
ఇక డిజాస్టర్స్ చాలు, ఈ సారి హిట్ పక్కా అంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నిన్న 'కల్ట్' తో తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రెజెంట్ అయితే కల్ట్ కి కూడా నెగిటివ్ టాక్ రన్ అవుతూ ఉంది. మూవీ స్టార్ట్ అయిన నలభై నిమిషాల దాకా విశ్వక్ సేన్ కనపడకపోవడం ఏంటని ఫ్యాన్స్ బాగానే అలిగినట్టున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా తమ గుండె లోతుల్లో ఉన్న బాధని వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టుగా తెలుస్తుంది ఒక రకంగా అవి షాకింగ్ కలెక్షన్స్ అని చెప్పవచ్చు. భారతదేశ వ్యాప్తంగా 1.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ నమోదు కాగా, విదేశీ మార్కెట్ నుంచి 20 లక్షల గ్రాస్ రాబట్టింది. ఈ విధంగా మొత్తం వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సరిగ్గా 1.30 కోట్లకు చేరాయి. దేశవ్యాప్తంగా సుమారు 1,240 షోలలో ఈ సినిమా ప్రదర్శించబడగా, ప్రతి ప్రదర్శనకు సగటున 7,661 వసూలైంది. థియేటర్లలో మొత్తం 93,932 మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం ఫస్ట్ డే కలెక్షన్స్!

రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అత్యధికంగా 1 కోటి గ్రాస్ రాగా, కర్ణాటక నుంచి. 6 లక్షలు, తమిళనాడు నుంచి 2 లక్షలు, కేరళ నుంచి 1 లక్ష మరియు మిగిలిన భారతీయ రాష్ట్రాల నుండి లక్ష వసూలయ్యాయి. మరి వీకెండ్ ని ఏ మేర ఉపయోగించుకుంటుందో చూడాలి.
[Cult Movie First Day Collections, Vishwak Sen Cult box office, Cult Telugu movie opening collection, Cult movie worldwide gross day 1,Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]
[Cult Movie First Day Collections, Vishwak Sen Cult box office, Cult Telugu movie opening collection, Cult movie worldwide gross day 1, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]





