వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ విమర్శలు, వ్యూహాలు, ప్రెస్ మీట్లే. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఆ తరువాత క్రమంగా పార్టీలో ప్రాభవం, పలుకుబడి కోల్పోయారు. దరిమిలా 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత ఆయన పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించారు. అయితే కొద్ది కాలానికే రాజకీయ సన్యాసంపై యూటర్న్ తీసుకుని సొంత పార్టీ అంటూ ప్రకటనలు గుప్పించారు. పనిలో పనిగా జగన్ పై విమర్శలూ గుప్పించారు. విజయసాయి తొలి నుంచీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మార్చారు. ఇన్ స్టా గ్రాం రీల్స్ తో సందడి చేస్తున్నారు.  ఇటీవల   సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విజయసాయి  రాజకీయ విషయాలకే పరిమితం కాకుండా, విభిన్న అంశాలపై  రీల్స్ రూపొందిస్తూ  నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. తాజాగా  తారకరత్న కుమార్తెతో కలిసి ఆయన ఇటీవల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్  అయ్యింది.    అయితే విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోకి సొంత పార్టీతో రీఎంట్రీ ఇవ్వబోతున్న విజయసాయి, ఇలా రీల్స్ లో నెట్టింట, నెటిజనులలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.   [Vijay Sai Reddy Instagram reels, New Political Strategy, AP politics, videos, digital politics, Telugu One]
అర్నాబ్ పెను తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో పెను విలయం సృష్టించింది. ఈ పెను తుపాను కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, పంట నష్టం సంభవించింది. తుపాను హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం కనిష్టానికి తగ్గంది కానీ ఆస్తి, పంట నష్టం అపారంగా వాటిల్లింది.  ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో జరిగిన నష్టానికి తగిన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి న చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో, కేంద్రం తక్షణమే స్పందించి సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అర్నాబ్  ధాటికి తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉప్పాడ వంటి తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రతకు మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న పలువు స్థానికులను, కార్మికులను రెస్క్యూ టీమ్స్   సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రహదారులపై చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.   ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో సుమారు రూ. 4 వేల600 కోట్ల మేర ఆస్తి, పంట  నష్టం వాటిల్లింది.   గతంలో వచ్చిన హుద్‌హుద్, తిత్లీ వంటి తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని అధికార వర్గాలు వెల్లడించాయి.   ఈ సంక్షోభం నుంచి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించడం, మునిగిపోయిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను సరిచేయడం వంటి అత్యవసర పనులకు   ప్రాధాన్యత ఇస్తున్నారు. మత్స్యకారులు కోల్పోయిన బోట్లకు, జీవనోపాధికి తగిన నష్టపరిహారం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు.  అయితే ఏపీని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  అర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు. ఇందుకు తమిళనాడు సర్కార్ క్షణం ఆలోచంచకుండా సరే అంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిపవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఎన్డీయే తరఫున ప్రచారం చేశారు. అంటే తమిళనాడు సీఎం విజయ్ కు, ఆయన పార్టీ టీవీకేకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ వినతికి తక్షణమే స్పందించి ఏపీకి తమిళనాడు విద్యుత్ సిబ్బందిని, అవసరమైన సామగ్రిని పంపేందుకు అంగీకరించారు.   అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో  విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయపడటానికి తెలంగాణ కూడా విద్యుత్ సిబ్బందిని పంపింది.   ఎన్నికలలో రాజకీయ వైరం సహజమే కానీ, కానీ విపత్తు సహాయక చర్యలు దానికి రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలన్న సందేశాన్నిఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు తమ చేష్టల ద్వారా చాటాయి. రాష్ట్రల మధ్య సమైక్యతకు, పరస్పర సహకారానికి ఇటువంటి చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయని పరిశీలకులు అంటున్నారు.   [Tamilnadu Telangana come forward Help AP, Cyclone Arnab, Damage, Andhra Pradesh, Chandrababu Naidu,Vijay, Revanth, Telugu One]
ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా స్థానిక ఎన్నికల వేళ.. జగన్ కు ఆయన మిత్రుడు బిగ్ షాక్ ఇచ్చారు. జగన్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు  పాలనను, కరవును ఎదుర్కొనే విషయంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని, పాలనా వైఫల్యాలనూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎండగడుతున్న వేళ..పొరుగు రాష్ట్రంలోని ఆయన మిత్రుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు చంద్రబాబునాయుడి పాలనా దక్షతను, విధానాలను ప్రశంసించారు.   సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.  ఒక సందర్భంలో సినీ నటుడు రజనీకాంత్ అమరావతిని, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసించినప్పుడు ఆయనపై వైసీపీ సోషల్ మీడియాలోనూ, బహిరంగంగానూ  విమర్శల దాడికి దిగింది.    కానీ పాపం, తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ముందుచూపును, కరవు సమర్థవంతమైన నిర్వహణను ప్రస్తుతిస్తే.. మింగలేక కక్కలేక అన్నట్లు మౌనం వహించింది.      ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మంచి దోస్తులు. వారిరువురి మధ్యా రాజకీయ, వ్యక్తిగత మైత్రీ బంధం అందరికీ తెలిసిందు.  అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు తెలంగాణలో రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి అక్కడి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించడం రాజకీయ అవసరం. అందుకోసం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనతో పోలుస్తూ రేవంత్ వైఫల్యాలను ఎండగట్టడం ఆ పార్టీకి అనివార్యం.   ఆ రాజకీయ అనివార్యత కారణంగానే కేటీఆర్ చంద్రబాబును ఆకాశానికెత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందు కోసం ఆయన జగన్ తో మైత్రిని పట్టించుకోలేదు. లెక్క చేయలేదు.  చంద్రబాబును ప్రశంసించిన ఎవరిపైనైనా పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ముద్ర వేసి అనుచిత వ్యాఖ్యలతో, విమర్శలతో విరుచుకుపడే వైసీపీ ఇప్పుడు మౌనం వహించడంగమనార్హం.  కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ తో సంబంధాలు దెబ్బతింటుందనే భయం, అలాగని మౌనం వహిస్తే.. చంద్రబాబు సమర్థతను అంగీకరించినట్లౌతుందన్న ఆందోళనతో వైసీపీ సతమతమౌతున్నట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.  [KTR Big Shock To Jagan, Praises CBN, Telangana, Andhra Pradesh Politics, Political Necesacities, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  వరల్డ్ సెల్యులాయిడ్ వద్ద ఆదర్శ కుటుంబం ప్యూర్ వెజిటేరియన్ టాక్ తో దూసుకుపోతూ ఉంది. స్టిల్ మహారాష్ట్రలోని పూణే లో పెద్ద ఎత్తున మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు,అభిమానులు మార్నింగ్ 9 .45 షో కి పెద్ద ఎత్తున చలో టూ ఆదర్శ కుటుంబం థియేటర్స్ అంటూ తరలి వెళ్తున్నారంటే ఆదర్శ కుటుంబం హవా అర్ధం చేసుకోవచ్చు.ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆదర్శ కుటుంబం సరికొత్త రికార్డులో నమోదు చేయవచ్చనే మాటలు వినపడుతున్నాయి.  మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు చూస్తే  ప్రపంచవ్యాప్తంగా 16.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచింది. ఆశ్చర్యం ఎందుకని అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. అంచనాలు లేకపోవడానికి కూడా కారణం పలు మార్లు వాయిదా పడటం. అందుకే మంత్ ఎండింగ్ లో, అది కూడా కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఫస్ట్ డే 16 .65 కోట్లు రాబట్టడంతో ట్రేడ్ సర్కిల్స్ విస్తుపోతున్నాయి.    ఇండియా వైడ్ గా చూసుకుంటే  ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 11.15 కోట్లు.తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలోనే అత్యధికంగా  9.25 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు కావడం విశేషం. నివేదికల ప్రకారం ఈ మొత్తం వసూళ్లలో ఇండియన్ మార్కెట్ వాటా 67 శాతం కాగా, ఓవర్సీస్ నుండి మిగతా 33 శాతం వసూళ్లు లభించాయి. కన్నడ ప్రాంతంలో శ్రీనిధి శెట్టి క్రేజ్ మరియు వెంకీ అభిమానుల ఆదరణతో కర్ణాటకలోను 1.40 కోట్ల గ్రాస్ వచ్చింది. మిగిలిన రాష్ట్రాలలో తమిళనాడు 30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 18 లక్షలు, కేరళ నుండి  2 లక్షలు సాధించి మొత్తం 11.15 కోట్ల ఇండియా గ్రాస్‌ను నమోదు చేసుకుంది.   ఇది కూడా చదవండి: కిల్లర్ మూవీ రివ్యూ    విదేశాల్లో సైతం విక్టరీ వెంకటేష్ జెండా ఎగిరింది. ఓవర్సీస్ మార్కెట్లలో మొదటి రోజే రూ. 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి నార్త్ అమెరికా మరియు ఇతర దేశాల్లో సాలెడ్ ఓపెనింగ్స్ అందుకుంది. థియేటర్ల ఆక్యుపెన్సీ విషయానికి వస్తే, దేశవ్యాప్తంగా దాదాపు 3,073 షోలలో 44.1 శాతం సగటు ఆక్యుపెన్సీ నమోదు కాగా, ప్రదర్శనల సమయం బట్టి గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఉదయం పూట 34.46 శాతం, మధ్యాహ్నం 37.15 శాతం, సాయంత్రం 46 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోలకు ఏకంగా 61.69 శాతానికి ఎగబాకింది. హైదరాబాద్‌లోని ప్రీమియం తెలుగు EPIQ ఫార్మాట్‌లలో అయితే రాత్రి షోలు 100 శాతం ఆక్యుపెన్సీతో హౌస్‌ఫుల్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ తెలంగాణ  56.74 లక్షలు, ఆంధ్రప్రదేశ్. 32.90 లక్షలతో ముందంజలో నిలిచాయి. వీకెండ్ కావడంతో రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.     [Aadarsha Kutumbam First Day Collections, Aadarsha Kutumbam collections, AK 47 Box Office Collection, Aadarsha Kutumbam Movie Review, TeluguCinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
  -సినిమా పేరు: కిల్లర్  -న‌టీన‌టులు: జ్యోతి పూర్వజ్, సుకు పూర్వజ్, మనీష్, విశాల్ రాజ్,అర్చన అనంత్, చంద్రకాంత్ కొల్లు తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి  -ఎడిటింగ్: సుకు పూర్వజ్ -మ్యూజిక్: ఆశీర్వాద్ లుకే  -నిర్మాత‌: సుకు పూర్వజ్  -బ్యానర్: థింక్ సినిమా  -రచన,దర్శకత్వం: సుకు పూర్వజ్ -రిలీజ్ డేట్ : అక్టోబర్ 30 , 2026  కింగ్ నాగార్జున హిట్టు బొమ్మ కిల్లర్.. ఆ టైటిల్ ని మరోసారి గుర్తు చేస్తూ 'కిల్లర్' ఈ రోజు సెల్యులాయిడ్ పై టేక్ ఆఫ్ అయ్యింది. యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం, ట్విస్ట్ చెపితే కోటి రూపాయలు ఇస్తామనే  ప్రకటనతో ప్రేక్షకుల చూపుని తన ఆదీనంలో ఉంచుకుంది. నిన్న చాలా ఏరియాస్ లో ప్రీమియర్స్ సైతం  ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ దట్టమైన అభయారణ్యం నీలగిరి ఫారెస్ట్ లోని నందికొన ఏరియాలో ఆకాశం నుంచి భారీ 'ఉల్క' రాలిపడుతుంది.  దాంతో నిప్పుల జడివానలాగా సంభవించి అక్కడ జరుగుతున్న రహస్య ప్రయోగశాల డామేజ్ అవుతుంది. రనియా(జ్యోతి పూర్వరజ్) ఒక ఉగ్రవాది.. బాంబులు పెట్టి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసుకుంటుంది. రతిక( జ్యోతి పూర్వజ్) బాగా డబ్బున్న హై క్లాస్ యువతి.. తన అందంతో, మత్తుచూపులతో   మగవాళ్ళని తన వశం చేసుకోగలదు. కానీ శారీరక సుఖం టైంకి రక్త పిశాచిగా మారి మనిషి రక్తం తాగుతుంది. సియా( జ్యోతి పూర్వజ్) ఉన్నత వర్గానికి చెందిన పెళ్ళైన  యువతి. భర్తతో కలిసి ఒక ఏరియాలోని రిసార్ట్ కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని వాంటెడ్ గా చంపుతుంది. ఆధునిక సైంటిస్ట్ పూర్వజ్( పూర్వజ్)..మనిషి మెదడులో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చనేది తన నమ్మకం. ఈ క్రమంలో  సినీ రచయిత  అయిన ఒక యువతి మెదడులోకి  ఆర్టిఫిషియల్ చిప్‌ని పెట్టడానికి ప్రయత్నిస్తాడు. మరి ఇన్ని పార్శ్యాలని అమర్చుకున్న  ఉన్న కథలో కిల్లర్ ఎవరు? మిగతా క్యారక్టర్ ల కథ ఏంటనేదే కిల్లర్ మూవీ. ఎనాలసిస్  కథగా చూసుకుంటే మంచి క్యూరియాసిటీ కలిగించే కథనే. కాకపోతే కథనం, క్యారెక్టర్స్ డిజైన్ విషయంలో మరింత శ్రద్ద చూపించి ఉండాల్సిందేమో. అంటే జ్యోతి పూర్వరాజ్ పోషించిన అన్ని క్యారెక్టర్స్ ని లెంతి గా చూపించాల్సింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రారంభ సన్నివేశంతో పాటు ఫస్ట్ హాఫ్ చాలా వరకు క్యూరియాసిటీగానే సీన్స్ వచ్చాయి. జ్యోతి పూర్వ రాజ్ పోషించిన అన్ని క్యారెక్టర్స్ కి సంబంధించిన సన్నివేశాలు పర్లేదు. పోలీస్ ఇన్విస్టిగేషన్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ క్రమ క్రమంగా ఒకే ఫార్మేట్ లో సాగుతునట్టుగా అనిపించింది. కాకపోతే  ఇంటర్వెల్ ముందు వరకు కూడా కథ ఏంటనే విషయం అర్ధం కాక మేకర్స్ కి సరెండర్ పొజిషన్ లో ఉండిపోతుంది. దీంతో వేరే ఇతర లోపాలేమి కనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మొదటి పది నిమిషాలు క్యూరియాసిటీ గానే సీన్స్ వచ్చాయి.  ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ సీన్స్.  రచయిత ( జ్యోతి పూర్వజ్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ . ఆ తర్వాత వచ్చిన సీన్స్ లలో బలం లేకపోయినా పర్లేదు.ఈ సినిమా బడ్జెట్, మేకింగ్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ వర్క్ చూస్తే మంచి క్వాలిటీతో, అనుసరించిన టెక్నాలజీ విలువలు చాలా రిచ్‌గా అనిపిస్తాయి. కాకపోతే వచ్చిన ప్రతి సీన్ కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా  ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేశారనే ఫీలింగ్‌ని కలిగించడంలో మేకర్స్  సక్సెస్ అయ్యారు. నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు    పలు విభిన్న క్యారెక్టర్స్ లో జ్యోతి పూర్వజ్ పెర్ఫార్మ్ సూపర్. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా ఎంత వరకు చెయ్యాలో అంత వరకే చేసింది. మంచి అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో తన కట్ అవుట్ రేంజ్ ని చాలా బలంగానే చెప్పడం మాత్రం పక్కా. పోలీస్ ఆఫీసర్, శాస్త్రవేత్తగా పూర్వజ్ కూడా మంచి పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. జ్యోతి పూర్వజ్ తమ్ముడిగా చేసిన యువనటుడు చందు సైతం తన నటనతో మెప్పించాడు. మంచి అవకాశాలు వస్తే నటుడుగా తన ప్రభ చాటగల సమర్థుడే. మిగతా వాళ్ళు కూడా తమ క్యారక్టర్ పరిధి మేరకు మెప్పించారు. పూర్వజ్ దర్శకుడిగా సక్సెస్. కథకుడిగా మోస్తరు మెప్పించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలం. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం  మూవీ రివ్యూ  బలాలు 1 . కాన్సెప్ట్  2 . జ్యోతి పూర్వజ్ పెర్ఫార్మెన్స్  3 . ఫస్ట్ హాఫ్  బలహీనతలు  1 . సెకండ్ హాఫ్ లో కథనం అంత ఆసక్తికరంగా లేకపోవడం  చివరిగా చెప్పాలంటే కథనం విషయంలో కొన్ని లోపాలు ఉన్నా మంచి కంటెంట్ తోనే వచ్చి పర్వాలేదనిపించారు రేటింగ్ 2 .25 /5                                                                                                                                                                                                                                                            అరుణాచలం   
సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, వారి ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్‌ వీడియోల బెడద మరింత పెరిగింది. తాజాగా నటి రితికా సింగ్ కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతోంది. ఆమె పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు సృష్టించడమే కాకుండా.. డీప్‌ఫేక్‌ వీడియోల పేరుతో అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా రితికా సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొందరు వ్యక్తులు తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, వాటి ద్వారా ఏఐతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అంతేకాదు, ఈ నకిలీ ఖాతాల్లో వీడియోలు చూడాలంటే నెలకు రూ.400 చొప్పున సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలని అడుగుతున్నారట. దీంతో తన అభిమానులు ఇలాంటి మోసాలకు బలికావద్దని ఆమె హెచ్చరించింది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉన్న అకౌంట్ మాత్రమే అఫీషియల్ అని రితికా స్పష్టం చేసింది. తన పేరుతో కనిపించే ఇతర అకౌంట్స్ ను నమ్మవద్దని, వాటిని గుర్తించిన వెంటనే రిపోర్ట్ చేయాలని కోరింది. ముఖ్యంగా అనధికారిక ప్రొఫైల్స్‌లో కనిపించే వీడియోలు, సబ్‌స్క్రిప్షన్ లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇది కూడా చదవండి: డ్రాగన్ అణుబాంబులా ఉంటుంది.. ఈసారి ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేస్తారు.! https://www.instagram.com/reel/DfFj8dNusmM/       [Ritika Singh Fake Instagram Subscription Scam, Ritika Singh Instagram, Ritika Singh Deepfake Videos, Ritika Singh AI Videos, Ritika Singh Viral Videos, Ritika Singh, AI Deepfake Videos, Telugu Film News]  
సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొత్త విషయం కాదు. చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల వారసులు సినిమాల్లోకి వస్తుంటారు. అయితే కొందరు మాత్రం తమ తండ్రి ఎంత పెద్ద దర్శకుడైనా సరే.. ఆ ఇమేజ్‌ను ఉపయోగించుకోకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో నటుడు సునీల్ రెడ్డి ఒకరు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంటున్న ఈయన బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. సునీల్ రెడ్డి మరెవరో కాదు.. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి తనయుడు. ఖైదీ, అభిలాష, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ముఠామేస్త్రి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను చిరంజీవికి అందించారు కోదండరామిరెడ్డి. టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడి కుమారుడే సునీల్ రెడ్డి.  అయితే సునీల్ రెడ్డి మాత్రం తండ్రి పేరుతో కాకుండా నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించారు. 2018లో విజయ్ సేతుపతి నటించిన 'సీతాకత్తి' సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత మాస్టర్, డాక్టర్, బీస్ట్, జైలర్, మామన్నన్ వంటి తమిళ సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా 'డాక్టర్' సినిమాలో మహాలీ పాత్రతో ప్రేక్షకులను బాగా నవ్వించారు.  మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సునీల్ రెడ్డి తమ్ముడు కూడా నటుడే. అతనే వైభవ్ రెడ్డి. తెలుగులో హీరోగా సినిమాలు చేసిన వైభవ్.. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి వచ్చిన అన్నదమ్ములిద్దరూ సినిమాల్లో కొనసాగుతుం డటం విశేషం. ఇటీవల సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలో సునీల్ రెడ్డి కనిపించడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయన గురించి ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడి కుమారుడు.. ఇప్పుడు తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.     [Sunil Reddy, A Kodandarami Reddy, Sunil Reddy Father, Kodandarami Reddy Son, Sunil Reddy Movies, Vaibhav Reddy, Jailer Actor Sunil Reddy, Tamil Actor Sunil Reddy]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నటుడు రాజీవ్ కనకాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ‘డ్రాగన్’ ఒక అణుబాంబులా ఉంటుందని ఆయన అన్నారు.  ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్.. ఈ నాలుగు పేర్లు కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని రాజీవ్ కనకాల అభిప్రాయపడ్డారు. ఈ సినిమా అభిమానులు రెండు కాలర్లు ఎగరేసుకునేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘డ్రాగన్’ సినిమా కోసం తాను ఇప్పటివరకు ఎనిమిది రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు. తన పాత్రకు సంబంధించిన మరికొంత షూటింగ్ ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ పనితీరును కూడా రాజీవ్ ప్రశంసించారు. ఆయనకు సన్నివేశం ఎలా ఉండాలి, నటీనటుల నుంచి ఎలాంటి నటన రాబట్టాలి అనే విషయాలపై స్పష్టత ఉంటుందని పేర్కొన్నారు. ఒక దర్శకుడికి తన కథపై పూర్తి అవగాహన ఉంటే నటీనటులు తమ పాత్రలను మరింత సులభంగా చేయగలరని వివరించారు. ‘డ్రాగన్’ కథ 1960ల కాలంలో గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో సాగుతుంది. అంతర్జాతీయ ఓపియం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్, బిజూ మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, అశుతోష్ రాణా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇది కూడా చదవండి: ‘అదుర్స్’ బామ్మ కన్నుమూత.. 60 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ.!       [Rajeev Kanakala About Dragon, Dragon Movie Atomic Bomb, NTR Dragon movie, NTR Prashanth Neel movie, Dragon Movie Updates, Jr NTR, Prashanth Neel, Rajeev Kanakala, Telugu Film News]  
నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, యజ్ఞ తుర్లపాటి   సాంకేతిక వర్గం: రచన: తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్ సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ సంగీతం: రవి బస్రూర్ ఎడిటింగ్: రవితేజ గిరిజాల దర్శకత్వం: విశ్వక్ సేన్ నిర్మాత: సందీప్ కాకర్ల   ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కీ వంటి సినిమాలతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న విశ్వక్ సేన్, ఇప్పుడు పలు పరాజయాల తర్వాత 'కల్ట్' (Cult) అనే స్లాషర్ యాక్షన్ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామనే హామీతో ఈ సినిమా అక్టోబర్ 30న విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం.   కథ: ఒక సినిమా నిర్మాత (KV Anudeep) జీవితం గురించి తెలుసుకోవడానికి, క్రైమ్‌ను దగ్గరగా చూడటానికి ముగ్గురు యువకులను గోవా పంపిస్తాడు. తనకు ఒక మంచి క్రైమ్ స్టోరీ కావాలని, ఈ అనుభవం వారికి అందుకోసం ఉపయోగపడుతుందని అతను భావిస్తాడు. మరోవైపు, గోవా హోం మంత్రి (Murli Sharma) కుమారుడు ఎల్విన్ (Tarak Ponnappa) తన తండ్రి వద్దంటున్నా వినకుండా తన పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. గోవాలో డ్రగ్ మాఫియాపై పోరాడే డీఎస్పీ సంకల్ప్ అలియాస్ సంకీ (Vishwak Sen), డ్రగ్స్ సప్లై జరుగుతుందనే అనుమానంతో ఆ పార్టీలోకి ప్రవేశిస్తాడు. కానీ అనూహ్యంగా ఒక 'కల్ట్' గ్యాంగ్ ఆ పార్టీని తమ ఆధీనంలోకి తీసుకుని విచక్షణారహితంగా చంపడం ప్రారంభిస్తుంది. వారు అక్కడున్న ప్రతి ఒక్కరినీ అందులో పాల్గొనేలా బలవంతం చేసి దారుణంగా హతమారుస్తుంటారు. వారు ఎందుకు అలా చేస్తున్నారు? వారి బారి నుండి అందరినీ కాపాడటానికి సంకీ ఏం చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   విశ్లేషణ: తన పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా నటించాడు కానీ సినిమాలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగానే ఉంటుంది. పాత్రలు, సినిమా నేపథ్యం పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్ల మొదటి 40 నిమిషాలు బోర్ కొట్టిస్తాయి. విశ్వక్ సేన్ ఉన్న సన్నివేశాలు బాగున్నప్పటికీ, దర్శకుడు ఆశించిన స్థాయి ఇంపాక్ట్‌ను ప్రేక్షకుడికి ఇవ్వడంలో అవి విఫలమయ్యాయి. రవి బస్రూర్ (Ravi Basrur) అందించిన నేపథ్య సంగీతం బాగుంది, ఆయన ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడానికి బాగా ప్రయత్నించాడు. కానీ యాక్షన్ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. ఒక దశ దాటాక ప్రతి సన్నివేశం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ ఐడియాలను ప్రయత్నించే క్రమంలో హత్యల సన్నివేశాలు ఒకేలా ఉండటంతో సినిమాలో వేగం తగ్గుతుంది. కథ ముందుకు సాగక ఒక దశ తర్వాత స్క్రీన్‌ప్లే చాలా నెమ్మదిస్తుంది. సాంకేతికంగా కొన్ని సన్నివేశాలు బాగానే వచ్చినా, సినిమాకు అవి పెద్దగా సహాయపడలేదు. మొత్తానికి స్లాషర్ జానర్‌లో ప్రయత్నించిన ఈ సినిమా, రచనలోని లోపాల వల్ల నిరాశపరుస్తుంది.   ప్లస్ పాయింట్స్: విశ్వక్ సేన్ నటన రవి బస్రూర్ నేపథ్య సంగీతం   మైనస్ పాయింట్స్: నెమ్మదించిన స్క్రీన్‌ప్లే రిపీట్ అయ్యే సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించే యాక్షన్ సీన్స్ సింగిల్ టేక్ షాట్స్ వర్కౌట్ కాలేదు   చివరిగా: ప్రయత్నం బాగున్నా.. ఆచరణలో విఫలమయ్యారు!   రేటింగ్: 2/5   గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి, వీటికి సంస్థకు ఎటువంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నాము.
Cast: Vishwak Sen, Gayatri Baradwaj, Tarak Ponnappa, Murli Sharma, Srikanth Iyengar, Yagnya Turlapati   Crew:  Written by Tharun Bhascker, Vishwak Sen  Cinematography by Aravind Viswanathan Music by Ravi Basrur  Editing by Ravi Teja Girijala  Directed by Vishwak Sen  Produced by Sandeep Kakarala   Vishwak Sen has proven his directorial capabilities in films like Falaknuma Das, Das ki Dhamki and now, after several disappointments, he came up with a slasher action film, Cult. The movie released on 30th October promising to give a new-age experience to audiences. Let's discuss about the film in detail.    Plot:  A movie producer (KV Anudeep) sends three youngsters to Goa to learn about life and experience crime. He wants a good crime story and hence, he thinks this experience will help them. Goa Home Minister (Murli Sharma)'s son Elvin (Tarak Ponnappa) decides to throw a party on his birthday, even though his father opposes it.  DSP Sankalp (Vishwak Sen) aka Sanki works against drug mafia in Goa and he enters into the party suspecting drug peddling. But a cult gang takes over and they start killing randomly. They force everyone to participate and brutally kill. Why? What will Sanki do to save them? Watch the movie to know more.  Analysis:  Vishwak Sen performs well in the character but his portions are limited. The first 40 minutes are literal bore as the characters and set up don't really work. While The scenes featuring him are good still, they fail to evoke the similar feeling or high they have intended.  BGM by Ravi Basrur is good and he tried to enhance all the sequences. But the action portions and sequences don't really work as anticipated. Each scene looks repetitive after a point and ideas keep repeating at places. But as they try some different ideas the killings get repetitive and that drops the momentum.  After a point, the screenplay feels lethargic with story not moving forward. Technically, few scenes work out but largely they did not really contribute. Overall, the movie tries a slasher genre but fails to deliver due to loopholes in writing.    Positives:  Vishwak Sen performance  Ravi Basrur score    Negatives:  Lethargic Screenplay  Repetitive Narrative  Action scenes feel too long  Oners don't help.    Bottomline: Ambition is visible but execution is lacking!    Rating: 2/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (93) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా శుక్రవారం (అక్టోబర్ 30) చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. తమిళ చిత్రాలతో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన ఆమె.. ‘అదుర్స్’ సినిమాలో నటించారు. ఎన్టీఆర్ బామ్మగా ఆమె పంచిన వినోదాన్ని తెలుగు ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు. సాధారణంగా నటీనటులు చిన్న వయసులోనే సినిమాల్లోకి వస్తుంటారు. కానీ వత్సల రాజగోపాల్ ప్రయాణం మాత్రం భిన్నం. మొదట రంగస్థలంపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సుమారు 60 ఏళ్ల వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ (1992) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో మధుబాలకు నాయనమ్మగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.  ఆ తర్వాత వయసుతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘సతి లీలావతి’, ‘రిథమ్’, ‘విన్నర్’, ‘అన్నియన్’, ‘మొళి’ వంటి తమిళ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ముఖ్యంగా అమ్మమ్మ, నాయనమ్మ పాత్రల్లో తన సహజమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. వత్సల రాజగోపాల్ ప్రయాణం సినిమాలకే పరిమితం కాలేదు. తమిళ టెలివిజన్ రంగంలోనూ ఆమె ఎన్నో సీరియళ్లలో నటించారు. ‘చిత్తి’, ‘ఆనందం’, ‘ముందానై ముడిచ్చు’, ‘వసంతం’ వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రంగస్థలం, సినిమా, టెలివిజన్.. ఇలా మూడు విభాగాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇది కూడా చదవండి: తొమ్మిదో నెలలోనూ అదే ఫిట్‌నెస్‌.. సమంత వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!       [Adhurs Actress Vatsala Rajagopal Passed Away, Vatsala Rajagopal passes away, Vatsala Rajagopal Death, NTR Adhurs Movie, Roja actress, Vatsala Rajagopal Age, Vatsala Rajagopal Movies, Vatsala Rajagopal]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పండుగ అనగానే మన ఇళ్లలో పిండి వంటలు, ఘుమఘుమలాడే కారపు పదార్థాలు, నోరూరించే తీపి పదార్థాల హోరు మొదలవుతుంది. అయితే ఈ పండుగ వేడుకల్లో ఆనందంగా తిన్న ఆహారమే కొన్నిసార్లు తీవ్రమైన ఎసిడిటీ, ఛాతీలో మంట, కడుపులో అసౌకర్యానికి దారితీస్తుంది. పండుగ సమయాల్లో మన చేసే కొన్ని చిన్న ఆహార పొరపాట్లు జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది ఉదయం పూట పండుగ పనుల బిజీలో లేదా విందు కోసం కడుపు ఖాళీగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉంటారు. ఇలా దీర్ఘకాలం పాటు ఖాళీ కడుపుతో ఉండి, ఆ తర్వాత ఒకేసారి భారీ విందు భోజనం చేయడం వల్ల కడుపుపై తీవ్రమైన ఒత్తిడి పడి ఆమ్లాలు (Acids) అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇది కడుపును సాగదీసి యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇక పండుగ విందులలో సమోసాలు, పకోడీలు, పూరీలు మరియు క్రీమీ గ్రేవీలతో కూడిన వేయించిన పదార్థాలు ఉండాల్సిందే. అయితే రీసెర్చ్ గేట్ (ResearchGate) అధ్యయనం ప్రకారం, ఇలాంటి అధిక కొవ్వు ఉండే వేయించిన ఆహారాలు జీర్ణమಾಗడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కడుపు ఖాళీ అయ్యే ప్రక్రియను మందగించి, ఛాతీలో మంట లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి. వీటితో పాటు అత్యంత కారంగా ఉండే కూరలు, పచ్చళ్లు మరియు మసాలా పదార్థాలు జీర్ణకోశ గోడలను చికాకు పెట్టి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే అందరికీ అన్ని మసాలాలు పడాలని లేదు, కొందరిలో మిరపకాయల కారం తక్షణమే ఎసిడిటీని ట్రిగ్గర్ చేస్తుంది. కాబట్టి మీ శరీర తత్వానికి సరిపడే మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. పండుగ పూట పిండివంటలు, చాక్లెట్లు, కేకులు మరియు రిచ్ డెజర్ట్‌లను పెద్ద మొత్తంలో లాగించేయడం మరో పెద్ద పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చాక్లెట్లు తీసుకోవడం వల్ల కొందరిలో రిఫ్లక్స్ సమస్య తీవ్రమవుతుంది. అలాగే విందు సమయంలో లేదా ఆ వెంటనే టీ, కాఫీలు లేదా కార్బోనేటెడ్ శీతల పానీయాలు అధికంగా సేవించడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం మరియు తేన్పులు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన వెంటనే కెఫిన్ పానీయాలు తీసుకోవడం యాసిడ్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, రాత్రి పూట ఆలస్యంగా భారీ విందు ముగించిన వెంటనే నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం తిరిగి అన్నవాహికలోకి (Oesophagus) తన్నేసే ప్రమాదం ఉంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ జర్నల్ నివేదిక ప్రకారం, భోజనానికి మరియు నిద్రపోవడానికి మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. రాత్రి వేళల్లో ఈ చిన్న నియమం పాటించకపోతే తీవ్రమైన ఎసిడిటీ నిద్రను భగ్నం చేస్తుంది. అందువల్ల పండుగ రుచులను ఆస్వాదిస్తూనే, మితంగా తింటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఎసిడిటీ జోలికిపోకుండా పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.     Festival Indigestion Causes, Holiday Acidity And Bloating, Prevent Acid Reflux Festivals, Festive Diet Mistakes, Heartburn Food Triggers, Digestive Health Tips, Wellness Tips In Telugu.
ప్రస్తుతం మన దైనందిన జీవితంలో స్మార్ట్‌వాచ్‌లు ఒక అత్యవసర ఆరోగ్య భాగస్వామిగా మారిపోయాయి. మణికట్టుపై ధరించే ఈ చిన్న పరికరం గుండె వేగం ఎంత ఉంది, ఎన్ని అడుగులు నడిచాం, ఎంతసేపు గాఢంగా నిద్రపోయాం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనకు తెలపడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, సకాలంలో ప్రాణాలను కాపాడుకునేలా ప్రోత్సహించాలని వైద్య నిపుణులు ఎల్లప్పుడూ హెచ్చరిస్తుంటారు. అయితే చాలామంది తమ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్‌బీట్ నిమిషానికి 72 సార్లు సాధారణంగా కనిపిస్తుంటే చాలు, తమకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, స్ట్రోక్ వచ్చే ప్రమాదం లేదని చాలా పొరపడుతుంటారు. గురుగ్రామ్‌లోని ప్రముఖ సీకే బిర్లా ఆసుపత్రి న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మోహిత్ ఆనంద్ ప్రకారం.. స్మార్ట్‌వాచ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి స్థాయి వైద్య పరీక్షా పరికరాలుగా భావించకూడదు. ఇవి కేవలం గుండె వేగం, గుండె లయ వంటి కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రమే గమనిస్తాయి. కొన్ని అత్యాధునిక పరికరాలు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib) వంటి అసాధారణ గుండె లయలను గుర్తించే సూచనలు ఇవ్వగలవు, ఇది భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. అయితే, అసలు విషయం ఏమిటంటే, స్ట్రోక్ అనేది కేవలం గుండె వేగానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మెదడుకు ఆక్సిజన్‌ను, రక్తాన్ని సక్రమంగా సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం, లేదా రక్తనాళం చిట్లిపోయి తీవ్రమైన రక్తస్రావం జరగడం వల్ల అకస్మాత్తుగా స్ట్రోక్ సంభవిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌వాచ్ స్క్రీన్‌పై గుండె నిమిషానికి సరిగ్గా సాధారణ రీడింగ్‌లో కొట్టుకుంటున్నట్లు కనిపించినా, మెదడులో జరిగే అంతర్గత రక్తనాళాల సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రోక్ ముప్పు ముంచుకొస్తున్నప్పుడు శరీరం కొన్ని కీలకమైన హెచ్చరిక సంకేతాలను అకస్మాత్తుగా ఇస్తుంది. ముఖం ఒకవైపు అకస్మాత్తుగా వాలిపోవడం, చేతులు లేదా కాళ్లలో ఒకవైపు తీవ్రమైన బలహీనత లేదా తిమ్మిరి ఆవరించడం, మాట్లాడటంలో ఇబ్బంది తడబడటం లేదా ఎదుటివారు చెప్పేది అసలు అర్థం చేసుకోలేకపోవడం, అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా దృష్టి పూర్తిగా కోల్పోవడం, నడవడంలో ఇబ్బంది కలగడం, సమతుల్యత దెబ్బతినడం, ఎటువంటి స్పష్టమైన కారణం తెలియకుండా విపరీతమైన తలనొప్పి రావడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి తప్ప, స్మార్ట్‌వాచ్ సాధారణ రీడింగ్ చూపిస్తోందన్న ధీమాతో ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం చేయకూడదు. లక్షణాలు ప్రారంభమైన సమయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవడం వైద్య చికిత్సలో అత్యంత కీలకం. కొన్ని నిమిషాల్లో ఆ లక్షణాలు అంతగా అనిపించకపోయినా వాటిని తేలికగా తీసుకోకూడదు. అది తాత్కాలిక ఇస్కీమిక్ దాడి (TIA) లేదా మినీ స్ట్రోక్ కావడానికి పూర్తి అవకాశం ఉంది. సెన్సార్లు కదలికల వల్ల, పరికరాన్ని సరిగ్గా ధరించకపోవడం వల్ల కొన్నిసార్లు తప్పు రీడింగ్స్ ఇచ్చే సాంకేతిక పరిమితులు స్మార్ట్‌వాచ్‌లకు ఉంటాయి. కాబట్టి రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నా, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతోందని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. క్రమమైన వ్యాయామం, సమతుల్య ఆహారం, రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం ద్వారా స్ట్రోక్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.     Stroke With Normal Heart Rate, Hidden Stroke Risks, Doctors Warnings On Stroke, Cardiovascular Health Facts, Silent Stroke Causes, Medical Advice In Telugu, Heart And Brain Health
ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే మనలో కోట్లాది మందికి గుమగుమలాడే వేడి వేడి టీ లేదా కాఫీ కప్పుతోనే దినచర్య ప్రారంభమవుతుంది. రాత్రి నిద్ర నుంచి మేల్కొనగానే శరీరం అలసట నుంచి తేరుకోవాలన్నా, రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా పనిచేయాలన్నా ఈ రెండింటిలో ఏదో ఒకటి కచ్చితంగా ఉండాల్సిందే. అయితే, టీ మరియు కాఫీలలో ఏది ఆరోగ్యానికి నిజంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది, ఎవరి శరీర తత్వానికి ఏది సరైన ఎంపిక అవుతుంది అనే అంశంపై ఇటీవలి కాలంలో నిర్వహించిన ఒక ప్రత్యేక అధ్యయనం అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఈ తాజా నివేదిక ప్రకారం, టీ మరియు కాఫీ రెండింటిలోనూ విభిన్నమైన పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగా టీ విషయానికి వస్తే, ఇందులో  ఎల్ థియోనైన్  అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది మన మెదడును తక్షణమే ఉత్తేజపరిచి, మానసిక ప్రశాంతతను అందిస్తూనే ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మరియు ఆలోచనా శక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా సరైన మోతాదులో టీ సేవించే వారిలో ఎముకల సాంద్రత మెరుగ్గా ఉండటమే కాకుండా శరీర రోగ నిరోధక శక్తి కూడా క్రమంగా పెరుగుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆహారం తీసుకున్న వెంటనే టీ తాగే అలవాటు ఉన్నవారు కొన్ని విషయాలు గమనించాలి. తాజా నివేదికల ప్రకారం, భోజనం లేదా అల్పాహారం చేసిన తర్వాత వెంటనే టీ తాగితే, ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించే శక్తి ఏకంగా 62 శాతం మేర తగ్గిపోతుంది. ఇది రక్తహీనత వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక కాఫీ విషయానికి వస్తే, ఈ ఐరన్ శోషణ ప్రభావం కేవలం 35 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు, కాఫీలో ఉండే కెఫీన్ శాతం బరువు తగ్గాలనుకునే వారికి, ఫిట్‌నెస్ సాధించాలనుకునే వారికి ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో కొవ్వును వేగంగా కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది జిమ్‌లో వర్కవుట్ చేయడానికి ముందు బ్లాక్ కాఫీని ప్రీ వర్కవుట్ డ్రింక్‌గా ఎంచుకుంటారు. పరిమిత మోతాదులో, అంటే రోజుకు తగినన్ని కప్పులు మాత్రమే కాఫీ తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం మరియు పార్కిన్సన్స్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలొచ్చే రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. అయితే, కాఫీకి ఎసిడిక్ గుణం చాలా ఎక్కువగా ఉండటం వల్ల పరగడుపున లేదా అతిగా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫిల్టర్ చేయని కాఫీని అధికంగా తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా రోజుకు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే, కాలక్రమేణా ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోయి ఎముకలు గుల్లబారి బలహీనపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి, టీ లేదా కాఫీలలో ఏది మంచిదనేది కేవలం వాటి రుచిపైనే కాకుండా మీ శరీర తత్వానికి, ఆరోగ్య అవసరాలకు తగినట్లుగా వాటిని మితంగా తీసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఏ పానీయమైనా హద్దుల్లో ఉంటేనే ఆరోగ్యం సొంతమవుతుంది.     Tea Vs Coffee Health Benefits, Which Is Healthier Tea Or Coffee, Scientific Study On Tea Coffee, Caffeine Drinks Comparison, Surprising Health Facts, Daily Beverage Impact, Wellness Tips In Telugu.  
 విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..! శరీరానికి కావాల్సిన విటమిన్లు , పోషకాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సాధారణంగా కాల్షియం, ఐరన్ లేదా విటమిన్-సి వంటి వాటి గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉంటాము. కానీ మన శరీరంలో విటమిన్-డి పాత్ర ఎంత ముఖ్యమైనదో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఎముకలను బలంగా ఉంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు. అయితే నేటి కాలపు వైద్యులు చెబుతున్న దాని ప్రకారం విటమిన్-డి మన శరీరంలోని ఎముకలకు మాత్రమే కాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా చాలా అవసరం. ఎండలో తిరిగితే లభించే ఈ విటమిన్ లోపిస్తే దంపతులలో పిల్లలు పుట్టే అవకాశాలపై ప్రభావం పడుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. ఈ విషయంలో వైద్య నిపుణులు , పరిశోధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుంటే.. మన దేశంలో ఎండకు ఎటువంటి కొదవ ఉండదు. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ మనలో చాలా మంది విటమిన్-డి లోపంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని ఒక రకమైన సైలెంట్ సమస్యగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎలాంటి పెద్ద లక్షణాలు లేకుండానే శరీరం లోపల ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇటీవలి కాలంలో జరిగిన పలు వైద్య అధ్యయనాలు ఈ విటమిన్ లోపానికి పురుషులు , మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలకు మధ్య గట్టి సంబంధం ఉందని వెల్లడించాయి. మహిళలకు.. మహిళల విషయంలో చూస్తే విటమిన్-డి లోపం వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. మహిళల నెలసరి క్రమంగా రావడానికి , అండాశయాల నుంచి ప్రతి నెల ఆరోగ్యకరమైన అండం విడుదల కావడానికి కొన్ని రకమైన హార్మోన్లు చాలా అవసరం. విటమిన్-డి మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తూ ఈ ప్రక్రియను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరంలో దీని స్థాయి తగ్గినప్పుడు హార్మోన్ల పనితీరు మందగించి అండాల నాణ్యత , సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఇది నేరుగా పూర్తిగా సంతానలేమికి కారణం కాకపోయినా గర్భం దాల్చడాన్ని కష్టతరం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులకు.. పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వారిలో కూడా సంతానోత్పత్తి సామర్థ్యంపై విటమిన్-డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులలో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత , అవి కదిలే వేగం సక్రమంగా ఉండటంలో ఈ విటమిన్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుంది. పురుషుల శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రత్యేకమైన విటమిన్-డి రిసెప్టర్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని , వీర్యకణాల తయారీని నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో విటమిన్-డి తగినంత లేకపోతే వీర్యకణాల నాణ్యత తగ్గిపోయి తద్వారా సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది.  ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మన శరీరంలో విటమిన్-డి ఎంత మోతాదులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లోపం ఉన్నట్లు తేలితే ఆహారపు అలవాట్లలో , జీవనశైలీలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సరిదిద్దుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పూట కొంత సమయం ఎండలో గడపడం చాలా మంచిది. దీనితో పాటు గుడ్డు సొన, చేపలు, , విటమిన్-డితో కూడిన పౌష్టికాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ లోపం చాలా ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు తగిన సప్లిమెంట్లను వాడుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడమే ఎప్పుడూ మంచిది.                                                                                                                                           *రూపశ్రీ.
ప్రతి రోజూ మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల గురించి వింటూనే ఉంటాం. అయితే వాటిలో అత్యంత భయపెట్టే , ప్రాణాంతకమైన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. పేరు వినగానే చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇక మరణమేనా అనే అభద్రతా భావం కలుగుతుంటుంది. కానీ సరైన అవగాహన ఉండి, సకాలంలో స్పందిస్తే ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యమవుతుంది. అసలు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉండేందుకు, ఒకవేళ అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. దీని గురించి వివరాలు తెలుసుకుంటే.. బ్రెయిన్ స్ట్రోక్.. ప్రతి నిమిషం ఎంతో విలువైనది.. మనుషులను తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి గురిచేస్తున్న సమస్య బ్రెయిన్ స్ట్రోక్.. ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సమస్య ఇది. గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 65 లక్షల నుంచి 73 లక్షల మంది స్ట్రోక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మన మెదడులోని ఏదైనా భాగానికి అకస్మాత్తుగా రక్త ప్రసరణ నిలిచిపోయినా లేదా తగ్గిపోయినా ఈ ప్రమాదం వస్తుంది. దీనివల్ల మెదడులోని కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందక అవి వేగంగా చనిపోవడం ప్రారంభిస్తాయి. సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే స్ట్రోక్ విషయంలో ప్రతి ఒక్క నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు గుర్తించకపోవడమే సమస్య.. బ్రెయిన్ స్ట్రోక్ అనేది హఠాత్తుగా వచ్చినప్పటికీ, దాని వెనుక ఉండే అసలు ప్రమాదాలు మాత్రం సంవత్సరాల ముందే మన శరీరంలో పుట్టుకొస్తుంటాయి. కానీ చాలా మందికి ఈ ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఉండదు. స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తుంటారు. దీనివల్ల వైద్యులు చికిత్స అందించడానికి అవసరమైన ఎంతో విలువైన సమయం వృథా అయిపోతుంది. స్ట్రోక్ బారిన పడిన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 73 నుంచి 80 శాతం మంది రోగులలో స్ట్రోక్  లక్షణాలు ప్రారంభమైన సుమారు నాలుగున్నర గంటల కంటే ఎక్కువ సమయం గడిచాక ఆసుపత్రికి చేరుకుంటున్నట్లు తేలింది. లక్షణాలపై అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. లక్షణాల గురించి అవగాహన ఉంటే చాలా తొందరగా ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉంటుంది. అకస్మాత్తుగా వచ్చేది కాదు.. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. దీని వెనుక ప్రధానంగా హై బ్లడ్ ప్రెషర్ అనగా అధిక రక్తపోటు, మధుమేహం , కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి. ఈ అనారోగ్యాలు చాలా కాలం పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడకుండానే శరీరం లోపల పెరుగుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్నామని భావించే యువకులు కూడా ఈ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఐసీఎంఆర్ , ఇండియాబీ పరిశోధనల ప్రకారం మన దేశంలో సుమారు 35.5 శాతం మంది వయోజనులు హై బ్లడ్ ప్రెషర్ తో, 87.3 శాతం మంది డిస్లిపిడెమియా అనగా రక్తంలో కొలెస్ట్రాల్ లేదా కొవ్వు స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో, అలాగే 11.4 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తనాళాలు దెబ్బతినడం వల్లే.. అధిక రక్తపోటు రక్త నాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే డయాబెటిస్ ,  కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం కూడా రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఇవన్నీ కలిసి బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును విపరీతంగా పెంచుతాయి.  స్ట్రోక్ రావడానికి చాలా సంవత్సరాల ముందే ఏర్పడే ప్రమాదకర పరిస్థితులను చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ సమస్య మరింత పెరుగుతుంది. అలాగే  స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా లక్షణాలను గుర్తించలేక వైద్య సహాయం అందడంలో ఆలస్యం చేయడం వల్ల మరణం సంభవిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నామని లైట్ తీసుకోకండి.. చూడటానికి పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తున్న యువతలో కూడా హై బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ సమస్యల కారణంగా స్ట్రోక్ ముప్పు పొంచుకుని ఉంటోంది. ముఖంలో ఒక వైపు వంకర పోవడం, మాట తడబడటం, చేతులు లేదా కాళ్లలో అకస్మాత్తుగా బలహీనత కలగడం లేదా శరీర సమతుల్యత దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని కేవలం సాధారణ నీరసం, అలసట లేదా వయసు ప్రభావం అనుకుని లైట్ తీసుకుంటారు. ఈ చిన్న నిర్లక్ష్యమే ప్రాణాల మీదికి తెస్తుంది. స్ట్రోక్ నుండి బయట పడే మార్గం.. స్ట్రోక్ సమస్య నుండి,  దానికి గల కారణాల  నుంచి బయటపడాలంటే రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహాలు పాటించడం, రోజువారీ జీవితంలో అకస్మాత్తుగా ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే.. వాటిని  ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండటం ఎంతో అవసరం. ముఖంలో తేడాలు రావడం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం వంటి చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రాణాంతక పరిస్థితుల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యమనే సత్యాన్ని గ్రహించి ముందస్తు జాగ్రత్తలు పాటించడమే బ్రెయిన్ స్ట్రోక్ నుండి రక్షణ పొందే ఉత్తమ మార్గం.                                                                                                                                              *రూపశ్రీ