వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన వరుపుల సుబ్బారావు.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. వైసీపీ విధానాలు తనకు నచ్చకపోవడంతోనే పార్టీని వీడినట్లు వరుపుల సుబ్బారావు తెలిపారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తనకు తగిన గౌరవం దక్కలేదని అన్నారు. గతంలో వైఎస్ జగన్ తన వయసు ఎక్కువైందని వ్యాఖ్యానించేవారని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే జనసేనలో చేరేందుకు తాను ఎలాంటి పదవి, ప్రత్యేక హామీ లేదా కమిట్‌మెంట్‌ కోరలేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వరుపుల సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం కాకినాడ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాకినాడ జిల్లాలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావు రాజీనామా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పెద్దాపురం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.     [ Big shock for YCP, Former MLA Varupula Subbarao, Deputy CM Pawan Kalyan, Kakinada District,   Peddapuram, Samarlakota, YS Jagan, YSRCP,  Telugu One, Telugu News ]
డిజిటల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యవహరించి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు వారిలో పశ్చాత్తాపం కలిగేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వివాదాస్పద యూట్యూబర్ బాచలకురి జోసెఫ్, అలియాస్  ప్రశ్న రావణ్ తాను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.  మతపరమైన మనోభావాలను గాయపరచడం, దేవుళ్లను దూషించడం,  రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.    వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏపీ పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వ్యాఖ్యల తీవ్రతను బట్టి అధికారులు ఈ కేసులో కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ముఖ్యంగా దేశ భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాల కింద ఉపా  చట్టంతో పాటు దేశద్రోహ సెక్షన్లను కూడా అతడిపై నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అనుకున్న అతడికి, చట్టం చేతికి చిక్కిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యాయి. పోలీస్ కస్టడీలో భాగంగా అధికారులు జరిపిన  విచారణలో ప్రశ్న రావణ్ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. తాను గతంలో చేసిన తప్పులకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక సున్నితమైన అంశాలపై తాను అనవసరంగా అతిగా స్పందించానని, దానివల్ల అనూహ్య సమస్యలను కొనితెచ్చుకున్నానని విచారణాధికారుల ఎదుట అతడు వాపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాస్పద ధోరణులకు దూరంగా ఉండాల్సిందని, ఈ పరిణామాలు తన జీవితంలో పెద్ద గుణపాఠం నేర్పాయని ప్రశ్నరావణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవుళ్లపై   అభ్యంతకరమైన వీడియోలపై పోలీసుల ప్రశ్నలకు.. అతడు చేశానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలా విషయాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని ప్రశ్న రావణ్ కన్ఫెస్ అయినట్లు సమాచారం.   అయితే..  ఈ విచారణలో భాగంగా అధికారులు అతడి ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనపై కూపీ లాగారు. ఛానెల్ ఆదాయం,  బ్యాంకు లావాదేవీల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలలో చాలా వాటికి అతడు సరైన సమాదానం ఇవ్వలేదని తెలుస్తోంది.    [Prashna Ravan, Bachalakuri Joseph, AP Police UAPA Cases, YouTube controversial videos,Social Media Misuse, Confess]
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని అన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిం చిందని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫాంహౌజ్ వ్యవహారంపై కూడా బండి సంజయ్ స్పందించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిదని నిలదీశారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. భూదోపిడీ జరిగితే ఆధారాలతో సహా బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూముల స్వాధీ నంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌజ్‌ను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ అధికార పార్టీ ఫాంహౌజ్‌ ను సందర్శించడం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిం చారు.రాష్ట్రంలో 22ఏ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని బండి సంజయ్ అన్నారు. ప్రజల సమస్య లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తా మని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీ కానేకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవా లను ప్రశాంతంగా నిర్వహించుకుందామని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. భక్తిశ్ర ద్ధలతో ఉత్సవాలను జరుపుకోవడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.     [ Bandi Sanjay Kumar, Congress party, Supreme Court, BJP, BRS, Danam Nagender, Khairatabad by-election, CM Revanth reddy ]
ALSO ON TELUGUONE N E W S
సూర్య వరుస హిట్స్ తో జోరు మీద ఉన్నాడు.  మరి ఆ జోరుకి భారతీయ సినీ పరిశ్రమ గర్వంగా చెప్పుకునే దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబో కలిస్తే అభిమానులతో పాటు సోషల్ మీడియా సైతం ఎగిరి గంతేస్తుంది. నిజానికి సూర్య సినీ ప్రస్థానం మణిరత్నం నిర్మించిన 'నేరుక్కు నేర్' (1997) చిత్రంతోనే ప్రారంభమైంది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే  'యువ' చిత్రంలో మైఖేల్ అనే శక్తివంతమైన క్యారక్టర్ లో సూర్య కనబరిచిన నటన ఆయన కెరీర్‌కే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇక ఈ సంచలన కలయిక వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. దాదాపు 8 ఏళ్ల క్రితమే మణిరత్నం, సూర్యకు ఒక అద్భుతమైన లైన్ వినిపించారట. అయితే ఆ సమయంలో వేర్వేరు ప్రాజెక్టుల వల్ల, ఇతర కారణాల చేత ఆ చిత్రం పట్టాలెక్కలేకపోయింది. కానీ ఇప్పుడు అదే కథను మణిరత్నం నేటి ట్రెండ్‌కి తగినట్లుగా కీలకమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మోడిఫైడ్ వర్షన్ స్క్రిప్ట్‌ని  సూర్యకు మళ్లీ నరేట్ చేయడానికి మణిరత్నం సిద్ధమవుతున్నారు. కొత్త కథనం గనక సూర్యకు నచ్చితే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారై, ఆయన లైనప్‌లోకి చేరుతుంది. ఇది కుడా చదవండి: చిరంజీవి భావోద్వేగ ట్వీట్: 48 ఏళ్ల క్రితం మారిన జీవితం!   ప్రస్తుతం దర్శకుడు మణిరత్నం విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటగా 'ఇంజి వెల్లమ్' అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొల్కతా నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయిన వెంటనే, ఆయన సూర్య కాంబినేషన్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో సూర్య కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'సీన్' చిత్రం నవంబర్ 6న విడుదల కానుండగా, ఆ తర్వాత జై భీమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో డాక్టర్ పాత్రలో నటిస్తున్న సినిమాతో పాటు మరో 3 సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. ఇద్దరూ తమ వద్ద ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసిన వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరి చిత్ర పరిశ్రమలో ఏదైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు మణిరత్నం మూవీ జరుగుతుందేమో చూద్దాం.   [Suriya, Mani Ratnam,  Suriya Mani Ratnam movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే కథ మొత్తం హీరో చుట్టూనే తిరిగేది. హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా కథను తయారు చేసి.. అందులో భారీ యాక్షన్‌, ఎలివేషన్ సన్నివేశాలు పెట్టి సినిమాను తెరకెక్కించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. హీరో ఎంత పెద్ద స్టార్ అయినా.. కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు అంత సులభంగా అంగీకరించడం లేదు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య విషయంలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కెరీర్ ప్రారంభంలో యూత్‌, ఫ్యామిలీ కథలతో సూర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా.. తన నటనలోని మరో కోణాన్ని చూపించే పాత్రలను ఎంచుకోవడానికి ఆసక్తి చూపించారు. దీంతో ఇప్పుడు సూర్యతో సినిమా చేయాలంటే దర్శకులు కూడా కొత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు హీరోను తెరపై చూస్తే చాలు అనే స్థాయిలో అభిమానుల అంచనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది. హీరో ఎవరన్నదితో పాటు.. ఆయన పాత్ర ఎలా ఉంది? కథలో ఆ పాత్రకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? సినిమాలో కొత్తగా చెప్పబోయే అంశం ఏంటి? అనే విషయాలను కూడా గమనిస్తున్నారు. అందుకే సూర్యతో సినిమా చేయాలనుకునే దర్శకులకు కథను సిద్ధం చేయడం పెద్ద సవాల్‌గా మారుతోంది. సూర్యకు సరిపోయే కథను రాయడం ఒక ఎత్తయితే.. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సూర్యను తెరపై చూపించడం మరో ఎత్తుగా మారింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, భారీ సెట్లు, పెద్ద స్టార్‌ క్యాస్ట్‌ మాత్రమే సినిమాకు సరిపోవు. వీటన్నింటి వెనుక బలమైన పాత్ర ఉండాలి. ఆ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కథనం ఉండాలి. అదే సమయంలో ప్రయోగాలు చేయడానికి సూర్య వెనకడుగు వేయడం లేదు. తన స్టార్ ఇమేజ్‌కు సరిపోయే కమర్షియల్ అంశాలను కూడా పూర్తిగా పక్కన పెట్టడం లేదు. దీంతో దర్శకులు సూర్యలో ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన ఇమేజ్‌ను మరోసారి చూపించడం కంటే.. కొత్త పాత్రలో ఆయనను ఎలా చూపించాలనే దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా సూర్య వయసు, అనుభవం కూడా ఇప్పుడు ఆయనకు కొత్త రకాల పాత్రలు చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో చేసిన పాత్రలను ఇప్పుడు అదే తరహాలో చేయడం కంటే.. ఆయన అనుభవానికి తగ్గ మెచ్యూర్డ్ క్యారెక్టర్స్‌, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న కథలు, వయసుకు తగ్గ కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటే సూర్యను మరో కోణంలో చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక దర్శకుడికి పనిచేసిన ఫార్ములాను మరో సినిమాకు కూడా అలాగే ఉపయోగిస్తే సరిపోదు. ప్రతి సినిమాకు ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. కథకు అవసరమైన చోట సూర్య స్టార్ పవర్‌ను ఉపయోగించడంతో పాటు.. కథను ముందుకు తీసుకెళ్లే పాత్రగా ఆయనను చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘సీన్‌’ వంటి సినిమాల్లో సూర్య తనకు అలవాటైన ఇమేజ్‌కు భిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్న విషయం కనిపిస్తోంది. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య ప్రేమ్ రాజ్ అనే విభిన్నమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. టైటిల్ టీజర్‌లోనే ఆయన పాత్రలో కామెడీ, యాటిట్యూడ్‌, యాక్షన్‌కు భిన్నమైన టచ్ కనిపించింది. మొత్తంగా చూస్తే.. అప్పటి సూర్యను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తే ఇప్పుడు సరిపోదని చెప్పొచ్చు. ఇప్పటి సూర్యను, ఆయన అనుభవాన్ని, ప్రేక్షకుల మారిన అభిరుచిని అర్థం చేసుకుని కథలు రాయాల్సిన అవసరం ఉంది. అలా వచ్చినప్పుడే సూర్య స్టార్ ఇమేజ్‌తో పాటు ఆయనలోని నటుడిని కూడా మరింత కొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉంటుంది.     [Suriya, Suriya Movies, Suriya Upcoming Movies, Suriya New Roles, Suriya Different Roles, Suriya New Movies, Tamil Cinema, Kollywood, Suriya Films, Suriya Acting, Suriya Character Roles, Suriya Scene Movie, Jithu Madhavan, Suriya Latest News]
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. సీనియర్ నటుడు మోహన్‌బాబు పోషించిన పాత్రపై కూడా ఆసక్తి నెలకొంది. తాజాగా తన పాత్ర గురించి మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రస్తావన రావడంతో తన పాత్ర గురించి ఆసక్తికరంగా స్పందించారు. విద్యార్థులు తనకు కరతాళ ధ్వనులతో స్వాగతం పలకడంతో.. ఈ చప్పట్లు బహుశా ‘ది ప్యారడైజ్‌’ సినిమా కోసమే అనుకుంటున్నానని మోహన్‌బాబు సరదాగా అన్నారు. ఆ సినిమా చూసిన తర్వాత తన దగ్గరకు రావడానికి కూడా ఎవరూ సాహసించరని, తన పాత్ర అంత భయంకరంగా ఉంటుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో సినిమాలో మోహన్‌బాబు ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది. ‘ది ప్యారడైజ్‌’లో మోహన్‌బాబు పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర పేరు శిఖంజ్ మాలిక్‌ అని సమాచారం. ఈ పాత్ర సినిమాకు చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. మోహన్‌బాబు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఇప్పటివరకు ఆయన పోషించిన పాత్రలకు భిన్నమైన షేడ్స్‌ ఇందులో కనిపించే అవకాశం ఉంది. మరోవైపు ‘ది ప్యారడైజ్‌’ ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ అయింది. దాదాపు మూడు గంటల నిడివితో ఈ సినిమా తెరకెక్కగా.. హింసాత్మక సన్నివేశాల కారణంగా సెన్సార్‌ బోర్డు పలు మార్పులు, కట్స్‌ సూచించినట్టు సమాచారం. మొత్తం 21 చోట్ల మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించారు. మోహన్‌బాబుతో పాటు రాఘవ్‌ జుయల్‌, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ఇప్పటికే ‘ఏ’ సర్టిఫికెట్‌, దాదాపు మూడు గంటల రన్‌టైమ్‌, భారీ యాక్షన్‌ సన్నివేశాల కారణంగా ‘ది ప్యారడైజ్‌’పై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు మోహన్‌బాబు తన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరి తెరపై ఆయన పాత్ర ఏ స్థాయిలో భయపెడుతుందో తెలియాలంటే సెప్టెంబర్‌ 24 వరకు ఆగాల్సిందే.     [Mohan Babu, The Paradise, The Paradise Movie, Nani The Paradise, Mohan Babu The Paradise, Mohan Babu Villain Role, Shikhanj Malik, Nani Movie, Srikanth Odela, The Paradise Release Date, The Paradise A Certificate, Anirudh Ravichander, Nani Mohan Babu, Telugu Cinema News]
టాలీవుడ్‌ యువ కథానాయకుడు నారా రోహిత్‌ ఇటీవల తండ్రిగా ప్రమోషన్‌ పొందిన విషయం తెలిసిందే. నారా రోహిత్‌, శిరీష దంపతులకు ఈ ఏడాది జూన్‌లో పండంటి మగబిడ్డ జన్మించాడు. అప్పటి నుంచి తమ కుమారుడి ఫొటోలు, పేరు ఎప్పుడు ప్రకటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఆ ఎదురుచూపులకు తెరదించుతూ నారా రోహిత్‌ తన కొడుకు పేరును అధికారికంగా ప్రకటించారు. తనయుడికి ‘నందన్ రామ నారా’ అని నామకరణం చేసినట్టు రోహిత్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తమ చిన్నారి తమ జీవితాల్లోకి అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చాడంటూ ప్రేమతో స్వాగతం పలికారు. ఇక తన కుమారుడికి ‘నందన్’ అనే పేరు పెట్టడం వెనుక కూడా ప్రత్యేకమైన అర్థం ఉందని నారా రోహిత్‌ తెలిపారు. ‘నందన్’ అంటే అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని పంచేవాడు అనే అర్థం వస్తుందని వివరించారు. తమ జీవితాల్లోకి వచ్చిన ఈ చిన్నారి కూడా అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడనే భావనతో ఈ పేరును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ‘నందన్ రామ నారా’ పేరులోని ‘రామ’ అనే పదం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తన తాతయ్య జ్ఞాపకార్థం ఆయన పేరులోని ‘రామ’ను తన కుమారుడి పేరులో చేర్చినట్టు నారా రోహిత్‌ తెలిపారు. దీంతో ఈ పేరు తమ కుటుంబానికి సంబంధించిన ప్రేమ, గౌరవం, మధుర జ్ఞాపకాలకు ప్రతీకగా మారింది. గతేడాది అక్టోబర్‌లో శిరీషతో నారా రోహిత్‌ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అనంతరం జూన్‌ 23న ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి తమ కుటుంబంలో కొత్త ఆనందం మొదలైందని రోహిత్‌ అభిమానులతో పంచుకున్నారు. ఇప్పుడు తన కుమారుడి పేరును అధికారికంగా ప్రకటించడంతో నారా రోహిత్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా రోహిత్‌, శిరీష దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన నారా రోహిత్‌.. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు నారా రోహిత్‌. వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. దీంతో వ్యక్తిగత జీవితంలో తండ్రిగా కొత్త బాధ్యతలు స్వీకరిస్తూనే.. సినిమాల పరంగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.       [Nara Rohit, Nara Rohit Son, Nara Rohit Son Name, Nandan Rama Nara, Nara Rohit Baby Boy, Nara Rohit Family, Nara Rohit Wife Sireesha, Nara Rohit Son Name Meaning, Nandan Rama Meaning, Nara Rohit Latest News, Nara Rohit Movies, Tollywood Hero Nara Rohit]
రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ‘మహావీర్ కర్ణ’. దర్శకుడు రమేశ్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్‌ కనిపించారు. ఫస్ట్ లుక్‌ గంభీరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాఘవ లారెన్స్‌ ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రల్లో నటించారు. అయితే పౌరాణిక పాత్రలో నటించడం మాత్రం ఇదే తొలిసారి. అందులోనూ మహాభారతంలో అత్యంత కీలకమైన కర్ణుడి పాత్రను పోషిస్తున్నారు. గౌరవం, విధి, విశ్వాసం, త్యాగం వంటి లక్షణాలతో కూడిన కర్ణుడి పాత్రను లారెన్స్‌ ఎలా ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్‌తో పాటు ఆర్‌వి స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌ కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాను ఒక విజువల్ ఫీస్ట్‌గా అందించేందుకు దర్శకుడు రమేశ్‌ వర్మ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. మహాభారత కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్లు, ప్రత్యేకమైన ఆర్ట్ వర్క్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌ సాంకేతికతను ఉపయోగించి కర్ణుడి ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. పురాతన రాజ్యాలు, యుద్ధ క్షేత్రాలు, భారీ పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనేది మేకర్స్‌ ఆలోచనగా తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌లో కూడా కర్ణుడి పాత్రలో లారెన్స్‌ లుక్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక ఈ సినిమాలో నటించే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది. ప్రస్తుతం మాత్రం కర్ణుడిగా రాఘవ లారెన్స్‌ ఫస్ట్ లుక్‌ సినిమాకు మంచి బజ్‌ తీసుకొచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌, పౌరాణిక కథ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌, తొలిసారి కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్‌.. ఇలా ‘మహావీర్ కర్ణ’లో ఆసక్తి కలిగించే అంశాలు చాలానే కనిపిస్తున్నాయి.       [Mahaveer Karna, Mahaveer Karna Movie, Raghava Lawrence Karna, Raghava Lawrence Mahaveer Karna, Mahaveer Karna First Look, Ramesh Varma, Pen Movies, Raghava Lawrence Upcoming Movie, Karna Movie, Mahabharata Karna Movie, Pan India Movie, Telugu Mythological Movie, Mahaveer Karna 2027, Raghava Lawrence Movies]
'చిరంజీవి' అనే పేరుకి ఉన్న వైబ్రేషన్స్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది ఉండటం అసాధ్యం. దాని తాలూకు ప్రకంపనలు ఎప్పటికప్పుడు నిత్య యవ్వనంతో ప్రకాశిస్తూనే ఉంటాయి. ఆ  చిరంజీవి అనే కాంతి పుట్టి ఇప్పటికి 48 ఇయర్స్. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన పోస్ట్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కర్ని భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆ వివరాలు చూద్దాం. . 1978 సెప్టెంబర్ 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే ఒక సాధారణ యువకుడు 'చిరంజీవి'గా తన సినీ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అంటే ఈ రోజే. నేటితో ఆ చారిత్రాత్మక ఘట్టానికి సరిగ్గా 48 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక అత్యంత భావోద్వేగభరితమైన లేఖని పంచుకున్నారు.   1978 సెప్టెంబర్ 22న తాను నటించిన మొదటి చిత్రం 'ప్రాణం ఖరీదు' బాక్సాఫీస్ వద్ద విడుదలై, వెండితెరకు నటుడిగా పరిచయమయ్యానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. "ఆనాడు నేను పెట్టుకున్న 'చిరంజీవి' అనేది ఒక పేరు మాత్రమే, కానీ ఈ 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీరందరూ కురిపించిన అపారమైన ప్రేమతో అది నాకింటి పేరుగా, శాశ్వతమైన గుర్తింపుగా మారింది" అని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.   ఈ 48 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించానని, లెక్కలేని విజయాలను, ఎన్నో మైలురాళ్లను, ప్రతిష్టాత్మక పురస్కారాలు మరియు గౌరవాలను అందుకున్నానని తెలిపారు.  ఇది కుడా చదవండి: రాధకి ట్విస్ట్ ఇచ్చిన సోదరి అంబిక: ఆ 46 కోట్లు ఇవే!   150కి పైగా చిత్రాల్లో నటించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన చిరంజీవి, తన విజయాలన్నింటికంటే అభిమానులు తన గుండెల్లో ఇచ్చిన స్థానమే అత్యంత విలువైనదని కొనియాడారు.   తనలోని నటుడిని నమ్మి అవకాశాలిచ్చిన ప్రతిష్టాత్మక నిర్మాతలు, వైవిధ్యమైన పాత్రల్లో తనను ఆవిష్కరించిన దర్శకులు, సహ నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కొణిదెల శివశంకర వరప్రసాద్‌ను మెగాస్టార్ చిరంజీవిగా గుండెల్లో పెట్టుకుని, సొంత కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క అభిమానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ మెగా పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 48 ఏళ్ల మెగా ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.    
సెప్టెంబర్ 22, 1978. సరిగ్గా ఇదే రోజున 'ప్రాణం ఖరీదు' అనే ఒక సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఆరోజే తెలుగు తెరకు ‘చిరంజీవి’ అనే ఒక కొత్త తార పరిచయమయ్యారు. నేటితో ఈ అద్భుతమైన సినిమా వచ్చి సరిగ్గా 48 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కానీ, ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ, ఇప్పటికీ చాలామందికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. అసలు శివశంకర వరప్రసాద్ అనే ఒక సామాన్యమైన కుర్రాడు.. 'చిరంజీవి'గా మారిన ప్రయాణం ఒక సంచలనం. చెన్నై ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటన నేర్చుకుంటున్న రోజుల్లోనే, ఆయనలోని అపారమైన ప్రతిభను, విలక్షణమైన ముఖకవళికలను దర్శకుడు కె. వాసు గమనించారు. అప్పట్లో సి.ఎస్. రావు రాసిన ప్రముఖ నాటకం 'ప్రాణం ఖరీదు' ఆధారంగా ఒక సినిమా తీయాలని నిర్మాత క్రాంతి కుమార్ భావించారు. ఆ సినిమాలో 'నరసింహా' అనే ఒక ఛాలెంజింగ్ రోల్ కోసం కొత్త ముఖం కావాల్సి వచ్చింది. అలా చిరంజీవికి ఆ అవకాశం దక్కింది. ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. చిరంజీవి మొదట నటించిన సినిమా 'పునాదిరాళ్లు'. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. దానికంటే తర్వాత మొదలైన 'ప్రాణం ఖరీదు' సినిమానే ముందుగా విడుదలై చిరంజీవికి తొలి చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి డెడికేషన్ చూసి ఇండస్ట్రీ పెద్దలంతా ఆశ్చర్యపోయారు. క్లైమాక్స్ సీన్స్ కోసం ఆయన పడిన శ్రమ, చూపించిన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇది కూడా చదవండి: నా ఓటమిని కోరుకునే వారికి ఒకటే చెప్తున్నా.. నాని వైల్డ్ ఫైర్ స్పీచ్.! ఇక ఈ సినిమా కోసం చిరంజీవికి వచ్చిన తొలి పారితోషికం.. కేవలం ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు (రూ. 1116/-). ఆ చిన్న మొత్తంతో మొదలైన ప్రయాణం, ఆ తర్వాత దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర రంగాన్నే శాసించే స్థాయికి చేరింది అంటే దానికి కారణం ఆయన కష్టం, పట్టుదల. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ వంటి సీనియర్ నటీనటుల మధ్యలో.. తన ప్రత్యేకమైన మాడ్యులేషన్, నటనతో చిరంజీవి తన మార్కును స్పష్టంగా చూపించారు. 'ప్రాణం ఖరీదు' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. తెలుగు చిత్రసీమకు ఒక "మెగాస్టార్"ను బహుమతిగా ఇచ్చిన ఒక చారిత్రాత్మక చిత్రం. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు కూడా 'ప్రాణం ఖరీదు' సినిమాతోనే వెండితెరకు నటుడిగా పరిచయం కావడం విశేషం.  మీకు నచ్చవచ్చు:  ఒకే సినిమాలో ముగ్గురు మెగాస్టార్లు.. ఆ సినిమా కోసం ద‌ర్శ‌కేంద్రుడు చేసిన సాహసం ఇదే! ట్రిపుల్ రోల్: టాలీవుడ్‌లో తోపు యాక్టర్ ఎవరు?       [48 Years Of Pranam Khareedu, 48 Years For Pranam Khareedu, Pranam Khareedu Unknown Facts, Chiranjeevi First Remuneration, Chiranjeevi First Movie, Chiranjeevi Debut Movie, Megastar Chiranjeevi, Pranam Khareedu Movie, Telugu Film News, Telugu News]  
Megastar Chiranjeevi delivered an inspiring speech at the Mega Youth Force Meet, where a huge number of Mega Fans gathered for the event. Addressing the youngsters, Chiranjeevi stressed the importance of time management, positive thinking and believing in one’s dreams. Chiranjeevi said that many youngsters have big dreams but often remain directionless. “Believe in your dreams, stop wasting time and manifest positive outcome. Tell yourself that you’ve got it in you, observe what you lack and invest time in acquiring that knowledge, but not in negativity and wasting time,” he said. Speaking about his approach towards life, Chiranjeevi said he believes in positive manifestation and the power of time. “I trust in God and positive manifestation. I keep telling the universe that I deserve this and I am capable of handling it. This kind of manifestation is needed to not get bogged down by negative vices. Even if you’re an atheist, believe in nature and it will work for you as it did for me,” he remarked. Chiranjeevi also revealed that time management is one of the reasons behind his energy and punctuality even at his age. “If anyone loses time, it is not going to come back ever. If you waste even a second, you cannot earn it back. Time is Money and remember it always,” he said.  He added that his punctuality on the sets had even inspired director Bobby Kolli and his team to complete Kaaka as planned. He also revealed his character name as Kadiri Kalidas and promised that the KVN Productions-backed Sankranti release will be “KEKA” in theatres. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) మొదటి వరుసలో ఉంటుంది. వేపుడు, కుర్మా, ఫ్రైస్ లేదా సమోసాలు.. వంటకం ఏదైనా సరే ఆలూ ఉంటే ఆ రుచే వేరు. అయితే ఇల్లాళ్లకు, వంట ప్రియులకు నిత్యం ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టగానే అవి కొద్ది నిమిషాల్లోనే నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. అలా రంగు మారిన దుంపలను చూస్తే వంట చేయాలనే ఉత్సాహం తగ్గడమే కాకుండా, అవి పాడైపోయాయేమోననే అనుమానం కూడా వస్తుంది. సాధారణంగా ఉదయం పూట ఆఫీసులకు, పిల్లల స్కూల్ బాక్సులకు త్వరగా వంట పూర్తి చేయాలని ముందుగానే ఆలూ ముక్కలను కోసి పెట్టుకునే వారికి ఈ సమస్య మరింత చిరాకు కలిగిస్తుంది. అసలు బంగాళాదుంప ముక్కలు అంత వేగంగా ఎందుకు నల్లగా మారతాయి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మరియు అలా మారకుండా ఎల్లప్పుడూ తెల్లగా, ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడే కిచెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు నల్లగా మారడానికి ప్రధాన కారణం  ఎంజైమాటిక్ బ్రౌనింగ్  (Enzymatic Browning) అనే సహజమైన రసాయన చర్య. బంగాళాదుంపల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ (Polyphenol Oxidase) అనే ప్రత్యేకమైన ఎంజైమ్‌తో పాటు ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మనం దుంపను చాకుతో కోసినప్పుడు, దానిలోని కణాలు దెబ్బతిని లోపలి భాగం నేరుగా గాలిలోని ఆక్సిజన్‌తో స్పర్శలోకి వస్తుంది. ఈ ఆక్సిజన్, ఎంజైమ్‌లతో చర్య జరపడం వల్ల మెలనిన్ (Melanin) అనే నల్లటి వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. ఇదే ఆలూ ముక్కలు రంగు మారడానికి అసలు కారణం. ఈ మార్పు వల్ల రుచిలో పెద్దగా తేడా రాకపోయినా, చూడటానికి అస్సలు బాగుండవు. పైగా ఇలా గాలికి ఎక్కువసేపు ఉంచడం వల్ల అందులోని కొన్ని నీటిలో కరిగే పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మన వంటింట్లోనే దొరికే కొన్ని సులువైన పదార్థాలతో అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి  చల్లని నీటి చిట్కా . బంగాళాదుంపలను కోసిన వెంటనే గాలి తగలకుండా ఐస్ వాటర్ లేదా చల్లని నీళ్లు ఉన్న గిన్నెలో మునిగేలా వేయాలి. నీరు ఆక్సిజన్‌కు, ఆలూ ముక్కలకు మధ్య ఒక కవచంలా పనిచేసి ఆక్సీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది. నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల ముక్కలలో ఉండే అదనపు స్టార్చ్ బయటకు వచ్చి, ఫ్రైస్ చేసినప్పుడు అవి మరింత క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఎక్కువ సమయం అంటే 4 నుంచి 5 గంటల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, ఆ నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం లేదా కొద్దిగా తెల్ల వెనిగర్ (White Vinegar) కలపాలి. నిమ్మరసంలోని విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) మరియు వెనిగర్‌లోని అసిడిటీ ఎంజైమ్‌ల పనితీరును పూర్తిగా నిరోధించి ముక్కలు గంటల తరబడి తెల్లగా మెరిసేలా చేస్తాయి. మరొక అద్భుతమైన మార్గం  ఉప్పు నీటి శుద్ధి . ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి అందులో కోసిన బంగాళాదుంప ముక్కలను వేసి ఉంచడం వల్ల అవి రంగు మారవు. ఉప్పు నీరు ఎంజైమాటిక్ చర్యను మందగించేలా చేస్తుంది. అలాగే, వంటను మరుసటి రోజుకి ప్లాన్ చేసుకుంటుంటే, ముక్కలను నీటిలో వేసి గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 24 గంటల పాటు అవి ఏమాత్రం రంగు మారకుండా తాజాగా ఉంటాయి. ఒకవేళ మీరు ముక్కలను నీటిలో వేయకూడదు అనుకుంటే, వాటిపై కొద్దిగా వంటనూనె (Cooking Oil) రాసి గాలి తగలకుండా ఉంచవచ్చు. ఈ చిన్న చిన్న కిచెన్ హాక్స్ పాటించడం వల్ల వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, బంగాళాదుంపలతో చేసే ప్రతి వంటకం ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా మారుతుంది.     [ Potatoes, Potato Browning, Enzymatic Browning, Polyphenol Oxidase, Potato Storage, Kitchen Hacks, Prevent Potato Browning, Cold Water Soak, Lemon Juice, White Vinegar ]
మనం రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నప్పుడు లేదా నిమ్మకాయతో చేసిన వంటకాలను తింటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి పొరపాటున నిమ్మ విత్తనం (నిమ్మ గింజ) నోట్లోకి వెళ్లడం, దాన్ని అనుకోకుండా మింగేయడం మనందరికీ ఏదో ఒక సందర్భంలో జరిగే సాధారణ విషయమే. అయితే, అలా గింజ లోపలికి వెళ్లగానే చాలామందిలో ఒకరకమైన అపరిమితమైన భయం, ఆందోళన మొదలవుతాయి. చిన్నప్పుడు సరదాగా విన్నట్లు కడుపులో చెట్టు మొలుస్తుందేమోననే అమాయకపు ఆలోచన నుంచి, ఆ గింజ కడుపులోని ప్రేగుల్లో ఎక్కడైనా అడ్డుపడి తీవ్రమైన ప్రమాదానికి దారితీస్తుందేమోననే ఆరోగ్య భయాల వరకు మనస్సును ఎన్నో ప్రశ్నలు చుట్టుముడతాయి. కానీ, నిజంగానే మన జీర్ణవ్యవస్థలోకి నిమ్మ గింజ వెళ్లినప్పుడు మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది? దానివల్ల ఆరోగ్యానికి ఏమైనా ముప్పు ఉందా లేదా అనేది సైన్స్ ఆధారంగా క్షుణ్ణంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మన మానవ జీర్ణవ్యవస్థ చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. నిమ్మ గింజ పరిమాణం సాధారణంగా చాలా చిన్నదిగా, మృదువైన లేదా సులభంగా జారే ఆకారంలో ఉంటుంది. మనం దాన్ని మింగిన వెంటనే అది అన్నవాహిక గుండా ప్రయాణించి నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. మన జీర్ణాశయం (Stomach) లో అత్యంత శక్తివంతమైన హైడ్రోక్లోరిక్ ఆసిడ్ (HCl) ఉత్పత్తి అవుతుంది. ఈ ఆమ్లం జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నిమ్మ గింజ పైన గట్టి పొర (Seed Coat) ఉన్నప్పటికీ, కడుపులోని శక్తివంతమైన ఆమ్లాలు దాని తీవ్రతను తగ్గిస్తాయి. నిజానికి నిమ్మ గింజలు విషపూరితమైనవి కావు. వాటిలో సెల్యులోజ్ అధికంగా ఉంటుంది. మానవ శరీరం సెల్యులోజ్‌ను సంపూర్ణంగా అరిగించుకోలేకపోయినప్పటికీ, మన జీర్ణనాళం ఆ గింజను ఒక వ్యర్థ పదార్థంగా భావించి ప్రేగుల ద్వారా ముందుకు నెట్టివేస్తుంది. అనుకోకుండా ఒకటి లేదా రెండు నిమ్మ గింజలను మింగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని జరగదు. 99 శాతం సందర్భాల్లో ఈ గింజలు జీర్ణనాళం గుండా సురక్షితంగా ప్రయాణించి, మనకు తెలియకుండానే మలం రూపంలో శరీరం నుంచి బయటకు విసర్జించబడతాయి. వీటివల్ల కడుపులో చెట్లు మొలవడం అనేది కేవలం ఒక అపోహ మాత్రమే, ఎందుకంటే కడుపులోని ఆమ్ల వాతావరణం, ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఏ విత్తనం కూడా లోపల మొలకెత్తలేదు. పైగా, నిమ్మ గింజల్లో కొద్ది మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, సాలిసిలిక్ యాసిడ్ వంటి సహజ మూలకాలు ఉంటాయి. కాబట్టి పొరపాటున ఒక చిన్న గింజ పొట్టలోకి వెళ్లినా అది ఎటువంటి విషపూరిత రసాయనాలను విడుదల చేయదు. అయితే, కొన్ని అరుదైన మినహాయింపులను మనం ఖచ్చితంగా గమనించాలి. చాలా చిన్న పిల్లలు లేదా జీర్ణ సంబంధిత తీవ్ర సమస్యలు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో నిమ్మ గింజలను నమలకుండా మింగితే, అవి ప్రేగుల్లో అడ్డుపడే (Intestinal Obstruction) స్వల్ప అవకాశం ఉంటుంది. అలాగే, నిమ్మ గింజను మింగేటప్పుడు అది జీర్ణనాళానికి బదులుగా శ్వాసనాళంలోకి వెళ్తే (Aspiration) తీవ్రమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మింగిన తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, లేదా మింగడంలో ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. కానీ, సాధారణ పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు నిమ్మ గింజలను మింగడం వల్ల ఎలాంటి భయం అవసరం లేదు. మీ శరీరం దానిని సహజంగానే బయటకు పంపించేస్తుంది.     [ Lemon Seeds, Swallowed Lemon Seed, Digestive System, Stomach Acid, HCl, Seed Digestion, Intestinal Health, Aspiration Risk, Intestinal Obstruction, Health Myths ]  
మన భారతీయ సంప్రదాయ వంటకాల్లో నల్ల శనగలకు (నల్ల శనగలు / కాలా చనా) అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. గుడి ప్రసాదాల నుంచి ఉదయం పూట తినే మొలకెత్తిన విత్తనాల వరకు ప్రతికూల వాతావరణంలో సైతం శరీరానికి అపరిమితమైన శక్తిని ఇచ్చే సూపర్‌ఫుడ్‌గా నల్ల శనగలు నిలుస్తాయి. పోషకాల గనిగా పిలువబడే ఈ శనగలను మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి లభించే ఆరోగ్య ప్రయోజనాలు అపారం. మనలో చాలామంది చికెన్, మటన్ లేదా ఇతర నాన్ వెజ్ ఆహారాల ద్వారానే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందని భావిస్తుంటారు. కానీ, శాకాహారులకు అత్యధిక స్థాయిలో ప్రొటీన్ అందించే అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఈ నల్ల శనగలేనని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రోజూ ఒక గుప్పెడు నల్ల శనగలను నానబెట్టి లేదా ఉడకబెట్టి తినడం ద్వారా మన ఆరోగ్యంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. నల్ల శనగల్లో లభించే ప్రధానమైన పోషకం వృక్ష ఆధారిత ప్రోటీన్ (Plant based Protein) మరియు అధిక మొత్తంలో ఉండే పీచు పదార్థం (Dietary Fiber). నానబెట్టిన లేదా ఉడకబెట్టిన 100 గ్రాముల నల్ల శనగలను తీసుకుంటే అందులో సుమారు 15 గ్రాముల వరకు నాణ్యమైన ప్రోటీన్, దాదాపు 12 గ్రాముల పీచు పదార్థం లభిస్తాయి. ఇవి కండరాల బలానికి, శరీర కణాల పునర్నిర్మాణానికి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి నల్ల శనగలు ఒక అద్భుతమైన వరం లాంటివి. వీటిలో ఉండే సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్లు మరియు పీచు పదార్థం జీర్ణక్రియను మందగించేలా చేసి, కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఫలితంగా అకారణంగా కలిగే ఆకలి కోరికలు (Food Cravings) తగ్గి, క్యాలరీల వినియోగం నియంత్రణలోకి వస్తుంది. రెండవ అత్యంత కీలకమైన ప్రయోజనం మధుమేహం లేదా షుగర్ వ్యాధి నివారణ. నల్ల శనగల గ్లైసేమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా తక్కువ గ్లైసేమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒకేసారి పెంచకుండా, నిదానంగా శోషించబడేలా చేస్తాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా క్రమబద్ధీకరించబడతాయి. అంతేకాకుండా, నల్ల శనగలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో సమృద్ధిగా లభించే మెగ్నీషియం మరియు పొటాషియం రక్తపోటును సమతుల్యంలో ఉంచడానికి తోడ్పడతాయి. అలాగే, ఇందులో ఉండే కరిగే పీచు పదార్థం శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తొలగించడంలో సహాయపడి, గుండెపోటు మరియు పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా నల్ల శనగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణనాళంలో మంచి బాక్టీరియా పెరుగుదలకు దోహదపడి, ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక మలబద్ధకం, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు త్వరగా చెక్ పెట్టవచ్చు. ఇక మహిళల్లో మరియు పిల్లల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత (Anemia) సమస్యకు నల్ల శనగలు ఒక అద్భుతమైన సహజ నివారణి. వీటిలో ఐరన్ (L Iron) అధిక స్థాయిలో ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం వేగంగా పెరిగి, శరీరం రోజంతా ఉత్సాహంగా, చైతన్యవంతంగా ఉంటుంది. నిత్యం ఉదయాన్నే మొలకెత్తిన నల్ల శనగలను తినడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారు. ఇంతటి దివ్యమైన పోషకాలు ఉన్న నల్ల శనగలను ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం.     [ Chukkakura, Chukkakura Benefits, Sorrel Leaves, Vitamin A, Vitamin C, Iron Rich Foods, Eye Health, Immunity, Digestive Health, Heart Health ]  
క్రియాటినిన్ అంటే ఏమిటి? మన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో Creatinine Test, Creatinine Levels, Kidney Functionగురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ Dr. Sree Bhushan Raju, MD, Nephrology వివరంగా తెలియజేస్తున్నారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు, రిపోర్టులో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు.  క్రియాటినిన్ స్థాయి పెరగడానికి కిడ్నీ సమస్యలతో పాటు డీహైడ్రేషన్, కండరాలకు సంబంధించిన సమస్యలు, అధిక శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఒకసారి క్రియాటినిన్ ఎక్కువగా వచ్చిందని మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అని భావించకూడదు. అవసరమైన ఇతర పరీక్షలతో పాటు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యం, క్రియాటినిన్ స్థాయిలు, కిడ్నీ ఫిల్టరింగ్ సామర్థ్యం, గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్‌ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్‌ వాపు ఎలా ఉంటుంది? లింఫ్‌ నోడ్స్‌ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)