ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ  నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, వైసీపీ నేత జోగి రమేష్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జోగి రమేష్ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, ఆయన ఎన్నికల చరిత్ర, నియోజకవర్గాల మార్పులు  గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై వసంత కృష్ణప్రసాద్  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.  వర్తమాన రాజకీయ పరిస్థితికృష్ణా జిల్లా రాజకీయాల్లో మైలవరం, పెనమలూరు, పెడన నియోజకవర్గాలు అత్యంత కీలకమైన ప్రాంతాలు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన వసంత కృష్ణప్రసాద్, 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నుంచి 43,000 పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగీ రమేష్ 2024 ఎన్నికల్లో పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 60,000 పైగా భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంతో పాటు, మైలవరంలో రాబోయే రోజుల్లో 80,000 మెజారిటీతో ఓడిస్తానంటూ జోగీ రమేష్ చేసిన సవాళ్లను వసంత కృష్ణప్రసాద్ తీవ్రంగా తప్పుపట్టారు. వరుసగా నియోజకవర్గాలు మారుస్తూ స్థిరత్వం లేని నేతగా జోగీ రమేష్ మిగిలిపోయారని, ఎన్నికల్లో తీవ్ర ప్రజాగ్రహాన్ని ఎదుర్కొన్న వ్యక్తికి తనపై మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యూహాలు  పరిణామాలు మైలవరం నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే, సాధారణంగా మెజారిటీలు చాలా తక్కువగా ఉంటాయి. 1972 నాటి రికార్డులను తిరగరాస్తూ 2024లో సాధించిన 43,000 ఓట్ల మెజారిటీ తన ప్రజాదరణకు నిదర్శనమని వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రెండు విభిన్న పార్టీల తరఫున ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడం తన రాజకీయ బలానికి నిదర్శనమని స్పష్టం చేశారు.అలాగే జోతి రమేష్ రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ — 2009లో పెడన, 2014లో మైలవరం, 2019లో తిరిగి పెడన, 2024లో పెనమలూరు నుంచి పోటీ చేయడం ఆయనకున్న ఓటు బ్యాంకు లేమిని ఎత్తిచూపుతోందని విమర్శించారు.  గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పెడన నియోజకవర్గంలో ఇసుక మైనింగ్, చేపల చెరువులు, రెవెన్యూ పాస్ పుస్తకాల మంజూరు వంటి వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు. భవిష్యత్ రాజకీయ ప్రభావంకృష్ణా జిల్లా రాజకీయాల్లో వసంత కృష్ణప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సమస్యలపై స్పందిస్తూనే, ప్రతిపక్షం చేసే ఆరోపణలను తిప్పికొట్టడంలో కృష్ణప్రసాద్ దూకుడు ప్రదర్శిస్తున్నారు.  ఓటమి భారం నుంచి తేరుకోకముందే నేతల మధ్య పరస్పర ఆరోపణలు పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. స్థానిక నాయకత్వ పోరు: రాబోయే రోజుల్లో మైలవరం, పెనమలూరు పరిధిలో వైఎస్సార్‌సీపీ పునర్నిర్మాణం అంత సులువు కాదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వేడిని మరింత పెంచాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.     Vasantha Krishnaprasad, Jogi Ramesh, Mylavaram MLA, TDP, YSRCP, Krishna district politics, Penamalur elections, Andhra Pradesh politics, Pedana constituency, AP Politics
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవలి  తీరు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.  ఆయన అడుగులు తెలుగుదేశం పార్టీ నుంచి దూరంగా పడుతున్నాయా? అన్న చర్చ మొదలైంది. గతంలో కేశినేని నాని, అంతకంటే ముందు కొడాలి నాని, వంశీ వంటి నేతల బాటలోనే బోండా ఉమ అడుగులు పడుతున్నాయా అన్న అనుమానాలకు తావిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు..  ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి.   గుంటూరులో జరిగిన  ముద్రగడ సంస్మరణ సభ వేదికగా..  బోండా ఉమా చేసిన ప్రసంగం వైసీపీ స్వరం వినిపించేలా ఉంది.   రాష్ట్ర జనాభాలో   25 శాతానికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గానికి రాజకీయాల్లో, ప్రభుత్వ సంక్షేమ నిధుల్లో తగిన ప్రాధాన్యం లభించాలనీ,  కాపుల ఆవేదనను,  డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆలకించి, వారికి న్యాయమైన వాటా దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని బోండా చేసిన వ్యాఖ్యలు.. ఇటీవలి కాలంలో వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను బలపరిచేవిగా ఉన్నాయి. బొండా ఉమానే స్వయంగా తమ పార్టీ  ప్రభుత్వ తీరును ఎత్తిచూపేలా మాట్లాడటం వెనుక ఉన్న వ్యాహంపై చర్చోపచర్చలు   మరొకవైపు, గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, పార్టీ సిద్ధాంతాలపై అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడిన అంబటి రాంబాబుతో బోండా ఉమా వేదిక పంచుకోవడం, సన్నిహితంగా మెలగడం కూడా బోండా ఉమా రాజకీయ అడుగులు ఏ దిశగా పడుతున్నాయో తేటతెల్లం చేశాయంటున్నారు.  తెలుగుదేశం   అధినేతను వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తితో వేదిక పంచుకోవడమే కాకుండా, ఆయనతో నవ్వుతూ ముచ్చటించడం ద్వారా బోండా ఉమా తీరుపై తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.     ఇక పోత తెలుగుదేశం కేడర్ మాత్రం ఉమా పార్టీని వీడితేనే మేలని అభిప్రాయపడుతోంది. ఆయన పార్టీని వీడ వరకూ ఆగకుండా తెలుగుదేశం అధిష్టానమే ఆయనను బహిష్కరించాలని కూడా కోరుకుంటోంది. ఎందుకంటే.. ఉమా తెలుగుదేశం పార్టీని వీడితే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న చంద్రంగా ఇంత కాలంగా విజయవాడ రాజకీయాలలో క్రియాశీలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వంగవీటి రాధాకు మార్గం సుగమం అవుతుందని పార్టీ క్యాడర్ భావిస్తున్నది.   రాబోయే రోజుల్లో బోండా ఉమా తన రాజకీయ ప్రయాణంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమా నిజంగానే జెండా మారుస్తారా లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచి తన ప్రాధాన్యాన్ని పెంచుకోవడానికి ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. విజయవాడ నగర రాజకీయాల్లో బోండా ఉమా తీసుకునే నిర్ణయం కూటమి ప్రభుత్వానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండింటికీ ఎంతో కీలకమైనదిగా మారనుంది. 2024 ఎన్నికలలోనే తెలుగుదశం పార్టీ వంగవీటి రాధాను  మచిలీపట్నం ఎంపీ సీటు లేదా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఆఫర్ చేసింది. అయితే అప్పట్లో  రాధా  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అయితేనే పోటీ చేస్తాననీ, లేకుంటే.. పోటీలో ఉండననీ స్పష్టం చేయడమే కాకుండా, పోటీ చేయకున్నా..  తెలుగుదేశం అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని చెప్పి అదే పని చేశారు. అప్పట్లో.. విజయవాడ సెంట్రల్ నుంచి అంతకుముందు ఎన్నికలలో స్వల్ప తేడాతో పరాజయం పాలైన బోండా ఉమాను పక్కన పెట్టడం ఇష్టం లేక వంగవీటి రాధా కోరినట్లుగా  ఆ నియోజకవర్గ టికెట్ వంగవీటి రాధాకు ఇవ్వలేదు చంద్రబాబు.   ఇప్పుడు బోండా ఉమానే తన వ్యవహార శైలితో కాగల కార్యాన్ని స్వయంగా ఆయనే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బోండా ఉమా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరితే.. వంగవీటి రాధా వచ్చే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ, అదే జరిగితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మరింత బలపడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అదే సమయంల వైసీపీలో బోండా ఉమా చేరిక ఆ పార్టీలో విభేదాలకు కారణమౌతుందనీ, విజయవాడలో ప్రస్తుతం వైసీపీ తరఫున చక్రం తిప్పుతున్న దేవినేని అవినాశ్, ఇతర నేతలు నిస్సందేహంగా వ్యతిరేకిస్తారనీ చెబుతున్నారు. మొత్తం మీద బోండా ఉమ పార్టీ మారతరన్న వార్తలు తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పింపుతుంటే.. వైసీపీ శ్రేణుల్లో గుబులు మొతలైందని పరిశీలకులు విశ్లేషిస్టున్నారు.  Bonda Uma, Ambati Rambabu, TDP Political News, Vijayawada olitics, YCP Rumors
నీటి పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ  ఆధ్వరంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్రమోడీ. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు అనివార్యంగా ధర్మేంద్రప్రధాన్ చేత రాజీనామా చేయిం,చాల్సిన పరిస్థితి ఎదురుర కావడం మోడీ ప్రతిష్ట మసకబారడానికి కారణమైంది.  కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా  విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే విద్యావ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులే ఉవ్వెత్తున ఉద్యమించారు. అదలా ఉంచితే.. నరేంద్ర మోడీ తాత్కాలికంగా జోషీకి విద్యాశాఖ అప్పగించారనీ, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ బాధ్యతలు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి అప్పగించే అవవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఢిల్లీ వర్గాల సమాచారం.  గతంలో క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండంతో ప్రధాని మోడీ ఆమెవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.  నీట్   లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట బాగా మసకబారిందనడంలో సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. దీంతో ప్రధాని మోడీ నష్టనివారణపై దృష్టి పెట్టారంటున్నారు.  ఇప్పటికే మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని విద్యాశాఖను విద్యావంతురాలు, రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి  సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు బీజేపీలో చేరిన పురంధేశ్వరి..ఆ ఎన్నికలలో  రాజంపేట నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోఆమె రాజమహేందర వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగించాలని మోడీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   Daggubati Purandeswari into union cabinet, Union Education Minister, Dharmendra Pradhan resignation, Rajahmundry MP, Modi Cabinet expansion 
ALSO ON TELUGUONE N E W S
భారతీయ చిత్ర పరిశ్రమ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న వేళ, మన సినిమాల చిత్రీకరణకు యూరోపియన్ దేశాలు ఎల్లప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు లండన్, స్విట్జర్లాండ్, ఇటలీ వంటి సాంప్రదాయ ప్రాంతాలకే పరిమితమైన మన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఒక సరికొత్త గమ్యస్థానం వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. అదే తూర్పు యూరప్‌లోని సుందర దేశం బల్గేరియా. అత్యంత తక్కువ నిర్మాణ వ్యయం, అనుకూలమైన ఆర్థిక విధానాలు, అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు మరియు ప్రాచీన, సహజసిద్ధమైన లొకేషన్లతో భారతీయ సినిమాలకు బల్గేరియా ఒక ప్రధాన ప్రొడక్షన్ హబ్‌గా అవతరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఆ దేశం మన చిత్ర నిర్మాతలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలుకుతోంది. యూరప్‌లోని ఇతర దేశాలతో పోలిస్తే బల్గేరియాలో సినిమా షూటింగ్ చేయడం వల్ల అనేక ఆర్థిక మరియు సాంకేతిక ప్రయోజనాలు లభిస్తున్నాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అక్కడ షూటింగ్ జరుపుకునే అర్హత ఉన్న ప్రతి అంతర్జాతీయ ప్రాజెక్టుకు బల్గేరియా ప్రభుత్వం ఏకంగా 25 శాతం క్యాష్ రిబేట్ (25% Cash Rebate) సదుపాయాన్ని అందిస్తోంది. దీనికి తోడు అక్కడ వర్తించే అత్యల్ప కార్పొరేట్ పన్నుల విధానం కూడా భారతీయ నిర్మాణ సంస్థలకు భారీగా నిధులు ఆదా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం ఆర్థిక రాయితీలు మాత్రమే కాకుండా, హాలీవుడ్ స్థాయి నాణ్యత కలిగిన సాంకేతిక మౌలిక వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విశాలమైన సౌండ్ స్టేజీలు, అత్యంత ఆధునిక వీఎఫ్‌ఎక్స్ (VFX), సీజీఐ (CGI) టెక్నాలజీ మరియు నాణ్యమైన పోస్ట్-ప్రొడక్షన్ స్టూడియోలు ఇక్కడ కొలువుదీరి ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. లొకేషన్ల విషయానికి వస్తే బల్గేరియా ఒక ప్రకృతి దృశ్యాల నిధి అని చెప్పవచ్చు. పురాతన శైలిని ప్రతిబింబించే అందమైన నగరాలు, దట్టమైన అడవులు, మంచు కొండలతో కూడిన పర్వత శ్రేణులు, చారిత్రక ప్రాధాన్యం ఉన్న రోమన్ శైలి కట్టడాలు మరియు అద్భుతమైన బ్లాక్ సీ తీరప్రాంతాలు ఒకే చోట లభించడం దర్శకులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. యాక్షన్ ఘట్టాలైనా, మెలోడీ పాటలైనా, చారిత్రాత్మక సన్నివేశాలైనా తీయడానికి బల్గేరియా సరైన వేదికగా మారుతోంది. ఈ భారత్ - బల్గేరియా సినీ అనుబంధం వెనుక ఒక ప్రముఖ వ్యక్తి కృషి ఎంతగానో ఉంది. అతడే బల్గేరియన్ ప్రముఖ ఫైట్ మాస్టర్ మరియు 'టీఎల్ ప్రొడక్షన్' (TL Production) వ్యవస్థాపకుడు టోడర్ లాజరోవ్ జుజి (Todor Lazarov Juji). దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ప్రపంచ స్థాయి దృశ్యకావ్యం 'ఆర్ఆర్ఆర్' (RRR) బల్గేరియా షెడ్యూల్‌కు జుజి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. టాలీవుడ్‌లో కేవలం 'ఆర్ఆర్ఆర్' మాత్రమే కాకుండా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు', విశ్వక్ సేన్ 'దాస్ కా దమ్కీ' వంటి భారీ చిత్రాలకు ఆయన స్టంట్స్ కొరియోగ్రఫీ చేసి భారతీయ చిత్ర పరిశ్రమతో బలమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ సమయంలో భారతీయ సినీ నిర్మాణం మరియు సంస్కృతి పట్ల ఎంతో ప్రభావితుడైన జుజి, ఇప్పుడు భారతీయ చిత్రసీమతో దీర్ఘకాలిక భాగస్వామ్యం నెలకొల్పేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. యూరప్‌లో సినిమా చిత్రీకరించాలనుకునే ప్రతి భారతీయ నిర్మాతకు బల్గేరియానే మొదటి ఎంపికగా మారాలనేది తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం పట్ల ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఆయన ఆశిష్ గణేషన్‌తో కలిసి 'టాడ్ యాష్ చాప్టర్‌హౌస్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఒక అంతర్జాతీయ స్థాయి సూపర్ హీరో చిత్రాన్ని నిర్మిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ప్రధాన భాగాలను బల్గేరియాలోనే చిత్రీకరిస్తున్నారు. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు, అద్భుతమైన లొకేషన్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు అంతర్జాతీయ స్థాయి నిర్మాణ అనుభవంతో బల్గేరియా సిద్ధంగా ఉందని జుజి పేర్కొంటున్నారు. గొప్ప కథలకు, కళకు ఎల్లప్పుడూ సరిహద్దులు ఉండవని నమ్మే జుజి, బల్గేరియాలో పనిచేస్తున్న ఒక భారతీయుడిలా భావిస్తూ, మన దేశీయ ప్రతిభతో కలిసి రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులను తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే కాలంలో మరిన్ని భారతీయ మరియు టాలీవుడ్ చిత్రాలు బల్గేరియా వీధుల్లో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.   Bulgaria, Todor Lazarov Juji, RRR Bulgaria Shooting
టాలీవుడ్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమవుతోంది 'వారణాసి' చిత్రం. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, విడుదల తేదీకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల ధర సమాచారం బయటకు వచ్చి ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 'వారణాసి' నిర్మాతలు ఏకంగా ₹350 కోట్ల థియేట్రికల్ బిజినెస్ కోట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల హక్కులకే ఈ స్థాయి రేట్ అనేది భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని ఒక సంచలన పరిణామం.  గతంలో ఎస్.ఎస్. రాజమౌళి చెక్కిన అంతర్జాతీయ దృశ్యకావ్యం 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో సాధించిన మొత్తం షేర్ కలెక్షన్ ₹270 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు 'వారణాసి' సినిమా కేవలం ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే ఆర్ఆర్ఆర్ సాధించిన రికార్డును దాటేసి, ₹350 కోట్ల మైలురాయిని టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ఈ భారీ రేటు వెనుక సినిమాపై ఉన్న అపారమైన నమ్మకం, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు మునుపెన్నడూ చూడని విధంగా రెండు విభిన్నమైన పాత్రల్లో అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా చోప్రా, మలయాళ వర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తుండటం సినిమాకు గ్లోబల్ అపీల్‌ను తెచ్చిపెట్టింది.  రాజమౌళి మార్క్ విజువల్ మ్యాజిక్, మహేష్ బాబు విశ్వరూపం కలగలిసి ప్రేక్షకులకు థియేటర్లలో ఒక సరికొత్త దృశ్యకావ్యాన్ని అందించబోతున్నాయి. ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.      Mahesh babu, SS Rajamouli, Varanasi, Telugu States, Theatrical Rights  
  ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారతీయ చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్‌డమ్ గురించి చర్చ రాగానే మన అందరికీ మొదట గుర్తుకువచ్చే పేరు ప్రభాస్(Prabhas). బాహుబలి, సలార్, కల్కి వంటి వరుస బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని కింగ్‌గా నిలిచాడు. అయితే, ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు కాబోతున్నారు అనే ఆసక్తికరమైన ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో వినిపిస్తున్న ఏకైక పేరు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor). ప్రస్తుతం రణబీర్ కపూర్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రామాయణం, అనిమల్ పార్క్, లవ్ అండ్ వార్, బ్రహ్మాస్త్ర 2, ధూమ్ 4 వంటి వరుస భారీ ప్రాజెక్టులతో ఆయన ప్రపంచవ్యాప్తంగా తన జెండా పాతేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇన్ని భారీ సినిమాలు లైన్ లో ఉన్నంత మాత్రాన సరిపోతుందా లేదా బాక్స్ ఆఫీస్ వసూళ్లు కూడా అదే స్థాయిలో రాబట్టగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు రణబీర్ కపూర్ కెరీర్‌లో నిజంగానే తిరుగులేని పాన్ ఇండియా మార్కెట్ బిల్డ్ అయిందా లేక కేవలం హైప్ మాత్రమే పెరిగిందా అనే కోణంలో ట్రేడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున విశ్లేషణలు మొదలయ్యాయి. Also read: ఆ హీరోని పెళ్లి చేసుకోమని అడిగారు.. ఆమని వ్యాఖ్యలు వైరల్  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా రణబీర్ కపూర్ కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఈ ఒక్క సినిమాతో ఆయన సాధించిన ఊరమాస్ ఇమేజ్, బాక్స్ ఆఫీస్ క్రేజ్ మిగతా సినిమాలపై అంచనాలని అమాంతం ఆకాశానికి ఎత్తేసాయి. యానిమల్ చూపించిన తిరుగులేని ఇంపాక్ట్ వల్ల ఇప్పుడు ఆయన రాబోయే సినిమాలపై ప్రేక్షకులలో  క్యూరియోసిటీ నెలకొంది. అయితే ఇక్కడే ఒక పెద్ద రిస్క్ కూడా దాగి ఉందనేది నిపుణుల అభిప్రాయం. లైనప్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ రావడం అనేది మరో ఎత్తు. ప్రస్తుతం ఒక్క సినిమా తేడా కొట్టినా లేదా బాక్స్ ఆఫీస్ వద్ద మిస్‌ఫైర్ అయినా, ఆ ప్రభావం మొత్తం రాబోయే బిగ్ లైనప్ మీద పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దర్శకధీరుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న 'రామాయణం' చిత్రంపై భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతోంది. గ్లోబల్ రిలీజ్ టార్గెట్‌గా హాలీవుడ్ స్థాయి VFX సాంకేతికతతో  నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 8 న విడుదల కాబోతుంది. Prabhas, Ranbir Kapoor    
సినీ పరిశ్రమలో మహిళా ప్రాధాన్యత కలిగిన కథలు, వైవిధ్యమైన పాత్రలు మరింత విస్తృతంగా రావాలంటే కేవలం వెండితెరపై కనిపించే నటీమణుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తెరవెనుక కీలకమైన టెక్నికల్ విభాగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ప్రముఖ నటి మాళవిక మోహనన్ కుండబద్దలు కొట్టారు. ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల తీరుతెన్నులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించిన కమర్షియల్ సినిమాల్లో కథానాయికలకు కేవలం గ్లామర్ ప్రదర్శనకే పరిమితమైన మూస పాత్రలు లభించడానికి అసలు కారణం తెరవెనుక మహిళా రచయితలు, దర్శకుల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటమేనని ఆమె ఎంతో విశ్లేషణాత్మకంగా వివరించారు. ఎప్పుడైతే చిత్ర నిర్మాణ రంగంలో ఎక్కువ మంది మహిళా మేకర్స్, మహిళా రచయితలు స్వతంత్రంగా ముందుకు వస్తారో, అప్పుడే నటీమణులకు కేవలం అందాల ఆరబోత పాత్రల పరిమితి దాటి, కథను మలుపు తిప్పే బలమైన యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ లభిస్తాయని ఆమె స్పష్టం చేశారు. గ్లామర్ ఇమేజ్ గమ్యస్థానాన్ని దాటి, హాలీవుడ్ సంచలనం సృష్టించిన 'కిల్ బిల్' వంటి పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నరనరాల్లో ఉద్వేగం నింపే ప్రధాన పాత్రలో నటించడమే తన జీవితంలో అతిపెద్ద కల అని మాళవిక తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలనే తపనను బయటపెట్టారు. ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవిక మోహనన్, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తన పంథాను కొనసాగిస్తున్నారు. ఆమె సినీ ప్రయాణం 2013లో మలయాళ చిత్రం 'పట్టం పోల్' ద్వారా యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ సరసన ప్రారంభమైంది. ఆ తర్వాత 2017లో అంతర్జాతీయంగా విశేష ప్రశంసలు పొందిన ప్రఖ్యాత ఇరానియన్ దర్శకుడు మజిద్ మజిదీ తెరకెక్కించిన హిందీ చిత్రం 'బియాండ్ ది క్లౌడ్స్' లో తనలోని నటన కోణాన్ని ఆవిష్కరించి విమర్శకుల నుంచి విశేష గౌరవాన్ని దక్కించుకున్నారు. తమిళ చిత్రసీమలోకి 2019లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ డ్రామా 'పేట' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మాళవిక, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా స్థానం సంపాదించుకున్నారు. అనంతరం 2021లో దళపతి విజయ్ సరసన 'మాస్టర్' వంటి బ్లాక్‌బస్టర్ విజయంలో భాగమయ్యారు. 2024లో చియాన్ విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన పిరియాడిక్ విజువల్ వండర్ 'తంగలాన్' చిత్రంలో ఆమె పోషించిన విభిన్నమైన పాత్ర నటిగా ఆమె స్థాయిని మరింత పెంచింది. ఇక 2026 నాటికి రెబల్ స్టార్ ప్రభాస్ సరసన భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'ది రాజా సాబ్' చిత్రంతో టాలీవుడ్‌లో నేరుగా ఎంట్రీ ఇస్తుండగా, ఎనర్జిటిక్ స్టార్ రవితేజ మరియు శ్రీవిష్ణు కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ మూవీలోనూ ఆమెను కథానాయికగా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో యంగ్ హీరో కార్తీ సరసన నటిస్తున్న 'సర్దార్ 2' చిత్రంతో పాటు వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పాకెట్ నావెల్' ప్రాజెక్ట్‌లోనూ కీలక పాత్రలు పోషిస్తూ దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో తన హవాను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సినిమాల్లో కేవలం కమర్షియల్ వేషాలకే పరిమితం కాకుండా, సమాజంలో మహిళా దర్శకులు మరియు రచయితల సంఖ్య పెరిగితేనే సినిమాల నాణ్యత, మహిళా పాత్రల గంభీరత పెరుగుతాయని మాళవిక మోహనన్ చేసిన ఈ బోల్డ్ ప్రకటన సినీ వర్గాల్లో ఒక కొత్త తరహా ఆలోచనా విధానానికి నాంది పలికింది.   Malavika Mohanan The Raja Saab 
  'ఏమిటో'... అనే మూడంటే మూడే  అక్షరాలతో కూడిన డైలాగ్ ని పలు రకాల వయ్యారంతో  చెప్పి బోలెడంత మంది అభిమానులని సంపాదించడమే కాకుండా ప్రతి తెలుగు వాళ్ళ ఇళ్లల్లో తిష్ట వేసింది ఆమని(Aamani). ప్రెజెంట్ తల్లిగా, క్యారక్టర్ ఆర్టిస్ గా సినిమాలతో పాటు బుల్లి తెరపై మెరుస్తూ నటన అంటే తనకి ఎంత మక్కువో నిరూపిస్తుంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. ఆమని మాట్లాడుతు చిన్నతనం నుంచే కథానాయిక కావాలని కలలు కంటూ, అద్దంలో నన్ను నేను  చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. నటిగా గుర్తింపు పొంది పరిశ్రమలో   నిలదొక్కుకోవడానికి దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ గారే ప్రధాన కారణం. నా అసలు పేరు మంజు.మొదట సినీ అవకాశాల కోసం గంగమ్మరాజు గారు నా పేరుని మీనా', ఆ తర్వాత 'మీనాక్షి'గా మార్చారు. కానీ చివరికి ఈ.వి.వి. సత్యనారాయణ గారు 'ఆమని'గా ఫిక్స్ చేసారు. ఒకవేళ ఆయనే గనుక ఆ పేరు పెట్టకపోతే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండేదానిని కాదేమో.ప్రస్తుతం తన ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ మొదలుకొని అన్ని అధికారిక పత్రాల్లోనూ 'ఆమని' అనే పేరే స్థిరపడిపోయింది. Also read: విజయ్‌పై సీనియర్ నటుడు నిళ్‌గల్ రవి షాకింగ్ కామెంట్స్..రజినీకాంత్ సీఎం అయ్యేవారు  స్టార్ హీరో జగపతి బాబు(Jagapathi Babu)నాది  ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు నిజమైన భార్యాభర్తలుగా భావించేవారు. రియల్ లైఫ్‌లో కూడా జగపతిబాబుని పెళ్లి చేసుకోమని   చాలామంది సలహాలు కూడా ఇచ్చారు . అయితే, అప్పట్లో తన దృష్టి అంతా కేవలం నటనపైనే ఉండేదని, ఎలాంటి క్రష్‌లు లేదా ఇతర ఆలోచనలు లేవని ఆమె స్పష్టం చేశారు. తన కుటుంబ బాధ్యతలు, కెరీర్ లక్ష్యాల కారణంగానే గతంలో ఒక తమిళ వ్యక్తి నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను కూడా తిరస్కరించినట్లు ఆమని తెలిపారు. జగపతిబాబు, ఆమని కాంబోలో శుభలగ్నం, మావిచిగురు, శుభమస్తు వంటి చిత్రాలు వచ్చాయి. మూడు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్.  Aamani, Jagapathi Babu, Evv Sathyanarayana     
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం 'డ్రాగన్' బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించేందుకు వేగంగా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చి నెట్టింట రచ్చ చేస్తోంది.  ఇటీవల చిత్ర యూనిట్ ఒక పవర్ ప్యాక్డ్ అండ్ కలర్‌ఫుల్ 'పార్టీ వైబ్' సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ ప్రత్యేకమైన పార్టీ సీక్వెన్స్ చిత్రీకరణలో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత స్టైలిష్‌గా, యుత్‌ఫుల్‌గా, మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో డిజైన్ చేశారని ఫిలిం నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్‌లో సాధారణంగా ఉండే డార్క్ అండ్ రా అట్మాస్ఫియర్‌కి భిన్నంగా, ఈ పార్టీ సీక్వెన్స్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోందట. ఈ సీన్‌లో రుక్మిణి వసంత్ గ్లామర్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుందని ఇన్సైడ్ టాక్. ఇక ఈ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్‌ను ప్రశాంత్ నీల్ చూపించిన తీరు అల్టిమేట్ అని చెబుతున్నారు. ఈ మొత్తం పార్టీ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కనిపించే తీరు వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం. మద్యం మైకంలో, పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో ఎన్టీఆర్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ వింటేజ్ తారక్‌ను గుర్తుచేసేలా ఉంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ స్వతహాగా మాస్ యాక్షన్, కామిక్ టైమింగ్‌లో సిద్ధహస్తుడు. అలాంటి నటుడికి ప్రశాంత్ నీల్ తన మార్క్ హై-ఎనర్జీ ఎలివేషన్లను తోడు చేయడంతో ఈ సీన్ సినిమాలో ప్రధాన హైలైట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.     Dragon Movie, Jr NTR, Prashanth Neel, Rukmini Vasanth  
  ఇళయ దళపతి విజయ్(Vijay)ప్రస్తుతం 'జన నాయగన్' (జన నాయకుడు) తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. టాక్ అయితే నెగిటివ్ గా వస్తుండంతో పాటు కలెక్షన్స్ కూడా అంత ఆశాజనకంగా లేవు. తమిళనాడుతో పాటు  అన్ని చోట్ల ఇదే పరిస్థితి. సోషల్ మీడియాలో కొంత ముందైతే 'జన నాయగన్' పై స్పందిస్తు 'ఎలక్షన్స్ కి ముందు జన నాయగన్ రిలీజై ఉంటే విజయ్ మెజారిటీ సీట్స్ గెలుచుకునే వాడు కాదని అంటున్నారు. వాళ్ళు అలా మాట్లాడటానికి కారణం' జన నాయగన్' సెకండ్ హాఫ్ లో హిందూ, ముస్లిమ్, క్రిస్టియన్ మధ్య మత కల్లోహాలు అనే ఓల్డ్ పాయింట్ పై అవ్వచ్చు. తమిళ సినీ పరిశ్రమతో పాటు సౌత్ సినీ పరిశ్రమలో తనదైన వైవిధ్యమైన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ తమిళ నటుడు నిలళ్‌గల్ రవి. రీసెంట్ గా విజయ్ గురించి ఆయన మాట్లాడుతు 'షూటింగ్ సమయంలో విజయ్ చాలా నిశ్శబ్దంగా, తన పని తాను చేసుకునే స్వభావంతో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి  రాష్ట్రానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడని అసలు ఊహించలేదు. 2000వ సంవత్సరంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'ఖుషి', 2003 లో విడుదలైన 'తిరుమలై',  2011 లో  వచ్చిన 'కావలన్' వంటి అనేక చిత్రాల్లో చేశాను. ఆ రోజుల్లో షూటింగ్ లొకేషన్లలో ఎన్నో గంటల పాటు మాట్లాడినప్పటికీ, విజయ్ ఆలోచనల్లో ఎప్పుడూ రాజకీయాకాంక్షలు ఉన్నట్లు గానీ, భవిష్యత్తులో రాజకీయం వైపు వెళ్తారనే సంకేతాలు గానీ ఏనాడూ కనిపించలేదని తెలిపారు. కెమెరా ముందుకు రాకముందు ఎంత అమాయకంగా, మౌనంగా ఉంటారో, సెట్స్‌లో కూడా అదే రీతిలో ఉంటూ కేవలం నటనపై మాత్రమే దృష్టి పెట్టేవారని వ్యాఖ్యానించారు. Also read: సల్మాన్ ఖాన్ కి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్ట్.. జస్టిస్ జ్యోతి సింగ్ కీలక తీర్పు  1990ల మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని  బలంగా అనుకున్నాను. అలాంటిది కాలక్రమేణా ఎవరూ ఊహించని రీతిలో విజయ్ ఆ రాజకీయ శిఖరానికి చేరుకోవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని చెప్పుకొచ్చాడు. మూడు దశాబ్దాలపై నుంచే తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయస్థుడైన  నిలళ్‌గల్ రవి జన నాయగన్ లో కూడా నటించాడు. VIjay, Nizhalgal Ravi, Rajini Kanth
తెలుగు చిత్రసీమలోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి అమల అక్కినేని. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దక్షిణాది అగ్ర కథానాయకులందరి సరసన నటించి, తన అద్భుతమైన గ్లామర్, నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు. కెరీర్ అత్యున్నత దశలో ఉన్న సమయంలోనే అక్కినేని నాగార్జునను వివాహం చేసుకుని ఒక్కసారిగా వెండితెరకు దూరమయ్యారు. ఒక స్టార్ హీరోయిన్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నటనకు గుడ్ బై చెప్పడం అప్పట్లో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత సినిమాలకు స్వస్తి చెప్తే.. దానికి కుటుంబ ఆంక్షలే కారణమని అందరూ భావిస్తారు. అమల విషయంలోనూ అదే జరిగింది. భర్త నాగార్జున కానీ, మామగారు అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ పెట్టిన కట్టుబాట్ల వల్లే ఆమె వెండితెరకు దూరమయ్యారని చాలామంది దశాబ్దాల పాటు అనుకున్నారు. అయితే ఈ సుదీర్ఘ ఊహాగానాలకు తెరదించుతూ అమల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాలు మానేయడానికి గల అసలు కారణాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి ఆమె నటనకు దూరం కావడానికి అక్కినేని కుటుంబ ఆంక్షలు ఎంత మాత్రం కారణం కాదని, ఆమె హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిన కొన్ని నిజ జీవిత సంఘటనలే ముఖ్య కారణమని బయటపడింది. పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన అమల సినీ ప్రయాణం అత్యంత వేగంగా సాగింది. వరుస ప్రాజెక్టులతో దాదాపు ఏడెనిమిదేళ్ల పాటు తీరిక లేని షూటింగ్ షెడ్యూళ్లతో బిజీగా గడిపారు. ఏకకాలంలో రెండు నుంచి మూడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడం వల్ల బయటి ప్రపంచంతో, నిజ జీవితంతో ఆమెకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ విధమైన సుదీర్ఘమైన వర్క్ ప్రెజర్ వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన అమల, కొంతకాలం నటనకు బ్రేక్ ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. కెమెరాకు దూరంగా ఉంటూ ప్రపంచాన్ని చూడటానికి, కొత్త ప్రాంతాలను సందర్శించడానికి ప్రయాణాలు ప్రారంభించారు. ఆ ప్రయాణాల సమయంలో ఆమె కళ్లారా చూసిన దయనీయమైన దృశ్యాలు ఆమె జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేశాయి. వీధుల్లో సరైన ఆహారం లేక అలమటిస్తున్న మూగజీవులు, వేగంగా వెళ్లే వాహనాలు డీకొట్టి రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న జంతువులు, చిన్న పంజరాల్లో బంధీలై నిస్సహాయంగా నరకం అనుభవిస్తున్న పక్షులు, చివరకు నోళ్లు కుట్టేసిన పాముల వికృత దృశ్యాలు ఆమె హృదయాన్ని ద్రవీభూతం చేశాయి. ఆ మూగజీవుల వేదనను చూసి తీవ్రమైన మానసిక ఆవేదనకు గురైన అమల, వాటి రక్షణ కోసం ఏదైనా చేయాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. కెమెరా ముందు నటిస్తూ కోట్లాది మంది మెప్పు పొందడం కంటే, బయట సమాజంలో రక్షణ లేని మూగజీవులకు ఆసరాగా నిలబడి మార్పు తీసుకురావడమే అత్యంత ముఖ్యమైన బాధ్యత అని ఆమె బలంగా విశ్వసించారు. ఆ తపనతోనే జంతు సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులను కలవడం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించారు. క్రమంగా ఆమె దృష్టి సినీ ప్రపంచం నుంచి సామాజిక సేవ వైపు పూర్తిగా మళ్లింది. అమల పడుతున్న ఆరాటాన్ని చూసి ఆ సమయంలో నాగార్జున కూడా "అమల సినిమాల కంటే కూడా ఈ మూగ జీవుల కోసం తిరగడంలోనే రోజంతా ఎంతో బిజీగా ఉండిపోతోంది" అని సరదాగా కామెంట్ చేసేవారట. ఆ తర్వాత నాగార్జునతో వివాహం జరిగాక, అమల తన ఆశయానికి ఒక శాశ్వత రూపాన్ని ఇచ్చారు. హైదరాబాద్‌లో 'బ్లూ క్రాస్ హైదరాబాద్' అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి కో-ఫౌండర్‌గా బాధ్యతలు స్వీకరించారు. వేలాది జంతువులను కాపాడుతూ, వాటికి వైద్యం మరియు ఆశ్రయం కల్పిస్తూ జంతు హక్కుల పోరాటంలో నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సేవారంగానికి పూర్తిగా అంకితమైనప్పటికీ, మంచి సందేశం ఉన్న పాత్రలు వచ్చినప్పుడు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఒకే ఒక జీవితం' వంటి విలక్షణమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వెండితెరపై నటిగా మాత్రమే కాకుండా, సమాజంలో ఒక రియల్ హీరోగా నిలిచిన అమల అక్కినేని జీవిత ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.     Amala Akkineni, Amala Akkineni Quit Movies Reason, Nagarjuna Wife Amala, Blue Cross Hyderabad
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు. అయితే ఎంత శుభ్రం చేసినా చాలా ఇళ్లలో సాలీడు పురుగులు చాలా మళ్లీ మళ్లీ వచ్చి చేరుతుంటాయి.  బూజు కూడా చాలా తొందరగా ఏర్పడుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? వీటికి కారణాలు ఏంటి? వీటిని పరిష్కరించుకోవడానికి ఏం  చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే.. సాలీడు గూళ్లు కట్టడానికి కారణాలుయ.. ఇల్లు శుభ్రం చేసిన కొద్ది రోజులకే మూలల్లో, సీలింగ్‌పై, లేదా ఫర్నిచర్ వెనుక సాలీ గూళ్లు మళ్లీ కనిపిస్తుంటే ఇల్లు సరిగా శుభ్రం చేయలేదని అర్థం కాదు.. పదేపదే గూళ్లు ఏర్పడటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వాస్తవానికి, సాలీలు తమకు సురక్షితమైన ప్రదేశం , తినడానికి చిన్న కీటకాలు సులభంగా దొరికే చోట మాత్రమే తమ గూళ్లను అల్లుతాయి. స్టోర్‌రూమ్‌లు, అటకలు, మెట్ల దారులు, కిటికీల అంచులు లేదా బరువైన ఫర్నిచర్ వెనుక.. ఇలా ఇంట్లో ఎక్కువ కాలం శుభ్రం చేయకుండా ఉండే ప్రదేశాలు సాలీడులకు ఇష్టమైన స్థలాలుగా మారతాయి. ఈ ప్రదేశాలు నిశ్శబ్దంగా ఉండి, మనుషుల సంచారం తక్కువగా ఉండటం వల్ల, అవి గూళ్లు అల్లడానికి సులభంగా ఉంటాయి. సాలీడులు పదే పదే ఇంట్లోకి ఎందుకు వస్తాయంటే.. సాలీడులు పదేపదే గూళ్లు కట్టడానికి ఒక ప్రధాన కారణం ఇంట్లో చిన్న కీటకాలు ఉండటమే. సాలీడులు ఈ కీటకాలను తిని బ్రతుకుతాయి. ఇంట్లో దోమలు, ఈగలు లేదా ఇతర చిన్న కీటకాలు ఎక్కువగా ఉంటే, సాలీడులు కూడా తరచుగా అక్కడికి వచ్చి గూళ్లు కడతాయి. వర్షాకాలం , శీతాకాలంలో , సాలీడులు బయట కంటే ఇళ్లలోని సురక్షిత ప్రదేశాలను వెతుకుతాయి.  దీని వల్ల వర్షాకాలంలో ఇళ్లలో సాలీడుల నివాసం,  సాలీడు గూడులు పెట్టడం వంటివి ఎక్కువ అవుతాయి. సాలీడుగూళ్లు  ఎలా తొలగించాలి?  ఇంట్లో సాలెగూళ్లు ఏర్పడితే, వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి. వాక్యూమ్ క్లీనర్‌తో పైకప్పులు, మూలల్లోని సాలెగూళ్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. వాక్యూమ్ చేరలేని ప్రదేశాల కోసం పొడవాటి పిడి ఉన్న చీపురు లేదా డస్టర్‌ను ఉపయోగించవచ్చు. భారతీయులు వాడే బూజు కర్రతో బాగా శుభ్రం చేయవచ్చు. శుభ్రం చేసిన తర్వాత, మిగిలిపోయిన దుమ్ము, సాలెగూళ్లను పూర్తిగా తొలగించడానికి ఆ ప్రదేశాన్ని తడి గుడ్డతో తుడవడం  మంచిది. సాలెగూళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే..  ఇంట్లో సాలెపురుగులు మళ్లీ గూళ్లు కట్టకుండా నిరోధించాలంటే, ముందుగా  ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా మూలలు, పైకప్పులు, ఫర్నిచర్ వెనుక , స్టోర్‌రూమ్‌ల వంటి ప్రదేశాలను నిర్లక్ష్యం చేయకూడదు. కిటికీలు, తలుపులు , గోడలలోని పగుళ్లు లేదా చిన్న రంధ్రాలను మూసివేయాలి. ఎందుకంటే సాలెపురుగులు వీటి ద్వారానే ఇంట్లోకి ప్రవేశిస్తాయి.  ఇంట్లో చిన్న కీటకాల తిరగడం, దోమలు, ఈగలు వంటివి ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సాలెపురుగులకు ఆహారం దొరకనప్పుడు, అవి అక్కడ ఎక్కువసేపు ఉండవు. ముఖ్యంగా తలుపులు , కిటికీల చుట్టూ  పుదీనా నూనెను కలిపిన నీటిని చల్లడం కూడా సాలెపురుగులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.                                   *రూపశ్రీ.
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని, అది పెద్దదైనా లేదా చిన్నదైనా, పంచుకోవడం ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్నిసార్లు, తెలివిగా ఉండటం,  కొన్ని విషయాలు షేర్ చేసుకోకుండా ఉండటం కూడా మంచిదని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  కేవలం ఇవి మాత్రమే కాదు.. బంధాల మధ్య ఆరోగ్యకరమైన వాతావారణం ఉండాలన్నా,  బంధం ఏ చీకు చింతలు లేకుండా సంతోషంగా ఉండాలన్నా కొన్ని విషయాలు దాచిపెట్టడమే మంచిది అంటున్నారు.  బంధాలు బాగుండాలంటే ఎలాంటి విషయాలను చెప్పకుండా ఉండటం మంచిది? తెలుసుకుంటే.. మాజీ ప్రేమికుల గురించి..  భాగస్వామికి  గతం గురించి చెప్పడంలో తప్పు లేదు, కానీ ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా  మాజీ భాగస్వామి గురించి చర్చించడం, వారిని గొప్పగా పొగడటం లేదా వారితో  గడిపిన సన్నిహిత క్షణాలను చెప్పడం వల్ల  ప్రస్తుత భాగస్వామిలో అనవసరమైన అసూయ మరియు పోలిక ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది బంధంలో అభద్రతాభావం, అసౌకర్యం, అపార్ఠాలు ఏర్పడేలా చేస్తుంది.  అందుకే  ఒక కొత్త బంధం మొదలుపెట్టాక   గతాన్ని గురించి వదిలిపెట్టడం చాలా మంచిది.  దాని గురించి గుర్తుచేసుకోకపోవడం మంచిది. సొంత వ్యక్తుల చెడుగుణం..  భాగస్వామి స్నేహితుల్లో  లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా  మీకు నచ్చకపోవచ్చు. వారు మీతో సరిగా ఉండకపోవచ్చు. కానీ  బిగ్గరగా అరవాల్సిన అవసరం లేదు. "మీ అమ్మ చాలా చెడ్డగా  ఉంటుంది" లేదా "మీ స్నేహితుడు  పద్దతిగా ఉండటం లేదు" అని మీరు చెబితే భాగస్వామి బాధపడే అవకాశం ఉంది.  సమస్య పెద్దది కాకపోతే ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల రహస్యాలు..  ప్రాణ స్నేహితుడు లేదా స్నేహితురాలు ఇలా ఎవరైనా సరే..   మీతో రహస్యంగా మాట్లాడి ఏదైనా రహస్యం చెప్పినట్లయితే, దానిని భాగస్వామితో పంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది "మేము భార్యాభర్తలం, లేదా జంట, మా మధ్య ఎటువంటి రహస్యాలు లేవు, లేదా ఉండకూడదు" అని అనుకుంటారు, కానీ ఇది ఆ మూడవ పక్షం నమ్మకాన్ని దెబ్బతీసినట్లే. భాగస్వామికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, స్నేహం లేదా ఇతర కుటుంబ సభ్యులు, పుట్టింటి వారికి అంతే ప్రాధాన్యత  ఉంటుంది. కాబట్టి  స్నేహితుల గోప్యతను గౌరవించాలి.   వారి రహస్యాలను భాగస్వామి ముందు గాసిప్ లాగా చర్చించకూడదు. ఇష్టాలు, అయిష్టాలు.. భాగస్వామి ప్రేమతో మీకు బహుమతి కొన్నప్పుడు, అది మీకు అస్సలు నచ్చకపోతే  నిజాయితీతో అది నచ్చలేదు అని చెప్పడం మంచిది కాదు. నాకు ఈ రంగు అస్సలు నచ్చలేదు లేదా ఇది క్వాలిటీగా లేదు  అని చెప్పడం వారి మనసును బాధపెట్టినట్టే..   ఇక్కడ అబద్ధం చెప్పడం మంచిది. వారి భావాలను గౌరవించాలి,  చిరునవ్వుతో బహుమతిని తీసుకోవాలి. కొన్నిసార్లు, నిజం చెప్పడం కంటే అబద్దం చెప్పడం వల్ల భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. సోషల్ మీడియా పాస్వర్డ్ లు.. నేటి డిజిటల్ యుగంలో ఇది ఒక పెద్ద సమస్య. చాలా మంది భార్యాభర్తలు ఒకరి పాస్‌వర్డ్‌లు ఒకరు తెలుసుకోవడం ప్రేమకు సంకేతం అని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరం.  ఫోన్ లేదా సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను చెప్పకపోవడం నేరం కాదు. ఏ తప్పు చేయనంత వరకు, తనకంటూ కొంత పర్సనల్ ఉంచుకోవడం తప్పే కాదు. సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి, కానీ అర్థం చేసుకోవడం ఆ నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. కొన్ని విషయాలను దాచడం మోసం కాదు, అనవసరమైన గొడవలు, అపార్థాలు కలగకుండా బంధాన్ని రక్షించుకునే మార్గమది.                                *రూపశ్రీ
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె,  ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు.  ఆవనూనె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే విదేశీయులు,  ఆరోగ్య స్పృహ ఎక్కువ కలిగిన ధనవంతులు వంటల్లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. పైగా  ఆలివ్ నూనె గుండెకు మంచిదని అంటారు. ఆవ నూనె వందల సంవత్సరాల నుండి భారతీయ వంటకాలలో వాడుతున్నారు. కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఆవనూనెను ఉపయోగిస్తుంటారు.  మధ్యధరా ప్రాంతంలో ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే గుండె ఆరోగ్యానికి ఆవనూనె లేదా ఆలివ్ నూనె రెండింటో ఏది మంచిది? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. సరైన నూనె ఎంపిక ఎందుకు ముఖ్యం? ఒకప్పుడు నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని,  ఈ కారణంగా కొవ్వు ఎక్కువ వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోషకాహార నిపుణులు చెబుతున్న విషయం వేరు.. కొవ్వులో రెండు రకాలు ఉన్నాయని,  వీటిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి.  పదేపదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ , అధిక సంతృప్త కొవ్వులు గుండెకు హానికరం అని చెబుతారు. అయితే, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ , ఒమేగా-3 వంటి అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి , రక్తనాళాలలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే గుండె ఆరోగ్యం గురించి చర్చించేటప్పుడు ఆవ నూనె , ఆలివ్ నూనె రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారికి ఆలివ్ నూనె లేదా ఆవనూనె? గుండె జబ్బుల రోగులకు ఆలివ్ నూనెతో వంట చేయడం మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు , ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇందులో పాలీఫెనాల్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ ధమనులకు నష్టం కలిగించడంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె  మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో , చెడు కొలేస్ట్రాల్  ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు.  చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణం అవుతుందని చెబుతారు. అధికంగా ఆలివ్ నూనె తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ నూనె అన్ని రకాల వంటలకు మంచిదా? ఆలివ్ నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. భారతీయులు  ఆహారాన్ని  నూనెలో బాగా వేయిస్తారు, పోపు  వేస్తారు, లేదా ఎక్కువ సేపు అధిక వేడి మీద వండుతారు. ఇలాంటి పరిస్థితులలో, అధిక వేడి కారణంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, పోషకాలు తగ్గిపోతాయి. శుద్ధి చేసిన ఆలివ్ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఆవనూనె ఎందుకు ప్రత్యేకం.. ఆవ నూనె చాలా కాలంగా భారతీయ వంటకాలలో ఒక భాగంగా ఉంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  ఆవ నూనె వల్ల గుండెకు కలిగే సంభావ్య ప్రయోజనాలపై భారతీయ పరిశోధనలు కూడా జరిగాయి. సాంప్రదాయ ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అయితే ఆవ నూనెను మితంగా వాడాలి.                                    *రూపశ్రీ.  
మూత్రంలో మంటా? UTIని నిర్లక్ష్యం చేయొద్దు..! మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లక్షణాలు కావచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్‌ఫెక్షన్ మూత్రాశయం నుంచి కిడ్నీల వరకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ నవులూరు ఉపేంద్ర కుమార్ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను చాలా సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: ✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) అంటే ఏమిటి? ✅ UTI రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? ✅ మహిళల్లో UTI ఎక్కువగా ఎందుకు వస్తుంది? ✅ పురుషుల్లో UTI వచ్చే కారణాలు ఏమిటి? ✅ UTI లక్షణాలు ఎలా గుర్తించాలి? ✅ ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి? ✅ ఏ పరీక్షల ద్వారా UTIని నిర్ధారిస్తారు? ✅ UTIకి అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? ✅ యాంటీబయాటిక్స్‌ను ఎలా వాడాలి? ✅ UTI మళ్లీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ✅ రోజువారీ అలవాట్లలో చేయాల్సిన మార్పులు మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, గర్భిణీలు మరియు మధుమేహం ఉన్నవారు UTI లక్షణాలపై మరింత అప్రమత్తంగా ఉండాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ గురించి పూర్తి అవగాహన పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. పూర్తి వీడియోను వీక్షించి, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోండి. మరిన్ని ఆరోగ్య సంబంధిత ఉపయోగకరమైన వీడియోలు, నిపుణుల సూచనల కోసం TeluguOne Health‌ను ఫాలో అవ్వండి.