తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిష  మరో సారి చర్చనీయాంశంగా మారారు. త్రిష పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం  జోరుగా సాగుతున్న వేళ  ఆమె అభిమానులు త్రిష పేరుమీద   కొత్త వేదికను ప్రారంభించారు.  అక్కడితో ఆగకుండా ఆమెను దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత రాజకీయ వారసురాలిగా అభివర్ణించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలితకు ఉన్న  పురట్చి తలైవి బిరుదును గుర్తుచేసేలా,  ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కావడం తమిళ సినీ, రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చకు తెర లేచింది.  ఈ వేదిక నిర్వాహకులు విడుదల చేసిన వివరాల ప్రకారం..  త్రిష వ్యక్తిత్వం, దృఢత్వంలో జయలలిత లక్షణాలు కనిపిస్తాయి.   తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే  ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే..  భవిష్యత్తులో విజయ్‌తో కలిసి త్రిష కూడా రాజకీయ ప్రయాణం చేస్తే..  రాష్ట్రంలో జయలలిత తరహా  పాలన వస్తుందన్నది ఆ వేదిక నిర్వాహకుల అభిప్రాయం.   ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ, త్రిష రాజకీయ ప్రవేశానికి అనుకూల వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా,  ఆమెకు ఈ వేదికతో   ప్రత్యక్ష సంబంధం ఉందా అనే అంశాలపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.  ఇప్పటివరకు నటి త్రిష స్వయంగా రాజకీయ ప్రవేశంపై గానీ, టీవీకే పార్టీలో చేరడంపై గానీ   అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.  కేవలం అభిమానుల ఆకాంక్షలు, కొత్త వేదిక ప్రారంభోత్సవ ప్రకటనల ఆధారంగానే ఈ రాజకీయ చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో పాటు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన చర్చలూ తెరపైకి వచ్చాయి. గతంలో జయలలిత పాత్ర కోసం త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపించినప్పటికీ..  ఆ ప్రాజెక్ట్ లేదా నటీనటుల ఎంపికపై ఎటువంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అయినప్పటికీ.. జయలలితతో పోలికలు, బయోపిక్ ప్రస్తావనలు కలగలిసి త్రిష పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి.  ఇది కూడా చదవండి:  త్రిష రాజకీయరంగ ప్రవేశం: మీడియాతో రాజకీయాలపై త్రిష ఏం మాట్లాడిందంటే! దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.  , సినిమా షూటింగ్‌లు, వృత్తిపరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉండే త్రిష ఈ ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.  ఏది ఏమైనా రానున్న రోజులలో ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  తరఫున చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.  మొత్తంగా  జయలలిత వారసత్వం, సీఎం విజయ్‌తో రాజకీయ ప్రయాణ అంచనాల నేపథ్యంలో త్రిష పేరు చుట్టూ మొదలైన చర్చ తమిళనాడులో పొలిటికల్ హీట్ ను పెంచింది.  మీకు నచ్చవచ్చు:  విజయ్ ఇంటికి త్రిష.. సిఎం అవ్వబోతున్నాడా! విజయ్ ఈవెంట్‌లో త్రిష సడన్ ఎంట్రీ.. ఊహించని ట్విస్ట్‌తో షాక్ తిన్న ఫ్యాన్స్! [Actress Trisha, olitical Entry, Jayalalitha, Successor, Ilaiya Puratchi Thalaivi, Trisha Peravai, TeluguOne] 
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది. మహా పాదయాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. కరీంనగర్‌లో కనిపిస్తున్న కాషాయ ప్రభంజనాన్ని చూసి తన మనసు పులకించిపోతోందని అన్నారు. తనను కన్న కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టడంతో తన గుండె ఉప్పొంగుతోందన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, భుజాన ఉన్న కాషాయ జెండా కోసం ఎంతవరకైనా పోరాడతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ తన కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలనిపిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు.. కరీంనగర్‌లో కనిపిస్తున్న జన ప్రభంజనాన్ని చూడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాషాయ దళం సిద్ధంగా ఉందని అన్నారు. నితిన్ నబిన్‌పై బండి సంజయ్ ప్రశంసల వర్షం.! బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను బండి సంజయ్ కొనియాడారు. ఆయన సాధారణ నాయకుడు కాదని, కొదమసింహం అంటూ అభివర్ణించారు. నబిన్ చూపుల్లో పదును ఉందని, ఆయన పక్కన నిలబడితేనే వేడి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.. నబిన్ అంటే నూతనత్వమని అభివర్ణించారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై, ఐదుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన నాయకుడిగా నితిన్ నబిన్ ఎదిగారని గుర్తుచేశారు. 45 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఒక సామాన్య కార్యకర్త పార్టీని నడిపించే స్థాయికి ఎదగడం బీజేపీలోనే సాధ్యమని పేర్కొన్నారు. నితిన్ నబిన్‌కు చిన్నతనంలో రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని, ఉన్నత విద్య అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనుకున్నారని బండి సంజయ్ చెప్పారు. అయితే ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, దేశం కోసం పనిచేయాలనే అంకితభావమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని ప్రశంసించారు. బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని గుర్తుచేస్తూ..! తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కార్యకర్తలు ఏళ్ల తరబడి పోరాడుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండాను మోస్తూ కార్యకర్తల భుజాలు కాయలు కాశాయని, లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. కాషాయ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇదే సంకల్పంతో పనిచేస్తున్నారని అన్నారు. SIR, ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌కు ప్రశ్నలు.! ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ గాంధీ SIR ప్రక్రియను వ్యతిరేకించడంపై ప్రశ్నలు సంధించారు. మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, డూప్లికేట్ ఓటర్లు, అర్హత లేని ఓట్లను తొలగిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. దేశంలోకి అక్రమంగా వలస వచ్చినవారికి ఓటు హక్కు కల్పించడం సరికాదని, అర్హులైన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు ఉండాలని అన్నారు. విదేశీ చొరబాటుదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొందుతూ స్థానిక ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేసినా బీజేపీ వెనక్కి తగ్గదని అన్నారు. ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌పై మోదీ పోరాటానికి మద్దతివ్వాలని పిలుపు.! దేశంలో డ్రగ్స్ సమస్య యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్న పరిస్థితిని చూసి ప్రధాని మోదీ ఆవేదన చెందుతున్నారని చెప్పారు. నషా ముక్త్ భారత్ లక్ష్యంతో డ్రగ్స్ రహిత సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయన్న అంచనాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అందరికీ అధికారం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మహా పాదయాత్ర: రాంచందర్ రావు  మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే ఈ మహా పాదయాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు SIR ప్రక్రియ జరిగినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎనిమిదిసార్లు SIR జరిగినా అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రధాని మోదీ ఎన్నిక చెల్లదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని రాంచందర్ రావు విమర్శించారు. మోదీ ఎన్నిక చెల్లదంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక కూడా చెల్లదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. విదేశీ శక్తులతో కలిసి భారత్‌ను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మహా పాదయాత్ర లక్ష్యమని రాంచందర్ రావు స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: Gen z:  24 ఏళ్లకే డిప్యూటీ మేయర్‌.. టీడీపీ కూటమి సంచలన నిర్ణయం.! మీకు నచ్చవచ్చు: ఫేస్‌ క్రీమ్‌ వాడితే కిడ్నీలు డ్యామేజ్..అసలేం జరిగిందంటే.!     [ Karimnagar BJP Maha Padayatra, Nitin Nabin, Bandi Sanjay, BJP Telangana, N Ramchander Rao, Rahul Gandhi, SIR Controversy ]  
తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి ఓ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కాదు, పునర్వ్యవస్థీకరణే అంటే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది.  రాష్ట్రంలో  రేవంత్ సర్కార్  మూడేళ్ల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో, రాష్ట్రంలో మరో డిప్యూటీ సీఎం పదవి అంశం తెరపైకి వచ్చింది.   తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రభుత్వం, పార్టీ యంత్రాంగంలో కీలక మార్పులు చేసేందుకు సమాయత్తమౌతోందని అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నదని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు తరచుగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్న తీరును సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ప్రస్తుత మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చేసింది.   2028 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇటు పార్టీ పదవుల్లోనూ, అటు కేబినెట్ పోర్టుపోలియోల్లోనూ కూడా భారీ మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన వెంటనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తలు జోరుగా వినిపింయాయి. అయితే అరకొర మార్పులు కాకుండా సమగ్ర ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో హైకమాండ్ కేబినెట్ పునర్యవస్థీకరణ అంశాన్ని అప్పటికి పక్కన పెట్టింది.  త్వరలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరగనుంది. అది పూర్తయిన వెంటనే రేవంత్ కేబినెట్ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎంపికయ్యే ఎమ్మెల్సీలలో ఒకరికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.  మల్లు భట్టి విక్రమార్కకు తోడుగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు మరో డిప్యూటీ సీఎం పదవిని కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.   ఇది కూడా చదవండి:   వినాయక చవితికి ముందే రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటే? రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో   కీలక వాటా దక్కాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉంది. ఆ డిమాండ్ ను నెరవేర్చే ఉద్దేశంతో హైకమాండ్ రెండో ఉప ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు.  భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండో ఉపముఖ్యమంత్రి అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.   సామాజిక సమతుల్యతను కాపాడుతూనే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పునర్వ్యవస్థీకరణతో పార్టీలో అసమ్మతి, అసమ్మతి గళాలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని అంటున్నారు.  ఏది ఏమైనా వచ్చే నెల రెండో వారం నాటికి కేబినెట్ రీషఫుల్, రెండో ఉప ముఖ్యమంత్రి, పార్టీ పదవులలో మార్పులు తదితర అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    మీకు నచ్చవచ్చు:  రేవంత్ మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా ? రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?​ [Raventh, Cabinet Reshuffle, SecondDeputyCM,  Highcommand, Strategy, TeluguOne]
ALSO ON TELUGUONE N E W S
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సత్తా చాటుతూ ఉన్నాడు ప్రముఖ మలయాళ నటుడు  శ్రీజిత్‌ రవి. ఇప్పుడు ఈ  నటుడికి కోర్టు షాక్ ఇచ్చింది. ఇద్దరు మైనర్ బాలికలకి  సంబంధించిన పోక్సో కేసులో ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ కేరళలోని త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించడం ప్రధాన హాట్ టాపిక్. 2022 జూలై 4న కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన 2022 జూలై 4న జరిగింది. త్రిసూర్‌లోని అరనాట్టుకరలో ఇ‍ద్దరు బాలికలు పాఠశాల నుంచి తమ ఇంటికి తిరిగి వస్తుండగా, శ్రీజిత్ రవి తన కారులో వారిని వెంబడించాడ. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ ప్రాంతంలో వారిని చూస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అతన్ని నటుడు శ్రీజిత్ రవిగా గుర్తించారు. ఇది కూడా చదవండి: అజిత్ డేర్ డెవిల్ లో సిఎం క్యామియో: ఫ్యాన్స్ ని ఆపడం ఇక ఎవరి తరం కాదు!    అయితే శ్రీజిత్ రవికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని, ఈ కేసు ఆయన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, శిక్షను తగ్గించాలన్న రవి తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నిందితుడు ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని.. ఈ ఘటన వల్ల వారిపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడొచ్చని కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. రవి నుంచి జరిమానా వసూలు చేస్తే.. నష్టపరిహారంగా  ఇద్దరు బాలికలకు సమానంగా పంచాలని కూడా కోర్టు ఆదేశించింది. శ్రీజిత్ రవి తండ్రి కూడా ప్రముఖ నటుడు టీజీ రవి. మీకు నచ్చవచ్చు  భోగి  ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! బండ్ల గణేష్ మమ్మల్ని మోసం చేయలేదు: చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్!   [Sreejith Ravi POCSO Case, Mollywood, Tollywood, Tg Ravi]  
కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘కింగ్ 100’ విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 24న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా మేకర్స్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో ఈ వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. సినిమా డిసెంబర్ 24నే థియేటర్లలోకి రానుందని మరోసారి స్పష్టం చేశారు. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కావడంతో ‘కింగ్ 100’పై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాగ్ స్టైలిష్ లుక్, కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించారు. అప్పుడే డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల సినిమా విడుదల తేదీ మారబోతుందనే ప్రచారం మొదలైంది. క్రిస్మస్ సీజన్‌లో పోటీ, సినిమా ప్రమోషన్ల విషయంలో కనిపిస్తున్న నిశ్శబ్దం వంటి కారణాలతో వాయిదా పడే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నాగార్జున అభిమానులు సినిమా అనుకున్న తేదీకే వస్తుందా? లేదా? అని చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా విడుదల చేసిన 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో స్పష్టత ఇచ్చారు. బ్లాక్ సూట్‌లో నాగార్జున స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌తో డిసెంబర్ 24 విడుదల తేదీని మరోసారి గుర్తుచేశారు. దీంతో ఇప్పటివరకు వినిపించిన వాయిదా ప్రచారానికి చిత్ర బృందం సమాధానం ఇచ్చినట్లయింది. ఇది కూడా చదవండి: నాగార్జునను ఆందోళనకు గురిచేసిన చైతు.. పోకిరి చూశాకే ఆ నిర్ణయం తీసుకున్నారు.! ఈ సినిమాకు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ‘కింగ్ 100’లో నాగార్జునతో పాటు టబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున, టబు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా టబు పోషిస్తున్న మహంతి ఝాన్సీ రాణి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఇటీవల నాగార్జున కూడా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఒక పాటతో పాటు కొంత ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ సిద్ధమయ్యేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మీకు నచ్చవచ్చు:  శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్.. అసలు సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!       [King 100, Release Date, December 24, Nagarjuna, Ra Karthik]  
స్టార్ హీరో అజిత్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ తెలిసిందే. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'డేర్ డెవిల్' అనే మూవీ అనౌన్స్ చేసాడు. గతంలో వీరిద్దరి కాంబోలో  వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మంచి క్రేజ్ సంపాదించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే న్యూస్  సోషల్ మీడియాకి సరికొత్త పులకింతలు తీసుకొస్తుంది. అయితే ఆయన ముఖ్యమంత్రి గానా? లేక కథలో కీలకమైన మరో వ్యక్తిగా కనిపిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌తో పాటు కన్నడ సినీ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఇది నిజమైతే అజిత్ సినిమాతో డీకే శివకుమార్ వెండితెరపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం కానీ, డీకే శివకుమార్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.    అజిత్ కెరీర్‌లో 64వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆయన భార్య షాలిని అజిత్ కుమార్ బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అజిత్‌కి జోడీగా శ్రీలీల కనిపిస్తుండగా ఉన్ని ముకుందన్, శివరాజ్ కుమార్, పార్తిబన్, ప్రభు, సునీల్, రెడిన్ కింగ్స్‌లీ వంటి ప్రముఖ నటులు కీ రోల్స్. ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్! ముఖ్యంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అజిత్‌కు ఎదురుగా ఆయన చేసే పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే 'జైలర్' సినిమాలో నరసింహ పాత్రతో ఇతర భాషల ప్రేక్షకులకు మరింత దగ్గరైన శివన్న.. ఇప్పుడు అజిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.  నవంబర్ 2న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ కొనసాగుతోంది. 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అజిత్ యాక్షన్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్, అనిరుధ్ సంగీతం.. ఇలా ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మీకు నచ్చవచ్చు భోగి ఫస్ట్ రివ్యూ! తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా! [ DK Shivakumar, Ajith, Dare Devil,  Adhik Ravichandran, Tollywood, sreeleela]                
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘డ్రాగన్’. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి టైటిల్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో #NTRNeel పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రకటించగానే అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ పవర్‌ఫుల్ టైటిల్ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని తాజాగా బయటపడింది. ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకు అందించింది మరెవరో కాదు.. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న అయాన్ ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా కోసం సరైన టైటిల్ వెతుకుతున్న సమయంలో తాము ‘డ్రాగన్’ పేరును వారికి ఇచ్చామని ఆయన చెప్పారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు తొలుత ఈ ‘డ్రాగన్’ టైటిల్‌ను పెట్టాలని అయాన్ ముఖర్జీ భావించారట. ఆ సినిమా మొదట చిన్న కథగా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా భారీ బడ్జెట్‌తో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉన్న ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంది. దీంతో కథ, సినిమా పరిధి పెరిగిన నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ అనే పేరును ఖరారు చేశారు. అలా ‘బ్రహ్మాస్త్ర’ కోసం అనుకున్న ‘డ్రాగన్’ పేరు ఉపయోగించకుండా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం టైటిల్ వెతుకుతున్న సమయంలో అయాన్, కరణ్ జోహార్ ఆ పేరును చిత్ర బృందానికి అందించారు. ఈ విషయాన్ని అయాన్ స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు ఈ టైటిల్ వెనుక ఉన్న కథ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ఎదురుచూపులు.. ఎట్టకేలకు దేవర శాటిలైట్ రైట్స్ సోనీ చేతికి.! ఇక ‘డ్రాగన్’ సినిమా విషయానికి వస్తే.. 1967 నేపథ్యంలో సాగే ఈ కథలో నల్లమందు వ్యాపారం, దాని చుట్టూ ఏర్పడే ఆధిపత్య పోరాటం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్, ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనదైన యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు:  మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. వారణాసి కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.! మమితా బైజు అసభ్యకర AI వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.!       [Jr NTR, Dragon Title Story, Ayan Mukerji, Karan Johar, Prashanth Neel]  
The All India Cine Workers Association (AICWA) has written to Prime Minister Narendra Modi seeking a ban on Pakistani series Jo Bachay Hain Sang Samait Lo on Netflix India. The association has urged the government to prevent the show from streaming in the country ahead of its scheduled December 4 premiere. In its letter, AICWA called for strict implementation of the Ministry of Information and Broadcasting's May 2025 advisory on Pakistani-origin content. It has also demanded a permanent law prohibiting Pakistani entertainment content across Indian television, OTT platforms and theatres. The association argued that streaming the series in India would go against the spirit of the advisory and public sentiment. It has appealed to Netflix India and other streaming platforms not to feature Pakistani content in the country. Jo Bachay Hain Sang Samait Lo marks Netflix's first Pakistani original series. Based on Farhat Ishtiaq's bestselling Urdu novel, the drama follows six love stories across three generations. Also Read: Suriya next to be produced by Sun Pictures? The series features Fawad Khan and Mahira Khan in leading roles, alongside Ahad Raza Mir, Hamza Ali Abbasi, Hania Aamir and Sanam Saeed. The show has been produced by Momina Duraid Films, with Momina Duraid serving as showrunner. Netflix has announced December 4 as the premiere date, but the platform has not clarified whether the series will be available to Indian subscribers. AICWA's demand has brought the upcoming show into the spotlight ahead of its release. Check Out:  Megaverse Promo: Chiru takes over Netflix                       King 100: Nagarjuna dismisses postpone rumors Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Suriya is reportedly set to collaborate with director Arun Matheswaran, known for his distinct filmmaking style in films like Captain Miller and Rocky. If the reports turn out to be true, the project could bring together an interesting combination of Suriya's screen presence and Arun's gritty storytelling. Anirudh Ravichander is said to be composing the music for the film, adding another exciting element to the rumoured collaboration. The composer has previously delivered several popular albums for Tamil cinema, and his association with Suriya would be keenly watched. Sun Pictures is reportedly being considered as the production house for the project. However, an official confirmation regarding the director, composer or producer is still awaited. Reports suggest that Suriya may announce the film after completing his upcoming project with director TJ Gnanavel. The actor is currently working on the film, and his next lineup has become a topic of discussion among fans. Also Read: King 100: Nagarjuna dismisses postpone rumors Arun Matheswaran's films are known for their intense narratives and distinctive visual treatment. A collaboration with Suriya could see the director working on a larger canvas while retaining his signature style. With Suriya, Arun Matheswaran and Anirudh Ravichander reportedly coming together, the project has already sparked curiosity. An official announcement is expected to clarify the details of this much-discussed combination. Check Out:   Megaverse Promo: Chiru takes over Netflix                        Avengers: Doomsday: Marvel ditches phase 5 films Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nagarjuna Akkineni's 100th film, King 100, is set to release in theatres on December 24. The makers have put an end to speculation about a possible postponement by unveiling a countdown poster, confirming that the film remains on schedule. The poster features Nagarjuna in a black suit against a red backdrop. The actor's look has drawn attention, with the countdown marking the film's arrival in theatres next month. The film's title and glimpse were unveiled on Nagarjuna's birthday, followed by a glimpse introducing Tabu. The two actors are expected to share an intense rivalry in the film, which has become a key point of interest. Also Read: Megaverse Promo: Chiru takes over Netflix Directed by Ra. Karthik, King 100 also features Ashok Selvan in a prominent role. Devi Sri Prasad is composing the music, and his background score in the promotional glimpses has received a positive response. The film's shoot has been completed and it is currently in the final stages of post-production. With the countdown poster, the makers have reaffirmed December 24 as the theatrical release date. King 100 is being produced by the Akkineni family under the Annapurna Studios banner. The film marks Nagarjuna's 100th outing as a lead actor and is scheduled to release on December 24. Check Out:  Family Pack teaser promises comical feast                       Viral: AI video of Mamitha Baiju and Pradeep Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బండ్ల గణేష్‌కి  సంబంధించిన చెక్ బౌన్స్ కేసు వ్యవహారం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ఈ కేసు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో బండ్ల గణేష్ పై ఫిర్యాదు చేసిన జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా స్పందించారు. బండ్ల గణేష్, తమ మధ్య ఉన్న వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని, ఇక ఎలాంటి ఆర్థికపరమైన, వ్యక్తిగత సమస్యలు లేవని ప్రకటించారు. అంతేకాదు.. ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలను కూడా బయటపెట్టారు. మరి ఇంతకీ బండ్ల గణేష్, జెట్టి వెంకటేశ్వరరావు మధ్య ఏం జరిగింది? ప్రకాశం జిల్లా ముప్పాల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వరరావు తాజాగా విడుదల చేసిన వీడియోలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బండ్ల గణేష్‌తో తమకు గత 15 ఏళ్లుగా మంచి స్నేహం ఉందని గుర్తుచేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి బండ్ల గణేష్ ఈ స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. గతంలో తన కుమారుడు, బండ్ల గణేష్ ఎంతో సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. అయితే తన కుమారుడు మరణించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని,ఆ సమయంలో ఏర్పడిన వ్యక్తిగత ఇగో కారణంగానో, మధ్యవర్తుల జోక్యం వల్లనో తమ మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని వెల్లడించారు. ఆ విభేదాలే చివరకు కోర్టు కేసుల వరకు వెళ్లాయని ఆయన వివరించారు. అంటే ఇంతకాలం కొనసాగిన వివాదం వెనుక కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయన్నమాట. నవంబర్ 18న ఈ కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తర్వాత కొందరు మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూల పేరుతో అనవసర హడావుడి చేశారని జెట్టి వెంకటేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. తాము వద్దని చెబుతున్నా కొందరు ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా చూపించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: భోగి ఫస్ట్ రివ్యూ: ఒక్క సినిమాలో ఇన్ని ట్విస్టులా? బిగ్గెస్ట్ హిట్ అవుతుందా! ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి ఆర్థికపరమైన సమస్యలు లేవని, వ్యక్తిగత విభేదాలు కూడా పూర్తిగా సమసిపోయాయని స్పష్టం చేశారు. గతంలో ఎలాంటి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవో.. ఇకపై కూడా బండ్ల గణేష్‌తో అలాంటి అనుబంధమే కొనసాగుతుందని తెలిపారు. ఇక ఈ వివాదం వెనుక ఉన్న అసలు విషయానికి వస్తే.. 2018లో బండ్ల గణేష్ జె. జానకిరామయ్య నుంచి రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం జానకిరామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బ్యాంకులో ఆ చెక్ నగదుగా మారకపోవడంతో జెట్టి వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ అనంతరం ఒంగోలు కోర్టు బండ్ల గణేష్‌కు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన అప్పీల్‌కు వెళ్లగా, నవంబర్ 18న అప్పీల్ కోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి.  ఇక ఇప్పుడు జెట్టి వెంకటేశ్వరరావు స్వయంగా ముందుకొచ్చి తమ మధ్య అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని ప్రకటించడంతో ఈ వ్యవహారంపై ఆసక్తి పెరిగింది. అయితే వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య రాజీ కుదరడం వేరు.. కోర్టులో కొనసాగుతున్న కేసు చట్టపరంగా ముగియడం వేరు. ఈ విషయంలో తదుపరి కోర్టు ప్రక్రియపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి గత 15 ఏళ్ల స్నేహంలో వచ్చిన చిన్నపాటి మనస్పర్థలు పెద్ద వివాదానికి దారితీయగా.. ఇప్పుడు మళ్లీ ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడినట్లు జెట్టి వెంకటేశ్వరరావు మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ పరిణామం తర్వాత బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.   మీకు నచ్చవచ్చు  తెలుగు సినిమాలకి అనిరుధ్ గండం! 100 డేస్ ఆడిన చివరి సినిమా అదే!   [Bandla Ganesh, Cheque Bounce, Jetti Venkateswara Rao, Tollywood]  
మాస్ అమ్మ మొగుడు అనిపించుకోవాలని శర్వానంద్ తాపత్రయ పడుతున్నాడనే విషయం 'భోగి'తో అర్థమైపోతుంది. అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికులైతే శర్వానంద్ కోరిక నెరవాలని తమ ఇష్ట దైవాలని ప్రార్థిస్తున్నారు.     తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రివ్యూ షోతో భోగి హెడ్ లైన్స్ లో  నిలిచింది.  ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, సెకండాఫ్‌లో వచ్చే రెండు ట్విస్టులు ప్రేక్షకులని  ఆశ్చర్యపరిచాయని సమాచారం. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని, దర్శకుడు సంపత్ నంది కథను ఆసక్తికరంగా నడిపించారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను సీట్లకి అతుక్కుపోయేలా చేస్తాయని అంటున్నారు.. కథను ఊహించని మలుపు తిప్పే ఈ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే ప్రచారం సైతం  జరుగుతోంది. ఇప్పటివరకు శర్వానంద్‌ను ఎక్కువగా ఫ్యామిలీ, లవ్, ఎంటర్‌టైన్మెంట్ సినిమాల్లో చూసిన ప్రేక్షకులకు 'భోగి'లో ఆయన పాత్ర కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. మరి నిజంగానే ఈ సినిమా ఆయన కెరీర్‌లో ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందా? అనేది థియేటర్లలో ప్రేక్షకుల స్పందనను బట్టి తేలనుంది. 1960ల కాలంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని 'బొగ్గుల గుట్ట' అనే గ్రామం నేపథ్యంలో  సాగుతుంది. ఇందులో కమ్మరి గంగ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు తన ఐదుగురు చెల్లెళ్లే ప్రపంచంగా భావించే గంగ.. కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే వ్యక్తి. ఇది కూడా చదవండి: తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా? ఇవిగో ప్రూఫ్స్!   అదే గ్రామంలో సులోచన రాణి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనున్నారు. మరోవైపు మందారం పాత్రలో డింపుల్ హయతి తన గ్లామర్‌తో ఆకట్టుకోనున్నారు. గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే భూస్వాములు, అమావాస్య పూజల చుట్టూ తిరిగే రహస్య సంఘటనలు కథలో కీలకంగా ఉండనున్నాయి. మూఢనమ్మకాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గ్రామ ప్రజలను భూస్వాముల చెర నుంచి గంగ ఎలా కాపాడాడు? అతని జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. 'భోగి' కి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాలోని కొన్ని హింసాత్మక సన్నివేశాలు, డైలాగ్స్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే కథ క్యారక్టర్ ల స్వభావం దృష్ట్యా వాటిలో మార్పులు చేయడానికి చిత్రబృందం అంగీకరించలేదని సమాచారం. ఇక సినిమా రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలు. అంటే 154 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించాడు . భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్. నవంబర్ 27 అంటే ఈ శుక్రవారం రిలీజ్ డేట్.   మీకు నచ్చవచ్చు ధనుష్ ఓం కి నిరాశ తప్పదా! డింపుల్ హయాతి పెళ్లి!     [Bhogi, Sharwanand , Anupama Parameswaran, Dimple Hayathi, Sampath Nandi]     Bhogi Movie First Review
సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముందుగా ప్రకటించిన ఏప్రిల్ 7, 2027 విడుదల తేదీకి సినిమా రావడం లేదని, ఆగస్టుకు వాయిదా పడిందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాలంటే విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో తన మేకింగ్ సత్తా చాటిన ఆయన.. ఈసారి మహేష్ బాబుతో అంతకుమించిన స్థాయిలో సినిమా తెరకెక్కిస్తున్నారు. అందుకే ‘వారణాసి’లోని భారీ విజువల్స్, గ్రాఫిక్స్ పనులకు మరింత సమయం అవసరమవుతోందని, ఈ కారణంగానే విడుదల తేదీని మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రస్తుతం మూడు తేదీలను పరిశీలించినట్లు తెలుస్తోంది. జులై 29, ఆగస్టు 5, ఆగస్టు 12 తేదీలను ట్రేడ్ వర్గాలతో చర్చించారట. అయితే జులై చివరి వారంతో పోలిస్తే ఆగస్టులో విడుదల చేయడమే మంచిదని చిత్ర బృందంలోని పలువురు అభిప్రాయపడినట్లు వినికిడి. దీంతో ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ 7, 2027 అనేది మంచి రిలీజ్ డేట్. ఆ రోజు ఉగాది కావడం, ఆ తర్వాతి వారంలో శ్రీరామనవమి రావడంతో పండుగ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆగస్టుకు మారితే ఆ పండుగ సీజన్‌ను వదులుకోవాల్సి వస్తుంది. అయితే గ్రాఫిక్స్ పనుల్లో రాజీ పడకుండా, సినిమాను మరింత క్వాలిటీగా సిద్ధం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: వారణాసి వీడియో లీక్.. ఆపిల్ చేసిన పనికి షాక్‌లో రాజమౌళి.! ‘వారణాసి’లో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు.  అయితే ఈ వాయిదా వార్తపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంటారు. మరి ఈసారి కూడా ఏదైనా భారీ అప్‌డేట్‌తో విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.  మీకు నచ్చవచ్చు: టికెట్ ధరలు 80 శాతం తగ్గింపు.. 99కే ‘రామాయణ’ సినిమా చూసే ఛాన్స్.! కిరణ్ అబ్బవరం రికార్డ్.. కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇన్ని మిస్టరీలా.?       [Varanasi Postponed, August 2027, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra]  
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
శీతాకాలం మొదలవగానే ఉదయాన్నే చల్లగాలి వణుకు పుట్టిస్తుంది, ఆ వెంటనే జలుబు, దగ్గు, నీరసం, మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. చలి వాతావరణంలో శరీరానికి లోపలి నుంచి వెచ్చదనం, స్థిరమైన శక్తి మరియు బలం అవసరమవుతాయి. అలాంటి కాలానికి మన సంప్రదాయ వంటకాలలో గోందు లడ్డూ ఒక అద్భుతమైన బలవర్ధక ఆహారంగా నిలుస్తుంది. ఇందులో ఉపయోగించే గోందు ప్రత్యేకమైన చెట్ల నుంచి లభించే సహజ జిగురు కాగా, ఆయుర్వేదంలో దీనిని శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చలవ కోసం వాడే గోందు కతీరాకు భిన్నంగా, సాధారణ గోందు శీతాకాలంలో శరీరానికి వేడిని, బలాన్ని అందించడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ గోందు లడ్డూల తయారీలో ప్రతి కొలత, ప్రతి దశ కూడా రుచి మరియు ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. ముందుగా 1 కప్పు గోధుమపిండిలో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చల్లుతూ పిండి ముద్ద కాకుండా 15 నిమిషాలు నానబెట్టి, ఆపై జల్లెడ పడితే అది చక్కటి రవ్వలా మారుతుంది. తర్వాత కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి పావు కప్పు గోందును తక్కువ మంటపై వేయించాలి; అది వడియాల్లా ఉబ్బి తెల్లగా మారేవరకు లోపలి వరకు వేయించడం చాలా అవసరం, లేదంటే తినేటప్పుడు పళ్లకు జిగురుగా అంటుకుంటుంది. అదే కడాయిలో కొద్దిగా నెయ్యితో జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, పుచ్చగింజలు, బాదం పలుకులు, అలాగే అర చిప్ప తురిమిన ఎండుకొబ్బరిని కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక గోధుమపిండి రవ్వను మరొక 1 స్పూన్ నెయ్యిలో లో ఫ్లేమ్ మీద రంగు మారి సువాసన వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి. వేయించిన గోందును చేతితో మెత్తగా క్రష్ చేసి, దానికి అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండుకొబ్బరి, గోధుమపిండి మిశ్రమాన్ని కలపాలి. మరోవైపు ముప్పావు కప్పు బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంటపై తీగపాకం వచ్చేవరకు కరిగించి, ఆ పాకాన్ని మిశ్రమంలో వడకట్టి వేయాలి. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో కలిపి, తర్వాత చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టాలి. ఇలా తయారు చేసిన గోందు లడ్డూలను ఫ్రిజ్‌లో పెట్టకుండానే 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పోషకాల పరంగా చూస్తే, సుమారు 30 గ్రాముల నుంచి 35 గ్రాముల బరువున్న ఒక గోందు లడ్డూ దాదాపు 160 నుంచి 180 క్యాలరీల శక్తిని అందిస్తుంది (సైజు మరియు నెయ్యి, బెల్లం మోతాదును బట్టి 60 గ్రాముల లడ్డూలో 287 క్యాలరీల వరకు ఉండవచ్చు). గోధుమపిండి మరియు బెల్లం నుంచి కార్బోహైడ్రేట్లు, నెయ్యి మరియు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఖనిజాలు లభిస్తాయి. చలికాలంలో రోజుకు కేవలం 1 గోందు లడ్డూ తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా, ఎముకలు మరియు కీళ్ల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఒక్క కివీ లేదా ఉడికించిన టమాటో: కణాల ఆరోగ్యంపై డాక్టర్ సూచనలు ఈ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలకు నడుము మరియు ఎముకలు గట్టిపడటానికి, శరీరం త్వరగా కోలుకోవడానికి సంప్రదాయకంగా వీటిని తినిపిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలోనూ ఇవి మంచి తోడ్పాటు అందిస్తాయి. అయితే ఇందులో నెయ్యి, బెల్లం, గోధుమపిండి ఉండటం వల్ల క్యాలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి; కాబట్టి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా బరువు నియంత్రణలో ఉన్నవారు మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. మొత్తానికి, సరైన మోతాదులో తీసుకుంటే గోందు లడ్డూ శీతాకాలంలో రుచిని, ఆరోగ్యాన్ని కలబోసే విలువైన సంప్రదాయ ఆహారం. బయట దొరికే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ లడ్డూను రోజుకు 1 చొప్పున 10 రోజుల పాటు నిల్వ ఉండేలా సిద్ధం చేసుకుంటే చలికాలపు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సహజ పదార్థాల మేళవింపుతో రూపొందే ఈ లడ్డూ మన జీవనశైలిలో భాగమైతే శరీరానికి బలం, మనసుకు తృప్తి రెండూ దక్కుతాయి. మీకు నచ్చవచ్చు:పిల్లల స్నాక్ బాక్స్ కోసం, క్విక్ అటుకుల మిక్చర్.. నెల రోజులు నిల్వ                                  వేడి అన్నంలో నెయ్యి, చిక్కుడుకాయ కూర.. బాల్యపు రుచి మళ్లీ!       Winter Gond Laddu, Gond Laddu Benefits, Strong Bones In Winter, Immunity Boosting Laddu, Edible Gum Laddu, Winter Wellness Tips, Health Tips In Telugu.  
అందంగా కనిపించాలని, చర్మం కాంతివంతంగా ఉండాలని చాలామంది రకరకాల Skin Care Products, Beauty Treatments ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వైరల్ అవుతున్న Skincare Trends చూసి కొత్త కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయడం, రకరకాల Skin Treatments చేయించుకోవడం ఇటీవల ఎక్కువైంది. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి Skin Care Product మన చర్మానికి సరిపోతుందా? ప్రతి Beauty Treatment సురక్షితమైనదేనా? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ మౌనిక చర్మ సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Skin Care Products, Creams, Serums వంటివి ఉపయోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రకటనల్లో చూపించే ఫలితాలను ఎంతవరకు నమ్మవచ్చు? మన చర్మతత్వానికి సరిపోని ఉత్పత్తులను ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనే విషయాలను తెలియజేశారు. అలాగే ముఖంపై ముడతలు తగ్గించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి ఉపయోగించే Botox Treatment, Facial Fillers గురించి కూడా వివరించారు. ఈ చికిత్సలు అంటే ఏమిటి? వీటిని చేయించుకునే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? సరైన అర్హతలు లేని వ్యక్తుల దగ్గర చికిత్సలు చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు? అనే అంశాలను చర్చించారు. ఒకరికి మంచి ఫలితాన్ని ఇచ్చిన Skin Care Product లేదా Treatment మరొకరికి కూడా సరిపోతుందని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరి చర్మతత్వం, చర్మ సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, ప్రకటనలు చూసి గుడ్డిగా ఉత్పత్తులు కొనడం లేదా చికిత్సలు చేయించుకోవడం మంచిది కాదు. చర్మ సంరక్షణకు సరైన ఉత్పత్తులను ఎలా ఎంచుకోవాలి? సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Beauty Products విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? Botox, Facial Fillers వంటి చికిత్సలు చేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చర్మ సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో డాక్టర్ మౌనిక సమాధానాలు ఇచ్చారు. అందం కోసం చేసే ప్రయోగాల కంటే చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ చర్మతత్వాన్ని అర్థం చేసుకుని, అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుల సలహాతోనే Skin Care Products, Treatments ఎంచుకోండి. సోషల్ మీడియా Skincare Trends, Beauty Products, Botox, Facial Fillers గురించి డాక్టర్ మౌనిక ఏం చెబుతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి.  గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Skin Care Products లేదా Beauty Treatments అందరికీ సరిపోతాయని భావించకండి. కొత్త ఉత్పత్తులు ఉపయోగించే ముందు, Botox, Facial Fillers వంటి చికిత్సలు చేయించుకునే ముందు అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుడి సలహా తీసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మునగాకు (Moringa Leaves) అంటే కేవలం ఒక ఆకు కూర మాత్రమే కాదు.. ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారం. మన రోజువారీ ఆహారంలో మునగాకును చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. ముఖ్యంగా మునగాకు పొడితో తయారుచేసే మునగాకు లడ్డూలు ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి ఉన్నవారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. మరి మునగాకు లడ్డూల ప్రత్యేకత ఏమిటి? వీటిని తినడం వల్ల ఎలాంటి పోషక ప్రయోజనాలు లభిస్తాయి? మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు మునగాకులో లభిస్తాయి. అందుకే మునగాకును పోషకాల గనిగా పిలుస్తారు. మునగాకును నేరుగా కూరగా తీసుకోవడమే కాకుండా, ఎండబెట్టి పొడిగా తయారుచేసి కూడా ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. మునగాకు పొడితో తయారుచేసే లడ్డూలు ఎలా ఉంటాయి? వీటిని తయారుచేయడానికి ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు? మునగాకు పొడిని లడ్డూల రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రత్యేకత ఏమిటి? రోజువారీ ఆహారంలో మునగాకు పొడిని ఎలా చేర్చుకోవాలి? రోజుకు ఎన్ని మునగాకు లడ్డూలు తీసుకోవచ్చు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో Green Alchemy Founder అరుణ గారు మునగాకు పొడి తయారీ విధానం, దాని పోషకవిలువలు, మునగాకు లడ్డూల తయారీ ప్రత్యేకతలు, వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మునగాకు లడ్డూల్లో ఉపయోగించే పదార్థాలు, వాటి పోషక ప్రాధాన్యత, రోజూ రెండు లడ్డూలు తినడం వెనుక ఉన్న ఆలోచన వంటి విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మునగాకు, మునగాకు పొడి, మునగాకు లడ్డూల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి. గమనిక: మునగాకు పోషకాలు కలిగిన ఆహారమే అయినప్పటికీ, మునగాకు లడ్డూలు తీసుకోవడం వల్ల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.  వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, పోషకాహార విశేషాలు, సహజ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాల కోసం తెలుగు వన్ హెల్త్ (TeluguOne Health)ను అనుసరించండి.
ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచీ ఏదో తెలియని అలసట, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు కండరాలు పట్టేయడం లేదా బలహీనంగా అనిపించడం.. వీటిని మనం చాలామంది రోజువారీ ఒత్తిడి లేదా పని భారం వల్ల వచ్చిన సాధారణ విషయాలుగా కొట్టిపారేస్తాం. కానీ వీటన్నింటి వెనుక మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం లోపం ఉండొచ్చు. అదే మెగ్నీషియం. మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో, ఖనిజాలు కూడా అంతే అవసరం. వాటిలో మెగ్నీషియం పాత్ర ఎంతో కీలకమైనది. శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలు, గుండె సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. మన శరీరంలో శక్తి తయారవ్వాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా, రక్తపోటు సమతుల్యంగా ఉండాలన్నా మెగ్నీషియం ఎంతో అవసరం. సాధారణంగా పెద్దవారికి రోజుకు సుమారు 310 నుంచి 420 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం అవసరం అవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మోతాదులో అవసరమయ్యే ఈ పోషకం శరీరానికి సరిపడా అందకపోతే, చాలామందిలో మెల్లమెల్లగా లోపం తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి. కండరాలు బిగుసుకుపోవడం, పట్టేయడం, కొందరిలో వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శరీరంలో నీరసం, బలహీనత, అలసట ఎక్కువగా అనిపించడం కూడా దీని వల్ల జరగవచ్చు. కండరాలు సాధారణంగా పనిచేయడానికి, వాటికి విశ్రాంతి కలగడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడతాయి. నరాల పనితీరు సక్రమంగా సాగడానికి, శరీరంలో శక్తి ఉత్పత్తి జరగడానికి కూడా మెగ్నీషియం అవసరం. ఇది తగ్గిపోయినప్పుడు కొందరిలో మనసు ప్రశాంతంగా లేకపోవడం, చిరాకు, చికాకు కలగడం వంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నిద్ర మీద కూడా పడుతుంది. రాత్రి పూట సుఖంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయాలు కలగడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా చదవండి  బూడిద గుమ్మడి రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.! గుండె ఆరోగ్యంపై మెగ్నీషియం లోపం తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉండటానికి, రక్తపోటు అదుపులో ఉండటానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె స్పందనల్లో తేడాలు రావడం, రక్తపోటుపై ప్రభావం పడటం, అలాగే శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి.. రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో దొరికే అనేక ఆహార పదార్థాల్లో మెగ్నీషియం బాగానే ఉంటుంది. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం అందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మొత్తానికి చిన్నదిగా కనిపించే ఈ ఖనిజం మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. అలసట, కండరాల నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపిస్తే లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                                                                                                                                *రూపశ్రీ. మీకు నచ్చవచ్చు  మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టేనట..!                                 కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!