Home

»

Latest News

Killer Movie Review Telugu: కిల్లర్ మూవీ రివ్యూ 

Oct 31, 2026 10:57AM

 


-సినిమా పేరు: కిల్లర్ 
-న‌టీన‌టులు: జ్యోతి పూర్వజ్, సుకు పూర్వజ్, మనీష్, విశాల్ రాజ్,అర్చన అనంత్, చంద్రకాంత్ కొల్లు తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి 
-ఎడిటింగ్: సుకు పూర్వజ్
-మ్యూజిక్: ఆశీర్వాద్ లుకే 
-నిర్మాత‌: సుకు పూర్వజ్ 
-బ్యానర్: థింక్ సినిమా 
-రచన,దర్శకత్వం: సుకు పూర్వజ్
-రిలీజ్ డేట్ : అక్టోబర్ 30 , 2026 

కింగ్ నాగార్జున హిట్టు బొమ్మ కిల్లర్.. ఆ టైటిల్ ని మరోసారి గుర్తు చేస్తూ 'కిల్లర్' ఈ రోజు సెల్యులాయిడ్ పై టేక్ ఆఫ్ అయ్యింది. యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం, ట్విస్ట్ చెపితే కోటి రూపాయలు ఇస్తామనే  ప్రకటనతో ప్రేక్షకుల చూపుని తన ఆదీనంలో ఉంచుకుంది. నిన్న చాలా ఏరియాస్ లో ప్రీమియర్స్ సైతం  ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

దట్టమైన అభయారణ్యం నీలగిరి ఫారెస్ట్ లోని నందికొన ఏరియాలో ఆకాశం నుంచి భారీ 'ఉల్క' రాలిపడుతుంది.  దాంతో నిప్పుల జడివానలాగా సంభవించి అక్కడ జరుగుతున్న రహస్య ప్రయోగశాల డామేజ్ అవుతుంది. రనియా(జ్యోతి పూర్వరజ్) ఒక ఉగ్రవాది.. బాంబులు పెట్టి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసుకుంటుంది. రతిక( జ్యోతి పూర్వజ్) బాగా డబ్బున్న హై క్లాస్ యువతి.. తన అందంతో, మత్తుచూపులతో   మగవాళ్ళని తన వశం చేసుకోగలదు. కానీ శారీరక సుఖం టైంకి రక్త పిశాచిగా మారి మనిషి రక్తం తాగుతుంది. సియా( జ్యోతి పూర్వజ్) ఉన్నత వర్గానికి చెందిన పెళ్ళైన  యువతి. భర్తతో కలిసి ఒక ఏరియాలోని రిసార్ట్ కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని వాంటెడ్ గా చంపుతుంది. ఆధునిక సైంటిస్ట్ పూర్వజ్( పూర్వజ్)..మనిషి మెదడులో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చనేది తన నమ్మకం. ఈ క్రమంలో  సినీ రచయిత  అయిన ఒక యువతి మెదడులోకి  ఆర్టిఫిషియల్ చిప్‌ని పెట్టడానికి ప్రయత్నిస్తాడు. మరి ఇన్ని పార్శ్యాలని అమర్చుకున్న  ఉన్న కథలో కిల్లర్ ఎవరు? మిగతా క్యారక్టర్ ల కథ ఏంటనేదే కిల్లర్ మూవీ.

ఎనాలసిస్ 

కథగా చూసుకుంటే మంచి క్యూరియాసిటీ కలిగించే కథనే. కాకపోతే కథనం, క్యారెక్టర్స్ డిజైన్ విషయంలో మరింత శ్రద్ద చూపించి ఉండాల్సిందేమో. అంటే జ్యోతి పూర్వరాజ్ పోషించిన అన్ని క్యారెక్టర్స్ ని లెంతి గా చూపించాల్సింది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ప్రారంభ సన్నివేశంతో పాటు ఫస్ట్ హాఫ్ చాలా వరకు క్యూరియాసిటీగానే సీన్స్ వచ్చాయి. జ్యోతి పూర్వ రాజ్ పోషించిన అన్ని క్యారెక్టర్స్ కి సంబంధించిన సన్నివేశాలు పర్లేదు. పోలీస్ ఇన్విస్టిగేషన్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ క్రమ క్రమంగా ఒకే ఫార్మేట్ లో సాగుతునట్టుగా అనిపించింది. కాకపోతే  ఇంటర్వెల్ ముందు వరకు కూడా కథ ఏంటనే విషయం అర్ధం కాక మేకర్స్ కి సరెండర్ పొజిషన్ లో ఉండిపోతుంది. దీంతో వేరే ఇతర లోపాలేమి కనిపించవు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మొదటి పది నిమిషాలు క్యూరియాసిటీ గానే సీన్స్ వచ్చాయి. 

ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ సీన్స్.  రచయిత ( జ్యోతి పూర్వజ్) ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సూపర్ . ఆ తర్వాత వచ్చిన సీన్స్ లలో బలం లేకపోయినా పర్లేదు.ఈ సినిమా బడ్జెట్, మేకింగ్ వాల్యూస్, వీఎఫ్ఎక్స్ వర్క్ చూస్తే మంచి క్వాలిటీతో, అనుసరించిన టెక్నాలజీ విలువలు చాలా రిచ్‌గా అనిపిస్తాయి. కాకపోతే వచ్చిన ప్రతి సీన్ కూడా రెగ్యులర్ సినిమాలా కాకుండా  ఓ డిఫరెంట్ అటెంప్ట్ చేశారనే ఫీలింగ్‌ని కలిగించడంలో మేకర్స్  సక్సెస్ అయ్యారు.


నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు   

పలు విభిన్న క్యారెక్టర్స్ లో జ్యోతి పూర్వజ్ పెర్ఫార్మ్ సూపర్. ఎక్కడా ఓవర్ యాక్టింగ్ లేకుండా ఎంత వరకు చెయ్యాలో అంత వరకే చేసింది. మంచి అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో తన కట్ అవుట్ రేంజ్ ని చాలా బలంగానే చెప్పడం మాత్రం పక్కా. పోలీస్ ఆఫీసర్, శాస్త్రవేత్తగా పూర్వజ్ కూడా మంచి పెర్ఫార్మ్ ప్రదర్శించాడు. జ్యోతి పూర్వజ్ తమ్ముడిగా చేసిన యువనటుడు చందు సైతం తన నటనతో మెప్పించాడు. మంచి అవకాశాలు వస్తే నటుడుగా తన ప్రభ చాటగల సమర్థుడే. మిగతా వాళ్ళు కూడా తమ క్యారక్టర్ పరిధి మేరకు మెప్పించారు. పూర్వజ్ దర్శకుడిగా సక్సెస్. కథకుడిగా మోస్తరు మెప్పించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు బలం.


ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం  మూవీ రివ్యూ 


బలాలు
1 . కాన్సెప్ట్ 
2 . జ్యోతి పూర్వజ్ పెర్ఫార్మెన్స్ 
3 . ఫస్ట్ హాఫ్ 

బలహీనతలు 
1 . సెకండ్ హాఫ్ లో కథనం అంత ఆసక్తికరంగా లేకపోవడం
 

చివరిగా చెప్పాలంటే కథనం విషయంలో కొన్ని లోపాలు ఉన్నా మంచి కంటెంట్ తోనే వచ్చి పర్వాలేదనిపించారు

రేటింగ్ 2 .25 /5                                                                                                                                                                                                                                                            అరుణాచలం 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com