జనసేన ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ కార్యకర్తగానే ఉంటాననీ, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తన సోదరుడు పవన్ కల్యాణ్ కు అండగా, సహాయంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా చాలా హ్యాపీగా ఉన్నానన్న నాగబాబు, తనకు ఇది చాలని అన్నారు. వచ్చే ఎన్నికలే కాదు, అసలు ఏ ఎన్నికలలోనూ తాను పోటీ చేయనన్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం (డిసెంబర్ 14) శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనన్న ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.  వాస్తవానికి తాను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే.. 2024 ఎన్నికలలోనే పోటీకి దిగేవాడనన్న ఆయన.. తాను స్వయంగా   నిర్ణయించుకోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.    అయితే వాస్తవానికి నాగబాబు 2024 ఎన్నికలలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగాలని భావించారు. అందుకు అన్ని విధాలుగా సంసిద్ధమయ్యారు కూడా. అయితే కూటమి పొత్తు ధర్మంలో బాగంగా ఆయన అనివార్యంగా విరమించుకోవలసి వచ్చింది. అనకాపల్లి నుంచి అవకాశం లేదన్నది నిర్ధారణ అయ్యాక కూడా నాగబాబు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే పొత్తు ధర్మం కారణంగా అప్పట్లో ఆ అవకాశం కూడా దక్కలేదు.  సరే వచ్చే ఎన్నికల్లో అయినా శ్రీకాకుళం నుంచి బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన తరచుగా శ్రీకాకుళంలో పర్యటనలు చేస్తూ వచ్చారు. ఎంత ఎక్కువగా అంటే గత ఏడాది కాలంలో ఆయన శ్రీకాకుళంలో 12 సార్లు పర్యటించారు. దీంతో నాగబాబు కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడి సీటుపై కన్నేశారంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇదో పెద్ద వివాదంగా పరిణమించే అవకాశాలున్నాయని గ్రహించిన నేపథ్యంలో నాగబాబు శ్రీకాకుళం వేదికగా తనకు అసలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రకటించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
గుంటూరులో  ఇటీవల   ఉండవల్లి అరుణకుమార్, అంబటి రాంబాబు కలిసి,  ఇద్దరు మాజీ ఎంపీలు, టీడీపీ నాయకులు యలమంచిలి శివాజీ, రాయపాటి సాంబశివరావులను కలిశారు. వారిద్దరూ ఆనారోగ్యంతో ఉన్నారని పరామర్శకు వెళ్ళామని అంబటి ఒక వీడియో చేసి యూట్యూబ్ లోని తన సొంత సైట్‌లో పెట్టారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.  తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి?  ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.  అంబటి రాంబాబు అప్పుడెప్పుడో అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట, 1989లో రేపల్లెలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదైపోయాక మళ్లీ 2019లో వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు మంత్రిగా కూడా పని చేశారు.  అంతే మళ్లీ ఆయన్ని సత్తెనపల్లికి కూడా పనికిరాడని తేల్చేసిన జగన్ జిల్లా మార్చేసి.. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఆయన ఆశలు పెట్టుకున్న గుంటూరు వెస్ట్ పార్టీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దాంతో అంబటి వారు నియోజకవర్గం లేని మాజీ మంత్రిగా మిగిలిపోయారు. అదలా ఉంటే రాజధాని  అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అమరావతిపై కమ్మ సామాజికవర్గం ముద్ర వేసి, ఆ ఆక్కసుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన వైసీపీకి జిల్లా వాసులు తగిన బుద్ది చెప్పారు. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. ఆ క్రమంలో జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆ ఎఫెక్ట్‌తో ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జులకు బాధ్యతలు కట్టబెడుతోంది. అందులో భాగంగానే తమ పార్టీపై ఉన్న కమ్మ వ్యతిరేక ముద్రను తుడిచేసుకోవడానికి అంబటి రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. పొలిటికల్‌గా ఎక్స్‌పైర్ అయిపోయి, దాదాపు అందరూ మర్చిపోతున్న టీడీపీ మాజీ ఎంపీలు, గుంటూరులో సీనియర్ కమ్మ నేతలు రాయపాటి సాంబశివరావు, యలమంచిలి శివాజీలు అందుకే అంబటికి గుర్తు కొచ్చారంటున్నారు. ఏదో ఒక వంక చెప్పి వారితో మాట్లాడివస్తే, లేనిపోని విమర్శలు వస్తాయి కాబట్టి... వారి అనారోగ్యం పేరు చెప్పి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి వారిని కలిసి వచ్చారు. ఆ సందర్భంగా 80 ఏళ్లు పైబడిన యలమంచలి శివాజీ రాజ్యసభ స్థానానికి ఇప్పటికీ అర్హులని అయన్ని అందలానికెక్కించేసేలా మాట్లాడారు.  ఈ సందర్భంగా ఉండవల్లికి సోదరుడు వరుసయ్యే రఘు అనే పెద్దాయన్ని కలిస్తే.. ఆయన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అయిపోతారని జోస్యం చెప్పేశారు. అదలా ఉంటే వైఎస్ కు అంబటి , ఉండవల్లి ఇద్దరూ ఆప్తులు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు కూడా. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించేసిన ఉండవల్లి   సమయం వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబును విమర్శిస్తుంటారు.  జగన్ పై కూడా విమర్శలు చేసినా అవి చాలా సున్నితంగా, జనగ్ హితం కోరి ఇస్తున్న సలహాల్లా  ఉంటాయి. అటువంటి ఉండవల్లి ఇప్పుడు  పనిమాలా గుంటూరు రావడం, అంబటితో కలసి రాయపాటిని, శివాజీ ని కలవడం.. శివాజీ రాజ్య సభలో ఉండాల్సిన వారంటూ పొగడ్తలు కురిపించడం వెనుక ఎదో మతలబు ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సొంత పార్టీలో నియోజకవర్గం లేక .. టీడీపీ మాజీలైన కమ్మ దిగ్గజాలతో అలా కానిచ్చేస్తున్న అంబటి లెక్కలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
  తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనత పార్టీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. అనుకొగానే బీజేపీ  అధికారంలోకి రావడానికి "ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కేంద్ర మంత్రి  అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, "ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు" అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ కామెంట్స్ రానున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో  బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉంది
ALSO ON TELUGUONE N E W S
      -వార్నింగ్ ఇస్తున్న దర్శకుడు ఎవరు -ఈ నెల 19 న ఏం జరగబోతుంది -లెటర్ లో ఏముంది -జేమ్స్ కామెరూన్ ఏమంటున్నాడు!     వరల్డ్ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ సినీ పితామహుడు జేమ్స్ కామెరూన్(James Cameron)మరో అద్భుత సృష్టి  'అవతార్ 3 ఫైర్ అండ్ యాష్'(Avatar 3: Fire and ash)ఈ సారి పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ ని కామెరూన్ పరిచయం చేయబోతున్నాడు. దీంతో  ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు పార్టులకి మించి సెల్యులాయిడ్ పై సరికొత్త వండర్ ప్రత్యక్షం కాబోతుంది. ఈ నేపధ్యంలో పార్ట్ 3 ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలనుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతు ఉంది. ఇప్పుడు వాళ్ల తొందరని జేమ్స్ కామెరూన్ రాసిన ఒక లేఖ రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.     రీసెంట్ గా కామెరూన్  థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేకమైన లేఖ రాసారు. సదరు లేఖలో ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీ లో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ కూడా ముఖ్యం.సౌండ్ సిస్టమ్ ని నేనే  వ్యక్తిగతంగా మిక్స్ చేశాను. పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ని తగ్గించవద్దు. థియేటర్ల నిర్వహణ ప్రేక్షకుల అనుభూతిలో కీలకం.ఆ విషయంలో ఎలాంటి రాజీపడవద్దు. ఒక రకంగా   హెచ్చరిక లాంటిదని తన లెటర్ లో కామెరూన్  స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.      also read:   తిండి, నిద్ర మానేసి రాత్రంత అదే పని.. దాంతో ఆరోగ్యం నాశనం        దీంతో కామెరూన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా  స్పందిస్తు 'ప్రపంచ సినీ ప్రేక్షకులకి అత్యుత్తమ క్వాలిటీ తో సినిమాని అందించాలనే నిబద్దత కామెరూన్ కి ఎంతలా ఉంటుందో అనడానికి ఇదొక  నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవతార్ 3 సుమారు 400 మిలియన్ల డాలర్స్ తో తెరకెక్కింది.        
Funky starring Mass ka Das Vishwak Sen has created good impression among audiences with the first glimpse. He is playing the role of a film director and Kaydu Lohar is debuting in Telugu, as leading lady. Jathiratnalu director KV Anudeep is directing this hilarious entertainer.  Well, the makers have decided to prepone the film to Valetine's Day weekend and locked 13th February release date. Interestingly, Vishwak's previous movie, Laila failed big time at the box office and the actor got thrashed for accepting such an outdated, cringe and cheap comedy in today's day and age.    It looks like he is trying to find his box office success during the same weekend next year as he got criticised and trolled all over this year. Initially, makers planned to release the film during April 2026, but the works have been completed early for them to go with a pre-ponement of release.   Produced by S Naga Vamsi and Sai Soujanya, Funky promises to be a big change for the production house Sithara Entertainments, who faced major losses this year. The movie is expected to become a big comeback for Vishwak, Anudeep and Naga Vamsi. Let's hope that is the case for the next Valentine's Day Weekend.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ కి సినిమాలు రాకపోవడం అనేది కామన్ అయిపోయింది. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అలాంటిది ఒక సినిమా మాత్రం.. ఊహించని విధంగా ప్రీ పోన్ అయ్యి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. (Funky Movie)   విశ్వక్ సేన్ హీరోగా 'జాతి రత్నాలు' ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఫంకీ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026, ఏప్రిల్ 3న విడుదల చేయనున్నట్లు.. నెల రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని అనూహ్యంగా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు.   Also Read: బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా అఖండ-2   ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా 2026 ఫిబ్రవరి 13న 'ఫంకీ' సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఇలా 50 రోజులు ముందుకి ప్రీ పోన్ అయిన సినిమా లేదనే చెప్పాలి.   ప్రీ పోన్ తో సర్ ప్రైజ్ చేసిన 'ఫంకీ'.. కంటెంట్ తోనూ అలాగే సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందుని అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. టీజర్ లోని అనుదీప్ మార్క్ పంచ్ డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'జాతి రత్నాలు' తరహలో అనుదీప్ మరోసారి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.    
The 2025 global box office has proven to be a disastrous year for tentpole films, but towards the end of the year success of Disney's animated sequel, Zootopia 2, rejuvenated box office. The film has not only cemented its franchise status but has also delivered a significant boost to the theatrical exhibition market globally. Walt Disney Animation Studios' Zootopia 2 roared past expectations, crossing the $1 billion milestone at the worldwide box office in a record-shattering 17 days, making it the fastest PG-rated film and fastest animated film ever to achieve the feat.  As of its latest count, the buddy-cop comedy has amassed an estimated global total of $1.137 billion. Its success is notably driven by a colossal international haul, becoming a monumental hit in China, where its gross of over $500 million is one of the highest for any Hollywood film. Zootopia 2 is one of three films to have surpassed the $1 billion threshold globally in 2025, demonstrating a robust and renewed appetite for major event cinema. The two other films joining the exclusive 2025 Billion-Dollar Club are Ne Zha 2, an animated sequel primarily dominating the Chinese market with an approximate worldwide gross of $1.9 Billion, and Disney’s own live-action remake of Lilo & Stitch, which secured its spot earlier in the year with a haul over $1.04 Billion. The performance of Zootopia 2 and Lilo & Stitch gives The Walt Disney Company two $1 billion hits for the year, underscoring the studio's continuing strength in high-grossing, family-friendly releases. With Avatar 3 releasing this weekend, the company is expecting to end the year on absolute summit with over 2 Billion dollars collections worldwide but the movie buzz seems too low for a sequel of such great franchise.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
      ఊర్వశి చెప్పిన సంచలన విషయాలు  ఏం చెప్పింది! రాత్రంతా ఏం పని  తను ఎందుకు అలవాటు చేసుకుంది!     అందంతో పాటు అందానికి తగ్గ అభినయం కలగలిపిన వాళ్ళని ఇంద్రలోకంలో ఉండే రంభ, ఊర్వశి, మేనక తో పోలుస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో ప్రముఖ నటి 'ఊర్వశి'(Urvashi)కూడా ఒకరు. అందుకే కవిత రేంజిని అనే తన పేరుని ఊర్వశి గా మార్చారేమో. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఊర్వశి తన సొంత భాష మళయాళంతో పాటు  తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఇప్పటి వరకు సుమారు 350 కి పైగా చిత్రాల్లో చేసింది. హీరోయిన్ గా అలరించిన చిత్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నేటికి తన కట్ అవుట్ కి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. రీసెంట్ గా ఊర్వశి ఒక ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా నిలిచాయి.     ఆమె మాట్లాడుతు 'మొదటి సారి పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టినప్పుడు వాతారవరణం చాలా కొత్తగా అనిపించింది.ఇంట్లో అందరూ కలిసి తాగడం, తినడం చేసే వారు. దాంతో ఎంత వద్దని అనుకున్నా,  ఆ అలవాట్లు నాకు వచ్చాయి. షూటింగ్ నుంచి రాగానే ఆల్కహాల్ తాగడం అలవాటైపోయింది. క్రమంగా అది ఒక వ్యసనంగా మారిపోయింది. అప్పటికే ఇంటి బాధ్యత భుజాన పడటంతో ఇష్టం లేని పనులు కూడా చేశాను. నా అభిప్రాయాలూ ఇంట్లో ఎవరకి నచ్చక పోవడంతో కోపంతో మరింత ఎక్కువగా తాగే దాన్ని. తిండి, నిద్ర మానేసి తాగడంతో ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాను. ఆ తర్వాత నా స్నేహితులు, పర్సనల్ స్టాఫ్ వల్ల ఆ వ్యసనం నుంచి బయటపడగలిగానని ఊర్వశి చెప్పుకొచ్చింది.     also read:   మహేష్ కి తండ్రిగా  లెజండ్రీ యాక్టర్ ! రాముడు కదా ఫ్యాన్స్ ఏమంటారో మరి     ఊర్వశి వ్యక్తి గత విషయానికి వస్తే 2000 వ సంవత్సరంలో ప్రముఖ మలయాళ నటుడు 'మనోజ్ కె జయన్'(Manoj K jayan)ని పెళ్లి చేసుకొని, 2008 లో విడాకులు తీసుకుంది. జయన్ 1988 లో సినీ రంగ ప్రవేశం చేసి స్టార్ యాక్టర్ గా గుర్తింపు పొందాడు. సుమారు వంద చిత్రాలు తన ఖాతాలో ఉండగా నేటికీ ఎన్నో భారీ చిత్రాల్లో చేస్తు తన సత్తా చాటుతున్నాడు. తెలుగులో కూడా వీడే, శౌర్యం వంటి చిత్రాల్లో కనిపించాడు.  ఊర్వశి, జయన్ కి ఒక కూతురు ఉంది. అనంతరం 2013 లో శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా ఆ ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. శివ ప్రసాద్ చెన్నై కి చెందిన బిజినెస్ మెన్.      
  బాలయ్య బాక్సాఫీస్ గర్జన మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో అఖండ-2  సోమవారం సాలిడ్ బుకింగ్స్   'అఖండ-2'తో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించారు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. వరుసగా ఐదోసారి బాలకృష్ణ ఈ ఫీట్ సాధించడం విశేషం. (Akhanda 2 Thaandavam)   2021లో వచ్చిన 'అఖండ'తో బాలయ్య హిట్ స్ట్రీక్ మొదలైంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా నాలుగు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరాయి. ఇప్పుడదే బాటలో 'అఖండ-2' పయనించింది.   అఖండ-2 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో రోజు, మూడో రోజు కలిపి మరో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీంతో మొదటి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.   Also Read: 'ధురంధర్' బాక్సాఫీస్ ఊచకోత.. పది రోజుల్లో 550 కోట్లు..!   ఇప్పట్లో అఖండ-2 జోరుకి బ్రేకులు పడేలా లేవు. నాలుగో రోజైన సోమవారం కూడా బుకింగ్స్ బాగున్నాయి. బుక్ మై షోలో గంటకు ఐదు వేలకు తగ్గకుండా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే.. ఈ మూవీ మండే టెస్ట్ పాస్ అయినట్లే.   వీక్ డేస్ లో నిలబడిందంటే.. సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. ప్రస్తుత బుకింగ్స్ చూస్తుంటే.. అఖండ-2 కి లాంగ్ రన్ ఉండటం ఖాయమనిపిస్తోంది. అదే జరిగితే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.150-200 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. దాంతో అఖండ-2 బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశముంది.    
      -ఆయన ఓకేనా! -వారణాసి అప్ డేట్ ఏంటి  -ఫ్యాన్స్ ఏమంటారు     సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu),దర్శకధీరుడు రాజమౌళి(SS Rajamouli)అభిమానులే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులు మొత్తం 'వారణాసి'(Varanasi) ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని తమ ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తూ వస్తున్నారు. దీంతో నిత్యం వారణాసి అప్ డేట్స్ గురించి సెర్చ్ చేయడం వాళ్ళ నిత్యదినచర్యల్లో ఒక భాగమైపోయింది.ఈ క్రమంలోనే వారణాసి కాస్టింగ్ కి సంబంధించి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక న్యూస్ వాళ్ళల్లో ఆనందాన్ని నింపుతుంది.     అంతలా వాళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి కారణం వారణాసిలో లెజండ్రీ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj)నటిస్తూ ఉండటమే. అవును వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో చేస్తున్నాడని, సదరు క్యారక్టర్ మహేష్ తండ్రి క్యారక్టర్ అని కూడా అంటున్నారు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ఈ ఇద్దరిది చాలా పెద్ద హిట్ కాంబో. ఎక్కువ శాతం చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా తండ్రి కొడుకులుగా చేసిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాయో తెలిసిందే. వారణాసి చిత్ర యూనిట్ ప్రకాష్ రాజ్ చేస్తున్న విషయాన్నీ త్వరలోనే అధికారకంగా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.     Also read:   ప్రముఖ దర్శకుడు, అతని భార్య దారుణ హత్య.. ఎవరు ఆ కిల్లర్!      ఇక ఈ న్యూస్ పై సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టుని మహేష్ తండ్రిగా ఎంచుకున్నారంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై వండర్ ని సృష్టించే క్యారక్టరే అయ్యి ఉంటుంది. పైగా ప్రకాష్ రాజ్ కూడా తన క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఒప్పుకుంటాడు. ఆల్రెడీ మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రకాష్ రాజ్ క్యారక్టర్ తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడిందని అంటున్నారు. ఇక వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. 2027 వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.         
      చంపింది ఎవరు! ఎందు కోసం చంపారు! దర్శకుడిగా ఎన్నో హిట్ మూవీస్  నటుడుగా కూడా సుదీర్ఘ ప్రయాణం        తండ్రి వారసత్వంతో సినీ రంగంలోకి ప్రవేశించి సదరు వారసత్వాన్ని బలంగా చాటి చెప్పే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వాళ్ళల్లో 'రాబ్ రీనర్' కూడా ఒకరు. ఐదు దశాబ్దాలుగా హాలీవుడ్ సెల్యులాయిడ్ పై తనదైన ముద్ర వేసి హాలీవుడ్ ప్రేక్షకులకే కాకుండా ప్రపంచ సినీ ప్రేమికులకి ఇష్టమైన దర్శకుడిగా మారారు. దిస్ ఈజ్ స్పైనల్ టాప్, స్టాండ్ బై మీ, ది ప్రిన్సెస్ బ్రైడ్, ఏ ఫ్యూ గుడ్ మెన్, ది అమెరికన్ ప్రెసిడెంట్, రూమర్ హాజ్ ఇట్, ఆల్బర్ట్ బ్రోక్స్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. నిన్న రాబ్ రీనర్ 'లాస్ ఏంజెల్స్' లో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఆయనతో పాటు భార్య మైకేల్ సింగర్ కూడా విగత జీవిలా పడి ఉంది. ఈ ఇద్దరు ఒంటిపై కత్తి పోట్లు ఉండటంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త హాలీవుడ్ సినీ సర్కిల్స్ లోనే కాకుండా వరల్డ్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు గల రాబ్ రీనర్ 1984 లో దర్శకుడిగా పరిచయమయ్యాడు. కానీ దర్శకుడి కంటే ముందే ఇరవై ఏళ్ళ వయసులోనే నటుడుగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో విశిష్టమైన క్యారెక్టర్స్ పోషించాడు. అభిమాన గణం కూడా ఎక్కువే.     also read:   అఖండ 2 చూస్తున్న మహిళకి పూనకం.. పూర్తి నిజం ఇదే      ఈ ఏడాది సెప్టెంబర్ 25 న 'ది స్పైనల్ టాప్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన 'ది స్పైనల్ టాప్ 2 ' అనే మాక్యుమెంటరీ కామెడీ ఫిలింలో కనిపించాడు. దర్శకుడు కూడా ఆయనే. విచిత్రం ఏంటంటే దర్శకుడిగా పరిచయమైన మూవీ కూడా స్పైనల్ టాప్ నే. దీంతో మొదటి చిత్రమే ఆఖరి చిత్రంగా మిగలడం అభిమానులని కంట తడి పెట్టిస్తుంది.  సుమారు ఇరవై చిత్రాల వరకు దర్శకత్వం వహించిన రాబ్ నిర్మాతగానూ ఎన్నో గోప్ప సినిమాలని నిర్మించాడు. 1971 లో 'పెన్నీ మార్షల్' అనే నటిని వివాహం చేసుకొని 1984 లో విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాతే మైకేల్ ని 1989 లో వివాహం చేసుకున్నాడు. మొత్తం నలుగురు పిల్లలు. ఇక తండ్రి కార్ల్ రినర్ అమెరికన్ సినీ ప్రపంచంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన లెజండ్రీ సినీ పర్సన్.    
Bad Girlz, an entertainer directed by Phani Pradeep Dhulipudi, who has previously directed the successful '30 Rojullo Preminchadam Ela', locked release date. The film is being produced under the banners of Prashvitha Entertainment, Neeli Neeli Aakasam Creations, and NVL Creations. Anchal Gowda, Payal Chengappa, Roshini, Yashna, Rohan Surya, and Moin are the main actors in 'Bad Girlz'. The tagline for the film, 'Kani Chala Manchodlu', contradicts with the title in an interesting way. Sasidhar Nalla, Emmadi Soma Narsaiah, Ramisetti Rambabu, and Ravula Ramesh are producing this film. This Entertainer film is set to release on December 25th, on the occasion of Christmas. Director Phani Pradeep  Dhulipudi has described his movie as a complete entertainer that explores what it would be like if female characters headlined a Jathi Ratnalu or a MAD.    "We are very happy with how the film has shaped up. It's for everyone to like. You are in for a thorough entertainer," the director said. He added that the talented Anup Rubens has provided excellent music, and that the Oscar-winner Chandra Bose penned the lyrics for all the songs.  He further said, "The songs have come out very well. The recently releasaed song Ila Chusukuntane received very good response with 6 Million views. And Bad Girlz Anthem song is getting a good response as well in Social Media. We will be releasing the remaining songs soon. Please watch our movie in theatres."  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
      -అఖండ 2 జోరు  -బాలయ్య, శివుడి తాండవంకి భారీ రెస్పాన్స్  -ఆ మహిళ ఎవరు -ఎక్కడ జరిగింది     ప్రస్తుతం 'అఖండ 2 '(Akhanda 2)మానియాతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా మొత్తం ఊగిపోతోంది. డేవోషనల్ కంటెంట్ కి అన్ని రకాల ఎమోషన్స్ కుదరడంతో పాటు శివస్థుతుడైన అఘోరగా బాలయ్య(Balakrishna)తన నట విశ్వరూపాన్ని చూపించడంతో అభిమానులే కాకుండా ప్రేక్షకలోకం మొత్తం అఖండ కి దాసోహమయ్యింది. ఎంతలా అంటే మూవీలో  ని చాలా సీన్స్ చాలా మందికి ఫేవరేట్ గా నిలవడమే కాకుండా సదరు సీన్స్ గురించి చాలా గర్వంగా తమకి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. రిపీట్ ఆడియెన్సు కూడా పెద్ద సంఖ్యలోనే థియేటర్స్ లో దర్శనమిస్తున్నారు. బాలయ్యకి తోడుగా పరమేశ్వరుడు, థమన్ కలవడంతో కొంత మంది ఆడవాళ్ళకైతే థియేటర్స్ లోనే పూనకాలు కూడా వస్తున్నాయి.     ఇందుకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)ప్రకాశం జిల్లా ఒంగోలు(Ongole)లోని ఒక మహిళ తన భర్త తో  కలిసి  అఖండ 2 చూడటానికి వెళ్ళింది. క్లైమాక్స్ సీన్  లో శివుడు, అఖండ తాండవం ఆడే సీన్‌ని చూస్తూ సదరు మహిళ ఆ ఇద్దరికి దండం పెడుతూ చేతులు ఊపుతూ, శరీరాన్ని కదిలిస్తూ పూనకంతో ఊగిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఆమె భర్త అదుపు చేసే ప్రయత్నం చేశాడు. థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఆమెను చూస్తు ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ మారింది. దీన్ని బట్టి మూవీ ప్రారంభం నుండే ప్రేక్షకులు అఖండ కి ఎంతలా కనెక్ట్ అయ్యారో అర్ధం చేసుకోవచ్చు.     ఇక స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి విజిల్స్‌, చప్పట్లతో హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్‌ దగ్గరయ్యే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు అందర్నీ ఊర్రూతలూగిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్న అభిప్రాయం కలగడంతో పాటు పిల్లలు, పెద్దలు అంతా మువీని ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్త మంది అభిమానులైతే థియేటర్‌ల వద్ద ఏకంగా పూజలు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా మూడు రోజులకే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య రికార్డు కలెక్షన్స్ సాధించడం పక్కా.        
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు,  సమస్యలలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్న స్నేహితుల అవసరం,  వారి సహాయం ఎంతో అవసరం అవుతుంది.  అయితే ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీగా ఉన్న, నిజమైన స్నేహితులు ఉండరు. కొందరి జీవితాలలో నకిలీ స్నేహితులు కూడా ఉంటారు.  కేవలం స్వార్థం కోసం, మోసం చేయాలనే ఉద్దేశంతో స్నేహం చేసే వారు ఉంటారు. నకిలీ స్నేహితులు వెనక గోతులు తీస్తూ ఉంటారు. చాలా నష్టాలు కూడా కలిగించే అవకాశం ఉంటుంది. నిజమైన స్నేహితుడికి,  నకిలీ స్నేహితుడికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పే మార్గాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. దూరం.. నకిలీ స్నేహితులను బయటపెట్టే మంచి మార్గం వారు పాటించే దూరం. స్నేహితులు సమస్యలు ఏమీ లేకుండా బాగున్నప్పుడు,  పార్టీలు చేసుకుంటున్నప్పుడు,  ఆర్థికంగా  బాగున్నప్పుడు,  ప్రయాణాలు ప్లాన్  చేస్తున్నప్పుడు  అందరికంటే ముందు వీళ్లే కనిపిస్తారు.  కానీ స్నేహితులు ఏవైనా సమస్యలలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు  దూరం మెయింటైన్ చేస్తారు. అంతేకాదు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడం  లేదా ఫోన్  ఆఫ్ లో ఉందని చెప్పడం లాంటివి చేస్తారు. కొన్నిసార్లు కేవలం దూరంగా ఉంటూ మాటల్లో సానుభూతి తెలుపి తప్పించుకుంటారు. ఈర్ష్య.. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల  విజయాన్ని తనదిగా భావిస్తాడు.  కానీ  నకిలీ స్నేహితులు తన స్నేహితులు  అభివృద్ధి చెందడం చూసి ఎప్పటికీ సంతోషించడు.  ప్రమోషన్ వచ్చినప్పుడు లేదా గుడ్ న్యూస్ చెప్పినప్పుడు ఓర్వలేరు.  పైగా   అలాంటి సంతోష సమయాల్లో  నీ అదృష్టం బాగుంది అందుకే నీకు అవన్నీ దొరికాయి వంటి ఎగతాళి మాటలు కూడా మాట్లాడతారు.  విజయం పట్ల అసూయ పడే స్నేహితులు ఉంటే వారితో జాగ్రత్తగా ఉండాలి. అవమానం.. స్నేహితుల మధ్య జోకులు వేసుకోవడం, ఆటపట్టించడం సర్వసాధారణం, కానీ నకిలీ స్నేహితులు  తరచుగా అందరిముందు   తక్కువ చేయడానికి, తక్కువ చేసి మాట్లాడటానికి  ప్రయత్నిస్తారు. బలహీనతలు బయటపెట్టడం,  ఎగతాళి చేయడం వంటివి చేస్తారు.  అలాంటి సందర్భాలలో బాధపడితే నేను జోక్ చేశా.. దీనికే బాధపడాలా, కనీసం ఫ్రెండ్ గా నేను ఇలా కూడా మాట్లాడకూడదా అని కవరింగ్ కూడాచేస్తారు. రహస్యాలు.. స్నేహితులు  ఇతరుల రహస్యాలను కథలు కథలుగా లేదా కబుర్లు లాగా చెప్పేవాడు అయితే అతను  ఇక్కడ వినే రహస్యాలు కూడా అవతలి వారికి చెప్పేస్తాడు. నకిలీ స్నేహితుడు ఎప్పుడూ రహస్యాలను దాచి ఉంచలేరు.  పోస్ట్‌మ్యాన్ లాగా వ్యవహరించి అవతలి వారి విషయాలను ఇవతలికి,  ఇవతలి వారి విషయాలను అవతలికి చెబుతూ ఉంటారు.  ఇలాంటి వ్యక్తి అస్సలు మంచివాడు కాదు. స్వార్థం.. నకిలీ స్నేహితులు ఎప్పుడూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తారు.  ఎవరైనా తన దగ్గర  ఏదైనా  చెప్పుకునేటప్పుడు మధ్యలో తన సమస్యలు,  తన ఇబ్బందులు చెప్పి తన స్నేహితుల మాటలు డైవర్ట్ చేస్తారు. ఇతరుల భావాలు, ఎమోషన్స్ అస్సలు వారికి పట్టవు. అందరూ తను చెప్పేది వింటే చాలని అనుకుంటారు తప్ప అందరి విషయాలు తనకు అవసరం లేనట్టు బిహేవ్ చేస్తారు. పైన చెప్పుకున్న లక్షణాలు మీ స్నేహితులలో ఉంటే దయచేసి వారిని దూరం ఉంచడం ఉత్తమం. వారికి పర్సనల్ విషయాలు,  ముఖ్యమైన విషయాలు, జీవితంలో ఏవైనా రహస్యమైన విషయాలు చెప్పకుండా ఉండటమే మంచిది. అలాంటివారి కోసం సమయాన్ని వృథా చేయడం కూడా తప్పే.                             *రూపశ్రీ.
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే అనే ఫీలింగ్ కలిగిస్తుంది.  వారి ప్రవర్తన,  వారి స్వభావం ఇవన్నీ పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితుల ఆధారంగా వచ్చేవే అయినా పుట్టిన నెలను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు,  జ్యోతిష్కులు. ఇంతకీ డిసెంబర్ నెలలో ఫుట్టిన వారి స్వభావం, వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుంటే.. సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తులు  వేర్వేరు స్వభావాలు కలిగి ఉంటారు.  అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా ఇతర నెలల్లో పుట్టిన వ్యక్తులకు భిన్నంగా ఉంటుంది.   సంఖ్యాశాస్త్రం ప్రకారం డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారట.  వీరిది సహజమైన ఆకర్షణ అని, డబ్బు, హోదా, పలుకుబడి ద్వారా వచ్చే ఆకర్షణ కాదని సంఖ్యాశాస్ర్త నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు వారి ప్రవర్తన,  హావభావాలు, వారి మాట తీరుతో ఇతరుల హృదయాలను గెలుచుకుంటారట.  ఇతరుల నుండి మెప్పు పొందడం, ఇతరులతో ఆకట్టుకునేలా మాట్లాడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఎమోషన్ పరంగా చాలా పీక్స్ లో ఉంటారట.  వీరు చాలా భావోద్వేగాలకు లోనవుతారు.  దీని వల్ల వారు చాలా సార్లు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇతరులతో సంబంధాల విషయంలోనూ నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. మోసపోవడంలో కూడా డిసెంబర్ లో పుట్టిన వారు ఫస్ట్ అని చెప్పవచ్చు.  వీరు ఇతరులను చాలా తొందరగా నమ్మేస్తారు. అంతకు మించి వీరిది చాలా స్వచ్చమైన హృదయమట.  ఈ కారణంగా వీరు ఇతరుల విషయంలో  సులువుగా బోల్తా పడతారు.   డిసెంబర్ లో పుట్టిన వారితో ఎలాంటి సంకోచం లేకుండాస్నేహం చేయవచ్చట. ఎందుకుంటే ఈ నెలలో పుట్టిన వారు స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇస్తారట.  అలాగే నమ్మకమైన స్నేహితులుగా ఉంటారట. స్నేహం పట్ల పూర్తీ విధేయతతో ఉంటారట. కొందరు వ్యక్తుల చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్ చాలా మెరుగ్గా ఉంటుంది. అలాంటి వారిలో డిసెంబర్ నెలలో పుట్టిన వ్యక్తులు కూడా ఉంటారట.  వీరి చుట్టూ సానుకూల శక్తి ఉంటుందట.  ఈ కారణంగా వీరి చుట్టూ ఉండే వ్యక్తులకు మంచి జరుగుతుందని,  ఎవరికైనా మంచి సలహాలు, పరిష్కారాలు లభించి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటారు. సలహాలు ఇవ్వడంలో డిసెంబర్ లో పుట్టిన వారు ది బెస్ట్ అని చెప్పవచ్చు. వీరు మంచి సలహా దారులు,  సమస్యను పరిష్కరించడానికి మంచి సలహాలు,  సరైన ప్రణాళిక ఇవ్వగలరట.కాకపోతే వీరిది చంచలమైన మనసు.. అలాగే వీరి స్వభావం కూడా మొండిగా ఉంటుంది. ఈ కారణంగా వీరు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.   ఇది డిసెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం. అందరూ ఇలానే ఉంటారని కాదు.. సంఖ్యా శాస్ర్తం ప్రకారం నిపుణులు పేర్కొన్న వివరాలే ఇవి.                                *రూపశ్రీ.
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి.  ఒకరు చాలా సీరియస్ గా భావిస్తే.. మరొకరు చాలా సులువుగా బంధాన్ని వదిలేస్తారు. మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది కొందరికి అలవాటుగా కూడా మారింది.  డబ్బు, వస్తువులు కోల్పోతే పోతే పోయాయని సర్థి చెప్పుకోవచ్చు. కానీ మనసుకు గాయం చేసి, నమ్మకాన్ని దెబ్బతీసి,  జీవితంలో ఆశల మీద నీళ్లు చల్లే పనులు చేసే మోసగాళ్లు ఉంటారు.  ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసపోయేవారు. కానీ ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు.  మోసం చేసేముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తారట. అవేంటో తెలుసుకుంటే ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా అలాంటి సంఘటనలు ఎదురైతే జాగ్రత్త పడవచ్చు. మోసాన్ని గ్రహించి మనసు గాయపడకుండా కాపాడుకోవచ్చు. మాట్లాడే విధానం.. అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా జరిగేటప్పుడు కనిపంచే మొదటి మార్పు మాట్లాడే విధానం మారడం. ఒకప్పుడు ఆప్యాయంగా,  ఎక్కువగా కేర్ తీసుకుంటూ,  ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే అమ్మాయి,  ఒక్కసారిగా మాట్లాడటం తగ్గించడమే కాకుండా క్రమంగా కఠినంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తొందరలోనే బ్రేకప్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. ఫోన్ కాల్స్.. అమ్మాయిలు పదే పదే బంధువులు లేదా కుటుంబ సభ్యులు కాల్ చేశారని చెబుతూ దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఆమె దూరం అయ్యే సూచనలు ఇస్తుందట.  మోసం చేసే అమ్మాయిలు తరచుగా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారని అంటారు.   మాటల్లో మార్పు.. ప్రేమించిన అమ్మాయి మొదట్లో ఎంతో ఆప్యాయంగా,  కేరింగ్ గా మాట్లాడుతుంది. కానీ ఆ తరువాత ఆమె ఆ రిలేషన్ నుండి తప్పించుకోవాలని,  వేరే రిలేషన్ లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆమె మాటతీరు మారుతుందట.  ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ స్థానంలో చిరాకు, అసహనం,  వ్యంగ్యం వచ్చి చేరతాయట. కొన్ని సార్లు చాలా ఘాటుగా కూడా మాట్లాడతారట. సమయం తగ్గించడం.. బయట కలవడం అయినా,  ఫోన్ లో మాట్లాడటం అయినా ప్రేమించిన అమ్మాయి గతంలో లాగా ఎక్కువసేపు మాట్లాడటం, కబుర్లు చెప్పడం కాకుండా  కేవలం రెండు మూడు నిమిషాలలో మాట్లాడటం,  రెండు మూడు ముక్కలలో సమాధానం చెప్పి పోన్ పెట్టేయడం,  తర్వాత మాట్లాడతాను అని చెప్పడం.. వంటివి చేస్తుంటే ఆమె తొందరలోనే బ్రేకప్ చెప్పేస్తుందని అర్థమట. కారణాలు.. సమయం లేకపోవడం, పనిలో బిజీగా ఉండటం లేదా మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి సాకులు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆమెకు మాట్లాడే ఆసక్తి లేదని అర్థం. నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అలా కారణాలు చెబుతూ ఉంటారు. మార్పులు.. లైఫ్ స్టైల్ మార్చుకోవడం,  కొత్త అలవాట్లు,  సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వంటివి చేస్తుంటే ఆ అమ్మాయి మరొకరితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిందని అర్థం.  ఇవన్నీ కనివిస్తే ఆ అమ్మాయి మోసం చేస్తోందని అర్థం.  ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అబ్బాయిలు జాగ్రత్త పడితే మనసుకు గాయం కాకుండా జాగ్రత్త పడవచ్చు.                                       *రూపశ్రీ.
  ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు.  ఆయుష్షును పెంచడానికి ఎటువంటి మాయా సూత్రం లేదని,  ఇప్పటికీ కొన్ని పురాతన ఆయుర్వేద పద్ధతులను ఆచరించడం ప్రారంభిస్తే వంద సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా  చరక మహర్షి శిష్యుడైన  వాగ్భటాచార్యుడు  చెప్పారు. ఆయన ఆయుర్వేదంలో కొన్ని పద్దతులను వివరించాడు. వీటని పాటించడం వల్ల వందేళ్లకు పైగా ఆరోగ్యంగా జీవించడం సాధ్యమట.  ఇంతకీ ఆ రహస్య చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. భారతదేశ జనాభా దాదాపు 1.4 బిలియన్లు అయితే.. అందులో కేవలం 300 మిలియన్లు మాత్రమే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన వారు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, కీళ్ల నొప్పులు,  వాత-పిత్త-కఫ సమస్యలు వంటి వివిధ వ్యాధులతో బాధపడుతున్నారట. ప్రతి వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి,  ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా వారికి వచ్చే  85 శాతం అనారోగ్యాలకు స్వయంగా చికిత్స చేసుకోగలరని, కేవలం  15 శాతం అనారోగ్యాలకు మాత్రమే నిజంగా వైద్యుడు అవసరమవుతారని వాగ్భటాచార్యుడు పేర్కొన్నారు. తాగునీరు.. 3 నియమాలు.. ప్రతిరోజూ నీరు తాగుతాము, కానీ సరైన రీతిలో త్రాగడం కూడా అంతే ముఖ్యమని వాగ్బటాచార్యుడు చెప్పాడు.  మొదటి నియమం.. తిన్న వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. రెండవ  నియమం.. నీటిని ఎల్లప్పుడూ గుటకలుగా త్రాగాలి. కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ తాగాలి. నీటిని  గ్లాసు లేదా చెంబు, బాటిల్ తో ఎత్తుకుని ఒక్కసారిగా ఎక్కువ మొత్తం తాగడం  ఆరోగ్యానికి మంచిది కాదు. మూడవ నియమం.. చల్లటి నీరు ఎప్పుడూ త్రాగకూడదు. చాలా చల్లటి నీరు కడుపులోని అగ్నిని బలహీనపరుస్తుంది. ఇది ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి ఆటంకం కలిగిస్తుంది. గోరువెచ్చని నీరు త్రాగడం ఎల్లప్పుడూ ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్ర లేచిన వెంటనే నీరు.. ఉదయం నిద్ర లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. రాత్రిపూట ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ లాలాజలం శరీరం లోపలి నుండి శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఉదయం ఈ నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  శరీరం విష పదార్థాలను తొలగిస్తుంది. ఆహారం, సమయం.. వాగ్భటుడు చెప్పిన దాని ప్రకారం సూర్యోదయం తర్వాత రెండున్నర గంటల పాటు శరీరం యొక్క జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. ఉదాహరణకు.. సూర్యుడు ఉదయం 7 గంటలకు ఉదయిస్తే శరీరం యొక్క జీర్ణశక్తి ఉదయం 7:00 నుండి  9:30 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో తినే ఆహారం బాగా జీర్ణమవుతుంది,  పూర్తి పోషణను అందిస్తుంది. అందువల్ల ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం కొంచెం తక్కువగా, రాత్రి తేలికైన భోజనం తినాలని ఆయన సలహా ఇచ్చారు. ఇష్టమైన ఆహారం, నియమాలు.. చాలామందికి ఇష్టమైన ఆహారాలు అంటూ  పరాఠాలు, స్వీట్లు, రబ్రీ, రసగుల్లాలు లేదా ఏదైనా భారీ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు  ఇష్టమైన ఆహారాన్ని ఉదయం తినాలట. ఉదయం  జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది.  బరువైన ఆహారాలు కూడా సులభంగా జీర్ణమవుతాయి. అయితే, రాత్రిపూట అదే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం, గ్యాస్,  అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం ఇలా ఉండాలి.. ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా మానసిక సంతృప్తికి కూడా అవసరమని వాగ్భటాచార్యులు  అన్నారు. మనస్సు సంతృప్తి చెందినప్పుడు శరీరం సరైన మొత్తంలో హార్మోన్లు,  ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిరాశ,  మానసిక అనారోగ్యాన్ని నివారిస్తుంది.  శరీరం చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...