తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్   కలిసి పోటీ చేయడం ఖాయమైంది. ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు జరిగింది. దీంతో పొత్తులో భాగంగా  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌  28 స్థానాలలో పోటీ చేయనుంది.  సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే కాంగ్రెస్ కు డీఎంకే 28 సీట్లతో పాటు ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా ఆఫర్ చేసింది. ఇందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో   కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది. మొత్తంగా ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.  అదలా ఉంటే.. తమిళనాడు ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగనుంది. డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు ఆప్ నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకాలపై ఆప్, డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనిపై తమిళనాడు ఆప్ కన్వీనర్ ఎస్ఏఎన్ వశీగరణ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే సమన్వయ కమిటీని కలిసామనీ, కొన్ని సీట్లు అడిగామని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడానికి బలమైన కూటమి అవసరమన్న ఆయన  గత పర్యాయం పార్లమెంటు ఎన్నికల్లో బలమైన విపక్ష కూటమి ఏర్పడిందని, అందులో ఆప్ కూడా ఉందని గుర్తుచేశారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తుతో  పోటీ చేస్తామన్న ఆయన, ఈ విషయంపై  ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం  కేజ్రీవాల్  డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో  చర్చిస్తారన్నారు.  
తెలంగాణ రాష్ట్ర పరిపాలన, భద్రతా వ్యవస్థ బలోపేతంపై కీలక చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (మార్చి 4) ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో  రాష్ట్ర భద్రతా పరిస్థి తులు, పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, మావోయిస్టుల లొంగుబాట్లు, పునరావాసం వంటి అంశాలపై చర్చ జరిగింది.  ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెంటన తెలంగాణ డీజీపీ  బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీ బి. సుమతి తదితర ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను, ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణలో అమలు చేస్తున్న వ్యూహాలను సీఎం ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి వివరించారు.  హైదరాబాద్ మహానగర విస్తరణతోపాటు డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణ కీలకమైందని సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపడుతున్న చర్యలు, అంతర్రాష్ట్ర మోసగాళ్లపై జరుగుతున్న ఆపరేషన్ల వివరాలను రేవంత్ అమిత్ షాకు పూసగుచ్చినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శిక్షణ పొందిన అధికారుల అవసరం పెరుగుతోందన్నారు.    ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా  ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.   రాష్ట్రంలో ఇటీవల అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నాయకుల అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చింది. గత రెండేళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టులు ఆయుధాలు వదిలి   జీవన స్రవంతిలో కలిశారు.   లొంగిపోయిన  మావోయిస్టులకు  ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ప్యాకేజీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల గురించి సీఎం ఈ భేటీలో అమిత్ షాకు వివరించారు.  మిగిలిన మావోయిస్టు నేతల లొంగుబాటుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కేంద్రం, రాష్ట్రం సమన్వయం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర  మరింత సహకారం అందించాలని కోరారు. ఈసమావేశంలో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోంమంత్రి సానుకూ లంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐపీఎస్ క్యాడర్ పెంపు, భద్రతా బలోపేతానికి అవసరమైన మద్దతు అంశాలపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా సీఎం రేవంత్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఈ భేటీతో రాష్ట్ర భద్రతా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విశాఖలో ఒకే వర లో రెండు కత్తులు అన్న రీతిన కూటమి నాయకుల వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో తెలుగుదేశం, జనసేన నాయకులు మధ్య పొత్తు సక్రమంగా లేదన్న మాట  బహిరంగంగా వినినిపిస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈ దశలో జీవీఎంసీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు  వీరంతా విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక  సమయంలో ఒక రకంగా పార్టీని ఫిరాయించారు అయితే ఈ కార్పొరేటర్లు అనుకున్న రీతిన కూటమి ధర్మాన్ని పాటించడం లేదు  దీనికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అధినాయకులు కారణం. నిజానికి ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన సీతం  రాజు సుధాకర్ ఉన్నారు ఈయన వెంట వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో తోపాటు టిడిపి కార్పొరేటర్లు కొందరు ఉన్నారు అదే సమయంలో  వైసీపీ నుంచి  జనసేనకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట కూడా కొందరు కార్పొరేటర్లు ఉంటున్నారు వీరందరూ కూడా తమతమ నాయకులకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు.   ఈ తరహాలో పార్టీ సభ్యత్వం నుంచి ఇతర వ్యవహారాల్లో కూడా తలో దిక్కు అడుగులు వేయడంతో కూటమి మధ్య సయోధ్య కరవైంది.    సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ  కొనసాగుతున్నది.  సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు.  ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కార్పొరేటర్ల పదవీకాలం మరొక రెండు వారాల్లో ముగుస్తోంది.  వీరిలో కొందరు నేరుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసి కూటమిలో కొనసాగుతుంటే... మరి కొందరు ఇండిపెండెంట్ లు వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతుగా నిలిచారు.  అయితే తమ పదవీకాలం ముగిసిన తర్వాత వార్డుల్లో ఏ తీరున వ్యవహరిస్తారన్న విషయం అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి పార్టీ సింబల్ పై తమకు సీట్లు కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు అయితే మేయర్ సీటు కోసం పార్టీ వీడి వచ్చిన తమకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీటు కావాలని ఇతరులు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో  నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో అని త్వరలో మాజీలు కాబోతున్న కార్పొరేటర్లు కలవర పడుతున్నారు. ముఖ్యంగా సీతం రాజు సుధాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కూటమి కార్పొరేటర్లు కలవర పడుతున్నారు మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ  పాలకమండలి విషయంలో కూడా నాయకులకు అన్యాయం జరిగినట్టు  లో లోపల మధనపడుతున్నారు.   కూటమి ధర్మానికి భిన్నంగా ఈ నాయకుల వ్యవహారం ఉండటం కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరుగుతోంది.  ఈ పరిస్థితుల మధ్య ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక రకంగా ఒక ఒరలో రెండు కత్తుల సమెతలా తయారైంది.   నిజానికి వైసీపీ నుంచి సీటు ఆశించిన సీతారామరాజు సుధాకర్,   వైసిపి  ఎమ్మెల్యే  అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడంలో కీలకంగా వ్యవహ రించారు. అంతమాత్రాన అతనికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి కార్పొరేటర్లకు అన్యాయం చేయలేమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. అదే సమయంలో సుధాకర్ కూడా అసలు తన ప్రమేయం లేకపోతే జనసేనకు ఇక్కడ అవకాశం ఉండదని అంటున్నారు. నాయకులు వాదన ఏ రకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉందని కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మదన పడుతున్నారు.
ALSO ON TELUGUONE N E W S
The team of D/O Prasad Rao Kanabadutaledhu, streaming on ZEE5, celebrated the remarkable success of the series with a grand success meet after it crossed 100 million streaming minutes within just one week of release. The emotionally charged series, directed by Poluru Krishna and produced by K. V. Sriram, has struck a chord with audiences for its intense performances and strong emotional core. The event brought together the cast and crew who shared their experiences and gratitude for the overwhelming response. Cinematographer K. Mahesh Kumar expressed his happiness about the reception and the collaboration behind the project. He said, “Good morning everyone. I’m really happy today. This is a hat-trick for producer Sriram and director Krishna, and I’m happy to be part of that hat-trick. Special thanks to Jayanth and all the artists who have been very supportive during the work. Thank you.” Actor Raag Satya became emotional while addressing the gathering and recalled predicting the success of the series during the pre-release event itself. Reflecting on the response from audiences, he said, “Hello everyone, a warm welcome to everyone especially the media. I fixed it at the pre-release event itself that there shall be a success meet and that day has arrived. I’m enjoying this success wholeheartedly. It released on Feb 27 and since that day from around 10 AM I’ve been getting continuous calls. Everyone has been praising it. Even I was unable to watch the episodes properly because the calls were so continuous. They specifically mentioned a couple of scenes that made them cry. One such scene is me controlling Bindu Chandramouli garu. My own sister connected to that scene a lot and became very emotional. I didn’t do it alone, the director made me do it. We actors are just like water — whatever vessel we are put into, the shape is decided by the director. Thank you Krishna. I and Sriram share nearly a 20-year relationship. We met during a shoot and since then we have stayed connected. A special thanks to the ZEE5 team, Jayanth and Anuradha garu*. *Rajeev Kanakala* was so good that he reminded me of my own father and I truly felt Vasanthika was like my own daughter-in-law.” Actor Dr. Prasad Rao spoke about how widely the series has resonated with viewers. “I will not be surprised if the ongoing success of this compels you to edit the series as a feature film. Today when I went to the bank on some work, the staff there spoke vividly about the series and how engaging it was and some even started identifying me because of it. The cinematographer did an amazing job and his combination with the director was excellent. It was really great working with Udaya Bhanu garu and Rajeev Kanakala.” Actor Koteswara Rao praised director Poluru Krishna for maintaining strong quality in the project. “Hello all. First of all a big thanks to the team because of whom we are standing here today. I’ve been working with Krishna from the series Recce. He is incredible at enhancing the quality of the project regardless of the budget. DOP Mahesh is also on the same wavelength as the director. Since COVID the audience’s taste has changed and they are looking for genuine entertainment. Director Krishna did a great job regarding that and the reason for the success of this series is that it feels genuine.” Actress Bindu Chandramouli spoke warmly about the experience of working on the project. “Hello all, we are lucky to be part of this web series. Thank you Krishna for choosing me. He has so much clarity of thought and making and that clarity really reflected when I saw the series. He is really a brilliant director. Vasanthika and I share a genuine bond and that reflected on the screen. Thank you sweetheart, she is a beautiful actress. Rajeev Kanakala sir was amazing. It looks like Krishna sir reminded everyone about the acting capacity of Rajeev sir through this series. Even we felt like someone had written something like this for us to perform. Udaya Bhanu garu was excellent and thanks to Sriram garu for being such a supportive producer. A special thanks to ZEE5 and Jayanth garu. They always encourage brilliant and versatile scripts. I’m glad to be part of such a thrilling and thought-provoking series that carries an important message.”   Actress Vasanthika thanked the media and audiences for supporting the series from the beginning and spoke about the relevance of its message. “First of all thanks to the media for gracing the event today and being very supportive since day one. I’m very happy about the responses and praises that have been flooding in. This series has a very important message and it is not restricted to anyone or two people. It is for everyone including parents and it addresses real issues that every family faces today. A special thanks to director Krishna garu for choosing me for this role and series. All the appreciation I get is because of Krishna garu. Thanks to Mahesh garu for showing me so well on screen. Rajeev garu has been immensely inspiring with his performance and our dynamic lady superstar *Udaya Bhanu garu* — I wish someday I become as brave as her. Special thanks to my producer and ZEE5. ZEE5 has become more like home to me and this has been a golden opportunity for my career.” Jayanth Raghavan, Head of Telugu Content at ZEE5, described the current phase as particularly exciting. “2026 ZEE5 journey is something else and we are calling it Fantastic February. The dance show Aata is doing great numbers on our platform and now D/O Prasad Rao Kanabadutaledhu has also joined that success. The title says Kanabadutaledhu but the series will be seen for a very long time. Its aesthetics and technical values stand out. Success today is not easy but family content never lets audiences down and we at ZEE5 will continue bringing such content.” Director Poluru Krishna thanked the media and the platform for supporting the project. “Special thanks to the media who came here today. You have taken the series so much closer to the audience and played a key role in this success. I should first thank *Jayanth* and *Anuradha garu* because of whom the project took this shape and then my producer *Sriram* who gave me so much freedom while working. In many calls I received people spoke less about me and more about Rajeev sir. He did a great job. Udaya Bhanu garu was very cooperative. Bindu Chandramouli garu* was phenomenal and everyone emoted during the shoot itself. Vasanthika’s reaction after the narration showed how enthusiastic she was for the role. A special thanks to Prabhakar and Kondal Rao who worked with me for the story and especially Siddhu and Kiranmayi who are the reason the background score came out so well.” Producer K. V. Sriram spoke about the emotional theme of the series and the father-child relationship at its core. “There might be a communication gap with parents but the connection is always there. Mothers may feel more friendly but fathers maintain a certain discipline and stature. That emotional gap can create issues and this series explores that space. It is about the protectiveness of a father towards his children and we felt it was important to show that sense of security for this generation. Krishna and I share a relationship of nearly twenty years and the success of this project is really a triangular success between Krishna, me and ZEE5.” Actress Udaya Bhanu said the response to the series brought her immense happiness. “Hello everyone, hope you all are doing well and we are all on cloud nine. When your work speaks you don’t need many words. My speech today is only gratitude. The happiness I’m feeling after this success has come after a very long time. Everyone gave 100% to this project but there was always a doubt whether it would reach the audience. Once it released I started receiving beautiful messages from everywhere and it made me very happy reading them. I’m indebted to Sriram for casting me and thank you director sir. My role is powerful and empathetic and everyone did a great job. It has been a long time since I worked with *Rajeev* and he is such a great actor.”   Actor Rajeev Kanakala thanked the media and praised his co-actors while reflecting on the emotional impact of the series. “First thanks to the media for coming here today and everyone standing here did great work. I want to specially thank the media for their wonderful reviews. They were quite boosting for all of us. I must speak about Bindu Chandramouli. It’s not easy to do emotional scenes. Her 11-year-old son passed away six months ago and regardless of that she showed up to work and delivered a great performance. Vasanthika was excellent. You can see the pressure of Swathi in her walk itself. It shows a very mature performance at such a young age. It has been a long time since I worked with Udaya Bhanu, maybe after 20–25 years. I was initially doubtful since she is known for funky roles but she really aced such a serious role and her monologue was very impactful. The final emotional moment was really touching. I cried a lot and realized that even I should loosen up and be more friendly with my kids.”   Q & A Session   Q. How was it for you while watching the series not just as an actor but also as a father?* Rajeev Kanakala: “I was into the character from my first shot itself. That’s not me. The director made sure it was not Rajeev but Prasad Rao. The final emotional moment was really touching. I cried a lot and also realized that even I should loosen up and be more friendly with my kids.” Q. Earlier you mentioned bringing your kids to the shoot. What was their reaction while watching the series? Udaya Bhanu: “We enjoyed a lot. Even after finishing the series we spoke for more than six hours and kept discussing it. My friends and acquaintances kept calling me and my kids were guessing what would happen in each episode. By the end of it even my husband and I became conscious of the message from the series and I’m very happy to be part of it.” Q. Everyone is speaking about the final episode and many say it feels like a one-man show. How did you feel about it during narration?* Rajeev Kanakala: “I was excited during the narration itself and I knew how powerful the finale would be. Even though the sequence is only two or three minutes the director took an entire day to shoot it because he was very keen about the details and that is why it had such a strong impact.” D/O Prasad Rao Kanabadutaledhu is an emotionally charged drama that explores the complex relationship between a father and his daughter, weaving themes of protection, misunderstanding, and the emotional distance that can sometimes grow within families.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తన కెరీర్ ప్రారంభంలోనే చేసిన ‘మహానగరంలో మాయగాడు’ చిత్రం నటుడుగా చిరంజీవికి మంచి పేరు తెచ్చింది. చిత్ర విచిత్రమైన సన్నివేశాలు, ట్విస్టులతో సాగే సినిమా ఇది. విజయబాపినాడు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్‌గా నటించారు. రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, నూతన్‌ప్రసాద్, సంగీత, గిరిబాబు ఇతర ముఖ్యపాత్రల్లో క‌నిపిస్తారు. ఈ సినిమా టైటిల్‌ని బట్టి ఇది ఒక కామెడీ సినిమాలా అనిపించవచ్చు. కానీ, ఇందులో బలమైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన సస్పెన్స్ మరియు ఒక సామాన్యుడు వ్యవస్థను ఎలా ఎదిరించాడనే కథాంశం ఉంది. 100 రూపాయల నోటుతో బీడీ వెలిగించే అహంకారం నుండి, ఒక హత్య కేసులో ఎస్పీని బ్లాక్ మెయిల్ చేసే కుట్ర వరకు.. ఈ కథనం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కథలోకి వెళ్తే.. ఈ సన్నివేశం ఒక వింతైన పాత్రతో మొదలవుతుంది. తన గొప్పతనాన్ని చాటుకోవడానికి హోటల్‌లో సప్లయర్ ముందు ఏకంగా 100 రూపాయల నోటును వెలిగించి బీడీ కాల్చుకునే ఒక వ్యక్తి.. తనను తాను ‘101 జిల్లాలకు ఎదవను’ అని గర్వంగా చెప్ప్పుకుంటాడు. ఈ పాత్రలో ఒక రకమైన అమాయకత్వం, మరికొంత అహంకారం కనిపిస్తాయి. బయట ఇంత సీన్ క్రియేట్ చేసినా, ఇంట్లో తన భార్య దగ్గర మాత్రం అతనికి చుక్కెదురు. క్లబ్‌లో మిగిలిపోయిన ఎంగిలి కూడు తినమని ఆజ్ఞాపించే భార్య ముందు అతను ఎంత నిస్సహాయుడో చూస్తే జాలేస్తుంది. ఇక్కడే కథలోకి విజయశాంతి ప్రవేశిస్తుంది. భర్తను హీనంగా చూసే భార్యకు ఆమె ఇచ్చే కౌంటర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. ‘ఒక మనిషి తప్పు చేస్తే శిక్షించవచ్చు, కానీ బూటు కాళ్లతో తన్నడం పెళ్ళాం లక్షణమేనా?’ అంటూ ఆమె అడిగే ప్రశ్నలు సమాజంలో భార్యాభర్తల గౌరవప్రదమైన సంబంధాన్ని గుర్తుచేస్తాయి. తన భర్తను అంతలా అవమానిస్తున్నా భరిస్తున్నాడే తప్ప, అతడికి ఉండాల్సిన కనీస గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ కామెడీ, ఎమోషన్స్ వెనుక ఒక భయంకరమైన కుట్ర దాగి ఉంది. చంచల్ అనే అమ్మాయిని చంపేసి, ఆ శవాన్ని మాయం చేసి, ఎస్పీ స్థాయి అధికారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వైనం బయటపడుతుంది. చంచల్ చనిపోయిందని అందరూ నమ్ముతారు, కానీ నిజానికి ఆమె బతికే ఉందనే వాస్తవం మన హీరో చిరంజీవికి తెలుస్తుంది. ఒక పెద్ద అధికారి తన అల్లుడిని కాపాడుకోవడానికి, చనిపోయిన శవం ముఖాన్ని గుర్తుపట్టలేకుండా చెక్కి పడేసి, అది చంచల్ శవమేనని నమ్మించే ప్రయత్నం చేస్తారు. చట్టాన్ని, వ్యవస్థను తప్పుదోవ పట్టించే ఇలాంటి నేరగాళ్ల గుట్టు రట్టు చేయడానికి హీరో ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ‘నా బావ నిర్దోషి అని నిరూపిస్తాను, చంచల్‌ను మీ ముందు హాజరుపరుస్తాను’ అని హీరో చేసే ప్రతిజ్ఞ ప్రేక్షకులలో ఉత్కంఠను పెంచుతుంది. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే సందేశంతో కూడిన ఈ ఆసక్తికరమైన వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  -కుర్చీలో నుంచి పడబోయిన నాగ చైతన్య  -సోషల్ మీడియాలో పిక్స్ వైరల్  -అభిమానుల కంగారు  తండేల్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన యువసామ్రాట్ 'నాగచైతన్య'(Naga Chaitanya)ఈ సారి కూడా హిట్ విషయంలో తగ్గే ప్రసక్తే లేదని 'వృషకర్మ'(VrushaKarma)తో శర వేగంగా ముస్తాబవుతున్నాడు. హిట్ విషయంలో తగ్గేదే లేదని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు వృషకర్మ ని తెరకెక్కిస్తుండటం. ఈ రోజు చిత్ర యూనిట్  గ్లింప్స్ ని రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఇందుకు వేదికగా నిలవగా అభిమానులు భారీగా పోటెత్తారు. కానీ అదే అభిమానులని సదరు వేడుక ఆందోళనకి గురి చేసింది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం గ్లింప్స్ ఈవెంట్ కి నాగ చైతన్య కూడా హాజరయ్యాడు. అభిమానులని తన మాటలతో ఉత్తేజపర్చడమే కాకుండా సినిమా గురించి పలు విషయాలు చెప్పాడు. అనంతరం మీడియాతో ముఖాముఖి కార్యక్రమానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సందర్భంగా స్టాఫ్ కొంత మంది కుర్చీలని వేశారు. అందులోని ఒక కుర్చీలో నాగ చైతన్య కూర్చోబోతుంటే కుర్చీ ఒక వైపుకి వంగిపోయింది. దీంతో చైతన్య ఒక్కసారిగా వెనక్కి పడిపోయాడు. వెంటనే అభిమానులతో పాటు అక్కడున్న వారందరు టెన్షన్ పడ్డారు. చైతన్య కి కార్తీక్ దండు(karthik dandu)చేయి అందించడంతో పైకి లేచాడు. ఆ తర్వాత యధావిధిగా మీడియాతో వృషకర్మ గురించి ముచ్చటించాడు. also read: The paradise: ఆయా షేర్ స్టెప్ వెనకున్న అసలు నిజం బయటపడింది ఇక సుమారు నిమిషం యాబై సెకన్ల నిడివితో ఉన్న గ్లింప్స్ ని చూస్తుంటే సెల్యులాయిడ్ పై  మైథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ రూపంలో ఒక అద్భుతం జరిగే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది. రెండు వెరీయేషన్స్ లో నాగచైతన్య కనిపిస్తుండగా అతేంద్రియ శక్తీ మేల్కొన్నప్పుడు, సృష్టి దర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మ ని ఎంచుకుంటుంది అనే డైలాగ్స్ మూవీపై మరింత ఆసక్తిని కలుగచేసే విధంగా ఉన్నాయి. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా హిట్ చిత్రాల భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary)హీరోయిన్ గా చేస్తుంది.           
Sree Vishnu, widely regarded as the King of Entertainment, continues to demonstrate his growing box office potential. He has built immense confidence among audiences through his diverse script choices and consistent delivery of high-quality entertainers. Proving this trust once again, his latest release, Vishnu Vinyasam, has successfully outperformed all trade expectations. The film's theatrical run began with mixed reports during the early morning shows. However, the box office trajectory quickly shifted by the evening and night shows as family audiences flocked to the theaters. Despite the initial underwhelming word-of-mouth, viewers chose to rely on their trusted star, seeking the spectacular cinematic experience Sree Vishnu is known to deliver. Defying early trade predictions, the movie collected a solid gross of over Rs. 19.2 crores worldwide in just six days, successfully achieving its breakeven target across all territories. Audiences were thoroughly impressed by Sree Vishnu's effortless comic timing and ease in dialogue delivery. His engaging chemistry with leading lady Nayan Sarika, along with comedian Satya's hilarious performance, served as major crowd-pullers. Directed by Yadunaath Maruthi Rao and produced by Sumanth G Naidu, the remarkable commercial recovery of Vishnu Vinyasam firmly establishes Sree Vishnu's impeccable star power. Riding high on this box office triumph, the actor is now gearing up for the release of his next project, Mrityunjay, hitting screens tomorrow.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -కొనసాగుతున్న ఆయా షేర్ ప్రభంజనం -హుక్ స్టెప్ ని ఒక రేంజ్ లో చేసిన నాని  -అసలు నిజం ఇదే   ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఏ రీల్ చూసినా 'ఆయా షేర్'(Ayaa sher)సాంగ్ ప్రభంజనం కనిపిస్తుంది. నాచురల్ స్టార్ నాని(Nani)లా స్టెప్ వేసి లైక్స్ పొందాలని చూస్తున్న ఆశావాహులకైతే లెక్కే లేదు. అంతలా సదరు సాంగ్ సినీ ప్రేమికుల్లోకి, సోషల్ మీడియా ప్రేమికుల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది. ఇందుకు నాని, అనిరుధ్ ఎంత కారణమో నాని చేత స్టెప్స్ వేయించిన  డాన్స్ మాస్టర్ సుధన్ మాస్టర్  అంతే కారణం. సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన ప్రతిభని ప్రపంచానికి తెలిసేలా చాటిచెప్పిన సుధన్ మాస్టర్ గురించి పలు ఆసక్తి కర విశేషాలని ఎక్స్‌క్లూజివ్ గా మా తెలుగు వన్ అందిస్తుంది సుదాన్ కి  డాన్స్ మాస్టర్ గా అవకాశం అంత సులభంగా రాలేదు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు. ఆర్ఆర్ఆర్ నాటునాటు ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర పదకొండు సంవత్సరాలు పని చేసాడు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత పారడైజ్ తో అవకాశం వచ్చింది. నాని నుంచే వచ్చిన  'దసరా' సినిమాకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసాడు. ఆ సమయంలో సుధన్ ప్రతిభని  దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)గుర్తించి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్‌ గా ఫస్ట్ మూవీకే నాని లాంటి బడా  హీరోతో, భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం నిజంగా  ఆయన టాలెంట్ లో దాగి ఉన్న గొప్ప విషయం అని చెప్పవచ్చు.     ఆయా షేర్ సాంగ్ కి సంబంధించిన కొన్ని రహస్యాలని కూడా సుదన్ మాస్టర్ చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడుతు సాంగ్ లో నాని గారి లుక్ ఎంత కొత్తగా ఉందో తెలిసిందే. కానీ  మేకప్ వేసుకోవడం అంతకంటే కష్టం. ఆ గెటప్ కోసం దాదాపు ఒకటి నుండి రెండు గంటల సమయం పట్టేది. జడలు మరియు మేకప్ వల్ల నాని గారికి ఎంతో పెయిన్ వచ్చినా,  భారీ గెటప్ వేసుకుని కదలడం కష్టమైనా అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. పూర్తి ఏకాగ్రతతో స్టెప్స్ నేర్చుకోవడానికి మూడు రోజులు కేటాయించారు. ప్రాపర్టీస్ సెట్ చేయడం,  జనాన్ని నిలబెట్టడం వంటి పనుల వల్ల ఒక్కో షాట్‌కి దాదాపు 30 నుండి 40 నిమిషాల సమయం పట్టేది.  కొన్ని స్టెప్స్ బాలీవుడ్ నుండి కాపీ చేశారనే విమర్శలు వస్తున్నాయి. మనం ఒక స్టెప్‌ని కాపీ చేయాలన్నా, ఇన్‌స్పైర్ అవ్వాలన్నా ముందు అది చూసి ఉండాలి. కానీ నేను ఆ స్టెప్ చూడలేదు. కొన్నిసార్లు కొరియోగ్రాఫర్లకి సిమిలర్ థాట్స్ రావచ్చు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర 11 ఏళ్లు పని చేశాను. అటువంటి ఫ్లోర్ మూమెంట్స్ నాకు కొత్తేమీ కాదు. అనిరుధ్ గారు ఇచ్చిన మ్యూజిక్ వల్లనే కొరియోగ్రఫీ చేయడానికి మరింత ఎనర్జీ వచ్చింది. ఒక సాధారణ పాటని  కూడా మాస్ సెలబ్రేషన్ సాంగ్‌గా మార్చేస్తుందని, ఈ సాంగ్ విషయంలో అదే జరిగిందని సుధన్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ప్యారడైజ్ ఆగష్టు 21 న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. also read: Ustaad baghat singh: ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం.. మరి ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి!  సుధన్ మాస్టర్  మాటలని బట్టి ఒక కళాకారుడి వెనుక ఉండే ఏళ్ల తరబడి శ్రమ, పట్టుదల ఎలా ఉంటుందో సుధన్ మాస్టర్ ప్రయాణం చూస్తే అర్థమవుతుంది. 'ఆయా షేర్' కేవలం ఒక సాంగ్ మాత్రమే కాదు, ఎంతోమంది సాంకేతిక నిపుణుల కష్టమని కూడా అర్ధమవుతుంది. ఇక  ప్యారడైజ్  కి సంబంధించిన మరిన్ని న్యూస్ అప్ డేట్స్ మా నుంచి వస్తూనే ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా తెలుగు వన్ సినిమా(Telugu One Cinema) ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టడంలో కూడా లేటు చెయ్యద్దు.  
Director Abhishek Nama showcases his remarkable vision and grand scale filmmaking with the upcoming pan-Indian movie, Nagabandham. Featuring leading stars Virat Karrna, Nabha Natesh, Iswarya Menon, Jagapathi Babu, and Mahesh Manjrekar, the film is already making waves.  The thrilling teaser received huge applause nationwide, raising anticipation to new heights among moviegoers. Produced by Kishore Annapureddy and Nishitha Nagireddy, the project is expected to set fresh benchmarks in Indian cinema.   Audiences will soon be captivated by the film's maiden single, "NAMO Re," officially launching on March 15th at 11:11 AM. This highly awaited release serves as a beautiful tribute to Lord Narayana. It deeply reflects the powerful spiritual themes that drive the story, preparing fans for a truly divine cinematic journey.   The visual highlight of "NAMO Re" is an epic sequence featuring 1,000 dancers. Renowned choreographers Ganesh Acharya and Shrasti Verma have created a stunning routine celebrating diverse Indian dance forms.  Musicians Junaid Kumar and Abhe crafted a dreamy soundscape, matched by Sriharsha Emani’s inspiring lyrics. Powerful vocals from Sindhuja Srinivasan and Aishwarya Daruri bring this devotional masterpiece alive. Behind the scenes, a talented crew ensures sheer technical perfection.  Cinematographer Soundar Rajan S and editor RC Pranav are shaping the movie's artistic vision, while production designer Ashok Kumar crafts a visually spectacular world. Fans should watch social media for more teasers as this rich blend of spirituality, music, and dance rapidly approaches its release.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Yuvasamrat Naga Chaitanya Akkineni is not an outspoken person but he made a big statment about his upcoming mythical epic, Vrushakarma. The adventure film's spectacular glimpse was recently launched amidst great excitement from fans. Chaitanya's stunning transformation and athletic new look have quickly become the talk of the town. The teaser is receiving massive applause nationwide for its rocking background score, grand visuals, intriguing production design, and director Karthik Dandu's brilliant vision. Speaking at the launch event, director Karthik Dandu promised that he is crafting the best film of Chaitanya's career. He shared that every filmmaker dreams of delivering a memorable masterpiece for their star, and he is determined to achieve just that. He further added that the movie's scale and execution will be world-class, with producers BVSN Prasad and Sukumar offering their complete backing to the massive project. Naga Chaitanya expressed his immense happiness and pride in being part of such a high-budget mythical adventure, a genre he has always wanted to explore. He admitted he initially wondered how the team would translate their massive vision onto the screen, noting that the glimpse is just a small sample of what is to come. Most notably, he confidently stated that the film's climax will set a brand new benchmark in Indian cinema. The actor also shared his thrill at working with Laapata Ladies fame Sparsh Srinivastava, praising his performance and unique character. Furthermore, he took a moment to wish the leading lady, Meenakshi Chaudhary, a very happy birthday. Currently trending on YouTube, the Vrushakarma glimpse, elevated by Ajaneesh Lokanath's gripping music, has significantly raised the anticipation for this exciting Pan-Indian film.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ప్రస్తుతం తెలుగు సినీ లోకంలో ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతోంది... అదే 'పెద్ది'(Peddi). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సన, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా "రయ్ రయ్ రా రా" పాట విడుదలైన తర్వాత, ఈ సినిమా సృష్టించబోయే ప్రభంజనం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. 'రయ్ రయ్ రా రా' సాంగ్ కి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో తాజాగా అనంత శ్రీరామ్(Anantha Sriram) 'తెలుగువన్'కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కథలోని లోతు - అనంత శ్రీరామ్ నమ్మకం:  గీత రచయిత అనంత శ్రీరామ్ ఈ సినిమా గురించి చెబుతూ ఒక అద్భుతమైన మాట అన్నారు. "పెద్ది సినిమా చూసిన తర్వాత ఆ కథ ప్రేక్షకులను పది రోజుల పాటు వెంటాడుతూనే ఉంటుంది" అని ధీమా వ్యక్తం చేశారు. అనంత శ్రీరామ్ నమ్మకాన్ని బట్టి చూస్తే.. దర్శకుడు బుచ్చిబాబు పెద్ది కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారని అర్థమవుతోంది.   బుచ్చిబాబు పనితీరు:  దర్శకుడు బుచ్చిబాబు గత నాలుగు ఏళ్లుగా ఈ ఒక్క కథ మీదనే ప్రాణం పెట్టి పని చేస్తున్నారని, 24 శాఖలను సమన్వయం చేసుకుంటూ ఒత్తిడిలోనూ చిరునవ్వుతో పని చేస్తున్నారని కొనియాడారు. రామ్ చరణ్ డాన్స్:  'రయ్ రయ్ రా రా' పాట విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్ సాధించిందని, అందులో రామ్ చరణ్ గారి డాన్స్ అద్భుతంగా ఉండటం వల్ల అందరి కళ్ళు పాటపై పడ్డాయని చెప్పారు. పాటల సంఖ్య:  ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండవచ్చని, ప్రస్తుతానికి 4 పాటలు అద్భుతంగా వచ్చాయని ఆయన తెలిపారు. తెలుగు భాషా మాధుర్యం - ఒక సవాలు:  నేటి కాలంలో పాటల్లో తెలుగు తగ్గిపోయి ఆంగ్ల పదాల వాడకం పెరిగిపోతోందనే విమర్శ ఉంది. కానీ 'పెద్ది' సినిమాలో ఒక విప్లవాత్మక మార్పు కనిపిస్తోంది. ఇంత పెద్ద గ్లోబల్ స్టార్ సినిమాలో, ఏఆర్ రెహమాన్ వంటి సంగీత దర్శకుడి పర్యవేక్షణలో వచ్చిన పాటలో ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా రాయడం ఒక గొప్ప సవాలుగా నిలిచింది. ఈ సినిమా 1990ల నేపథ్యంలో సాగడం వల్ల, స్వచ్ఛమైన తెలుగు పదాలతో పాటలు రాయడానికి అవకాశం దక్కిందని, ఇది ప్రేక్షకులను తప్పకుండా కదిలిస్తుందని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు. సినిమా మరియు సమాజం:  సమాజంలో మనం ఎలా మాట్లాడుతున్నామో సినిమాల్లో కూడా అదే ప్రతిబింబిస్తుందని, అందుకే మన భాషను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. "సినిమాకి సమాజం అద్దం లాంటిది, సమాజానికి సినిమా భూతద్దం లాంటిది" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా "పెద్ది" సినిమా 90ల కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని మరియు భాషా పరంగా చాలా స్వచ్ఛంగా ఉంటుందని అర్థమవుతోంది. అనంత శ్రీరామ్ పూర్తి ఇంటర్వ్యూను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ లో వీక్షించండి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం, సినిమా ప్రపంచంలోని ఇలాంటి ఎన్నో విశేషాలు, ఇంటర్వ్యూలు మరియు తాజా వార్తల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.  
  -షాకింగ్ న్యూస్ వెల్లడి చేసిన మైత్రి  -ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి  -మార్చి నెల ఏం జరగబోతుంది ప్రెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కోట్లు ఇచ్చినా ఆ ఆనందాన్ని కొనలేం. దీంతో మార్చి నెల పవన్, పవన్ ఫ్యాన్స్ మంత్ గా మారే అవకాశం ఉంది. అందుకు వేదికగా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఆ ఆనందకర వార్త ఏంటో చూసేద్దాం.  ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat singh)ఈ నెల 26 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.  కానీ పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. ఏంటి నిజమేనా అని అనుకుంటున్నారా! అవును నిజమే.. అనుకున్న డేట్ కంటే ముందే మార్చి 19 న వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనుంది. ఈ మేరకు  తాజాగా ఉస్తాద్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్  వీకెండ్స్, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మధ్య కాలంలో చాలా పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ వరకు వచ్చి మళ్ళీ వాయిదా పడి కొంచం వెనక్కి జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. పవన్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఒక ఉదాహరణ. ఇలాంటి టైంలో ఉస్తాద్ ఇంకొంచం ముందుకు జరగడం అంటే అభిమానుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక 'గబ్బర్ సింగ్' తరువాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్(Harish Shankar)కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి కంటెంట్‌కి అద్భుతమైన స్పందన లభించింది. అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతు భారీ బజ్ సృష్టించాయి. దేఖ్ లేంగే సాలా, ఆరా ఆఫ్ ఉస్తాద్’సాంగ్స్ అయితే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.  also read:  ప్రముఖ హీరోయిన్ కి అత్యాచార బెదిరింపులు.. ధురంధర్ గుర్తుంది కదా   సిల్వర్ స్క్రీన్ కూడా భారీ ఆశలతో ఎదురుచూస్తున్న ఉస్తాద్ లో శ్రీలీల(Sreeleela),రాశి ఖన్నా(Raashii Khanna)హీరోయిన్స్  కాగా భారీ కాస్టింగ్ నే స్క్రీన్ పై మెరవనుంది. రీసెంట్ గా నేపథ్య సంగీతం బాధ్యతలని థమన్ కి అప్పగించారు. దేవిశ్రీ ప్రసాద్(Devi Sriprasad)బిజీగా ఉండటమే అందుకు కారణం.         
లోకంలో అమ్మ ప్రేమకు మించినది ఏదీ లేదు. ఆ అమృత సమానమైన ప్రేమకు దూరమైన బిడ్డలు పడే వేదన వర్ణనాతీతం. కళ్ళ ముందు కదలాడే రూపం లేకపోయినా, ఎక్కడో దేవుడి దగ్గర ఉన్న తన తల్లి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆశపడే ఒక పసివాడి అమాయకత్వం, ఆ పసివాడి జీవితంతో ఆడుకునేందుకు జరిగే కుట్రలు.. ఇవన్నీ వింటుంటేనే మన కళ్లు చెమర్చుతాయి. ఈ రోజు మనం అటువంటి ఒక హృదయ విదారకమైన సన్నివేశం గురించి, అందులోని లోతైన భావోద్వేగాల గురించి తెలుసుకుందాం. వెంకటేష్, మీనా జంటగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘అబ్బాయిగారు’ చిత్రంలోనిదీ సన్నివేశం. శ్రీకాంత్, జయచిత్ర, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నూతన్‌ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చక్కని ఫ్యామిలీ సెంటిమెంట్‌తోపాటు కడుపుబ్బా నవ్వించే హాస్య సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా 1993లో విడుదలై ఘనవిజయం సాధించింది. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే సినిమాల్లో ‘అబ్బాయిగారు’ ఒకటి.  చిన్నతనంలోనే దొరబాబు తల్లి చనిపోతుంది. చనిపోయిన విషయం ఆ పసివాడికి తెలీక అమ్మ తప్పకుండా వస్తుందని ఎదురుచూస్తుంటాడు. ఒకరోజు అమ్మతో మాట్లాడాలనుకొని టెలిఫోన్ ఆపరేటర్‌కి ఫోన్ చేసి అమ్మకి లైన్ కలపమంటాడు. బాబు పరిస్థితి అర్థం చేసుకున్న ఆ ఆపరేటర్ అక్కడే పనిచేసే ఒక తల్లికి ఆ విషయం చెప్పి ఆ బాబుకి అమ్మలా కాసేపు మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాడు. వెంటనే ఆ బాబుకి ఫోన్‌లో తల్లి మాటలు వినిపిస్తాయి. ఆనందంతో ఆ బాబు ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఎంతో ఉద్వేగంగా తల్లితో మాట్లాడతాడు. తనకు పరిచయం లేకపోయినా ఆ బాబు మాటలకు ఆ ఆపరేటర్ కూడా ఎంతో ఉద్వేగానికిలోనై కంటతడి పెట్టుకుంటుంది. ఎంతో ఎమోషనల్‌గా సాగే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తుంది.  ఆ తండ్రి రెండో పెళ్లి చేసుకొని కొడుకు కోసం తల్లిని తీసుకొస్తాడు. ఆస్తి కోసమే రెండో భార్యగా వచ్చిన ఆమె.. ఆస్తంతా దొరబాబుకే చెందుతుందని తెలుసుకొని ఒక పథకం ప్రకారం బాబుతో చదువు మాన్పించి పొలం పనులకే పరిమితం చేస్తుంది. భర్తను కూడా ఒక ప్లాన్ ప్రకారం వీల్ చైర్‌కి పరిమితం చేసి, పిచ్చివాడు అనే ముద్ర వేస్తుంది. దొరబాబుని తన గుప్పిట్లో పెట్టుకొని ఆస్తి, వ్యాపార వ్యవహారాలన్నీ తనే చూసుకుంటూ ఉంటుంది. జీవితంలో తల్లి లేని వెలితిని ఏ ఆస్తి, ఏ డబ్బు భర్తీ చేయలేదు. ఆ పసివాడి అమాయకత్వం, వాడు పడే వేదన మనల్ని ఆలోచింపజేస్తాయి. ‘అబ్బాయిగారు’ చిత్రంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలోని అంత్యంత కీలకమైన సన్నివేశాలతో కూడిన‌ ఈ వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే మా Teluguone youtube channelను Subscribe చెయ్యండి. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఫిబ్రవరి, మార్చి నెలలు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల్లో ఒక రకమైన తెలియని ఆందోళన మొదలవుతుంది. ఇంటర్, టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతుంటే, ఎంత చదివినా ఏదో వెలితి, చదివింది మర్చిపోతున్నామనే భయం చాలా మందిని వెంటాడుతుంటుంది. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ, మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి: పరీక్షలు మీ మేధస్సును పరీక్షించేవి మాత్రమే, మీ జీవితాన్ని శాసించేవి కావు. ఈ ఒత్తిడిని జయించి, పరీక్షల్లో అద్భుతంగా రాణించడానికి నిపుణులు చెబుతున్న సూత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు ఒత్తిడిని తగ్గించుకోవాలి? (Why should we?) ఒత్తిడి అనేది కేవలం మానసికమైనదే కాదు, అది మన శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి: మన మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడే సమాచారాన్ని చక్కగా "రీకలెక్షన్" (Recollection) చేయగలదు. ఆందోళనలో ఉంటే తెలిసిన విషయాలు కూడా గుర్తుకురావు. ఆరోగ్యం కోసం: విపరీతమైన స్ట్రెస్ వల్ల కొంతమంది విద్యార్థులకు జ్వరం రావడం, వాంతులు అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెరుగైన ఫలితాల కోసం: మనసు ప్రశాంతంగా ఉంచుకుని పరీక్ష రాస్తే, మీ సాధారణ పర్ఫార్మెన్స్ కంటే 10% నుండి 30% వరకు మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఏమి చేయకూడదు? (What NOT to do!) చాలా మంది విద్యార్థులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. అవి ఏంటంటే: అతిగా ఆశించడం: "నాకు ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ రావాలి" లేదా "470 కి 470 రావాలి" అని పరీక్షకు వెళ్లే ముందు టార్గెట్లు పెట్టుకోకండి. ఈ ఆలోచనలే మిమ్మల్ని టెన్షన్ పెడతాయి. పోలికలు వద్దు: మీ అన్నయ్యకో, పక్కింటి అబ్బాయికో వచ్చిన మార్కులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఇలాంటి ప్రెజర్ పెట్టకూడదు. మార్కులు లెక్కపెట్టడం: క్వశ్చన్ పేపర్ చూడగానే "నాకు ఇన్ని మార్కులు వస్తాయి, ఇన్ని రావు" అని లెక్కలు వేయకండి. దీనివల్ల కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. పక్కవారిని చూడటం: ఎగ్జామ్ హాల్‌ లో పక్కవాడు ఎన్ని అదనపు పేపర్లు (Additionals) తీసుకున్నాడు అనేది మీకు అనవసరం. అది చూస్తే మీ బ్రెయిన్ డైవర్ట్ అయి ఒత్తిడి పెరుగుతుంది. ఎలా సిద్ధమవ్వాలి? విజేతల సూత్రాలు (How to Prepare?) రాతపూర్వక ప్రాక్టీస్: కేవలం నోటితో చదవడం కంటే, రాస్తూ చదవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. "ఒకసారి రాయడం.. పదిసార్లు చదవడంతో సమానం". సమయ పాలన (Time Planning): ఏ సెక్షన్ కి ఎంత సమయం కేటాయించాలి? (2 మార్కుల ప్రశ్నలకు ఎంత? 10 మార్కుల ప్రశ్నలకు ఎంత?) అనేది ముందే ప్లాన్ చేసుకోండి. దీనివల్ల చివరి నిమిషంలో హడావిడి ఉండదు. పాజిటివ్ థింకింగ్: "నేను చదివింది బాగా రాస్తాను, తెలియని ప్రశ్నలు వస్తే ఊహించి రాస్తాను" అనే క్లియర్ పిక్చర్ తో పరీక్ష హాల్ లోకి అడుగు పెట్టండి. ఏకాగ్రత: పరీక్ష రాస్తున్న ఆ రెండున్నర గంటలు ప్రపంచాన్ని మర్చిపోయి, కేవలం మీ పేపర్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: నేను బాగా చదివాను, కానీ పరీక్ష హాల్ లోకి వెళ్ళగానే అంతా మర్చిపోతున్నాను. ఎందుకు?  జవాబు: దీనికి ప్రధాన కారణం "ఆలోచనల ఒత్తిడి". పరీక్ష ఫలితం ఎలా ఉంటుందో, మార్కులు ఎన్ని వస్తాయో అని అతిగా ఆలోచించడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది. ఫలితం గురించి కాకుండా, కేవలం ఆన్సర్ రాయడం మీద దృష్టి పెడితే మర్చిపోయే సమస్య ఉండదు. ప్రశ్న: పరీక్షల సమయంలో పేరెంట్స్ పాత్ర ఏమిటి?  జవాబు: పేరెంట్స్ పిల్లలకు హోమ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి. వారిని భయపెట్టకుండా, వారిలో ధైర్యాన్ని నింపాలి. కార్పొరేట్ సంస్థలు పెట్టే ప్రెజర్ నుంచి పిల్లలను కాపాడాలి. గుర్తుంచుకోండి, పరీక్షలు మీ జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రశాంతమైన మనసుతో, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే విజయం మీదే. ఆల్ ది బెస్ట్! మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య మరియు విద్యా విషయాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ ని సందర్శించండి! మీరు పరీక్షల ఒత్తిడిని ఎలా జయించాలి? జ్ఞాపకశక్తిని ఎలా పెంచుకోవాలి? వంటి మరిన్ని చిట్కాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడిండి. మీ విజయ ప్రయాణంలో మేము తోడుంటాం! (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి సమాజంలో పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, అది ఇద్దరు వ్యక్తుల జీవితకాల ప్రయాణం. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనలు, వారి భయాలు కూడా మారుతున్నాయి. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సంబంధాలు చూసేటప్పుడు, వారి మనసులోని మాటను గమనించకుండా తొందరపడుతుంటారు. దీనివల్ల పెళ్లి కుదరకపోవడమే కాకుండా, పిల్లల మనసుపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ విషయంలో మనం అనుసరించాల్సిన పద్ధతులు, చేయకూడని పొరపాట్ల గురించి  కాకతీయ మ్యారేజ్ డైరెక్టర్ నవీనా యలమంచి గారు చెప్పిన విషయాలను ఈ Video Link లింక్ క్లిక్ చేసి చూడండి మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (Why Should We?) పెళ్లి సంబంధం చూసే ప్రక్రియలో పారదర్శకత లేకపోతే, అది కేవలం సమయాన్ని వృథా చేయడమే కాకుండా ఎదుటి కుటుంబం యొక్క శ్రమను, ఆశలను కూడా నీరుగారుస్తుంది. పిల్లలు సిద్ధంగా లేనప్పుడు వారిపై ఒత్తిడి తెస్తే, వారు ఎదుటి వారితో "నాకు ఇష్టం లేదు" అని చెప్పడం వల్ల రెండు కుటుంబాల మధ్య అనవసరమైన మనస్పర్థలు ఏర్పడతాయి. సరైన అవగాహన లేకుండా సంబంధాలు చూస్తే, భవిష్యత్తులో పిల్లలు మరే సంబంధాన్ని చూడటానికి కూడా ఇష్టపడరు. సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు: బలవంతం చేయడం: పిల్లలు పెళ్లికి మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వారిని బలవంతంగా సంబంధాలు చూడమని ఫోర్స్ చేయకూడదు. ముందస్తు చర్చ లేకపోవడం: ఇంట్లో పిల్లలతో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా బయట సంబంధాలు వెతకడం వల్ల ఫలితం ఉండదు. భయాలను విస్మరించడం: "నా ఫ్రెండ్స్ ఎవరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా లేరు" లేదా "అపరిచిత వ్యక్తితో జీవితం ఎలా ఉంటుంది?" అనే పిల్లల భయాలను కొట్టిపారేయకండి. వారి భయాలు చాలా జెన్యూన్ అయి ఉండవచ్చు. పరిస్థితిని చక్కదిద్దడానికి మరియు పిల్లలను పెళ్లికి సిద్ధం చేయడానికి ఈ పద్ధతులు పాటించండి: కౌన్సెలింగ్ మరియు మాటామంతి: పిల్లలు మీతో ఓపెన్ అవ్వనప్పుడు, వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఓపికగా ప్రయత్నించండి లేదా నిపుణుల సహాయం తీసుకోండి. అవకాశం ఇవ్వండి: పిల్లలు ఎదుటి వారితో మాట్లాడటానికి ఇష్టపడకపోయినా, కనీసం ఒకరిద్దరిని కలిసేలా ప్రోత్సహించండి. సరైన వ్యక్తి (Right Person) తారసపడినప్పుడు వారిలోని భయాలు సహజంగానే తొలగిపోతాయి. ఇంటి గుట్టు ముఖ్యం: ముందుగా మీ ఇంట్లో చర్చలు జరిపి, పిల్లలను ఒప్పించిన తర్వాతే పబ్లిక్‌గా సంబంధాలు చూస్తున్నామని చెప్పడం గౌరవప్రదంగా ఉంటుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: పిల్లలు సంబంధం చూడటానికి వచ్చినప్పుడు 'ఐ యామ్ నాట్ రెడీ' అని ఎందుకు అంటారు?  జవాబు: దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వారు కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకోవచ్చు లేదా అపరిచిత వ్యక్తులతో ప్రేమను ఎలా పంచుకోవాలో తెలియక భయపడవచ్చు. తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కూడా వారు ఇలాంటి సమాధానాలు ఇస్తుంటారు. ప్రశ్న: పిల్లల భయాలు ఎప్పుడు తొలగిపోతాయి?  జవాబు: అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, మరేదైనా సరే.. ఒక సరైన వ్యక్తిని కలిసినప్పుడు, వారితో మాటలు కలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సందేహాలు, భయాలు క్లియర్ అవుతాయి. అంతవరకు మనం ఎన్ని చెప్పినా వారి భయం తగ్గదు. ప్రశ్న: ఒక సంబంధం తప్పిపోతే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?  జవాబు: ఒకసారి చేదు అనుభవం ఎదురైతే, తర్వాత వచ్చే మంచి సంబంధాలను కూడా పిల్లలు వద్దని తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో పరిస్థితిని సెట్ చేసుకున్నాకే బయట సంబంధాలు చూడాలి. పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి భయాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే అరేంజ్డ్ మ్యారేజ్ విజయవంతం అవుతుంది. వారిని బలవంతం చేయడం కంటే, వారికి నమ్మకాన్ని కలిగించడం ముఖ్యం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు రిలేషన్‌షిప్ సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి! 👉మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [www.youtube.com/@Naveenacolumn ] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది... టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది. ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు. ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి. నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.
                           ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక పండ్లలో కొన్ని మనకు తెలియని రహస్యాలను దాచుకుంటాయి. అలాంటి ఒక అరుదైన మరియు శక్తివంతమైన పండే 'బిహి' (Behi). దీనిని ఇంగ్లీష్‌ లో 'క్విన్స్' (Quince) అని, సంస్కృతంలో 'అమృతఫల' అని, తెలుగులో 'సీమ దానిమ్మ' అని పిలుస్తారు. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పండు, పర్షియా (నేటి ఇరాన్) నుండి గ్రీస్, రోమ్ మరియు మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపించింది. ప్రాచీన గ్రీకులు దీనిని 'ప్రేమ మరియు సంతాన సాఫల్యతకు' (Love and Fertility) చిహ్నంగా భావించేవారు. ఈ రోజు మనం ఈ 'బంగారు ఆపిల్' వంటి బిహి పండు విశిష్టతలను గురించి Dr SGV Satya (Unani Specialist) ఈ Video లింక్ క్లిక్ చేసి వివరంగా తెలుసుకుందాం. మనం ఈ పండును ఎందుకు తీసుకోవాలి? (Why should we?)  బిహి పండు కేవలం రుచికరమైనదే కాదు, ఇది ఒక పోషకాల గని. దీనిని మీ ఆహారంలో చేర్చుకోవడానికి గల ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి: సంతాన సాఫల్యత మరియు పురుషుల ఆరోగ్యం: మగవారిలో స్పెర్మ్ కౌంట్‌ను (Sperm Count) అమాంతం పెంచే అద్భుత గుణం దీనికి ఉంది. అందుకే పురాతన కాలంలో పెళ్లికూతుళ్లకు పెళ్లికి ముందు దీనిని ఇచ్చే ఆనవాయితీ ఉండేది. బరువు తగ్గడానికి మరియు మధుమేహానికి: ఇది తక్కువ క్యాలరీలు ఉండి, పోషకాలు ఎక్కువగా ఉండే ఫ్రూట్. బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిక్ పేషెంట్లు, థైరాయిడ్ మరియు క్యాన్సర్ రోగులు కూడా దీనిని తమ డైట్‌లో చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ మెరుగుదల: ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం (Constipation) మరియు అల్సర్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం: పొటాషియం, కాపర్ మరియు ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును (BP) అదుపులో ఉంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి (Immunity): కరోనా సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన 'జోషాంద' (Joshanda) కాడాలో బిహి గింజలను (Behi Dana) ఒక ముఖ్యమైన ఇంగ్రిడియంట్‌గా వాడారు. ఇది వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడి బాడీని స్ట్రెంథన్ చేస్తుంది. ఎలా ఉపయోగించాలి? (How to use?) బిహి పండు నేరుగా తినడానికి చాలా పుల్లగా ఉంటుంది, కాబట్టి దీనిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు: మురబ్బా (Murabba): ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పద్ధతి. బిహి మురబ్బా ఏ యునానీ మందుల షాపులోనైనా దొరుకుతుంది. తేనెతో కలిపి: డయాబెటిక్ పేషెంట్లు పంచదార పాకంలో చేసిన మురబ్బా కాకుండా, తేనెతో చేసిన దానిని ఎంచుకోవాలి. జెల్లీలు మరియు షర్బత్‌లు: దీనితో జెల్లీలు, జామ్‌లు లేదా 'షర్బతే బిహి' వంటి పానీయాలు తయారు చేసుకోవచ్చు. వంటల్లో: గ్రీస్ వంటి దేశాల్లో దీనిని నిమ్మరసంతో కలిపి ఉడికించి వంటల్లో వాడుతుంటారు. ఏమి చేయకూడదు? (What NOT to do?) ఈ పండు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి: నేరుగా ఎక్కువగా తినకండి: ఇది చాలా పుల్లగా ఉండటం వల్ల నేరుగా పండును ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహ రోగులు జాగ్రత్త: బయట దొరికే మురబ్బాలలో షుగర్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేదా తాటి బెల్లంతో ఇంట్లోనే తయారు చేసుకున్న మురబ్బాను వాడటం శ్రేయస్కరం. అపరిమితంగా వద్దు: ఇది మన దేశీయ పండు కాదు కాబట్టి, రోజుకు ఒక చిన్న టీస్పూన్ మురబ్బా తీసుకుంటే సరిపోతుంది. అతిగా తీసుకోకూడదు. ప్రశ్నోత్తరాలు (Q&A): ప్రశ్న: బిహి పండు కేవలం మగవారికి మాత్రమే ఉపయోగపడుతుందా? సమాధానం: లేదు, ఇది అందరికీ ఆరోగ్యకరమైనది. అయితే పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఇది విశేషంగా పనిచేస్తుంది. ప్రశ్న: ఇది మార్కెట్‌లో దొరుకుతుందా? సమాధానం: పండు దొరకడం కష్టమైనా, 'బిహి మురబ్బా' రూపంలో యునానీ స్టోర్లలో సులభంగా లభిస్తుంది. ప్రశ్న: పిల్లలకు ఇది ఇవ్వవచ్చా? సమాధానం: అవును, రోగనిరోధక శక్తి పెంచడానికి తక్కువ మోతాదులో మురబ్బాను ఇవ్వవచ్చు. పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న ఈ బిహి పండు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటిది. ముఖ్యంగా నేటి కాలంలో ఎదుర్కొంటున్న సంతాన సమస్యలకు మరియు ఇమ్యూనిటీ సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ప్రకృతి ఇచ్చిన ఈ 'అమృతఫలాన్ని' సరైన పద్ధతిలో తీసుకుని ఆరోగ్యంగా ఉందాం. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన పండ్ల గురించి వివరంగా తెలుసుకోవడానికి మా  TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
మన శరీరంలోని ఐదు జ్ఞానేంద్రియాలలో చెవి అత్యంత సున్నితమైనది మరియు ముఖ్యమైనది. మనం ప్రపంచంతో మమేకమవ్వడానికి, ఇతరుల మాటలు వినడానికి, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినికిడి శక్తి ఎంతో అవసరం. కానీ నేటి కాలంలో మనం మన చెవుల ఆరోగ్యాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆ నిర్లక్ష్యం చివరకు మనల్ని శాశ్వత చెవుడు వైపు ఎలా నెడుతుందో, సీనియర్ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి గారు పంచుకున్న కొన్ని కీలక విషయాలను ఈ Video Link క్లిక్ చేసి చూడండి మనం చెవుల ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? (Why Should We?) మన చెవి లోపల వినికిడికి సహాయపడే 'హెయిర్ సెల్స్' (Hair Cells) అనేవి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైనవి. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే: శాశ్వత నష్టం: ఒకసారి ఈ హెయిర్ సెల్స్ దెబ్బతింటే, అవి మళ్ళీ తిరిగి రావు. మన శరీరంలోని ఇతర కణాలలాగా ఇవి మళ్ళీ పుట్టవు (Regeneration ఉండదు). వృత్తిపరమైన జీవితం: వినికిడి లోపం ఉంటే మీటింగ్‌లలో ఇతరులు చెప్పేది అర్థం కాదు, దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులు జరిగి మీ కెరీర్ దెబ్బతినవచ్చు. భారీ ఖర్చు: ఒకవేళ వినికిడి పూర్తిగా పోయి ఆపరేషన్ (Cochlear Implant) చేయించుకోవాల్సి వస్తే, ఒక్క చెవికి 7 నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఏం చేయకూడదు? (What Not To Do) నిరంతర శబ్దాలు: 24 గంటలూ బ్లూటూత్ హెడ్‌సెట్లు లేదా ఇయర్ ఫోన్లు పెట్టుకుని వినకండి. దీనివల్ల హెయిర్ సెల్స్ అలసిపోయి (Fatigue) శాశ్వతంగా దెబ్బతింటాయి. నిర్లక్ష్యం: చిన్నపాటి వినికిడి లోపం ఉన్నా "ఏం కాదులే" అని వదిలేయకండి. స్క్రీనింగ్ చేయించుకోకపోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. సామాజిక భయం: కళ్ళద్దాలు పెట్టుకున్నట్లే, అవసరమైతే హియరింగ్ ఎయిడ్ (Hearing Aid) పెట్టుకోవడానికి వెనుకాడకండి. లోకం ఏమనుకుంటుందో అన్న భయంతో సమస్యను పెంచుకోవద్దు. దురలవాట్లు: ధూమపానం (Smoking) మరియు మద్యం అలవాటు వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి లోపలి కణాలు దెబ్బతింటాయి. చెవులను ఎలా కాపాడుకోవాలి? (How To Maintain Ear Health) ఆరోగ్యకరమైన జీవనశైలి: డయాబెటిస్ (షుగర్), బీపీ మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఇవి పెరిగితే వినికిడి శక్తిపై ప్రభావం చూపుతాయి. వ్యాయామం: యోగా, ప్రాణాయామం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదలయ్యి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు పరీక్షలు: చెవిలో బ్లాకేజ్ అనిపించినా, వినికిడి తగ్గినట్లు అనిపించినా వెంటనే 'ప్యూర్‌టోన్ ఆడియోమెట్రీ' లేదా 'ఎండోస్కోపీ' వంటి పరీక్షలు చేయించుకోవాలి. నీటి జాగ్రత్తలు: స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు చెవిలోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే చెవిలోని గుబిలి (Wax) ఉబ్బిపోయి నొప్పి మరియు బ్లాకేజ్‌కి దారితీస్తుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్రశ్న: వయసు పెరగడం వల్ల వచ్చే వినికిడి లోపాన్ని మందులతో తగ్గించవచ్చా?  జవాబు: దీనిని 'ప్రెస్ బ్రాయకోసిస్' అంటారు. దీనికి మందులు లేదా ఆపరేషన్లు ఉండవు. ప్రివెన్షన్ (ముందస్తు జాగ్రత్త) మాత్రమే మార్గం. సమస్య ఎక్కువైతే హియరింగ్ ఎయిడ్ వాడాలి. ప్రశ్న: పిల్లల్లో చెవి నొప్పి, బ్లాకేజ్ ఎందుకు వస్తుంది?  జవాబు: పిల్లల్లో జలుబు చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ చెవిలోకి చేరి బ్లాకేజ్ ఏర్పడుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే 'గ్లూ ఇయర్' (Glue Ear) గా మారి వినికిడి లోపం రావచ్చు. వెంటనే డాక్టరును సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ప్రశ్న: చెవిలో గుబిలి (Wax) ఉండటం తప్పా?  జవాబు: గుబిలి అనేది ఒక రక్షణ కవచం లాంటిది. కానీ అది ఎక్కువై ఇయర్ కెనాల్‌ను బ్లాక్ చేసినప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. అప్పుడు డాక్టర్ ద్వారా క్లీన్ చేయించుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వినికిడి లోపం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా 👉 (TeluguOne Health YouTube Channel) ని సందర్శించండి. సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.