LATEST NEWS
హైదరాబాద్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్  రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ   షోకాజ్ నోటీసు జారీ చేసింది.   పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని  పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి.   ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.   పార్టీ ప్రధాన కార్యదర్శి  సోమ భరత్ కుమార్ సంతకంతో.... బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జారీ చేసిన  ఈ నోటీసులో వారం రోజులలో పైలట్ రోహిత్ రెడ్డి తనపై  వచ్చిన డ్రగ్స్ ఆరోపణ లపై పూర్తి వివరాలతో కూడిన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.  అలాగే, ఈ విషయంలో పార్టీ  తుది నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలు,  అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉండాలని రోహిత్ రెడ్డిని ఆదేశించారు.  బీఆర్ఎస్ బాధ్యతా యుత రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు,  నైతిక విలువలను  పాటిస్తుందని, మాదకద్రవ్యాల వినియోగం వంటి అక్రమ కార్యకలాపా లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆ షోకాజ్ నోటీసు పేర్కొంది.   పైలట్ రోహిత్ రెడ్డి పై వచ్చిన ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా భావించి కఠిన వైఖరి అవలంబించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా, నోటీసులో పేర్కొన్న గడువులోపు సంతృప్తికర మైన వివరణ ఇవ్వకపోతే..  ఎటువంటి అదనపు నోటీసు లేకుండానే క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకుం టామని కూడా పైలట్ రోహిత్ రెడ్డిని హెచ్చరించింది. దీంతో ఇప్పుడు రోహిత్ రెడ్డి తనకు అందిన షోకాజ్ నోటీసుకు ఇచ్చే వివరణ, ఆ పై బీఆర్ఎస్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు తీసుకున్న కొన్ని నిర్ణయాలను సవాల్ చేస్తూ ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో తనకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఆయన   పిటిషన్ దాఖలు చేశారు.  ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద  విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.   ఇంతకు ముందే  కేజ్రీవాల్ ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను విచారణను వేరే బెంచ్ కు మార్చాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన వినతిని తోసిపుచ్చారు. రోస్టర్ నిబంధనల ప్రకారం కేసు కేటాయింపు జరిగిందనీ, విచారణ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది   న్యాయమూర్తి విచక్షణకే వదిలేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే తిరస్కరణను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తు అధికారిపై విచారణ జరపాలంటూ గతంలో ట్రయల్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిలిపివేశారు. ఈ నిర్ణయాన్ని కూడా కేజ్రీవాల్ తన పిటిషన్‌లో సవాల్ చేశారు.   
తెలంగాణ అసెంబ్లీ వేదికగా సరదా సన్నివేశం చోటుచేసుకుంది.  . బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు..  బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల పువ్వులు పూయించింది.  తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజు  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం నేతలందరూ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారు.  ఆసమయంలో సమయంలో   రాజాసింగ్,  కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు.  కొద్ది సేపు ఇరువురూ నవ్వుతూ ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ఫొటోలు తీస్తుంటే.. కేటీఆర్ రాజాసాంగ్ ను ఆటపట్టిస్తూ మనం ముచ్చటించుకుంటుంటే చూసే వారు ఇంకేదో అనుకునే చాన్స్ ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు.  రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కాగా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, బడ్జెట్ కేటాయింపులపై పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేటీఆర్, రాజాసింగ్ మధ్య జరిగిన సరదా సంభాషణ వాతావరణాన్ని తేలిక చేసిందని చెప్పవచ్చు.   అయితే  ఇదొక రాజకీయ వ్యూహంగా కొందరు పేర్కొంటున్నారు. రానున్న రోజులలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలకు ఇది సంకేతంగా చెబుతున్నారు.  ఈ సరదా సంభాషణ ద్వారా కేటీఆర్.. బీజేపీకి స్నేహహస్తం సాచారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సన్నిహితంగా మెలుగుతోందనీ, ఒక దశలో పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్న చర్చ కూడా జరిగిందనీ ఇటీవలి కాలంలో కవిత చేసిన విమర్శలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.   
వైసీపీ సీనియర్ నాయకుడు,  మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ ను అడ్డంగా బుక్ చేశారా? అంబటి తన నోటి దూలతో జగన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ ఐటెమ్ గా మార్చేశారా? అంటే నెటిజనులు ఔననే అంటున్నారు. విషయం ఏంటంటే.. అంబటి రాంబాబు తాజాగా ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొంత పార్టీ అధినేత జనగ్ మోహన్ రెడ్డి  విఫలమయ్యారని కుండబద్దలు కొట్టేశారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   ఇంటర్వ్యూలో యాంకర్ తన చొక్కాపై ఉన్న లోగోను గురించి యాంకర్ ప్రశ్నిస్తే.. ఆ లోగో నవరత్నాలు పథకాలకు సంబంధించిన లోగో అని అంబటి గొప్పగా చెప్పారు. అక్కడితో ఆగకుండా ఆ పథకాలే కాదు జగన్ నే విఫలమయ్యారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో జగన్ నెటిజనులకు ట్రోలింగ్ ఐటెమ్ గా మారిపోయారు. అసలింతకీ అంబటి రాంబాబు ఉద్దేశమేంటంటే?.. పార్టీ పరాజయం పాలైనంత మాత్రాన జగన్ తమ నాయకుడు కాకుండా పోరనీ, పథకాలు విఫలమైనంత మాత్రాన నవరత్నాలు మంచి పథకాలు కాకుండా పోవనీ చెప్పడమే. అంబటికి ఏ విషయాన్నైనా వ్యంగ్యవైభవం జోడించి చెప్పడం అలవాటు. అలాగే నోటి దురద కూడా కొంచం ఎక్కువే. ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన జగన్ వైఫల్యం అంటూ చేసిన వ్యాఖ్య కూడా ఆ నోటి దురద కారణంగానే అని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పుడు ఆ వ్యాఖ్యలే జగన్ వ్యతిరేకులకు ఆయుధంగా మారాయి. జగన్ ఫెయిల్యూర్ అని స్వయంగా అంబటి రాంబాబు ఒప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలతో విపరీతమైన  ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.  ఈ పరిస్థితి నిస్సందేహంగా జగన్ ను, వైసీపీనీ, ఆ పార్టీ క్యాడర్ ను ఇబ్బందుల్లో పడేసింది. డిఫెన్స్ లోకి నెట్టేసింది.   ఇటీవలి కాలంలో అంబటి రాంబాబు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై  బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన మరింతగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో పార్టీ శ్రేణులు 'కాపు టైగర్' అంటూ అభివర్ణించగా, ఆయన కుమార్తె కూడా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వైసీపీ మద్దతుదారుల దృష్టిని ఆకర్షించాయి. ఈ క్రమంలో అంబటి వరుస  ఇంటర్వ్యూలు ఇస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామంపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంబటి చేసిన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల వరకు కూడా ప్రత్యర్థి పార్టీలు వార్తల్లో, చర్చల్లో ఉండేలా వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  సొంత పార్టీ అధినేతనే నేతనే విఫలనేతగా అంబటి అభివర్ణించడంతో ఆయన రాజకీయ భవిష్యత్ పై కచ్చితంగా ప్రభావం పడుతుందని పరిశీలకులు అంటున్నారు.   
  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘వందేమాతరం’ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ శాసన సభలో ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ ఎంఐఎం వైఖరిపై మండి పడ్డారు. తెలంగాణ శాసనసభలో జాతీయ గీతమైన ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  ఇది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదని, దేశానికి గౌరవ సూచకమైన జాతీయ గీతం పట్ల అవమానకరమైన ప్రవర్తనగా భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో ప్రజల్లో జాతీయ స్పూర్తి ని నింపిన గీతం ‘వందేమాతరం’ అని గుర్తు చేసిన బండి సంజయ్, అలాంటి గీతాన్ని గౌరవించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. దేశానికి సంబంధించిన చిహ్నాలు, సంప్రదాయాలు, జాతీయ భావాలను గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్య మని ఆయన అన్నారు. అయితే ఎంఐఎం ఎమ్మె ల్యేలు సభ నుంచి బయట కు వెళ్లడం ద్వారా తమ అసలు వైఖరిని మరోసారి బయటపెట్టారని బండి సంజయ్ విమర్శించారు. భారతీయ చిహ్నాలు, జాతీయ భావాల పట్ల ఎంఐఎం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికై శాసనసభకు వచ్చిన ప్రతినిధులు జాతీయ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటనతో తెలం గాణ రాజకీయాల్లో మరోసారి జాతీయత, రాజకీయ నిరసనలపై చర్చ మొదలైంది. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకులు భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశముంది.  
ALSO ON TELUGUONE N E W S
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ'. ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి కీలక పాత్రలో నటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందంటే..? కథ: విక్రమ్ వాసు (నిఖిల్) ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్. కొన్ని కారణాల వల్ల అతను సస్పెన్షన్ లో ఉంటాడు. అయితే కేసారం గ్రామంలో శిరీష అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఛేదించడానికి కమిషనర్ మనోజ్ కుమార్ (సమీర్) మళ్ళీ విక్రమ్‌ను రంగంలోకి దించుతాడు. యూనిఫామ్ లేకుండానే ఒక స్పెషల్ టీమ్‌తో విక్రమ్ ఈ కేసు విచారణను చేపడతారు. ఈ క్రమంలో విక్రమ్ కి ఎదురైనా సవాళ్లు ఏంటి? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? అసలు విక్రమ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? శిరీష హత్యకు కారకులు ఎవరు? వంటి విషయాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: కేసారం గ్రామంలో జరిగిన శిరీష అనే యువతి హత్య కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సస్పెన్షన్ లో ఉన్న విక్రమ్‌కు కమిషనర్ ఈ కేసును అప్పగించడం, ఆ తర్వాత జరిగే మలుపులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ముఖ్యంగా శిరీష హత్య కేసును ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి.  కొన్ని ఎపిసోడ్లలో కథ చాలా నెమ్మదిగా సాగింది. అనవసరమైన సీన్లు ఉండటం వల్ల ఆడియెన్స్‌కు కాస్త బోర్ కొట్టే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదించినట్లు అనిపిస్తుంది. అయితే ట్విస్ట్‌లు, నిఖిల్ పర్ఫార్మెన్స్ మాత్రం సిరీస్‌ను నిలబెట్టాయి. దర్శకుడు వేదవ్యాస్ ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశాడు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో మిస్టరీని విప్పుతూ థ్రిల్లర్ ప్రియులకు నచ్చేలా సిరీస్ నడిపించాడు. ముఖ్యంగా నిఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. అషు రెడ్డి తన గ్లామర్, యాక్టింగ్‌తో సిరీస్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సిరీస్‌లో నిఖిల్ 'విక్రమ్ వాసు' అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. నిబంధనలను పక్కనపెట్టి, తనదైన శైలిలో కేసులను ఛేదించే ఒక అన్‌కన్వెన్షనల్ కాప్‌గా నిఖిల్ నటన ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్‌గా అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అషు రెడ్డి పాత్రలో సస్పెన్స్ ఉండటమే కాకుండా, ఆమె నటన కూడా సిరీస్‌కు ప్లస్ అయ్యింది. సమీర్, గాయత్రి చాగంటి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుహాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్, సస్పెన్స్ సీన్లలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పరవాలేదు. డైలాగ్స్ మరింత పవర్ ఫుల్‌గా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, సిరీస్‌ను క్వాలిటీగా నిర్మించారు. విజువల్స్, లోకేషన్స్ సహజంగా ఉన్నాయి. ప్రస్తుతం 8 ఎపిసోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటిదాకా అయితే కథాకథనాల్లో పెద్దగా మెరుపుల్లేవు. రాబోయే ఎపిసోడ్స్ లో హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎలా ఉంటుందనే ఆసక్తి మాత్రం కలుగుతోంది. ప్లస్ పాయింట్లు: - నిఖిల్ పర్ఫార్మెన్స్ - సస్పెన్స్ - నేపథ్య సంగీతం - నిర్మాణ విలువలు - అషు రెడ్డి నటన మైనస్ పాయింట్లు: - నెమ్మదిగా సాగే కథనం - డైలాగ్స్ ఫైనల్ గా... కొన్ని చోట్ల సాగతీత సీన్లు ఉన్నప్పటికీ, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చే అవకాశముంది. Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
-కేసు నమోదు చేయడానికి కారణం ఏంటి! -మంగ్లీ ఏం చేసింది  -పూర్తి వివరాలు ఇవే   పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై చాలా బలంగా తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు కన్నడ హీరో  ధ్రువ సర్జా(Druva Sarja). ఈ మేరకు జననాయగన్, టాక్సిక్ ఫేమ్ కే విఎన్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన 'కెడి: ది డెవిల్'(kd The Devil)అనే మూవీతో శరవేగంగా ముస్తాబవుతున్నాడు. నిజానికి ఈ మూవీ మూడు సంవత్సరాల క్రితమే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు అవాంతరాలు ఎదురవ్వడంతో డిలే అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఒక సాంగ్ విషయంలో వైరల్ గా నిలిచింది. రీసెంట్ గా కెడి నుంచి 'సర్కే చునర్'(sarke Chunar)అనే సాంగ్ పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ అయ్యింది. సదర్ సాంగ్ లో నోరా ఫతేహి, సంజయ్ దత్ చేయగా రకీబ్ ఆలం సాంగ్ ని రచించాడు. హిందీ వెర్షన్ ని మన తెలుగు సింగర్ మంగ్లీ ఆలపించింది. ఇప్పుడు ఈ సాంగ్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ స్పందిస్తు  హిందీ వెర్షన్ లిరిక్స్‌లో  శృంగారాన్ని వర్ణిస్తూ వాడిన పదజాలం అత్యంత అసభ్యకరంగా, ద్వందార్థాలతో ఉంది.   దృశ్య పరంగా కూడా అశ్లీలత హద్దులు దాటింది. జానపదాలు, భక్తి గీతాలకి పేరుగాంచిన మంగ్లీ ఇలాంటి 'బూతు' కంటెంట్ ఉన్న సాంగ్ ని ఎలా పాడిందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే హిందీ సాహిత్యంతో పోలిస్తే తెలుగు సాహిత్యం కొంత మర్యాదపూర్వకంగానే ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. also read: Dhurandhar 2: రిలీజ్ కి ముంచే రికార్డు కలెక్షన్స్ సాధించిన ధురంధర్ 2 ..అడ్వాన్స్ ఫిగర్ ఇదే ముంబైకి చెందిన లాయర్ వినీత్ జిందాల్ అయితే 'సర్కే చునర్' సాంగ్ లోని సాహిత్యం, దృశ్యాలు సమాజంపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని  సెన్సార్ బోర్డు (CBFC), కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకి ఫిర్యాదు చేశారు.  తన ఫిర్యాదులో దర్శకుడు ప్రేమ్, సంగీత దర్శకుడు అర్జున్ జన్య, రచయిత రకీబ్, గాయని మంగ్లీ పేర్లని ప్రస్తావించాడు. ఇక  తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో చిత్ర యూనిట్ సాంగ్ ని యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సమాచారం.       
- పాలస్తీనాకు మద్దతు తెలిపిన జేవియర్ బార్డెమ్  - ప్రియాంక చోప్రా రియాక్షన్ వైరల్! - ఆస్కార్ వేదికపై రాజకీయ ప్రకంపనలు ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేదిక ఈసారి కేవలం అవార్డులకే పరిమితం కాలేదు. హాలీవుడ్ ప్రముఖ నటుడు జేవియర్ బార్డెమ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. గ్లోబల్ వేదికపై ఆయన యుద్ధానికి వ్యతిరేకంగా గళం ఎత్తడమే కాకుండా, ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ చేసిన నినాదం పెను దుమారాన్ని రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. 98వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగంలో అవార్డును ప్రకటించడానికి జేవియర్ బార్డెమ్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా బార్డెమ్ మైక్ అందుకుని నేరుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించారు. "యుద్ధం వద్దు.. పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి" అంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. జేవియర్ బార్డెమ్ కేవలం మాటలతోనే కాకుండా తన దుస్తులపై ధరించిన బ్యాడ్జీల ద్వారా కూడా తన నిరసనను తెలియజేశారు. ఆయన సూట్‌పై యుద్ధం వద్దు అని రాసి ఉన్న రెడ్ పిన్‌తో పాటు పాలస్తీనాకు మద్దతుగా ఉన్న చిహ్నాన్ని ధరించారు. గతంలో 2003లో ఇరాక్ యుద్ధం సమయంలో కూడా ఆయన ఇదే తరహాలో నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిణామం వేదికపై ఉన్న ప్రియాంక చోప్రాను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. బార్డెమ్ అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఆమె చిరునవ్వుతో తల ఊపుతూ కనిపించారు. అయితే దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక, అటువంటి గంభీరమైన ప్రకటన సమయంలో మరింత స్పష్టంగా స్పందించాల్సి ఉండాల్సిందని కొందరు విమర్శిస్తుంటే, ఆమె పరిస్థితిని హుందాగా హ్యాండిల్ చేసిందని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. నటుడిగా జేవియర్ బార్డెమ్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్', 'స్కైఫాల్' వంటి చిత్రాల్లో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఆయన, సామాజిక అంశాలపై ఎప్పుడూ ముందుంటారు. ఈ ఏడాది ఆస్కార్ వేదికపై ఆయన ప్రసంగం తర్వాత, అవార్డు అందుకున్న 'సెంటిమెంటల్ వాల్యూ' చిత్ర దర్శకుడు జోచిమ్ ట్రియర్ కూడా యుద్ధ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకుల బాధ్యతను గుర్తు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జేవియర్ బార్డెమ్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికను ఇలాంటి రాజకీయ నిరసనలకు వేదికగా మార్చడంపై అకాడమీ ఎలా స్పందిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది
రామ్ చరణ్ కోసం సుకుమార్ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న 'RC17' అప్‌డేట్‌ టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్లలో ఒకటైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), లెక్కల మాస్టారు సుకుమార్(Sukumar) మళ్ళీ జతకడుతుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. 'రంగస్థలం' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ (RC17) గురించి ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా కోసం ఒక 'మైండ్ బ్లోయింగ్' ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుకుమార్ ఒకే కథను రెండు విభిన్న వెర్షన్లలో డెవలప్ చేశారని, అందులో బెస్ట్ వెర్షన్‌ను ఇప్పుడు ఫైనలైజ్ చేశారని సమాచారం. అంటే, కథ ఇప్పటికే లాక్ అయిపోయింది, ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. 'పెద్ది' తర్వాత చరణ్ కొంచెం గ్యాప్ తీసుకుని సుకుమార్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నారు. ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్‌ను కొత్తగా చూపించిన సుకుమార్, ఈసారి అంతకు మించిన పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేశారట. చిట్టిబాబు పాత్ర తరహాలో చరణ్ నట విశ్వరూపం చూపిస్తే.. ఆయన ఖాతాలో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చి చేరడం ఖాయమంటున్నారు.  ఈ సినిమాకు కూడా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాకు సంబంధించి ఏదైనా స్పెషల్ అప్‌డేట్ లేదా పోస్టర్ వస్తుందేమోనని మెగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఒకవైపు 'పెద్ది' ప్రమోషన్స్, మరోవైపు సుక్కూ సినిమా అప్‌డేట్స్‌తో చరణ్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది డబుల్ ధమాకా ఖాయమనిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్, తన 17వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. సుకుమార్ మార్క్ టేకింగ్, చరణ్ పెర్ఫార్మెన్స్ తోడైతే మరో హిస్టరీ క్రియేట్ అవ్వడం ఖాయం.
- చిరు-హరీష్ మూవీపై క్లారిటీ. - తమ్ముడి సినిమా చూసి మురిసిపోయిన అన్నయ్య  - హరీష్ శంకర్ నెక్స్‌ట్ టార్గెట్ అదేనా? టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సక్సెస్ జోష్‌లో ఉన్నారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, సినిమా ప్రమోషన్లలో భాగంగా హరీష్ శంకర్ పవన్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాభిమానులను ఉర్రూతలూగించే ఒక భారీ ప్రాజెక్ట్ గురించి ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ చూసిన చిరంజీవి.. సుమారు 20 నిమిషాల పాటు తనతో మాట్లాడారని హరీష్ తెలిపారు. పవన్ మేకోవర్, డైలాగ్స్ పట్ల చిరు ఎంతో సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పవన్‌ను చూస్తుంటే చిరంజీవికి ఒక తమ్ముడిలా కాకుండా సొంత కొడుకులా అనిపిస్తుందని, ప్రతి షాట్ గురించి ఆయన మురిసిపోతుంటే వారి మధ్య ఉన్న అనుబంధం తనకు అర్థమైందని హరీష్ చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవితో సినిమా ఎప్పుడనే ప్రశ్నకు హరీష్ శంకర్ పక్కా క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, అది ఇప్పటికే ప్రాసెస్‌లో ఉందని స్పష్టం చేశారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా 'రౌడీ అల్లుడు', 'గ్యాంగ్ లీడర్', 'దొంగ మొగుడు' వంటి మాస్ ఎంటర్‌టైనర్‌ను వెండితెరపై ఆవిష్కరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఆయనతో కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసిన అనుభవం తనకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్‌ను కేవలం ఒక నటుడిగానే కాకుండా సమాజంపై అవగాహన ఉన్న గొప్ప వ్యక్తిగా హరీష్ అభివర్ణించారు. 16 ఏళ్ల వయసు నుంచే ఆయనకు సామాజిక స్పృహ ఉందని, అది ఆయన సినిమాల్లోని పాటల ద్వారా అప్పట్లోనే వ్యక్తమయ్యేదని గుర్తు చేశారు. పవన్ సెట్‌లో ఒక చిన్న డైలాగ్ కోసం కూడా ఎంతో శ్రమిస్తారని, ఆయన డెడికేషన్ చూసి ఆశ్చర్యమేస్తుందని కొనియాడారు. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మళ్ళీ ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అదే మేజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవితో సినిమా వార్తలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, హరీష్ పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. త్వరలోనే మెగాస్టార్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు 'ఉస్తాద్' హంగామా థియేటర్లలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి!
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఉగాది కానుకగా మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ రాశి ఖన్నా(Raashii Khanna) పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.  ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు? పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా కెరీర్ లో కథ వినకుండా ఓకే చేసిన సినిమా ఇదే. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో నా కల నెరవేరింది. ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. పవన్ కళ్యాణ్ గారితో పని చేసిన అనుభవం ఎలా ఉంది? పవన్ గారు చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని ఆయనతో చెప్పాను. ఆయన తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ గారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ గారి అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కి తగ్గట్టుగా మీరు డేట్స్ ఇవ్వాలి కదా.. ఏమైనా ఇబ్బంది పడ్డారా? పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ గారు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను. దర్శకుడు హరీష్ శంకర్ గారి గురించి? హరీష్ శంకర్ గారు చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. సాధారణంగా 120 రోజులు పట్టే షూటింగ్‌ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హరీష్ గారికి ఓపిక ఎక్కువ. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఎలా ఉండబోతుంది? 'గబ్బర్ సింగ్' లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు.
-రేపు ప్రీమియర్స్ నుంచే సిల్వర్ స్క్రీన్ పైకి  -అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఎంత వచ్చాయి -సరికొత్త రికార్డు అంటారా  ఇండియా వైడ్ గా మీ ఇష్టమొచ్చిన ఏరియాకి వెళ్లి మూవీ లవర్స్ ని కదిలించండి. మీరు అడక్కుండానే వాళ్ళు మీతో  'ఏది ఏమైనా 'ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2)'సాధించింది మాములు రికార్డు కాదు. రిలీజ్ కి ముందే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో. పై  పెచ్చు పార్ట్ 1 కి వచ్చినట్టు హిట్ టాక్ వస్తే ఇండియన్ సినీ ఖజానాలో మూలగబోయే సంపద ఉహించుకోబోతుంటేనే సినీ పులకరింత కలిగిస్తుందని అంటారు. ఆ తర్వాత నిజం తెలిసాక మనం కూడా అవే డైలాగ్స్ తో ధురంధర్ 2 రికార్డుల ప్రచార కర్తగా బాధ్యతలు తీసుకుంటాం. మరి ఆ మ్యాటర్  ఏంటో చూద్దాం.   ధురంధర్ 2 వరల్డ్ వైడ్ గా రేపు సాయంత్రం ఐదు గంటల ప్రీమియర్స్ నుంచే సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుకింగ్స్ కూడా సుమారు వారం రోజుల క్రితమే స్టార్ట్ అయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కి సంబంధించి 135 కోట్ల మార్కుని దాటేసింది.  ఇది మాములు రికార్డు కాదు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో 135  కోట్ల మార్కుని అందుకున్న ఫస్ట్  మూవీ ధురంధర్ 2 అని చెప్పవచ్చు.  also read: Rajinikanth: భయపడ్డానా!.. టివికె పార్టీకి కౌంటర్ ఇస్తు లెటర్ రిలీజ్ చేసిన రజినీ  ఇక పార్ట్ 2 ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి మూవీపై అంచనాలు అంబరాన్ని అంటాయి. రెహ్మాన్ డెకాయిట్ చనిపోయి ఉండటంతో పార్ట్ 2  కథ, కథనం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా అందరిలో ఉంది. రణవీర్ సింగ్(Ranveersingh)సారా అర్జున్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతుంటే డైరెక్టర్ ఆదిత్య ధర్(Aditya Dhar)కదా అని కొంచం ఎగతాళిగా మాట్లాడతారు.అంతలా ధురంధర్ తో ట్రావెల్ అవుతున్నారు.   సోషల్ మీడియాలో ప్రస్తుతం 'ధురంధర్ 2’హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 'ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. అనౌన్స్‌మెంట్ రోజు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ కోసం బుచ్చిబాబు సరికొత్త ప్లాన్ చేస్తున్నారట. సాధారణంగా సినిమాల్లో వచ్చే ఐటమ్ సాంగ్ లేదా స్పెషల్ సాంగ్‌లో ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తుంటారు. కానీ 'పెద్ది' కోసం బుచ్చిబాబు రూట్ మార్చారు. ఈ ప్రత్యేక గీతంలో ఏకంగా నలుగురు లేదా ఐదుగురు క్రేజీ హీరోయిన్లను దించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఐడియా కనుక కార్యరూపం దాల్చితే, రామ్ చరణ్ లాంటి అద్భుతమైన డాన్సర్ పక్కన ఇంతమంది తారలు కలిసి చేసే సందడి థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ కోసం ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. షూటింగ్‌కు సంబంధించిన ప్రధాన భాగాన్ని పూర్తి చేసిన తర్వాత, ఈ స్పెషల్ సాంగ్‌ను గ్రాండ్‌గా చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఎమోషన్స్ కూడా పీక్స్‌లో ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే ఆయన స్వరపరిచిన బాణీలు చాలా అద్భుతంగా వచ్చాయని ఇండస్ట్రీ టాక్. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గతంలో బుచ్చిబాబు తన మొదటి సినిమాతోనే మ్యూజికల్ హిట్ అందుకున్న నేపథ్యంలో, ఈసారి చరణ్ కోసం రెహమాన్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ స్పెషల్ సాంగ్ వార్త వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "నలుగురు హీరోయిన్లంటే స్క్రీన్ మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంటుంది" అని కొందరు అంటుంటే, చరణ్ డాన్స్ స్టెప్పులకు థియేటర్లు షేక్ అవ్వడం గ్యారెంటీ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ మీద ప్రేక్షకులకు ఉన్న నమ్మకం ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుపుకుంటున్న 'పెద్ది' చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది. ఈ గ్లోబల్ స్టార్ మూవీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్‌లో నటించే ఆ నలుగురు లేదా ఐదుగురు భామలు ఎవరో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.
కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం ఆస్కార్ వేదికపై మారుమోగిన కోట పేరు ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై మన టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) పేరు మారుమోగింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 98వ అకాడమీ అవార్డుల వేడుకలో గతేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే 'ఇన్ మెమోరియం' విభాగంలో కోటకి చోటు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన లెజెండరీ నటుడికి దక్కిన ఈ అంతర్జాతీయ గౌరవం పట్ల యావత్ టాలీవుడ్ గర్వపడుతోంది. (Oscars 2026) 98వ ఆస్కార్ వేడుకల సందర్భంగా అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన 'ఇన్ మెమోరియం' జాబితాలో కోట శ్రీనివాసరావు ఫోటోను పొందుపరిచింది. కేవలం కోటనే కాకుండా, భారతీయ సినిమాకు ఎనలేని సేవలు అందించిన దిగ్గజ నటులు ధర్మేంద్ర, మనోజ్ కుమార్,  అభినయ సరస్వతి బి.సరోజాదేవి పేర్లను కూడా అకాడమీ ఈ జాబితాలో చేర్చింది.  అయితే ఆస్కార్స్ వేడుక ప్రారంభంలో గతేడాది కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పిస్తూ ప్రదర్శించిన స్పెషల్ వీడియోలో భారతీయ నటీనటులను చూపించలేదు. సమయాభావం వల్ల ఆస్కార్ వేడుకలో టెలికాస్ట్ చేసిన వీడియోలో కొన్ని పేర్లే ఉన్నప్పటికీ, అధికారిక జాబితాలో మాత్రం మన దేశానికి చెందిన దిగ్గజాలకు చోటు దక్కడం విశేషం.  కోట శ్రీనివాసరావు జూలై 13, 2025న తన 83వ ఏట తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బ్యాంక్ ఉద్యోగి అయిన కోట.. రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొంది, ఆ తర్వాత వెండితెరపై తనదైన ముద్ర వేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750కి పైగా చిత్రాల్లో నటించి.. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నవరసాలు అద్భుతంగా పండించి 'నవరస చక్రవర్తి'గా పేరు తెచ్చుకున్నారు. ఆస్కార్ 'ఇన్ మెమోరియం' విభాగంలో కోటకు చోటు లభించడంపై టాలీవుడ్ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కోట అభిమానులు ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. "వెర్సటైల్ యాక్టర్ రేంజ్ ఇది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్లతో పాటు భారతీయ సినీ దిగ్గజాలను కూడా అకాడమీ గుర్తించడంపై సినీ విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  Also Read: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్!
- విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలతో మీకేం పని? - త్రిషపై అసత్య ప్రచారాలు తగవు - ముంబై కల్చర్ ఇక్కడికి కూడా వచ్చేసింది దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్, దళపతి విజయ్‌ల మధ్య ఏదో నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ప్రచారాలపై తాజాగా సీనియర్ నటి ఖుష్బూ సుందర్ స్పందించారు. ట్రోలర్లు మరియు నెటిజన్లు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ.. త్రిష వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. త్రిష తనకు అత్యంత సన్నిహితురాలని, ఆమె ఎంతో మృదుస్వభావి అని ప్రశంసించారు. ఎవరో తెలియని వారు చేసే అసత్య ప్రచారాల వల్ల త్రిష విలువ తగ్గదని, ఆమె ఎప్పుడూ హుందాగానే ఉంటుందని ఖుష్బూ స్పష్టం చేశారు. ప్రస్తుతం చిన్న విషయానికి కూడా ఇతరులను నిందించే పరిస్థితులు ఉండటం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముంబై వంటి నగరాల్లో ఉండే పాపరాజీ కల్చర్ (సెలేబ్రిటీల వెంటే ఉండే ఫోటోగ్రాఫర్లు) ఇప్పుడు చెన్నైకి కూడా పాకడంపై ఖుష్బూ మండిపడ్డారు. ఎదుటివారి ప్రైవసీని గౌరవించకుండా, వారి వ్యక్తిగత జీవితాల గురించి తప్పుగా మాట్లాడుతూ కొంతమంది 'పైశాచిక ఆనందం' పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి పనికిరాని కామెంట్స్ చేసేవారికి స్పందించి సమయాన్ని వృథా చేసుకోవద్దని త్రిషకు సూచించారు. విజయ్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఈ రూమర్లు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపుతాయా అన్న ప్రశ్నకు కూడా ఖుష్బూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రజలకు ఎవరికి ఓటు వేయాలో బాగా తెలుసని, వ్యక్తిగత విషయాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. విజయ్, త్రిష ఇద్దరూ తనకు వ్యక్తిగతంగా బాగా తెలుసని, వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయటి వ్యక్తులకు అనవసరమని తేల్చి చెప్పారు. గతంలో కూడా విజయ్, త్రిషల కాంబినేషన్‌లో వచ్చిన గిల్లి, తిరుపాచి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత 'లియో' చిత్రంతో ఈ జోడీ మళ్లీ వెండితెరపై మెరవడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే అప్పటి నుండే వీరిద్దరిపై పుకార్లు మొదలయ్యాయి. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా 'దళపతి 69' పనుల్లో ఉండగా, త్రిష చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు.  గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాత్రల సెలక్షన్..  ఉపయోగించే వంట పాత్రల రకం కూడా  గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ  అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి.  ఈ  పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా  ఉంటే, వేడి వ్యాపిస్తుంద,  వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీడియం ప్లేమ్.. అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని,  గ్యాస్ వినియోగం తగ్గుతుందని  అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది,  ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు,  బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా,  సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్.. వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మూత పెట్టి వండటం.. వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి  ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. బర్నర్.. బర్నర్ శుభ్రతపై  శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది  మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.                                                   *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.