ఏపీలో ఆదివారం (నవంబర్ 1)  మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో తాడోపేడో తేల్చుకునేందుకు పార్టీలు, అభ్యర్ధులు సన్నద్ధమయ్యారు. తెలుగుదేశం కూటమి ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవంగా విజయం సాధించింది. జగన్ అడ్డా పులివెందులలో కూడా అదే పరిస్థితి. అయితే జగన్ సొంత గడ్డ పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అడ్డా అయిన మునిసిపాలిటీలో  తెలుగుదేశం జెండా ఎగరనీయకూడదన్న పట్టుదలతో ఉన్న జగన్.. పులివెందులలోనే మకాం వేశారు. మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు స్వయంగా నడుంబిగించారు.  ఇప్పిటికే పులివెందుల మునిసిపాలిటీలోని సగం వార్డులను తెలుగుదేశం కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుని సత్తా చాటింది.  మిగిలిన వాటి కోసం వైసీపీ, జగన్ పోరాడుతున్నారు.  సాధారణంగా అయితే అక్కడ ఎన్నిక జరుగుతోంది. ఓటర్లు గెలుపోటములు నిర్ణయిస్తారు. కానీ పులివెందుల మాత్రం సెపరేట్. అది జగన్ కంచుకోట.   అలింటి కంచుకోటలో తెలుగుదేశం పాగా వేస్తే.. ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా 2029 ఎన్నికలపై పడుతుందన్నది జగన్ భయం. ఇప్పటికే గంలో పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోర పరాజయాన్ని చవి చూశారు. దీంతో ఎది ఏమైనా, ఏం చేసైనా పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకోవాలని జగన్ పట్టుదలగా ఉన్నారు.   దీంతో పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపోల్ లో ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి కల్పించడమే లక్ష్యంగా పోలీసులు సర్వ సన్నద్ధంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు.   [Pulivendula Municipal Elections,  Jagan Pulivendula, YCP Baston Pulivendula, Andhra Pradesh Politics, Tension  Pulivendula, Telugu One]
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు.  అప్పట్లో  రాజకీయ పరిణామాలు, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే   వాతావరణంలోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొన్న కొండా సురేఖ  కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కించపరచాలనే ఉద్దేశం గానీ, ఆయన కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయాలని కానీ తాను ఎన్నడూ భావించలేదని వివరణ ఇచ్చారు.   ఆ వ్యాఖ్యల వల్ల కేటీఆర్ కు కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నాని పేర్కొన్న ఆమె  ఈ వివాదానికి పూర్తిగా ముగింపు పలకాలనే సదుద్దేశంతోనే  క్షమాపణలు చెబుతూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు.  కాగా కొండా సురేఖను రేవంత్ తన కేబినెట్ నుంచి తొలగించిన తరువాత ఇప్పుడు కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  సరైన కారణాలు వెల్లడించకుండా, కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి తొలగించడాన్ని ఆమె అప్పట్లోనే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.  బీసీ మహిళగా తనకు జరుగుతున్న అన్యాయంపై ఆమె బహిరంగంగానే  నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణ చెప్పడం, ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం పొలిటికల్ గా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బీఆర్ఎస్ గూటికి చేరడానికి రెడీ అయ్యారన్న చర్చ జోరందుకుంది. ఈ చర్చకు కొండా సురేఖ భర్త కొండా మురళితో కలిసి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలున్నాయన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.    [Konda Surekha Apologizes to KTR, Telangana Politics, Konda Surekha Murali, BRS Reentry Rumors, Telugu One]
రాను రానంటూనే  చిన్నదీ రాములోరి గుడికొచ్చే అనే పాట చందంగా రాజకీయాలలో పొత్తుల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోంది. తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆంధ్రప్రదేశ్ లోనూ, జాతీయ స్థాయిలోనూ జనసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీయే అయినా, తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో ఎటువంటి పొత్తూ ఉండదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఇప్పటికే పలుమార్లు విస్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పోటీకి జనసేన రెడీ అవుతోంది.  రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన జనసేనతో  కలిసి ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.  ఉమ్మడి ఖమ్మం,వరంగల్,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఎమ్మెల్సీ పోరులో జనసేన   అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ పార్టీకి అండగా నిలబడుతోందన్న అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారికంగా మిత్రపక్షాలుగా కొనసాగుతున్న జనసేన,  బీజేపీలు, తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికి వారే యమునా తీరే చందంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తీరు మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, రెండు పార్టీలూ అనివార్యంగా అవగాహనకు వచ్చాయంటున్నారు పరిశీలకులు.   జనసేన అభ్యర్థి బరిలో నిలిచే స్థానంలో బీజేపీ తన అభ్యర్థిని పోటీకి పెట్టకుండా పరోక్షంగా మద్దతు తెలిపేలా ఇరు పార్టీల మధ్య అవగాహన కుదిరిందన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇదే జరిగితే.. ముందు ముందు జరగనున్న స్థానిక ఎన్నికలు, ఆ పై 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ రెండు పార్టీలూ జతకట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Jana Sena  BJP Alleance Telangana,  MLC Elections, Graduate MLC,Telangana Politics,  , Warangal Khammam Nalgonda Graduates MLC, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, డ్యాన్సర్‌ శ్రష్టి వర్మ మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి జానీ మాస్టర్‌ తాజాగా ‘ఢీ’ డ్యాన్స్‌ షోలో మాట్లాడటంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశమైంది. దీనిపై శ్రష్టి వర్మ సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడే హక్కు తనకు ఉందని, తన గొంతును ఎవరూ మూయించలేరని స్పష్టం చేశారు. ‘ఢీ’ కొత్త సీజన్‌కు జానీ మాస్టర్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మీద లక్ష ఆరోపణలు చేశారు. ఒక అమ్మాయి, మన డ్యాన్సరే వచ్చి ‘జానీ మాస్టర్‌ జీరో జీరో’ అని చెప్పింది. నేను కరెక్ట్‌ అయినప్పుడు అవతలివాళ్లు ఎన్ని అనుకుంటే నాకెందుకు?’’ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో జానీ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఈ వీడియోపై శ్రష్టి వర్మ స్పందిస్తూ.. జానీ మాస్టర్‌ మాట్లాడిన క్లిప్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘నిజం వెలుగులోకి వచ్చినప్పుడు అపరాధభావం ఉన్న వ్యక్తి మరింత గట్టిగా మాట్లాడతాడు’’ అంటూ వ్యాఖ్యానించారు. తనను ఓ మహిళా డ్యాన్సర్‌ ‘జీరో జీరో’ అని అన్న విషయాన్ని జానీ బహిరంగ వేదికపై ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక మహిళ తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా మాట్లాడితే, ఆమె మాటలను ప్రశ్నించడం ఎందుకని నిలదీశారు. అంతేకాదు, తనకు మద్దతుగా నిలుస్తున్నవారికి వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి వారిని మాట్లాడకుండా ఆపే హక్కు జానీ మాస్టర్‌కు లేదని శ్రష్టి వర్మ పేర్కొన్నారు. ‘‘దాదాపు నాలుగేళ్లపాటు ఎన్నో కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నా కాళ్లపై నేను నిలబడి, నాకు ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడే స్థాయికి వచ్చాను. అలాంటప్పుడు నన్ను కానీ, నాకు మద్దతుగా నిలబడాలనుకునే వారిని కానీ అడ్డుకునే హక్కు నీకు లేదు. నా కథను నేను చెప్పుకోకుండా ఎవరూ నా నోరు మూయించలేరు’’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. కాగా, జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని శ్రష్టి వర్మ గతంలో ఆరోపించారు. తాను మైనర్‌గా ఉన్నప్పటి ఘటనల గురించి ఆమె ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2024 సెప్టెంబర్‌లో ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు, స్పందనలను వేర్వేరుగా చూడాల్సిన నేపథ్యంలో.. తాజాగా ‘ఢీ’ షోలో జానీ చేసిన వ్యాఖ్యలు, వాటికి శ్రష్టి ఇచ్చిన కౌంటర్‌ మరోసారి చర్చకు దారితీశాయి.     [Shrasti Verma, Jani Master, Shrasti Verma Latest News, Dhee Dance Show, Jani Master Controversy, Shrasti Verma Instagram, Jani Master Allegations, Telugu Cinema News]
విక్టరీ వెంకటేశ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నంబర్‌ 47’. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా విషయంలో సెంటిమెంట్ల కంటే ప్రేక్షకుల తీర్పుకే ప్రాధాన్యం ఇస్తాననే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో త్రివిక్రమ్‌తో కలిసి ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి విజయవంతమైన సినిమాలు చేశానని వెంకటేశ్‌ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సినిమాల తర్వాత మళ్లీ కలిసి పనిచేసేటప్పుడు ఎలాంటి కథను ఎంచుకోవాలనే విషయంలో సహజంగానే ఒత్తిడి ఉంటుందని చెప్పారు. అయితే త్రివిక్రమ్‌ ఈ సినిమా కథ చెప్పినప్పుడు అందులోని అంశాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా థ్రిల్లింగ్‌ సన్నివేశాలు, సస్పెన్స్‌, వివిధ రకాల భావోద్వేగాలు ఇందులో ఉంటాయని వివరించారు. తాను గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించినప్పటికీ ‘ఆదర్శ కుటుంబం’ ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని వెంకటేశ్‌ అన్నారు. ఇందులో తన పాత్ర పేరు చిట్టిబాబు. కుటుంబానికి ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించడానికి, తన వాళ్లను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్లే వ్యక్తిగా ఈ పాత్ర ఉంటుందని చెప్పారు. కుటుంబ అనుబంధాలతో పాటు ఉత్కంఠభరితమైన అంశాలు కూడా కథలో భాగమవుతాయని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక అక్టోబర్‌ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించడంతో, ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో వస్తారనే ఆసక్తి నెలకొంది. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్‌ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. అయితే సినిమా విజయం విషయంలో అంతిమ నిర్ణయం ప్రేక్షకులదే అన్నది వెంకటేశ్‌ వ్యాఖ్యల సారాంశం.     [Venkatesh, Aadarsha Kutumbam, Venkatesh Trivikram Movie, Aadarsha Kutumbam Press Meet, Trivikram Srinivas, Venkatesh Latest News, Aadarsha Kutumbam Release Date, Telugu Cinema News]
సినిమా పాట అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సంగీత దర్శకుడు, గాయకుడు, గేయ రచయిత. కానీ ఒక పాటను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడంలో వాయిద్య కళాకారుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ముఖ్యంగా ఇళయరాజా సంగీతంలో గిటార్ వినిపిస్తే చాలు.. ఆ మాధుర్యాన్ని ఆస్వాదించకుండా ఉండలేం. అలాంటి ఎన్నో మధురమైన పాటలకు తన గిటార్‌తో ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చిన సీనియర్ సంగీత విద్వాంసుడు సదా మాస్టర్ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. ఎస్. సదానందం అలియాస్ సదా మాస్టర్ దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో ప్రముఖ గిటార్ కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం కుమారుడైన ఆయన.. చిన్నప్పటి నుంచే సంగీత వాతావరణంలో పెరిగారు. ఇళయరాజా సంగీత బృందంలో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రధాన గిటారిస్ట్‌గా పనిచేశారు. ఇళయరాజా సంగీత దర్శకుడిగా పరిచయమైన ‘అన్నకిళి’ సినిమా నుంచి ఆయనతో కలిసి ప్రయాణించారు. అలా వేలాది పాటలకు తన గిటార్ సంగీతాన్ని అందించారు. ఎన్నో పాటల్లో ప్రారంభ సంగీతం, మధ్యలో వచ్చే వాయిద్యాల బిట్స్‌ ప్రత్యేకంగా వినిపించడానికి సదా మాస్టర్ వంటి కళాకారుల ప్రతిభ కూడా ఒక కారణం. తనతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేసిన సదా మాస్టర్ మరణవార్తపై ఇళయరాజా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తన తొలి రోజుల నుంచే తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తనతో కలిసి జీవించినవారిని, తన జీవితంలో అంతర్భాగమైనవారిని మరణించినవారిగా చూడలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. సదానందం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.  ఇది కూడా చదవండి: బాలయ్య vs మంచు మనోజ్.. క్లైమాక్స్‌కు వచ్చేసిన ‘దాదా’.!       [Guitarist Sada Master Passed Away, Ilaiyaraaja Guitarist Sada Master, Sada Master Passes Away, Ilaiyaraaja Guitarist, Ilaiyaraaja Music Team, Sadanandam Guitarist, Ilaiyaraaja, Sada Master]  
మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు విమాన ప్రయాణంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా అభిమానులతో సరదాగా మాట్లాడటం, వారితో ఫొటోలు దిగడం ఇష్టపడే కీర్తికి.. ఓ వ్యక్తి ప్రవర్తన ఇబ్బందికరంగా మారింది. మిలన్‌ నుంచి ఇండియాకు తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కీర్తి సురేష్‌ ప్రయాణిస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. సరిగా నిలబడలేని స్థితిలో ఉన్న అతను తనతో సెల్ఫీ దిగాలని పట్టుబట్టాడు. అయితే, ఆ సమయంలో ఫొటో దిగడం సాధ్యం కాదని, కొద్దిసేపటి తర్వాత దిగుదామని కీర్తి చెప్పింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆమె మాటలను పట్టించుకోకుండా వెంటనే సెల్ఫీ కావాలని ఒత్తిడి చేశాడు. దీంతో కీర్తి అతనికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. తన తరఫున నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీర్తి భర్త ఆంటోనీ తట్టిల్‌ కూడా ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం. సాధారణంగా అభిమానులతో ఎంతో సౌమ్యంగా ఉండే తన భర్త గొంతు పెంచి మాట్లాడటం తాను మొదటిసారి చూశానని కీర్తి చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. సెలబ్రిటీలైనా సరే, తమ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఈ సంఘటన ద్వారా ఆమె చెప్పకనే చెప్పారు. అయితే, విమాన ప్రయాణాల్లో అభిమానులందరి వల్ల ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని కీర్తి అనడం లేదు. చాలామంది ఎంతో మర్యాదగా మాట్లాడతారని, కొందరైతే ఫొటో కూడా అడగకుండా ప్రయాణమంతా సరదాగా కబుర్లు చెబుతుంటారని ఆమె వివరించింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలను తాను గౌరవిస్తానని, అయితే ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు మాత్రం ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలనుకోవడం తప్పు కాకపోయినా, వారి ఇష్టాయిష్టాలను, వ్యక్తిగత పరిధిని గౌరవించడం ముఖ్యమనే విషయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.     [Keerthy Suresh, Keerthy Suresh Flight Incident, Keerthy Suresh Husband Antony Thattil, Keerthy Suresh Interview, Keerthy Suresh Latest News, Celebrity Fan Incident, Keerthy Suresh Selfie Incident]
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దాదా’. ‘వీరసింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 80ల నాటి ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మధ్యలో బాలయ్య గాయపడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఆయన కోలుకుని తిరిగి సెట్స్‌లోకి రావడంతో సినిమా పనులు వేగం పుంజుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ‘దాదా’ క్లైమాక్స్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ ఎపిసోడ్‌లో బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు టాక్. ‘దాదా’లో బాలకృష్ణ లుక్ ఇప్పటికే ఆసక్తిని పెంచింది. రెట్రో గెటప్‌లో, గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో ఆయన కనిపించనున్నారు. మంచు మనోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలపై అంచనాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘వారణాసి’ వాయిదా పడుతుందా?.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్.!       [Dada Movie Climax Shoot, Balakrishna vs Manchu Manoj, Dada Movie, Nandamuri Balakrishna, Gopichand Malineni, Manchu Manoj, Kajal Aggarwal, Telugu Film News]  
‘అర్జున్ రెడ్డి’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాలతో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. ఇప్పటివరకు నటుడిగా ఎన్నో విభిన్న పాత్రలు చేసిన ఆయన.. ఇక మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘హుషారు-2’ సినిమా పూర్తయిన వెంటనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాహుల్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాహుల్ తెరకెక్కించబోయే ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే రాసుకున్నారు. ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తానని తెలిపారు. అయితే ఈ సినిమాలో మరో నటుడు ప్రియదర్శి హీరోగా నటించనున్నట్లు రాహుల్ స్పష్టం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నటుడిగా తనకు ఎక్కువగా హీరో స్నేహితుడి పాత్రలే వస్తున్నాయని, అలాంటి పాత్రలను పదేపదే చేయడం బోర్‌ కొట్టిందని రాహుల్ చెప్పారు. అందుకే కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నట్లు వివరించారు. ‘అర్జున్ రెడ్డి’లో శివ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ‘జాతిరత్నాలు’తో పాటు పలు సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగానూ తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా ఎలాంటి కథను ఎంచుకుంటారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు, రాహుల్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించనున్నారనే విషయం ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే కామెడీ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం విశేషం. రాహుల్ తనదైన హాస్యాన్ని కథలో ఎలా మేళవిస్తారు? ప్రియదర్శిని హీరోగా ఎలా చూపించబోతున్నారు? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ‘హుషారు-2’లో నటిస్తున్న రాహుల్.. ఆ సినిమా తర్వాత దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు.   [Rahul Ramakrishna, Priyadarshi, Rahul Ramakrishna Director, Priyadarshi New Movie, Husharu 2, Telugu Cinema News, Rahul Ramakrishna Directorial Debut, Telugu Comedy Movies]
తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ రాజకీయాల్లోకి రాబోతున్నారా? గత కొంతకాలంగా తమిళనాట వినిపిస్తున్న ఈ ఊహాగానాలు ఇప్పుడు మరింత పెరిగాయి. తాజాగా ఆయన తన అభిమాన సంఘం ద్వారా చేపట్టబోతున్న ఓ విద్యా కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా ఏసీ ట్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ధనుష్‌ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన రాజకీయ ఆరంగేట్రానికి ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారనే చర్చ మొదలైంది. ధనుష్‌ తన ‘ధనుష్‌ నార్పని ఇయక్కం’ (ధనుష్‌ సంక్షేమ ఉద్యమం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. 2027 జనవరి నుంచి ‘స్మార్ట్‌ స్టడీ హబ్స్‌’ పేరుతో ఈ కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో పదో తరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్‌ చెప్పించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. ఒక్కో కేంద్రంలో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు ఒక సహాయకుడిని నియమించనున్నారు. వీరికి సంబంధించిన జీతభత్యాలను కూడా ధనుష్‌ సంక్షేమ సంస్థే భరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధనుష్‌ తన అభిమాన సంఘాలను సంక్షేమ కార్యక్రమాల వైపు నడిపిస్తున్నారు. ఇటీవల చెన్నైలో సుమారు 3,000 మంది మహిళా సభ్యులతో నిర్వహించిన సమావేశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అభిమాన సంఘాలను ప్రజలకు సేవ చేసే సంస్థలుగా మార్చడం, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం వంటి పరిణామాలను పరిశీలిస్తే.. ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారనే ప్రచారం ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో విజయ్‌ కూడా అభిమాన సంఘాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ధనుష్‌ విషయంలోనూ అలాంటి పోలికలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ధనుష్‌ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేశారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఉచిత ట్యూషన్‌ సెంటర్ల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా భావిస్తున్నప్పటికీ, వాటి ఆధారంగా ధనుష్‌ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేం. మరి ఈ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువయ్యే ధనుష్‌.. భవిష్యత్తులో రాజకీయ నిర్ణయం తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.     [Dhanush Political Entry, Dhanush Politics, Dhanush Narpani Iyakkam, Smart Study Hubs, Dhanush Free Tuition Centres, Tamil Nadu Politics, Dhanush Political Party, Dhanush Latest News]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్‌కు ‘వారణాసి’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. వారణాసి వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. నిర్మాతలు ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న తప్పకుండా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. విడుదల తేదీలో మార్పు లేదా అని మరోసారి అడగ్గా.. అవును, కచ్చితంగా అదే రోజున విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు. రాజమౌళి సినిమా అంటేనే విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ‘వారణాసి’ని అంతకుమించిన స్థాయిలో రూపొందిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి భారీ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. అయితే విజయేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యలతో ఈ అనుమానాలకు సమాధానం లభించినట్లయింది. ‘వారణాసి’లో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, పురాణ అంశాలు, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇది కూడా చదవండి: రామాయణ రిలీజ్.. పాకిస్థాన్‌లో రియాక్షన్ ఎలా ఉందంటే.? https://x.com/Theteluguone/status/2115782861051830718       [Varanasi Postponement Rumours, Varanasi Release Date, Vijayendra Prasad, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]  
నేటి డిజిటల్ యుగంలో మ్యూజిక్ అనగానే మనందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆన్‌లైన్ స్ట్రీమింగ్ యాప్స్ మరియు ఏఐ ఆధారిత ఆటోప్లే ప్లేలిస్ట్స్. అయితే, ప్రతి పాటను అల్గారిథమ్‌ల ద్వారా ముందుగానే అంచనా వేయడం మరియు ఎప్పుడూ ఒకే రకమైన సిఫార్సులు రావడం వల్ల మ్యూజిక్ ప్రేమికులకు బోరు కొడుతోంది. ఈ విసుగు నుంచే నేడు సరికొత్త మలుపు చోటుచేసుకుంది. మ్యూజిక్ ప్రియులు డిజిటల్ శబ్దం నుండి బయటపడి, మళ్లీ సీడీల (CDs) వైపు పరుగులు తీస్తున్నారు. ప్రముఖ రిటైలర్ జాన్ లూయిస్ (John Lewis) గణాంకాల ప్రకారం, జూలై నుండి సీడీ ప్లేయర్ల కోసం వెతికే వారి సంఖ్య ఏకంగా 96 శాతం పెరిగింది. అంతేకాకుండా, ఈ ఏడాది మ్యూజిక్ మరియు ఫిల్మ్ ట్రెండ్స్‌పై వచ్చిన మరొక నివేదిక ప్రకారం సీడీల అమ్మకాలు 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ అసాధారణ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషిస్తే, స్ట్రీమింగ్ యాప్స్ తెచ్చిపెడుతున్న అనంతమైన ఎంపికల గందరగోళం (paradox of choice) ప్రధాన కారణమని తెలుస్తోంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో మనకు నచ్చిన పాటను ఎంచుకోవడం కంటే, యాప్‌లు మనపై బలవంతంగా రుద్దే అల్గారిథమ్ పాటలతో విసిగిపోయిన శ్రోతలు, తమకు ఇష్టమైన ఆల్బమ్‌లను భద్రపరుచుకోవడానికి ఫిజికల్ సీడీలను ఆశ్రయిస్తున్నారు. లండన్‌కు చెందిన 67 ఏళ్ల ఆండ్రూ వేల్స్ (Andrew Wales) అనే మ్యూజిక్ లవర్ వద్ద ఏకంగా 10,000లకు పైగా సీడీలు ఉన్నాయి. చిన్న ఫ్లాట్‌లో నివసిస్తున్నప్పటికీ, డిజిటల్ స్ట్రీమింగ్ కంటే తన చేతిలో పట్టుకునే భౌతిక రూపంలో మ్యూజిక్ ఉండటమే తనకు ఇష్టమని ఆయన స్పష్టం చేస్తున్నారు. అలాగే, శాన్ జోస్‌కు చెందిన 32 ఏళ్ల గాబ్రియేలా క్రౌలీ (Gabriela Crowley) తన అనుభవాన్ని పంచుకుంటూ, ఇంట్లో చిన్న పాప పుట్టిన తర్వాత వినైల్ రికార్డులు చాలా బరువెక్కినట్లు, అసౌకర్యంగా అనిపించాయని తెలిపారు. దీంతో తన మామగారు ఇచ్చిన పాత సీడీ ప్లేయర్‌ను వాడటం ప్రారంభించానని, ఇప్పుడు అదే తమ రోజువారీ అలవాటుగా మారిందని ఆమె చెబుతున్నారు. స్ట్రీమింగ్‌లో కేవలం మ్యూజిక్ అద్దెకు తీసుకున్నట్లు ఉంటుందని, ఏ క్షణంలోనైనా ఆ పాటలు ఆన్‌లైన్ నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని మ్యూజిక్ కలెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేరుగా చిన్న ఇండి మరియు ఫోక్ బ్యాండ్‌ల నుండి సీడీలను కొనుగోలు చేయడం ద్వారా ఆ కళాకారులకు సరైన ఆర్థిక ప్రయోజనం దక్కుతుందని గ్లౌసెస్టర్‌కు చెందిన నీల్ కమ్మింగ్ (53) అభిప్రాయపడ్డారు. ఈ ట్రెండ్ కేవలం పాత జ్ఞాపకాల పునరుజ్జీవనం మాత్రమే కాదు, డిజిటల్ యుగంలో కాలిపోయే వేగవంతమైన జీవితానికి ఒక ప్రశాంతమైన విరామం. టొంట్రోటోకు చెందిన 65 ఏళ్ల ఆశా వరదరాజన్ మాట్లాడుతూ, సీడీ వినడం అనేది నిరంతరం మొబైల్ స్క్రీన్‌లను స్క్రోల్ చేయడానికి పూర్తి విరుద్ధమైన ప్రక్రియ అన్నారు. సీడీని ప్లేయర్‌లో ఉంచి పాట వినడంలో ఉండే శ్రద్ధ, ఓపిక మ్యూజిక్‌ను మనసులో చిరకాలం నిలిచిపోయేలా చేస్తాయని ఆమె నమ్ముతున్నారు. వినైల్ రికార్డుల ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, తక్కువ ధరలకే లభించడం మరియు ఎటువంటి స్క్రాచ్‌లు పడే అవకాశం లేకపోవడం సీడీల జనరంజకతను మరింత పెంచుతోంది. మొత్తానికి, అల్గారిథమ్‌ల ఉచ్చు నుంచి బయటపడి స్వచ్ఛమైన సంగీతాన్ని ఆస్వాదించాలనుకునే తహతహే నేడు సీడీల అద్భుత పునరాగమనానికి అసలు సిసలు కారణం.     CD Resurgence Trend, Compact Disc Mania, Why CDs Are Making A Comeback, Physical Music Albums Revival, Retro Audio Trends, Music Collectors Culture, Streaming Vs CDs.
ఆంధ్రుల వంటకాల్లో మాంసాహారానికి, అందునా మటన్ వంటకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. సాధారణంగా చేసుకునే మటన్ కూర కాకుండా కాస్త భిన్నంగా, రుచిగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే "శెనగపప్పు మటన్ కూర" ఒక అద్భుతమైన ఎంపిక. నాన్‌వెజ్ ప్రియులకు ఆదివారం వచ్చిందంటే ఇంట్లో మటన్ ఉండాల్సిందే, అయితే ఈసారి ఈ ట్రెడిషనల్ ఆంధ్ర స్టైల్ శెనగపప్పు మటన్ కర్రీని ప్రయత్నిస్తే కుటుంబ సభ్యులంతా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ వంటకం తయారీకి ముఖ్యంగా అర కిలో (500 గ్రాములు) తాజా మటన్ ముక్కలు, ఒక కప్పు శెనగపప్పు అవసరం అవుతాయి. శెనగపప్పును వంటకానికి ముందే రాత్రిపూట లేదా కనీసం రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి. దీనివల్ల పప్పు మెత్తగా ఉడుకుతుంది మరియు కూరకు అద్భుతమైన ఆకృతి వస్తుంది. మొదటగా నానబెట్టుకున్న ఒక కప్పు శెనగపప్పును విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే అర కిలో మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, అందులో అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి ఉంచాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక, సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 చీల్చిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత మరో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత రెండు కట్ చేసిన టమోటాలు వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచిన అర కిలో మటన్ ముక్కలను బాండీలో వేసి బాగా కలపాలి. మటన్ లోని నీరు ఇంకిపోయే వరకు మగ్గిన తర్వాత, అందులో ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా మరియు పావు స్పూన్ మిరియాల పొడి వేసి మసాలాలు ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక కప్పు శెనగపప్పును ఈ మిశ్రమంలో కలపాలి. కూరకు సరిపడా తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై సుమారు 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్ ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే శెనగపప్పు మటన్ కూర సిద్ధంగా ఉంటుంది. చివరగా సన్నగా తరిగిన గుప్పెడు తాజా కొత్తిమీర తరుగును చల్లి దించేయాలి. ఆరోగ్యపరంగా చూస్తే, శెనగపప్పులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్ మరియు ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే మటన్‌లో కూడా ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల ఈ కాంబినేషన్ భోజనం శరీరానికి అద్భుతమైన బలాన్ని, శక్తిని ఇస్తుంది. ఈ వేడి వేడి శెనగపప్పు మటన్ కూరను అన్నంతో పాటు రోటీ, చపాతీ లేదా ఘాటైన బిర్యానీతో తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. ఒకసారి ఈ కొలతలతో మీ ఇంట్లో ప్రయత్నిస్తే రుచి చూసిన అందరూ మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించడం ఖాయం.     Andhra Chana Dal Mutton Curry, Senagappappu Mutton Kura, Traditional South Indian Non Veg, Mutton And Bengal Gram Recipe, Spicy Andhra Curry, Authentic Mutton Gravy, Indian Meat Recipes.
 ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు.. కుటుంబం నిశ్చింతగా ఉండొచ్చు..! ఏ ఇంటికైనా ఆ ఇంట్లోని పిల్లల ప్రవర్తనే వారి పరువు ప్రతిష్టలను నిర్ణయిస్తుంది. ముఖ్యంగా కొడుకు మంచివాడైతే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. సమాజంలో ఆ కుటుంబానికి ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. అదే సమయంలో కొడుకు చెడు అలవాట్లకు బానిస అయితే మాత్రం ఆ ఇల్లు  సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఒక కుటుంబం ప్రశాంతంగా, సంతోషంగా సాగిపోవడానికి ఇంట్లోని పిల్లల ప్రవర్తనే మూలం అవుతుంది.  మరీ ముఖ్యంగా.. కొడుకు ఎలా ఉండాలి? కొడుకు ఎలా ఉంటే ఆ కుటుంబం అంతా నిశ్చింతగా, అందరిలో గౌరవంగా ఉంటుందో వివరంగా తెలుసుకుంటే.. ఓ చక్కని ఉదాహరణ.. మన జీవితంలో కొన్ని విషయాలను చిన్న ఉదాహరణలతో అర్థం చేసుకోవడం చాలా సులభం. అడవిలో ఒకే ఒక చెట్టు ఎండిపోయి దానికి నిప్పు అంటుకుంటే, ఆ ఒక్క చెట్టు కారణంగా చుట్టుపక్కల ఉన్న పెద్ద అడవి మొత్తం కాలిపోతుంది. సరిగ్గా అలాగే, ఇంట్లో ఒకరు చెడు మార్గంలో నడిచినా లేదా చెడు అలవాట్లకు అలవాటు పడినా, అది ఆ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. ఆ కుటుంబం మొత్తం  పరువును, సమాజంలో వారికున్న గౌరవాన్ని మట్టిలో కలిపేస్తుంది. అందుకే పిల్లల చిన్ననాటి నుంచి వారి ప్రవర్తన ఎలా ఉందనే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. చెడు స్నేహాలు, తప్పుదారి పట్టే అలవాట్లకు పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోవడం తల్లిదండ్రులది, కుటుంబానిదే బాధ్యత. కుటుంబానికి అండగా నిలిచే కొడుకు ఉంటే.. చీకటి రాత్రిలో చంద్రుడు తన వెలుతురుతో నలుదిక్కులా ప్రకాశాన్ని నింపినట్లుగా, ఒక మంచి సంస్కారమున్న కొడుకు తన కుటుంబం మొత్తానికి వెలుగునిస్తాడు. సమాజంలో ఎంతో మంచి పేరు తెచ్చిపెడతాడు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండటం ముఖ్యం కాదు, ఉన్న ఒక్కరు చాలు కుటుంబానికి గర్వకారణంగా నిలవడానికి. మంచి కొడుకులో ఉండాల్సిన  లక్షణాలు.. తన జీవితానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకునే పరిపక్వత ఉండాలి. చదువు, కెరీర్ పరంగానూ సొంతంగా నిలదొక్కుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలి. కాలానికి తగినట్టుగా   తనను తాను మార్చుకుంటూ, అడుగడుగునా సానుకూల దృక్పథంతో వ్యవహరించడం చాలా అవసరం. కేవలం తన గురించి మాత్రమే కాకుండా, ఇంట్లోని పెద్దలను గౌరవించడం, వారి మనసులోని భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ జీవితాన్ని పిల్లల కోసం ధారపోస్తారు కాబట్టి, వారి వృద్ధ్యాప్యంలో వారికి అండగా ఉంటూ, వారి ప్రతి మాటకు విలువనివ్వాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాలను కూడా అందరితో కలిసి పంచుకుంటూ, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించాలి. కుటుంబానికి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా అందరికీ అండగా నిలబడాలి. ఆర్థికంగా లేదా మానసికంగా ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని కుటుంబానికి భరోసా కల్పించాలి. అప్పట్లో తల్లిదండ్రులు పడిన కష్టాన్ని గుర్తిస్తూ, వారికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండటం ఒక బాధ్యతాయుతమైన కొడుకు లక్షణం. ఎప్పుడూ నిజాయితీని, క్రమశిక్షణను పాటించడం ద్వారా చుట్టూ ఉన్నవారికి కూడా మంచి ప్రేరణగా నిలవాలి. సమాజంలో నలుగురితో కలిసిమెలిసి ఉండే తీరు, ఇతరులకు సహాయం చేసే గుణం ఆ కొడుకును మరింత ఎత్తుకు తీసుకెళ్తాయి. మంచి పనులతో, కష్టపడే తత్వంతో తన భవిష్యత్తును బంగారుమయం చేసుకుంటూ కుటుంబానికి అండగా నిలబడే కొడుకు ఉంటే ఏ తల్లిదండ్రులైనా ఎటువంటి టెన్షన్ లేకుండా నిశ్చింతగా జీవించవచ్చు.                                                                                                                                                *రూపశ్రీ.
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే  ప్రతి అవయవం తన బాధ్యతను తాను సరిగ్గా నిర్వర్తించడం ఎంత ముఖ్యమో, అలాగే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సరిపడా ఉండటం కూడా అంతే అవసరం. మనం రోజూ తినే తిండి మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది విటమిన్లు లేదా పోషకాలు తక్కువైతే నీరసం రావడం, రక్తం పడిపోవడం లేదా చర్మం , కళ్ళు బలహీనపడటం మాత్రమే జరుగుతుందని అనుకుంటారు. కానీ మన శరీరంలో అత్యంత కీలకమైన భాగమైన లివర్.. దీన్నే  కాలేయం అని అంటారు.  కాలేయం ఆరోగ్యం కూడా కొన్ని విటమిన్ల ఆధారంగా ఉంటుంది.  అసలు కాలేయం చేసే పని ఏమిటి? ఏ విటమిన్లు లోపిస్తే కాలేయం దెబ్బతింటుంది? వివరంగా తెలుసుకుంటే.. శరీరంలో లివర్ పాత్ర.. మన శరీరంలో లివర్ చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడంలో, శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను , హానికారక పదార్థాలను బయటకు పంపడంలో, శరీరానికి కావలసిన శక్తిని నిల్వ చేయడంలో లివర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఎన్నో రకాల ముఖ్యమైన ప్రొటీన్లను కూడా ఇదే తయారు చేస్తుంది. అయితే శరీరంలో కొన్ని రకాల విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు అది నేరుగా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు లివర్‌కు సంబంధించిన సమస్యలు ఏవైనా వస్తే, అప్పుడు శరీరం విటమిన్లను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీనివల్ల సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది.  ఆ విటమిన్లు ఏమిటో తెలుసుకుంటే.. విటమిన్-ఎ.. శరీరంలో విటమిన్ ఎ లోపం ఏర్పడితే అది కంటి చూపు తగ్గడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలకే పరిమితం కాకుండా లివర్ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మన శరీరంలో ఉండే మొత్తం విటమిన్ ఎ నిల్వల్లో దాదాపు ఎనబై నుంచి తొంభై శాతం వరకు లివర్‌లోనే ప్రత్యేక కణాలలో నిల్వ ఉంటుంది. కాబట్టి లివర్ పనితీరు మందగిస్తే విటమిన్ ఎ నిల్వలు కూడా దెబ్బతింటాయి. అలాగే ఎముకలు , కండరాల బలానికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్ డి లోపం కూడా లివర్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. శరీరంలో విటమిన్ డి తక్కువైతే అది లివర్‌లో వాపు రావడానికి , కణజాలం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్-ఇ.. శరీరంలో కణాలను ఆక్సీడేటివ్ నష్టం నుంచి రక్షించడంలో విటమిన్ ఇ ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు సరిగ్గా శోషణం కాకపోవడం లేదా కొన్ని రకాల దీర్ఘకాలిక లివర్ సమస్యలు ఉన్నప్పుడు విటమిన్ ఇ లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విటమిన్ తగినంత ఉంటే లివర్‌లో వచ్చే వాపును , కణాలకు జరిగే నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి వీలవుతుంది. విటమిన్-కె.. రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ప్రొటీన్ల తయారీలో విటమిన్ కే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఈ విటమిన్ లోపిస్తే చిన్న గాయాలైనప్పటికీ రక్తం త్వరగా గడ్డకట్టదు. శరీరంలో పిత్తరసం సక్రమంగా ప్రవహించకపోయినా లేదా కొవ్వు పదార్థాలు సరిగ్గా ఒంటబట్టకపోయినా విటమిన్ కే లోపం తలెత్తుతుంది. మొత్తంగా చెప్పాలంటే లివర్ ఆరోగ్యంగా ఉండాలన్నా, లేదా లివర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నా శరీరానికి అవసరమైన విటమిన్లు సరైన పాళ్ళలో అందడం చాలా ముఖ్యం. ఏ చిన్న ఆరోగ్య సమస్య కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం , అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                               *రూపశ్రీ.
వేసవి కాలం వెళ్ళిపోయి చలికాలం వైపు అడుగులు వేస్తున్న సమయంలో మార్కెట్లోకి విరివిగా వచ్చే పండ్లలో సీతాఫలం ఒకటి. పైకి బొడిపెల్లా ఉంటూ, లోపల  గుజ్జుతో ఎంతో తియ్యగా ఉండే ఈ పండును చాలామంది ఇష్టంగా తింటారు. రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ సీతాఫలం ఎంతో ముందుంటుంది. మరి ఈ సీజన్లో దొరికే సీతాఫలాలను ఎవరు తినాలి? రోజుకు ఎన్ని తినాలి? దీనివల్ల  శరీరానికి కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుంటే.. సీతాఫలం ఎవరు తినాలి? చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ సీతాఫలాలు తినవచ్చు. ముఖ్యంగా ఎల్లప్పుడూ నీరసంగా ఉండేవాళ్లకు, త్వరగా అలసిపోయే వాళ్లకు ఇవి చాలా మంచివి. బరువు పెరగాలనుకునే వాళ్లకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఈ పండు చక్కటి ఆహారం. అయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహా మేరకు తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. రోజుకు ఎన్ని తినాలి? ఏదైనా సరే అతిగా తింటే నష్టమే కలుగుతుంది. సీతాఫలాలు తియ్యగా, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు పండ్లు తింటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు మితంగా తినడం చాలా ముఖ్యం. సీతాఫలాల వల్ల కలిగే బెనిఫిట్స్.. శక్తిని ఇస్తుంది.. రోజంతా పని చేసి అలసిపోయిన వాళ్లకు సీతాఫలం తింటే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.. ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి ఇవి తోడ్పడతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.. సీతాఫలాలలో పీచు పదార్థం ఎక్కువశాతంలో ఉంటుంది. ఇది కడుపును శుభ్రం చేయడానికి, మలబద్ధకం సమస్యను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ సాఫీగా పనిచేసేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటివి రాకుండా రక్షణ ఇస్తుంది. చర్మం, జుట్టు అందంగా ఉంటాయి.. విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల సీతాఫలాలు చర్మానికి మంచి మెరుపును ఇస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి, కుదుళ్లను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎముకలు బలపడతాయి.. కాల్షియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు సీతాఫలం మంచి ఆహారం. మొత్తానికి సీతాఫలం కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్యౌషధం. ఈ సీజన్లో దొరికే ఈ అద్భుతమైన పండును అస్సలు మిస్ కాగండి.                                                                                                                                            * రూపశ్రీ.