, లోపల అవయవాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది ముఖ్యం. సరైన పోషకాహారం మరియు మితమైన తీపి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మీ జుట్టు - మీ ఆత్మవిశ్వాసం జుట్టు రాలడం లేదా చిట్లిపోవడం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మనలో చాలా మంది జుట్టు పొడవుగా పెరగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, జుట్టు పెరుగుదల అనేది ప్రధానంగా మన జెనెటిక్స్ (Genetics) మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉన్న జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మనం జుట్టు పట్ల ఎందుకు జాగ్రత్త వహించాలి? (Why Should We?) సహజ సౌందర్యం: మీ జుట్టు కర్లీగా ఉన్నా లేదా స్ట్రెయిట్‌గా ఉన్నా, అది మీ ప్రత్యేకత. దాన్ని ప్రేమించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. శాశ్వత నష్టాన్ని నివారించడానికి: జుట్టు ఒకసారి తీవ్రంగా దెబ్బతింటే (పర్మనెంట్ డామేజ్), అది మళ్ళీ పూర్వస్థితికి రావడం కష్టం. ఆరోగ్యకరమైన పెరుగుదల: క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు చిట్లిపోకుండా (Split ends) చూడవచ్చు, దీనివల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా మరియు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇవి అస్సలు చేయకండి! (What Not To Do) అధిక వేడి (High Heat): హెయిర్ స్టైలింగ్ కోసం 180°C కంటే ఎక్కువ వేడిని ఎప్పుడూ వాడకండి. ఇది మీ జుట్టును శాశ్వతంగా దెబ్బతీస్తుంది. బిగుతైన కేశాలంకరణ (Tight Hairstyles): జుట్టును చాలా గట్టిగా వెనక్కి లాగి ముడి వేయడం లేదా పోనీటైల్ వేయడం వల్ల ట్రాక్షన్ అలోపేషియా (Traction Alopecia) అనే సమస్య వస్తుంది. దీనివల్ల జుట్టు ఊడిన చోట మళ్ళీ మొలవదు. అతిగా కెమికల్ ట్రీట్‌మెంట్స్: కెరాటిన్, స్మూతనింగ్ లేదా పర్మింగ్ వంటివి తరచుగా చేయించుకోవడం వల్ల జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. నిరంతరం షాంపూలు మార్చడం: షాంపూ అనేది కేవలం జుట్టును శుభ్రం చేసే సోప్ వంటిది మాత్రమే. ఇది జుట్టు పెరుగుదలను ఆపలేదు లేదా పెంచదు. కేవలం అలర్జీలు ఉంటే తప్ప, పదే పదే షాంపూలు మార్చడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జుట్టు సంరక్షణ కోసం చిట్కాలు (How To Take Care) సహజమైన మాస్క్‌లు: ఇంట్లోనే లభించే అవిసె గింజల జెల్ (Flaxseed gel), కలబంద (Aloe vera), మెంతులు మరియు మందార ఆకులను వాడండి. ఇవి జుట్టుకు మంచి స్మూతనింగ్ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. సరైన వేడి వద్ద స్టైలింగ్: మీరు తప్పనిసరిగా స్టైలింగ్ చేయాలనుకుంటే, వేడిని 140°C నుండి 160°C మధ్య మాత్రమే ఉంచండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్: జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి ప్రతి 6 వారాలకు లేదా కనీసం రెండు నెలలకు ఒకసారి కొద్దిగా ట్రిమ్ చేయించుకోండి. లూజ్ హెయిర్ స్టైల్స్: జుట్టును వదులుగా ఉండేలా చూసుకోండి. స్లీక్ స్టైల్స్ (Sleek styles) కంటే సహజమైన జుట్టును ప్రదర్శించడం ఎంతో మంచిది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: చివర్లు కట్ చేస్తే జుట్టు వేగంగా పెరుగుతుందా?  జ: లేదు. జుట్టు చివర్లు కట్ చేయడం వల్ల జుట్టు చూడటానికి స్మూత్‌గా ఉంటుంది కానీ, పెరుగుదల అనేది రూట్ (స్కాల్ప్) నుండి జరుగుతుంది. ప్ర: హెయిర్ బోటాక్స్ (Hair Botox) సురక్షితమేనా?  జ: ఇది ఒక మార్కెటింగ్ జిమిక్ మాత్రమే. ఇది పర్మనెంట్ కాదు, కేవలం మూడు నెలల వరకు మాత్రమే ఉంటుంది. దీనికంటే సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం. ప్ర: షాంపూ మార్చడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా?  జ: షాంపూ మార్చడం వల్ల నేరుగా హెయిర్ ఫాల్ అవ్వదు. కొన్నిసార్లు అందులోని కొత్త కాంపోనెంట్స్ పడకపోతే అలర్జీ రావచ్చు, కానీ హెయిర్ ఫాల్ అనేది ఇతర కారణాల వల్ల (జెనెటిక్స్ లేదా ఒత్తిడి) జరగవచ్చు. జుట్టు ఆరోగ్యం అనేది మీరు దాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. రసాయనాలకు దూరంగా ఉంటూ, సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా మీ జుట్టును మెరిసేలా ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన అలవాట్లే మీ జుట్టుకు నిజమైన బలం. మరిన్ని హెల్త్ టిప్స్ మరియు హెయిర్ కేర్ రహస్యాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది.  చాలా వరకు ఆఫీసు పనులు, వ్యక్తిగత పనుల మీద ఒంటరిగానే ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిజానికి ప్రయాణాలు అంటే అదొక స్పెషల్ మూమెంట్ అనిపిస్తుంది.  కానీ చాలా మంది మాత్రం ప్రయాణంలో చెప్పుకోలేని అసౌకర్యం అనుభవిస్తుంటారు.  అదే మలబద్దకం. ప్రయాణం కోసం అలా ఇంటి నుండి బయటపడగానే.. ఇటు మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిర్లు,  అసౌకర్యం మొత్తం ప్రయాణాన్ని నాశనం చేస్తాయి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు  ఈ సమస్య నరకాన్ని పరిచయం చేస్తుంది. అసలు ప్రయాణాలలో మలబద్దకం ఎందుకు వస్తుంది.  ఈ సమస్యకు చెక్ పెట్టే చిట్కాలేంటి తెలుసుకుంటే.. ప్రయాణాల సమయంలో మలబద్దకం ఎందుకు వస్తుంది? ప్రయాణాలు చేసేటప్పుడు దినచర్య మారడం,  ఆహారపు అలవాట్లలో మార్పులు,  నీరు తక్కువ తీసుకోవడం,  ఎక్కువ సేపు కూర్చోవడం,  నిద్రలేకపోవడం,  టాయిలెట్ కు వెళ్లడానికి తగిన వెసులుబాటు లేకపోవడం మొదలైనవి మలబద్దకం రావడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే ప్రయాణాల సమయంలో మలబద్దకం,  ఉబ్బరం,   గ్యాస్ వంటి సమస్యలను చాలా మంది ఎదుర్కుంటారు. ముఖ్యంగా వృద్దులు, స్త్రీలు,  పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు ప్రయాణ సమయంలో మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టే చిట్కాలు.. ప్రయాణాలలో మలబద్దకానికి చెక్ పెట్టాలంటే ప్రయాణాలలో ఫైబర్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  మరీ ముఖ్యంగా ప్రయాణాలలో హోటల్ ఆహారాన్ని నిషేధించాలి. ప్రయాణాలలో ఆహారం వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే పండ్లను తినడం మంచిది. పండ్లలో ఫైబర్ ఉంటుంది, నీటి శాతం కూడా ఉంటుంది.  ఇది జీర్ణాశయానికి సహాయపడుతుంది. ప్రయాణాలలో ఆకలి వేయకపోయినా స్నాక్స్ తినే అలవాటు కొందరికి ఉంటుంది.  బిస్కెట్లు,  సమోసాలు వంటివి తినడం వల్ల మలబద్దకం వస్తుంది.  అందుకే వీటిని నివారించాలి.  ఆకలిగా అనిపిస్తే బాదం, కాజు వంటి శక్తిని ఇచ్చే నట్స్ తీసుకోవాలి. ప్రయాణాలలో చాలామంది నీరు తక్కువగా తాగుతారు. కానీ ప్రయాణాలలో తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తాగేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువసేపు అలాగే కూర్చోకుండా అటు ఇటు తిరగడం,  ఏవైనా స్టాప్ లు వచ్చినప్పుడు కిందకు దిగి మళ్లీ ఎక్కడం వంటివి చేయవచ్చు. ప్రయాణాలలో తప్పనిసరిగా బయటి ఆహారం తినాల్సి వస్తే ప్రోబయోటిక్స్ మెరుగ్గా ఉన్న ఆహారం తీసుకోవాలి.  దోశ, ఇడ్లీ,  మజ్జిగ, పెరుగన్నం వంటివి మలబద్దకం రాకుండా చేస్తాయి. అలాగే ప్రయాణంలో పాలు పోక ఊరికే కాఫీలు,  టీలు తాగడం మానేయాలి. ప్రయాణాలలో మలబద్దకం సమస్యను ఎదుర్కునేవారు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇలా సమస్య ఎదుర్కునేవారు వైద్యుడిని సంప్రదించి వారి సలహా మేరకు మందులు వాడటం మంచిది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి రోజూ ఆహారంలో పండ్లు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అయితే కొన్నిరకాల పండ్ల రసాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.  ముఖ్యంగా దానిమ్మ రసం చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రోజూ ఒక కప్పు దానిమ్మ (pomegranate) రసం తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరతాయి. ఇది శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉంచే సహజ ఆయుర్వేద ఔషధంలా పనిచేస్తుంది. దానిమ్మ రసం తాగడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటంటే.. గుండె ఆరోగ్యానికి మంచిది.. రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. గుండెపోటు, హై బీపీ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్.. దానిమ్మలో పునికాలగిన్స్ (punicalagins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్, వృద్ధాప్యం రాకుండా రక్షిస్తాయి. శరీరానికి నష్టం కలిగించే హానికరమైన కణాలతో పోరాడతాయి. రక్తహీనత (అనీమియా) నివారణ.. దానిమ్మలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి దానిమ్మ జ్యూస్ లో కూడాఐరన్ అధికంగా ఉంటుంది.  ఈ కారణం వల్ల హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తుంది. రక్తహీనత సమస్య తో ఇబ్బంది పడేవారు,  ముఖ్యంగా మహిళలు దానిమ్మ రసం రోజూ తీసుకుంటే మంచిది.  ఇంకా దానిమ్మ జ్యూస్  రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చర్మవర్ణం మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక శక్తి.. దానిమ్మలో విటమిన్ C, విటమిన్ K, పొటాషియం అధికంగా ఉంటాయి.  ఇవి   ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం,  అందం.. దానిమ్మ జ్యూస్ రోజూ తాగుతూ ఉంటే చర్మం గ్లోగా, యంగ్‌గా కనిపించేందుకు సహాయపడుతుంది.  అలాగే చర్మం మీద మొటిమలు, మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుంది. మూత్రపిండాలకు & కాలేయానికి శుభ్రత.. టాక్సిన్లను బయటకు పంపి లివర్‌ను డిటాక్స్ చేయడంలో దానిమ్మ బాగా పనిచేస్తుంది. అంతేకాదు  మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడం & బరువు తగ్గడం.. దానిమ్మలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఈ కారణంగా దానిమ్మ పండు లేదా జ్యూస్ తీసుకుంటే   త్వరగా ఆకలి కాదు.   మితంగా తీసుకుంటే బరువు తగ్గే వారికీ సహాయకరంగా ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన  రసం తీసుకోవడం మంచిది.  ప్యాకెట్ జ్యూస్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది.  డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవాలి. రోజూ 1 కప్పు (150–200 మిల్లీలీటర్లు) సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ తీసుకోకూడదు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...