ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.   ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు.  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.  ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా? సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.   నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.! రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​ [Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne] 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను మరింత పటిష్టపరిచే దిశగా అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలను యువ నాయకుడు బీఎం సందీప్‌కు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.    పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీని సమన్వయం చేసే తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.    గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సంస్థాగత పదవి నుంచి తప్పుకున్న ఆమె, గతంలో రాష్ట్రంలో అందించిన విశేష సేవల పట్ల అధిష్ఠానం ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.    కొత్త ఇన్‌ఛార్జి రేసులో పలువురు సీనియర్ జాతీయ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే వంటి ఉద్ధండుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనూహ్యంగా అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.    ఈ పరిణామం సరిగ్గా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించేందుకు ఈ నాయకత్వ మార్పు దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఇతర రాజకీయ సవాళ్లు ఎదురుకానున్న తరుణంలో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతను పెంపొందిస్తూ, పార్టీని విజయపథంలో నడిపించడంలో బీఎం సందీప్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీకు నచ్చవచ్చు: Under 19 Asia Cup: పాక్‌పై చివరి బంతికి భారత్  థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.! [ BM Sandeep Telangana Congress In-charge, Telangana Congress news, AICC new appointments 2026, TPCC updates, Mallikarjun Kharge decisions ]
ALSO ON TELUGUONE N E W S
గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా బాలకృష్ణ.. గాడ్ ఆఫ్ మాసెస్ క్రికెట్ ధోని.. మరి ఈ ఇద్దరికీ సంబంధించిన కంబైన్డ్ న్యూస్ వస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి? నా టైం స్టార్ట్ అయ్యిందంటూ  సోషల్ మీడియా సరికొత్త పరవళ్లతో ఊగిపోయే పరిస్థితి.మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.    భారత క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అంటే కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదని, కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిన ఒక మహా శక్తి అని టాలీవుడ్ నటసింహం, అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొనియాడారు. ఐపీఎల్ (IPL) సమరంలో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ప్రాముఖ్యతను మరియు ధోనీ విశిష్టతను తెలియజేస్తూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రోమో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.   పసుపు రంగు జెర్సీని ధరించి, కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల జీవితాల్లో ఆశాకిరణంలా ఉదయించిన సూర్యుడిలా ధోనీ కనిపిస్తాడని బాలకృష్ణ తనదైన శైలిలో పవర్‌ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రశంసల జల్లు కురిపించారు. క్రికెట్ మైదానంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం చలించకుండా, కూల్‌గా వ్యవహరించే ధోనీ మానసిక స్థైర్యాన్ని బాలయ్య తన డైలాగ్స్ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందించడంలో ధోనీ నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక చతురత ఎంతగానో దోహదపడ్డాయని అభిమానులు ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇది కూడా చదవండి: అయ్యప్ప దీక్ష తీసుకున్న ఈ ఇద్దరు లెజండ్రిస్ ని గుర్తుపట్టారా: ఇరుముడి హిట్ ని మీకు ఇచ్చారు!    మైదానంలో ఆయన ప్రదర్శించే ప్రశాంతత, మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి గెలిపించే నైపుణ్యం 'కెప్టెన్ కూల్' ధోనీని ప్రపంచ క్రీడా రంగంలోనే అత్యున్నత శిఖరాలపై నిలబెట్టాయి. అటు టాలీవుడ్ మాస్ హీరో బాలకృష్ణ దంభమైన వాయిస్, ఇటు మిస్టర్ కూల్ ధోనీ లెజెండరీ క్రేజ్ కలగలిపిన ఈ ప్రత్యేక ప్రమోషనల్ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వీడియో ఓల్డ్ దే అయినా  అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు వీడియోని  షేర్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.    మీకు నచ్చవచ్చు:  ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ! మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ!   [Balakrishna, Ms Dhoni, IPL Telugu promo, Tollywood]  
Director and actor Tharun Bhascker is reportedly going through a significant change in his personal life. His mother has confirmed that he is in a relationship with actress Eesha Rebba and is happy with her presence in his life, at ENE Repeat pre-release event. The movie is releasing on 19th November with paid premieres on 18th November.  Speaking about her son's personal life, Tharun's mother, Geetha revealed that he has been several court cases, construction of house, selling and many ups and downs for the past two years. She also indicated that Eesha's entry into his life has brought him happiness during this difficult phase. Interestingly, Tharun and Eesha reportedly grew close during the making of Om Shanti Shanti Shantihi, in which he played the male lead opposite her. Their chemistry and interactions during the film's promotions had already caught the attention of audiences. At the OSSS film's pre-release event, Tharun had dropped a few hints about their equation, leaving those present wondering whether something was brewing between the two. Their appearances together subsequently added to the speculation. Also Read: Chiru Leaks Again: Anaswara plays this character?  There were also reports of Eesha travelling to Bangkok during the shoot of ENE Repeat to spend a few days with Tharun. Now, his mother's confirmation has brought their relationship into the spotlight, putting an end to much of the speculation surrounding their equation. Vishwak Sen, Srinath Maganti, Abhinav Gomatham, Venkatesh are back with Shivatmika Rajasekhar and Anisha Ambrose in leading roles. Ee Nagaraniki Emayyindi became a cult film and now, sequel ENE Repeat is releasing with high anticipation.  Check Out: Allu Arjun's historical Pushpa 2 event completes two years!                     Avengers: Doomsday creates history with unreal demand Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మాస్ మహారాజా రవితేజ శివ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో వచ్చిన ఇరుముడి సాధించిన విజయం తెలిసిందే. హరిహరసుతుడు కలియుగ దైవం  అయ్యప్ప స్వామి దీక్షని, స్వామి పరమార్దాన్ని ఆత్మగా చేసుకొని వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా 20 రోజుల పాటు రోజుకి కోటి రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించిన ఘనత కూడా కేవలం ఇరుముడికే సాధ్యమైంది.     ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో, చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్ భక్తి మార్గంలో అడుగుపెట్టారు.ఆ ఇద్దరు తాజాగా అయ్యప్ప దీక్షని  స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో వీరు ఇద్దరూ అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలను ధరించి దీక్షను ప్రారంభించారు. ప్రతి ఏడాది శీతాకాలం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప నామస్మరణతో పాటు, నల్లటి దీక్ష వస్త్రాలు ధరించి స్వామి భక్తులు పంబానది ప్రయాణానికి సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ చిత్రంలో స్వామివారి భక్తి తత్వాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు,నిర్మాత నేడు స్వయంగా దీక్షాధరులు కావడం సినీ వర్గాల్లో మరియు అభిమానులలో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రంలోని సెంటిమెంట్ కేవలం వెండితెర మీదే కాకుండా, నిజ జీవితంలోనూ ప్రతిఫలించడం విశేషం. ఇది కూడా చదవండి:ధనుష్ ఓం ఫస్ట్ రివ్యూ!..700 టన్నుల ఎర్రచందనం మాయమైతే ఏమైంది?   దీంతో  చిత్ర యూనిట్ సభ్యులు ఇలా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ ఇదే!   మీకు నచ్చవచ్చు:ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ ఇదే!   [Irumudi, Shiva Niravana, Ravishankar, Raviteja, Tollywood]
Megastar Chiranjeevi seems to have let out an interesting character detail about his upcoming film Kaaka. Speaking at the Itllu Arjuna success event, the actor indirectly hinted that Anaswara Rajan, who plays a medical student in the film, might be portraying a mute character. The makers have already revealed that Anaswara plays a medical student, while Chiranjeevi's character is protective of her in the film. However, his latest comments have added another interesting dimension to her role, suggesting that she might be a speech-impaired character. Interestingly, Chiranjeevi made this revelation while celebrating the success of Itllu Arjuna, which features a mute protagonist. The connection between the two films perhaps prompted the Megastar to let out this detail in his trademark playful manner. Also Read: Allu Arjun's historical Pushpa 2 event completes two years! Known for his occasional intentional and unintentional Chiru Leaks, Chiranjeevi has often given audiences glimpses of unrevealed film details through his speeches. This time, his comments have sparked curiosity about Anaswara's character in Kaaka. Directed by Bobby Kolli and produced by Venkat K Narayana under KVN Productions, Kaaka also features Nivetha Pethuraj, Sunil and others in important roles. The film has locked January 13, 2027, for its theatrical release, targeting the Sankranthi festive season. Check Out: Vijay Antony takes an emotional decision                      Kamal Haasan to play a cameo in Seyon Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Two years ago, on November 17, 2024, Patna witnessed a cinematic spectacle that redefined the scale of film promotional events in India. The trailer launch of Icon Star Allu Arjun's Pushpa 2: The Rule turned into a historic celebration, drawing an unprecedented gathering of over 2 lakh people. Adding another remarkable milestone to the event, the live streaming of the trailer launch recorded an extraordinary 2.6 lakh concurrent viewers on YouTube, making it the highest live viewership recorded for an Indian cinema event. The scale was extraordinary, both on-ground and digitally. While thousands of fans thronged the venue and surrounding areas to catch a glimpse of their favourite star, lakhs more tuned in online to witness the celebrations. At the centre of this phenomenal response was Allu Arjun, whose popularity transcended geographical and linguistic boundaries. The overwhelming response in Patna reflected his immense pan-India stardom and the unprecedented reach of the Pushpa franchise. Also Read: Vijay Antony takes an emotional decision What began as a film trailer launch evolved into a massive public celebration, setting a new benchmark for Indian cinema events in terms of crowd mobilisation, digital viewership and audience engagement. Two years later, the Patna event remains a defining moment in the journey of Pushpa 2: The Rule and a testament to the phenomenon that is Icon Star Allu Arjun. Check Out: SOTY: After Dark gets bashed all over                      Selena Gomez gets major relief Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్.. ఆ వెంటనే విలన్‌గా మారి తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత మళ్ళీ హీరో అవతారమెత్తి మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే  గోపీచంద్ ని విలన్‌గా చూడాలని కోరుకునే వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ విలన్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తి రేపుతోంది. అది కూడా సాధారణ సినిమా కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్యతో తలపడే అవకాశం ఉందట. సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించనున్నారనేది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఈ వార్త నిజమైతే మాత్రం రెండు భాషల ప్రేక్షకులకు మంచి మాస్ కాంబినేషన్ చూసే అవకాశం దక్కుతుంది. గోపీచంద్ పేరు చెప్పగానే చాలామందికి మొదట గుర్తొచ్చే సినిమాలు ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’. ఈ మూడు సినిమాల్లోనూ ఆయన విలన్‌గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘వర్షం’లో భద్రన్న పాత్ర ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ఆ తర్వాత ‘యజ్ఞం’ సినిమాతో మళ్ళీ హీరోగా మారి, యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ మళ్లీ విలన్‌గా నటిస్తారనే వార్త రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. సూర్య 49వ చిత్రానికి దర్శకుడిగా అరుణ్ మాతేశ్వరన్ పేరు వినిపిస్తోంది. ‘DC’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాని కోస్టల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారని సమాచారం.  ఇది కూడా చదవండి: ఆద్యను స్టేజ్‌పైకి వద్దన్న రేణు దేశాయ్.. కూతురి విషయంలో ఎందుకలా చేశారు.? ఈ ప్రాజెక్ట్ ఇంకా అధికారికంగా ప్రకటించకముందే గోపీచంద్ విలన్ పాత్రలో నటించనున్నారనే వార్త బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. సూర్యకు ధీటుగా నిలిచే పవర్‌ఫుల్ విలన్ పాత్రను గోపీచంద్ కోసం రూపొందించారనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’ ఒకటి. మరో సినిమా 'సింగ' వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోంది.  గోపీచంద్ విలన్‌గా నటిస్తే మాత్రం అది ఆయన కెరీర్‌లో ఆసక్తికరమైన మలుపు అవుతుంది. గతంలో తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టిన ఆయన.. ఇప్పుడు సూర్యలాంటి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ పోటీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మీకు నచ్చవచ్చు: నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ ఒక విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.! రామాయణ ఎఫెక్ట్.. థియేటర్లలో కొత్త రూల్.. నాన్‌వెజ్‌ బ్యాన్.!       [Gopichand, Villain Role, Suriya 49, Arun Matheswaran]  
'ఓం' మూవీ స్టార్ లైనప్ చూస్తుంటే ఇప్పుడికిప్పడు షో స్టార్ట్ చేస్తున్నామని చెప్పినా కూడా అభిమానులు, ప్రేక్షకులు చలో టూ ఓం మూవీ అంటూ థియేటర్స్ కి దౌడ్ తీస్తారు. అంత క్రేజ్ 'ఓం' సొంతం . ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీ లీల, అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి.. ఈ లిస్ట్ చాలనుకుంటా! పైన చెప్పుకున్న మాట ఎలాంటి వాస్తు, అక్షర దోషం లేని వాస్తవమని. మరి ఈ మూవీ ఫస్ట్ రివ్యూ చూసేద్దాం.    ఈ నెల 20 న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) తాజాగా సెన్సార్ పూర్తి చేసి U/A (UA16+) సర్టిఫికెట్‌ జారీ చేసింది. సుమారు 179 నిమిషాలు అంటే 2 గంటల 59 నిమిషాల భారీ రన్‌టైమ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. సెన్సార్ బోర్డు సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న ఫస్ట్ రివ్యూ ప్రకారం, ఈ సినిమా కథాంశం ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని ఎర్రచందనం అడవుల నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. మమ్ముట్టి ఇందులో బర్మా కార్తీకేయన్ అలియాస్ సియా అనే శక్తివంతమైన గంధపు చెక్కల స్మగ్లింగ్ డాన్‌గా కనిపించనుండగా, అతడికి నమ్మినబంటుగా చెజియన్ అలియాస్ తిరు కుమరన్ క్యారక్టర్ లో  ధనుష్ కనిపిస్తున్నాడు.   వీరిద్దరూ కలిసి ఏకంగా 1,000 టన్నుల విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేయడానికి భారీ ప్రణాళిక వేస్తారు. అందులో భాగంగా మొదటి విడతలో 300 టన్నుల సరుకును విజయవంతంగా గమ్యస్థానానికి చేరవేస్తారు. అయితే, మిగిలిన 700 టన్నుల భారీ సరుకు అనుకోకుండా మాయమవడంతో కథలో అసలైన మలుపు తిరుగుతుంది. 700 టన్నుల సరుకు గల్లంతవడంతో రెండు బలమైన మాఫియా గ్రూపుల మధ్య భీకరమైన అంతర్యుద్ధం మొదలవుతుంది. ఈ క్రమంలో తన బాస్ కార్తీకేయన్‌కే తిరు కుమరన్ ఎదురు తిరగడం, అండర్ కవర్ ఆపరేషన్‌లో భాగంగా అసలు దొంగ ఎవరనే కోణంలో కథ నడవడం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుందని ఫస్ట్ రివ్యూ టాక్ వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: దుల్కర్ మరో హిట్ అందుకున్నాడా!  మరోవైపు ఈ హై ప్రొఫైల్ స్మగ్లింగ్ కేసును ఛేదించడానికి ఐపీఎస్ అధికారిణి నిత్యా రెడ్డి పాత్రలో సాయి పల్లవి రంగంలోకి దిగుతారు. ట్రైలర్ మరియు సెన్సార్ రిపోర్ట్స్ ప్రకారం, స్టార్ హీరోల సరసన సాయి పల్లవి తన నటనతో, పవర్‌ఫుల్ యాటిట్యూడ్‌తో స్క్రీన్‌ను శాసించారని తెలుస్తోంది. ఇక ధనుష్ భార్య రోజా పాత్రలో టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల నటించగా, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా, రేణు దేశాయ్ కీలక పాత్రల్లో మెరిశారు.   సాంకేతిక అంశాల విషయానికి వస్తే, యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది.  ఎర్రచందనం అడవుల్లో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లకు యానిక్ బెన్, కెచ్చా ఖంఫాక్డీ స్టంట్ కొరియోగ్రఫీ, ఎజిల్ అరసు విజువల్స్ సినిమా స్థాయిని పెంచాయి. వాస్తవానికి అక్టోబర్ 16నే విడుదల కావాల్సిన ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా నవంబర్ 20కి వాయిదా పడింది. తెలుగు వెర్షన్‌కు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తుండటం, తమిళ వెర్షన్‌లోనూ దాదాపు 30 శాతం తెలుగు డైలాగులు ఉండటం విశేషం. వింటేజ్ మాస్ ధనుష్‌కు ఇది ఒక బిగ్ కమ్‌బ్యాక్ మూవీగా నిలుస్తుందని ఫస్ట్ రివ్యూ స్పష్టం చేస్తోంది. మీకు నచ్చవచ్చు:ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ! మీకు నచ్చవచ్చు:రమ్యకృష్ణ మొదటి సంపాదన వైరల్!   [Dhanush, Om, Sai Pallavi, mammotty, raj Kumar periya swami, Sreeleela]  
కొన్ని చిత్రాల ప్రచార చిత్రాలు చూస్తుంటేనే సదరు మూవీ అలా వచ్చి వెళ్లడమే కాదు.. మన మనసులో గట్టిగానే తిష్ట వేస్తుందని అనిపిస్తుంది. అలాంటి ఆనవాళ్లు 'ఆకాశంలో ఒక తార' లో కనపడుతున్నాయనే మాట సినీ సర్కిల్స్, ప్రేక్షకుల్లో వినపడుతూ ఉంది. మేకర్స్ లక్ష్యం కూడా అదే అనే విషయం ప్రీ రిలీజ్ తర్వాత చాలా స్పష్టంగా వినపడుతుంది పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందిన  ఆకాశంలో ఒక తార  ఈ నెల 20 న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇటీవల విడుదలైన ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలు, అలాగే సెన్సార్ బోర్డు నుండి వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇటీవలే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి ఈ చిత్రానికి క్లీన్ 'యు/ఎ' (U/A) సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ సభ్యుల నుండి  పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 160 నిమిషాల (2 గంటల 40 నిమిషాలు) నిడివితో రూపొందిన ఈ చిత్రంలో భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, స్ఫూర్తిదాయక సన్నివేశాలు అద్భుతంగా పండాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. 2 నిమిషాల 27 సెకన్ల నిడివి గల ట్రైలర్ కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్తితో మొదలై, ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. సాంకేతికంగా కూడా ఈ సినిమాకు అత్యున్నత స్థాయి నిపుణులు పనిచేశారు. రెండుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, అంతరిక్ష కలల దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. జాతీయ అవార్డు గ్రహీత కె.ఎల్. ప్రవీణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్ బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా చదవండి: ENE రిపీట్ ఫస్ట్ రివ్యూ ఇదే! ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఈ కథ ప్రతి మహిళ కలను నిజం చేసే అద్భుతమైన చిత్రమని ప్రశంసించారు. మొత్తం మీద, మనసును హత్తుకునే కథ, దుల్కర్ సల్మాన్ నటన, జి.వి. ప్రకాశ్ సంగీతంతో 'ఆకాశంలో ఒక తార' బాక్సాఫీస్ వద్ద మరో క్లాసిక్ హిట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కథ విషయానికి వస్తే, ఇది ఒక సామాన్య గ్రామీణ నేపథ్యం నుండి అంతరిక్ష కలల దిశగా సాగే ఒక అద్భుతమైన ప్రయాణం. తెలుగు రాష్ట్రాల్లోని ఒక చిన్న పల్లెటూరికి చెందిన కల్పన అనే యువతి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని. చదువులో చురుకైన కల్పనకు వ్యోమగామి (ఆస్ట్రోనాట్) కావాలనేది జీవిత ఆశయం. కానీ ఆ ఊరిలో చాలా మంది ఆమె కలను చూసి ఎగతాళి చేస్తారు, కొందరికైతే అసలు ఆస్ట్రోనాట్ అంటే ఏంటో కూడా తెలియదు. కుటుంబ సభ్యులు, సమాజం ఆమె ప్రతిభను గుర్తించకపోగా, ఆమె ఆశయాలను నిరుత్సాహపరుస్తూ పెళ్లి చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి భర్తగా కృష్ణ అడుగుపెడతాడు.   భార్య కలను తన కలగా భావించి, ఆమె ఆశయాన్ని నిజం చేయడానికి కృష్ణ చేసే పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒక పరిపూర్ణమైన, భార్యకు అండగా నిలిచే 'గ్రీన్ ఫారెస్ట్' భర్తగా ఒదిగిపోయారు. కల్పన పాత్రలో నూతన నటి సాత్విక వీరవల్లి పరిచయమవుతున్నారు. తన సహజమైన నటన, అమాయకత్వంతో సాత్విక తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేలా కనిపిస్తున్నారు. వీరి ప్రయాణంలో నాసా (NASA) ఉద్యోగిని రోహిణిగా శృతి హాసన్ ఒక కీలక మలుపుగా నిలుస్తారు. రోహిణితో కృష్ణ పరిచయం కల్పనను తన లక్ష్యానికి ఎలా చేరువ చేసిందనేది అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు.   మీకు నచ్చవచ్చు:రామాయణ కలెక్షన్ల తుఫాన్! మీకు నచ్చవచ్చు:అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో ఆ స్టార్ హీరో!   [Aakasamlo Oka Tara, Dulquer Salmaan, Satvika Veeravalli, Pawan Sadineni]
యూత్, జెన్ జీ, మూవీ లవర్స్ అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న మూవీ ENE రిపీట్. ఉరఫ్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 .  2018 లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ కూడా కావడంతో ప్రేక్షకులు కూడా రీగర్ గా వెయిట్ చేస్తున్నారు.  ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన  ఫస్ట్ రివ్యూ ఇదే అంటూ సోషల్ మీడియాలో సరికొత్త పులకింతలు రేపుతోంది.     మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎంటర్ టైన్ మెంట్ గా సాగుతుందని, ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే తో సీన్స్ వచ్చాయని ఫిలిం సర్కిల్స్ లో అంటున్నారు. సెన్సార్ బోర్డు UA' సర్టిఫికెట్ ఇవ్వడం శుభసూచికం. మూవీ చూసిన సెన్సార్ వాళ్ళు కూడా మూవీ బాగుందని చెప్పినట్టుగా సోషల్ మీడియా కథనం. నిడివి  దాదాపు 2 గంటల 35 నిమిషాలు. మొదటి భాగంలో కార్తీక్ పాత్రలో కనిపించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి 'హిట్' ఫేమ్ శ్రీనాథ్ మాగంటి జాయిన్ అవ్వడం సినిమాకు ఒక కొత్త ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చిందని ప్రీ-రిలీజ్ టాక్ వినిపిస్తోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమానుల మధ్య ఉండే సహజమైన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసలో సాగే పంచ్ డైలాగులు ఈసారి కూడా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  అయితే, మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్‌లో తరుణ్ భాస్కర్ కేవలం వినోదానికే పరిమితం కాకుండా బలమైన ఎమోషనల్ డ్రామాను కూడా జోడించినట్లు ట్రైలర్ మరియు చిత్ర బృందం మాటల ద్వారా స్పష్టమవుతోంది. ఇది కూడా చదవండి:చావు అంచుల దాకా వెళ్లొచ్చిన అమితాబ్!  కొత్తగా ఈ గ్యాంగ్‌లో చేరిన శివాత్మిక రాజశేఖర్ పాత్ర కథలో కీలక మలుపు తిప్పనుండగా, అనీషా ఆంబ్రోస్ మరోసారి షెర్లీ పాత్రలో అలరించనుంది. అంతేకాకుండా, వివేక్ సాగర్ అందించిన నేపథ్య సంగీతం మరియు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.    బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 2,567 షోలకు గాను దాదాపు 1.95 లక్షల టికెట్లు అమ్ముడై 2.84 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా 40 శాతం బుకింగ్స్ నమోదవ్వడం విశేషం. నెగటివ్ రివ్యూలు లేదా సోషల్ మీడియా ట్రోల్స్ గురించి తాను ఏమాత్రం ఆందోళన చెందడం లేదని, నిజాయితీతో కూడిన ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించామనే నమ్మకంతో తరుణ్ భాస్కర్ ఉన్నారు. మరి మొదటి భాగం సృష్టించిన కల్ట్ మ్యాజిక్‌ను 'ఈఎన్ఈ రిపీట్' మళ్ళీ రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.   మీకు నచ్చవచ్చు:భోగి వచ్చేస్తుంది: శర్వానంద్ హిట్ కొడుతున్నాడా! మీకు నచ్చవచ్చు:11000 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో సంచలనం నమోదు!     [ENE Repeat, Vishwak Sen, Srinadh, Abinav, Tarun Bhaskar, Tollywood]  
Fatima Vijay Antony made her first public appearance in nearly five years at the pre-release event of her husband Vijay Antony's upcoming film Appakutty. The emotional occasion turned into a deeply personal moment as she spoke about their late daughter Meera and revealed how the family continues to cherish her memories. One of the most touching revelations was about Vijay Antony's decision to stop wearing expensive watches. Fatima revealed that he now wears a simple watch that belonged to Meera, which she had bought for her daughter. When she suggested that he switch to a smartwatch to monitor his health, Vijay reportedly told her, "This is my Meera's watch. From now on, she will take care of my health." Fatima also revealed why Vijay Antony is often seen walking barefoot. She said that Meera had several pairs of shoes bought for her as she was preparing to go to college. After her demise, those unused shoes remained at home, and seeing them prompted Vijay to decide that he would never wear footwear again. He wears shoes only when absolutely necessary for overseas concerts. Speaking about their daughter's belongings, Fatima said Meera always wore a single earring and that she even removed it before bidding her final farewell. The family has also kept her room exactly as she left it and is planning to turn it into their own room, as Meera had wished. Fatima also spoke about Vijay Antony's personality at home, revealing that the otherwise reserved actor has a mischievous sense of humour. She said he often breaks television sets and mobile phones through his playful antics, adding that he continues to protect and support her and their younger daughter through difficult times. Overwhelmed with emotions, Fatima concluded her speech by addressing Meera directly, saying, "Meera, wherever you are, please lead this event." She also thanked Vijay and his close friends for helping her return to public life. Her heartfelt words offered a glimpse into how the family is finding the strength to move forward while keeping Meera's memories alive.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
చాలామంది భారతీయుల దినచర్య ఉదయం పూట ఒక వేడి వేడి టీ కప్పుతోనే ప్రారంభమవుతుంది. దానికి తోడు రెండు బిస్కెట్లు తింటే అల్పాహారం పూర్తయినట్లుగా ఎంతో సంతృప్తిగా భావిస్తారు. తక్కువ ఖర్చుతో, ఎంతో సులభంగా దొరికే ఈ సాధారణ అలవాటు దాదాపు ప్రతి మధ్యతరగతి ఇళ్లలోనూ కనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా కేవలం టీ, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతుందనేది చాలామందికి తెలియదు. కన్సల్టెంట్ డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, ఈ అలవాటును కేవలం 30 రోజుల పాటు నిరంతరం కొనసాగిస్తే శరీరంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. టీ, బిస్కెట్లు తినడం అప్పటికప్పుడు ఆకలిని తాత్కాలికంగా తగ్గించినప్పటికీ, శరీరానికి అవసరమైన ఎలాంటి పౌష్టికాహారాన్ని అందించడంలో పూర్తిగా వెనుకబడతాయి. ముఖ్యంగా ప్యాకెట్లలో లభించే బిస్కెట్లలో మైదా పిండి, రిఫైండ్ చక్కెర, అదనపు కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో నిండి ఉంటాయి. అలాగే తీపి కలిపిన టీ నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పూర్తిగా లోపించిన ఇలాంటి అల్పాహారం తీసుకోవడం వల్ల రోజువారీ శక్తి తగ్గిపోవడం, ఆకలి నియంత్రణ కోల్పోవడం మరియు జీవక్రియ మందగించడం జరుగుతుంది. ఉదయం పూట మైదాతో తయారైన బిస్కెట్లు, చక్కెర కలిపిన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్షణాల్లో వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అకస్మాత్తుగా పెరిగిన చక్కెర స్థాయిలను నియంత్రించడానికి శరీరం అత్యవసరంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొనసాగిస్తే కొంతమందిలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రీడయాబెటిస్ లేదా మధుమేహ సమస్యల బారిన పడినవారు ఇలాంటి ఆహారపు పొరపాట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బిస్కెట్లలో ఫైబర్ మరియు ప్రొటీన్లు నామమాత్రంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన అస్సలు కలగదు. దీనివల్ల ఉదయం 10 గంటల సమయానికే విపరీతమైన ఆకలి వేయడం, శరీరం నీరసించిపోవడం, తీవ్రమైన అలసట, చిరాకు మరియు ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, నెల రోజుల పాటు ఈ అలవాటును పాటిస్తే శరీరానికి కావలసిన విటమిన్లు, కాల్షియం, బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడి ఎముకల బలం క్షీణించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఈ కేలరీల భారాన్ని గమనిస్తే, చక్కెర మరియు చెడు కొవ్వులు అధికంగా ఉండే టీ, బిస్కెట్లను రోజూ తీసుకోవడం ద్వారా శరీరంలో అదనపు కేలరీలు పేరుకుపోతాయి. ఇది క్రమంగా బరువు పెరగడానికి మరియు కొలెస్ట్రాల్ సంబంధిత గుండె సమస్యలకు దారితీస్తుంది. అలాగే టీలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తలెత్తి శరీరం ఎప్పుడూ అలసటగా మారుతుంది. అయితే, టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు గానీ దానితో పాటు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర లేని టీ తీసుకోవడం, రాత్రంతా నానబెట్టిన 8 నుంచి 10 బాదం పప్పులను తినడం లేదా ఇంట్లో తక్కువ నూనెతో వేయించిన మఖానాలను అల్పాహారంగా ఎంచుకోవడం మంచిది. సరైన పోషకాహారాన్ని ఎంచుకోవడం ద్వారా కేవలం 30 రోజుల్లోనే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!                                   ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర!       Biscuits With Morning Tea, Daily Biscuit Side Effects, Unhealthy Breakfast Habits, Sugar And Maida Dangers, Weight Gain Risks, Doctor Health Advice, Health Tips In Telugu.  
మనలో చాలా మంది రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా పళ్ళు తోముకున్నప్పటికీ, దంతాల పై భాగంలో మరియు మూలల్లో కఠినమైన పాచి, పసుపు రంగు మరకలు పేరుకుపోవడం చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. ఈ విధంగా దంతాలపై పేరుకుపోయే మురికి కాలక్రమేణా దంతాలను బలహీనపరచడమే కాకుండా, చిగుళ్ల వాపు మరియు ఇతర దంత సంబంధిత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ మొండి మరకలను తొలగించుకోవడానికి ఎలాంటి ఖరీదైన డెంటల్ ట్రీట్‌మెంట్‌లకు లేదా ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన వంటింట్లో లభించే సాదాసీదా పదార్థాలతోనే వీటిని సులభంగా వదిలించుకోవచ్చు. దంతాలపై పడిన మొండి మరకలను పూర్తిగా వదిలించడంలో బేకింగ్ సోడా ఒక అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో 1 నుండి 2 స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, అందులో తగినన్ని నీళ్లు లేదా కొద్దిగా కొబ్బరి నూనె కలిపి చక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్‌ను మీ టూత్‌బ్రెస్ట్‌పై వేసి పళ్లను, ముఖ్యంగా మరకలు ఎక్కువగా ఉండే వెనుక భాగాలను సుమారు ఒక నిమిషం పాటు చాలా మెల్లిగా రుద్దాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో నోరు కడుక్కోవడం ద్వారా దంతాల మీద ఉన్న మురికి సులభంగా వదులుతుంది. ఈ బేకింగ్ సోడా మిశ్రమాన్ని వారంలో కేవలం 2 నుంచి 3 సార్లు మాత్రమే క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల దంతాలపై ఉన్న పాచి పూర్తిగా తొలగిపోయి, మునుపటి మెరుపు తిరిగి వస్తుంది. అయితే బేకింగ్ సోడాను అతిగా ఉపయోగించడం దంతాల ఎనామిల్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి సూచించిన మోతాదులోనే వాడటం ఎంతో ముఖ్యం. ఇది దంతాల తెల్లటి రంగును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు, మన నోటి ఆరోగ్యానికి పచ్చి కొబ్బరి నూనె ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ ఉదయం బ్రష్ చేసే ముందు ఒక స్పూన్ స్వచ్ఛమైన పచ్చి కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని కొన్ని నిమిషాల పాటు గట్టిగా పుక్కిలించాలి (ఆయిల్ పుల్లింగ్). ఇలా చేయడం వల్ల నోటిలోని దాదాపు హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది మరియు పంటి నొప్పులు కూడా క్రమంగా దూరం అవుతాయి. ఇది కూడా చదవండి: ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి! ఇక బేకింగ్ సోడా, కొబ్బరి నూనె రెండింటినీ కలిపి ఉపయోగిస్తే మరింత అద్భుతమైన మరియు వేగవంతమైన ఫలితాలు ఉంటాయి. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి ఒక ప్రత్యేక మిశ్రమంలా తయారు చేయాలి. దీనిని బ్రష్‌కి రాసుకుని పళ్లను శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్లపై ఉన్న మురికి, పసుపు రంగు పూర్తిగా వదిలిపోతుంది. ఈ మిశ్రమం దంతాలను శుభ్రపరచడమే కాకుండా నోటిని రోజంతా తాజాగా ఉంచుతుంది మరియు నోటి దుర్వాసన రాకుండా సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ సాధారణ ఇంటి చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా, మెరిసేలా కాపాడుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!                           వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు!       Remove Tartar At Home, Yellow Teeth Remedies, Plague Removal Tips, Natural Dental Care, Oral Hygiene Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతగా మారుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులు మరియు వృద్ధులు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి జిమ్‌లకు వెళ్లే బదులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వైద్య నిపుణులు మరియు ఆరోగ్య సర్వేల తాజా నివేదికల ప్రకారం, 50 ఏళ్లు పైబడిన వారు ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి టీవీ మరియు యూట్యూబ్ (YouTube) మాధ్యమాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు వెల్లడైంది. బిజీ లైఫ్‌స్టైల్, ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడం మరియు ఇంట్లోనే ఉంటూ నిపుణుల మార్గదర్శకత్వంలో వ్యాయామాలు చేయడం ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతకంటే ముఖ్యం. చాలామంది మధ్య వయస్కులు తమ ఇళ్లలోని లివింగ్ రూమ్‌లలో డిజిటల్ స్క్రీన్‌లను ఆన్ చేసి, ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ కోచ్‌లు అందించే గైడెడ్ వర్కవుట్‌లను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా యోగా, స్ట్రెచింగ్, లైట్ కార్డియో మరియు బ్యాలెన్స్ ఎక్సర్‌సైజెస్‌ను యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటూ క్రమం తప్పకుండా ఆచరిస్తున్నారు. దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పట్టడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. ఇంటి వద్దే వ్యాయామాలు చేయడం వల్ల వృద్ధులకు ప్రయాణ భారం తప్పుతుంది. వ్యాయామశాలకు వెళ్లే శ్రమ లేకుండా, తమకు నచ్చిన సమయంలో, తమ శరీర సామర్థ్యానికి తగినట్లుగా వ్యాయామాలను ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది. యూట్యూబ్‌లో లభించే ఉచిత వీడియోలు మరియు లైవ్ సెషన్‌లు వీరికి ఎంతగానో సహాయపడుతున్నాయి. నిపుణుల సలహాల మేరకు రోజుకు కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు డిజిటల్ మాధ్యమాల సహాయంతో వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, డిజిటల్ వ్యాయామాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఏ వయసు వారైనా తమ శరీర తత్వానికి, ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామాలను మాత్రమే ఎంచుకోవాలి. ఏకతాటిగా కష్టమైన వ్యాయామాలు కాకుండా, తేలికపాటి కదలికలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. ఇంట్లోనే ఉంటూ టీవీ స్క్రీన్ ద్వారా పెద్ద అక్షరాలు మరియు స్పష్టమైన విజువల్స్ సహాయంతో వ్యాయామాలు చేయడం వల్ల భంగిమలు (Posture) సరిగ్గా ఉండేందుకు వీలవుతుంది. ఇది కూడా చదవండి: ఎముకల బలం మరియు, హార్మోన్ల సమతుల్యత, కోసం వేయించిన ఖర్జూరాలు! ఈ డిజిటల్ ఫిట్‌నెస్ ట్రెండ్ కేవలం శారీరక బలాన్నే కాకుండా, వృద్ధులలో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నామనే భావనను పోగొట్టుకోవడానికి, తమ వయసుకు తగిన ఆరోగ్య చిట్కాలు మరియు వ్యాయామ దినచర్యలను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటూ వారు ఉత్సాహంగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ డిజిటల్ వ్యాయామ ప్రయాణంలో తోడ్పాటునందిస్తూ, వారిని ప్రోత్సహిస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే, టెక్నాలజీ మరియు ఆరోగ్యం జోడై మధ్య వయస్కులు, వృద్ధుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తున్నాయి. జిమ్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా, ఖరీదైన వ్యాయామ పరికరాలు కొనుగోలు చేయకుండా కేవలం టీవీ మరియు యూట్యూబ్ మాధ్యమాలతో ఫిట్‌గా మారవచ్చని నిరూపితమవుతోంది. సరైన క్రమశిక్షణ, నిపుణుల పర్యవేక్షణ మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కూడిన ఈ ఇంటిపట్టునే చేసే వ్యాయామ విధానం రాబోయే రోజుల్లో మరింత ప్రాచుర్యం పొందుతుందనడంలో సందేహం లేదు. మీకు నచ్చవచ్చు:బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, తర్వాత రోగనిరోధక శక్తి, కోలుకోవడం ఎలా?                                 మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!       Senior Fitness Workouts, Elders Home Exercise, YouTube Fitness Channels, Middle Aged Health Trends, Safe Workouts For Seniors, Healthy Aging Tips, Health Tips In Telugu.  
షుగర్ (Diabetes) ఉన్నవారికి గుండె జబ్బులతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందా? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని రక్తనాళాలు, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? ఇలాంటి ముఖ్యమైన ఆరోగ్య విషయాల గురించి ఈ వీడియోలో డాక్టర్ శాస్త్రి వివరించారు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా నియంత్రణలో లేకపోతే రక్తనాళాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడటం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు పెరగవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. డయాబెటిక్ స్ట్రోక్ అంటే ఏమిటి? మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? షుగర్ వ్యాధి మెదడులోని రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు: ముఖం ఒకవైపు వాలిపోవడం లేదా కండరాల్లో బలహీనత రావడం. ఒక చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం లేదా తిమ్మిరి రావడం. మాట తడబడటం లేదా మాట్లాడటంలో ఇబ్బంది కలగడం. అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా కనిపించకపోవడం. నడవడంలో ఇబ్బంది, తల తిరగడం, శరీర సమతుల్యత కోల్పోవడం. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం. స్ట్రోక్ విషయంలో గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది. మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని స్ట్రోక్ చికిత్స అందించే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రారంభ గంటల్లో అందించే చికిత్స వల్ల మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల స్ట్రోక్ చికిత్సలు లక్షణాలు ప్రారంభమైన సమయం ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను ఎలా గుర్తిస్తారు? తక్షణ చికిత్సలో ఎలాంటి వైద్య విధానాలను అనుసరిస్తారు? గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి షుగర్ వ్యాధిని ఎలా నియంత్రించుకోవాలి? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను డాక్టర్ శాస్త్రి ఈ వీడియోలో వివరించారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, అత్యవసర చికిత్స, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. సకాలంలో గుర్తించి వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్, గుండె ఆరోగ్యం, స్ట్రోక్ లక్షణాలు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ శాస్త్రి అందిస్తున్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.  
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!