తమిళనాడు రాజకీయాలలో ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రి విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది. వరుస రోజుల్లో చోటుచేసుకున్న ఈ రెండు కీలక పరిణామాలు రాష్ట్ర,  జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సమీకరణాలకు దారితీస్తాయనే అంశంపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.   ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెన్నైలో జరిగిన భేటీలు   ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నివాసంలో సమావేశమై సుమారు గంటపాటు చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి ఒక కేఫ్‌కు వెళ్లి అల్పాహారం తిని, కాఫీ తాగారు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ సమావేశంలో వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలేమిటన్నది పూర్తిగా వెల్లడి కాలేదు.  అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.   ఈ సమావేశం జరిగిన మరుసటి రోజే చెన్నైలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూనమల్లి-వడపలని మెట్రో మార్గాన్ని ప్రారంభించగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్   పాల్గొని ప్రధానితో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. దాదాపు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఇద్దరు నేతలు కలిసి కనిపించడం ప్రభుత్వ పరమైన సమన్వయంలో భాగమని పరిశీలకులు భావిస్తున్నారు. రాహుల్‌తో రాజకీయ చర్చలు జరిపిన మరుసటి రోజే ప్రధాని మోదీతో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం విజయ్ అనుసరిస్తున్న   విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది.    కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతున్న విజయ్ పార్టీ తಮಿళ వెట్రి కజగం   భవిష్యత్తులో ఏ రాజకీయ కూటమితో నడుస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. కేవలం ఒక సమావేశం ఆధారంగా భవిష్యత్ రాజకీయ నిర్ణయాలను అంచనా వేయడం సాధ్యం కాదంటున్నారు.    రాష్ట్ర ప్రయోజనాల సాధనలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఎంత ముఖ్యమో, రాజకీయంగా స్వతంత్ర వైఖరిని ప్రదర్శించడం కూడా అంతే కీలకమని   అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు  కేంద్రంతో   సహకరిస్తూనే, విధానపరమైన అంశాలపై తమ స్వరాన్ని వినిపించే దిశగా విజయ్   అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మోడీ సమక్షంలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన నిధులపై విజయ్ గళమొత్తడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  ఏది ఏమైనప్పటికీ, రాహుల్ గాంధీతో స్నేహపూర్వక భేటీ,  ప్రధాని మోదీతో మెట్రో ప్రయాణం వంటి పరిణామాలు విజయ్ మాస్టర్ ప్లాన్‌లో భాగమని భావించాల్సి ఉంటుంది.   భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తమిళనాడు పాత్ర మరింత కీలకం కానున్న తరుణంలో, విజయ్ అనుసరిస్తున్న వ్యూహం ఆసక్తిగా మారింది.  కాంగ్రెస్‌తో రాజకీయ సహకారం వైపు అడుగులు వేస్తారా లేక అన్ని పార్టీలతోనూ సమదూరం పాటిస్తూ స్వతంత్ర రాజకీయాలను కొనసాగిస్తారా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   [Tamil Nadu Chief Minister Vijay Master Plan, Rahul Gandhi Meeting, Narendra Modi Metro Travel, Tamilaga Vettri Kazhagam, Chennai Metro, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి అధికారిక కూటమి సర్కాయ్ సిద్ధమవుతున్న వేళ, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో కూటమి అగ్రనేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన ఈ అత్యున్నత స్థాయి భేటీలో జనసేన  బీజేపీ ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొని విస్తృతంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పూర్తిగా ఖరారైన తరుణంలో, వివిధ పార్టీల మధ్య స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటును అత్యంత పకడ్బందీగా కొలిక్కి తేవడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఏజెండాగా కనిపిస్తోంది. ఈ కీలక భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి ప్రధాన కారణం, ఇప్పటికే సమన్వయ కమిటీ సుమారు మూడు పర్యాయాలు వేర్వేరు అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరపడమే. ఎల్లుండే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతుండటంతో, అభ్యర్థుల ఎంపిక, జిల్లాల వారీగా సీట్ల కేటాయింపు మరియు ఉమ్మడి వ్యూహంపై నేతలు త్వరితగతిన ఒక తుది నిర్ణయానికి రానున్నారు. ముఖ్యంగా తొలుత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత తీసుకురావాలని కూటమి నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని స్థానిక సంస్థల్లోనూ పునరావృతం చేయాలని, ఏ ఒక్క స్థానంలోనూ అభిప్రాయ భేదాలు రాకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని నేతలు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు  ఇతర స్థానిక సంస్థల పరిధిలో క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేస్తూ ఈ సీట్ల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. మూడు పార్టీల శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, పొత్తు ధర్మానికి ఎక్కడా విఘాతం కలగకుండా నాయకులు అడుగులు వేస్తున్నారు. ఎల్లుండి అధికారికంగా షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో, ఈ సమావేశం ద్వారానే కూటమి అభ్యర్థుల బలబలాలు, సీట్ల పంపకాలపై ఒక స్పష్టమైన స్పష్టత వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఇప్పుడు సర్వత్రా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.     [ Alliance Leaders Meeting, CM Chandrababu residence, local body elections ap, seat sharing telugu, amaravati political news, tdp bjp janasena alliance, MLC PVN Madhav, Minister Nadendla Manohar, Telugu One, Telugu News ]  
దేశ రాజకీయాల్లో చాలామంది నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే కార్యక్రమాలలో కేవలం ఆయనను ప్రశంసించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో చాలా మంది నేతలు మోడీకి పూర్తిగా సరెండర్ అయిపోయాన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అటువంటి సమయంలో  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు.  ఈ వేదికపై ప్రసంగించిన ముఖ్యమంత్రి విజయ్, కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సిన  5 వేల ఒక వంద   కోట్ల  నిధులను తక్షణమే విడుదల చేయాలని ప్రధాని మోదీని నేరుగా కోరారు. కోరారు అనడం కంటే డిమాండ్ చేశారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఈ నిధులు ఎంతో కీలకమని, ఎలాంటి ఆలస్యం లేకుండా వీటిని అందించాలని విజయ్ నొక్కి వక్కాణించారు.    నిధులతో పాటుగా తమిళనాడులోని పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కూడా సీఎం విజయ్ మాట్లాడారు.   చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. దీనితో పాటు రాష్ట్రంలో కీలకమైన జాతీయ రహదారుల విస్తరణ,  నూతన రోడ్డు  ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరారు.  రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో తన అభిప్రాయాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేసిన సీఎం..  ఎంతటి పెద్ద వేదికైనా రాష్ట్ర ప్రయోజనాల కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించారు. సామాన్యంగా ప్రధాని పాల్గొనే బహిరంగ సభలలో స్థానిక నాయకులు పొగడ్తలకే పరిమితమవుతారని, అయితే విజయ్ మాత్రం రాష్ట్ర నిధుల సాధన కోసం ఈ వేదికను వేదికగా మలుచుకున్నారని రాజకీయవర్గాలలో విజయ్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   [CM Vijay Demand Funds In Presense Of Narendra Modi, Tamil Nadu Politics, Developement Projects, Tamilnadu Developement,  Chennai Kanyakumari High Speed Train]
ALSO ON TELUGUONE N E W S
హీరో ఆర్య నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘హలో కాదల్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఆర్య హీరోగా నటిస్తున్న 40వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు నిఖిల్ మురళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆర్య సరసన నిఖిల విమల్, వైష్ణవీ చైతన్య కథానాయికలుగా నటిస్తున్నారు. విమానంలో నిఖిల విమల్, వైష్ణవీ చైతన్య మాట్లాడుకునే సన్నివేశాలతో టీజర్ ప్రారంభమవుతుంది. వైష్ణవీ చదువుతున్న పుస్తకంలోని ప్రేమకథ గురించి నిఖిల అడగడంతో కథలోని ఆసక్తికరమైన అంశాలు పరిచయమవుతాయి. వైష్ణవీ చెప్పే ప్రేమకథలో ఆర్య కీలకంగా కనిపిస్తాడు. చివర్లో తన భర్తతో ఉన్న ప్రేమకథ మరింత ఆసక్తికరంగా ఉంటుందని నిఖిల చెప్పడం టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను జీవా శంకర్ నిర్వహిస్తుండగా, బిను నేపోలియన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ‘ప్రణయ విలాసం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రచయితలు సునూ ఏవీ, జ్యోతిష్ ఎం ఈ సినిమా కథా రచనలో భాగమయ్యారు. దర్శకురాలు హలితా షమీమ్ అదనపు స్క్రీన్‌ప్లే, సంభాషణల బాధ్యతలు చేపట్టారు. ఆర్య, ఆయన భార్య సాయేషా తమ నిర్మాణ సంస్థ ది షో పీపుల్‌తో పాటు సిల్వర్ గ్రెయిన్ పిక్చర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ తమిళ సినిమా తెలుగులో ‘హలో ప్రేమ’ పేరుతోనూ విడుదల కానుంది. ప్రేమ, వినోదం, ప్రయాణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.     [Arya Hello Kadhal Movie, Hello Kadhal Teaser, Arya 40th Film, Vaishnavi Chaitanya Tamil Movie, Nikhila Vimal Hello Kadhal, Hello Prema Telugu Release, Hello Kadhal Release Date]
ఫుట్ బాల్ మాంత్రికుడు, రెప్పపాటులో ప్రత్యర్థుల బుర్రలకి అంతుచిక్కని విధంగా  గోల్ కొట్టే  'లియోనెల్ మెస్సీ' మైదానంలో ఆడుతుంటే, అందుకు తగట్టుగా బ్యాక్ గ్రౌండ్ లో  తెలుగు జానపద సాంగ్ వస్తు ఉంటే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటుందో కదా! ఇప్పుడు సోషల్ మీడియా ఆ విడియోతోనే ఇది నా రేంజ్ అని తెగ మురిసిపోతూ ఉంది. పూర్తి మ్యాటర్ చూద్దాం. మన తెలుగు నేల నుంచి పుట్టిన ఒక అచ్చమైన జానపద పాట ఏకంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటింది. సాధారణంగా గ్రామాల్లో, స్థానిక వేడుకల్లో మారుమోగే జానపద బాణీలు గ్లోబల్ స్టేజ్‌పై సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న "జిమ్ జిమ్ తార" (Jim Jim Taara) తెలుగు ఫోక్ సాంగ్ ఇప్పుడు ఏకంగా ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రాక్టీస్ సెషన్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ ఇంటర్ మయామి  ప్రాక్టీస్ గ్రౌండ్‌లో మెస్సీ మరియు ఇతర ప్లేయర్స్ ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్‌కు ఈ తెలుగు ఫోక్ బీట్‌ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.   "జుమ్ జుమ్ తార" అంటే ఏదో లోకల్ అనుకుంటివా, ఇది ఇంటర్నేషనల్ రేంజ్ అంటూ తెలుగు నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.  ఇది కూడా చదవండి: జైలర్ 2 vs రణబాలి: బాక్సాఫీస్ వద్ద ఆ హిస్టరీ ఆసక్తికరం    అమెరికాలోని ఎన్ఆర్ఐలు (NRIs) సైతం ఈ మాస్ కనెక్షన్‌ను చూసి ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి రీల్స్ మరియు ఎడిట్స్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం రూపొందించినప్పటికీ, మన ప్రాంతీయ సంగీతం గ్లోబల్ ఐకాన్ల వీడియోలకు సింక్ కావడం తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణంగా మారింది. కేవలం స్థానిక ఆడియెన్స్‌ను మాత్రమే కాకుండా, విదేశీ బీట్స్‌ను సైతం తనదైన జానపద శైలితో కట్టిపడేస్తున్న ఈ ట్రెండ్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా నిలిచింది. మన మట్టి వాసన ఉన్న జానపద పాటల జోరు చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు ఫోక్ మ్యూజిక్ మరింత ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని సినీ, సోషల్ మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   [Jim Jim Taara Song Viral Inter Miami Messi, Jim Jim Taara song, Telugu folk song viral, Lionel Messi Inter Miami, Jim Jim Tara trend, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
Television actress Niti Taylor has opened up about a disturbing casting couch experience from her early days in films, revealing that a South Indian director allegedly demanded sexual favours in exchange for a role. The actress recalled how the shocking proposal left her stunned and eventually pushed her away from the film industry. In a recent interview with Hauterrfly, Niti revealed that she had worked in two South Indian films. After completing her first film, the director approached her with an offer for another project. However, what initially appeared to be another professional opportunity took an uncomfortable turn when he allegedly told her that she would have to sleep with him to get the role. Niti said she was so shocked by the demand that she could not even confront the director. Instead, she immediately disconnected the call, blocked his number and informed her mother about the incident. She also recalled having seen the director with other women earlier but said she had never expected to face such a situation herself. The experience left a lasting impact on Niti, who decided against continuing her career in films at the time. She later established herself in television, earning popularity through shows such as Kaisi Yeh Yaariaan, Ghulam and Bade Acche Lagte Hain. Her latest revelations have brought attention back to the casting couch issue and the difficult choices aspiring actors can face while pursuing opportunities in the entertainment industry. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై నటి నీతి టేలర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ కొందరు మహిళా నటీమణులను లైంగికంగా వేధిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీతి టేలర్ కూడా దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక దర్శకుడు సినిమా అవకాశం పేరుతో తనను ఇబ్బందికరమైన కోరిక కోరాడని ఆమె తెలిపారు. నీతి టేలర్ తెలుగులో ‘మేం వయసుకు వచ్చాం’, ‘పెళ్లి పుస్తకం’ వంటి సినిమాల్లో నటించారు. దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్న సమయంలో తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వ్యక్తి, ఆ సినిమా పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం తనను సంప్రదించాడని ఆమె చెప్పారు. అయితే, ఆ దర్శకుడు ఫోన్‌లో మాట్లాడిన తీరు తనను షాక్‌కు గురిచేసిందని వెల్లడించారు. ఈసారి సినిమాలో అవకాశం కావాలంటే తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అతడు అడిగినట్లు నీతి తెలిపారు. ఆ మాటలు విన్న వెంటనే తనకు ఏం చేయాలో అర్థం కాలేదని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నటి గుర్తుచేసుకున్నారు. వెంటనే ఫోన్ కట్ చేసి, అతడి నంబర్‌ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించానని తెలిపారు. గతంలో ఆ దర్శకుడిని ఇతర మహిళలతో కూడా చూసినప్పటికీ, తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, దాని తర్వాత సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు నీతి టేలర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై మరోసారి చర్చకు దారితీశాయి. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించి దర్శకుడి పేరును ఆమె వెల్లడించలేదు.     [Niti Taylor Casting Couch, Niti Taylor Shocking Interview, South Director Casting Couch Allegations, Niti Taylor Telugu Movies, Niti Taylor Me Vayasuku Vacham, Casting Couch in Film Industry, Niti Taylor Latest News]
సూపర్ స్టార్ రజినీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండియన్ గా మరోసారి బాక్స్ ఆఫీస్ ని జీ హుజూర్ అనిపించడానికి వస్తున్నాడు. మరో వైపు విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ని వెంటబెట్టుకొని పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' తో వస్తున్నాడు. ఈ రెండు చిత్రాల ట్రైలర్స్ ఆసక్తిగా ఉండటం, డిఫరెంట్ జోనర్స్ కావడంతో అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.   ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాక మూవీ లవర్స్ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.సూపర్‌స్టార్ రజినీకాంత్ మాస్ మేనియా, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో రూపుదిద్దుకున్న 'జైలర్ 2'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్-టైమ్ రికార్డు సృష్టించడంతో, ఈ సీక్వెల్ కూడా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ రజినీకాంత్‌కు ఉన్న బలమైన మార్కెట్, బ్రాండ్ వాల్యూ ఈ సినిమాకు దసరా రేసులో అతిపెద్ద అడ్వాంటేజ్‌గా నిలుస్తోంది.  మరోపక్క  'రణబాలి' చిత్రం కూడా అంతే ధీటుగా బజ్ క్రియేట్ చేస్తోంది. 1800ల కాలంలో బ్రిటిష్ పాలన, రాయలసీమ ప్రాంతంలో జరిగిన ఒక చారిత్రక ఘట్టం నేపథ్యంలో రూపుదిద్దుకుంది. విజయ్ దేవరకొండ కేరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కగా రష్మిక కి ఉన్న గోల్డెన్ లెగ్ ఉపయోగపడుతుందనే మాటలు వినపడుతున్నాయి.   . దసరా పండుగ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో రెండు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ పరంగా భారీ స్పందన లభించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా.   అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'జైలర్ 2' వర్సెస్ 'రణబాలి' కలెక్షన్ల పోరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్, నెగెటివిటీ వస్తోంది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ తీవ్రంగా ఆక్షేపించారు. తన సినిమా రిలీజ్ సమయంలో కావాలనే కొంతమంది పెయిడ్ ప్రోమోషన్లు, ట్రోలింగ్ బ్యాచ్‌లను పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రతికూల కామెంట్లలో దాదాపు 90 శాతం మ్యానుఫ్యాక్చర్డ్ ట్రోలింగ్ అని, కావాలనే కొందరు రీల్స్ ద్వారా నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారని పక్కా డేటాతో ఘాటుగా వెల్లడించారు.      ఏదేమైనా 15 ,16 న  రజినీకాంత్ మాస్ చిత్రం, ఇటు టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ భారీ పీరియాడిక్ డ్రామా పోటీపడటం చిత్ర పరిశ్రమకి , ప్రేక్షకులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. విభిన్న జానర్లలో వస్తున్న ఈ రెండు చిత్రాలలో ఏది బాక్సాఫీస్ దగ్గర దసరా విన్నర్‌గా నిలుస్తుందో, ఏ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.  సినీ ప్రేమికులు, ట్రేడ్ సర్కిల్స్ లో అయితే ఏ చిత్రం బాక్స్ ఆఫీస్ బరిలో ముందు వరుసలో నిలుస్తుందనే క్యూరియాసిటి ఏర్పడింది.      [Jailer 2 vs Ranabaali, Jailer 2 vs ranabaali box office clash, Jailer 2, Ranabaali, Vijay Deverakonda, Rajinikanth, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
టాలీవుడ్‌ స్టార్‌ జంట విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న తమ కొత్త సినిమా ‘రణబాలి’ విడుదలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరూ తిరుమలకు చేరుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. సినిమా విడుదలకు ముందు ఇలా దైవదర్శనం చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన విజయ్‌, రష్మిక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ‘రణబాలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్శనం అనంతరం విజయ్‌, రష్మిక హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఈ వేడుకలో సినిమా గురించి చిత్ర బృందం మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రణబాలి’లో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించగా, రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపించనున్నారు. 19వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన చారిత్రక ఘటనలు, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాను రూపొందించారు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వీరుడి కథను ఇందులో చూపించనున్నారు. హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ ప్రతినాయకుడిగా నటించడం మరో ప్రత్యేకత. మరో విశేషం ఏమిటంటే.. విజయ్‌, రష్మిక నిజ జీవితంలో ఒక్కటైన తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం ‘రణబాలి’. గతంలో వీరిద్దరూ ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల్లో జంటగా నటించారు. ఇప్పుడు మరోసారి తెరపై జంటగా కనిపించనుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ-సిరీస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.     Vijay Deverakonda, Rashmika Mandanna, Ranabaali Movie, Vijay Rashmika Tirumala Visit, Ranabaali Pre Release Event, Ranabaali Release Date, Rahul Sankrityan, Arnold Vosloo, Mythri Movie Makers, Telugu Cinema News
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలుపెట్టేసింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ వసూళ్లు సాధిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం, నాలుగు రోజుల షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా ఇప్పటికే రూ.34.14 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో బ్లాక్ చేసిన సీట్లను మినహాయిస్తే అమ్ముడైన టికెట్ల విలువ రూ.29.86 కోట్లుగా ఉంది. తొలి రోజు షోలకే రూ.18.71 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవడం రజనీ క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ‘జైలర్ 2’కు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్ అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో టికెట్లకు మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు విదేశీ మార్కెట్లలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే ఈ స్థాయిలో బుకింగ్స్ నమోదవడంతో సినిమా తొలి రోజు వసూళ్లపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి లభించినట్లు తాజా కథనాలు వెల్లడించాయి. మొదటి వారం సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రోజుకు ఏడు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ నిర్ణయంతో విడుదల సమయంలో మరింత మంది ప్రేక్షకులకు సినిమా చూసే అవకాశం లభించనుంది. అయితే ఈ ప్రత్యేక అనుమతులు, టికెట్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్ పాత్రలో కనిపించనున్నారు. రమ్యకృష్ణ, యోగిబాబు, ఎస్.జే. సూర్య, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి భాగం సాధించిన విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు థియేటర్లలోనూ కొనసాగుతుందా? ‘జైలర్ 2’ తొలి రోజు ఎలాంటి వసూళ్లు సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.     [Jailer 2, Rajinikanth Jailer 2, Jailer 2 Advance Booking, Jailer 2 Box Office, Rajinikanth Movie, Jailer 2 Release Date, Nelson Dilipkumar, Anirudh Ravichander, Jailer 2 Collections, Jailer 2 Telugu News, Sun Pictures]
The makers of Jo Jo, presented by filmmaker Deva Katta, have unveiled Caution 1, introducing a raw, rustic world where the pursuit of diamonds sets the stage for romance, ambition and irreverent comedy. Written and directed by Kiran Jay Kumar and produced by Vijay Krishna Lingamaneni under the Vijayam banner, the film unfolds in the drought-hit diamond fields of Jonnagiri, where the promise of sudden fortune draws an unlikely group into an unconventional adventure. The teaser takes us to Jonnagiri, where a group of hopefuls descends on the diamond fields, convinced that the rains might have left behind a fortune. What follows is a chaotic hunt, with stones mistaken for potential riches and a man trying his luck at flirting. Their discoveries are put to the test by an examiner, who dismisses them as ordinary stones. While one hopeful refuses to give up, insisting that their lucky break will eventually come, the woman beside him has a far more direct response: “Clean your own ass!” The exchange captures the film’s unfiltered humour, where the dream of striking it rich comes with its own share of ridicule. Adding to the teaser’s promotional momentum, filmmaker and actor Tharun Bhascker called it an “excellent teaser” after watching it. His reaction offers an additional talking point as the film begins introducing its unconventional premise to audiences. At the heart of Jo Jo are two penniless dreamers and a fearless young woman chasing a life-changing diamond. Their quest soon becomes entangled with romance, greed, betrayal, danger and comic misadventures. As their ambitions collide with unpredictable circumstances, the possibility of sudden wealth threatens to turn their pursuit into a far more complicated adventure than they imagined. The film marks another collaboration between Deva Katta, Kiran Jay Kumar and Vijay Krishna Lingamaneni, who previously worked together on Mayasabha: Rise of the Titans. With Jo Jo, the team moves into a distinctly different tonal space, exploring a romantic comedy rooted in rural eccentricity and the absurdities surrounding an unlikely treasure hunt. Krishna Kamal plays Seenu, while Maahi Sri portrays Supraja. The ensemble cast includes Phanindra Devarapalli as Venkatesh, Prabhavathi as Vijayamma, Mahaboob Basha as Suri, Satish Devatte Tanjore as Rangasaami, Puduru Sharath Babu as Ramana and Makarand Deshpande as Mukesh Shah. The technical crew comprises Rohith Kumar as Director of Photography, Mahesh Shankar as Music Director and Madhav Kumar Gullapalli as Editor. The film’s lyrics are penned by Rehman, Srinivas Mouli and Ramachandra. With Caution 1, Jo Jo introduces a world where the pursuit of fortune brings together eccentric characters, unexpected confrontations and humour that refuses to play safe. The teaser offers an early glimpse of the film’s distinctive setting and comic sensibility, with further details about its release plans expected to follow. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అనంతరం లండన్, హైదరాబాద్‌లోనూ కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌కు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘బ్లడీ రోమియో’లో నాని పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు చెఫ్‌గా కనిపిస్తూ మరోవైపు హింసాత్మక గ్యాంగ్‌స్టర్‌గా ఉండే విభిన్నమైన పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. డార్క్ హ్యూమర్, స్టైలిష్ యాక్షన్ అంశాలతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ‘ది ప్యారడైజ్’లో రగ్డ్ లుక్‌లో కనిపించిన నాని, ఈ సినిమా కోసం రెట్రో స్టైల్‌లోకి మారడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని కొత్త లుక్‌లో ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, బ్లాక్ గాగుల్స్‌తో కనిపిస్తుండటం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో ఆయన సరసన ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. నాని, సుజీత్ తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. నాని నటనకు సుజీత్ స్టైలిష్ మేకింగ్, యాక్షన్‌తో పాటు డార్క్ హ్యూమర్ తోడైతే ‘బ్లడీ రోమియో’ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.     [Nani Bloody Romeo, Bloody Romeo Shooting Date, Nani Sujeeth Movie, Bloody Romeo Delhi Schedule, Nani New Movie, Sujeeth Upcoming Movie, Preethi Mukundhan, Prithviraj Sukumaran, Nani Retro Look, Telugu Cinema News]
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు సుహాస్ మరో ఆసక్తికరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి చేనేత మగ్గం, ఓ చీర చుట్టూ సాగే అందమైన ప్రేమకథలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు ‘హైడ్ & సిల్క్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ ప్రోమో చూస్తుంటే.. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. ‘హైడ్ & సిల్క్’ టైటిల్ ప్రోమోలో సుహాస్ చేనేత కార్మికుడిగా కనిపిస్తున్నారు. చీర నేయడాన్ని కేవలం వృత్తిగా కాకుండా ఓ కళగా చూపిస్తూ వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. చేనేత మగ్గంపై నేసిన చీరకు ఉండే ప్రత్యేకతను తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌ ద్వారా వివరించారు. “నేత అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు.. అదొక గొప్ప కళ” అనే భావనతో సాగే మాటలు ప్రోమోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి చీరకూ దాన్ని కట్టుకునే ఓ మహిళ ముందే నిర్ణయించబడి ఉంటుందనే కవితాత్మకమైన ఆలోచనతో కథలోని ప్రేమకోణాన్ని పరిచయం చేశారు. తాను మొదటిసారి నేసిన చీరను ఎవరు కట్టుకుంటారు? ఆమె ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? కనీసం ఒక్కసారైనా ఆమెను చూడగలనా? అనే ఆలోచనలతో సుహాస్ పాత్ర సాగించే ప్రయాణం ఈ ప్రేమకథకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నట్లు ప్రోమోతో హింట్ ఇచ్చారు. చీర ద్వారా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా మొదలవుతుందనే ఆసక్తిని రేకెత్తించారు. ‘లబ్బర్ పందు’, ‘డీసీ’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంజనా కృష్ణమూర్తి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సుహాస్ తండ్రి పాత్రలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కనిపించనున్నారు. రాజేంద్ర బాలా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్, మిస్రీలాల్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమృత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ‘మండాడి’ సినిమాలో విలన్ గా కనిపించిన సుహాస్.. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ప్రేమకథతో వస్తుండటం విశేషం. టైటిల్ ప్రోమోలో కనిపించిన కవితాత్మకమైన భావాలు, చేనేత నేపథ్యం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ చీర వెనుక దాగిన ప్రేమకథ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.  ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల జర్నీ.. కళ్యాణ్ బాబు నుంచి పవర్ స్టార్ వరకు.!       [Hide And Silk Title Promo, Hide & Silk Title Promo, Suhas Hide And Silk, Suhas Hide & Silk, Suhas New Movie, Sanjana Krishnamoorthy, Rajendra Bala, Tanikella Bharani, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆంధ్రా మరియు తెలంగాణ ఇళ్లలో కూరలు తినబుద్ధి కాకపోయినా, రొటీన్ వంటలతో విసుగొచ్చినా మనందరికీ ముందుగా గుర్తొచ్చే సాంప్రదాయ వంటకం అద్భుతమైన కంది పచ్చడి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు లేదా హడావిడిగా రుచికరమైన భోజనం చేయాలనుకున్నప్పుడు ఈ పచ్చడి అమృతంలా ఆదుకుంటుంది. కేవలం 10 నిమిషాల్లో ఎంతో సులభంగా సిద్ధమయ్యే ఈ కంది పచ్చడి తయారీ విధానం మరియు దీనికి కావలసిన కొలతలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ అచ్చమైన ఆంధ్రా స్టైల్ పచ్చడి తయారీ కోసం ప్రధానంగా పావు కప్పు కందిపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, కారానికి సరిపడా 15 నుండి 20 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. వీటితో పాటు పావు కప్పు కరివేపాకు, 1 టీస్పూన్ జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజులో వేడి నీళ్లలో నానబెట్టుకున్న చింతపండు, 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు మరియు రుచికి సరిపడా ఉప్పు అవసరమవుతాయి. తాలింపు కోసం 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ ఇంగువ, పావు టీస్పూన్ పసుపు సిద్ధం చేసుకోవాలి.    మొదటగా స్టవ్‌పై పాన్ పెట్టి పావు కప్పు కందిపప్పు వేసి సన్నటి సెగపై దోరగా, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 టీస్పూన్ మినపప్పు వేసి కాస్త వేయించిన తరువాత, 15 నుండి 20 ఎండుమిరపకాయలను జత చేయాలి. ఆపై పావు కప్పు కరివేపాకు వేసి అది క్రిస్పీగా మారేంత వరకు వేయించి, చివరగా 1 టీస్పూన్ జీలకర్ర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన చింతపండును దాని నీళ్లతో సహా, పొట్టు తీసిన 3 నుండి 4 వెల్లుల్లి రెబ్బలు వేసి, కాచి చల్లార్చిన నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ రోటి పచ్చడి లాగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పరిపూర్ణమైన రుచినిచ్చే తాలింపు సిద్ధం చేసుకోవాలి. దీనికోసం చిన్న కడాయిలో 1 నుండి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి, 1 టీస్పూన్ ఆవాలు, కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును ముందుగా సిద్ధం చేసుకున్న కంది పచ్చడిలో వేసి బాగా కలపాలి. కాచి చల్లార్చిన నీటిని వాడటం వల్ల ఈ పచ్చడి ఫ్రిజ్‌లో దాదాపు 10 రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది. పొగలు కక్కే వేడివేడి అన్నంలో ఈ కంది పచ్చడిని వేసుకొని, చెంచాడు స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని కలుపుకుని తింటే ఆ రుచి స్వర్గానికి బెత్తెడే దూరంలో ఉన్నంత ఆనందాన్ని ఇస్తుంది. పక్కన నంజుకోవడానికి ఉల్లిపాయ లేదా అప్పడం ఉంటే భోజనం మరింత అద్భుతంగా సాగిపోతుంది.     Andhra style Kandi Pachadi, Toor Dal Chutney recipe, 10 minute chutney recipe, authentic Andhra recipes, Kandi Pachadi for rice, traditional Telugu pachadi, quick dal chutney.  
ఉరుకుల పరుగుల ఆధునిక జీవనశైలిలో చాలామంది ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు పనులు, ఇంటి బాధ్యతలతో బిజీగా గడుపుతుంటారు. ఈ హడావుడిలో చాలామంది రాత్రి భోజనం చేసే సమయాన్ని అసలు పట్టించుకోరు. కొందరు చాలా ఆలస్యంగా రాత్రి 9 లేదా 10 గంటల తర్వాత భోజనం చేస్తుంటే, మరికొందరు తిన్న వెంటనే నేరుగా మంచంపై పడుకుంటున్నారు. అయితే ఇలాంటి చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం చేసే సమయం మన జీర్ణక్రియపై, నిద్ర నాణ్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఏ సమయంలో తింటున్నాం, పడుకునే ముందు ఎంత విరామం ఇస్తున్నాం అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. సాధారణంగా రాత్రి భోజనానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం 2 నుంచి 3 గంటల విరామం కచ్చితంగా ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఉదాహరణకు, మీరు రాత్రి 10 గంటలకు నిద్రపోవాలనుకుంటే, సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్యే మీ భోజనాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మనం భోజనం చేసిన వెంటనే పడుకున్నప్పుడు, జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహించే ప్రమాదం పెరుగుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, ఎసిడిటీ, పుల్లటి త్రేన్పులు, కడుపు ఉబ్బరం వంటి తీవ్రమైన అసౌకర్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా, రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం వల్ల శరీర సహజ సిద్ధమైన జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) సమతుల్యత దెబ్బతింటుంది. రాత్రి వేళల్లో రక్తపోటు (బీపీ) సహజంగా తగ్గాలి, దీనిని నైట్  టైమ్ డిప్పింగ్ అంటారు. కానీ లేట్ నైట్ డిన్నర్ లేదా ఆలస్యంగా తినడం వల్ల రాత్రివేళల్లో కూడా బీపీ తగ్గకుండా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇన్సులిన్ పనితీరు మందగించి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, రాత్రి 10 గంటలకు భోజనం చేయడం వల్ల సాయంత్రం 6 గంటలకు తినడంతో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు సుమారు 18 శాతం ఎక్కువగా పెరుగుతాయి మరియు రాత్రి సమయంలో కొవ్వు కరిగే ప్రక్రియ సుమారు 10 శాతం వరకు తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం మరియు బరువు పెరగడానికి దారితీస్తుంది. రాత్రి పూట మనం ఏం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నామనేది కూడా అంతే ముఖ్యం. రాత్రివేళల్లో అధికంగా కారం, మసాలాలు ఉన్న వంటకాలు, బాగా నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవడం వల్ల అజీర్ణం ముప్పు పెరుగుతుంది. అలాగే కాఫీ, టీ, డార్క్ చాక్లెట్లలో ఉండే కెఫీన్ కారణంగా నిద్ర పట్టడం ఆలస్యం కావచ్చు. భోజనం తర్వాత అధికంగా స్వీట్లు లేదా ఐస్‌క్రీమ్‌లు తీసుకోవడం ద్వారా శరీరంలోకి అదనపు కేలరీలు, చక్కెర చేరుతాయి. కాబట్టి రాత్రి భోజనం ఎప్పుడూ సమతుల్యంగా, తేలికపాటి ఆహారంతో ఉండాలి. అన్నం లేదా రొట్టెలతో పాటు కూరగాయలు, పప్పులు, కిచిడీ, గంజి, లేదా వెజిటబుల్ సూప్ వంటి తేలికగా అరిగే పదార్థాలను ఎంచుకోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామాలు లేదా వేగంగా నడవడం చేయకూడదు. కొద్దిసేపు నిశ్శబ్దంగా నడవడం లేదా ఆకలికి తగినట్లుగా మితంగా తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన నిద్రను సొంతం చేసుకోవచ్చు.     best dinner time for diabetes, dinner timing for blood pressure, early dinner benefits, blood sugar control rules, ideal meal times for health, managing hypertension naturally, dinner habits for health.
అధిక రక్తపోటు లేదా బీపీ సమస్యతో బాధపడుతున్నవారు తమ ఆహారపు అలవాట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, రక్తపోటును సహజంగా అదుపులో ఉంచుకోవడానికి ఏ పండ్ల రసాలు తాగాలనే విషయంలో చాలామందికి అనేక సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం దానిమ్మ జ్యూస్, బీట్‌రూట్ జ్యూస్ రెండూ అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ రెండింటిలోనూ గుండెకు మేలు చేసే విలువైన పోషకాలు, మొక్కల నుంచి లభించే సహజ రసాయన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అయితే రక్తపోటును తగ్గించే విషయంలో ఈ రెండింటి పనితీరు, ప్రభావం ఒకేలా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న ఆధునిక పరిశోధనల ప్రకారం, అధిక రక్తపోటును నియంత్రించడంలో బీట్‌రూట్ జ్యూస్‌కు మరింత బలమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీట్‌రూట్‌లో సహజసిద్ధంగా లభించే నైట్రేట్లు మన శరీరంలో ప్రవేశించిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. ఈ ప్రక్రియ ద్వారా రక్తనాళాలు సులభంగా విశ్రాంతి పొంది, రక్తప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తనాళాలపై పడే అదనపు ఒత్తిడి తగ్గి, బీపీ అదుపులో ఉండేందుకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, బీట్‌రూట్‌లో ఉండే బీటలైన్స్ అనే సహజ వర్ణద్రవ్యాలు శక్తివంతమైన. యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వివిధ అధ్యయనాల ప్రకారం, రోజుకు 70 నుంచి 250 మిల్లీలీటర్ల బీట్‌రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ ఉన్నవారిలో సిస్టోలిక్ బీపీ అనగా పై సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తేలింది. అయితే ప్రతి ఒక్కరి శరీర తత్త్వాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. మరోవైపు, దానిమ్మ జ్యూస్‌లో కూడా పాలీఫినాల్స్ వంటి బలమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఆంథోసయానిన్స్, ఎల్లాజిటానిన్స్ వంటి సమ్మేళనాలు ఉండటం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, వాపు సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం దానిమ్మ రసం తాగడం వల్ల సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ బీపీ రెండింటిలోనూ కొంత తగ్గుదల కనిపించింది. అయితే ఈ ప్రయోజనాలు సుమారు రెండు నెలల వరకు మాత్రమే కొనసాగినట్లు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా దానిమ్మ జ్యూస్‌లో పొటాషియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఉదాహరణకు ఒక కప్పు దానిమ్మ జ్యూస్‌లో సుమారు 533 మి.గ్రా. పొటాషియం ఉంటుంది, ఇది శరీర ద్రవాల సమతుల్యతకు తోడ్పడుతుంది. అయితే ఒక కప్పు దానిమ్మ జ్యూస్‌లో సుమారు 31.4 గ్రాముల చక్కెర కూడా ఉంటుందని గమనించాలి. కాబట్టి గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ కోసం ఈ జ్యూస్‌లను ఎంచుకునేటప్పుడు వాటిలోని పోషకాలతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, తీసుకునే మోతాదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం.     Pomegranate juice vs beetroot juice, high blood pressure juices, beetroot juice for hypertension, pomegranate juice BP benefits, lower blood pressure naturally, best juice for BP control, natural BP remedies.