ప్రస్తుత రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు అన్నది రివాజుగా మారిపోయింది. ఉదయం  ఒక పార్టీ, సాయంత్రానికి మరో పార్టీ.. తెల్లారేసరికి మరో పరా్టీ అన్నట్లుగా రంగులు మార్చేయడం సర్వసాధారణమైపోయింది. ఇందులోంచే ఆయారం, గయారాం అన్న నానుడి పుట్టిందని చెప్పవచ్చు.  ఒక పార్టీ తరఫున చట్ట సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, తమను ఎన్నుకున్న ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా, నైతికత గురించి ఇసుమంతైనా సంకోచించకుండా రాత్రికి రాత్రి మరో పార్టీలోకి జంప్ జిలానీ అన్నట్లుగా దూకేస్తున్నారు.  దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు తాజాగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై పడిన అనర్హత వేటు.. మరో సారి రాజకీయాలలో పార్టీ ఫిరాయింపులు, నైతిక విలువలపై మరో సారి చర్చకు తెరలేపింది.  ఒక పార్టీ గుర్తుపై శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ, మరో పార్టీ తరఫున పోటీ చేయడంతో దానంపై అనర్హత వేటు పడింది. ఇది దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడే నేతలకు హెచ్చరిక అనడంలో సందేహంలేదు.  అయితే.. ఈ సందర్భంగా  కేవలం ఫిరాయింపులపైనే కాకుండా ఎన్నికల వ్యవస్థలోని గూడుకట్టుకుని పోయిన లోపాలు, లొసుగుల గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఎందుకంటే.. ప్రస్తుత ఎన్నికల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు  ఖరీదైన వ్యవహారంగా మారిపోయి.. సామాన్యుడికి భాగస్వామ్యం లేని తంతుగా తయారయ్యాయి. ఎన్నికలలో పోటీ చేయాలంటే..  ఎన్నివందల కోట్లు ఖర్చు పెట్టగలరు? అన్న ప్రశ్న ఎదుర్కోవలసి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.  ఎలాంటి ప్రలోభాలు లేకుండా నిష్పక్షపాతంగా ఓటు వేయాల్సిన ఓటర్లు సైతం డబ్బులు, వస్తువుల పంపిణీని ఆశించే స్థాయికి దిగజారేలా, కాదు కాదు దిగజార్చేలా ఎన్నికల తీరు మారిపోయింది.  నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్నవారు ఎన్నికల వ్యయాన్ని తట్టుకోలేక ఈ ప్రక్రియకు దూరం అవుతున్నారు.  మరోవైపు..  సాంకేతికత ఎన్నికల ప్రచార శైలిని పూర్తిగా మార్చేసింది. కార్పొరేట్ సంస్థలు, పెద్ద వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్ వ్యూహకర్తలు  రాజకీయాలను శాసించే పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడం మొత్తంగా వాతావరణాన్ని కలుషితం చేస్తోంది.  ఏఐ వంటి సాంకేతికతో నిజం, అబద్ధం మద్య గీత చెరిగిపోయినట్లైంది.    నేరచరిత్ర కలిగిన అభ్యర్థులు చట్టసభల్లోకి ప్రవేశిస్తున్నారనే విషయాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎప్పకటికప్పుడు నివేదికల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నా.. వాకిరి నిరోధించే యంత్రాంగం నిర్వీర్యమైపోయింది.  ఎన్నికల సంఘం  ప్రేక్షక పాత్రకే పరిమితమైపోయిన పరిస్థితి నెలకొంది.  ఈ పరిస్థితి మారకుండా,  చట్టసభల్లో అనర్హత వేటుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎన్నికల వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాల్సి ఉంది.  అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ఖర్చు  కట్టడి, ప్రలోభాలకు తెరదించడం లాంటి చర్యల ద్వారానే  ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లుతుంది.    [Defection, Danam Nagender Disqualification, Party Jump Leaders, AAyaram GayaRam, Election Expenses, Telugu One]
స్థానిక ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ  జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో  మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో  భేటీ కావడం పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేసింది.  ఈ భేటీ కేవలం మర్యాదపూర్వక సమావేశమే అని ఇటు వంగవీటి రాధా, అటు పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటికీ..రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ  రాజకీయాల్లో పట్టు సాధించే దిశగా కూటమి పార్టీలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చ జరిగిందని  అంటున్నారు. అలాగే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ ముచ్చటించుకున్నట్లు చెబుతున్నారు.  మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల  వేళ పవన్ కల్యాణ్, వంగవీటి రంగా భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ స్థానక సమరంలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.  [Pawan Kalyan, Vangaveeti Radha Krishna, AP Local Body Elections, Mangalagiri Camp office, Janasena Party, AP Politics, Telugu One]
తెలంగాణ రాజకీయ రంగంలో ప్రస్తుతం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక  హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో రాబోయే  ఉపఎన్నికలో కవిత బరిలోకి దిగనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత.. ఏకకాలంలో ఇటు రేవంత్ సర్కార్ ను, అటు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ వైఫల్యాలనూ ఎండగడుతున్నారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో కల్వకుంట్ల కవిత దిగితే రాజకీయం రసకందాయంలో పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ నియోజకవర్గంలో పాగా వేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.  వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగనున్నారన్న వార్త పొలిటికల్ గా సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగర పరిధిలో  ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ద్వారా కల్వకుంట్ల కవిత  రాజకీయాల్లో తన ప్రభావం చాటేందుకు రెడీ అయ్యారంటున్నారు.  అంతే కాకుండా కేసీఆర్ కుమార్తె కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిస్తే, ఈ ఉపఎన్నిక రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ప్రాధాన్యత సంతరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు, కుటుంబ రాజకీయాల నేపథ్యంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.  కవిత రంగంలోకి దిగడం అంటూ జరిగితే ఖైరతాబాద్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆమె అభ్యర్థిగా రంగంలో ఉంటే.. అధికార కాంగ్రెస్ కు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూ కూడా గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, ఆయా పార్టీల విజయావకాశాలపై ప్రభావం పడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Khairatabad Bypoll, Kavitha Kalvakuntla, Contest,  Danam Nagender disqualification, Telangana politics, Khairatabad assembly constituency, Telangana news, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Anirudh Ravichander is facing huge amount of criticism for his BGM for The Paradise. Interestingly, he is being blamed for bringing so much of hype and buzz for the film with his song, Aaya Sher. But he is continuing with his work for his upcoming biggie, Superstar Rajinikanth and Nelson's Jailer 2. First single, Ala Bolelo, did not really get the ball rolling as much as The Paradise songs or DC soundtracks. But it has been a popular track hanging around among charts. Now, he has come up with a fusion track to celebrate Rajini as One Moon One Sun and One Superstar. Going away from loud and energetic track like Hukum, Anirudh decided to infuse International slow melody beats and Indian classical making it a more personal statement. Looks like it fits the movie plot as there are many huge stars cast in the film as Jailer takes on a huge mafia network. So, this track is in a way, a reminder of Rajini's stardom and also the story being about one man inflicting chaos on this mafia. Sun Pictures are producing the film and it is releasing on 15th October. Vidya Balan, Suraj Venjaramoodu, SJ Suryah, Ramyakrishnan are cast in prominent roles with Hrithik Roshan, Vijay Sethupathy, Mohanlal, Shiva Rajkumar, Mithun Chakraborthy in cameo roles.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి ఇటీవల విడుదలైన ‘ఏందయ్యా సామి’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన బిహైండ్ ద సీన్స్ వీడియోను మేకర్స్ విడుదల చేయడంతో మరోసారి విజయ్–రష్మిక జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఏందయ్యా సామి’ పాటలో రణబాలి, జయమ్మ పాత్రల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, సరదాను అందంగా చూపించారు. ముఖ్యంగా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా రూపొందించిన పెళ్లి వేడుకలు, సంప్రదాయ వాతావరణం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పాట కోసం విజయ్, రష్మిక చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్, షూటింగ్ సమయంలో వారి మధ్య చోటుచేసుకున్న సరదా సన్నివేశాలను మేకింగ్ వీడియోలో చూపించారు. విజయ్, రష్మిక గతంలో కలిసి నటించిన సినిమాలతోనే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘రణబాలి’లో మరోసారి జంటగా కనిపిస్తుండటంతో వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీపై ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమా వీరిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ‘ఏందయ్యా సామి’ వీడియోలో కూడా వీరిద్దరి మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ‘రణబాలి’ కథ బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంతో సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించనుండగా.. రష్మిక ఆయన భార్య జయమ్మగా నటిస్తోంది. ఒకవైపు ప్రేమకథను చూపిస్తూనే మరోవైపు ఆ కాలం నాటి పరిస్థితులు, పోరాటాన్ని సినిమాలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘ఏందయ్యా సామి’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయ్, రష్మికల కెమిస్ట్రీతో పాటు పాటలో కనిపించే పీరియడ్ వాతావరణం కూడా ఆకట్టుకుంటోంది. ఇక భారీ అంచనాల మధ్య ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదలైన BTS వీడియోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగినట్టే కనిపిస్తోంది.     [Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabaali, Ranabaali Movie, Endhayya Saami, Endhayya Saami Song, Vijay Rashmika Ranabaali, Vijay Deverakonda Rashmika Mandanna, Ranabaali BTS Video, Endhayya Saami BTS, Rahul Sankrityan, Ranabaali Release Date, Vijay Deverakonda Upcoming Movie, Rashmika Mandanna Movies, Tollywood News, Telugu Cinema]  
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ వచ్చేసింది. 'కల్కి 2898 AD' నేషనల్ అవార్డుల వేదికపై సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే, ఈ శుభసమయంలోనే మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్‌తో రాబోతున్న ‘కల్కి పార్ట్ 2’ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై దర్శకుడు నాగ్ అశ్విన్ బిగ్ అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ వచ్చే అక్టోబర్ నెల నుంచే 'కల్కి 2' రెగ్యులర్ షూటింగ్ చాలా వేగంగా ప్రారంభం కాబోతోంది. డార్లింగ్ ప్రభాస్ కూడా సెట్స్‌లో అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ టీమ్ చాలా పక్కా ప్లానింగ్‌తో మూవ్ అవుతోంది. క్లియర్ టార్గెట్‌తో 2027 మిడ్ నాటికల్లా సెకండ్ పార్ట్ షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలని రంగం సిద్ధం చేశారు. మొదటి భాగం హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్, వరల్డ్ క్లాస్ విజువల్ ఎఫెక్ట్స్, సైన్స్ ఫిక్షన్ విత్ ఇండియన్ మైథాలజీ మిక్సింగ్‌తో ప్రేక్షకుల మనసులను విపరీతంగా దోచుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఆ విజువల్స్ మంత్రముగ్ధులను చేశాయి.  ఇప్పుడు అదే అంచనాలను మరింత నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడానికి నాగ్ అశ్విన్ అండ్ టీమ్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. సెకండ్ పార్ట్‌లో వరల్డ్ క్లాస్ విజువల్స్ మాత్రమే కాదు, కంబైన్డ్ వరల్డ్‌ను విస్తరిస్తూ బిగ్గెస్ట్ మైథాలాజికల్ విజువల్ వండర్‌ను ఆవిష్కరించబోతున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి బిగ్ స్టార్స్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి వార్ ఇంకా పెద్దదిగా, ప్రొడక్షన్ వేల్యూస్ అంతకుమించి ఉండబోతున్నాయి. ఇది కూడా చదవండి: ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పిరిట్ పరిస్థితి ఏంటి.?       [Kalki 2 Shooting Update, Kalki 2 Shooting Starts in October, Kalki Part 2 Shoot Update, Kalki 2898 AD Sequel, Prabhas Kalki 2 Update, Nag Ashwin Kalki Part 2, Kalki 2898 AD Part 2, Telugu Film News, Telugu News]
  ఎంత షో చేస్తూ ఉన్న హారతి కర్పూరంలా వయసు కరిగిపోతుందనేది ఎంత నిజమో, నటీమణుల సినీ వయసు కూడా కరిగిపోతుందనేది అనే నిజం. అందుకు ఇప్పుడు ఆద్యులుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్, కరీనా కపూర్ నిలిచారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యం వహించి, తమ అభినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకున్నారు ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ ఖాన్‌ల సినిమా కెరీర్ ఇప్పుడు తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు వీరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేవి, అయితే ప్రస్తుతం వీరి కెరీర్ ఫేడవుట్ దిశగా అడుగులు వేస్తోందా అనే సందేహాలు సినీ విశ్లేషకుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా  ఐశ్వర్యరాయ్ బచ్చన్ పరిస్థితిని పరిశీలిస్తే, ఆమె గత కొన్నేళ్లుగా కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేయకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ 2' దాదాపు 345 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి భారీ విజయంగా నిలిచినప్పటికీ, ఆ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఐష్ మరే ఇతర కొత్త ప్రాజెక్ట్‌ను కూడా అధికారికంగా ప్రకటించలేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంటి కోడలయ్యాక అత్యంత జాగరూకతతో కథలను ఎంచుకుంటూ వచ్చిన ఐశ్వర్య, ప్రస్తుతం కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో మెరవడం లేదా వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపార ప్రకటనలకే పరిమితమయ్యారని విశ్లేషణలు చెబుతున్నాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ నుంచి కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే వార్తల్లో నిలవడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఇది కూడా చదవండి: గ్లామర్ రోల్స్ నుంచి రియల్ లైఫ్ లెజెండ్స్ వైపు: హీరోయిన్ జిందాబాద్!   మరోవైపు బాలీవుడ్ బెబో కరీనా కపూర్  కెరీర్ గ్రాఫ్ కూడా ఆశించిన స్థాయిలో సాగడం లేదనేది తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వివాహం, ఇద్దరు పిల్లల జన్మ తర్వాత కూడా వరుస అవకాశాలతో దూసుకుపోయిన కరీనాకు, ఇటీవల థియేటర్లలో మినిమం వసూళ్లు రాబట్టడం కూడా అత్యంత క్లిష్టంగా మారింది. ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ దర్శకత్వంలో, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలసి కరీనా  తాజా చిత్రం 'దాయ్రా' బాక్సాఫీస్ వద్ద ఘోర డిజాస్టర్‌గా మిగిలింది. దాదాపు  50 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కనీసం 20% రికవరీ కూడా సాధించలేక డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీనికంటే ముందు వచ్చిన 'ది క్రూ' సాధించిన వసూళ్లను పక్కన పెడితే, సోలో లీడ్‌గా కరీనా మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.   ఈ పరిస్థితికి కేవలం ఫ్లాప్‌లు మాత్రమే కారణం కాదని, పరిశ్రమలోని కొత్త మార్పులు కూడా ఒక ముఖ్య కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.    చిత్రసీమలోకి కొత్త తరం కథానాయికల రాక పెరగడం, వయస్సుకు తగ్గ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో సీనియర్ హీరోయిన్లు వెనుకబడడం కూడా వీరికి అవకాశాలు తగ్గడానికి దోహదం చేస్తున్నాయి. సాధారణంగా సీనియర్ బ్యూటీలు ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో ముందుకు రావాల్సి ఉంటుంది, కానీ వీరి మార్కెట్ పరిధి క్రమంగా తగ్గుతుండడంతో నిర్మాతలు 30 నుండి  50 కోట్ల  బడ్జెట్‌ పెట్టేందుకు సైతం ముందుకు రావడం లేదు. ఈ విధమైన పరిణామాల మధ్య ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ వంటి సీనియర్ తారలు తమ సెకండ్ ఇన్నింగ్స్‌ను మళ్లీ ఎలా నిర్మించుకుంటారో వేచి చూడాల్సిందే! ఏది ఏమైనా కాశ్మిరీ యాపిల్ కంటే అందమైన సోయగం, సొగసుతో బాలీవుడ్ ని ఏలిన మాట వాస్తవం.  
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో మహేశ్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లు సమాచారం. దీంతో ఇక డబ్బింగ్, సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో పాల్గొనడం వంటి పనులు మాత్రమే ఆయనకు మిగిలినట్లు తెలుస్తోంది. అయితే ‘వారణాసి’ షూటింగ్ పూర్తవుతున్న సమయంలోనే మహేశ్ బాబు తదుపరి సినిమా ఏంటి? అనే చర్చ మొదలైంది. సాధారణంగా ఒక సినిమా పూర్తయ్యే సమయానికి తన తర్వాతి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసుకునే మహేశ్.. ఈసారి మాత్రం కాస్త ఎక్కువ సమయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ‘వారణాసి’ తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో మరింత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి రావడమేనని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘వారణాసి’ భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో, ఈ సినిమా తర్వాత మహేశ్ చేసే ప్రాజెక్ట్‌పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా, అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కథ, దర్శకుడు, ప్రాజెక్ట్ స్కేల్ విషయంలో ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహేశ్ తదుపరి సినిమా కోసం పలువురు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా పేరు ప్రధానంగా చర్చలో ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ‘యానిమల్ పార్క్’ పనుల్లోకి వెళ్లాల్సి ఉంది. దీంతో వెంటనే మహేశ్‌తో సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చనే టాక్ ఉంది. మరోవైపు సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ వంటి దర్శకులు కూడా తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో మహేశ్‌కు సరిపోయే భారీ స్థాయి ప్రాజెక్ట్‌ను వెంటనే ప్రారంభించడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అనిల్ రావిపూడి సహా పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపించినప్పటికీ, ప్రస్తుతం అధికారికంగా ఏ ప్రాజెక్ట్ ఖరారైనట్లు ప్రకటన లేదు. అనిల్ రావిపూడితో మరో సినిమా అంటూ వచ్చిన వార్తలను ఆయనే గతంలో ఖండించారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో మహేశ్ బాబు సినిమా చేయబోతున్నారనే ప్రచారం కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. భన్సాలీ మహేశ్‌ను కలిసి కథ గురించి చర్చించినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దీంతో మహేశ్ బాబు తన తదుపరి సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారు? ఎవరితో సినిమా చేస్తారు? అనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారు కాలేదనే చెప్పాలి.       [Mahesh Babu, Mahesh Babu Next Movie, Mahesh Babu Next Film, Mahesh Babu Varanasi, Varanasi Movie, Mahesh Babu Upcoming Movies, Mahesh Babu Latest News, SS Rajamouli Varanasi, Mahesh Babu Sandeep Reddy Vanga, Mahesh Babu Sanjay Leela Bhansali, Mahesh Babu New Movie, Tollywood News, Telugu Cinema, Mahesh Babu Movies]
Tamil Zee 5 continues its winning streak by bringing audiences some of the most celebrated blockbusters featuring India's biggest superstars. Following the phenomenal response to Jananayagan, the platform is now gearing up to premiere Hi, starring Nayanthara and Kavin, an unconventional yet heartwarming romance that offers a fresh perspective on modern relationships. With Nayanthara and Kavin leading the cast, Hi delivers a heartwarming and emotionally resonant take on modern-day relationships. The film brings together the unexpected pairing of two powerhouse performers, whose crackling on-screen chemistry adds a unique charm to the narrative. While Nayanthara effortlessly embodies a strong, independent woman with conviction and grace, Kavin wins hearts as a sincere and endearing young man whose vulnerability makes him instantly relatable. Their performances complement each other beautifully, creating characters that feel authentic and memorable. Directed by Vishnu Edavan, the film follows a young man who refuses to give up on finding love despite heartbreak and rejection, and a young woman grappling with family challenges while trying to escape an unwanted marriage. When their paths cross, they embark on a heartfelt journey of love, acceptance, and self-discovery. Hi is further elevated by the presence of celebrated Tamil cinema veterans Radhika Sarathkumar, the late actor K. Bhagyaraj, and Prabhu, whose impactful performances add emotional depth to the narrative. The film also marks one of the final on-screen appearances of the legendary filmmaker, actor, and writer K. Bhagyaraj, making it a particularly special and memorable addition to the film's legacy. Through its refreshing narrative and relatable characters, Hi captures the fears and aspirations of a generation navigating love and relationships in an ever-evolving world. With a heartfelt storytelling, the film offers a deeply resonant viewing experience that is poised to strike a chord with audiences across age groups. Lloyd C. Xavier, Business Head – Tamil, Telugu & Malayalam, Zee 5, said “At Tamil Zee 5, we are focused on curating a diverse slate of stories that offer audiences meaningful and memorable viewing experiences. Hi is a wonderful addition to our growing movie library, bringing together an exceptional ensemble cast led by Nayanthara and Kavin, a refreshing narrative, and emotions that resonate long after the credits roll. While contemporary in its setting and themes, the film carries a warmth and simplicity that make it an immensely comforting watch. What makes Hi stand out is its ability to tell a modern relationship story with sincerity and humour, while remaining accessible to audiences across age groups. We are delighted to premiere Hi exclusively on Tamil Zee 5 and are confident that audiences will embrace it as a feel-good film that they will want to revisit time and again.” Speaking about Hi, Nayanthara said, “The character I play in Hi is someone who is independent, resilient, and deeply grounded in her convictions, yet she carries her own fears and emotional complexities. That balance of strength and vulnerability is what made the role so meaningful to me. She is protective of the people she loves, thoughtful in her choices, and someone who learns that opening her heart can be both challenging and beautiful." She further said, "Hi is very close to my heart because it tells a deeply relatable story about love in today’s world. It explores how two people, despite their differences, insecurities, and fears, come together in search of acceptance and companionship. The film beautifully captures the inner conflicts we face, as well as the pressures and expectations that often come from family while navigating relationships, which is what makes it feel so authentic and universal. Working with Vishnu Edavan was a wonderful experience, as he brought great sensitivity and honesty to the storytelling. It was also incredibly rewarding to share this journey with such an exceptional ensemble of co-stars, whose performances and camaraderie added so much heart to the film. I believe audiences will see parts of themselves in these characters and connect with the warmth, honesty, and hope that the story offers. I’m excited for viewers to watch Hi on Tamil Zee 5 and experience this heartfelt journey for themselves.” Kavin said, “What I loved most about Hi was that it gives us a male protagonist who is unapologetically vulnerable, emotionally honest, and unafraid to wear his heart on his sleeve. In a world where men are often expected to hide their emotions, my character embraces them, making him incredibly real and relatable. He is a young man navigating love, rejection, self-doubt, and the fear of not being enough, all while holding on to the hope of finding a meaningful connection." "What makes the story special is that it captures the emotional highs and lows of relationships with authenticity and warmth. The journey my character goes through, the choices he makes, and the struggles he faces to win over the woman he loves are things many young people will connect with. Director Vishnu Edavan has crafted a beautiful, heartfelt film that balances romance, humour, and emotion effortlessly. Jen Martin’s soulful music and evocative background score further elevate the narrative, while the chartbuster ‘Rasagulla’ created a sensation among audiences, with its infectious energy and catchy melody making it a song that everyone loved to vibe to. The love and appreciation that Hi has already received means a lot to all of us, and I’m thrilled that even more viewers will now get to experience this special story on Tamil Zee 5," concluded Kavin. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో విజయ్ దేవరకొండ, సుకుమార్ జోడీ కూడా ఒకటి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. అయితే అనౌన్స్‌మెంట్ వచ్చి చాలా కాలం గడిచినా ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా పూర్తిగా పక్కకు వెళ్లిపోయిందా? అనే చర్చ మళ్లీ మొదలైంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘రణబాలి’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన్’లోనూ విజయ్ నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా కనిపించనున్నారు. వీటితో పాటు ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా విజయ్ లైన్‌లో పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ఇలా విజయ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో సుకుమార్‌తో చేయాల్సిన సినిమాకు డేట్స్ కేటాయించడం ఇప్పట్లో కష్టమనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ‘పుష్ప’, ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో మరింత బిజీ అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేయనున్న తదుపరి ప్రాజెక్ట్‌పై ఆయన దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం సుకుమార్ స్క్రిప్ట్‌ను మరింతగా సిద్ధం చేస్తున్నట్లు గతంలోనూ వార్తలు వచ్చాయి. ఇక విజయ్–సుకుమార్ సినిమా విషయంలో అసలు సమస్య ఏంటనేది మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. సినిమా పూర్తిగా రద్దయిందని చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అదే సమయంలో త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పే అధికారిక సమాచారం కూడా లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో ఉందా? లేక భవిష్యత్తులో మళ్లీ పట్టాలెక్కుతుందా? అనేది సస్పెన్స్‌గానే ఉంది. వాస్తవానికి ఈ కాంబినేషన్ ప్రకటించిన సమయంలోనే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సుకుమార్ తనదైన టేకింగ్, విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ కలిస్తే సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి అప్పట్లో ఎక్కువగా కనిపించింది. కానీ ఇద్దరి కెరీర్‌లోనూ వచ్చిన మార్పులు, కొత్త ప్రాజెక్టులు, షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు విజయ్ ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో ఆయన ఇతర సినిమాలపై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ కూడా తన తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ–సుకుమార్ సినిమా ఇప్పట్లో ప్రారంభం కాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా పూర్తిగా రద్దయిందని ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని ‘షెల్వ్ అయింది’ అని ఖచ్చితంగా చెప్పడం కంటే.. ప్రాజెక్ట్ భవిష్యత్తుపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పడం సరైనది. ఒకవేళ భవిష్యత్తులో విజయ్, సుకుమార్ ఇద్దరి షెడ్యూల్స్ కుదిరితే ఈ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.     [Vijay Deverakonda, Sukumar, Vijay Deverakonda Sukumar Movie, Vijay Sukumar Movie, Vijay Deverakonda Next Movie, Sukumar Next Movie, Vijay Deverakonda Latest News, Sukumar Latest News, Vijay Deverakonda Upcoming Movies, Sukumar Ram Charan Movie, Tollywood News, Vijay Deverakonda Films, Sukumar Movies]
ఏదో అనుకుంటాం గాని హీరోయిన్ గా అభిమానులు, ప్రేక్షకులని మెప్పించేలా యాక్టింగ్ చెయ్యాలంటే నరం తెగుద్ది. ప్రెజెంట్ చాలా సినిమాల్లో   అందచందాలు,నాలుగైదు పాటలకే పరిమతమైనా కూడా అదే పరిస్థితి. కానీ రానురానూ ట్రెండ్ వేగంగా మారుతోంది. ప్రేక్షక దేవుళ్ళే  ఇందుకు కారణమనుకోండి.  కేవలం కమర్షియల్ పాత్రలు లేదా 100 శాతం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తమలోని అసలైన నటనను బయటకు తీసేందుకు నేటి నాయికలు సరికొత్త బాటలు వేస్తున్నారు.  నిజ జీవిత  చారిత్రక నారీమణులు మరియు బయోపిక్‌లలో రియల్ లైఫ్ లెజెండ్స్ పాత్రలను పోషించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథ, వారి ధైర్యమైన నిర్ణయాలు ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారాయి.     బయోపిక్‌ల వైపు అడుగులు వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అక్కడ కేవలం మేకప్, స్టైలిష్ దుస్తులు పనిచేయవు. ఒక వాస్తవ వ్యక్తి జీవన శైలిని, వారి భావోద్వేగాలను, ప్రవర్తనను తెరపై 100 శాతం ఆవిష్కరించాల్సి ఉంటుంది. సావిత్రి బయోపిక్ మahanati చిత్రంలో కీర్తి సురేష్ నటనతో నేషనల్ అవార్డు సాధించి 100కు 100 మార్కులు కొట్టేసిన తీరు ఇందుకు నిదర్శనం. గతంలో 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్ ఉన్న భారీ కమర్షియల్ సినిమాల్లో కేవలం గ్లామర్ డాల్‌గా కనిపించిన నటీమణులు సైతం, ఇప్పుడు బయోపిక్‌లలో లేదా రియల్ లైఫ్ రోల్స్‌లో నటించి తమ సత్తా చాటుతున్నారు. దాదాపు 80 శాతానికి పైగా భావోద్వేగాలు, 100 శాతం సహజత్వంతో కూడిన పాత్రలను ఎంచుకోవడం వల్ల వారి మార్కెట్ వాల్యూ పెరగడమే కాకుండా, నటిగా సినీ చరిత్రలో వారి స్థానం చిరస్థాయిగా నిలిచిపోతోంది.ఈ మార్పుకు ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచి మారడమే. ప్రస్తుతం కేవలం 3 లేదా 4 పాటల్లో వచ్చి వెళ్లే హీరోయిన్ పాత్రల కంటే, కథను మలుపు తిప్పే బలమైన నటన ఉన్న పాత్రలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌత్ మరియు నార్త్ చిత్రసీమలో దాదాపు 60 శాతం మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు తమ కెరీర్ ప్లానింగ్‌లో కనీసం ఒక్క బయోపిక్ లేదా రియల్ స్టోరీ ఆధారిత సినిమా ఉండేలా చూసుకుంటున్నారు.  ఇది కూడా చదవండి: తమన్నా, కియారా అద్వానీ భర్తకి షాక్: ఫ్యాన్స్ నిర్ణయమేంటి! కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడానికి ఇది సరైన రూట్ అని వారు విశ్వసిస్తున్నారు. అందంతో పాటు అభినయంతో మెప్పించినప్పుడే సుదీర్ఘ కాలం పరిశ్రమలో నిలబడగలమనే నిజాన్ని వీరు గ్రహించారు.అంతేకాకుండా, రియల్ లైఫ్ లెజెండ్స్ పాత్రలు చేయడం వల్ల నటీమణులపై దర్శక నిర్మాతలకు ఉన్న అంచనాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు పారితోషికం విషయంలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఇటువంటి పవర్ ఫుల్ పాత్రలతో నాయికలు తమ బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంటున్నారు. రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ పొందే స్థాయిలో తమ డిమాండ్‌ను పెంచుకుంటూ, లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. గ్లామర్ పాత్రల మెరుపులు తాత్కాలికమే కానీ, రియల్ లైఫ్ లెజెండ్స్ పాత్రలు అందించే కీర్తి శాశ్వతమని నిరూపిస్తూ టాలీవుడ్, బాలీవుడ్ భామలు ముందుకు సాగుతున్నారు.మారిన ఈ ఆలోచనా దృక్పథం వల్ల పరిశ్రమలో మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్క్రీన్ ప్రెజెన్స్ 20 నిమిషాలు ఉన్నా సరే, అది గుర్తుండిపోయే పాత్ర కావడం ముఖ్యమని వారు భావిస్తున్నారు. గ్లామర్ గ్లాస్ సీలింగ్‌ను బద్దలు కొడుతూ, నిజ జీవిత కథానాయికలుగా మారి వెండితెరపై వారు చూపిస్తున్న విక్రమ విన్యాసాలు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. భావోద్వేగాలు, పోరాట పటిమ, నటనలోని పరిణతితో వీరు వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్ తరం హీరోయిన్లకు ఒక దిశా నిర్దేశంగా నిలుస్తున్నాయి. ఏది ఏమైనా హీరోయిన్ జిందాబాద్ అనే రోజులు రావడం సినీ శుభసూచికం.       [Glamour Roles To Real life Legends, Heroine, Heroines real life roles. Tollywood actresses biopics, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధానమైన సౌందర్య మరియు ఆరోగ్య సమస్య జుట్టు రాలడం. ప్రతిరోజూ నిద్రలేచింది మొదలు దువ్వెన పట్టుకుంటే గుప్పెడు జుట్టు చేతికి రావడం, లేదా స్నానం చేస్తున్నప్పుడు కుళాయి దగ్గర కుప్పలుగా జుట్టు రాలిపోవడం చాలామందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సాధారణంగా ఒక మనిషికి రోజుకు 50 నుండి 100 వెండ్రుకలు రాలడం అనేది సహజమైన ప్రక్రియే అయినప్పటికీ, అంతకంటే ఎక్కువ మోతాదులో విపరీతంగా రాలిపోతుంటే మాత్రం దానిని తీవ్రమైన హెచ్చరికగా భావించాలి. మారుతున్న జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత మరియు రసాయనాలతో కూడిన షాంపూల వాడకం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి ఊడిపోతుంటాయి. ఈ జుట్టు రాలే సమస్యకు ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మరియు కెమికల్ ట్రీట్‌మెంట్లు తాత్కాలిక పరిష్కారాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ ఆయుర్వేదం చెప్పిన సహజసిద్ధమైన పద్ధతులు జుట్టును కుదుళ్ల నుండి దృఢంగా మార్చి రాలడాన్ని అరికడతాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో మరియు కొత్త వెంట్రుకల ఎదుగుదలను ప్రోత్సహించడంలో ఆయుర్వేదంలో  భృంగరాజ్  లేదా గుంటగలగర ఆకు ప్రథమ స్థానంలో నిలుస్తుంది. భృంగరాజ్ ఆకుల రసాన్ని లేదా తైలాన్ని తలకు క్రమం తప్పకుండా పట్టించడం వల్ల తలమాడుకి (Scalp) రక్తప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల కేశాల కుదుళ్లకు అవసరమైన పోషకాలు లభించి జుట్టు ఊడటం తక్షణమే తగ్గుతుంది. అలాగే మన ఇళ్లల్లో సులభంగా దొరికే మందార పూలు మరియు మందార ఆకులు జుట్టు సంరక్షణకు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. మందార రేకులు మరియు ఆకులను మెత్తగా నూరి పేస్ట్‌లా చేసి తలకు మాస్క్‌లా వేసుకుంటే, అందులోని అమైనో యాసిడ్లు, విటమిన్ సీ కుదుళ్లను బలోపేతం చేసి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా పెరిగేలా చేస్తాయి. ఆయుర్వేదంలో అమృతంగా భావించే ఆమ్లా లేదా ఉసిరికాయ జుట్టు ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉసిరిలో విటమిన్ సీ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో మరిగించి తయారుచేసిన నూనెతో వారానికి రెండుసార్లు తలకు మసాజ్ చేయడం వల్ల తలమాడుపై ఉన్న పొడిబారిన తత్వం మరియు చుండ్రు శాశ్వతంగా నివారించబడతాయి. అలాగే కుంకుడుకాయలు, సీకాకాయ్ మిశ్రమంతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకల సహజమైన తత్వానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కెమికల్స్ లేని స్వచ్ఛమైన క్లీన్సింగ్ లభిస్తుంది. కేవలం బాహ్య సంరక్షణ మాత్రమే కాకుండా, ఆహారంలో సైతం తగిన మార్పులు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతిరోజూ ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్ మరియు జింక్ ఎక్కువగా ఉండే కరివేపాకు, బాదం, నువ్వులు, మొలకెత్తిన విత్తనాలు మరియు ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు అంతర్గతంగా బలపడతాయి. మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి 40 శాతానికి పైగా కారణమవుతుంది కాబట్టి, రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఈ ఆయుర్వేద నియమాలను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే విపరీతమైన జుట్టు రాలడానికి చెక్ పెట్టి ఒత్తైన, నల్లని, దృఢమైన కేశాలను మీ సొంతం చేసుకోవచ్చు.     [ Hair Fall, Hair Growth, Bhringraj, Hibiscus, Amla, Ayurvedic Hair Care, Scalp Health, Dandruff, Hair Nutrition, Stress Management ]  
తీరిక లేని ఆధునిక జీవనశైలిలో మనలో చాలామంది సమయాభావం వల్ల లేదా అలవాటు ప్రకారం భోజనం చేసిన వెంటనే స్నానానికి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు, కళాశాలలకు త్వరత్వరగా వెళ్లే క్రమంలో లేదా రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వచ్చి భోజనం ముగించిన వెంటనే శరీరం చల్లబడటానికి స్నానం చేయడం చాలా ఇళ్లల్లో సాధారణ దృశ్యంగా మారింది. అయితే, ఈ చిన్న అలవాటు మన జీర్ణవ్యవస్థపై మరియు మొత్తం ఆరోగ్యంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల శరీరంలో అంతర్గతంగా జరిగే జీవక్రియల సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని ఆయుర్వేద శాస్త్రంతో పాటు ఆధునిక వైద్య నిపుణులు కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు. మనం ఆహారాన్ని స్వీకరించిన వెంటనే మన శరీరం దానిని జీర్ణం చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని  జఠరాగ్ని  లేదా జీర్ణశక్తి అని పిలుస్తారు. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవ్వడానికి కడుపులోని పాచక రసాలు మరియు ఎంజైమ్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. దీని కోసం మన గుండె పొట్ట, ప్రేగుల భాగాలకు రక్తప్రసరణను గణనీయంగా పెంచుతుంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత శరీరంలోని రక్తంలో దాదాపు 70 శాతం వరకు జీర్ణవ్యవస్థ వైపు మళ్లించబడుతుంది. దీనివల్ల కడుపు భాగంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఈ ఉష్ణోగ్రతే ఆహారాన్ని వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. అయితే, భోజనం ముగించిన వెంటనే మనం స్నానం చేసినప్పుడు శరీరంలో ఒక రకమైన థర్మల్ షాక్ లేదా ఉష్ణోగ్రత వైరుధ్యం ఏర్పడుతుంది. మన శరీరంపై నీరు పడగానే, చర్మం యొక్క ఉష్ణోగ్రత హఠాత్తుగా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో శరీరం తన బాహ్య చర్మ ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడం కోసం లేదా చలిని తట్టుకోవడం కోసం కడుపు భాగంలో ఉన్న రక్తాన్ని చేతులు, కాళ్లు మరియు చర్మం ఉపరితలానికి వేగంగా తరలిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థకు అందాల్సిన రక్తప్రసరణ హఠాత్తుగా తగ్గిపోతుంది. దీనివల్ల కడుపులో ఉన్న జఠరాగ్ని చల్లబడి, ఆహారం జీర్ణమయ్యే వేగం 50 శాతం కంటే ఎక్కువ మందగిస్తుంది. ఇలా జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల కడుపులో ఆహారం సరిగ్గా అరగక ఉండిపోతుంది. దీనివల్ల తీవ్రమైన కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ (కడుపులో మంట), మరియు అజీర్తి వంటి సమస్యలు తక్షణమే తలెత్తుతాయి. అంతేకాకుండా, జీర్ణం కాని ఆహారం ప్రేగులలో ఎక్కువ సమయం నిల్వ ఉండటం వల్ల అది పులిసిపోయి శరీరంలో విషపదార్థాలు (ట్రాక్సిన్లు) విడుదలవడానికి కారణమవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలికంగా మలబద్ధకం, కడుపులో అల్సర్లు మరియు జీర్ణకోశ వ్యాధులకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం చేసినా లేదా చల్లటి నీటితో స్నానం చేసినా ఈ ప్రమాదం వర్తిస్తుంది. చల్లటి నీటి స్నానం రక్తనాళాలను సంకోచింపజేస్తే, వేడి నీటి స్నానం రక్తనాళాలను విస్తరింపజేసి రక్తాన్ని చర్మానికి ఎక్కువ మళ్లిస్తుంది. వైద్య నిపుణుల సలహా ప్రకారం, భోజనం చేసిన తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు స్నానం చేయకుండా ఆగడం చాలా ముఖ్యం. ఈ సమయం జీర్ణక్రియ ప్రాథమిక దశ పూర్తికావడానికి మరియు రక్తం కడుపు భాగంలో సక్రమంగా పనిచేయడానికి సరిపోతుంది. ఒకవేళ మీరు తప్పనిసరిగా స్నానం చేయాలనుకుంటే, స్నానం చేసిన తర్వాతే భోజనం చేయడం అత్యంత శ్రేయస్కరం. స్నానం చేసినప్పుడు శరీరం ఉత్తేజితమై, జీర్ణక్రియకు సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలంటే మరియు గుండెపై అనవసర ఒత్తిడి పడకుండా ఉండాలంటే భోజనం తర్వాత వెంటనే స్నానం చేసే అలవాటును ఇప్పుడే మానుకోండి.     [ Bath After Eating, Digestion, Digestive Health, Ayurveda, Jatharagni, Blood Circulation, Acid Reflux, Indigestion, Bloating, Healthy Habits ]
నేటి ఆధునిక ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా నాన్  వెజ్ ప్రియులు ప్రతిరోజూ తమ ఆహారంలో మాంసాహారాన్ని భాగం చేసుకుంటున్నారు. అయితే,  మాంసాహారం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా.  అనే ప్రశ్న చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అంతర్జాతీయ నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు క్యాన్సర్ పరిశోధనా సంస్థలు జరిపిన సమగ్ర అధ్యయనాలలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. రోజూ తీసుకునే మాంసాహార రకం, దానిని వండే పద్ధతి మరియు తీసుకునే మోతాదు ఆధారంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు మారుతాయని ఈ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) నివేదికల ప్రకారం, ప్రాసెస్ చేసిన మాంసం (Processed Meat) అంటే హామ్‌స్, సాసేజ్‌లు, బెకన్, హాట్ డాగ్స్ వంటి వాటిని  గ్రూప్ 1 కార్సినోజెన్  (Group 1 Carcinogen) గా వర్గీకరించారు. అంటే ధూమపానం లేదా పొగాకు వాడకం లాగే ప్రాసెస్డ్ మీట్ కూడా మానవులలో క్యాన్సర్‌కు స్పష్టమైన కారణమవుతుందని ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజూ కేవలం 50 గ్రాముల ప్రాసెస్ చేసిన మాంసాహారాన్ని తినడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) వచ్చే ప్రమాదం ఏకంగా 18 శాతం పెరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఈ ప్రాసెస్డ్ మాంసంలో రుచి, రంగు మరియు నిల్వ కాలం పెంచడానికి వాడే సోడియం నైట్రేట్, నైట్రైట్స్ వంటి రసాయనాలు జీర్ణక్రియలో అత్యంత ప్రమాదకరమైన నైట్రోసో సమ్మేళనాలుగా మారి ప్రేగుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. మరోవైపు, రెడ్ మీట్ అంటే మేక, గొర్రె, పంది, ఎద్దు వంటి జంతువుల మాంసాన్ని IARC  గ్రూప్ 2A కార్సినోజెన్  (Group 2A Carcinogen) వర్గంలో చేర్చింది. అంటే ఇది మానవులలో క్యాన్సర్ కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిరోజూ 100 గ్రాముల రెడ్ మీట్ తీసుకోవడం వల్ల ప్రేగు క్యాన్సర్ ప్రమాదం 17 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రెడ్ మీట్‌లో సహజంగా ఉండే  హీమ్ ఐరన్  (Heme Iron) కణాలలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచి, డిఎన్‌ఏను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్రమంగా ప్రేగులు, ప్రోస్టేట్ మరియు ప్యాంక్రియాటిక్ (క్లోమం) క్యాన్సర్లకు దారితీస్తుంది. మాంసం రకమే కాకుండా, దానిని మనం వండే పద్ధతి కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని నిర్ధారిస్తుంది. మాంసాహారాన్ని డైరెక్ట్ మంటపై బొగ్గులపై కాల్చడం (Barbecue/Grilling), అధిక ఉష్ణోగ్రత వద్ద సుదీర్ఘకాలం వేయించడం (Deep Frying) లేదా మాడిపోయేలా వండడం వల్ల అందులో హెటెరోసైక్లిక్ అమైన్లు (HCAs), పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు (PAHs) అనే అత్యంత విషపూరితమైన రసాయనాలు ఉత్పన్నమవుతాయి. ఈ రసాయనాలు మానవ శరీరంలోని డిఎన్‌ఏ నిర్మాణంలో ఉత్పరివర్తనలు (Mutations) తీసొచ్చి క్యాన్సర్ కణాల ఉత్పత్తికి బీజం వేస్తాయి. అయితే మాంసాహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వారానికి 350 నుండి 500 గ్రాముల కంటే ఎక్కువ రెడ్ మీట్ తినకూడదని, ప్రాసెస్డ్ మీట్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. రెడ్ మీట్‌కు ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు, కోడిగుడ్లు వంటి వైట్ మీట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉండకపోగా, శరీరానికి మేలు జరుగుతుంది. అలాగే మాంసంతో పాటు ప్రతిరోజూ పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు మరియు విటమిన్ సీ ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ప్రేగుల్లో క్యాన్సర్ కారక రసాయనాల ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు పాటించడం, మసాలాలు తగ్గించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటూ మాంసాహారాన్ని ఆస్వాదించవచ్చు.     [ Processed Meat, Red Meat, Cancer Risk, Colorectal Cancer, IARC, WHO, Group 1 Carcinogen, Heme Iron, HCAs, PAHs ]  
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నియంత్రణతో పాటు వివిధ సంప్రదాయ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను Dr. Ch. Madhusudhana Sharma ఈ వీడియోలో వివరిస్తున్నారు. మధుమేహం విషయంలో శరీరంలోని జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాల పాత్ర ఏమిటి? సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలను ఎలా పరిగణిస్తారు? అనే విషయాలను డాక్టర్ వివరిస్తున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా 5 రకాల పొడులు/చూర్ణాల గురించి ప్రస్తావించారు: త్రిఫల చూర్ణం, పసుపు, మెంతులు, పొడపత్రి (మధునాశిని), కాకరకాయ పొడి.  ఈ పదార్థాలను సంప్రదాయ వైద్య విధానంలో ఎలా ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటి? మధుమేహం ఉన్నవారు వీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వంటి అంశాలను వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే, మధుమేహాన్ని కేవలం మందులతో మాత్రమే కాకుండా ఆహారం, జీవనశైలి, శారీరక చురుకుదనం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలతో కలిపి ఎలా నిర్వహించుకోవాలనే విషయాలపై కూడా వీడియోలో అవగాహన కల్పిస్తున్నారు. డయాబెటిస్ మందులు ఇప్పటికే వాడుతున్నవారు తమంతట తాముగా మందుల మోతాదును తగ్గించడం లేదా ఆపడం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పే పొడులు లేదా ఇతర సహజ పదార్థాలను ఉపయోగించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. త్రిఫల, పసుపు, మెంతులు, మధునాశిని, కాకరకాయ పొడుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు? మధుమేహం నియంత్రణలో ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ ఎందుకు ముఖ్యమైనవి? తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్ మందులను వైద్యుల సలహా లేకుండా ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
రోజువారీ జీవితంలో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం లేదా కంప్యూటర్, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ పట్టుకుపోవడం, మెడ నొప్పి రావడం సాధారణంగా మారిపోయింది. ఈ నొప్పి తీవ్రమైతే కొందరిలో సర్వైకల్ పెయిన్ రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది సొంత వైద్యాలు లేదా చిట్కాలు పాటిస్తుంటారు. అందులో   చాలామంది పాటించే ఉపాయం దిండు లేకుండా నిద్రపోవడం. దిండును పక్కన పెడితే మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే ఇది నిజమేనా లేదా కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాలను వివరంగా తెలుసుకుంటే.. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గిపోతుందా? మెడ నొప్పి తగ్గాలంటే వెంటనే దిండు వాడటం ఆపేయాలని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు. మన వెన్నుపాము నిర్మాణం పూర్తిగా సూటిగా, నేరుగా ఉండదు. మెడ భాగంలో వెన్నుపాము స్వల్పంగా వంపు తిరిగి ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో ఈ వంపుకు సరైన సపోర్ట్ లభించడం చాలా అవసరం. దిండు లేకుండా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వెల్లకిలా పడుకున్నప్పుడు  దిండు వాడకపోతే తల వెనుకకు వాలిపోతుంది. దీనివల్ల మెడ భాగంలోనూ, పరుపుకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ వల్ల మెడ కండరాలు, లిగమెంట్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మెడ  సహజమైన వంపు చదునుగా మారే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉదయం లేచేసరికి మెడ నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది.  ఒక పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారికి భుజానికి, మెడకు మధ్య చాలా ఖాళీ ఉంటుంది. దిండు లేకపోతే తల పరుపు వైపు క్రిందికి వంగిపోతుంది. దీనివల్ల మెడ నరాలపై విపరీతమైన ఒత్తిడి పడి నరాలు లాగడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక సర్వైకల్ సమస్యలకు దారితీస్తుంది. సరైన దిండును ఎలా ఎంచుకోవాలి? మెడ నొప్పి తగ్గడానికి దిండును పూర్తిగా మానేయడం పరిష్కారం కాదు, సరైన దిండును ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దిండు మందం చాలా ముఖ్యం. అది మరీ ఎత్తుగా లేదా మరీ పలచగా ఉండకూడదు. నిద్రపోయేటప్పుడు  నొసలు, గడ్డం ఒకే స్థాయిలో సమాంతరంగా ఉండేలా దిండు సహకరించాలి. దిండు బాగా ఎత్తుగా ఉంటే గడ్డం ఛాతీ వైపు ఒంగిపోతుంది. అలాగే దిండు బాగా పలచగా ఉంటే తల వెనుకకు వాలిపోతుంది. ఇవి రెండూ మెడకు హానికరమే. పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు తమ భుజం చివర నుండి మెడ వరకు ఉండే దూరానికి సరిపోయేంత మందం ఉన్న దిండును ఎంచుకోవడం మంచిది. నిద్రపోయే భంగిమతో పాటు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును వాడటం ద్వారా మాత్రమే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన మెడ నొప్పి లేదా నరాల ఒత్తిడి ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.                                                                                                                                                   *రూపశ్రీ.