ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అధికారిక కూటమి సర్కాయ్ సిద్ధమవుతున్న వేళ, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో కూటమి అగ్రనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి భేటీలో జనసేన  బీజేపీ ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొని విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పూర్తిగా ఖరారైన తరుణంలో, వివిధ పార్టీల మధ్య స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటును అత్యంత పకడ్బందీగా కొలిక్కి తేవడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఏజెండాగా కనిపిస్తోంది. ఈ కీలక భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం, ఇప్పటికే సమన్వయ కమిటీ సుమారు మూడు పర్యాయాలు వేర్వేరు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపడమే. ఎల్లుండే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతుండటంతో, అభ్యర్థుల ఎంపిక, జిల్లాల వారీగా సీట్ల కేటాయింపు మరియు ఉమ్మడి వ్యూహంపై నేతలు త్వరితగతిన ఒక తుది నిర్ణయానికి రానున్నారు. ముఖ్యంగా తొలుత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత తీసుకురావాలని కూటమి నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేయాలని, ఏ ఒక్క స్థానంలోనూ అభిప్రాయ భేదాలు రాకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు  ఇతర స్థానిక సంస్థల పరిధిలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ ఈ సీట్ల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. మూడు పార్టీల శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, పొత్తు ధర్మానికి ఎక్కడా విఘాతం కలగకుండా నాయకులు అడుగులు వేస్తున్నారు. ఎల్లుండి అధికారికంగా షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో, ఈ సమావేశం ద్వారానే కూటమి అభ్యర్థుల బలబలాలు, సీట్ల పంపకాలపై ఒక స్పష్టమైన స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.     [ Alliance Leaders Meeting, CM Chandrababu residence, local body elections ap, seat sharing telugu, amaravati political news, tdp bjp janasena alliance, MLC PVN Madhav, Minister Nadendla Manohar, Telugu One, Telugu News ]  
దేశ రాజకీయాల్లో చాలామంది నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమాలలో కేవలం ఆయనను ప్రశంసించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో చాలా మంది నేతలు మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయాన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు.  ఈ వేదికపై ప్రసంగించిన ముఖ్యమంత్రి విజయ్, కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన  5 వేల ఒక వంద   కోట్ల  నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధాని మోదీని నేరుగా కోరారు. కోరారు అనడం కంటే డిమాండ్ చేశారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ నిధులు ఎంతో కీలకమని, ఎలాంటి ఆలస్యం లేకుండా వీటిని అందించాలని విజయ్ నొక్కి వక్కాణించారు.    నిధులతో పాటుగా తమిళనాడులోని పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కూడా సీఎం విజయ్ మాట్లాడారు.   చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు రాష్ట్రంలో కీలకమైన జాతీయ రహదారుల విస్తరణ,  నూతన రోడ్డు  ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు.  రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో తన అభిప్రాయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేసిన సీఎం..  ఎంతటి పెద్ద వేదికైనా రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించారు. సామాన్యంగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభలలో స్థానిక నాయకులు పొగడ్తలకే పరిమితమవుతారని, అయితే విజయ్ మాత్రం రాష్ట్ర నిధుల సాధన కోసం ఈ వేదికను వేదికగా మలుచుకున్నారని రాజకీయవర్గాలలో విజయ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   [CM Vijay Demand Funds In Presense Of Narendra Modi, Tamil Nadu Politics, Developement Projects, Tamilnadu Developement,  Chennai Kanyakumari High Speed Train]
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మ సారి రచ్చకెక్కాయి.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి   కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యమధ్యలో అడపాతడపా తగ్గిన ఆ అసంతృప్తి ఇప్పుడు ముదిరి పాకాన పడింది.   రేడియల్‌ రోడ్ల టెండర్ల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఆంధ్రా కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా సంస్థ సొంత ప్రభుత్వమే అన్యాయం చేసిందని ఫైర్ అయ్యారు.  ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టికి తీసుకెడతాననీ, రేవంత్ పై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తాననీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  హెచ్చరించారు.   హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని బుద్వేల్‌ నుంచి కొడంగల్‌ సమీపంలోని ఎన్‌హెచ్‌-167ఎన్‌ వరకు సుమారు 81.15 కిలోమీటర్ల రేడియల్‌ రోడ్డు-2 నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దాదాపు  3 వేల 296 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించారు. ఈ టెండర్లలో సుశీ ఇన్‌ఫ్రా సంస్థ కూడా పాల్గొంది. అయితే సాంకేతిక అర్హతల పరిశీలనలో ఆ సంస్థ బిడ్లను అధికారులు తిరస్కరించడం వివాదానికి కారణమైంది.  సుశీ ఇన్‌ఫ్రా వాదన ప్రకారం.. తమ సంస్థ తక్కువ ధరకు బిడ్‌ వేసినప్పటికీ, సాంకేతిక కారణాలు చూపుతూ టెండర్‌ ప్రక్రియ నుంచి తప్పించారు. తమ సంస్థకు పనులు దక్కకుండా చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు 6వందల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని కంపెనీ   టెండర్లలో తమ నిర్ణయాలు నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది.   ఈ నేపథ్యంలోనే టెండర్ల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ సుశీ ఇన్‌ఫ్రా హైకోర్టును ఆశ్రయించింది. అనుభవ ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన సాంకేతిక అభ్యంతరాల ఆధారంగా బిడ్లను తిరస్కరించడాన్ని ఆ సంస్థ సవాలు చేసింది. అవసరమైతే వివరణ కోరే అవకాశం ఇవ్వాల్సిందని పిటిషనర్‌ వాదించారు.  మరోవైపు, టెండర్ల ప్రక్రియలో తదుపరి దశలు ఇప్పటికే పూర్తయ్యాయని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.  రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య విభేదాలు కేవలం ఈ టెండర్ల వ్యవహారానికే పరిమితం కావడం లేదన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నారు.  సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.     కోమటిరెడ్డి హెచ్చరికతో ఇప్పుడు వివాదం కేవలం కాంట్రాక్టులకు సంబంధించిన వివాదంగా కాకుండా, రేవంత్ రెడ్డి నాయకత్వం, పార్టీ అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి వంటి అంశాలపై పంచాయతీగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రేడియల్‌ రోడ్ల టెండర్లపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. టెండర్ల వివరాలను బహిర్గతం చేయాలని, ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, మరోవైపు ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో రేడియల్‌ రోడ్ల ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది.   [Congress Internal Rift, Dispute, Komatireddy Rajagopal Reddy, Revanth Reddy, Susi Infra, Radial Road Tenders,Complaint  Rahul Gandhi, KTR, BRS, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
The makers of Jo Jo, presented by filmmaker Deva Katta, have unveiled Caution 1, introducing a raw, rustic world where the pursuit of diamonds sets the stage for romance, ambition and irreverent comedy. Written and directed by Kiran Jay Kumar and produced by Vijay Krishna Lingamaneni under the Vijayam banner, the film unfolds in the drought-hit diamond fields of Jonnagiri, where the promise of sudden fortune draws an unlikely group into an unconventional adventure. The teaser takes us to Jonnagiri, where a group of hopefuls descends on the diamond fields, convinced that the rains might have left behind a fortune. What follows is a chaotic hunt, with stones mistaken for potential riches and a man trying his luck at flirting. Their discoveries are put to the test by an examiner, who dismisses them as ordinary stones. While one hopeful refuses to give up, insisting that their lucky break will eventually come, the woman beside him has a far more direct response: “Clean your own ass!” The exchange captures the film’s unfiltered humour, where the dream of striking it rich comes with its own share of ridicule. Adding to the teaser’s promotional momentum, filmmaker and actor Tharun Bhascker called it an “excellent teaser” after watching it. His reaction offers an additional talking point as the film begins introducing its unconventional premise to audiences. At the heart of Jo Jo are two penniless dreamers and a fearless young woman chasing a life-changing diamond. Their quest soon becomes entangled with romance, greed, betrayal, danger and comic misadventures. As their ambitions collide with unpredictable circumstances, the possibility of sudden wealth threatens to turn their pursuit into a far more complicated adventure than they imagined. The film marks another collaboration between Deva Katta, Kiran Jay Kumar and Vijay Krishna Lingamaneni, who previously worked together on Mayasabha: Rise of the Titans. With Jo Jo, the team moves into a distinctly different tonal space, exploring a romantic comedy rooted in rural eccentricity and the absurdities surrounding an unlikely treasure hunt. Krishna Kamal plays Seenu, while Maahi Sri portrays Supraja. The ensemble cast includes Phanindra Devarapalli as Venkatesh, Prabhavathi as Vijayamma, Mahaboob Basha as Suri, Satish Devatte Tanjore as Rangasaami, Puduru Sharath Babu as Ramana and Makarand Deshpande as Mukesh Shah. The technical crew comprises Rohith Kumar as Director of Photography, Mahesh Shankar as Music Director and Madhav Kumar Gullapalli as Editor. The film’s lyrics are penned by Rehman, Srinivas Mouli and Ramachandra. With Caution 1, Jo Jo introduces a world where the pursuit of fortune brings together eccentric characters, unexpected confrontations and humour that refuses to play safe. The teaser offers an early glimpse of the film’s distinctive setting and comic sensibility, with further details about its release plans expected to follow. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అనంతరం లండన్, హైదరాబాద్‌లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘బ్లడీ రోమియో’లో నాని పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు చెఫ్‌గా కనిపిస్తూ మరోవైపు హింసాత్మక గ్యాంగ్‌స్టర్‌గా ఉండే విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. డార్క్ హ్యూమర్, స్టైలిష్ యాక్షన్ అంశాలతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’లో రగ్డ్ లుక్‌లో కనిపించిన నాని, ఈ సినిమా కోసం రెట్రో స్టైల్‌లోకి మారడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని కొత్త లుక్‌లో ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, బ్లాక్ గాగుల్స్‌తో కనిపిస్తుండటం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఆయన సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నాని, సుజీత్ తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. నాని నటనకు సుజీత్ స్టైలిష్ మేకింగ్, యాక్షన్‌తో పాటు డార్క్ హ్యూమర్ తోడైతే ‘బ్లడీ రోమియో’ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.     [Nani Bloody Romeo, Bloody Romeo Shooting Date, Nani Sujeeth Movie, Bloody Romeo Delhi Schedule, Nani New Movie, Sujeeth Upcoming Movie, Preethi Mukundhan, Prithviraj Sukumaran, Nani Retro Look, Telugu Cinema News]
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు సుహాస్ మరో ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి చేనేత మగ్గం, ఓ చీర చుట్టూ సాగే అందమైన ప్రేమకథలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు ‘హైడ్ & సిల్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ ప్రోమో చూస్తుంటే.. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ‘హైడ్ & సిల్క్’ టైటిల్ ప్రోమోలో సుహాస్ చేనేత కార్మికుడిగా కనిపిస్తున్నారు. చీర నేయడాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఓ కళగా చూపిస్తూ వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. చేనేత మగ్గంపై నేసిన చీరకు ఉండే ప్రత్యేకతను తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌ ద్వారా వివరించారు. “నేత అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు.. అదొక గొప్ప కళ” అనే భావనతో సాగే మాటలు ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి చీరకూ దాన్ని కట్టుకునే ఓ మహిళ ముందే నిర్ణయించబడి ఉంటుందనే కవితాత్మకమైన ఆలోచనతో కథలోని ప్రేమకోణాన్ని పరిచయం చేశారు. తాను మొదటిసారి నేసిన చీరను ఎవరు కట్టుకుంటారు? ఆమె ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? కనీసం ఒక్కసారైనా ఆమెను చూడగలనా? అనే ఆలోచనలతో సుహాస్ పాత్ర సాగించే ప్రయాణం ఈ ప్రేమకథకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు ప్రోమోతో హింట్ ఇచ్చారు. చీర ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా మొదలవుతుందనే ఆసక్తిని రేకెత్తించారు. ‘లబ్బర్ పందు’, ‘డీసీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజనా కృష్ణమూర్తి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సుహాస్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కనిపించనున్నారు. రాజేంద్ర బాలా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్, మిస్రీలాల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమృత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ‘మండాడి’ సినిమాలో విలన్ గా కనిపించిన సుహాస్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రేమకథతో వస్తుండటం విశేషం. టైటిల్ ప్రోమోలో కనిపించిన కవితాత్మకమైన భావాలు, చేనేత నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ చీర వెనుక దాగిన ప్రేమకథ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.  ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల జర్నీ.. కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్ వరకు.!       [Hide And Silk Title Promo, Hide & Silk Title Promo, Suhas Hide And Silk, Suhas Hide & Silk, Suhas New Movie, Sanjana Krishnamoorthy, Rajendra Bala, Tanikella Bharani, Telugu Film News]  
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ కొన్నేళ్లకే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని.. అభిమానుల గుండెల్లో ‘పవర్ స్టార్’గా స్థానం సంపాదించుకున్నారు. ఆయనే పవన్ కళ్యాణ్.  తెరపై తనదైన స్టైల్, మేనరిజమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన సినీ ప్రయాణం మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 1996 అక్టోబర్ 11న విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలైన ఈ ప్రయాణం.. ఎన్నో విజయాలు, ప్రయోగాలు, మలుపులతో సాగింది. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అల్లు అరవింద్ నిర్మించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం సినిమాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు.  అయితే తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు ఆయనకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ అప్పట్లో కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. కేవలం నటనకే పరిమితం కాకుండా జానీ సినిమాతో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, పవన్ కళ్యాణ్‌కు ఉన్న ప్రత్యేకమైన అభిమానగణం మాత్రం ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలిచింది. సినిమాల్లో తనదైన ముద్ర వేసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఊటీలో 12 రోజులు.. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఏం చేస్తున్నారంటే.?       [30 Years of Pawan Kalyan, Pawan Kalyan 30 Years in Cinema, Power Star Pawan Kalyan, Akkada Ammayi Ikkada Abbayi, Pawan Kalyan First Movie, Pawan Kalyan, Telugu Film News]  
దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలోనే అతిపెద్ద సృజనాత్మక ప్రయోగం ‘ఈగ’ అని, ఆ సినిమా దర్శకుడిగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న నేపథ్యంలో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఒక ఈగను ప్రధాన పాత్రగా పెట్టి సినిమా తీయాలనే ఆలోచనే చాలా కొత్తగా అనిపిస్తుంది. అలాంటి కథను ఎంచుకోవడమే కాకుండా, ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేలా తెరకెక్కించడం రాజమౌళికి పెద్ద సవాలుగా మారింది. 2012లో విడుదలైన ‘ఈగ’లో నాని, సమంత, సుదీప్ కీలక పాత్రల్లో నటించారు. యానిమేషన్‌, గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. కథలోని కొత్తదనం, ప్రతీకారం తీర్చుకునే ఈగ చుట్టూ అల్లిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తన సినీ ప్రయాణాన్ని చాలామంది ‘బాహుబలి’కి ముందు, ఆ తర్వాత అని విభజిస్తారని రాజమౌళి పేర్కొన్నారు. అయితే, దర్శకుడిగా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన సినిమా మాత్రం ‘ఈగ’ అని ఆయన అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌ను ‘ఈగ’కు ముందు, ‘ఈగ’కు తర్వాత అన్నట్లుగా చూస్తానని చెప్పుకొచ్చారు. ఒక వినూత్నమైన కథను నమ్మి, దాన్ని తెరపైకి తీసుకురావడం తనకు కొత్త ధైర్యాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యల సారాంశం. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు హీరోగా ‘వారణాసి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక చోప్రా జోనస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రామాయణం స్ఫూర్తితో రూపొందించిన ఘట్టాలు కూడా ఉండనున్నాయి. భారీ స్థాయి విజువల్స్‌, అడ్వెంచర్‌ అంశాలతో ఈ సినిమాను తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా రాజమౌళి అభివర్ణించారు. ఇలాంటి భారీ చిత్రాల మధ్య కూడా ‘ఈగ’ను తన జీవితంలోని అతిపెద్ద ప్రయోగంగా గుర్తుచేసుకోవడం విశేషం.     [SS Rajamouli, Eega Movie, Rajamouli Eega Comments, Biggest Experiment of Rajamouli, Baahubali Director, Eega Movie Nani Samantha, Rajamouli Career, Varanasi Movie, Mahesh Babu Varanasi, Rajamouli Latest News, Telugu Cinema News]
తమ అభిమాన నటులపై ప్రేమను చాటుకోవడానికి ఫ్యాన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తమ హీరోల భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తే, మరికొందరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఓ అభిమాని చూపిస్తున్న అభిమానం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. తమిళనాడులోని మధురైకి చెందిన కార్తీక్ అనే అభిమాని రజనీకాంత్ కోసం ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మించడమే కాకుండా, ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రత్యేక బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. మధురైలోని ‘అళగుమిగు శ్రీ రజనీ ఆలయం’లో ఈ ఏడాది కూడా నవరాత్రి కొలువును ఏర్పాటు చేశారు. ఇది వరుసగా మూడో ఏడాది కావడం విశేషం. ఈసారి రజనీకాంత్ సినీ ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఏకంగా 230కి పైగా ఫొటోలు, బొమ్మలను ప్రదర్శనకు ఉంచారు. ఆయన తొలి చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ నుంచి మొదలుకొని, కెరీర్‌లో గుర్తుండిపోయే ఎన్నో పాత్రలను ఈ కొలువులో భాగంగా చూపించారు. దీంతో ఈ ప్రత్యేక ప్రదర్శన స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రజనీకాంత్ నటించిన పాత సినిమాల్లోని పాత్రలతో పాటు ‘జైలర్’ చిత్రంలోని టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రకు సంబంధించిన నమూనాలను కూడా ఇందులో చేర్చారు. అంతేకాదు, త్వరలో విడుదల కానున్న ‘జైలర్ 2’, ‘ధర్మన్’ సినిమాలకు సంబంధించిన ఫొటోలు, ప్రతిరూపాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. ఇలా ఐదు దశాబ్దాలకు పైగా సాగిన రజనీకాంత్ సినీ ప్రస్థానాన్ని ఒకే చోట చూపించే ప్రయత్నం చేశారు. తన అభిమాన నటుడి పాత్రలను నవరాత్రి బొమ్మల కొలువులో భాగం చేయడం ద్వారా కార్తీక్ తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే, రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్‌లో ఆయన మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్ణా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రజనీ పాత్రలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కొలువు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.   [Rajinikanth Fan Temple, Rajinikanth Temple Madurai, Rajinikanth Navratri Kolu, Rajinikanth Fan Karthik, 230 Rajinikanth Characters, Jailer 2 Release Date, Rajinikanth Latest News, Superstar Rajinikanth Fans, Rajinikanth Film Journey, Tamil Cinema News]
మెగా కుటుంబం నుంచి ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో 2023లో ‘ఆదికేశవ’ విడుదలైన తర్వాత ఆయన కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టి తిరిగి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. వైష్ణవ్ తేజ్ చేయబోయే సినిమాల్లో మొదటి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ‘హంట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహేశ్ సూరపనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అనిల్ సుంకర తన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాల సమాచారం. మరోవైపు వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తోనూ వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, నిర్మాతగా శ్రీనివాస చిట్టూరి పేరు వినిపిస్తోందని సమాచారం. ఇక ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు పరశురామ్ పెట్లతోనూ వైష్ణవ్ తేజ్ మరో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రాజెక్టులపై అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. దీంతో ఈసారి కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు దర్శకులు, మూడు విభిన్న కథలతో ఆయన రీఎంట్రీ ఇస్తే కెరీర్‌కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాల కథలు, నటీనటులు, షూటింగ్ షెడ్యూల్స్ వంటి పూర్తి వివరాలు అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టత రానుంది.       [Panja Vaisshnav Tej, Vaisshnav Tej Upcoming Movies, Vaisshnav Tej Comeback, Vaisshnav Tej New Films, Mahesh Surapaneni, VI Anand, Parasuram Petla, Anil Sunkara, Dil Raju, AK Entertainments, Sri Venkateswara Creations, Uppena Hero Latest News]
సంక్రాంతి సినిమాల సందడి ఇప్పటి నుంచే మొదలైంది. విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ప్రకృతి అందాల నడుమ ఆటపాటలతో సందడి చేసేందుకు హీరోయిన్లు కీర్తి సురేశ్‌, కృతి శెట్టి కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించింది. ఊటీలో కొనసాగుతున్న ఈ షెడ్యూల్‌ దాదాపు 12 రోజుల పాటు జరగనుంది. ఈ సమయంలో రెండు పాటలతో పాటు సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. వెంకటేశ్‌ సరసన కీర్తి సురేశ్‌, కల్యాణ్‌రామ్‌ సరసన కృతి శెట్టి జోడీగా కనిపించనుండటంతో ఈ పాటలపై ఆసక్తి నెలకొంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి తన సినిమాల్లో వినోదానికి, పాటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటులను ఒకే సినిమాలో చూపిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఊటీలో చిత్రీకరిస్తున్న పాటలు తెరపై ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌ కలయికలో అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా పండగ సీజన్‌లో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి. ఇది కూడా చదవండి: 40 భాషల్లో ‘రామాయణ’.. ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ ప్రయోగం.! https://x.com/Shine_Screens/status/2109543339586691079       [January 12 Vidudala Ooty Schedule, January 12 Vidudala Movie, Venkatesh, Kalyan Ram, Keerthy Suresh, Krithi Shetty, Anil Ravipudi, Telugu Film News]  
Brad Pitt and Angelina Jolie’s legal battle over their French winery, Château Miraval, continues years after their divorce settlement was finalised in 2024. The latest courtroom exchange has brought a fresh controversy into the dispute, with Pitt’s lawyer raising concerns about how female lawyers are treated during legal proceedings. During a recent hearing at the Los Angeles Superior Court, Pitt’s lawyer, Julia B. Cherlow, sought additional financial documents from Jolie. Her request was opposed by Jolie’s lawyer, Paul D. Murphy, who remarked that he had never encountered a situation in which the opposing side kept asking for more. Cherlow responded that, as a female advocate, she frequently hears the phrase, “Never in my career have I ever seen this.” Murphy expressed disappointment over her response, but the exchange did not lead to any further action from the judge. The legal dispute dates back to 2022, when Pitt sued Jolie after she sold her stake in Château Miraval to Tenute del Mondo, a company associated with the Stoli Group. Pitt alleged that the sale violated an agreement requiring both parties to obtain the other’s consent before selling their interests. Jolie has disputed the existence of such a binding agreement and maintained that she was entitled to sell her stake. The former couple acquired the winery in 2008, and the business disagreement has continued despite the conclusion of their divorce proceedings. Pitt has repeatedly sought financial records from Jolie, while the actress has argued that some of the requested documents are private and irrelevant to the central contractual dispute. With both sides continuing to contest key issues, the Château Miraval case remains unresolved. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Mirnaa Menon has recalled a frightening health scare which she feared to death, while shooting for Rajinikanth’s Jailer 2, revealing that she was so weak she could not even brush her teeth. Despite her condition, she eventually made it to the sets after visiting a hospital, taking medication and receiving a high-dose injection to get through an important scene. In a recent interview, Mirnaa revealed that she woke up feeling extremely unwell on a day when a crucial scene was scheduled to be filmed. Even after taking tablets, her condition did not improve. She informed her manager that she needed medical attention and would be late to the sets. However, her search for help became difficult, as several hospitals she visited did not have doctors available at the time. After eventually finding a doctor, Mirnaa received an injection and was given another tablet to take if she continued to experience discomfort. She took the medication on her way to the sets, but the combination left her feeling numb. She also experienced dehydration and facial swelling, making the shoot particularly challenging. Despite the discomfort, Mirnaa completed the scene. She later became concerned about her performance because she felt she could not fully experience the emotions required for it. Director Nelson Dilipkumar, however, assured her that the scene had come out well and did not require another take. Mirnaa watched the footage again during dubbing and felt relieved that it had turned out fine. The actress admitted that the experience continued to trouble her even later, as she wondered whether she had performed the scene as well as she could have. Her account offers a glimpse into the difficult circumstances she faced while working on the much-anticipated sequel. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మనలో చాలామందికి ఎండలో కొద్దిసేపు గడపడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు. అయితే ఏ సమయంలో ఎండలో ఉండాలి? ఉదయం సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుందా లేక మధ్యాహ్నం ఎండలోకి వెళ్తేనే శరీరానికి ఎక్కువ విటమిన్ డి అందుతుందా అనే సందేహాలు సర్వసాధారణం. సూర్యరశ్మి పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన సమయంలో బయటకు వెళ్లకపోవడం మరియు శరీరానికి ఎంత మేరకు సూర్యరశ్మి తగులుతుందనే అంశాలను పట్టించుకోకపోవడం వల్ల కొందరిలో విటమిన్ డి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ సూర్యరశ్మి సమయం, దాని వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాను వివరించారు. ఉదయం వేళ లభించే సూర్యరశ్మి శరీరంలోని సహజ జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు ప్రశాంతమైన నిద్రకు తోడ్పడటానికి ఉపయోగపడితే, విటమిన్ డి ఉత్పత్తికి మాత్రం మధ్యాహ్నం సమయంలో లభించే ప్రత్యేకమైన UVB కిరణాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంటే మంచి నిద్ర కోసం ఎండలోకి వెళ్లే సమయం మరియు విటమిన్ డి కోసం ఎంచుకోవాల్సిన సమయం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. మంచి నిద్ర మరియు జీవ గడియారం యొక్క క్రమబద్ధీకరణ కోసం ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య ఎండలో ఉండటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి శరీరంలోని సర్కేడియన్ రిథమ్‌ (Circadian Rhythm) అని పిలిచే సహజ జీవ గడియారాన్ని సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ జీవ గడియారం మనకు ఎప్పుడు మెలకువగా ఉండాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనే అంశాలతో పాటు శరీరంలోని అనేక దైనందిన ప్రక్రియలను అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు సహజ వెలుతురులో గడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆరోగ్యకరమైన అలవాటు చక్కటి నిద్రకు, మానసిక స్థితి మెరుగుపడటానికి, పగటిపూట పూర్తి చురుకుదనానికి అలాగే జీవక్రియల సక్రమ క్రమబద్ధీకరణకు ఎంతో తోడ్పడుతుంది. రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లేటప్పుడు లేదా బయట కాసేపు గడిపేటప్పుడు ఈ సహజ సూర్యరశ్మిని సులభంగా పొందవచ్చు. అయితే, ఉదయాన్నే ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి పెద్ద మొత్తంలో లభిస్తుందని భావించకూడదు, ఎందుకంటే ఆ సమయంలో UVB కిరణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు, శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా తయారవడానికి చర్మంపై UVB కిరణాలు నేరుగా పడటం చాలా ముఖ్యం. సూర్యుడు ఆకాశంలో తగినంత ఎత్తులో ఉన్నప్పుడు ఈ కిరణాలు అత్యధికంగా అందుబాటులో ఉంటాయి. అందుకే విటమిన్ డి ఉత్పత్తి కోసం ఉదయం కంటే మధ్యాహ్నం సమయం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. డాక్టర్ సుధీర్ కుమార్ సూచన ప్రకారం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య సుమారు 15 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరశ్మిని పొందడం వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఈ విధంగా మధ్యాహ్నపు ఎండలో గడపడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, మన శరీర చర్మంలో సుమారు 20 నుంచి 30 శాతం మేర సూర్యరశ్మికి గురికావడం కూడా విటమిన్ డి ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన సూచనగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అందరికీ ఒకే రకమైన సమయం సరిపోతుందని చెప్పలేం; చర్మం రంగు, ధరించే దుస్తులు, వాతావరణ పరిస్థితులు, కాలాలు, భౌగోళిక ప్రాంతం మరియు UV కిరణాల తీవ్రతను బట్టి శరీరంలో తయారయ్యే విటమిన్ డి పరిమాణంలో మార్పులుంటాయి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు బయట ఉండటం వల్ల చర్మం కాలిపోవడం వంటి వేడి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, విటమిన్ డి కోసం ఎప్పుడూ అతిగా ఎండలో గడపకూడదని గుర్తుంచుకోవాలి.     Vitamin D Deficiency, Midday Sun Exposure, UVB Rays, Sunlight Timing, Bone Health, Indian Skin Tone, Melanin and Vitamin D, Sunlight Benefits, Sun Safety, Vitamin D Supplements.
ప్రస్తుత కాలంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యలు చాలా మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వయసు పెరగడం, వంశపారంపర్య కారణాలు మరియు ఇప్పటికే గుండె సమస్యలు ఉండటంతో పాటు, మన ఆధునిక రోజువారీ జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారత్‌లో గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందకపోవడం, ప్రాథమిక ప్రాణరక్షణపై అవగాహన తక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, అమెరికా వంటి దేశాల్లో కార్డియాక్ అరెస్ట్‌ నుంచి బయటపడే అవకాశాలు సుమారు 15 నుంచి 20 శాతం వరకు ఉండగా, భారత్‌లో మాత్రం అవి 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, హార్వర్డ్ హెల్త్ నిపుణుల సూచనల ప్రకారం.. కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, తగిన వ్యాయామం మరియు నిద్ర వంటి మూడు కీలక అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ ముప్పును ఏకంగా 80 శాతం వరకు తగ్గించుకోవచ్చని తేలింది. మొదటిగా, మన ఆహారపు అలవాట్లలో సమూలమైన మార్పులు చేసుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. మొక్కల ఆధారిత ఆహారం లేదా మెడిటరేనియన్ డైట్ విధానాన్ని అనుసరించడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ డైట్‌లో తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, డ్రై నట్స్‌ మరియు ఆరోగ్యకరమైన నూనెలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను వీలైనంత వరకు పరిమితం చేయడం చాలా అవసరం. ఒకవేళ మద్యం సేవించే అలవాటు ఉంటే దాని పరిమాణంపై కూడా తీవ్రమైన శ్రద్ధ పెట్టాలి. వారానికి 100 గ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మరియు అకాల మరణాల ముప్పు పెరుగుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన మరియు పౌష్టికాహారాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. రెండవదిగా, శారీరక చురుకుదనం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను పదిలంగా ఉంచుతుంది. శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన తీవ్రతతో కూడిన ఏరోబిక్ వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంటే వారంలో కనీసం ఐదు రోజులు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వేగంగా నడవడం, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటి వాటిని ఎంచుకోవచ్చు. కేవలం వ్యాయామ సమయమే కాకుండా, రోజంతా చురుగ్గా ఉండటం ముఖ్యం. ఎక్కువసేపు కూర్చునేవారు ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు నడవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా రోజువారీ శారీరక చురుకుదనాన్ని పెంచుకోవచ్చు. చివరిగా, ఆహారం మరియు వ్యాయామంతో పాటు నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి సమానంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. పెద్దలు ప్రతిరోజూ రాత్రి పూట కనీసం ఏడు గంటల గాఢమైన నిద్ర పొందాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి స్థాయిలు విపరీతంగా పెరగడం, వాపు సంబంధిత ప్రక్రియలు ప్రభావితం కావడం మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ నేరుగా గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు తగినంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. అంతేగాక, గుండె సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సొంతంగా ఆస్పిరిన్ మాత్రలను వేసుకోవడం చాలా ప్రమాదకరమని, వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.     Heart Attack Prevention, Lower Heart Attack Risk, Heart Health Habits, Cardiovascular Health, Preventive Cardiology, Daily Exercise, Healthy Diet, Quality Sleep, Harvard Health Tips, Lifestyle Medicine.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో మన శరీర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పూర్తిగా మన ప్రేగులలో ఉండే సూక్ష్మజీవుల (గుట్ బాక్టీరియా) సమతుల్యతపై ఆధారపడి ఉంటున్నాయని అనేక శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మానవ శరీరంలోని ప్రేగులలో సుమారు 1000 రకాల సూక్ష్మజీవులు లేదా బాక్టీరియాలు నివసిస్తుంటాయి. వీటిలో మంచి బాక్టీరియా మరియు చెడ్డ బాక్టీరియా అనే రెండు ప్రధాన రకాలుంటాయి. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. ఒకవేళ ఈ సమతుల్యత దెబ్బతింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం (షుగర్), ఊబకాయం, నిరంతరం మానసిక ఒత్తిడి మరియు తీవ్రమైన ఆందోళన వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువు ప్రేగులలోని బాక్టీరియా వృద్ధి ప్రక్రియ ప్రారంభమవుతుంది. గర్భవతిగా ఉన్న సమయంలో ఫైబర్, ప్రోటీన్లు మరియు తగిన పోషకాలు లేని వేయించిన పదార్థాలు, పులుసులు, పచ్చళ్ళు వంటి ఆహారాన్ని తీసుకుంటే, పుట్టకముందే బిడ్డలో చెడ్డ బాక్టీరియా పెరిగి మంచి బాక్టీరియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, బిడ్డకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వయసు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం వల్ల మంచి బాక్టీరియా బాగా వృద్ధి చెంది చెడ్డ బాక్టీరియా అదుపులో ఉంటుంది. ఈ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు శరీరానికి రోజంతా శక్తిని అందించడంలో పీచు పదార్థాల పాత్ర చాలా కీలకం. సరిగా అరగని మరియు కరగని పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మన ప్రేగులలోని మంచి బాక్టీరియాకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. ముఖ్యంగా సాయంత్రం పూట గుప్పెడు కందిపప్పు వంటి పప్పుధాన్యాలను పొట్టు తీయకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కందిపప్పుతో పాటు పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వాటిని తొక్క తొలగించకుండా వినియోగించడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే, పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పిండితో చేసిన అట్లు మరియు ఇడ్లీలలో మంచి బాక్టీరియా పుష్కలంగా వృద్ధి చెందుతుంది. పాలిష్ పట్టని ముడి బియ్యం, వివిధ రకాల మిల్లెట్లు, వాటితో తయారు చేసిన రవ్వలు, మల్టీగ్రెయిన్ పుల్కా వంటివి అధిక పీచును అందించి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజువారీ ఆహారంలో వాల్‌నట్స్, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు మరియు పొద్దుతిరుగుడు గింజలు వంటి విత్తనాలను చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పీచు లభించి మంచి బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి విరుద్ధంగా తెల్లటి బియ్యం, మైదా పిండి, తెల్లటి రవ్వ మరియు పంచదార వంటివి పీచు పదార్థాలు లేకుండా నేరుగా చక్కెరగా మారి చెడ్డ బాక్టీరియాను గణనీయంగా పెంచుతాయి. రసాయనాలు, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు మరియు ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రేగు వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి, సహజసిద్ధమైన పీచు పదార్థాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అలవరుచుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారి నుండి సులభంగా రక్షణ పొందవచ్చు.     Toor Dal Benefits, Kandipappu Health Benefits, Gut Microbiome, Good Gut Bacteria, Digestive Health, Plant Protein, Sustained Energy, Nutrition & Diet, Prebiotics, Indian Pulses.  
శరీరంలో నీరసం, అలసట, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు కనిపిస్తున్నాయా? వీటికి విటమిన్ B12 లోపం కూడా ఒక కారణం కావచ్చు. అయితే, ఇలాంటి లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. అసలు విటమిన్ B12 మన శరీరానికి ఎందుకు అవసరం? దాని లోపాన్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ డాక్టర్ స్వాతి విటమిన్ B12 ప్రాముఖ్యత, దాని లోపం వల్ల కనిపించే లక్షణాలు, నరాల ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి వివరిస్తున్నారు. అలాగే, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి, విటమిన్ B12 అందించే ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. మరోవైపు, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడం వల్ల కొందరిలో కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్ వంటి సమస్యలు రావచ్చు. మనం తీసుకునే ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మాంసాహారం ఎక్కువగా తినేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఈ అంశాలపై డాక్టర్ స్వాతి అందించే పోషకాహార సూచనలను తెలుసుకోండి. విటమిన్ B12 లోపం, యూరిక్ యాసిడ్ సమస్యలు రెండింటినీ ఒకే సమస్యగా భావించకుండా, వాటి కారణాలు, లక్షణాలు, ఆహార అవసరాలను విడివిడిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోండి: విటమిన్ B12 లోపం వల్ల కనిపించే ముఖ్యమైన లక్షణాలు నరాల ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి విటమిన్ B12 ఎందుకు అవసరం? విటమిన్ B12 అందించే ఆహార పదార్థాలు యూరిక్ యాసిడ్ పెరగడానికి దోహదపడే ఆహారపు అలవాట్లు గౌట్, కీళ్ల నొప్పులు, వాపుల విషయంలో ఆహారం పాత్ర యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఉపయోగపడే ఆహార మార్పులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పోషక లోపాలను నివారించుకోవడం ఎలా? గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. విటమిన్ సప్లిమెంట్లు లేదా యూరిక్ యాసిడ్ మందులను నిపుణులైన వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఈ రోజుల్లో బరువు తగ్గడానికో లేదా ఆరోగ్యం కోసమో చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా ఉపవాసం చేస్తే వయసు త్వరగా మళ్లినట్లు కనిపిస్తారని, వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అసలు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో  చాలా మందికి తెలియదు. ఉపవాసం సరైన విధానంలో చేస్తేనే అది శరీరానికి మేలు చేస్తుంది. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం తప్పుగా చేస్తే జరిగేది ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. ఉపవాసం చేస్తే వృద్ధాప్యం రావడానికి  కారణాలు..   పోషకాహార లోపం.. ఉపవాసం ఉండే సమయంలో లేదా ఉపవాసం పూర్తయిన తర్వాత శరీరానికి కావలసినంత విటమిన్లు, మినరల్స్ , ప్రోటీన్లు తీసుకోకపోతే చర్మం తన మెరుపును కోల్పోతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు వచ్చి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. కండరాల క్షీణత.. సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం ఆకలితో అలమటిస్తే, శరీరం కొవ్వుతో పాటు కండరాల కణజాలాన్ని కరిగించడం ప్రారంభిస్తుంది. కండరాలు తగ్గడం వల్ల శరీరం , ముఖం వేలాడబడినట్లు అయి, వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. డీహైడ్రేషన్.. ఉపవాసం సమయంలో చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారిపోయి, మెరుపు తగ్గిపోతుంది. ఇది కూడా త్వరగా ముసలితనం రావడానికి ఒక ప్రధాన కారణం. తీవ్రమైన ఒత్తిడి.. పద్ధతి లేకుండా కఠినమైన ఉపవాసాలు చేయడం వల్ల శరీరంలో కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ అధికమైతే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ దెబ్బతింటుంది. ఉపవాసం సరిగ్గా చేయాలంటే ఏం చేయాలి? ఉపవాసం అనేది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి కానీ దెబ్బతీయకూడదు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. ఉపవాసం ఉన్న సమయంలో , మిగతా సమయంలో తగినంత నీరు, నిమ్మరసం లేదా కొబ్బరిబోండాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఉపవాసం విరమించేటప్పుడు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ ఉన్న మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకేసారి కఠినమైన ఉపవాసాలు ప్రారంభించకుండా, చిన్నగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం. సరైన పద్ధతిలో చేసే ఉపవాసం యవ్వనాన్ని అందిస్తుంది. కానీ అవగాహన లేని ఉపవాసం వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటిస్తూ ఉపవాసం ఉండటమే శ్రేయస్కరం.                         • రూపశ్రీ.
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..ఈ తప్పే కారణం కావచ్చు! బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం. ఈ క్రమంలో చాలామంది వేగంగా ఫలితాలు సాధించాలనే తొందరలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు చేస్తుంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పడే శ్రమ, సరైన పద్ధతిలో లేకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వెయిట్ లాస్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని చెప్పే ప్రధానమైన తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం లేదా స్కిప్ చేయడం.. బరువు తగ్గే క్రమంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు. త్వరగా బరువు తగ్గవచ్చనే అపోహతో ఉదయం పూట టిఫిన్ లేదా రాత్రి భోజనాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందదు. దాంతో తీవ్రమైన అలసట, నీరసం ఏర్పడతాయి. అంతేకాకుండా, తర్వాత పూట అతిగా తినే ప్రమాదం పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడానికి బదులు మరింత పెరగడానికి కారణమవుతుంది. ఎనర్జీ, కేలరీల ప్రాధాన్యతను విస్మరించడం.. కేలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనలో శరీర జీవక్రియలకు అవసరమైన కనీస శక్తిని కూడా ఇవ్వకపోవడం సరైనది కాదు. రోజువారీ పనులు చేసుకోవడానికి, ఉత్సాహంగా ఉండటానికి సరైన పరిమాణంలో క్యాలరీలు అవసరం. అతి తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు మందగిస్తుంది. ఫలితంగా శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. పోషకాహార లోపం..  బరువు తగ్గే ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సమస్య. కేవలం కేలరీల లెక్కింపు పైనే దృష్టి పెట్టి, తింటున్న ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ ఉన్నాయో లేదో గమనించకపోవడం పెద్ద తప్పు. కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులను పూర్తిగా పక్కన పెట్టేయడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందవు. దీనివల్ల జుట్టు రాలడం, చర్మం నిస్తేజంగా మారడం, ఎముకలు బలహీనపడటం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు తగినంత తీసుకోకపోవడం.. నీరు తగినంత తీసుకోకపోవడం  శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. చాలామంది దప్పికను, ఆకలిని సరిగా గుర్తుపట్టలేక దప్పికైనప్పుడు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ప్రతిరోజూ శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు తాగడం వల్ల టాక్సిన్లు బయటకు పోవడమే కాకుండా, జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. వ్యాయామం.. వ్యాయామం విషయంలో కూడా తీవ్రమైన తేడాలు కనిపిస్తుంటాయి. కొందరు అసలు వ్యాయామమే చేయకుండా కేవలం డైటింగ్ పై ఆధారపడితే, మరికొందరు మితిమీరిన వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం కష్టపెట్టడం వల్ల కండరాల బలహీన పడతాయి,  గాయాలు అయ్యే అవకాశం ఉంది. నిద్ర.. బరువు తగ్గే ప్రయాణంలో నిద్ర పాత్ర చాలా కీలకమైనది. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి. మానసిక ఒత్తిడి.. మానసిక ఒత్తిడి కూడా బరువు తగ్గే ప్రక్రియకు పెద్ద అడ్డంకి. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలై పొత్తికడుపు భాగంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. ప్రతిరోజూ బరువు చూసుకుంటూ తీవ్ర ఆందోళనకు గురికావడం వల్ల కూడా ఎలాంటి పాజిటివ్ ఫలితాలు రావు. బరువు తగ్గడం అనేది చాలా చిన్న  ప్రక్రియ కాదు, అదొక ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పు. ఎనర్జీ , పోషకాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, సమతుల్యాహారాన్ని సరిపడా పరిమాణంలో తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, మంచి నీరు బాగా తాగడం వంటి అలవాటు పాటించడం ద్వారా మాత్రమే పూర్తిగా బరువు తగ్గడం లో   ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు.                          *రూపశ్రీ.