ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ చాలెంజ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. జనాలకు ముఖం ఎలా చూపించాలో తెలియనంతగా ఆత్మరక్షణలో పడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ధర్మానను జగన్ తీరు మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన ధర్మా ప్రసాదరావు జగన్ మావిగన్ చాలెంజ్ పై అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు.   2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడు.   ప్రజల్లో కూడా ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉండేవి. తన వాగ్ధాటితో,  విశ్లేషణలతో ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పి ప్రజామన్ననలు అందుకున్నారు. అయితే అదంతా గతం.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మాన ప్రభ రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిని, ఏకపక్ష పోకడలను  ధర్మాన ప్రసాదరావు అంతర్గతంగా విభేదించడమేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి.    ఆ కారణంగానే  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ధర్మానకు అంత సీనియర్ అయి ఉండి కూడా  తొలి మూడేళ్లలో  మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కిందనుకోండి. అది వేరే సంగతి.   విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు.  ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.  అయినా ధర్మాన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను వదల లేదు. కానీ ఇప్పుడు జగన్  మావిగన్ అనడం ధర్మానకు మింగుడు పడటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ధర్మాన పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారనీ,  జగన్ తీరు కారణంగా తన సొంత ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు.  నాడు విశాఖ రాజధాని అంశంపై గట్టిగా నిలబడిన తాను ఇప్పుడు జగన్ మావిగన్ అనడంతో ప్రజలలో చులకన అయ్యాననీ బాధపడుతున్నారని చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ మావిగన్ నినాదంతో ధర్మాన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మావిగన్ ను బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారని అంటున్నారు. 
ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన  విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి   ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన  ముద్రగడ..  కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు.  అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.  పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో  చెప్పించారు.  ముద్రగడ పద్మనాభంకు  రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే..  1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు.  మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ..  2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా,   కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు  ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది.  ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు.  ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్.  అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు. జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో  విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
జగన్ మావిగన్ సవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏమిటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల.. వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అమరావతి పనుల్లో  విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.. ఆ అవినీతికి విరుగుడుగా.. తాను అధికారంలోకి వస్తే మావిగన్ ను రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్  లాభదాయకమన్నారు.  జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.  తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లెలో జరిగిన విక్సిత్ భారత్-గ్రామ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలా మావిగన్ ఏమిటో  దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారనీ,  ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్  రాగం అందుకున్నారని విమర్శించారు.  రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29 వేల మంది రైతులు  33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన అటువంటి  అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు.  రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలకు నిప్పు పెట్టి, ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి గత ఐదేళ్లలో దాపురించిందన్న చంద్రబాబు..  2026లో పార్లమెంటు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదన్న చంద్రబాబు..  రాజకీయ నాయకుడు మాట మీద నిలబడాలని.. పూటకో మాట  మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిని 2028 నాటికి క్వాంటం వ్యాలీగా, నాలెడ్జ్ హబ్‌గా పూర్తిస్థాయిలో నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. 
ALSO ON TELUGUONE N E W S
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నతమైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలుగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల వేళ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో ఒక అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజే విజేతల వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వేడుకను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ అకస్మాత్తు బ్రేక్ వెనుక గల అసలు కారణాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేయకపోవడం గమనార్హం. అంతేకాకుండా, తదుపరి ఏ తేదీన ఈ అవార్డులను అనౌన్స్ చేస్తారనే విషయాన్ని కూడా సస్పెన్స్‌లో పెట్టడంతో ట్రేడ్ వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో నయా డిస్కషన్ మొదలైంది. ఈ ఏడాది అవార్డుల రేసు చాలా రసవత్తరంగా మారింది. గ్లోబల్ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన 'కల్కి 2898 AD', మాస్ విజువల్ వండర్ 'దేవర', మలయాళ చిత్ర పరిశ్రమ సంచలనాలు 'బ్రాహ్మయుగం', 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి పలు అద్భుతమైన సినిమాలు ఈ 72వ ఎడిషన్‌లో గట్టి పోటీని ఇస్తున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పాటు టెక్నికల్ విభాగాల్లో మన టాలీవుడ్ స్టార్ నటులు, సాంకేతిక నిపుణులు పలు అవార్డులను ఎగరేసుకుపోతారని సౌత్ ఆడియన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ఎంపిక ప్రక్రియ కోసం కేంద్రం ఒక పటిష్టమైన జ్యూరీని రంగంలోకి దించింది. ప్రముఖ అగ్ర దర్శకుడు జయరాజ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక జ్యూరీ కమిటీ ఈ స్క్రూటినీ బాధ్యతలను భుజాన వేసుకుంది. వివిధ భారతీయ భాషల నుండి వచ్చిన వందలాది ఎంట్రీలను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా సర్టిఫికేట్ పొందిన అర్హత గల చిత్రాలను ఈ 11 మంది సభ్యుల బృందం ఎంతో సమగ్రంగా, క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని కేటగిరీలకు సంబంధించిన విజేతల లిస్ట్ దాదాపుగా ఖరారైపోయిందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్న తరుణంలో ఈ పోస్ట్‌పోన్‌మెంట్‌ వార్త బయటకు రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణంగా జాతీయ అవార్డుల ప్రకటన సమయంలో తీవ్రమైన లాబీయింగ్, అంతర్గత చర్చలు జరుగుతుంటాయి, బహుశా విజేతల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవడంలో జ్యూరీ సభ్యుల మధ్య వ్యక్తమైన భిన్నాభిప్రాయాల వల్లే ఈ ఆలస్యం జరిగి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్దీ సినీ ఫ్యాన్స్ ఉదయం నుంచే టీవీ స్క్రీన్లకు, సోషల్ మీడియా అకౌంట్లకు అతుక్కుపోయి అప్‌డేట్స్ కోసం వెతికారు. తీరా కేంద్రం నుంచి వాయిదా వార్త వినాల్సి రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అసంతృప్తిని, నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ 11 మంది సభ్యుల జ్యూరీ సీల్ చేసిన విజేతల కవరు ఎప్పుడు ఓపెన్ అవుతుందో, 72వ జాతీయ అవార్డుల విజేతలుగా ఏయే చిత్రాలు చరిత్ర సృష్టిస్తాయో తెలియాలంటే కేంద్రం నుండి నెక్స్ట్ అఫీషియల్ ప్రెస్ నోట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Tamil cinema could be witnessing two of the most unusual box office clashes in recent years. Interestingly, both aren't just about star power—they involve families whose personal lives have dominated headlines over the last few years. The first clash revolves around Vijay and his son Jason Sanjay. After months of censor uncertainty, Jana Nayagan has reportedly been awarded an 'A' certificate, with the makers now said to be eyeing a July 23 release. However, Jason Sanjay's directorial debut Sigma, starring Sundeep Kishan, has already locked July 31. If Jana Nayagan takes the July 23 slot, it is expected to dominate theatres well into the following week, putting Sigma under immense pressure to either postpone or settle for reduced screens. What makes the clash even more intriguing is the backdrop. Vijay's family has been in the spotlight ever since divorce proceedings between him and wife Sangeetha began, while reports about his alleged relationship with Trisha have only added fuel to the fire. Amid all the speculation, Jason Sanjay and his sister have stayed away from making any public comments about their father. If Jana Nayagan ends up affecting Sigma's release, the father-son clash is bound to become a bigger talking point than the films themselves. The second clash could unfold during Dussehra. Rajinikanth's Jailer 2 is officially arriving on October 15, while Dhanush's OM is scheduled for October 16. Unless one of the films moves, the Superstar and his former son-in-law will lock horns at the box office. That battle too comes with emotional baggage. Dhanush and Aishwarya Rajinikanth's separation was one of the most discussed celebrity splits in South India. A direct clash between Jailer 2 and OM is certain to reopen that conversation, even if both families have moved on personally and professionally. Whether these release dates eventually change remains to be seen. But if they hold, Tamil cinema will witness two rare family-linked box office battles—one between a father and son, and another between a former father-in-law and son-in-law. Sometimes, reality writes stranger scripts than cinema itself. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని, మహేష్ బాబు ఇమేజ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని కుటుంబం నుండి మరో సరికొత్త తరం హీరో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ డెబ్యూ ఫిల్మ్ 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ప్రమోషనల్ కంటెంట్‌లో జయకృష్ణ చూపించిన నటన, యాక్షన్ ఎబిలిటీస్, అదిరిపోయే డ్యాన్సింగ్ స్కిల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి విలక్షణమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబుల నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక పవర్‌ఫుల్ లిట్మస్ టెస్ట్‌గా మారనుంది. ప్రారంభంలో వచ్చిన రెస్పాన్స్ ఎంతో పాజిటివ్‌గా ఉండటంతో, ఈ యంగ్ హీరోని వెండితెరపై చూడటానికి సినిమా లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 30న థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. నిజానికి చిత్ర బృందం మొదట జూలై 9వ తేదీని రిలీజ్ డేట్‌గా పరిశీలించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' వంటి ఇతర చిత్రాలతో ఎలాంటి అనవసరమైన క్లాష్స్ రాకూడదనే ఉద్దేశంతో ఒక అడుగు వెనక్కి వేసి, సోలోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు జూలై 30వ తేదీని లాక్ చేశారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. జయకృష్ణ, రాషా థడాని మధ్య కెమిస్ట్రీ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొదటి సినిమానే అయినప్పటికీ రాషా కనబరిచిన ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్సింగ్ టాలెంట్, నటన సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఘట్టమనేని మూడో తరం వారసుడి ఎంట్రీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.     Srinivasa Mangapuram, Jaya Krishna Ghattamaneni, Krishna, Mahesh Babu, Ajay Bhupathi  
సినిమా లేదా ఒక వెబ్ సిరీస్ తీయాలనే బలమైన కోరిక మీలో ఉందా? సరికొత్త ఆలోచనలతో సరిహద్దులు దాటే కథలు మీ మైండ్‌లో మెదులుతున్నాయా? మీ ఆలోచనలకు అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది డిజిటల్ ప్రేక్షకులకు మీ ప్రతిభను చూపించాలనుకుంటే ఇదే మీకు సరైన సమయం. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సరికొత్త సరిహద్దులను బద్దలు కొడుతూ, భారతదేశంలోని ప్రతిభావంతులైన యువ కథా రచయితలను ప్రోత్సహించేందుకు ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సృజనాత్మక మనసుల కోసం “నెట్‌ఫ్లిక్స్ నెక్స్ట్‌జెన్ ఇండియా రైటర్స్ ప్రోగ్రామ్”ను అధికారికంగా ప్రారంభించి చిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్నా, ఒక పెద్ద నిర్మాణ సంస్థకు లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు మన కథను వినిపించాలన్నా ఎన్నో ఏళ్ల నిరీక్షణ, సరైన పరిచయాలు అవసరమవుతాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇండియా తీసుకొచ్చిన ఈ సరికొత్త నెక్స్ట్‌జెన్ ప్రోగ్రామ్ ద్వారా మీలోని వినూత్నమైన ఆలోచనలను, వైవిధ్యమైన కథలను నేరుగా నెట్‌ఫ్లిక్స్ అంతర్జాతీయ సంస్థతో పంచుకునే వీలు కలుగుతుంది. మీ కథలోని దమ్ము, మీ ఆలోచనలోని కొత్తదనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటే చాలు, మీ కలలను నిజం చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్త డిజిటల్ స్క్రీన్లపై మీ పేరును ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. మీలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు, ఒక నూతన తరం కథా రచయితగా ఎదిగేందుకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న రచయితలను ఉద్దేశించి ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది. చిత్ర పరిశ్రమలో లేదా స్క్రీన్ రైటింగ్ (కథా రచన) రంగంలో గరిష్టంగా 3 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ అనుభవం ఉన్నవారెవరైనా ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. అంటే కేవలం 0 నుండి 3 ఏళ్ల అనుభవం ఉన్న యువ ప్రతిభావంతులు, ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తమ కథల స్క్రిప్ట్‌లతో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆలోచన సరికొత్తగా ఉండి, ఇప్పటివరకు ఎవరూ తాకని సరికొత్త కోణంలో ఉంటే, నెట్‌ఫ్లిక్స్ అనే అతిపెద్ద గ్లోబల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీ వెనుక నిలబడి మీకు మార్గదర్శకత్వం అందిస్తుంది. వెండితెరపై లేదా ఓటీటీ స్క్రీన్లపై తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవాలని ఆరాటపడే కథా రచయితలకు ఇదొక పెద్ద లైఫ్ చేంజింగ్ ప్లాట్‌ఫామ్ కానుంది. సరికొత్త స్క్రిప్ట్ రైటర్స్ తమ వినూత్న కథలను సమర్పించడానికి నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిజిటల్ కంటెంట్ రంగంలో సరికొత్త విప్లవం సృష్టిస్తున్న ఈ రోజుల్లో, నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో మీ కథ భాగం కావాలంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నెక్స్ట్‌జెన్ ఇండియా రైటర్స్ ప్రోగ్రామ్‌కు అప్లై చేసుకోండి. మీ కలల ప్రాజెక్ట్‌ను గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లండి.       Netflix India, NextGen India Writers Program, New Script Writers, Creative Writing India, Netflix India Originals, Apply for Netflix Writers Program
ఈ ఏడాది అక్టోబర్ నెల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో ఒక అపూర్వమైన, మునుపెన్నడూ చూడని రీతిలో భారీ బాక్సాఫీస్ జాతరను తీసుకురాబోతోంది. ముగ్గురు సీనియర్ సూపర్ స్టార్లు తమ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లతో ఒకే నెలలో థియేటర్లలోకి దూసుకురావడానికి అధికారికంగా లైన్ క్లియర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, విక్టరీ వెంకటేష్ ల చిత్రాలు అక్టోబర్ బాక్సాఫీస్ రేసులో నిలవడంతో ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ అక్టోబర్ బాక్సాఫీస్ రన్ లో అందరికంటే ముందుగా విక్టరీ వెంకటేష్ (Venkatesh) తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. వెంకీ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' (Aadarsha Kutumbam) చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్, మొదటిసారి వెంకటేష్ ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అసలైన థ్రిల్, బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ మాస్ జాతర దసరా పండుగ వారంలో మొదలుకానుంది. ఎందుకంటే దసరా కానుకగా ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య బాక్సాఫీస్ వద్ద మహా సంగ్రామం జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెల్ 'జైలర్ 2' (Jailer 2) అక్టోబర్ 15న విడుదల కాబోతోంది. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం నేపథ్యంలో ఈ సీక్వెల్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ వదిలిన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రజనీకాంత్ తనదైన స్టైల్ మరియు స్వాగ్ తో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఇక జైలర్ 2 తుఫాన్ థియేటర్లలో మొదలైన సరిగ్గా ఒక్క రోజు వ్యవధిలోనే, అంటే అక్టోబర్ 16న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 'విశ్వంభర' (Vishwambhara) థియేటర్లలోకి రానుంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి వంటి చిత్రాల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ట్రేడ్ సర్కిల్స్ లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది.  ఈ అక్టోబర్ రేసులో వెంకీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మెప్పించనుండగా, రజనీ హై-వోల్టేజ్ యాక్షన్ తో, చిరు విజువల్ వండర్ ఫాంటసీతో బాక్సాఫీస్ ను రూల్ చేయనున్నారు. ఈ ముగ్గురు అగ్ర హీరోల పోటీతో అక్టోబర్ నెల థియేటర్లలో మాస్ జాతర ఖాయమని చెప్పవచ్చు. మరి ఈ భారీ త్రిముఖ పోరులో విజేతగా నిలిచి బాక్సాఫీస్ కింగ్ గా ఎవరు నిలుస్తారో చూడాలి.     Chiranjeevi, Venkatesh, Rajinikanth, Vishwambhara, Aadarsha Kutumbam, Jailer 2  
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లలో లెక్కల మాస్టర్ సుకుమార్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ జోడీ ఖచ్చితంగా ఉంటుంది. సుకుమార్ సినీ ప్రయాణం మొదలైన మొదటి సినిమా 'ఆర్య' నుంచి నిన్నమొన్నటి ప్యాన్ ఇండియా సంచలనం 'పుష్ప', 'పుష్ప 2' వరకు వీరిద్దరి కాంబినేషన్ ఒక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించే అద్భుతమైన ట్యూన్స్, సుకుమార్ రాసుకునే విజువల్స్ వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ఎన్నో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అందించాయి. అయితే, ఇటీవల కాలంలో మెగా హీరోలు దేవిశ్రీ ప్రసాద్‌ను పక్కన పెడుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది.  మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన 4 సినిమాలలో 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'వాల్తేరు వీరయ్య' లాంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. అయినప్పటికీ, చిరంజీవి తన తదుపరి చిత్రాలకు దేవిశ్రీని కాదని వేరే సంగీత దర్శకులను ఎంపిక చేసుకోవడం, అలాగే బుచ్చిబాబు కూడా తన మొదటి సినిమా 'ఉప్పెన'కు దేవిశ్రీతో అద్భుతమైన మ్యూజిక్ ఇప్పించుకుని, తన రెండో సినిమా 'పెద్ది' కి వచ్చేసరికి ఏఆర్ రెహమాన్‌ను లైన్‌లోకి తెచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో, సుకుమార్-రామ్ చరణ్ కలయికలో రాబోయే 'RC 17' చిత్రానికి కూడా దేవిశ్రీ ప్రసాద్ దూరమయ్యాడనే రూమర్స్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపించాయి. ఈ రూమర్స్ రావడానికి ప్రధాన కారణం 'పుష్ప 2' సినిమా మేకింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర పరిణామాలు. 'పుష్ప 2' ఆల్బమ్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన టైటిల్ సాంగ్, కిస్సిక్, జాతర సాంగ్స్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఊపేశాయి. సినిమాను మ్యూజికల్ హిట్ చేయడంలో దేవిశ్రీ తన వంతు పాత్రను వంద శాతం పోషించినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో సుకుమార్, దేవిశ్రీ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే ప్రచారం జరిగింది. దీని కారణంగానే సుకుమార్ 'పుష్ప 2' లోని కొన్ని కీలకమైన సన్నివేశాల రీ-రికార్డింగ్ బాధ్యతలను తమన్‌కు అప్పగించాల్సి వచ్చింది. ఈ ఒక్క సంఘటనతో దేవిశ్రీ, సుకుమార్ ఎపిక్ కాంబోకి బ్రేక్ పడిందని, రామ్ చరణ్ సినిమాలో దేవిశ్రీ ఉండటం కష్టమేనని అందరూ భావించారు. కానీ, సుకుమార్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌కు మ్యూజిక్ విషయంలో తన బలం ఏంటో బాగా తెలుసు. ఒకటి రెండు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినంత మాత్రాన, తన కెరీర్‌కు ఎన్నో మ్యూజికల్ వెపన్స్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ లాంటి క్లోజ్ ఫ్రెండ్, టాలెంటెడ్ కంపోజర్‌ను పక్కన పెట్టేంత సాహసం సుకుమార్ చేయరని స్పష్టమవుతోంది. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో గతంలో వచ్చిన 'రంగస్థలం' సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడమే కాకుండా, అందులోని ప్రతి పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ (RC 17) కోసం దేవిశ్రీ ప్రసాద్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా లాక్ చేసినట్లు తాజా సమాచారం. ప్రస్తుతం 'RC 17' కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఒక పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఆయనకు మరో 4 నుండి 5 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 'పుష్ప 2' ను మించిన భారీ కథను సిద్ధం చేసే పనిలో లెక్కల మాస్టర్ టీమ్ రాత్రింబవళ్లు కష్టపడుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ల కాంబినేషన్ అధికారికంగా ఖరారు కావడంతో మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.       Sukumar Ram Charan Movie, Devi Sri Prasad Music Director, RC 17 Latest Updates, Pushpa 2 BGM Issue, Sukumar DSP Combo Break, Ram Charan Sukumar Movie 2027
Jaya Krishna Ghattamaneni's debut film Srinivasa Mangapuram has locked a new release date. The romantic action entertainer, directed by Ajay Bhupathi, will now hit theatres on July 30. The makers had initially planned to release the film on July 9, but decided to postpone it to avoid a box office clash with Akhil Akkineni's Lenin. Ever since its promotional material was unveiled, Srinivasa Mangapuram has generated decent buzz. Jaya Krishna, carrying forward the legacy of Superstar Krishna and Mahesh Babu, has impressed with his screen presence, action sequences and dancing abilities. The film is expected to be his first major test as a lead actor. Another major attraction is Rasha Thadani, daughter of Bollywood actress Raveena Tandon, who is making her Telugu debut with the film. Her traditional South Indian look, energetic dance moves and chemistry with Jaya Krishna have become talking points among movie buffs, adding to the anticipation surrounding the film. Veteran actor Mohan Babu plays a pivotal role in the film, while director Ajay Bhupathi is said to have blended romance and action against the backdrop of Tirupati and Chittoor. Presented by veteran producer Ashwini Dutt, the film features music composed by GV Prakash Kumar. With post-production work progressing at a brisk pace, the makers are gearing up to begin the final phase of promotions. A trailer and more promotional content are expected to be unveiled in the coming weeks.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
అఖిల్ అక్కినేని(Akhil Akkineni) లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా 'లెనిన్' (Lenin) విడుదలకు సిద్ధమవుతోంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానుల్లోనూ, ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 10న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ 'లెనిన్' మూవీ ప్రమోషన్స్ కోసం తారక్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ తో అఖిల్ ముచ్చటించబోయే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన షూట్ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది. సాధారణంగానే నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. గతంలో కూడా అఖిల్ నటించిన సినిమాల ఈవెంట్స్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి తన మద్దతును ప్రకటించారు. ఇప్పుడు 'లెనిన్' సినిమా కోసం తారక్ స్వయంగా రంగంలోకి దిగి ఇంటర్వ్యూ చేయనుండటం సినిమా బిజినెస్ కు, ప్రమోషన్స్ కు ఒక భారీ మైలేజ్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు మూడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తీసుకుని అఖిల్ చేస్తున్న సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ అఖిల్ కెరీర్ కి ఎంతో కీలకంగా మారింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లెటూరి వాతావరణంలో సాగే ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ అండ్ యాక్షన్ లవ్ స్టోరీగా 'లెనిన్' రూపొందింది. చిత్తూరు యాసలో సాగే డైలాగులు, ఊహించని మలుపులతో కూడిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.  ఈ సినిమాలో అఖిల్ సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ తోడైతే, బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ పరంగా 'లెనిన్' ఒక రేంజ్ లో దూసుకుపోవడం ఖాయం. త్వరలోనే ఈ క్రేజీ ఇంటర్వ్యూ ప్రసారం కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ 'ఎన్టీఆర్ విత్ అఖిల్ అక్కినేని లోడింగ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.     Jr NTR, Akhil Akkineni, Lenin Movie, TeluguOne  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు వాడమని చెబుతారు.  అయితే.. తన దగ్గరకు వచ్చిన రోగులకు జాగ్రత్తలు  చెప్పడానికి ముందు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు, మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే వారి మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అనేది తొందరగా లభించేది కాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిదానంగా సొంతమవుతుంది.  వైద్యులు తమ రోజువారీ జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.  వీటిని అందరూ పాటించవచ్చు.  ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. దీని వల్ల వైద్యుల లాగే ఓర్పు, సహనం వంటివి పెరుగుతాయి. ప్రతి ఏడాది డాక్టర్స్ దినోత్సవాన్ని జూలై 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ సందర్బంగా వైద్యులు పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుంటే.. నిద్ర.. ప్రతిఒక్కరికి కనీసం ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. "సమయానికి నిద్రపోవడం ద్వారా శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.  దీని వల్ల ఒత్తిడి  తగ్గుతుంది,  రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.   బ్లూ లైట్.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్‌లు, కంప్యూటర్‌లు , ఇతర ఎలక్ట్రానిక్స్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతిని నివారించాలి. ఆహారం..  కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ వనరులు, ఆరోగ్యకరమైన కొవ్వులు , అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది. డిన్నర్ టైం.. రాత్రి భోజనాన్ని త్వరగా తినడం ఎంతో మంచిది.  రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల శరీరానికి రాత్రంతా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రాసెస్ ఆహారాలు.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరతో నిండిన డెజర్ట్‌ల విషయంలో చాలా మంది కంట్రోల్ గా ఉండలేరు. కానీ వాటిని నివారించడానికి  తీపి తినాలని అనిపించినప్పుడు, చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన డెజర్ట్‌ల వైపు వెళ్లకుండా ఆయా కాలాల్లో లభించే తాజా పండ్లు తినడం, ఖర్జూరం,  డ్రై ప్రూట్స్ వంటి తినడం వల్ల తీపి తిన్న ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి పోషకాలు కూడా అందుతాయి. భోజనం ట్రిక్.. భోజనం తినే ముందు  కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల, ఎక్కువ ఆహారం తినకుండానే కడుపు నిండుతుంది.  దీనివల్ల ఆహారం అతిగా తినడం నివారించవచ్చు.  భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు సలాడ్‌ తినడం చాలా మంచిది. చురుగ్గా ఉండాలి.. లైఫ్ స్టైల్ చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  క్రమం తప్పకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే వ్యాయామం వల్ల ఓర్పు కూడా పెరుగుతుంది.   స్ట్రెంత్ ట్రైనింగ్.. క్రమం తప్పకుండా శరీరాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఫుషప్స్,  బైసెప్స్ తో పాటు ఇతర స్ట్రెంట వ్యాయామాలు కూడా శరీరం బలంగా మారడానికి సహాయపడుతుంది.  ఇవి కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వైద్యులకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం,యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేస్తారు.   రిలేషన్స్.. వైద్యులు కేవలం సమాజం కోసం మాత్రమే కాదు.. తమ కోసం తాము కూడా బ్రతకాలి.  వారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం,  సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడం వంటివి వారు వృత్తిలో రాణించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకు గంట సేపు అయినా కుటుంబంతో సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. పైన చెప్పుకున్నవన్న ఎంతో మందివైద్యులు తప్పకుండా తమ జీవితంలో రోజూ పాటించే అలవాట్లు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా పాటించవచ్చు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి. అప్పుడే వారు వృత్తికి సరైన న్యాయం చేయగలరు.                                       *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని  అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు   పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్..  బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం  ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం,  ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది.  ల్యాప్‌టాప్‌ను  ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది.                            *రూపశ్రీ.