LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘వందేమాతరం’ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ శాసన సభలో ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ ఎంఐఎం వైఖరిపై మండి పడ్డారు. తెలంగాణ శాసనసభలో జాతీయ గీతమైన ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.  ఇది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదని, దేశానికి గౌరవ సూచకమైన జాతీయ గీతం పట్ల అవమానకరమైన ప్రవర్తనగా భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో ప్రజల్లో జాతీయ స్పూర్తి ని నింపిన గీతం ‘వందేమాతరం’ అని గుర్తు చేసిన బండి సంజయ్, అలాంటి గీతాన్ని గౌరవించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. దేశానికి సంబంధించిన చిహ్నాలు, సంప్రదాయాలు, జాతీయ భావాలను గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్య మని ఆయన అన్నారు. అయితే ఎంఐఎం ఎమ్మె ల్యేలు సభ నుంచి బయట కు వెళ్లడం ద్వారా తమ అసలు వైఖరిని మరోసారి బయటపెట్టారని బండి సంజయ్ విమర్శించారు. భారతీయ చిహ్నాలు, జాతీయ భావాల పట్ల ఎంఐఎం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికై శాసనసభకు వచ్చిన ప్రతినిధులు జాతీయ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటనతో తెలం గాణ రాజకీయాల్లో మరోసారి జాతీయత, రాజకీయ నిరసనలపై చర్చ మొదలైంది. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకులు భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశముంది.  
మెగా బ్రదర్, జనసేనాని పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన కీలక నేత రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? లేక అయోమయంలో ఉన్నారా అన్న అనుమానాలు కలగకమానవు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో ఇప్పటి వరకూ విజయం సాధించింది లేదు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారనుకోండి అది వేరే సంగతి. ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులపై మాత్రం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  2019 ఎన్నికలలో ఆయన తొలి సారిగా నరసాపురం స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అక్కడ ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికలలో జనసేన కూడా ఏమంత ప్రభావం చూపకపోవడంతో నాగబాబు పరాజయం పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది.  ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు. జనసేన అధినేత సోదరుడు, ఆ పార్టీలో కీలక నేత అయి ఉండి కూడా ఆయనకు పోటీకి అవకాశం దక్కకపోవడం అప్పట్లో రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. అది పక్కన పెడితే.. 2025 ఏప్రిల్ లో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని ప్రకటించారు. అయినా ఎమ్మెల్సీ అయ్య దాదాపు ఏడాది కావస్తున్నా నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు.  ఇక ఇప్పుడు ఆయనను రాజ్యసభకు పంపే యోచనలో జనసేనాని ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాలిస్తే జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి నేతగా నాగబాబు నిలుస్తారు. ఇక ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ అన్న ప్రచారం కూడా వినిపిస్తోంది.  అదలా ఉండగా నాగబాబు ప్రస్తుతం తన దృష్టినంతా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంపై కేంద్రీకృతం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎచ్చెర్ల వేదికగా నాగబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో ఎచ్చెర్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం జనసేన వర్గాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తత టర్మ్ లో ఆయన ఏపీ కేబినెట్ లో చేరుతారా? లేక రాజ్యసభకు వెళ్లి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకుంటారా? అన్న చర్చల నడుమ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎచ్చర్ల నుంచి పోటీ అంటూ జరుగుతున్న ప్రచారం నాగబాబు రాజకీయ అడుగులు ఎటు పడుతున్నాయన్న ప్రశ్నకు తావిస్తోంది. ఎచ్చర్లలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో ఆయన ఎచ్చర్ల వైపు మొగ్గు చూపుతున్నారని భావించినా.. ప్రస్తతం ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ ఆ సీటును నాగబాబు కోసం త్యాగం చేస్తుందా? అంటే అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఒకే సమయంలో  మూడు రకాల ప్రయత్నాలు చేయడం ఆయనలోని కన్ఫ్యూజన్ ను బయటపెట్టడమే కాకుండా జనసేన వర్గాలను కూడా అయోమయానికి గురి చేస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద నాగబాబు ది రాజకీయ వ్యూహమా లేక అయోమయమా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని జనసేన వర్గీయులే అంటున్నారు. 
  తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పొత్తులో భాగంగా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమిళనాడ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపధ్యంలో ఈ ప్రచారానికి ప్రాధాన్యత సంతరించుకుంది.  టీవీకేతో పొత్తుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి. విజయ్ పార్టీకి 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అయితే విజయ్ సీఎం పదవిపై దృష్టి పెట్టారని, చర్చల్లో ఆ విషయం కీలకంగా మారిందని చెప్తున్నారు. బీజేపీ, డీఎంకేలతో తమకు పొత్తులు ఉండవన విజయ్ గతంలోనే తేల్చి చెప్పారు. అయినా పొత్తులపై ప్రచారం జరుగుతూనే ఉండటం విశేషం.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. సీఈసీపై అభిశంసన విషయంలో జగన్ తీసుకునే స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత ఏన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ఈవీఎంల ట్యాంపరింగే కారణం అంటూ సమయం వచ్చినా, రాకున్నా వైసీపీయులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.  2024 ఎన్నికల్లో  కూటమి విజయం వెనుక ఈసీ హస్తం ఉందని పదేపదే ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు  సీఈసీపై ప్రతిపక్షాల అభిశంసన తీర్మానానికి మద్దతుగా నిలబడుతుందా? అలా నిలబడే ధైర్యం చేస్తుందా? జగన్ కు ఆ దమ్ముందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  2024  ఎన్నికల ఫలితాల తర్వాత  వైసీపీ ఈసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ఓట్ల లెక్కింపులో తేడాలు ఉన్నాయనీ, అరకోటికి పైన ఓట్లపై స్పష్టత లేదనీ పలు విమర్శలు చేసింది.  రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీలు దీనిపై ప్రశ్నలు కూడా సంధించారు. ఇప్పుడు  అదే ఈసీపై పక్షపాత వైఖరి, ఎన్నికల మోసం అనే ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభిశంసన తీర్మానం నోటీసు ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్మానానికి  వైసీపీ   మద్దతు ఇస్తుందా లేదా అన్న చర్చ జోరందుకుంది.   ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే..   ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ  వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం  కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి. తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసిన పార్టీగా ప్రజల ముందు తలదించుకుని నిలబడాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా పార్లమెంటులో వైసీపీ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ఒరిగేదేం లేదు. కానీ   తమ ఓటమికి ఈసీనే కారణమని  వైసీపీకి నిజంగా నమ్ముతుంటే.. తీర్మానాన్ని బలపరచాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తే.. ఆ పార్టీ విశ్వసనీయత పాతాళంలోకి దిగజారిపోవడం ఖాయం.    సీఈసీపై అవిశ్వాస తీర్మానంపై ఇప్పటి వరకూ దాదాపు 195 మంది ఎంపీలు సంతకాలు చేశారు.  అలా సంతకాలు చేసిన వారిలో ఒక్కరంటే ఒక్కరైనా వైసీపీ ఎంపీ లేరు. దీంతో వైసీపీది ద్వంద్వ నీతి, నైతికతనీ నైతికత లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ విషయమేంటంటే.. కేసుల భయంతో జగన్ వైసీపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ కారణంగానే సీఈసీపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఆ పార్టీ ఎంపీలు నిలబడే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రజా విశ్వాసాన్ని చూరగొనడం కంటే.. జగన్ కు కేసుల నుంచి రక్షణ పొందడమే ముఖ్యమనీ, అందుకే  వైసీపీ ఎంపీలు సీఈసీపై అవిశ్వాన తీర్మానంపై సంతకాలు చేయడానికి ముందుకు రావడం లేదనీ అంటున్నారు. రాజకీయవర్గాలలో వైసీపీ నైతిక పతనానికి దీనిని సంకేతంగా చూపుతూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చూడాలి మరి సీఈసీపై అవిశ్వాత తీర్మానం విషయంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదే ఫామ్ హౌస్.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం తో మరోసారి తెరమీదకు వచ్చింది.   బీఆర్ఎస్   హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.  అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో  పెను సంచలనం సృష్టించింది.  ఇప్పుడు అదే ఫామ్ హౌస్ లో అప్పటి ఫిర్యాదుదారుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.  అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు సోదాలు నిర్వహిస్తే.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ గురించిన విశ్వసనీయ సమాచారంతో  ఈగల్ టీమ్ మెరుపు దాడి నిర్వహించి రోహిత్ రెడ్డితో సహా 11 మందిని అరెస్టు చేసింది. ఇప్పుడు స్వయంగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలారు.   గతంలో రోహిత్ రెడ్డి పోలీసులకు సహకరించిన అదే ఫామ్ హౌస్ లో, ఈసారి రోహిత్ రెడ్డి సమక్షంలోనే  పోలీసులపై కాల్పులు జరిగాయి.  ఒకే ఫామ్ హౌస్ గతంలో రాజకీయ కుట్రలకు వేదికగా, ఇప్పుడు డ్రగ్స్ పార్టీలను చిరుమానాగా ఉండటం గమనార్హం.  గతంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వస్తే, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల సమక్షంలో డ్రగ్స్ పార్టీకి వేదికగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.   గతంలో జరిగిన ఘటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటే.. ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీలో ప్రముఖుల ప్రమేయం ప్రాధాన్యతాంవంగా ఉంది.  
ALSO ON TELUGUONE N E W S
ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. 2026 ఆస్కార్ బరిలో ఎన్నో అంచనాల మధ్య నిలిచిన 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' (One Battle After Another) చిత్రం ఆరు ప్రధాన విభాగాల్లో అవార్డులను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకలో ఈ చిత్రం తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రముఖ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ రూపొందించిన ఈ చిత్రం 'ఉత్తమ చిత్రం' (Best Picture) కేటగిరీలో విజేతగా నిలిచింది. 13 విభాగాల్లో నామినేషన్లు పొందిన ఈ సినిమా, భారీ పోటీని తట్టుకుని ఈ ఘనత సాధించడం విశేషం. దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్‌లో మొదటిసారిగా ఈ చిత్రంతో 'ఉత్తమ దర్శకుడి'గా ఆస్కార్‌ను అందుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటన పరంగా కూడా ఈ చిత్రం అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. కల్నల్ స్టీవెన్ లాక్‌జా పాత్రలో ఒదిగిపోయిన సీన్ పెన్ 'ఉత్తమ సహాయ నటుడు'గా అవార్డును గెలుచుకున్నారు. ఆయనకు ఇది మూడవ ఆస్కార్ కావడం గమనార్హం. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన వేడుకకు హాజరు కాలేకపోవడంతో, ఆయన తరపున నటుడు కియారన్ కల్కిన్ ఈ అవార్డును అందుకున్నారు. సాంకేతిక విభాగాల్లో కూడా ఈ చిత్రం తన ముద్ర వేసింది. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను దక్కించుకుంది. అంతేకాకుండా, ఆస్కార్ చరిత్రలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన 'బెస్ట్ కాస్టింగ్' విభాగంలో మొదటి అవార్డును సొంతం చేసుకుని 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' చరిత్ర సృష్టించింది. లియొనార్డ్ డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను ఒకేలా మెప్పించింది. అవార్డును అందుకున్న సందర్భంగా దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ ఎమోషనల్ అయ్యారు. "మనం మన పిల్లలకు అందిస్తున్న ప్రపంచం గందరగోళంగా ఉంది, దానికి క్షమాపణగా ఈ సినిమాను రూపొందించాను" అంటూ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. యువత సమాజంలో మార్పు తీసుకువస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తానికి 2026 ఆస్కార్స్ వేడుకల్లో 'వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్' కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక ప్రభంజనంలా నిలిచింది. వార్నర్ బ్రదర్స్ స్టూడియో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను సాధించి, ఇప్పుడు అవార్డుల పంట పండించడంతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగిపోయింది. 
  -18 నుంచే ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సందడి  -ఎవరు విన్నర్  -ఫ్యాన్స్ , మూవీ లవర్స్ కి మాత్రం మజా  సెల్యులాయిడ్ కి సరికొత్త ఊపు, ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh),ధురంధర్ 2(Dhurandhar 2)పోటాపోటీగా కాచుకొని కూర్చున్నాయి. దీంతో ప్రీమియర్స్ నుంచే ఆ రెండు సినిమాలు  చూడాలనే ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అభిమానులు, మూవీ లవర్స్ అయితే క్షణమొక యుగంలాగా భావిస్తు సోమ, మంగళవారాలు ఫాస్ట్ గా గడిచిపోతే ఎంత బాగుండని అనుకుంటున్నారు. అదే టైంలో ఒక ఆసక్తికర చర్చ ఆ అందరి మధ్య జరుగుతుంది. మరి ఆ చర్చ ఏంటో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మొన్న రిలీజయ్యింది. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ ఎంత ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ గా ఉండబోతుందో అర్దమవ్వడంతో పాటు విలన్స్ తో చేసే పోరాటం, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. పైగా పవన్(Pawan kalyan)పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ధురంధర్  పార్ట్ 2 కూడా అంతే. ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ మూవీ. పార్ట్ 1 తోనే ఆ విషయం తెలిసినా, పార్ట్ 2 ట్రైలర్ తర్వాత  పార్ట్ 1 ని మించిన యాక్షన్ సీక్వెన్స్ పక్కా అనే నమ్మకం వచ్చింది. రణవీర్ కూడా పోలీస్ కాప్. పైగా రెండు చిత్రాల కథనం పవన్, రణవీర్ ల వన్ మాన్ షోతో సాగనున్నాయి. మరి ఈ లెక్కన  యాక్షన్ సీక్వెన్స్ లో పవన్, రణవీర్ సింగ్ ఏ విధంగా చేస్తారో తెలుసు. దీంతో తెలుగు నాట ఎవరి పెర్ ఫార్మెన్స్ బద్దలు కాబోతుందో అని అభిమానులు, మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు. also read: Ustaad Bhagat Singh: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్.. బిజీ అవ్వడం ఖాయమా! ధురంధర్ 2 కి వారం రోజుల క్రితమే ప్రీమియర్స్ కి సంబంధించి తెలుగు నాట బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి హిందీ, తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి స్టార్ట్ అవ్వగా ఇప్పటికే టికెట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఉస్తాద్  బుకింగ్స్ కోసం అందరు వెయిటింగ్.      
తిరుమల పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, ఇటీవల తిరుమల కొండపై చోటు చేసుకున్న కేక్ కటింగ్ వివాదం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఈ వివాదంలోకి అనవసరంగా తన పేరును లాగడంపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. అసలు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తనపై నిందలు వేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి, తన స్నేహితురాలు తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో కేక్ కట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. శ్రీవారి సన్నిధిలో ఇలాంటి చర్యలు పవిత్రతను దెబ్బతీస్తాయని భక్తులు మండిపడటంతో, టీటీడీ.. విజిలెన్స్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు కావడంతో మాధురి ఆత్మరక్షణలో పడ్డారు. ఈ వివాదంపై వివరణ ఇస్తూ దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో జాన్వీకపూర్ కూడా తిరుమలలో కేక్ కట్ చేశారు, అప్పుడు లేని అభ్యంతరం నేను చేస్తేనే ఎందుకు? నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీడియాకి ఏదో ఒక హాట్ టాపిక్ కావాలి. టిఆర్‌పి రేటింగ్ పెంచుకోవడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారు. అలాగే చెయ్యనివ్వండి. నేను అలా ఉపయోగపడడం నాకూ గర్వంగానే ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాన్వీకపూర్ దృష్టికి వెళ్లాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే జాన్వీ, ఈ అబద్ధపు ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘అసలు ఈ మహిళ ఎవరు?’ అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను తిరుమలలో ఎప్పుడూ కేక్ కట్ చేయలేదని, తనపై వస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. ప్రచారం కోసం ఇతరులపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. జాన్వీకపూర్ శ్రీవారికి పరమ భక్తురాలు. ఆమె తరచుగా తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, అలాంటి పవిత్ర స్థలంలో తాను ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం తనను తాను సమర్థించుకోవడానికి సెలబ్రిటీల పేర్లు వాడటం సరికాదని సూచించారు. ఈ విషయంలో నెటిజన్లు కూడా జాన్వీకపూర్‌కే మద్దతుగా నిలుస్తున్నారు. శ్రీవారి భక్తురాలైన జాన్వీపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మాధురి మూర్ఖత్వమని విమర్శిస్తున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే కానీ పక్కదారి పట్టించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమల కొండపై పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్ వంటివి నిషేధం. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా నిబంధనలు పాటించాల్సిందేనని భక్తులు కోరుతున్నారు. జాన్వీ ఇచ్చిన కౌంటర్‌తో దివ్వెల మాధురి మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
    -నిన్న జరిగిన ఉస్తాద్ ప్రీ  రిలీజ్ ఈవెంట్  -అందరిలో మూవీపై భారీ అంచనాలు -తాను మళ్ళీ బిజీ అవుతుందా!   ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath SIngh)పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawak Kalyan)అభిమానుల ఫోకస్ మొత్తం ఇప్పుడు బుక్ మై షో తో పాటు ఆన్ లైన్ టికెట్స్ యాప్స్ పై ఉంది. ఉగాది సందర్భంగా ఈ నెల 19 న థియేటర్స్ లోకి అడుగుపెడుతున్నా కూడా, ముందు రోజు బెనిఫిట్ షో ఉండటంతో ఏ నిమిషాన ఆన్ లైన్ లో లోడ్ చేస్తారో, ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఎక్కడ టికెట్స్ అయిపోతాయో అనే చిన్నపాటి దిగులు కూడా వాళ్ళల్లో ఉంది. దీంతో ఎన్ని పనులు ఉన్నా ఫోన్ ని మాత్రం వదలడం లేదు. మరో వైపు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అందరి స్పీచ్ లని మరోసారి మననం చేసుకుంటు 'ఉస్తాద్' అందరికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ లిస్ట్ లో రాశి ఖన్నా కూడా ఉంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ఆమె మాటలు చూద్దాం. రాశి ఖన్నా(Raashii Khanna)మాట్లాడుతు కెరీర్ ప్రారంభం నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించాలని కోరిక ఉండేది. ఉస్తాద్ భగత్ సింగ్ తో నా కల నెరవేరింది. . పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ నిజ జీవితంలో సింపుల్ గా ఉంటారు. ఒక వ్యక్తిగా నాలో ఎంతో స్ఫూర్తిని నింపారు. చాలా తక్కువ మాట్లాడతారు కానీ ప్రతి మాటలో విలువ ఉంటుంది. అంతటి   గొప్ప స్టార్ తో స్క్రీన్ ని పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను.  నాకు ఈ అవకాశం ఇచ్చిన హరీష్ శంకర్(Harish Shankar)గారికి ధన్యవాదాలు. ఉస్తాద్ కోసం ఎంత కష్టపడ్డారో నేను కళ్లారా చూశాను. గబ్బర్ సింగ్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందనే నమ్మకం నాలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పని చేయడం సంతోషంగా ఉంది. ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలి. శ్రీలీల స్వీట్ హార్ట్. తనతో వర్క్ చేయడం చాలా బాగుందని  రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. Also read: Ustaad Bhagat Singh: ఈ సారి నిలబడతాడా! ఆ స్పీచ్ ఏంటి స్వామి  ఢిల్లీకి చెందిన రాశి ఖన్నా 2014 లో ఊహలు గుసగుసలాడేతో తెలుగు సిల్వర్ స్క్రీన్ పై టేక్ ఆఫ్ అయ్యింది. సుప్రీమ్, ప్రతి రోజు పండగే తర్వాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ సినిమాలతో పాటు గత ఏడాది చేసిన 'తెలుసు కదా' వరకు పరాజయాలని ఎదుర్కొంది. సినిమాల లిస్ట్ కూడా అంత పెద్దగా లేదు. ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ హిట్ తో తెలుగుతో పాటు ఇతర బాషల్లోను వరుస అవకాశాలని దక్కించుకుంది. మరి ప్రస్తుతం డల్ గా ఉన్న రాశి ఖన్నా కెరీర్ కి  పవన్ తన ఉస్తాద్ భగత్ సింగ్ తో మళ్ళీ జోరుని అందిస్తాడేమో చూడాలి.        
-ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ హైలెట్స్ ఇవే  -ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న హరీష్ శంకర్ మాటలు  -హిట్ అందుకుంటాడా!    మాస్, క్లాస్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడుగా హరీష్ శంకర్(Harish Shankar)కి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. టేకింగ్, డైలాగ్స్ పరంగా కూడా తనకంటు సపరేట్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హరీష్ శంకర్ ప్రీవియస్ మూవీ మిస్టర్ బచ్చన్ పరాజయంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19 న విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా గబ్బర్ సింగ్ కాంబో కావడంతో అభిమానుల్లో అయితే అంచనాల రేంజ్ ఊహలకి కూడా అందని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి అవేంటో చూద్దాం. హరీష్ శంకర్ మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్(UStaad Bhagat singh)ఆలస్యానికి, ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవడానికి నేనే కారణం. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు స్టోరీ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో చేసాం. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు ఆ  డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రాణం పెట్టి పనిచేశారు  ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ . ఉస్తాద్ కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. కాలరే ఎత్తరా సాంగ్ సెట్ మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు. కథ మారినా, నా గురించి బయట కథలు కథలుగా చెప్పుకున్నా రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి  కృతఙ్ఞతలు. మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవిశ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఉగాదికి తీసుకొస్తున్నాం. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు గొప్ప క్యారెక్టర్స్ పోషించారు. also read: Ustaad Bhagat Singh: పవన్ గురించి శ్రీలీల చేసిన వ్యాఖ్యలు సబబేనా!.. ఐరెన్ లెగ్ ముద్ర పోతుందా! శ్రీలీల(Sreeleela)గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. ఇక ఉస్తాద్ తో తన పెర్ఫార్మ్ గురించి మాట్లాడుకుంటారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. మార్చి 19న థియేటర్లలో ఉస్తాద్ ఉగాది జరుపుకుందామని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. అభిమానులైతే హరీష్ శంకర్, పవన్ మరో సారి గబ్బర్ సింగ్ ని మించి విజయాన్ని అందుకోవాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.    
  -నిన్న గ్రాండ్ గా జరిగిన ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్  -శ్రీలీల స్పీచ్ వైరల్  -అభిమానుల రియాక్షన్ ఏంటి! వేసవి కాలం ఇంకా స్టార్ అయ్యిందో లేదో అనే డౌట్ చాలా మందిలో ఉంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్(UStaad Bhagat Singh)మానియా స్టార్ట్ అయ్యిందనే విషయంలో మాత్రం ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. పైగా ఓజి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో పాటు 18 నైట్ బెనిఫిట్ షో చూసే 19 న ఉగాది జరుపుకోవాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ విషయంలో మూవీ లవర్స్ కూడా పోటీ వస్తారనే విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్ కూడా లేదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు సాక్ష్యం. సదరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో పాటు వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన శ్రీలీల(Sreeleela)మాటలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆమె మాటలేంటో చూద్దాం. శ్రీలీల మాట్లాడుతు మా హీరో పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, పీపుల్ స్టార్. ఆయన గురించి మాట్లాడే అంత పెద్దదాన్నికాదు. ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నానని తెలిసి తమిళ, కన్నడ సినిమాల సెట్స్ కి వెళ్ళినప్పుడు పవన్ గారి గురించి అడిగేవారు. పాజిటివ్ గా ఉండటం, మన జీవితం మనం చూసుకోవడం కాకుండా చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం, ప్రకృతిని ప్రేమించడం ఇలా ఎన్నో విషయాలు పవన్ గారిని చూసి నేర్చుకున్నాను. ఆయన సినిమాలు చేయడం అనేది సినిమాకే మంచింది. ఎందరికో ఆయన నిజమైన స్ఫూర్తి. ఈ ఉగాదిని ఉస్తాద్ ఉగాది చేస్తారని కోరుకుంటున్నాను. మార్చి 19న థియేటర్లలో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం.అందరకి ఉగాది శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చింది.  also read: Ustaad Bhagat Singh: ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ స్పీచ్ అదరహో.. కానీ ఆ మాటల్ని గమనించారా హరీష్ శంకర్, నిర్మాతలు, దేవిశ్రీప్రసాద్ గురించి మాట్లాడుతు హరీష్ గారి నుంచి కూడా ఎంతో నేర్చుకున్నాను. నిజాయితీగా పని చేయడం వల్ల ముక్కుసూటిగా ఉంటారు. సరిగా నిద్ర పోకుండా ఒక యజ్ఞంలా మూవీని కంప్లీట్ చేసారు. ఆ యజ్ఞం ఫలించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారికి కృతఙ్ఞతలు. ప్రతి చిన్న విషయంలో ఎంతో శ్రద్ధతో నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన పాటలు అందించారు. మూవీలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు అని శ్రీలీల చెప్పుకొచ్చింది. శ్రీలీల మాత్రం గత కొంత కాలంగా వరుస పరాజయాల్ని చవి చూస్తూ గోల్డెన్ లెగ్ నుంచి  ఐరెన్ లెగ్ అనే టాగ్ లైన్ ని సినీ సర్కిల్స్ లో పొందింది. ఈ నేపథ్యంలో ఉస్తాద్ ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.    
ప్రముఖ తమిళ కవి, గేయ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ్‌ పురస్కారం దక్కడంపై టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. వైరముత్తు సాహితీ ప్రతిభను కొనియాడుతూ పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా 'మీటూ' ఉద్యమం ద్వారా వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గాయని చిన్మయి దీనిపై ఘాటుగా స్పందించారు. చిన్మయి తన సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తీరును తప్పుబట్టారు. గతంలో వైరముత్తుపై దాదాపు 17 మంది మహిళలు వేధింపుల ఆరోపణలు చేశారని, అటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ ఎలా అభినందిస్తారని ఆమె ప్రశ్నించారు. బాధితుల పక్షాన నిలవాల్సిన నాయకులు, ఇలాంటి వారికి మద్దతు తెలపడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైరముత్తుపై వచ్చిన ఆరోపణల విషయంలో చిన్మయి గత కొన్నేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాలు కూడా తగ్గాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడు కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో కేవలం వైరముత్తు సాహిత్య సేవను మాత్రమే ప్రస్తావించారు. కానీ, చిన్మయి మాత్రం "సాహిత్యం గొప్పదైతే సరిపోదు, మనిషి ప్రవర్తన కూడా ముఖ్యం" అని గట్టిగా చెబుతున్నారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే జనసేనాని, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గౌరవించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు చిన్మయి లేవనెత్తిన అంశాల్లో నిజం ఉందని మద్దతు తెలుపుతున్నారు. ఒక మహిళగా చిన్మయి పడుతున్న ఆవేదనను అర్థం చేసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. మొత్తానికి వైరముత్తుకు దక్కిన ఈ గౌరవం మరియు పవన్ కళ్యాణ్ అభినందనలు ఇప్పుడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ ఈ విమర్శలపై స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, మహిళా రక్షణ మరియు గౌరవం విషయంలో చిన్మయి చేస్తున్న పోరాటం మరోసారి చర్చకు దారితీసింది.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగు వెలుగుతోంది అందాల భామ త్రిష కృష్ణన్. నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్ మరియు నటనతో నేటి తరం కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే కాకుండా, తమిళంలోనూ వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా త్రిష వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో త్రిషకు ఉన్న అనుబంధంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్న తరుణంలో, అందులో త్రిష పేరు కూడా తరచూ వినిపిస్తోంది. వీరిద్దరూ గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులు కావడంతో ఈ రూమర్లు మరింత జోరందుకున్నాయి. ఇటీవల ప్రముఖ నిర్మాత సురేష్ కల్పతి కుమారుడి వివాహ వేడుకకు విజయ్ మరియు త్రిష ఇద్దరూ కలిసి హాజరవ్వడం టాలీవుడ్, కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆశ్చర్యకరంగా వీరిద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించి, ఒకే కారులో వేడుకకు రావడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. వీరి మధ్య ఏదో నడుస్తోందంటూ వస్తున్న వార్తలకు ఈ సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా మార్చి 13న త్రిష చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఒక విలేకరి ఏకంగా "విజయ్‌తో కలిసి ఒకే కారులో పెళ్లికి ఎందుకు వెళ్లారు?" అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్న వెంటనే త్రిష ముఖ కవళికలు మారిపోయాయి. ఆమె ఎటువంటి సమాధానం చెప్పకుండా, మౌనంగా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది. త్రిష మౌనంగా వెళ్లిపోవడానికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం సమాధానం చెప్పకపోవడం వల్ల అనుమానాలు పెరుగుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి విజయ్-త్రిషల మధ్య ఉన్న స్నేహం కేవలం ప్రొఫెషనల్ మాత్రమేనా లేక అంతకు మించి ఏదైనా ఉందా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. వీరిద్దరూ త్వరలోనే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్లపై వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే.
  -నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక  -పవన్ స్పీచ్ పై ఫ్యాన్స్ హ్యాపీ  -ప్రతి ఒక్కర్ని అభినందించాడు సిల్వర్ స్క్రీన్ పై ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాలు మోపడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కెరీర్ లో ఫస్ట్ టైం తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది రోజు 19 న అడుగుపెట్టబోతుండటం, పైగా 18 నుంచే ప్రీమియర్స్ పడుతుండటంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి వాతారణం నెలకొని ఉంది. రిలీజ్ ని పురస్కరించుకొని నిన్న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ కి హాజరైన అభిమానులకి, లైవ్ లో వీక్షిస్తున్న ప్రజలకి నమస్కారాలు. సినిమా నాకు చాలా ఇష్టమైన దితో పాటు అన్నం పెట్టింది. ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చింది కూడా సినిమానే.  అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకోవడంతో పాటు సినిమా కోసం ఉత్సాహంగా వచ్చే నా అభిమానులకి ఆనందం కలగాలని కోరుకుంటాను. నా మూవీ ఎంత వసూలు చేసిందని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. సినిమా బాగుండాలని మాత్రమే కోరుకుంటాను. తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా అనేది ఉండదు.  భారతీయ సినిమా మాత్రమే ఉంటుందని నమ్ముతాను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నా అదృష్టం. నా వరకు ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన పక్కన ఉంటే నేను హీరో అనే సంగతి మర్చిపోతాను. అలాంటి అన్నయ్య చిరంజీవి గారు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ట్వీట్ చేసిన రామ్ చరణ్ కి కూడా నా కృతఙ్ఞతలు. సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తాం. ఈ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. వాటిని తట్టుకొని సినిమా పూర్తి చేయడం చాలా కష్టమైనది. గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్(Harish Shankar)చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నాం. తర్వాత కథ మారింది. కోవిడ్ వచ్చింది. వీటన్నింటి మధ్య నేను రాజకీయాల్లోకి వెళ్లి, అక్కడ పదవీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకున్న బాధ్యతలు, విధులకు ఇబ్బంది కలగకుండా రోజుకి ఐదారు గంటల లోపే పనిచేస్తూ నలభై నలబైదు రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసాం. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. పాలిటిక్స్ లో ఉన్నా కూడా సినిమాలు చేయొచ్చు అనే భరోసాని కూడా ఉస్తాద్ ఇచ్చింది. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని  మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది. నవీన్ గారు నాతో గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేయాలని ఉందని ఎప్పటినుంచో చెప్పేవారు. ఆ కోరిక ఉస్తాద్ తో నెరవేరుతుందని ఆశిస్తున్నాను. లిరిక్స్  అందించిన చంద్రబోస్ గారికి, భాస్కరభట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి కృతఙ్ఞతలు. పీఆర్ఓ లక్ష్మి వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ కి, స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ గార్లకి రచయితలు రమేష్ రెడ్డి గారికి, దశరథ్ గారికి, ఎడిటర్ కార్తిక శ్రీనివాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారికి, సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ గారికి, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గారికి, నేపథ్య సంగీతం బాధ్యతలు తీసుకున్న తమన్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. శ్రీలీల మంచి డ్యాన్సర్, మంచి పెర్ఫార్మర్. తన కెరీర్ లో గుర్తుండిపోయే క్యారక్టర్ ని ఉస్తాద్ లో పోషించింది. రాశి ఖన్నా గారు నాతో కలిసి నటించాలనే ఉద్దేశంతో కథ కూడా వినకుండా అంగీకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్య క్యారెక్టర్స్ చేసిన పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారికి కృతఙ్ఞతలు.. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్. మీలో ఒకరు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. ఇలాంటి అద్భుత దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో ఈ సినిమా చేశాడు.  Also read: Allu Arjun: నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అల్లు అర్హ.. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ రిక్వెస్ట్  నా గుండెల్లో నుంచి ప్రేమ పూర్వకంగా చెబుతున్నాను.. హరీష్ శంకర్ కి హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను. నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని సినిమాలకు టికెట్ ధరల పెంపుకి అనుమతి ఇస్తుంది. అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అభిమానులకి  నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం. ఈ వేడుక జరుపుకోవడానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి కృతఙ్ఞతలు. అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు." అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇక పవన్ తన స్పీచ్ లో ప్రతి ఒక్కర్ని పేరు పేరున ప్రస్తావించడంపై అభిమానులు పవన్ కి ఉన్న సినీ నిబద్ధతని మరో సారి ప్రశంసిస్తున్నారు.    
టాలీవుడ్ 'కలెక్షన్ కింగ్', 'డైలాగ్ కింగ్' డాక్టర్ మోహన్ బాబు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఒడుదొడుకులు, సాధించిన విజయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ మొదట్లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఒక సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టి, నేడు ఇండస్ట్రీలో ఒక లెజెండ్‌గా ఎదగడం వెనుక దశాబ్దాల కష్టం ఉంది. సినిమా రంగంలోకి రాకముందు మోహన్ బాబు గారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మద్రాసులో ఉన్న సమయంలో సరైన భోజనం కూడా దొరకక పస్తులున్న రోజులు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి 'రాజమకుటం' సినిమా చూడటమే తన సినీ ప్రేరణకు మొదటి అడుగు అని చెప్పారు. ఆ పట్టుదలే ఆయనను దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దృష్టిలో పడేలా చేసింది. 'స్వర్గం-నరకం' చిత్రంతో మొదలైన ఆయన ప్రయాణం ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. మోహన్ బాబు నటనలో వైవిధ్యం చూపించడంలో దిట్ట. విలన్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 560కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. "నేను నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు, సినిమా ఫలితం ఎలా ఉన్నా నా నటనతో ప్రేక్షకులను అలరించాను" అని ఆయన గర్వంగా చెబుతుంటారు. క్రమశిక్షణకు మారుపేరైన ఆయన, సెట్స్‌లో సమయపాలన విషయంలో ఎంతో కఠినంగా ఉంటారు. రాజకీయాల్లోకి వెళ్లినా, విద్యా సంస్థలను స్థాపించినా సినిమా అంటే ఆయనకు ప్రాణం. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్‌ల గురించి మాట్లాడుతూ, తాను వాటిని అస్సలు పట్టించుకోనని, అందరూ బాగుండాలని కోరుకుంటానని హుందాగా సమాధానమిచ్చారు. మొత్తానికి 50 ఏళ్ల ఈ ప్రయాణం కేవలం ఒక నటుడి విజయగాథ మాత్రమే కాదు, పట్టుదల ఉంటే శూన్యం నుంచి సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించిన ఒక చరిత్ర. తన సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది నవంబర్ వరకు ప్రతి నెలా ప్రత్యేక వేడుకలు జరగనున్నాయి. అభిమానుల ప్రేమే తనను ఇక్కడి వరకు నడిపించిందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నేటికాలంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్ ఒక ప్రాథమిక అవసరంగా మారింది, కానీ  ప్రస్తుతం గ్యాస్ కొరత ఏర్పడిందని వస్తున్న వార్తల కారణంగా ప్రజల్లో భయం మొదలైంది. ఇంట్లో ఉన్న సిలిండర్ అయిపోతే   గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అనే భయం చాలా మందిలో మొదలైంది. కొందరు భయంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నా సరే.. మళ్లీ కొత్తగా బుక్ చేసుకుంటున్నారు.  గ్యాస్ సిలిండర్ కోసం కిలీమీటర్ల మేర క్యూ కట్టిన జనాన్ని వార్తల్లో కూడా చూపిస్తున్నారు. ఈ నైపథ్యంలో గ్యాస్ సిలిండర్ దొరుకుతుందా లేదా అని ఆలోచించేకంటే.. ఇంట్లో ఉన్న గ్యాస్ ను పదుపుగా వాడుకోవడం చాలా మంచిది. గ్యాస్ ను సేవ్ చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. చాలా మంది వినియోగదారులకు దేశీయ LPG సిలిండర్ యొక్క అసలు బరువు గురించి తెలియదు. సరిగ్గా నింపిన సిలిండర్ బరువు దాదాపు 29.7 కిలోలు, ఇందులో 14.2 కిలోల గ్యాస్ మరియు 15.5 కిలోల ఖాళీ సిలిండర్ బరువు ఉంటుంది. డెలివరీ సమయంలో సిలిండర్ బరువు దీని కంటే తక్కువగా ఉంటే సీలింగ్ చేసే ముందు తక్కువ గ్యాస్ నింపబడిన లేదా తీసివేయబడిన స్కామ్‌ను ఇది సూచిస్తుంది. వంట చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. పాత్రల సెలక్షన్..  ఉపయోగించే వంట పాత్రల రకం కూడా  గ్యాస్ వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. వంట చేసేటప్పుడు, ఎల్లప్పుడూ  అడుగున చదునుగా ఉన్న పాత్రలను ఎంచుకోవాలి.  ఈ  పాత్రలు బర్నర్‌పై సరిగ్గా కూర్చుంటాయి, తద్వారా గ్యాస్ వేడి నేరుగా పాత్రను చేరుతుంది. పాత్ర అడుగు భాగం వంకరగా  ఉంటే, వేడి వ్యాపిస్తుంద,  వంట సమయం ఎక్కువ అవుతుంది, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. మీడియం ప్లేమ్.. అధిక వేడి మీద వంట చేయడం వల్ల ఆహారం త్వరగా ఉడుకుతుందని,  గ్యాస్ వినియోగం తగ్గుతుందని  అనుకుంటారు. అయితే, ఇది చాలా తప్పు. అధిక వేడి ఆహారాన్ని కాల్చేస్తుంది,  ఎక్కువ గ్యాస్‌ను కూడా వినియోగించుకుంటుంది. చాలా కూరగాయలు, పప్పులు,  బియ్యం మీడియం లేదా తక్కువ వేడి మీద మరింత సులభంగా,  సమర్ధవంతంగా వండవచ్చు, దీనివల్ల గ్యాస్ ఆదా అవుతుంది. ప్రెజర్ కుక్కర్.. వంట చేయడానికి వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగించడం మేలు. ప్రెషర్ కుక్కర్‌లో ఆహారం తక్కువ సమయంలోనే ఉడుకుతుంది. ఇది గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. మూత పెట్టి వండటం.. వంట చేసేటప్పుడు పాత్రల మీద మూత పెట్టడం కూడా మంచి అలవాటు. మూత లేకుండా వంట చేయడం వల్ల ఆవిరి బయటకు వెళ్లి వంట ఆలస్యం అవుతుంది. మూత ఉపయోగించడం వల్ల ఆవిరి  ఆహారం వేగంగా ఉడుకుతుంది. దీనివల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. బర్నర్.. బర్నర్ శుభ్రతపై  శ్రద్ధ వహించాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోయినా లేదా ధూళి పేరుకుపోయినా, గ్యాస్ సరిగ్గా మండదు, ఫలితంగా గ్యాస్ వినియోగం పెరుగుతుంది. అందువల్ల వారానికి ఒకసారి బర్నర్‌ను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది  మంట బాగా వచ్చేలా చేస్తుంది. గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తుంది.                                                   *రూపశ్రీ.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం అనగానే చాలామందికి కూలర్లు, ఏసీలు గుర్తుకు వచ్చేస్తాయి.  ఫిబ్రవరి నెల వరకు అంతగా అవసరం లేని, ఎక్కువగా వాడని వారు కూడా మార్చి నెలతో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీ ఎంత చల్లదనం ఇస్తుందో.. అంతే కరెంట్ బిల్లు కూడా తెచ్చిపెడుతుంది.  ఏసీని ఎక్కువగా వాడితే వేలాది రూపాయల కరెంట్ బిల్లు వస్తుంది.  ఈ కారణంగానే చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఏసీ పెట్టించుకోవాలి అనే ఆశ ఉన్నా, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే భయంతో ఆ ఆలోచన మానుకుంటారు. అయితే ఏసీ రోజంతా వాడినా సరే.. కరెంట్ బిల్లు ఎక్కువ రాకూడదంటే కొన్ని సీక్రెట్ ట్రిక్స్  ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుంటే.. టెంపరేచర్... చాలామంది ఏసీ ఆన్ చేశారంటే తక్కువ టెంపరేచర్ సెట్ చేసుకుంటారు.  ఎక్కువ మంది 17 లేదా 15 వరకు కూడా పెడుతుంటారు. కానీ ఏసీ ని ఎప్పుడూ 26డిగ్రీల వద్ద పెడితే సరిపోతుంది.  ఇది రూమ్ మొత్తం చల్లదనాన్ని ఇస్తుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుంది. ఏసీ, ప్యాన్ కాంబినేషన్.. ఏసీ, ప్యాన్ కాంబినేషన్ గురించి చాలామందికి తెలియదు.  ఏసీ వేసినప్పుడు ప్యాన్ ఎందుకు అని కొందరు అనుకుంటారు.  కానీ ఏసీ వేసినప్పుడు కొద్దిసేపు ఫ్యాన్ కూడా ఆన్ చేయాలి.  ఇలా చేస్తే గది తొందరగా చల్లబడుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ ఆప్ చేసుకోవచ్చు. డోర్స్, విండోస్.. చాలామంది ఏసీ ఆన్ చేసి డోర్స్, విండోస్ తెరచి ఉంచుతారు. కానీ ఇది చాలా తప్పు.  డోర్స్, విండోస్ తెరచి ఉంచడం వల్ల బయటి వేడి గాలి లోపలి వస్తూ గదిని చల్లబడనివ్వదు.  దీనివల్ల ఏసీ ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. కర్టెన్లు.. కిటికీలకు గాజు అద్దాలు ఉంటే.. వేడి సెగ అనేది లోపలికి వస్తూ ఉంటుంది.  అందుకే కిటికీ ల దగ్గర కర్టెన్లు వేయాలి.  ఇలా చేస్తే వేడి లోపలికి రాదు. ఫిల్టర్.. చాలామంది వేసవి రాగానే ఏసీ వేయాలి అనే ఆలోచన ఉంటుంది కానీ,  ఏసీ ఫిల్టర్ల గురించి మాత్రం అంతగా పట్టించుకోరు.  ఏసీ ఫిల్టర్లను క్లీన్ చేయాలి.  వాటిలో డస్ట్ అలాగే ఉంటే ఏసీ పని చేయడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా ఫిల్టర్ల లో ఉండే డస్ట్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుంది.  శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. స్లీప్ మోడ్ లేదా టైమర్.. వేసవిలో కాసింత చల్లగాలి తగిలితే చాలు నిద్రపోవచ్చు అనుకునేవారు ఏసీని  ఆన్ చేసినప్పుడు స్లీప్ మోడ్ లేదా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. ఇది సెట్ చేస్తే ఏసీ దానంతకు అదే ఆఫ్ అవుతుంది.  ఇది సెట్ చేసుకొనేటప్పుడు రూమ్ లో ప్యాన్ ఆన్ లో ఉంచితే.. ఏసీ ఆప్ అయినా ఫ్యాన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగకుండా హాయిగా నిద్రపోవచ్చు. పైన చెప్పుకున్న చిట్కాలు పాటిస్తే ఏసీ ఎంత వాడినా సరే.. కరెంట్ బిల్లు హడలిపోయేంతగా రాదు.  ఖచ్చితంగా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.                                        *రూపశ్రీ.
డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచివని చెబుతారు.  డ్రై ఫ్రూట్స్  రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి పోషకాలను,  ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.  అయితే డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంత మంచివో.. వాటిలో ఎంత మంచి పోషకాలు ఉంటాయో.. వాటిని తీసుకునే విధానం సరిగా లేకపోతే అవన్నీ వ్యర్థమయినట్టే అని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.. అంతేకాదు.. ఏ డ్రై ఫ్రూట్స్ లేదా నట్స్ శరీరంలో ఏ అవయవానికి మేలు చేస్తుందో తెలుసుకుని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు.  వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బాదం.. బాదంలో పోషకాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ప్రయోజనాలు.. మెదడును పదును పెట్టి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉంచుతుంది.   ఎముకలను బలపరుస్తుంది,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్.. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. వాల్నట్స్ ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి,   జ్ఞాపకశక్తికి అద్భుతమైనది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.   వాపు,  ఉద్రిక్తతను తగ్గిస్తుంది. జీడిపప్పు.. జీడిపప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, భాస్వరం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు.. జీడిపప్పు  ఎముకలు, దంతాలను బలపరుస్తుంది.  చర్మానికి,  జుట్టుకు మంచిది. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. పిస్తా పప్పు.. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కూడా ఖరీదైనది.  పిస్తా పప్పులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ B6 వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..   పిస్తా పప్పు గుండె,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు నియంత్రణ,  జీర్ణక్రియకు సహాయపడుతుంది.  మెదడు,  కళ్ళకు మేలు చేస్తుంది. ఎండు ద్రాక్ష.. ఎండు ద్రాక్ష భారతీయులు ఎక్కువగా ఉపయోగించే, ఎంతో కాలం నుండి వాడుతున్న డ్రై ప్రూట్..  ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ప్రయోజనాలు..   రక్తహీనతను తొలగించడంలో ఎండుద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. కడుపు ఆరోగ్యానికి  జీర్ణక్రియకు మంచిది. అంజీర్.. అంజీర్ చాలా శక్తివంతమైన డ్రై ఫ్రూట్. అంజీర్ లో ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..  జీర్ణక్రియ,  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఎముకలు,  దంతాలను బలపరుస్తుంది. గుండె,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఖర్జూరం.. ఖర్జూరానికి చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఖర్జూరంలో సహజ చక్కెరలు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంచి పోషకాలు ఉంటాయి.  ప్రయోజనాలు..    ఖర్జూర పండ్లు తింటే తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తాన్ని మెరుగుపరచడంలో,  బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. గుండె,  కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది. వేసవి కాలం దానితో పాటు మండే ఎండలు,  ఎండ వేడిని వెంట పెట్టుకుని వస్తుంది. ఈ సీజన్‌లో చెమట, శరీరం తేమ కోల్పోవడం,   నిరంతరం  అలసటగా అనిపించడం వంటి సమస్యలు పెరుగుతాయి. పెరుగుతున్న వేడి,  వేడిగాలుల కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  వేసవి కాలంలో  హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు తాగుతారు,  కానీ అది శరీరాన్ని చల్లబరచదు. ఎన్ని నీళ్లు తాగినా తృప్తి కలగదు.  మార్కెట్ లో పానీయాలు కొనుగోలు చేయడం,  మరీ ముఖ్యంగా కూల్ డ్రింకుల కొనుగోలు వేసవిలో బాగా పెరుగుతాయి. కానీ వీటిలో రసాయనాలు ఉంటాయి.  ఈ వేసవిలో శరీరం చల్లగా ఉండాలంటే ఇంట్లోనే చేసుకోదగిన కొన్ని పానీయాలు తీసుకోవడం మంచిది. భారతీయులకు ఎంతో సుపరిచితమైన,  ఆరోగ్యానికి మేలు చేస్తూ వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు ఏంటో తెలుసుకుంటే.. బేల్ షర్బత్.. పరమ శివుడి ఆరాధనలో ఉపయోగించే బిల్వ  పత్రం మాత్రమే మనకు తెలుసు. కానీ బిల్వ వృక్షానికి పండ్లు కూడా కాస్తాయి.  వీటినే బిల్వ పండ్లు లేదా బేల్ పండ్లు అని మారేడు కాయలు అని అంటూ ఉంటారు.  ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. బాగా పండిన బిల్వ పండ్లను జ్యూస్ చేసి తాగితే శరీరం చల్లబడుతుంది. కావలసిన పదార్థాలు.. పండిన బిల్వ పండు చల్లని నీరు.. 4 గ్లాసులు బెల్లం లేదా చక్కెర.. 3 నుండి 4 స్పూన్లు నల్ల ఉప్పు.. కొద్దిగా. తయారు విధానం.. బిల్వ పండును పగలగొట్టి గుజ్జు తీయాలి.  ఈ గుజ్డులో నీరు పోసి బాగా బ్లెండ్ చేయాలి.  స్ట్రైయినర్ సహాయంతో వడబోయాలి. ఇందులో బెల్లం లేదా పంచదార,  నల్ల ఉప్పు వేసి బాగా కరిగిన తర్వాత తాగాలి. ఆమ్ పన్నా.. వేసవి అంటే మామిడికాయలు.  పచ్చి మామిడి కాయలతో చేసే ఆమ్ పన్నా రుచిగానే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. కావలసిన పదార్థాలు.. పచ్చి మామిడికాయలు.. 2 బెల్లం లేదా చక్కెర.. 3 టీస్పూన్లు వేయించిన జీలకర్ర పొడి నల్ల ఉప్పు పుదీనా.. తయారీ విధానం.. మామిడికాయలు ఉడకబెట్టి గుజ్జు తీసుకోవాలి.  గుజ్జులో బెల్లం లేదా చక్కెర వేయాలి. ఇందులో కాసింత పుదీనాను వేసి మిక్సీ వేసుకోవాలి.  దీనికి కావలసినంత నీరు కలిపి జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇందులో వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి కలిపి తాగాలి.  ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జల్ జీరా.. జల్ జీరా పేరు వింటేనే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది.  ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం,  శరీరానికి చలువ,  గ్యాస్, అజీర్ణం నుండి ఉపశమనం కూడా ఇస్తుంది. కావలసిన పదార్థాలు.. జల్ జీరా పొడి నీరు పుదీనా నిమ్మరసం నల్ల ఉప్పు తయారీ విధానం.. చల్లని నీటిలో జల్ జీరా పొడి,  నిమ్మరసం, నల్ల ఉప్పు,  పుదీనా అన్నీ వేసి బాగా కలిపి తాగడమే.   సత్తు జ్యూస్.. బీహార్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో సత్తును వేసవిలో  తాగుతారు. ఇది చాలా శక్తివంతమైన పానీయం.  కడుపును చల్లబరుస్తుంది,  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. కావలసిన పదార్థాలు.. సత్తు పొడి.. నల్ల ఉప్పు.. వేయించిన జీలకర్ర పొడి నిమ్మరసం తయారీ విధానం.. నీటిలో సత్తు పొడి, నల్ల ఉప్పు,  వేయించిన జీలకర్ర పొడి అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో కాసింత నిమ్మరసం కలిపి తాగాలి. మజ్జిగ.. బారతీయులు ఎక్కువగా తాగే ఆరోగ్యకరమైన పానీయం మజ్జిగ.  పెరుగు నుండి  వెన్నను తీయగా మిగిలిన పానీయమే మజ్జిగ.  ఈ మజ్జిగ మరింత రుచిగా ఉండటానికి ఇందులో అల్లం, వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు,  పొదీనా వేసి తాగుతారు.  మజ్జిగ మరింత రుచిగా రావడానికి కరివేపాకుతో పోపు పెట్టి తాగుతారు.  ఇందులో కొత్తి మీర వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.                               *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 బిలియన్ల మంది ఊబకాయం (Obesity) మరియు దాని సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నారు. ఇది కేవలం శరీర ఆకృతికి సంబంధించిన సమస్య కాదు.. ఇది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. ఈ రోజు మనం మన ఆరోగ్యం గురించి గంభీరంగా ఆలోచించకపోతే, రేపు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.  Metabolic and Bariatric Surgeon Dr. Kona Lakshmi చెప్పిన మరిన్ని విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? (Why should we care?) ఊబకాయం అనేది ఇతర ప్రమాదకరమైన రోగాలకు ఒక ముఖద్వారం లాంటిది. దీనివల్ల కలిగే నష్టాలు ఊహించలేనంత దారుణంగా ఉంటాయి: గుండె మరియు ఊపిరితిత్తులపై ప్రభావం: మీ బరువు పెరిగేకొద్దీ మీ ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరుగుతుంది, ఇది గుండె దెబ్బతినడానికి దారితీస్తుంది. సడన్ కార్డియాక్ డెత్స్‌కు ఊబకాయం ప్రధాన కారణం. క్యాన్సర్ ముప్పు: దాదాపు 13 రకాల క్యాన్సర్లు నేరుగా ఊబకాయంతో ముడిపడి ఉన్నాయి. మెటబాలిక్ వ్యాధులు: డయాబెటిస్ (షుగర్), హై బ్లడ్ ప్రెషర్, మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు బాడీలోని "ఇంజిన్"ను లోపల నుండి దెబ్బతీస్తాయి. కీళ్ల నొప్పులు: అధిక బరువు వల్ల ఆర్థరైటిస్ వంటి కీళ్ల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏమి చేయకూడదు? (What not to do?) మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు మనల్ని అనారోగ్యం వైపు నెట్టేస్తాయి: పెద్ద సైజు దుస్తులపై ఆధారపడకండి: మార్కెట్‌లో 3XL నుండి 5XL వరకు దుస్తులు దొరుకుతున్నాయి కదా అని, బరువు తగ్గడానికి బదులు పెద్ద సైజు బట్టలు కొనడం అలవాటు చేసుకోవద్దు. మీ డ్రెస్ సైజు పెరుగుతుంటే, మీ అనారోగ్యం పెరుగుతోందని గుర్తించండి. నిర్లక్ష్యం వద్దు: "నేను బాగానే నడుస్తున్నాను కదా, నాకు ఏమీ కాదు" అని భ్రమపడకండి. లోపల షుగర్ లేదా కొలెస్ట్రాల్ ఎంత ఉందో బయటకి కనిపించదు. కెమికల్స్ వినియోగం: ఫుడ్ కలర్స్, పెస్టిసైడ్స్ ఉన్న ఆహారం మరియు విపరీతమైన కెమికల్స్ ఉన్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల శరీర మెటబాలిజం దెబ్బతింటుంది. ఆరోగ్యం కోసం ఏం చేయాలి? (How to manage?) BMI పర్యవేక్షణ: మీ ఎత్తుకు తగ్గ బరువు (BMI) ఉన్నారో లేదో చూసుకోండి. సాధారణంగా BMI 18 నుండి 24 మధ్య ఉండాలి. ముందస్తు గుర్తింపు: మీకు ఆయాసం వస్తున్నా లేదా 15 నిమిషాలు కూడా నిరంతరంగా నడవలేకపోతున్నా మీ సిస్టమ్ ఫెయిల్ అవుతుందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. జీవనశైలి మార్పులు: కాలుష్యం, జంక్ ఫుడ్ మరియు కెమికల్స్ కు దూరంగా ఉంటూ, శారీరక శ్రమను పెంచుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) 1. సన్నగా ఉన్నవారికి కూడా ఊబకాయం సమస్యలు ఉంటాయా?  అవును, బరువు తక్కువగా ఉన్నా మెటబాలిక్ సమస్యలు (షుగర్, బిపి) ఉండవచ్చు. ఊబకాయం అంటే కేవలం బయటకి కనిపించే కొవ్వు మాత్రమే కాదు, శరీర అంతర్గత వ్యవస్థల పనితీరులో లోపం కూడా. 2. 'మార్బిడ్ ఒబేసిటీ' అంటే ఏమిటి? BMI 40 కంటే ఎక్కువ ఉంటే దానిని 'మార్బిడ్ ఒబేసిటీ' అంటారు. ఈ స్థితిలో ఊబకాయం అనేది కేవలం బరువు సమస్య కాదు, అది ప్రాణాపాయ స్థితిని (Life risk) సూచిస్తుంది. 3. బేరియాట్రిక్ సర్జరీ అంటే కేవలం బరువు తగ్గడమేనా?  కాదు, ఈ సర్జరీ వల్ల బరువు తగ్గడంతో పాటు మెటబాలిక్ డిసీజెస్ (డయాబెటిస్, హై బిపి) కూడా కంట్రోల్ అవుతాయి, అందుకే దీనిని మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జరీ అంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఊబకాయం అనేది మనకు సమయం ఇస్తుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలి. రేపటి తరానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును ఇవ్వాలంటే ఈ రోజే మనం మారాలి. ఆరోగ్య విషయాలపై మరింత లోతైన అవగాహన కోసం మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) ఆరోగ్యంగా ఉండండి.. ఆనందంగా జీవించండి!