మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ   స్థానాన్ని టీడీపీ  భారీ ఆధిక్యతతో గెలుచుకుంది.   ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన  సమీప ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో   వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర  ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది.  ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి  తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో  సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.! వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు   వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు.  వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది.   రాబోయే రోజుల్లో   పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా   స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.   మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.! పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.! [Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.    ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించినప్పటికీ, తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా పరిస్థితులు సృష్టించారని ఆయన వాపోయారు.    తాను స్వచ్ఛందంగా పార్టీని వీడలేదని, అక్కడి వాతావరణం వల్ల బయటకు వచ్చేలా బలవంతం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఏనాడూ లేనివిధంగా పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తూ, మానసిక క్షోభ కలిగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు దక్కిన గౌరవం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కరువైందని ఆయన గుర్తు చేసుకున్నారు. కొందరి తప్పుడు మాటలు నమ్మి తనను దూరం పెట్టారని, ఇది తనను తీవ్రంగా బాధిచించిందని ఆయన పేర్కొన్నారు.    ఎన్నికల సమయంలోనూ, అంతర్గత సమావేశాల్లోనూ తనను కించపరిచేలా వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 70కి పైగా అవమానాలను మౌనంగా భరించానని, ఇక ఆత్మగౌరవాన్ని చంపుకుని అక్కడ కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.    రాజకీయాల్లో ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యం అని, దానిని తాకట్టు పెట్టి బతకలేమని ఆయన స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మను నరికేసేలా కొందరు వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.     ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.    భవిష్యత్తులో నూతన రాజకీయ వేదిక ద్వారా ప్రజల గొంతుకగా మారుతామని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పాలనను అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.          [ Vijay Sai Reddy, Jagan Mohan Reddy, YSRCP, New Political Party Andhra Pradesh, Andhra Pradesh Politics, Sumathi Reddy, Andhra Pradesh politics, New political party AP ]  
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో   కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.  మరి కొన్నింటిలో ఆధిక్యంలో ఉంది.  చీరాల మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలలో   వైసీపీ సోదిలోకి కూడా కనిపించలేదు. అనూహ్యంగా అక్కడ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. చీరాల మునిసిపాలిటీ ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడింది. ఇక్కడ వైపీపీ మూడో స్థానానికే పరిమితమైంది.  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  శుక్రవారం ప్రారంభించారు.    చీరాల మున్సిపాలిటీలో  తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. పలు వార్డులలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం కనీస పోటీ ఇవ్వలేక చతికిల బడింది. చీరాల మునిసిపాలిటీలో పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు.  గతంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాలు, స్థానిక సమీకరణాల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చీరాలలో ఆమంచి కృష్ణ ప్రసాద్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ కు లాభించిందని అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు.  ఇది కూడా చదవండి:  ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! ఆమంచికి చీరాలలో ఉన్న పట్టు వైసీపీకి మైనస్ గా మారింది. చీరాలలోని ఒక్క వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి కనీసం రెండో స్దానానికి చేరుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ విజయం సాధించిన 25వ వార్డులో వైసీపీ బాగా వెనుక బడింది.    చీరాల మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంటూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది.  మున్సిపల్ చైర్మన్  ఓటింగ్‌లోనూ తెలుగుదేశం అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా కడపటి సమాచారం అందే సరికి చీరాలలో ఎనిమిది  వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే చీరాలలో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది.   మీకు నచ్చవచ్చు:  [Chirala Municipal Election, Congress, Ahead Ycp,  Competition TDP Versus Congress, Andhra Pradesh Politics, Amanchi Krishna Mohan, Effect, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Nandamuri Balakrishna is set to entertain audiences with another high-energy entertainer, Dada, directed by Gopichand Malineni. After generating strong anticipation with its birthday and title glimpses, the film is gearing up for a worldwide theatrical release on December 24. On the occasion of Diwali, the makers unveiled a special poster featuring Balakrishna and Nargis Fakhri dancing together for the song Dada Dhamakha. The grand visuals offer a glimpse of what promises to be a high-voltage mass number. Composed by S Thaman, the song is packed with energetic beats designed to complement Balakrishna's trademark screen presence. His dance moves alongside Nargis Fakhri are expected to be one of the major attractions of the number. The makers have confirmed that Dada Dhamakha will be released on November 13. The special poster has already raised expectations around the song's scale and choreography. Gopichand Malineni is presenting Balakrishna in a particularly stylish and youthful avatar in this action entertainer. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles. Produced by Venkata Satish Kilaru on a lavish scale, Dada is positioned as a major Christmas-season release, with the team aiming to deliver a mass entertainer in theatres.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు దర్శకుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారట. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం వశిష్ఠ ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. కథలోని ప్రతి అంశాన్ని పక్కాగా సెట్ చేసుకున్న తర్వాతే సెట్స్‌పైకి వెళ్లాలని భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞను తొలి సినిమాతోనే కొత్తగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వశిష్ఠ విభిన్నమైన కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా భారీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనుందని, ఇందులో పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్‌లైన్స్ వంటి ఆసక్తికరమైన అంశాలు ఉంటాయని టాక్. అంతేకాదు, కథకు తగ్గట్టుగా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారట. గతంలో ‘బింబిసార’ సినిమాతో సోషియో ఫాంటసీ జానర్‌లో తన సత్తా చాటిన వశిష్ఠ.. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం మరోసారి అలాంటి జానర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం ఉంది. అదే నిజమైతే తండ్రీకొడుకులను ఒకే సినిమాలో చూడటమనేది నందమూరి అభిమానులకు పండగే.       [Mokshagna Debut Movie Shooting, Balakrishna Son Mokshagna, Mokshagna Movie Shooting Update, Nandamuri Balakrishna, Nandamuri Mokshagna, Director Vassishta, Mythri Movie Makers, Telugu Film News]  
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో రామ్ నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. రాశీ ఖన్నాకు జోడీగా రజనీకాంత్‌కు అల్లుడి పాత్రలో నటిస్తాడని, అలాగే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని రకరకాల ప్రచారాలు జరిగాయి. రామ్ రోల్ ఏంటనేది రివీల్ చేయలేదు కానీ, ‘ధర్మన్’లో రామ్ నటిస్తున్నట్లు అదిరిపోయే గ్లింప్స్‌తో అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన సిమ్రన్ నటిస్తుండగా.. రాశీ ఖన్నా, నయనతార, శ్రీలీల, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. 2027 ఏప్రిల్‌లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రామ్ పోతినేని గతంలో ‘ది వారియర్’ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పుడు నేరుగా రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆయన కెరీర్‌లో మరో ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు. మరి ‘ధర్మన్’లో రామ్ పాత్ర ఎలా ఉండబోతోంది? రజనీతో ఆయన స్క్రీన్ షేరింగ్ ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. https://x.com/RKFI/status/2119376888405578034       [Ram Pothineni In Dharman, Superstar Rajinikanth, Dharman Movie, Ram Pothineni, Kamal Haasan, Ashwath Marimuthu, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దీపావళి కానుక అదిరిపోయింది. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’ నుంచి మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి చేతిలో కొడవలి పట్టుకొని పొలంలో నిలబడి కనిపిస్తున్నారు. ఆయన లుక్, యాక్షన్ మోడ్ చూస్తుంటే సినిమాలో మెగాస్టార్ ఊచకోత ఏ రేంజ్‌లో ఉండబోతుందో పోస్టర్‌తోనే హింట్ ఇచ్చినట్లుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో.. మరోసారి ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘కాకా’పై ఆసక్తి పెరిగింది. అందులోనూ ఈసారి చిరంజీవిని మరింత మాస్ అవతార్‌లో చూపించబోతున్నారనే టాక్ ఉంది. ఇక ఈ పోస్టర్‌తో పాటు సినిమా విడుదల తేదీపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. దీంతో ‘కాకా’ వాయిదా పడుతుందంటూ ఇటీవల వినిపించిన ప్రచారానికి చెక్ పడినట్లయింది. ఈ సినిమాలో కీలక పాత్రలో అనస్వర రాజన్ నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి సంక్రాంతి బరిలోకి దిగనున్న మెగాస్టార్.. ఈసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. https://x.com/KaakaMovie/status/2119311973427134527       [Kaaka Diwali Poster, Chiranjeevi Kaaka Movie, Kaaka Sankranthi Release, Kaaka Release Date, Kaaka Movie, Megastar Chiranjeevi, Bobby Kolli, Anaswara Rajan, Telugu Film News]  
సోషల్ మీడియా.. సెలబ్రిటీలకు అభిమానులను దగ్గర చేసే వేదిక మాత్రమే కాదు.. ఒక్కోసారి అదే వేదిక వాళ్లకు తలనొప్పిగా కూడా మారుతోంది. ఏదైనా మాట్లాడినా, ఏదైనా చేసినా వెంటనే ట్రోలింగ్ మొదలవుతోంది. ఇక యువత పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్ అంటూ సోషల్ మీడియా ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “మా తరం చాలా అదృష్టవంతులం. మా రోజుల్లో సోషల్ మీడియా లేదు. కానీ ఈ తరానికి సోషల్ మీడియా ఉంది. అది అత్యంత క్రూరమైనది. దాని నుంచి తప్పించుకునే మార్గం కూడా లేదు” అని నాగార్జున అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిందని, ముఖ్యంగా యువత దాని ప్రభావానికి ఎక్కువగా లోనవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. నాగార్జున సమర్పణలో మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ‘ఇట్లు అర్జున’ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాగార్జున, అనీష్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు సోషల్ మీడియా ప్రభావంపై నాగార్జున మాట్లాడారు. తాము హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సోషల్ మీడియా లేకపోవడం తమ అదృష్టమని, కానీ ఇప్పటి కొత్త హీరోలు ఈ క్రూరమైన సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేకపోతున్నారని అన్నారు. సోషల్ మీడియా విషయంలో తన తరం అదృష్టవంతులమని నాగార్జున చెప్పడం వెనుక సెలబ్రిటీల అనుభవం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి బయటకు వచ్చే సమాచారం పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి విషయాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు, ట్రోలింగ్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ‘ఇట్లు అర్జున’ సినిమా గురించి కూడా నాగార్జున ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ చిత్రం నేటి యువత ఆలోచనలు, వారి జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని.. యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.       [Nagarjuna Social Media Comments, Akkineni Nagarjuna, Social Media, Itllu Arjuna, Aniesh, Anaswara Rajan, Telugu Film News]  
నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ‘దాదా’ సినిమా నుంచి తొలి పాట విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ‘దాదా ధమాకా’ అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్‌ను నవంబర్ 13న విడుదల చేయనున్నారు. దీపావళి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ స్టైలిష్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన పక్కనే బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా ఉన్నారు. ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నట్లుగా పోస్టర్‌ను డిజైన్ చేశారు. దీంతో ఈ పాటలో బాలయ్య, నర్గీస్ ఫక్రీ కలిసి స్టెప్పులు వేయబోతున్నారని అర్థమవుతోంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ-తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో ‘దాదా ధమాకా’ పాటపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య మాస్ స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘దాదా’ సినిమా విడుదల తేదీపై కొంతకాలంగా వాయిదా ప్రచారం జరుగుతోంది. షూటింగ్ ఆలస్యం, బాలకృష్ణకు జరిగిన గాయం కారణంగా సినిమా అనుకున్న సమయానికి వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్రబృందం మాత్రం డిసెంబర్ 24న థియేటర్లలోకి వస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో మరోసారి అదే రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలిసి చేస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై మంచి అంచనాలు ఉన్నాయి. 1980ల ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. https://x.com/NBKisDADA/status/2119304488641339633       [Dada First Single, Dada Dhamaka Song, Balakrishna Dada Movie, Nandamuri Balakrishna, Nargis Fakhri, Thaman, Gopichand Malineni, Telugu Songs]  
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది.  ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.  ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "ఇడుపు కాయితం" సినిమా నుంచి 'బారాత్ బీట్..' సాంగ్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అదిరే బీట్ తో 'బారాత్ బీట్..' సాంగ్ కంపోజ్ చేశారు. శ్రీలత (నాగదుర్గ), శ్రీనివాస్ (ప్రియదర్శి) పెళ్లి బారాత్ సందర్భంగా వచ్చే డ్యాన్స్ నెంబర్ గా ఈ సాంగ్ ను రూపొందించారు. ఈ పాటలో నాగదుర్గ మాస్ డ్యాన్స్ స్టెప్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. థియేటర్స్ లో ఈ పాటకు ఆడియెన్స్ స్టెప్స్ వేస్తారనడంలో సందేహం లేదు. - Baraat Beat Video Song       [Idupu Kayitham Movie, Baraat Beat Song, Priyadarshi, Nagadurga, Bunny Vas, Sukumar, Vamsi Reddy Dondapati, Telugu Movies 2026, Telugu Film News]  
The much-discussed combination of Allu Arjun and Malayalam filmmaker Basil Joseph appears to be moving closer to reality. Reports suggest that Basil Joseph has been finalised to direct Allu Arjun's 25th film, tentatively referred to as AA25. However, an official announcement from the actor or the production house is still awaited.  Basil's recent comments have added weight to the speculation. In an interaction with the media, he indicated that he is occupied with another time-consuming project and refrained from revealing details about his collaboration with Allu Arjun, suggesting that the discussions are still progressing.  The project is expected to be backed by Geetha Arts, with Allu Aravind reportedly producing it. If finalised, it will mark Allu Arjun's first collaboration with a Malayalam filmmaker and Basil Joseph's entry into Telugu cinema as a director.  Also Read: Raaka: Allu Arjun works on Diwali and shocks entire team Interestingly, the proposed film has also been linked to a superhero subject following Basil's success with Minnal Murali. However, director Arun Anirudhan has clarified that the Allu Arjun project has no connection with the previously discussed Shaktimaan adaptation.  Allu Arjun is currently occupied with Atlee's Raaka and his upcoming collaboration with Lokesh Kanagaraj. The Basil Joseph project is expected to take shape after these commitments, with the director reportedly working on the script. Check Out: Salman Khan denies any script changes in Maatrubhumi                      Ranbir Kapoor plans to direct like Raju Hirani Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రయాణం. ముఖ్యంగా మగపిల్లలను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో మగపిల్లల పెంపకానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉంటాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ పెంపకం పద్ధతుల్లో కూడా మార్పులు రావడం చాలా అవసరం.మగపిల్లలను కేవలం క్రమశిక్షణ పేరుతో కట్టడి చేయడం వల్ల వారి మానసిక వికాసం దెబ్బతినే అవకాశం ఉంది. పిల్లలు పూర్తీగా  ఎదగాలంటే వారిని అర్థం చేసుకుంటూ సరైన మార్గంలో నడిపించాలి. మగపిల్లల పెంపకంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఏమిటి?  వాటిని ఎలా సరిదిద్దుకోవాలి?  వివరంగా తెలుసుకుంటే.. అల్లరిని ఆపకూడదు.. మగపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు మొదటిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వారిని అల్లరి చేస్తున్నారని ఎప్పుడూ ఆపకూడదు. పిల్లలు అల్లరి చేయడం వారి మెదడు ఎదుగుదలలో ఒక భాగం. వారు ఆటలాడుకుంటూ, ఇళ్లంతా తిరుగుతూ చేసే అల్లరి వారి శారీరక , మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది. ప్రతి చిన్న విషయానికి వారిని అరిచి, భయపెట్టడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల సహజమైన అల్లరిని కొంతవరకు అర్థం చేసుకుని, దాన్ని సరైన పద్ధతిలో మళ్లించాలి. రోజంతా ఇంట్లోనే ఖాళీగా కూర్చోబెట్టడం.. పిల్లలను రోజూ ఆరుబయట ఆటలాడడానికి పంపాలి. వారి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కి ఆటలు చాలా అవసరం. ప్లే గ్రౌండ్ లో  ఆడుకోవడం వల్ల పిల్లలలో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. తోటి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం, టీమ్ స్పిరిట్ నేర్చుకోవడం వంటివి ఆటల ద్వారానే సాధ్యమవుతాయి. ఇంట్లోనే మొబైల్స్ లేదా వీడియో గేమ్స్‌కి పరిమితం చేయకుండా శారీరక శ్రమ ఉండే ఆటలను ప్రోత్సహించాలి. ఏడవద్దని చెప్పడం.. మగపిల్లలకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. వారు బాధగా ఉన్నప్పుడు, కష్టంగా అనిపించినప్పుడు ఏడవడం సహజం. అలాంటప్పుడు వారి భావాలను అణచివేయడం వల్ల భవిష్యత్తులో వారు తమ భావాలను బయటపడలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. మగపిల్లలు ఏడవకూడదు.. లాంటి మాటలు అస్సలు చెప్పకూడదు.  వారి బాధను బయటకు వ్యక్తం చేయడానికి స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వారు మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ప్రయత్నాలకు ప్రోత్సాహం.. భయం వల్ల పిల్లలను ప్రతి చిన్న విషయానికి కట్టడి చేస్తుంటారు. అయితే సురక్షితమైన హద్దుల్లో ఉంచుతూనే పిల్లలు చేయాలకునే పనులకు,  కొత్త ప్రయత్నాలకు   వారిని ప్రోత్సహించాలి. ఇలాంటి చిన్న సాహసాలు చేయడం వల్ల పిల్లల్లో ధైర్యం పెరుగుతుంది , భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుంది. తండ్రి ప్రవర్తన.. పిల్లలు ముఖ్యంగా మగపిల్లలు తమ తండ్రిని ఆదర్శంగా తీసుకుంటారు. తండ్రి ఇంటా బయటా ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇతరులను ఎలా గౌరవిస్తున్నాడు అనే అంశాలను పిల్లలు నిశితంగా గమనిస్తుంటారు. పిల్లలు తండ్రిని చూసి ప్రవర్తన నేర్చుకుంటారు కాబట్టి ఇంట్లో పెద్దల ప్రవర్తన ఎప్పుడూ ఆదర్శప్రాయంగా ఉండాలి. మొత్తంగా చెప్పాలంటే మగపిల్లల పెంపకం కేవలం నియంత్రణతో కూడుకున్నది కాకుండా, ప్రేమతో, అవగాహనతో సాగాలి. వారి ఆలోచనలను గౌరవిస్తూ, సరైన మార్గదర్శకత్వం అందించినప్పుడే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు. తల్లిదండ్రులు ఈ చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ వహిస్తే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం చాలా సులభం అవుతుంది.                                 *రూపశ్రీ.
జీవితంలో ఎవరికైనా హార్ట్ అటాక్ లేదా గుండెపోటు వచ్చినప్పుడు మొదటి ఐదు నిమిషాలు ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలకమైనవిగా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడినప్పుడు బాధితుడిలో తీవ్రమైన ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, వికారం, చేతులు లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో చాలామంది ఏం చేయాలో తెలియక ఆందోళన చెంది అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తుంటారు. కానీ, అంబులెన్స్ వచ్చే వరకు చేసే చిన్నపాటి జాగ్రత్తలు కూడా బాధితుడి ప్రాణాలను నిలబెట్టడంలో అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు మధుమేహం ఉన్నవారిలో ఛాతీ నొప్పి లేకుండానే ఇతర లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నందున, అనుమానం వచ్చిన క్షణంలోనే అప్రమత్తం కావడం చాలా ముఖ్యమైన విషయమని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరికైనా గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే చేయవలసిన మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పని భారతదేశంలో అత్యవసర సేవల నంబర్లయిన 108 లేదా 112కు కాల్ చేసి అంబులెన్స్‌ను పిలవడం. నొప్పి በటానంతట అదే తగ్గుతుందేమోనని ఎదురుచూడకుండా ఉండాలి. బాధితుడిని సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయడం కంటే అత్యవసర సిబ్బందిని పిలవడం మంచిది, ఎందుకంటే అంబులెన్స్ సిబ్బంది దారిలోనే అవసరమైన ప్రాథమిక వైద్య సహాయం ప్రారంభించగలరు. అంబులెన్స్ వచ్చే వరకు బాధితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనివ్వకూడదు. శారీరక శ్రమను పూర్తిగా నిలిపివేసి, వీలైనంత సౌకర్యంగా కూర్చోబెట్టాలి లేదా వెనుకకు తగిన ఆధారం ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. అలాగే బాధితుడి శరీరంపై బిగుతుగా ఉన్న దుస్తులు, టై వంటి వాటిని వదులుగా చేయాలి. బాధితుడిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదిలిపెట్టకుండా పక్కనే ఉంటూ వారి స్పృహ మరియు శ్వాసలో ఏవైనా మారుతున్నాయా అని నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఒకవేళ బాధితుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, సాధారణంగా శ్వాస తీసుకోకపోతే అది ప్రాణాంతకమైన కార్డియాక్ అరెస్ట్ లక్షణం కావచ్చని గుర్తించాలి. వెంటనే అత్యవసర సేవల సిబ్బందికి సమాచారం అందించి, సీపీఆర్ (CPR) ప్రక్రియను ప్రారంభించాలి. సీపీఆర్ శిక్షణ పొందిన వారు ఛాతీ మధ్య భాగంలో రెండు చేతులను ఒకదానిపై మరొకటి ఉంచి గట్టిగా, నిమిషానికి 100 నుంచి 120 సార్లు చొప్పున వేగంగా కంప్రెషన్లు ఇవ్వాలి. పెద్దవారిలో ఈ విధంగా ఛాతీని నొక్కడం వల్ల మెదడుతోపాటు ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణ నిరంతరం కొనసాగుతుంది. ఇది కూడా చదవండి: కేలరీలు తక్కువ.. పోషకాలు ఎక్కువ: పాలకూర ఇడ్లీ స్పెషల్ రెసిపీ! శిక్షణ లేని వ్యక్తులు కూడా అత్యవసర సేవల ఫోన్ లైన్ ద్వారా ఇచ్చే సూచనలను శ్రద్ధగా పాటిస్తూ హ్యాండ్స్-ఓన్లీ CPR అందించవచ్చు. ఒకవేళ అందుబాటులో AED (Automated External Defibrillator) యంత్రం ఉంటే దానిని తెచ్చి, అందులోని వాయిస్ సూచనలను అనుసరించి వైద్య సిబ్బంది వచ్చే వరకు అమర్చాలి. గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఎలాంటి ఇంటి చిట్కాలు చేయడం, నీళ్లు లేదా ఆహారం తాగించడం వంటివి చేయకూడదు. బాధితుడు స్పృహ కోల్పోయినప్పుడు నోట్లో నీళ్లు లేదా మాత్రలు బలవంతంగా వేయడం ఊపిరితిత్తులలోకి ద్రవాలు వెళ్లేలా చేసి మరింత ప్రమాదకరంగా మారుతుంది. డాక్టర్ల సలహా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులను కూడా సొంతంగా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి. గుండెపోటు సమయంలో గుండె కండరాలకు రక్తప్రసరణ ఎంత త్వరగా పునరుద్ధరిస్తే, ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలో స్పందించి సరైన పద్ధతులు పాటించడం వల్ల గుండె కండరాలకు జరిగే నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. బాధితుడిని ఎటైనా నడిపించడం, మెట్లు ఎక్కించడం లేదా అనవసరమైన శారీరక శ్రమకు గురిచేయడం ప్రాణాలకే ముప్పు తెస్తుంది. కేవలం ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ, మానసిక ధైర్యాన్ని నింపుతూ అంబులెన్స్ వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలను విజయవంతంగా కాపాడవచ్చు. అత్యవసర సమయాల్లో ఇటువంటి ప్రాథమిక విషయాలపై ప్రతి ఒక్కరికీ కచ్చితమైన అవగాహన ఉండటం అత్యంతావశ్యకం. మీకు నచ్చవచ్చు: రోగ నిరోధక శక్తిని పెంచే, హెల్దీ మొలకల చాట్ రెసిపీ! పాలు, బాదం కంటే శక్తినిచ్చే పొద్దుతిరుగుడు గింజల అద్భుత లాభాలు!       Heart Attack First Aid, Emergency Life Saving Steps, Cardiac Arrest Response, Recognize Heart Attack Symptoms, Medical Emergency Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
చాలా మంది రాత్రి సమయంలో పడుకునే ముందు లేదా అర్ధరాత్రి పూట తమ పాదాల అరికాళ్ళలో తీవ్రమైన మంట, భరించలేని వేడి, మరియు దురద వంటి చికాకులను విపరీతంగా అనుభవిస్తుంటారు. వైద్య ప్రపంచంలో ఈ విచిత్రమైన మరియు బాధాకరమైన పరిస్థితిని  బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్  అని పిలుస్తారు. ఇది కేవలం వాతావరణ వేడి వల్ల లేదా రోజంతా తిరిగినడవడం వల్ల వచ్చే సాధారణ అలసట మాత్రమే కాదు. శరీరంలో అంతర్గతంగా తలెత్తుతున్న కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాలలో ఈ రకమైన మంట మరియు చికాకు రావడానికి అత్యంత ప్రధానమైన కారణాలలో అదుపులో లేని మధుమేహం మొదటి స్థానంలో ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, అది శరీరంలోని సున్నితమైన నరాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల  డయాబెటిక్ న్యూరోపతి  అనే అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారికి నరాల పనితీరు మందగించి, పాదాల అరికాళ్ళలో సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, తిమ్మిరి, తీవ్రమైన వేడి మరియు దురద వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. మధుమేహంతో పాటు శరీరంలో పోషకాల లోపం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలో నరాల ఆరోగ్యానికి అత్యంతావసరమైన విటమిన్ బి12 లోపించినప్పుడు నరాల బలహీనత ఏర్పడుతుంది.  ఈ విటమిన్ లోపం కారణంగా వచ్చే నరాల బలహీనత నరాల చికాకుగా మారి పాదాలలో తీవ్రమైన మంటను కలిగిస్తుంది. కేవలం పోషకాల లోపమే కాకుండా, థైరాయిడ్ గ్రంధి పనితీరు తక్కువగా ఉండటం, అలాగే మూత్రపిండాల వైఫల్యం లేదా కిడ్నీ రుగ్మతల కారణంగా శరీరంలో పేరుకుపోయే వ్యర్థ విషపదార్థాలు కూడా నరాలను దెబ్బతీసి ఈ చికాకుకు కారణమవుతాయి. ఇది కూడా చదవండి:బిల్వ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి మేలు? ఎవరికి డేంజర్? అలాగే, అధికంగా మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో కూడా ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుంది. క్రమం తప్పకుండా అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం నేరుగా నరాలను బలహీనపరుస్తుంది. దీనివల్ల పాదాలలో తిమ్మిర్లు రావడంతో పాటు సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి, వేడి అనుభూతి కలుగుతాయి. ఈ రకమైన లక్షణాలు శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుందనడానికి సంకేతంగా భావించాలి. ఈ అనారోగ్య లక్షణాలను ఎట్టి పరిస్థితులలోనూ తేలికగా తీసుకోవడం గానీ, సొంత వైద్యం చేసుకోవడం గానీ చేయకూడదు. రాత్రిపూట పాదాలలో మంట మరియు దురద వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటే, వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు మరియు నరాల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సరైన సమయంలో సమస్య మూలాలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో వచ్చే పెను ముప్పుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం! భారతదేశానికి ,జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? ఆసక్తికరమైన చరిత్ర!       Burning Feet At Night, Itchy Feet Causes, Nighttime Foot Discomfort, Nerve Health Warnings, Medical Reasons For Foot Burning, Doctor Health Advice, Health Tips In Telugu.  
  శరీరంలో కఫం పేరుకుపోవడం వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మారుతున్న కాలం, వాతావరణంలో వచ్చే మార్పులు, వివిధ రకాల అలర్జీల కారణంగా ముక్కు దిబ్బడ, గొంతులో గరగర, ఛాతీలో కఫం గడ్డకట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రకరకాల మందులు, యాంటీబయోటిక్స్ వాడుతుంటారు.  వీటి వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో  తయారు చేసుకునే పానీయం  తాగడం వల్ల ఈ సమస్యను  శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.  ఇంతకూ ఈ పానీయం ఏమిటి? దాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి?  ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కఫం.. మన శరీరంలో కఫం అనేది ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ లేదా ముక్కు భాగాల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పేరుకుపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరం ఎంతో అలసటకు గురవుతుంది. దీనిని నివారించడానికి వంటింట్లో లభించే నాలుగు ముఖ్యమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు..  తేనె.. తేనెలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గొంతును ప్రశాంతంగా ఉంచుతూ, పేరుకుపోయిన గట్టి కఫాన్ని పల్చగా మార్చడానికి తేనె ఎంతగానో సహాయపడుతుంది.  అల్లం.. అల్లంలో జింజిరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒక సహజమైన డికంజస్టెంట్ లా పనిచేస్తుంది. గొంతులో , చాతిలో పేరుకుపోయిన మందపాటి కఫాన్ని కరిగించి, అది సులభంగా శరీరం నుంచి బయటకు వచ్చేలా చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది వాపులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మిరియాలు.. మిరియాలు ముక్కు మార్గాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అక్కడ చిక్కుకున్న కఫాన్ని కరిగించి బయటకు పంపడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అల్లం , తేనెలోని పోషకాలు శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు సహాయపడతాయి. నిమ్మరసం.. నిమ్మరసంలో విటమిన్ సి  పుష్కలంగా  ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కఫానికి కారణమయ్యే అలర్జీలను అరికట్టి, గొంతు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది. పై నాలుగు పదార్థాలను ఉపయోగించి ఈ కింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఫాలో అవుతూ మంచి ఫలితం పొందవచ్చు.. మొదటి పద్దతి.. ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో తాజా అల్లం రసం లేదా అల్లం పొడి కలపాలి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి. ఇది గొంతులో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం ఇస్తుంది. రెండవ పద్ధతి.. ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి, అందులో అల్లం పొడి లేదా తురిమిన అల్లం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం వేయాలి. చివరగా ఒక టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనె కలిపిన తర్వాత నీటిని మరిగించకూడదు. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా తాగితే గొంతుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పైన చెప్పుకున్న రెమిడీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకుంటే రాత్రంతా పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్రలో కఫం అడ్డుపడకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.                                     *రూపశ్రీ.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)