LATEST NEWS
  తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉండగా, అధికార పక్షానికి కేవలం 108 మంది సభ్యుల బలమే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా తమిళనాడులో అభివృద్ధి మందగించిందని స్టాలిన్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్టాలిన్ సూచించారు. మరోవైపు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు పాలన నేడు గాడితప్పిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలుగా కాకుండా, రాజకీయ ప్రదర్శనల వేదికలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.  
ఉభయ తెలుగు రాష్ట్రాల  రాజకీయాల్లో  బీఆర్ఎస్, వైసీపీల బంధం గురించి చర్చ బాహాటంగా సాగడం కద్దు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైపీపీ అధినేత జగన్, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుల మధ్య స్నేహం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇరువురు నేతలూ పరస్పరం ప్రశంసలను గుప్పించుకోవడం తెలిసిందే.   తాజాగా   వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  నిర్వహించిన ఒక భారీ   ర్యాలీలో  బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.   తెలంగాణ వేదికగా జరిగిన ఈ పొలిటికల్  డెవలప్‌మెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు కథేంటి, దీని వెనుక ఏవైనా పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయా  అన్నది ఇప్పుడు రాజకీయవర్గాలలో  తెగ చర్చనీయాంశంగా మారింది.  సాధారణంగా తెలంగాణ రాజకీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కి నాయకుల ఫోటోలు లేదా ఫ్లెక్సీలు   చాలా చాలా  అరుదుగా కనిపిస్తుంటాయి.  గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం కేటీఆర్ స్వయంగా హైదరాబాద్‌లో జగన్ తో భేటీ అఅయ్యారు.  అయితే ఆ తర్వాత కాలంలో రెండు పార్టీల మధ్య, అలాగే  కేటీఆర్, జగన్ మధ్య అనుబంధానికి సంబంధించిన వార్తలుపెద్దగా వినిపించలేదు. మధ్యలో అడపాదడపా వైసీపీ బీఆర్ఎస్ అనుబంధం, జగన్, కేటీఆర్ స్నేహం గురించిన ప్రస్తావనలు వచ్చినా, తాజాగా  వికారాబాద్ లో కేటీఆర్ ర్యాలీ జరుగుతున్న సమయంలో జగన్ ఫ్లెక్సీలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం జోరందుకుంది.    ఈ పరిణామంపై తెలంగాణలో కాంగ్రెస్,   ఏపీ తెలుగుదేశం నేతలు తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు.  గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్, వైసీపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ తాము చేసిన ఆరోపణలకు ఈ ఫ్లెక్సీలు బలమైన నిదర్శనమని అంటున్నారు. మరోవైపు, వికారాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు, వైసీపీ సానుభూతిపరుల మద్దతును కూడగట్టేందుకే ఈ తరహా ఫ్లెక్సీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సీనియర్ ఐఏఎస్ అధికారి  శ్రీలక్ష్మి రిటైర్‌మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.  మంగళవారం (జూన్ 30) శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్ అయిన తరువాత ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి..  జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా  పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.   22 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్‌గా ఎంపికైన శ్రీలక్ష్మి  కెరీర్‌ మొత్తం వివాదాస్పదంగానే సాగింది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ సీఎస్‌గా పనిచేసిన శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొని,  వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో ఆరో నిందితురాలిగా ఉన్నారు.  2011 నుంచి 2013 మార్చి వరకు చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్‌పై వచ్చిన శ్రీలక్ష్మి  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌లో కొనసాగి.. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి వచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమెను కూటమి ప్రభుత్వం రాగానే పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తాజాగా రిటైర్‌మెంట్‌కు 4 రోజుల ముందు ఆమెకు పోస్టింగ్ దక్కింది. ఇప్పుడు జగన్‌ కేసుల్లో సహనిందితురాలిగా ఉన్న అనుబంధం, తనకున్న ఫైనాన్షియల్ బ్యాంక్‌గ్రౌండ్‌తో శ్రీలక్ష్మి వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతుండటం రాజకీయవర్గాల్లో బర్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా  బీజేపీ) వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  పార్టీ తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.   ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని, అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలను తెలంగాణ బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని  పిలుపునిచ్చారు. బెంగాల్ మోడల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించాలన్న నితిన్ నబీన్.. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఇక ఎంత మాత్రం సహించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు.  బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు.   పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  రాజకీయంగా  భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు కోల్పోవడం బీజేపీకి  ప్లస్ పాయింట్‌ అయ్యింది. దానికి తోడు అక్కడ  తృణమూల్ కాంగ్రెస్పై తీవ్రమైన అవినీతి, అక్రమాల ముద్ర పడటం, మమతా బెనర్జీ తర్వాత వారసుడిగా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ మించి బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి బలమైన, మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఐకాన్ లీడర్ బీజేపీకి దొరకడం కలిసి వచ్చింది. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలే అక్కడ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయి. కానీ..  అటువంటి పరిస్థితి లేదు.  రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ, సీఎంపై గానీ ప్రజల్లో పెద్దగా  వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ముద్ర పడిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో   కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ..  వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో   బలమైన   నేతగా, మాస్  లీడర్‌గా, అసెంబ్లీ లోపలా  బయటా గట్టిగా గళం ఎత్తగల నాయకుడిగా  గుర్తింపు పొందారు. ఇటువంటి బలమైన వ్యూహకర్తను ఢీకొట్టడం బీజేపీ అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు.  మరోవైపు..  బెంగాల్‌లో సువేందు అధికారి తరహాలో రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగల  నాయకుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎవరూ కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య  అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు, కుమ్ములాటలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయని చెబుతున్నారు.   అలాగే.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్  ఇప్పటికీ బలంగానే ఉండటం కూడా బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో   త్రిముఖ పోటీ తధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. బెంగాల్ తరహా ఏకపక్ష వ్యూహాలు ఇక్కడ ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి  రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా..  విభజన చట్టంలో పేర్కొన్న ప‌లు కీలక ప్రాజెక్టులు, హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి హామీలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదనే అసంతృప్తి స్థానికంగా చాలా చాలా బలంగా ఉంది.  తెలంగాణ ఆవిర్భావానికి  పార్లమెంట్‌లో తాము కూడా మద్దతు తెలిపామని బీజేపీ క్రెడిట్ కోరుకుంటున్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పుష్కర కాలంలో  రాష్ట్రానికి చేసిన ఆర్థిక సాయం ఎంత అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే..   కేవలం బెంగాల్ ఫార్ములాను నమ్ముకుని తెలంగాణలో పాగా వేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడంగా మారుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. 
భారతీయ రాజకీయాలలొప్రశాంత్ కిషోర్ (పీకే) పేరుకు పరిచయం అక్కర్లేదు.  రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో చారిత్రాత్మక విజయాల వెనుక పీకే ఉన్నారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మరో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.  సొంత పార్టీ పెట్టి  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ  తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ అప్పుడు తాను స్వయంగా పోటీ చేయలేదు. పార్టీ ఘోర పరాజయం తరువాత ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు  సిద్ధమౌతున్నారు.    బిహార్‌లో ఆయన స్థాపించిన  జన్ సూరజ్  పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా వెనుకడుగు వేయని ప్రశాంత్ కిశోర్..  ఇప్పుడు బీహార్ కొత్త పాట్నా పరిధిలోని  బాంకీపూర్  నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా  బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.  దీంతో బాకింపూర్ కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీకి బలమైన నియోజకవర్గమే అయినప్పటికీ..  పీకే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా వెళ్లడడించారు.  బాంకీపూర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమనీ.. అవసరమైతే తానే స్వయంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు   పొలిటికల్ స్క్రీన్‌ప్లే లకే పరిమితమైన  ప్రశాంత్ కిషోర్..    ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అదీ బీజేపీకి గట్టిపట్టున్న బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. బీజేపీ కోటలాంటి బాంకీపూర్ లో పీకే గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాశాంత్ కిశోర్ మాత్రం  దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
    యాక్షన్ కింగ్ అర్జున్(Arjun).. ఈ పేరుకి ఉన్న చరిష్మా, సృష్టించిన రికార్డులు బహుశా ఇక తెలుగు సినిమా చరిత్రలో ఏ హీరో సృష్టించడేమో. తెలుగు ఫీల్డ్ అనే  కాదు ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా ఏ హీరో కూడా అర్జున్ రికార్డుని సృష్టించలేడు. అసలు దరి దాపుల్లోకి కూడా రారు. మరి ఆ రికార్డు ఏంటో చూద్దాం. మా పల్లెలో గోపాలుడు.. అర్జున్ తొలిసారి తెలుగు తెరపై మెరిసిన మూవీ. ఈ మూవీకి ముందు తన సొంత లాంగ్వేజ్ కన్నడలో పలు చిత్రాలు చేసినప్పటికీ మా పల్లెలో గోపాలుడు ద్వారానే తెలుగునాట అడుగుపెట్టాడు. ఈ సినిమా సాధించిన వసూళ్లు మరియు రికార్డులు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ఏకంగా 21 కేంద్రాలలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇది ఆ కాలంలో ఒక కొత్త హీరో సాధించలేని అరుదైన రికార్డు. అంతటితో ఆగకుండా, ప్రేక్షకుల నీరాజనాలతో ఏకంగా 367 రోజులు అంటే ఒక సంవత్సరం పైగా ప్రదర్శితమై సరికొత్త చరిత్ర సృష్టించింది.  367 రోజులు ఆడిన కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. దీంతో అర్జున్ ని ఓవర్ నైట్  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్టార్‌గా నిలబెట్టింది.  1985 ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీలోని గ్రామీణ నేపథ్యంలో సాగే అమాయకపు ప్రేమ, సెంటిమెంట్, ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ థియేటర్లకి  కుటుంబాలు, కుటుంబాలు  వలస కట్టేలా చేశాయి. అగ్ర దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ మూవీని .భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. గోపాల్ రెడ్డి నిర్మించాడు.   అర్జున్ సరసన పూర్ణిమ కథానాయికగా నటించగా, గొల్లపూడి మారుతీరావు, రాజా, వై. విజయ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో  మెప్పించారు. ముఖ్యంగా వై. విజయ పోషించిన పాత్ర మూవీకి పెద్ద అసెట్ గా నిలిచింది.స్వరబ్రహ్మ కె.వి. మహదేవన్ అందించిన సంగీతం అత్యంత ప్రాచుర్యం పొందింది. నేను ఈల వేస్తే గోలకొండ అదిరిపడతది", "రాణీ రాణమ్మా", "ఘుం ఘుం ఘుం ఘుం గుమ్మెత్తింది గోదారిసీమ" తో పాటు మొత్తం  5 అద్భుతమైన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గాత్రం పాటలకి  ప్రాణం పోశాయి. గణేష్ పాత్రో రాసిన పదునైన డైలాగ్స్ కూడా సినిమా విజయానికి ముఖ్య కారణం. ఈ ఘన విజయంతో దర్శకుడు కోడి రామకృష్ణ, హీరో అర్జున్ కాంబినేషన్ ఎంత హిట్ అయిందంటే, ఆ తర్వాత వీరిద్దరి కలయికలో మరో 4 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. టాలీవుడ్ చరిత్రలో 367 రోజుల లాంగ్ రన్ రికార్డుతో నిలిచిన "మా పల్లెలో గోపాలుడు" ఎప్పటికీ ఒక అపురూప క్లాసిక్ సినిమా.  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి, ఏకంగా ఒక సంవత్సరం పైగా థియేటర్లలో ఆడిన ఘనత మాత్రం అర్జున్ కె దక్కుతుంది.   
SS Rajamouli is gearing up for one of the biggest schedules of his upcoming film Varanasi. The filmmaker is reportedly set to commence filming a massive battle sequence from July 7 at a specially constructed set in Hyderabad, with nearly 3,500 junior artists expected to take part in the shoot. Although the sequence is set in Varanasi, the makers have recreated the city's landscape on an elaborate set in Hyderabad. The schedule is said to be one of the most ambitious portions of the film, involving large-scale action choreography, extensive crowd management and elaborate production planning. The update comes after Rajamouli recently revealed that the film's major IMAX-specific action episodes had already been completed. The upcoming schedule is expected to be another key milestone in the production of the much-awaited globe-trotting adventure. Varanasi stars Mahesh Babu in the lead role, with Priyanka Chopra Jonas and Prithviraj Sukumaran playing pivotal characters. Rajamouli has previously described the film as a standalone epic featuring a Ramayana-inspired narrative, making it one of the most anticipated Indian films currently under production. While the makers are yet to officially confirm details of the battle sequence, the reported scale of the shoot has already created excitement among fans. With thousands of junior artists, an elaborate Varanasi set and Rajamouli's trademark vision, the sequence is expected to be one of the biggest highlights of the film. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Director Cibi Chakravarthy, who made a successful debut with Don, has had an eventful journey trying to lock his next sophomore project. After the success of the Sivakarthikeyan-starrer, the filmmaker was linked with several high-profile stars, but none of those collaborations eventually took off. Now, industry buzz suggests that Cibi is in discussions with Chiyaan Vikram for his next directorial. Following Don, Cibi was initially expected to reunite with Sivakarthikeyan. While the duo reportedly held multiple discussions, the project never materialised as both moved on to other commitments. The director was later said to be developing a Telugu film with Nani, but those talks also failed to reach the production stage. The biggest opportunity came when Cibi secured a film with Superstar Rajinikanth, to be produced by Kamal Haasan's banner. However, Rajinikanth later clarified that the script required significantly more pre-production as it had many elements before it could go on floors. Instead of going with such hi-fi subject, the superstar moved ahead with Dharman, directed by Ashwath Marimuthu, which has now commenced shooting. With that chapter closed, Cibi Chakravarthy appears to have shifted his focus to a new collaboration. Sources indicate that the director is currently in talks with Chiyaan Vikram, although discussions are said to be at an early stage. Neither the actor nor the filmmaker has officially confirmed the project. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తమిళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా యావత్ దక్షిణ భారత చలనచిత్ర రంగంలో తనకంటూ  ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ,దర్శకుడు, రైటర్, నటుడు భాగ్యరాజా   రెండు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. 50 ఏళ్లకి పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలని  అందించి, మధ్యతరగతి జీవితాలని వెండితెరపై ఆవిష్కరించిన ఈ మహోన్నత కథ సృష్టికర్తకి  చివరిసారిగా నివాళులర్పించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  నిన్న  చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అయితే, ఈ అత్యంత బాధాకరమైన సమయంలో కొందరు ప్రదర్శించిన అతి నెటిజన్లని , సెలబ్రిటీలను తీవ్రంగా కలచివేసింది. భాగ్యరాజ్ భౌతికకాయాన్ని దర్శించుకోవడానికి మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన నటీనటులను కొంతమంది యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు కెమెరాలతో చుట్టుముట్టారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల ముఖాల దగ్గరకు కెమెరాలను జూమ్ చేస్తూ, వ్యూస్ కోసం వారు పడ్డ తాపత్రయం అక్కడ ఒక సర్కస్ వాతావరణాన్ని తలపించింది. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలని  దానం చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్న వేళ, కళ్లని సేకరించడానికి వచ్చిన మెడికల్ టీమ్ వాహనం దగ్గర కూడా విపరీతమైన జనం గుంపులుగా చేరి కెమెరాలతో హంగామా సృష్టించారు. కనీసం నడవడానికి కూడా వీలులేని విధంగా అక్కడి వాతావరణాన్ని మార్చేశారు. ఈ తోపులాట మరియు కెమెరాల గోల చూసి అక్కడికి వచ్చిన సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ తీవ్ర అసహనానికి, ఆవేదనకి  గురయ్యారు. Also read: skn: యాక్టర్ గా ఎస్ కె ఎన్.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు కళ్లల్లో నీళ్లతో, రెండు చేతులు జోడించి అక్కడున్న మీడియా ప్రతినిధులను, వీడియోలు తీస్తున్న వారిని రాధిక వేడుకున్నారు. "మీకు టీఆర్‌పీ రేటింగుల కోసం, సోషల్ మీడియా వ్యూస్ కోసం కేవలం డ్రామా మాత్రమే కావాలంటే, మేము సినిమాల్లో నటనను చూపిస్తాం, మీకు కావలసిన డ్రామాను అందిస్తాం. కానీ దయచేసి ఇక్కడ మానవత్వంతో ఆలోచించండి. మనుషుల జీవితాలు వేరు, మాకు కొంచెం ప్రైవసీ (వ్యక్తిగత స్వేచ్ఛ) ఇవ్వండి" అంటూ తన ఆగ్రహాన్ని, బాధని వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO), ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు నడిఘర్ సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ చేసారు. ఒక మహోన్నతమైన వ్యక్తికి, 50 ఏళ్ల నా ప్రాణ స్నేహితుడికి ప్రశాంతంగా వీడ్కోలు పలకాల్సిన చోటుని కొందరు దారుణంగా ఒక సర్కస్‌లా మార్చేశారని ఆమె మండిపడ్డారు.
  చిరంజీవి(chiranjeevi )అభిమానిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి  తెలుగు చిత్ర పరిశ్రమలో కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నమ్ముకుని, వాటిని భారీ విజయాలుగా మలిచే టాలెంటెడ్ టేస్ట్‌ఫుల్ నిర్మాతగా మారాడు ఎస్‌కేఎన్.  'ఈ రోజుల్లో' మూవీతో  కో ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టిన ఆయన, ఆ తర్వాత 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి విజయవంతమైన చిత్రాల్లో భాగస్వామిగా నిలిచారు. ముఖ్యంగా 2023లో వచ్చిన 'బేబీ' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించి, దాదాపు 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేశారు. కేవలం  నిర్మాతగానే కాకుండా, ఇండస్ట్రీ సమస్యలపై సోషల్ మీడియాలో నిలదీసే పవర్‌ఫుల్ పర్సనాలిటీగా ఆయనకు గుర్తింపు ఉంది. సినిమా ప్రమోషన్లలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, తనదైన బోల్డ్ స్టేట్‌మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఎస్‌కేఎన్, ఇప్పుడు తన కెరీర్‌లో సరికొత్త అడుగు వేయబోతున్నారు. నిర్మాత కుర్చీ నుంచి కెమెరా ముందుకు వచ్చి, నటుడిగా టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. 'మసూద', 'పలాస 1978', 'జార్జ్ రెడ్డి', అలాగే 2026 లేటెస్ట్ హిట్ 'పాపం ప్రతాప్' చిత్రాలతో వర్సటైల్ యాక్టర్‌గా, హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్. ప్రస్తుతం తిరువీర్ హీరోగా, కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా ఒక సరికొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. గ్రామీణ నేపథ్యంతో సాగే అవుట్ అండ్ అవుట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో నిర్మాత ఎస్‌కేఎన్ ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలను ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ, ఈ సినిమాలో పాత్రకున్న ప్రాధాన్యత నచ్చడంతో ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎస్‌కేఎన్ పోషించబోయే క్యారెక్టర్ కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ సమాచారం. Also read: Varanasi: తండ్రి కొడుకుల ఎమోషన్!.. వారణాసి బిగ్ అప్డేట్   
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'వారణాసి'. రాజమౌళి మహేష్ బాబు ల  ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ కూడా. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో ఎస్ఎస్ఎమ్‌బి 29 (SSMB29) అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడిన ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా 'వారణాసి' అని ప్రకటించినప్పటి నుండి దీని గురించిన ప్రతి చిన్న అప్‌డేట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రం కేవలం ఒక అడ్వెంచర్ డ్రామా మాత్రమే కాకుండా, భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్,  విభిన్న కాలాలకి  సంబంధించిన ఒక అద్భుతమైన కాస్మిక్ ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు 1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మందాకిని రోల్ పోషిస్తుండగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే శక్తివంతమైన క్యారక్టర్ లో   కనిపిస్తున్నారు. ఈ సినిమా కథాంశం ఎంతో విలక్షణమైనదిగా ఉండబోతోంది. క్రీస్తు శకం 512 (512 CE) కాలంలో వారణాసి ఘాట్ల వద్ద ఒక ఋషి చేసే రహస్య పూజలతో ప్రారంభమయ్యే ఈ కథ, ఒక్కసారిగా 2027 వ సంవత్సరానికి మారుతుంది. 2027వ సంవత్సరంలో 'శాంభవి' అనే ఒక భారీ గ్రహశకలం (Asteroid) భూమి వైపు దూసుకువస్తూ ఉంటుంది. ఆ గ్రహశకలం వల్ల భూమికి ఎదురయ్యే విపత్తును అడ్డుకోవడానికి హీరో చేసే సాహసోపేతమైన అన్వేషణే ఈ చిత్ర ముఖ్య కథాంశం అని తెలుస్తోంది. ఈ ప్రయాణంలో కథ అంటార్కిటికాలోని మంచు ఖండాల నుండి ఆఫ్రికాలోని కెన్యా అడవుల వరకు, అలాగే అమెజాన్ అడవుల నుండి పురాతన త్రేతాయుగం కాలం వరకు ఎన్నో విభిన్న కాలాలు మరియు భౌగోళిక ప్రాంతాల గుండా సాగుతుంది. అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న మొదటి భారతీయ చిత్రంగా కూడా 'వారణాసి' సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సదరు తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా ఉండబోతున్నాయని  తెలుస్తుంది. అందులో ఒకటి రుద్ర అనే రగ్గడ్  అడ్వెంచరస్ రోల్ కాగా, మరొకటి త్రేతాయుగం నాటి శ్రీరాముడి పాత్ర అని సమాచారం. ఈ శ్రీరాముడికి సంబంధించిన మైథలాజికల్ ఎపిసోడ్‌ని  రాజమౌళి దాదాపు 60 రోజులకి  పైగా భారీ ఎత్తున చిత్రీకరించారు. Also read: vishal: శివ మూవీపై విశాల్ కామెంట్స్ వైరల్  రామోజీ ఫిల్మ్ సిటీలో దాదాపు 50 కోట్ల రూపాయల భారీ వ్యయంతో వారణాసి ఘాట్లకు సంబంధించిన ఒక అద్భుతమైన సెట్‌ను నిర్మించి కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్.ఎమ్. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ మోడల్ కూడా ఎంతో ప్రత్యేకం. రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ కూడా సినిమా లాభాల్లో 40 శాతం వాటాను పంచుకునేలా రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను ఎంచుకున్నారు. ఇది సినిమా నిర్మాణ వ్యయాన్ని మరింత మెరుగుపరచడానికి సహాయపడింది. అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ తరహా యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు, భారతీయ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక మూలాలని  కలగలిపి రాజమౌళి ఈ విజువల్ వండర్‌ని మలుస్తున్నారు. 2027 ఏప్రిల్ 7 న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న వారణాసి  బాక్సాఫీస్ వద్ద 2000 కోట్లకి  పైగా వసూళ్లని  సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. మహేష్ బాబు నుంచి అయితే  మునుపెన్నడూ లేని విధంగా త్రిశూలాన్ని చేతబూని, నంది లాకెట్ ధరించి ఎద్దుపై దూసుకువచ్చే విజువల్స్ అభిమానులు, మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించనున్నాయి.    
టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కలయికల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోయే సరికొత్త చిత్రం #NTRxTrivikram అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.  ఈ అద్భుతమైన పోస్టర్‌ను గమనిస్తే, అందులో ఒక వైపు దైవిక శక్తుల కలయిక, మరోవైపు ఆధునిక విజ్ఞాన శాస్త్ర ముద్ర స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా, ఒక పక్కన యుద్ధ భూమిని తలపించే వాతావరణం, ఎగురుతున్న ఎర్రటి జెండాలు, మరో పక్కన ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఒక విలక్షణమైన ఆయుధం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆయుధం కేవలం ఒక త్రిశూలం మాత్రమే కాదు, దాని పైభాగంలో మానవ జీవన రహస్యాలను మోసే ఒక 'DNA స్ట్రాండ్' ముడిపడి ఉండటం సరికొత్త చర్చకు దారితీసింది. దైవికమైన ఆయుధానికి మరియు ఆధునిక జన్యుశాస్త్రానికి ఉన్న ఈ వింత బంధం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ ప్రత్యేకమైన పోస్టర్‌లో ప్రదర్శించిన శ్లోకం ఇప్పుడు సినీ ప్రియులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆది శంకరాచార్యులు పరమ పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో రచించిన 'సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం' లోని ఒక దివ్యమైన శ్లోకాన్ని ఈ పోస్టర్ మధ్యలో ముద్రించారు. "ఓం న జానామి శబ్దం న జానామి చార్థం, న జానామి పద్యం న జానామి గద్యమ్! చిదేకో షడాస్యః హృది ద్యోతతే మే, ముఖాాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్!!" అనేదే ఆ సంస్కృత శ్లోకం.  ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఎంతో లోతైనది, భావోద్వేగభరితమైనది. దీని అర్థం ఏమిటంటే, "నాకు సరైన పదాలు తెలియవు, వాటి వెనుక ఉన్న గంభీరమైన అర్థాలు అస్సలు తెలియవు. నాకు కావ్యం రాయడం రాదు, వచనం అల్లడం అంతకన్నా తెలియదు. కానీ, షణ్ముఖుడు (ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి) నా హృదయంలో ప్రకాశిస్తున్నంత కాలం, నా నోటి నుండి అద్భుతమైన, ఆశ్చర్యకరమైన మాటలు నా ప్రమేయం లేకుండానే వెలువడతాయి" అని అర్థం.  అంటే, ఒక సాధారణ మనిషి దైవిక శక్తికి ఒక సాధనంగా మారినప్పుడు, అతని ద్వారా జరిగే అద్భుతాలు ఏ స్థాయిలో ఉంటాయో ఈ శ్లోకం తెలియజేస్తోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌ను పరిశీలిస్తే, "ONE SPEAR ONE PURPOSE ONE DIVINE RECKONING" అనే క్యాప్షన్ ద్వారా ఈ కథ ఎంత పవర్‌ఫుల్‌గా సాగబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంలో దైవిక వంశపారంపర్యం, పురాతన విధిరాత మరియు విశ్వ శక్తి ఒక వ్యక్తి ద్వారా ఎలా ప్రవహిస్తాయనే విభిన్నమైన లైన్‌ను త్రివిక్రమ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దైవిక శక్తిని, ఆధునిక సైన్స్‌ని మిక్స్ చేస్తూ త్రివిక్రమ్ రాసుకున్న ఈ సరికొత్త కథాంశంలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించబోతున్నారు.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ అద్భుతమైన పోస్టర్ ను చూస్తుంటే, రాబోయే రోజుల్లో వెండితెరపై ఒక గొప్ప దృశ్య కావ్యం ఆవిష్కృతం కాబోతుందని అర్థమవుతోంది.   https://x.com/haarikahassine/status/2071557894966014119
2026 ప్రథమార్ధం తెలుగు చిత్ర పరిశ్రమకు ఆశించిన స్థాయి ఫలితాలను ఇవ్వలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో టాలీవుడ్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో, 2026 ద్వితీయార్ధం (సెకండాఫ్) పైనే ఇండస్ట్రీ ఇప్పుడు కొండంత ఆశలు పెట్టుకుంది. రాబోయే ఆరు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 2000 కోట్ల రూపాయల భారీ బిజినెస్‌ను పణంగా పెడుతున్నాయి. ఈ చిత్రాలు టాలీవుడ్‌ను గట్టెక్కిస్తాయా లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భారీ రేసులో అందరి కళ్ళు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంపైనే ఉన్నాయి. క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ఇది. 1940 కాలం నాటి కథాంశంతో అంతర్జాతీయ స్థాయి విజువల్స్, భారీ రన్‌టైమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా 600 కోట్ల రూపాయలు దాటినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం కేవలం హిట్ అయితే సరిపోదు, పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే ఇండస్ట్రీ హిట్ రేంజ్ బ్లాక్‌బస్టర్ సాధించాల్సి ఉంటుంది. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ సైతం బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌తో ఉంది. విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్ల రూపాయలకు చేరుకుంది. గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నా కథలో బలం లేకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తున్న రోజులివి. కాబట్టి విశ్వంభర బాక్సాఫీస్ విజయం పూర్తిగా కథాబలంపైనే ఆధారపడి ఉంది. ఇక నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది పారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నాని కెరీర్‌లోనే మొదటిసారిగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం నిర్మితమవుతోంది. నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల ఆగస్టు 21న విడుదల కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. పెరిగిన బడ్జెట్ కారణంగా ఈ చిత్రంపై తీవ్రమైన బాక్సాఫీస్ ఒత్తిడి నెలకొంది. యువ హీరో విజయ్ దేవరకొండ సైతం వరుస ఫ్లాపుల తర్వాత గట్టి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు 150 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తన మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి విజయ్‌కు ఈ సినిమా సక్సెస్ అత్యంత కీలకం. వీరితో పాటు సీనియర్ హీరోలైన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ బడ్జెట్ 100 కోట్లు దాటడం విశేషం. ఓటిటీల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రస్తుత కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడం పెద్ద సవాలే. అలాగే కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ కూడా దసరా రేసులో నిలవనుంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని నాగార్జునకు ఈ మైల్‌స్టోన్ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకం. మొత్తానికి ఈ 2000 కోట్ల టాలీవుడ్ బెట్టింగ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
The wait is finally over. After years of anticipation and countless conversations among fans, Man of Masses NTR and visionary filmmaker Trivikram Srinivas officially reunite for one of the most awaited films in Indian cinema. Following the blockbuster success of Aravinda Sametha Veera Raghava, the celebrated actor-director duo is set to embark on an extraordinary cinematic journey. Conceived on a grand scale and rooted in divinity, the film promises a powerful blend of mythology-inspired storytelling, intense emotions, breathtaking action and spectacular world building. The project brings together an exceptional creative team. Acclaimed Music composer Anirudh Ravichander comes on board to create a massive musical experience adding another exciting dimension to this magnum opus.   On the poster makers used the Sanskrit shloka and hymn composed by Adi Shankaracharya in his Subrahmanya Bhujanga Stotram. "न जानामि शब्दं न जानामि चार्थंन जानामि पद्यं न जानामि गद्यम् ।चिदेका षडास्या हृदि द्योतते मेमुखान्निस्सरन्ति गिरश्चापि चित्रम् ॥"  English Translation:"I know not the science of words (poetic meters), nor do I know their meanings. I know not the nature of poetry (rhyme/verse), nor do I know the intricacies of prose. But in my heart shines the effulgent Lord with six radiant faces. And because of His grace, amazing phrases flow extempore from my mouth The film will be jointly produced by S. Radha Krishna (China Babu) under the prestigious Haarika & Hassine Creations banner and Nandamuri Kalyan Ram under NTR Arts. With one of Telugu cinema's most successful actor-director collaborations joining hands once again backed by two powerhouse production houses, the film is set to become one of the biggest cinematic spectacles ever mounted. Further details regarding the cast, technical crew and production schedule will be announced soon. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కొన్ని కాంబినేషన్లు అనౌన్స్ అయినప్పుడే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలవుతాయి. అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన ఒక మైథలాజికల్ యాక్షన్ డ్రామాతో ఈ క్రేజీ కాంబో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఇంటెన్స్ పోస్టర్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పెద్ద యుద్ధ భూమి కనిపిస్తోంది, చుట్టూ మంటలు, కూలిపోయిన కట్టడాలు, ఎగురుతున్న ఎర్రటి జెండాలు ఒక భీభత్సమైన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వీటన్నింటికీ మధ్యలో ఆకాశం నుండి భూమికి గుచ్చినట్లు ఉన్న ఒక భారీ త్రిశూలం ఆకృతి అందరినీ ఆకట్టుకుంటోంది. విశేషం ఏమిటంటే, ఆ త్రిశూలం పైభాగంలో మానవ డీఎన్‌ఏ (DNA) హెలిక్స్ నిర్మాణం పొగలతో పెనవేసుకుని ఉంది. సైన్స్ మరియు దైవత్వాన్ని మిక్స్ చేస్తూ డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్ సినిమా కథపై భారీ అంచనాలను పెంచేస్తోంది. పోస్టర్ మధ్యలో "ఒక ఆయుధం... ఒకే లక్ష్యం... ఒక దైవిక లెక్కింపు" (One Spear, One Purpose, One Divine Reckoning) అనే క్యాప్షన్ సినిమాలోని తీవ్రతను తెలియజేస్తోంది. అంతేకాకుండా, దీనిపై ఒక సంస్కృత శ్లోకం కూడా ముద్రించి ఉండడం కథలోని మైథాలజీ కోణాన్ని స్పష్టం చేస్తోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations), ఎన్టీఆర్ ఆర్ట్స్ (NTR Arts) బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నారు. దేవర వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్, అనిరుధ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండడంతో మ్యూజిక్ పరంగా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  "ఉత్తరాదిన జన్మించి, హృదయభూమిలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకున్నాడు... ఇప్పుడు విశ్వవ్యాప్తం కాబోతున్న ఒక కథ" అంటూ మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. పాన్-ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ #NTRxTrivikram ప్రాజెక్ట్ తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచవ్యాప్తం చేయనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.   https://x.com/tarak9999/status/2071557756570796349
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ట్రామా బాండింగ్.. ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది. ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది? ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని.. రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది. ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.  ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది. ట్రామా బాండింగ్ సిగ్నల్స్.. ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.    సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం. ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,  ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.  సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం. ఎలా బయట పడాలి.. ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.    మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం  మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.  ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.  తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం.. ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.                                  *రూపశ్రీ.
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు.  కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా,  బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి.. విద్య, నైపుణ్యాలు.. విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు. ఆడపిల్ల  విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు. విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని  ఇస్తుంది,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి  కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే  కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.   ఆర్థిక భద్రత.. నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు  బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం  ఉంచుకోవాలి. ఇంటి ఆడపిల్లకు  ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే  పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా  తెలపాలి.  అలాగే ఆడపిల్లల  ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది. ఆత్మవిశ్వాసం.. జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి.  ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను  ప్రోత్సహించాలి.  జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల  ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు. నడవడిక, విలువలు.. సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది.  కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది.  మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు  ప్రతిచోటా గౌరవం ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం.. పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి.  ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి  ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది.  ఆడపిల్లలకు  కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది.  సంబంధాల పట్ల  నమ్మకం కూడా నిలిచి ఉంటుంది.  తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్  ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.                               *రూపశ్రీయ
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక కీలక శారీరక ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో డాక్టర్ హరిత మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు, ఆ లోపం శరీరంపై చూపే ప్రభావం గురించి సులభంగా వివరిస్తారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: మెగ్నీషియం అంటే ఏమిటి? మెగ్నీషియం శరీరానికి ఎందుకు అవసరం? మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కండరాల తిమ్మిర్లు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు మెగ్నీషియం సంబంధం డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం ప్రాముఖ్యత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం ఎలా సహాయపడుతుంది? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎప్పుడు సప్లిమెంట్లు అవసరం అవుతాయి? మెగ్నీషియం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్యుల సూచనలతో మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)