ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది.  ఈ విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసే దిశగా  నాంపల్లి సీబీఐ కోర్టు ఈ మేరకు  ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు జగన్ తో పాటు  మిగిలిన నిందితులందరినీ కూడా స్వయంగా కోర్టు ముందుకు తీసుకురావాలని కోర్టు స్పష్టం చేసింది. జగన్ సహా మొత్తం 70 మంది నిందితులను వ్యక్తిగతంగా విచారించేలా ఈ ప్రక్రియ సాగుతుందని విస్పష్టంగా పేర్కొంది.  గతంలో ఈ కేసుల విచారణ నెమ్మదిగా సాగుతోందన్న కోణంలో విచారణను రోజువారీ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతూ ఈడీ  కోర్టును  ఆశ్రయించిన విషయం తెలిసిందే.  దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల విచారణ త్వరగా ముగించి స్పష్టత తీసుకురావాలని ఈడీ ఆ పిటిషన్‌లో కోరింది. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన సీబీఐ ప్రత్యేక కోర్టు,   రోజువారీ విచారణను పట్టాలెక్కించింది. ఈ కేసుల్లో ఉన్న నిందితుల సంఖ్య పెద్దది కావడం, అలాగే దాఖలైన చార్జ్‌షీట్లు, పత్రాల పరిమాణం విస్తృతంగా ఉండటంతో న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటివరకు   వాయిదాలు, మినహాయింపులతో కాలయాపన జరుగుతోందన్న అభిప్రాయాలకు చెక్ పెడుతూ, ధర్మాసనం స్వయంగా అందరినీ ప్రత్యక్షంగా విచారించేందుకు సిద్ధమైంది. అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా సీబీఐ, ఈడీ  దాఖలు చేసిన పలు చార్జ్‌షీట్లపై విచారణ కొనసాగుతోంది.  కోర్టు నిర్ణయం నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇతర రాజకీయ నాయకులు స్వయంగా రోజు వారీ విచారణకు కోర్టుకు హాజరు కాకతప్పని అనివార్యత ఏర్పడింది.  రోజువారీ విచారణతో ఇప్పటివరకు వాయిదాల మీదే నడుస్తున్న ఈ కేసుల  పురోగతి వేగం పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి  ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులుగా ఉన్న వారు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం రోజువారీ హాజరవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ప్రతిరోజూ కోర్టు విచారణ సజావుగా సాగితే, ఈ కేసుల్లో తీర్పుల ప్రక్రియ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.  [CBI Court Shok Jagan, YS Jagan Mohan Reddy, CBI Special Court Nampally, Disproportionate Assets Case, Enforcement Directorate, Telugu One]
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.  వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.   వివేకా హత్యకు ముందు,  తర్వాత  పెద్దఎత్తున ఆర్థిక లావాదేవీలు,  నిధుల బదిలీలు జరిగాయన్న అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే.  వివేకా హత్య కోసం  40 కోట్ల  రూపాయల డీల్ కుదిరిందనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం..  ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల ఆర్థిక మూలాలను గుర్తించేందుకు ఈడీ దర్యాప్తు చేస్తున్నది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, దాఖలు చేసిన చార్జిషీట్లలోని కీలక అంశాల ఆధారంగా ఈడీ ముందుకు సాగుతున్నది.  ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు నిందితులను, సాక్ష్యులు, అప్రూవర్ లను ఈడీ విచారించింది.  గత కొన్నేళ్లుగా జరిగిన బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్‌లపై ఫోకస్ పెట్టింది.  గతంలో ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌,   కడప తదితర ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృత సోదాలు నిర్వహించాయి. ఆ తనిఖీల్లో   కీలక పత్రాలు, డిజిటల్  ఆధారాలు,  లెక్కల్లో చూపని నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది.   ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈడీ విచారణకు పిలిచి విచారించడం సంచలనం సృష్టిస్తున్నది.   అవినాశ్ రెడ్డి విచారణ ద్వారా సేకరించిన సమాచారాన్ని గతంలో సేకరించిన ఆధారాలతో సరిపోల్చి చూసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో మరి కొందరు ప్రముఖులను కూడా ఈడీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని సమాచారం.    [ED Interrogate YS Avinash Reddy,  ED Investigation, YS Vivekananda Reddy Murder Case, Money Laundering Probe, YCP MP Avinash Reddy, ED Interrogation Viveka Case, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  కీలక పరిణామానికి విజయవాడ వేదిక కానుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న  మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన బుధవారం (అక్టోబర్ 14) జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.   ఇటీవల వంగవీటి రాధా.. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల తర్వాత ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వంగవీటి రాధా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.   ముఖ్యంగా, విజయవాడ మేయర్ పీఠం అన్‌రిజర్వ్డ్ జనరల్‌గా కేటాయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంటోందని అంటున్నారు. తెలుగుదేశంకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా  విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఆ పార్టీ తరఫున వంగవీటి రాధా లేదా ఆయన భార్య పుష్పవల్లిని బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  వంగవీటి కుటుంబానికి విజయవాడలో ఉన్న బలమైన అనుచరగణం, చారిత్రక నేపథ్యం ఈ నిర్ణయానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదే సీటుపై టీడీపీ నుంచి కూడా బోండా ఉమా కుమారుడు రవితేజ, మరి కొందరు కూడా ఆసక్తికనబరుస్తుండటంతో వంగవీటి రాధ జనసేన చేరిక ఉత్కంఠ రేపుతోంది. రాజకీయంగా ఈ పరిణామంతో సమీకరణాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది.   అదలా ఉంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.   [Vangaveeti Radha Joining Janasena, Vangaveeti Radhakrishna, Pawan Kalyan, Vijayawada Mayor Elections, TDP Janasena Alliance, Andhra Pradesh Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ఊహించని మలుపులు, నేరాల వెనుక మానసిక పరిస్థితులు, పోలీసుల విచారణతో సాగే కథలను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో మలయాళంలో రూపొందిన ‘ఐస్’ వెబ్ సిరీస్‌ సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహిళలను ప్రేమ పేరుతో వేధించే స్టాకర్లను నేరం జరగకముందే గుర్తించి, వారిని నియంత్రించేందుకు ప్రయత్నించే ఓ ప్రత్యేక బృందం చుట్టూ ఈ కథ సాగుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ సోనీ లివ్‌లో తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులో ఉంది. మహిళలపై వేధింపులు, దాడులు జరిగిన తర్వాత నేరస్థులను పట్టుకోవడం కంటే.. అలాంటి నేరాలు జరగకముందే వాటిని అడ్డుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో కేరళ పోలీస్ విభాగం ‘ఐస్’ అనే ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తుంది. సాఫ్ట్‌వేర్ నిపుణురాలు విద్య (శ్రుతి రామచంద్రన్), సైకాలజిస్ట్ ఆయేషా (నిఖిలా విమల్), పోలీస్ అధికారులు టీనా సెబాస్టియన్ (కని కుసృతి), జస్టిన్ (ప్రభు మురళీకృష్ణన్), సైకాలజిస్ట్ తన్వీ కలిసి ఈ బృందంలో పనిచేస్తారు. వేధింపులకు పాల్పడే వ్యక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, స్మార్ట్‌వాచ్‌ సాయంతో వారిని గమనిస్తుంటారు. బాధితులకు ముప్పు ఎదురయ్యే అవకాశముంటే ముందుగానే గుర్తించి హెచ్చరించాలన్నది ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం. అయితే ఈ ప్రయోగంలో భాగంగా పర్యవేక్షణలో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో బృందానికి అనుకోని సమస్య ఎదురవుతుంది. ఆ తర్వాత ఈ టీమ్‌ తిరిగి ఎలా ఒక్కటైంది? వారు ఎదుర్కొన్న నాలుగు కేసుల వెనుక ఉన్న నిజాలేంటి? అనేది మిగతా కథ. సాధారణ పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ కథలకు భిన్నంగా, సాంకేతికతను మానసిక విశ్లేషణతో కలిపి చూపించడం ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ. మహిళలను వేధించే వ్యక్తుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, బాధితులు ఎదుర్కొనే పరిస్థితులను చూపించడం ద్వారా ఓ సామాజిక సమస్యపై చర్చకు తెరలేపారు. ఒక్కో కేసులో ఒక్కో రకమైన నేపథ్యం ఉండటంతో కథలో ఆసక్తి కొనసాగుతుంది. ముఖ్యంగా కొన్ని కేసుల్లో అసలు ఏం జరుగుతోందనే ఉత్కంఠ ప్రేక్షకులను ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ కాన్సెప్ట్‌ ఆచరణలో ఎంతవరకు సాధ్యమనే సందేహం కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. స్టాకర్లు సులభంగా పర్యవేక్షణకు అంగీకరించడం, సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా వారి ప్రవర్తనను అంచనా వేయడం వంటి అంశాలు పూర్తిగా నమ్మశక్యంగా అనిపించవు. అంతేకాకుండా ఏడు ఎపిసోడ్లలో ఒక్కోటి సుమారు 50 నిమిషాల నిడివితో ఉండటం వల్ల కొన్ని చోట్ల కథ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా మధ్యలో వచ్చే ఎపిసోడ్లు కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. పోలీస్‌ అధికారిణి టీనా పాత్రలో కని కుసృతి సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. ఆయేషాగా నిఖిలా విమల్‌, విద్యగా శ్రుతి రామచంద్రన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రభు మురళీకృష్ణన్‌, జాఫర్‌ ఇడుక్కి, దేవ్‌ మోహన్‌, సానియా అయ్యప్పన్‌ తదితరులు కూడా కథకు బలాన్ని చేకూర్చారు. దర్శకుడు మను అశోకన్‌ సీరియస్‌ అంశాన్ని క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. నేరాలు జరిగిన తర్వాత విచారణ చేయడం కంటే, నేరాలకు దారితీసే ధోరణులను ముందుగానే గుర్తించవచ్చా అనే కొత్త ఆలోచనతో ‘ఐస్’ తెరకెక్కింది. కథలో కొన్ని లోపాలు, నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ, సామాజిక సమస్యను విభిన్నంగా చూపించే ప్రయత్నం ఆసక్తికరంగా ఉంటుంది. రెగ్యులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్లకు భిన్నమైన కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను ఒకసారి చూడొచ్చు.     [Eyes Web Series Review, Eyes Malayalam Series, Eyes OTT Review, Eyes SonyLIV, Eyes Telugu Review, Manu Ashokan, Kani Kusruti, Nikhila Vimal, Shruti Ramachandran, Malayalam Crime Thriller, SonyLIV Web Series, Eyes Series Cast]
ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరో మీసం మెలేస్తే థియేటర్లు దద్దరిల్లిపోయేవి.హీరో మీసం చూస్తేనే అతని క్యారెక్టర్ ఏంటో అర్థమైపోయేది. మీసం హీరో గాంభీర్యానికి, ధైర్యానికి, పౌరుషానికి ఒక గుర్తు! కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొందరు హీరోలు మీసంతో మాస్ లుక్‌లో కనిపిస్తుంటే, మరికొందరు గడ్డం, మీసం కలిపిన స్టైలిష్ లుక్‌తో  ఆకట్టుకుంటున్నారు. అసలు అప్పటి తెలుగు హీరోల మీసకట్టుకి, ఇప్పటి హీరోల మీసకట్టుకి మధ్య ఉన్న తేడా ఏంటి? అప్పటి మీసం హీరో క్యారెక్టర్‌ని చూపిస్తే… ఇప్పటి మీసం హీరో స్టైల్‌ని  చూపిస్తోందా? మరి ఈ మీసాల వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం! కొంచెం వెనక్కి వెళ్దాం... 70, 80, 90ల నాటి గోల్డెన్ ఎరాకి! అప్పట్లో హీరో ముఖానికి ప్రాణం అంటే ఆ మీసమే!  ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు పౌరాణిక, జానపద పాత్రల్లో కనిపించినా... ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు రొమాంటిక్, యాక్షన్ రోల్స్ చేసినా... మీసం అనేది ఒక మాస్ సింబల్. ముఖ్యంగా ఆ అందరిలో ఏఎన్ఆర్ మీసకట్టు డిఫరెంట్ .ఆ తర్వాత  చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున విభిన్నమైన మీసకట్టుతో ఫ్యాన్స్ ఐకాన్స్ గా మారారు. ఎంతో మంది ఫ్యాన్స్ వారిలా మీసకట్టుతో దర్శనమిచ్చే వారు. ఇక బాలయ్య  మీసం తిప్పి కంటిచూపుతో ప్రత్యర్థులని  భయపెడితే, థియేటర్లలో సీట్లు చిరిగిపోయేవి! అప్పట్లో మీసం లేని హీరోని ఊహించుకోవడం కూడా ఫ్యాన్స్‌కి కష్టంగా ఉండేది. మీసం ఉంటేనే హీరో, మీసం ఉంటేనే మాస్ పవర్! అప్పటి సినిమాల్లో విలన్‌కి ఒక రకమైన మీసం, పోలీస్ అధికారికి మరో రకమైన మీసం, జమీందారుకి ఇంకో రకమైన మీసం ఉండేది. అంటే హీరో స్క్రీన్‌పై కనిపించగానే అతను ఎలాంటి వ్యక్తి అనేది ప్రేక్షకులకి ఒక అంచనా వచ్చేది. అంటే మీసం యొక్క వాల్యూని అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పటి తెలుగు సినిమా విషయానికి వస్తే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అల్లు అర్జున్ పుష్ప లో పెంచిన గడ్డం, మీసం  పుష్ప క్యారక్టర్ కి ఒక ప్రత్యేకమైన మాస్ గుర్తింపుని తీసుకొచ్చాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు  తమ క్యారక్టర్ కి తగ్గట్టుగా రకరకాల మీసకట్టుతో ప్రేక్షకులని ఆకట్టుకుంటు వస్తున్నారు. ఆర్ఆర్ఆర్'లో చరణ్ పవర్ ఫుల్ పోలీస్ మీసకట్టుతో కనిపిస్తే, తారక్ రగ్గడ్ డిఫరెంట్ స్టైల్‌లో అలరించాడు. దేవర', 'సలార్', 'పుష్ప 2' లాంటి సినిమాల్లో హీరోలు మీసాలని  కేవలం ఒక ఫ్యాషన్ లా కాకుండా, ఆ క్యారక్టర్ యొక్క నైజానికి, యాటిట్యూడ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటున్నారు.  దీంతో ఇప్పుడు మీసం ఒక క్లాసిక్ ట్రెడిషన్ మాత్రమే కాదు... ఒక గ్లోబల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్! అతడు" లో మహేష్ బాబు క్లీన్ షేవ్డ్ చాక్లెట్ బాయ్ లుక్‌తో వస్తే, కుర్రకారు ఫిదా అయిపోయారు. మాస్ అంటే కేవలం పెద్ద మీసం ఉండక్కర్లేదు, స్టైలిష్‌గా ఉన్నా చాలు అని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మీసం ఒక్కటే కాదు… గడ్డం, హెయిర్‌స్టైల్, బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ అన్నీ కలిపి హీరో లుక్‌ నిర్ణయిస్తున్నాయి. ఒక సినిమాలో రఫ్‌గా కనిపించే హీరో, మరో సినిమాలో నీట్‌గా షేవ్ చేసుకుని కొత్త లుక్‌లో కనిపించడం కూడా ఇప్పుడు సాధారణమే! అప్పట్లో హీరో మీసం  వ్యక్తిత్వానికి, హుందాతనానికి ప్రతీకగా కనిపించేది. ఇప్పుడేమో కథకు తగ్గట్టుగా మీసం రూపం మారుతోంది.     అప్పటి సినిమాల్లో ఒక హీరో లుక్ సంవత్సరాల పాటు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయేది. ఇప్పుడు ప్రతి సినిమాకి  కొత్త లుక్, కొత్త మేకోవర్‌తో అభిమానులని  ఆశ్చర్యపరచడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అప్పటి హీరోలు స్టైలిష్‌గా కనిపించలేదని కాదు… ఇప్పటి హీరోలకు మాత్రమే మాస్ లుక్ ఉందని కాదు. కాలానికి తగ్గట్టుగా మీసాల స్టైలింగ్, సినిమాటిక్ ప్రెజెంటేషన్ మారాయి అంతే!   మొత్తానికి తెలుగు సినిమాలో అప్పటి మీసకట్టు సంప్రదాయానికి, పౌరుషానికి, క్యారక్టర్ గాంభీర్యానికి ప్రతీకగా నిలిస్తే… ఇప్పటి మీసకట్టు  స్టైల్, కొత్తదనం, మాస్ ఇమేజ్‌  చూపిస్తోంది.కాలం మారినా, హీరోల లుక్స్ మారినా... మన తెలుగు సినిమాలో మీసానికి ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు, తగ్గేదేలే!   [History of Moustache in Telugu Cinema, Telugu Cinema Meesa kattu, Chiranjeevi, Balakrishna, Pawan kalyan, Ntr, Mahesh Babu, Prabhas, Ram Charan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సినిమాల్లో తాము పోషించే పాత్రలు నిజ జీవితంపై కూడా ప్రభావం చూపిస్తాయని కొందరు నటీనటులు చెబుతుంటారు. తాజాగా ర‌ష్మిక దేవరకొండ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మంచి పనిని అభిమానులతో పంచుకున్నారు. ‘జయమ్మ’ పాత్రకు, తన నిజ జీవితానికి కొన్ని పోలికలు ఉన్నాయని చెబుతూ.. తాను ఎప్పటినుంచో చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఇప్పుడు అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాను ఒకేసారి 400 కుటుంబాలకు అండగా నిలిచినట్లు రష్మిక వెల్లడించారు. ఈ కుటుంబాలకు మూడు నెలల పాటు నిత్యావసర సరుకుల కోసం సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇలా ప్రతి మూడు నెలలకు 400 కుటుంబాలకు చొప్పున సహాయం చేస్తూ, వచ్చే ఏడాది మొత్తం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును ఆయా కుటుంబాలు పొదుపు చేసుకుని, తమ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకోవాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇదిలా ఉంటే.. ఇంతకాలం తాను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి బయటకు చెప్పలేదని ఆమె వెల్లడించారు. తనకు, తన టీమ్‌కు, కొద్దిమంది సన్నిహితులకు తెలిస్తే సరిపోతుందని భావించానని తెలిపారు. అయితే తాను చేస్తున్న పని గురించి తెలుసుకుని మరికొందరు కూడా తమకు తోచినంత సాయం చేయడానికి ముందుకొస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇప్పుడు ఈ విషయాన్ని పంచుకుంటున్నట్లు చెప్పారు. తన కెరీర్‌లో ఎదురైన కష్టాలు, నిద్రలేని రాత్రులు, గాయాలు, బాధలు, కన్నీళ్లకు ఈ కుటుంబాల ముఖాల్లో కనిపిస్తున్న చిరునవ్వులే విలువైన ప్రతిఫలమని ర‌ష్మిక‌ భావోద్వేగంగా పేర్కొన్నారు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు బదులుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు.     [Jayamma Actress, Actress Helps 400 Families, 400 Families Adoption, Actress Charity Work, Celebrity Philanthropy, Actress Social Service, Grocery Support for Families, Telugu Cinema News, Actress Kindness, Celebrity Charity News]
రణబాలి ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ స్పీడ్, కాన్ఫిడెన్స్ చూస్తుంటే హిట్ ని ఈ సారి  చాలా గట్టిగానే అందుకోబోతున్నాడా  అనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో, విజయ్, రష్మిక అభిమానుల్లో రణబాలి పండుగ వాతావరణం తీసుకొచ్చింది.  ఇక విజయ్ దేవరకొండ  మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌తో నేషనల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ప్రముఖ వినోద, జీవనశైలి వేదిక 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' (THR India) విడుదల చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన 'టాప్ 10 బెస్ట్ డ్రెస్డ్' (Top 10 Best Dressed Of The Year) సెలబ్రిటీల జాబితాలో విజయ్ దేవరకొండ స్థానం సంపాదించుకున్నారు. ఈ వార్త వెలువడిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ #VijayDeverakonda, #Ranabaali ట్రెండ్స్‌ను మోతెెక్కిస్తున్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ మరియు రెడ్ కార్పెట్ ఈవెంట్లలోనూ ఆయన ప్రదర్శించే సరికొత్త ఫ్యాషన్ ప్రయోగాలు, బోల్డ్ అండ్ క్లాసీ లుక్స్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి దుస్తులైనా సరే తనదైన శైలిలో కాన్ఫిడెంట్‌గా క్యారీ చేయగలగడం విజయ్ ప్రత్యేకత అని ఫ్యాషన్ నిపుణులు ఎప్పుడూ ప్రశంసిస్తుంటారు. ఇది కూడా చదవండి: Jailer 2: జైలర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: మరి రేపు థియేటర్స్ లో పరిస్థితి ఎలా ఉంటుందో!     ఏది ఏమైనా 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' అందించిన ఈ లేటెస్ట్ ఫ్యాషన్ లిస్ట్‌లో విజయ్  చోటు దక్కించుకోవడం ద్వారా సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ లెవెల్‌లో మరో మెట్టు ఎక్కించారనే చెప్పాలి.    vijay Deverakonda In ThrIndia Best Dressed, Vijay Deverakonda, THR India Best Dressed, Vijay Deverakonda style icon, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లో RC17 ప్రొడక్షన్ ఆఫీస్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆఫీస్ ప్రారంభం కావడంతో సినిమా పనులు అధికారికంగా ముందుకు కదులుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌పై టీమ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు మూవీ లాంచ్ కార్యక్రమాన్ని కూడా విజయదశమి సందర్భంగా అక్టోబర్ 20 ప్రాంతంలో నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా రామ్ చరణ్ చూపించిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సుకుమార్ తనదైన కథనం, పాత్రల రూపకల్పనతో ఆ సినిమాను ప్రత్యేకంగా నిలిపారు. ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో RC17పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం చరణ్ ఫిజికల్‌గా కూడా సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన లుక్, కథా నేపథ్యం చాలా కొత్తగా ఉండబోతున్నట్లు సమాచారం.  ఇది కూడా చదవండి: విజయ్‌ను చూసి భయపడ్డా.. రణబాలి ఈవెంట్‌లో రష్మిక కామెంట్స్.!       [RC17 Office Opening, RC17 Movie Launch, Ram Charan Sukumar Movie, Rangasthalam Combo, RC17 Movie, Ram Charan, Sukumar, Mythri Movie Makers, Telugu Film News]  
థియేటర్స్ రజినీ మ్యానియాతో ఊగిపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకెంత మహా అయితే కొన్ని గంటల్లో ప్రీమియర్స్  ప్రదర్శించడంతో ఫ్యాన్స్ లో కోలాహాలం కూడా స్టార్ట్ అయ్యింది.  అలాంటి ఈ టైంలో ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాలో, ట్రేడ్ సర్కిల్స్ లో న్యూస్ చెలామణి అవుతుంటే, అది కూడా పాజిటివ్ గా ఉంటే ఇంకేమైనా ఉందా!   టాక్ ప్రకారం, 'జైలర్ 2' చిత్రం అభిమానులకి, మాస్ ప్రేక్షకులకి  ఒక పరిపూర్ణమైన  విందులా ఉండబోతోంది. రజినీకాంత్ మార్క్ మ్యానరిజమ్స్, నెల్సన్ మార్క్ డార్క్ కామిడీ,  అనిరుధ్ రవిచందర్ రికార్డు స్థాయి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలవబోతున్నాయంట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ నాన్‌స్టాప్ ర్యాంపేజ్‌లా ఉంటాయని, థియేటర్లలో ఈలలు, కేకలతో ఫ్యాన్స్, ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోవడం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ బ్లాక్ అభిమానులకి గూస్‌బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశారట. టోటల్ గా చెప్పాలంటే జైలర్ ని మించి ఉండబోతుందనేది టాక్.  ఇది కూడా చదవండి: 'రాజాసాబ్' ఫెయిల్యూర్ తర్వాత.. రూటు మార్చిన డైరెక్టర్ మారుతి..కొత్త మూవీ సబ్జెక్టు ఇదే!   ఇక రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 కోట్లకి  పైగా ప్రీ సేల్స్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.  ఓవర్సీస్ లో కూడా  అడ్వాన్స్ బుకింగ్స్ 11 కోట్లు దాటడం రజినీ కట్ అవుట్ కెపాసిటీని తెలియచేస్తుంది.     [Jailer 2 First Review, Jailer 2 Review, Rajinikanth Jailer 2 Review, Jailer 2 advance booking, Jailer 2 inside talk, Nelson Dilipkumar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
సినిమాల్లో కలిసి నటిస్తే ప్రేమలో పడటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఇదంతా మనం చాలా సందర్భాల్లో చూశాం. కానీ పెళ్లయిన తర్వాత కూడా తన భర్త నటనకు ఓ అభిమానిలా ఫీలవుతుంటే మాత్రం ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు రష్మిక మందన్న కూడా అదే విషయాన్ని బయటపెట్టింది. విజయ్ దేవరకొండను చూస్తుంటే తనకు ఇప్పటికీ పెళ్లయిందనే ఫీలింగ్ రావడం లేదని చెప్పింది. అంతేకాదు.. ‘రణబాలి’ సెట్స్‌లో విజయ్ పర్ఫార్మెన్స్ చూసి భయపడిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై విజయ్‌ను చూస్తూ మురిసిపోయిన రష్మిక.. తన మనసులోని మాటను బయటపెట్టింది. “విజ్జూ.. నాకు అసలు పెళ్లయిందన్న ఫీలింగే కలగడం లేదు. నిన్ను చూస్తుంటే ఇప్పటికీ ఓ ఫ్యాన్ గర్ల్‌లాగే అనిపిస్తోంది. నీ వర్క్ కి నేను పెద్ద అభిమానిని” అంటూ చెప్పుకొచ్చింది. పెళ్లికి ముందు నుంచే విజయ్‌తో కలిసి నటించిన రష్మిక.. ఇప్పుడు నిజ జీవితంలోనూ అతడి భాగస్వామిగా మారింది. అయినప్పటికీ విజయ్ నటనను ఓ అభిమానిలా ఆస్వాదిస్తానని చెప్పడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘రణబాలి’ షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను కూడా రష్మిక పంచుకుంది. నెలకు నాలుగైదు రోజులు మాత్రమే సెట్‌కు వెళ్లేదాన్నని, తనకు మాత్రం అక్కడికి వెళ్తే పిక్నిక్‌కు వెళ్లినట్లుగా సరదాగా ఉండేదని చెప్పింది. కానీ విజయ్, దర్శకుడు రాహుల్, చిత్రబృందం మాత్రం చాలా సీరియస్‌గా పనిచేసేవారని తెలిపింది. ముఖ్యంగా విజయ్ మీసాలు తిప్పుతూ రౌద్రంగా నటిస్తుంటే తనకు భయమేసేదని రష్మిక చెప్పుకొచ్చింది. సెట్‌లో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులంతా మరో స్థాయిలో పనిచేశారని వివరించింది. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారని తాను నమ్ముతున్నట్లు చెప్పింది. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో విజయ్, రష్మిక జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘రణబాలి’లో మరోసారి ఈ జంట కలిసి నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో తమ లవ్ ట్రాక్ అంతకుమించిన స్థాయిలో ఉంటుందని కూడా రష్మిక చెప్పింది. మరి నిజ జీవితంలో ఒక్కటైన విజయ్, రష్మిక.. తెరపై మరోసారి తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారా? విజయ్ నటన గురించి రష్మిక ఇంతగా చెబుతున్న నేపథ్యంలో ‘రణబాలి’లో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో చూడాలి. ఇది కూడా చదవండి: జయలలితగా త్రిష.. కోలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ.!       [Rashmika Mandanna Speech, Ranabali Pre Release Event, Ranabali Movie, Rashmika Mandanna, Vijay Deverakonda, Rashmika Speech, Rahul Sankrityan, Telugu Film News]  
  రాజాసాబ్ తో బడా, పాన్ ఇండియా డైరెక్టర్ అనే టాగ్ లైన్స్ ని పేరు వెనకే ఉండిపోయేలా చేసుకుందామనుకున్న మారుతీ కల నెరవేరలేదు. మూవీ లవర్స్, ప్రేక్షకులు మాత్రం రిలీజ్ కి ముందు రాజా సాబ్ తాత,మనవడు కథ అని ఆ ఇద్దరు ప్రభాస్ నే కాబట్టి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, అంతే స్థాయిలో హర్రర్ ఉంటుందని అనుకున్నారు. తీరా, నాయనమ్మ, మనవడు సబ్జెక్టు కావడం, పైగా ఓల్డ్ ప్రభాస్ లేకపోవడంతో పరాజయం పాలైందని అంటారు. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ మాత్రం రాంగ్ టైం రిలీజ్ చేశామని నిన్న మీడియా ముఖంగా చెప్పేసాడు. ఏదిఏమైనా రాజా సాబ్ పరాజయం తర్వాత మారుతీ నుంచి కొత్త సినిమా ప్రకటన కోసం అందరు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తన పాత విజయాల బాట పట్టాలని నిర్ణయించుకున్నాడు. రాజా సాబ్ నుంచి  బాక్సాఫీస్ వద్ద ఎదురైన ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న మారుతి, భారీ హంగులు మరియు స్టార్ ఇమేజ్ భారం జోలికి వెళ్లకుండా తన అసలైన బలమైన 'హోం గ్రౌండ్' అయిన వింటేజ్ కామెడీ జోన్‌లోకి అడుగుపెడుతున్నాడు . ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా, పరిమిత బడ్జెట్‌లో నాణ్యమైన కంటెంట్‌ను శరవేగంగా అందించాలనే ప్లాన్‌తో మారుతి ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.        గతంలో 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో సరికొత్త నవ్వుల పూలు పూయించి బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్న మారుతి, ఇప్పుడు మళ్లీ అదే జోరును ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ తాజా చిత్రంలో ఎలాంటి పెద్ద స్టార్స్ లేకుండా పూర్తిగా కొత్తవారితో  ఒక చక్కటి కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నూతన నటీనటులకు అవకాశం ఇస్తూనే, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హిలేరియస్ స్క్రిప్ట్‌ని  సిద్ధం చేశాడని సమాచారం.   ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతుండగా, రాబోయే నవంబర్‌లోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్‌ను పట్టాలెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తక్కువ రోజుల్లోనే షెడ్యూల్స్ పూర్తి చేసి, వేసవి కానుకగా 2027 సమ్మర్‌లో సినిమాను థియేటర్లలో విడుదల చేయడమే లక్ష్యంగా మారుతి బృందం శ్రమిస్తోంది. మరి ఈ వింటేజ్ కామెడీ రీ ఎంట్రీతో మారుతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తాడో సినీ కాలమే చెప్తుంది.   Maruthi Nee Movie Details, Director Maruthi, The Raja Saab, Maruthi new movie, Maruthi upcoming film,  Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News  
సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్‌కు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల జీవితాల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయంటే.. అందులో నటించబోయే వారి గురించి ఆసక్తికర చర్చ మొదలవుతుంది. ఇప్పుడు అలాంటి వార్తే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో త్రిష నటించబోతున్నారా? అంటే.. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత జె.ఎం. బషీర్ ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా ‘పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్’ పేరుతో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను ఆయనే పోషించనున్నారు. ఇక జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు బషీర్ వెల్లడించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  జె.ఎం. బషీర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బయోపిక్ చిత్రీకరణను అక్టోబర్ 17 నుంచి ప్రారంభించనున్నారు. ఎంజీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయాల్లో ఆయన ఎదుగుదల వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నాదురై, కరుణానిధి వంటి కీలక రాజకీయ నాయకుల పాత్రలు కూడా ఇందులో ఉండనున్నాయి. అయితే దర్శకుడు, సంగీత దర్శకుడు సహా ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని బషీర్ తెలిపారు. నిజానికి జయలలిత పాత్రలో నటించాలనే ఆసక్తిని త్రిష గతంలోనే వ్యక్తం చేశారు. 2018లో ఓ సందర్భంలో జయలలిత బయోపిక్‌లో అవకాశం వస్తే నటించడానికి ఇష్టపడతానని చెప్పారు. జయలలితపై తనకు ఎంతో గౌరవం ఉందని కూడా వెల్లడించారు. ఇప్పుడు ఎంజీఆర్ బయోపిక్ కోసం ఆమెను సంప్రదిస్తున్నారనే వార్త రావడంతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. ఇప్పటికే జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమాలో కంగనా రనౌత్ ఆ పాత్రను పోషించారు. ఎంజీఆర్‌గా అరవింద్ స్వామి నటించారు. మరోవైపు రమ్యకృష్ణ కూడా గతంలో జయలలిత పాత్రలో కనిపించారు. ఇప్పుడు త్రిషకు అలాంటి అవకాశం వస్తే ఆమె ఎలా కనిపిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు మాత్రమే చిత్రబృందం నుంచి సమాచారం వచ్చింది. ఆమె ఈ పాత్రకు అంగీకరించారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ త్రిష గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం.. జయలలిత పాత్రలో ఆమెను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరగడం ఖాయం. మరి ఈ బయోపిక్‌లో త్రిష భాగమవుతారా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: నా ఫెయిల్యూర్ చూసి పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడతా - విజయ్ దేవరకొండ       [Trisha As Jayalalithaa, Trisha Jayalalithaa Role, Trisha as Thalaivi, MGR Biopic, Trisha Krishnan, JM Bashir, Jayalalithaa, MGR, Telugu News]  
విజయ్ దేవరకొండ అంటేనే దూకుడు.. ఆయన మాటల్లోనూ అదే కనిపిస్తుంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తన అభిప్రాయాలను నేరుగా చెప్పే విజయ్.. ఇప్పుడు ‘రణబాలి’తో మరోసారి వార్తల్లో నిలిచారు. తన గత సినిమాల పరాజయాలను చూసి కొందరు సంబరాలు చేసుకున్నారని, వాళ్లందరికీ ఈసారి తన సక్సెస్‌తో సమాధానం చెబుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ తన కెరీర్, ట్రోలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో ఎదురైన పరాజయాలను గుర్తు చేసుకుంటూ విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నోటా’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోనప్పుడు కొందరు తన వైఫల్యాన్ని చూసి పండగ చేసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో తన ఈగో బాగా దెబ్బతిందని, అందుకే అందరికీ ఓ బహిరంగ లేఖ రాశానని గుర్తుచేసుకున్నారు. ఆ లేఖలో ‘ఐ విల్ బి బ్యాక్’ అని చెప్పిన విజయ్.. ఆ తర్వాత ‘టాక్సీవాలా’తో విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా సక్సెస్ మీట్‌లో ‘ఐ యామ్ బ్యాక్’ అంటూ తన సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ‘రణబాలి’తోనూ అదే నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ఈసారి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తే.. అనంతపూర్ గడ్డ మీదకు వచ్చి తన సక్సెస్ ఏంటో మరోసారి గుర్తు చేస్తానని ట్రోలర్స్‌కు సవాల్ విసిరారు. దీంతో విజయ్ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ‘రణబాలి’ కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని విజయ్ చెప్పారు. సుమారు 150 ఏళ్ల క్రితం సంభవించిన మహా కరువు, మద్రాస్ ఫ్యామిన్ నేపథ్యంలోని అంశాలు ఈ కథలో ఉంటాయని వెల్లడించారు. చరిత్రలో మరుగునపడిపోయిన వీరుల కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం ఈ సినిమా అని ఆయన గతంలోనూ వివరించారు. మొత్తానికి, ఒకవైపు తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు గట్టిగా సమాధానం చెప్పాలని విజయ్ సిద్ధమవుతుంటే.. మరోవైపు ‘రణబాలి’తో కెరీర్‌లో కీలక విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. మరి విజయ్ చెబుతున్నట్లుగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అనేది అక్టోబర్ 16న తేలనుంది.       [Vijay Deverakonda Speech, Ranabaali Pre Release Event, Vijay Deverakonda Trolls, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
బలమైన భార్యాభర్తల బంధానికి, డబ్బుకు ఉన్న లింకు ఇదే..  పెళ్లి అనేది కేవలం ఇద్దరు మనుషులు ఒక్కటి కావడం కాదు. ఇద్దరి అలవాట్లు, వాళ్ళ మనసులు, వాళ్ళ బాధ్యతలు కూడా కలిసి ఉండే బంధం.  భార్యాభర్తల  మధ్య ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో, ఆర్థిక విషయాలలో స్పష్టత కూడా అంతే అవసరం. వివాహ బంధంలో చాలా సమస్యలు లేదా గొడవలు నేరుగా మనస్పర్ధల వల్ల కాకుండా, ఆర్థిక విషయాలలో సరైన సమాచారం, అవగాహన లేకపోవడం వల్లే మొదలవుతుంటాయి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పుల విషయంలో ఇద్దరి మధ్య పారదర్శకత లేకపోతే కాలక్రమేణా ఆ బంధంలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పెళ్లయిన కొత్తలోనే లేదా సంసార ప్రయాణంలో దంపతులిద్దరూ కూర్చుని డబ్బుకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించుకోవడం ఎంతో అవసరం. ఆర్థిక ప్రణాళికలు సరైన మార్గంలో ఉంటేనే దాంపత్య జీవితం ఆనందంగా, మానసిక ప్రశాంతతతో సాగుతుంది..   ఆర్థిక బలంగా ఉండాలన్నా  , భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా..ప్రతి భార్యాభర్తలు తప్పకుండా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అవేంటో తెలుసుకుంటే .. ఇద్దరి సంపాదన , ఆదాయం వివరాలు.. భార్యాభర్తలిద్దరికీ ఒకరి ఆదాయం గురించి మరొకరికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఇద్దరి నెలవారీ సంపాదన, వచ్చే బోనస్‌లు లేదా ఇతర ఆదాయ మార్గాల గురించి ఓపెన్ గా  మాట్లాడాలి. ఎవరి ఆదాయం ఎంత ఉందో తెలిసినప్పుడే ఇంటి బడ్జెట్‌ను సరిగ్గా నిర్వహించడం , భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం తేలికవుతుంది. ఇక్కడ సంపాదన తక్కువ లేదా ఎక్కువ అనేది ముఖ్యం కాదు, ఇద్దరు ట్రాన్స్పరెంట్ గా ఉండటమే  ప్రధానం. ఇంటి ఖర్చుల నిర్వహణ , బాధ్యతల విభజన..  ఇంటి అద్దె, గ్రోసరీస్, కరెంట్ బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులు వంటి రెగ్యులర్  ఖర్చులను ఎవరు, ఎలా భరించాలో ముందుగానే మాట్లాడుకోవడం   మంచిది. ప్రతి ఖర్చునూ సగం సగం షేర్ చేసుకోవాలనే రూల్  ఏమీ లేదు. భార్యాభర్తలిద్దరూ  వారి ఆదాయం, వీలును బట్టి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా ఖర్చులను అడ్జస్ట్ చేసుకోవచ్చు.  పొదుపు..  కేవలం సంపాదించడం, ఖర్చు పెట్టడమే కాకుండా భవిష్యత్తు భద్రత కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. నెలకు ఎంత మొత్తం పొదుపు చేయాలి, ఆ మొత్తాన్ని ఎక్కడ దాచాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. చిన్న మొత్తంతో మొదలుపెట్టినా, క్రమబద్ధమైన పొదుపు అలవాటు అత్యవసర సమయాల్లో ఎంతగానో ఆదుకుంటుంది. అప్పులు , ఈఎంఐలు.. పెళ్లికి ముందు ఉన్న అప్పులు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ బాకీల గురించిన నిజాలను ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవాలి. అప్పులు ఎంత ఉన్నాయి, వాటికి నెలకు ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నారు అనే వివరాలు భాగస్వామికి తెలియడం వల్ల అనవసర టెన్షన్లు తగ్గిపోతాయి. దాపరికం లేకుండా అప్పుల విషయాన్ని పంచుకోవడం ద్వారా ఇద్దరూ కలిసి త్వరగా వాటిని తీర్చే ప్రణాళిక వేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఫైనాన్సియల్ గోల్స్.. ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. సొంత ఇల్లు కొనడం, పిల్లల  చదువులు, వ్యాపారం ప్రారంభించడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి విషయాలపై ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయో మాట్లాడుకోవాలి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నాళ్ల సమయం పడుతుంది, ఎలా ముందుకు వెళ్లాలి అనేది ముందే నిర్ణయించుకుంటే ఒక స్పష్టత వస్తుంది. కుటుంబ సభ్యుల బాధ్యతలు , సహాయం.. చాలామందికి తమ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో పరస్పరం గౌరవం, అర్థం చేసుకునే తత్వం అవసరం. కుటుంబాలకు ఎంతవరకు సాయం చేయవచ్చు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు అనేది ముందే మాట్లాడుకుంటే, తర్వాత కాలంలో సంసారంలో అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయి. పెద్ద నిర్ణయాలు , వ్యక్తిగత స్వేచ్ఛ.. ఏదైనా పెద్ద వస్తువు కొనాలన్నా, అప్పు తీసుకోవాలన్నా లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇద్దరూ సంప్రదించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ తమ సొంత అవసరాల కోసం కొంత డబ్బును ఉపయోగించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఉమ్మడి లక్ష్యాలతో పాటు వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని గౌరవించినప్పుడే ఆ బంధంలో నమ్మకం, గౌరవం మరింత పెరుగుతాయి.                           *రూపశ్రీ.
ప్రపంచ ప్రఖ్యాత పాప్ సంగీత సంచలనం టేలర్ స్విఫ్ట్ విడుదల చేసిన సరికొత్త సింగిల్  పేషెంట్ జీరో  (Patient Zero) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. 2026 సెప్టెంబర్ 22న ఈ అనూహ్య ప్రకటన వెలువడిన క్షణం నుంచే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్విఫ్ట్ అభిమానులు మరియు మ్యూజిక్ నిపుణులు ఈ పాట అసలు అర్థం ఏమిటని తీవ్ర అన్వేషణ ప్రారంభించారు. అయితే, పబ్లిక్ హెల్త్ నిపుణులు మరియు వైద్య రంగానికి చెందిన పరిశోధకులు మాత్రం ఈ టైటిల్ విన్న వెంటనే ఆందోళనకు గురయ్యారు. 1980ల నాటి హెచ్‌ఐవి/ఎయిడ్స్ (HIV/AIDS) మహమ్మారి కాలం నుంచి రోగులను నిందించడానికి, సమాజంలో వేధించడానికి ఉపయోగించిన అత్యంత విషపూరితమైన  పేషెంట్ జీరో  అనే పదాన్ని టేలర్ స్విఫ్ట్ మళ్లీ తెరపైకి తీసుకురావడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, ఈ పాట మరియు స్టార్ స్టడెడ్ మ్యూజిక్ వీడియో విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసలు ఈ  పేషెంట్ జీరో  అనే పదానికి ఉన్న చారిత్రక నేపథ్యం చాలా బాధాకరమైనది. 1982లో యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) పరిశోధకులు అంటువ్యాధుల వ్యాప్తిని అధ్యయనం చేసే క్రమంలో అక్షర దోషం కారణంగా ఈ పదాన్ని ఉపయోగించారు. కెనడా దేశానికి చెందిన విమాన సిబ్బంది అయిన గాటెన్ డ్యుగాస్ (Gaëtan Dugas) అనే వ్యక్తిని తప్పుగా సమాజం అపార్థం చేసుకుని, ఒక వైరస్‌కు మూలకారకుడిగా ముద్ర వేసింది. అప్పటి నుండి ఈ పదం ఒక వ్యక్తిని బలిపశువును చేయడానికి, వారిపై సామాజిక కళంకాన్ని మోపడానికి ఒక అస్త్రంగా మారింది. కోవిడ్ 19 సమయంలో కూడా ఇదే తరహా ధోరణులు కనిపించాయి. అయితే, టేలర్ స్విఫ్ట్ తన సరికొత్త గీతంలో ఈ సాంప్రదాయ అర్థాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. డేంజరస్ రిలేషన్‌షిప్‌లు లేదా విషపూరితమైన సంబంధాల నుండి బయటపడే మహిళల అనుభవాలను ఇందులో శక్తివంతంగా ప్రతిబింబించింది. ఈ పాటలో టేలర్ స్విఫ్ట్ తన మాజీ భాగస్వామితో డేంజర్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకున్న మరొక మహిళను ఉద్దేశించి,  నేను మీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను  అంటూ అండగా నిలుస్తున్నట్లుగా భావోద్వేగపూరితంగా ఆలపించారు. ఈ గేయం కేవలం ఒక వ్యక్తిగత ప్రేమకథ మాత్రమే కాకుండా, అనేక మంది మహిళలు ఎదుర్కొంటున్న మానసిక వేదనకు అద్దం పడుతోంది. తన స్నేహితురాలితో జరిగిన ఒక సంభాషణ నుంచి ఈ ఆలోచన పుట్టిందని, చాలామంది మహిళలు ఇలాంటి విషపూరిత సంబంధాల బాధితులేనని ఆమె స్పష్టం చేశారు. ఈ గీతం ద్వారా టేలర్ స్విఫ్ట్ కేవలం పాట పాడటమే కాకుండా, పాతకాలం నాటి ఒక కళంకిత పదాన్ని ఒక శక్తివంతమైన మహిళా సంఘీభావ ప్రతీకగా మార్చేశారని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్ గ్యావిన్ యామేయ్ (Gavin Yamey) వంటి నిపుణులు కొనియాడారు. మొత్తానికి,  పేషెంట్ జీరో  అనే పదాన్ని ఒక సామాజిక అస్త్రం నుండి మహిళల ధైర్యానికి ప్రతీకగా మార్చడంలో టేలర్ స్విఫ్ట్ విజయం సాధించారని చెప్పవచ్చు.     Taylor Swift new song, Taylor Swift latest track, Taylor Swift new release, Taylor Swift social media viral, Taylor Swift song reaction, Swifties new music, Taylor Swift chartbuster.  
నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది. ఆఫీస్ పని నుండి సోషల్ మీడియా స్క్రోలింగ్ వరకు ప్రతి ఒక్కరూ గంటల తరబడి ఫోన్ స్క్రీన్‌లనే చూస్తూ గడుపుతున్నారు. అయితే, ఇలా ఎక్కువ సేపు ఫోన్ వాడటం వల్ల కళ్లలో మంటలు, దురద, ఎరుపుదనం, నీరు కారడం మరియు అস্পষ্ট దృష్టి (బ్లర్డ్ విజన్) వంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. చాలా మంది ఈ సమస్యకు స్క్రీన్ బ్రైట్‌నెస్ లేదా బ్లూ లైట్ మాత్రమే కారణమని భావిస్తారు, కానీ దీని వెనుక పలు ఇతర ముఖ్యమైన ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. మన కంటి ఉపరితలంపై తేమను నిలబెట్టే ఒక సన్నని కన్నీటి పొర (టీర్ ఫిల్మ్) ఉంటుంది. మనం ప్రతిసారీ రెప్ప వాల్చినప్పుడు ఈ కన్నీరు కంటి అంతటా ప్రసరించి తేమను కాపాడుతుంది. అయితే, మనం ఫోన్ లేదా ఇతర డిజిటల్ స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు మన రెప్పపాటు రేటు (ബ్లింక్ రేటు) సాధారణం కంటే చాలా వరకు తగ్గిపోతుంది లేదా మనం పూర్తిగా రెప్ప వాల్చము. దీనివల్ల కంటిలోని కన్నీటి పొర ఎండిపోయి, కళ్లలో పొడిబారడం, చికాకు మరియు తీవ్రమైన మంట వంటి లక్షణాలకు దారితీస్తుంది. డిజిటల్ ఐ స్ట్రెయిన్ పై నిర్వహించిన వివిధ వైద్య సమీక్షలు మరియు పరిశోధనల ప్రకారం, పొడి కళ్ళు, తలనొప్పి మరియు నీరు కారడం వంటివి అత్యంత సాధారణ సమస్యలుగా వెల్లడయ్యాయి. బ్లూ లైట్ ప్రభావంపై ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ, కళ్ళు మంట పుట్టడానికి అసలు కారణం మనం ఫోన్ వైపు సుదీర్ఘ సమయం పాటు తదేకంగా చూడటం మరియు రెప్పపాటు తగ్గడమేనని నేత్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే తప్పుగా ప్రిస్క్రైబ్ చేయబడిన కళ్ళద్దాలు, గదిలోని పొడి గాలి, ఫ్యాన్లు లేదా ఎయిర్ కండిషనర్ల నుంచి వచ్చే గాలి కూడా కళ్లలోని తేమను ఆవిరి చేసి సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. పిల్లల్లో కూడా సరైన స్క్రీన్ అలవాట్లు లేకపోవడం వల్ల కంటి చూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఈ డిజిటల్ కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన మరియు ప్రభావవంతమైన జీవనశైలి మార్పులను పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా  20,20,20 రూల్  పాటించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ నుండి దృష్టి మళ్లించి, కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. అలాగే ఫోన్ చదువుతున్నప్పుడు లేదా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా చదువుతూ, స్పృహతో తరచుగా రెప్ప వాల్చడం అలవాటు చేసుకోవాలి. ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను గదిలోని వెలుతురుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవాలి. చీకటి గదిలో ఫోన్ వాడటం పూర్తిగా మానుకోవాలి. ఎండీ గాలి లేదా ఏసీ వెంట్లు నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవాలి. రాత్రి పడుకునే ముందు కనీసం గంటపాటు స్క్రీన్ వాడకానికి దూరంగా ఉండటం వల్ల కళ్ళకు తగిన విశ్రాంతి దొరుకుతుంది. కళ్ళలో మంట లేదా నొప్పులు దీర్ఘకాలికంగా వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నేత్ర నిపుణులను సంప్రదించి సమగ్ర కంటి పరీక్ష చేయించుకోవడం అత్యంత ఉత్తమం.     Phone screen eye strain, burning eyes from screen time, digital eye strain remedies, screen time eye protection, eye care tips for smartphone users, 20,20,20 rule eye strain, computer vision syndrome tips  
  నేటి వేగవంతమైన జీవనశైలిలో సరిగ్గా సమయానికి తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరిపడా నిద్రపోకపోవడం వంటి అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి అలవాట్ల వల్ల శరీరంలోని జీవక్రియలు దెబ్బతిని దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా మన శరీరంలో ఉండే వాత, పిత్త, కఫ అనే మూడు దోషాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడే వ్యాధులు మొదలవుతాయి. ఈ మూడు దోషాలు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదం సూచించే ముఖ్యమైన నియమాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. జీవనశైలి లోపాల వల్ల వచ్చే ముప్పు.. రోజువారీ జీవితంలో వ్యాయామం లేకపోవడం, వేళపాళ లేని ఆహారం తీసుకోవడం, మద్యం లేదా ఇతర అలవాట్లు ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోక్, అధిక బరువు, టైప్ 2 మధుమేహం , ఊపిరితిత్తుల సమస్యల వంటి అనేక తీవ్రమైన రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న వయస్సు నుంచే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని సరిదిద్దుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారంతో దోషాల నివారణ.. ఆయుర్వేద ప్రకారం సరైన ఆహారం అంటే కేవలం కొన్ని పదార్థాలు తినడం మాత్రమే కాదు. ఆహారంలో ఉండే రుచులు, గుణాలు , వాటి కలయికను కూడా అర్థం చేసుకోవాలి. ఆయుర్వేదంలో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉన్నాయి. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఈ ఆరు రుచులు తగిన పాళ్లలో ఉండేలా చూసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. ఆహారంలో తాజా కూరగాయలు, ఆయా కాలాల్లో దొరికే పండ్లు తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. సరియైన దినచర్య చాలా ముఖ్యం.. మంచి ఆరోగ్యం కోసం సరైన రోజువారీ అలవాట్లు కలిగి ఉండటం చాలా అవసరం. ఉదయాన్నే త్వరగా లేవడం, శరీరానికి నూనె మర్దన చేసుకోవడం, అభ్యంగన స్నానం , యోగా వంటి ప్రక్రియలు శరీరానికి విశ్రాంతినిస్తాయి.  ఉదయాన్నే ఆరోగ్యకరమైన టిఫిన్ చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యకరమైన శరీరం కోసం ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. యోగా , ధ్యానంతో ప్రయోజనాలు.. యోగా , ప్రాణాయామం చేయడం వల్ల శరీరం, మనస్సు , ఆత్మ సమన్వయంతో పనిచేస్తాయి. ఇవి శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడమే కాకుండా పట్టుత్వాన్ని, శారీరక బలాన్ని పెంచుతాయి. రోజూ సూర్య నమస్కారాలు, ఊపిరితిత్తుల వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది మూడు దోషాలను సమతుల్యంగా ఉంచి శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.                           *రూపశ్రీ.
మన కాళ్లకు సరైన రక్తప్రసరణ అందకపోతే నడవడం దగ్గర నుంచి రోజువారీ పనులు చేసుకోవడం వరకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కొంతమందికి కొద్దిదూరం నడవగానే పిక్కల్లో నొప్పి రావడం, పాదాల్లో తీవ్రమైన నొప్పి, కాళ్ల వాపు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ సమస్యలన్నీ ఒకే కారణంతో వస్తాయని భావించకూడదు. వీటి వెనుక రక్తనాళాలకు సంబంధించిన వివిధ సమస్యలు ఉండవచ్చు. కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గవచ్చు. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు పిక్కల్లో నొప్పి వచ్చి, విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గిపోవడం కాళ్ల ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడానికి సంకేతం కావచ్చు. అలాగే పాదాలు చల్లబడటం, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మరోవైపు, కాళ్లలోని సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేయడంలో సమస్య ఎదురైతే వెరికోస్ వెయిన్స్ (Varicose Veins) వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. కాళ్లలో వాపు, బరువుగా అనిపించడం, చర్మంపై ఉబ్బిన సిరలు కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. ధమనుల్లో రక్తప్రసరణ తగ్గడం, సిరల్లో రక్తం తిరిగి ప్రవహించడంలో సమస్యలు రెండూ వేర్వేరు పరిస్థితులు. ఈ వీడియోలో వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారు కాళ్లకు రక్తప్రసరణ తగ్గడానికి గల కారణాలు, కాళ్ల రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడినప్పుడు కనిపించే లక్షణాలు, వెరికోస్ వెయిన్స్ సమస్య గురించి వివరించారు. అలాగే రక్తప్రసరణను పరీక్షించడానికి ఉపయోగించే డాప్లర్ టెస్ట్ (Doppler Test) గురించి, సమస్య తీవ్రతను బట్టి అందుబాటులో ఉండే చికిత్సా విధానాల గురించి తెలియజేశారు. రక్తనాళాల్లో బ్లాకేజీలను తొలగించడానికి లేదా రక్తప్రవాహాన్ని మెరుగుపరచడానికి కొన్ని సందర్భాల్లో బెలూన్ యాంజియోప్లాస్టీ (Balloon Angioplasty), స్టెంట్ చికిత్స (Stent Treatment) అవసరమవుతాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ చికిత్సలు అవసరం ఉండవు. సమస్య ఎక్కడ ఉంది, ఎంత తీవ్రంగా ఉంది, రోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాల ఆధారంగా వైద్యులు చికిత్సను నిర్ణయిస్తారు. కాళ్ల నొప్పులను వయసు పెరగడం వల్ల వచ్చే సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారా? నడిచేటప్పుడు పిక్కల్లో నొప్పి రావడానికి రక్తప్రసరణ తగ్గడం కూడా కారణమవుతుందా? డాప్లర్ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? రక్తనాళాల్లో బ్లాకేజీ ఉంటే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి డాక్టర్ ఎస్. శ్రీకాంత్ రాజు గారి పూర్తి వీడియోను చూడండి. ముఖ్య గమనిక: కాళ్లలో నిరంతర నొప్పి, పాదాల రంగు మారడం లేదా మానని గాయాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. అకస్మాత్తుగా తీవ్రమైన కాలి నొప్పి, పాదం చల్లబడటం, పాలిపోయినట్లు లేదా నీలంగా మారడం, తిమ్మిరి లేదా బలహీనత కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి. ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. వైద్య పరీక్షలు, చికిత్సలకు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
శరీరంలో నీరసం, అలసట, చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, ఏకాగ్రత తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు కనిపిస్తున్నాయా? వీటికి విటమిన్ B12 లోపం కూడా ఒక కారణం కావచ్చు. అయితే, ఇలాంటి లక్షణాలు ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు. అసలు విటమిన్ B12 మన శరీరానికి ఎందుకు అవసరం? దాని లోపాన్ని ఎలా గుర్తించాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ డాక్టర్ స్వాతి విటమిన్ B12 ప్రాముఖ్యత, దాని లోపం వల్ల కనిపించే లక్షణాలు, నరాల ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి వివరిస్తున్నారు. అలాగే, శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారపు అలవాట్లను ఎలా మార్చుకోవాలి, విటమిన్ B12 అందించే ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. మరోవైపు, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడం వల్ల కొందరిలో కీళ్ల నొప్పులు, వాపులు, గౌట్ వంటి సమస్యలు రావచ్చు. మనం తీసుకునే ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మాంసాహారం ఎక్కువగా తినేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఈ అంశాలపై డాక్టర్ స్వాతి అందించే పోషకాహార సూచనలను తెలుసుకోండి. విటమిన్ B12 లోపం, యూరిక్ యాసిడ్ సమస్యలు రెండింటినీ ఒకే సమస్యగా భావించకుండా, వాటి కారణాలు, లక్షణాలు, ఆహార అవసరాలను విడివిడిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ వీడియోలో తెలుసుకోండి: విటమిన్ B12 లోపం వల్ల కనిపించే ముఖ్యమైన లక్షణాలు నరాల ఆరోగ్యం, జ్ఞాపకశక్తికి విటమిన్ B12 ఎందుకు అవసరం? విటమిన్ B12 అందించే ఆహార పదార్థాలు యూరిక్ యాసిడ్ పెరగడానికి దోహదపడే ఆహారపు అలవాట్లు గౌట్, కీళ్ల నొప్పులు, వాపుల విషయంలో ఆహారం పాత్ర యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఉపయోగపడే ఆహార మార్పులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పోషక లోపాలను నివారించుకోవడం ఎలా? గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. విటమిన్ సప్లిమెంట్లు లేదా యూరిక్ యాసిడ్ మందులను నిపుణులైన వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)