తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను మరింత పటిష్టపరిచే దిశగా అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలను యువ నాయకుడు బీఎం సందీప్‌కు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.    పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీని సమన్వయం చేసే తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.    గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సంస్థాగత పదవి నుంచి తప్పుకున్న ఆమె, గతంలో రాష్ట్రంలో అందించిన విశేష సేవల పట్ల అధిష్ఠానం ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.    కొత్త ఇన్‌ఛార్జి రేసులో పలువురు సీనియర్ జాతీయ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే వంటి ఉద్ధండుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనూహ్యంగా అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.    ఈ పరిణామం సరిగ్గా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించేందుకు ఈ నాయకత్వ మార్పు దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఇతర రాజకీయ సవాళ్లు ఎదురుకానున్న తరుణంలో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతను పెంపొందిస్తూ, పార్టీని విజయపథంలో నడిపించడంలో బీఎం సందీప్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీకు నచ్చవచ్చు: Under 19 Asia Cup: పాక్‌పై చివరి బంతికి భారత్  థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.! [ BM Sandeep Telangana Congress In-charge, Telangana Congress news, AICC new appointments 2026, TPCC updates, Mallikarjun Kharge decisions ]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు వైయస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగిన కీలక నేత విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంత పొలిటికల్ జర్నీ ప్రారంభించిన సంగతి విదితమే.   వైసీపీ అధినేత జగన్ కు అత్యంత నమ్మకమైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఆయన,  పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ) పేరుతో నూతన రాజకీయ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. వైయస్ కుటుంబ నీడ నుంచి బయటపడి, తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ అస్తిత్వాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో ఆయన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. కొత్త పార్టీ ఆవిర్భావ వేదికపై విజయసాయి రెడ్డి ఊహించిన విధంగానే వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మత విశ్వాసాలను ప్రస్తావిస్తూ, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే రాజకీయ ప్రయోజనాల కోసం రెడ్డి సామాజిక వర్గ మద్దతును ఆశిస్తున్నారంటూ   ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. సాయిరెడ్డి చేసిన ఈ విమర్శలకు,  ఆయన కొత్త పార్టీకి వైసీపీ నుంచి ఎవరు, ఎలాంటి సమాధానం ఇస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.   ఇది కూడా చదవండి: విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? సాయిరెడ్డి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే ఆయన సొంత పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడారు. విజయసాయి పేరు నేరుగా  ప్రస్తావించకుండా  జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నంత కాలం కొంతమంది వ్యక్తులు తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటారని విమర్శించారు. జగన్ కల్పించిన నమ్మకం, విశ్వసనీయత వల్లే వారికి రాజకీయ వేదిక లభించిందని, కానీ నేడు వారు పార్టీ కంటే తామే గొప్ప అని భ్రమపడుతున్నారని చెవిరెడ్డి అన్నారు.   జగన్ లేకపోతే వ్యక్తిగతంగా వారికి ఎటువంటి గుర్తింపు, విలువ లేవనే విషయాన్ని   గ్రహించలేకపోతున్నారని అన్నారు. ఇలాంటి ప్రాధాన్యత లేని, ప్రభావం చూపలేని చిన్న పార్టీల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఇసుమంతైనా ఉండదన్నారు.   మీకునచ్చవచ్చు:  విజయసాయి కొత్త పార్టీ: వైసీపీకి జరిగే నష్ట మేంటి.. రాష్ట్ర రాజకీయాల్లో పీఆర్పీ ప్రభావమెంత.? విజయసాయి కొత్త పార్టీ: వైసీపీ బీ టీమ్ అంటూ చర్చలు.! [Vijaya Sai Reddy  PRP Party, Chevireddy Reaction, YCP TeluguOn]  
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.   వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి,  ఇప్పుడు  పరివర్తన రాజనీతి పార్టీ  పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.   దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ   లక్ష్యమని ప్రకటించారు.  ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు  సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.   ఇది కూడా చదవండి:  జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.! పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంచితే..  కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)  ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా  ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో  ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.   మీకు నచ్చవచ్చు:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి   విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? [Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Kamal Haasan is expected to make a brief appearance as Virumandi in Sivakarthikeyan's upcoming film Seyon. The actor is producing the film under his Raaj Kamal Films International banner, and the buzz suggests that he might reprise the iconic get-up for a few seconds. Released in 2004, Virumandi remains one of the most memorable films in Kamal Haasan's career. His performance and distinctive characterisation earned considerable appreciation, making the possibility of this appearance particularly interesting for fans. Seyon stars Sivakarthikeyan in the lead role and is directed by Sivakumar Murugesan. The project marks another collaboration between Sivakarthikeyan and Kamal Haasan after Amaran, which was also produced by Raaj Kamal Films International. Also Read: Avengers: Doomsday creates history with unreal demand Kamal Haasan's possible cameo would add an interesting nostalgic element to the film, particularly for audiences who have fond memories of his 2004 outing. The actor's appearance is said to be limited to just a few seconds, but it could become one of the interesting moments in the film if the buzz turns out to be true. Neither Kamal Haasan nor the makers have confirmed the development so far. For now, the special appearance remains an unconfirmed rumour surrounding Seyon. Check Out:  Robert Pattinson to play two famous detectives at same time!                       Mirnalini Ravi marries Mahavishnu in Malaysia Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అక్కినేని... తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆ పేరుకి ఉన్న వైబ్రేషన్స్ ప్రతి సెకను కూడా అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకుల నోళ్ళల్లో నిత్యం తచ్చాడుతునే ఉంటుంది. నిజ నిర్దారణ కమిటీని వేసినా ఆ మాట వాస్తవమని చెప్తుంది. అక్కినేని బ్రాండ్ కి అంతటి పవర్. అక్కినేని అమల ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కోడళ్ళు శోభిత, జైనబ్ రావ్‌జీల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కినేని ఇంట ఒకప్పుడు కేవలం మగపిల్లలు మాత్రమే ఉండేవారని, కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల  ఇద్దరు ముద్దుల కూతుర్లు దొరికారని ఆమె ఎంతో ఆప్యాయంగా పంచుకున్నారు. కుటుంబంలోకి కొత్తగా వచ్చిన ఈ ఇద్దరు కోడళ్ళు తమ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేశారు. నాగచైతన్యను వివాహం చేసుకున్న ప్రముఖ నటి శోభిత  గురించి అమల ప్రత్యేకంగా ప్రస్తావించారు. శోభిత ఎంతో అన్యోన్యమైన వ్యక్తి అని, తన కెరీర్‌లో అద్భుతమైన విజయాలు సాధించినప్పటికీ ఇంట్లో అందరితో చాలా సాదాసీదాగా, ఆప్యాయంగా ఉంటుందని కొనియాడారు. శోభితతో అనుబంధం పెంచుకోవడం చాలా సులభమని, ఆమె స్వచ్ఛమైన మనసు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. అలాగే అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రావ్‌జీతో తనకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ, జైనబ్ తనకు కూతురికంటే ఎక్కువగా మారిపోయిందని తెలిపారు.   అఖిల్ వివాహానికి ముందే జైనబ్ పరిచయం కావడంతో ఆమెతో ఆ బంధం మరింత బలంగా ఏర్పడిందని అమల వివరించారు.జైనబ్ రాకతో తమ ఇంట్లో పండుగలు, వేడుకల శైలే పూర్తిగా మారిపోయిందని అమల వెల్లడించారు. గతంలో అక్కినేని ఇంట పండుగలు చాలా చిన్నవిగా, నిరాడంబరంగా జరిగేవని, కానీ ఇప్పుడు జైనబ్ అందరినీ ఏకం చేసి ప్రతి పండుగను ఎంతో వైభవంగా, ఘనంగా జరుపుకునేలా చూస్తుందని చెప్పారు. ఇది కూడా చదవండి: కొత్త లోక చాప్టర్ 1 రికార్డు గల్లంతు?: దెబ్బకొట్టింది మన తెలుగు హీరోయిన్ నే!  అంతేకాకుండా, నాగార్జునను, తనను స్వంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా జైనబ్ చూసుకుంటుందని, ఇంట్లోని 89 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లిని కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ అందరి హృదయాలని  గెలుచుకుందని అమల భావోద్వేగంతో పంచుకున్నారు. విభిన్న సంస్కృతులు, నేపథ్యాల నుంచి వచ్చినప్పటికీ, జైనబ్ తమ హిందూ కుటుంబంలో ఇమిడిపోవడానికి చూపిన చొరవ అద్భుతమని ఆమె కొనియాడారు.కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థపై మాట్లాడుతూ.. ఏ బంధమైనా నిలబడాలంటే సమయం, పరస్పర అవగాహన చాలా ముఖ్యమని అమల స్పష్టం చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదని, కానీ మనశ్శాంతి లేని చోట బంధాలను బలవంతంగా లాగడం కంటే విడిపోవడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ, శోభిత మరియు జైనబ్‌ రూపంలో తమ కుటుంబానికి అంతులేని సంతోషం, అద్భుతమైన శక్తి వచ్చాయని, ఈ ఇద్దరు కోడళ్ళు తమ ఇంట వెలుగులు నింపారని అమల ముగించారు. ఇప్పుడు ఈ మాటలు అక్కినేని అభిమానుల్లో జోష్ తీసుకొచ్చాయి. హీరోయిన్ గా అమల సాధించిన విజయాలు తెలిసిందే.   మీకు నచ్చవచ్చు:ఈ వారం రిలీజయ్యే చిత్రాల్లో విజేత ఈ సినిమానే! మీకు నచ్చవచ్చు:సినిమాకి హిట్ సూత్రం ఇదేనంట!   [Amala Akkineni, Sobhita, Zainab, Nagarjuna, Naga Chaitanya, Akhil]
ఏ సినీ రికార్డు శాశ్వతం కాదనే విషయం అందరకి తెలుసు. కానీ తన రికార్డుని చూసుకొని రీకార్డే మురిసిపోతే. ఇంకో సరికొత్త రికార్డు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు సినీ సర్కిల్స్ లో ఆ ఛాయలే కనిపిస్తున్నాయి. చాలా బలమైన నమ్మకంతో.. నేషనల్ క్రష్   రష్మిక మందన్న ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న ఈ క్యూట్ హీరోయిన్, ఇప్పుడు తన కొత్త చిత్రం ‘మైసా’తో మరో భారీ బాక్సాఫీస్ రికార్డుపై కన్నేసింది. గతంలో మలయాళ చలనచిత్ర పరిశ్రమలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సూపర్ హీరో మూవీ ‘లోకా: చాప్టర్ 1 - చంద్ర’ సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ లేడీ ఓరియెంటెడ్  చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు  301.41 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డులను సృష్టించింది. కేవలం కేరళలోనే 120 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించగా, ఓవరాల్‌గా ఇండియా నెట్ కలెక్షన్లు 157.04 కోట్లకు చేరాయి. ఇప్పుడు అదే స్థాయిలో సరికొత్త రికార్డులని  తిరగరాయడానికి రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ సినిమా సిద్ధమవుతోంది. కోవిడ్ అనంతర కాలంలో బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక కెరీర్‌లో ‘అనిమల్’ (రూ. 910.72 కోట్లు), ‘పుష్ప 2: ది రూల్’ (రూ. 1727.23 కోట్లు) అలాగే ‘ఛావా’ (రూ. 827.06 కోట్లు) వంటి చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. కేవలం ఈ మూడు చిత్రాల ద్వారానే ఆమె బ్యాక్ ట్యాక్స్‌గా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక భారతీయ నటిగా అరుదైన మైలురాయిని చేరుకున్నారు. అంతేకాకుండా సికిందర్ (రూ. 211.34 కోట్లు), తమ్మా (రూ. 211.8 కోట్లు), కుబేర (రూ. 138.86 కోట్లు) వంటి చిత్రాలతో పాటు ఆమె పోస్ట్-కోవిడ్ సినిమాలు అన్నీ కలుపుకొని ఏకంగా  5000 కోట్ల ప్రపంచస్థాయి మైలురాయిని టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కూడా చదవండి:ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న బడా చిత్రాలివే: ఖచ్చితంగా విజేత ఈ హీరోనే!  ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారిన ‘మైసా’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్యాణి ప్రియదర్శన్ ‘లోకా’ సినిమాతో నెలకొల్పిన అద్భుతమైన లేడీ ఓరియంటెడ్ మరియు బాక్సాఫీస్ రికార్డులను అధిగమించడమే లక్ష్యంగా రష్మిక ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం ద్వారా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ సృష్టిస్తుందోనని సినీ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నాయి. రష్మిక గ్లామర్, అంకితభావం, నటనకి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే, ఈ టార్గెట్ సాధించడం కష్టమేమీ కాదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి రష్మిక వాళ్ల నమ్మకానికి రక్షణ కవచంగా ఉంటుందో లేదో చూడాలి. మీకు నచ్చవచ్చు:బయటపడిన నిజం: ఆ తెలుగు హీరోకి బాలీవుడ్ నిర్మాత నుంచి కాస్ట్లీ కారు!  మీకు నచ్చవచ్చు:ఆ హీరోయిన్ ని పెట్టుకోండి: సినిమా పక్కా హిట్టు!   [Rashmika,  Mysaa, Kalyani Priyadarshan, Kotha Lokah Chapter 1, Tollywood]
హైదరాబాద్‌లో సినిమా చూడటం అంటే ఒకప్పుడు ప్రసాద్స్ ఐమాక్స్ గుర్తొచ్చేది. ముఖ్యంగా భారీ స్క్రీన్‌పై హాలీవుడ్ సినిమాలు చూడాలనుకునే సినీ అభిమానులకు అది ప్రత్యేకమైన అనుభూతి. కానీ 2015లో ప్రసాద్స్‌లో ఐమాక్స్ ఫార్మాట్ నిలిచిపోవడంతో నగర ప్రేక్షకులకు ఆ అనుభవం దూరమైంది.  అప్పటి నుంచి ఐమాక్స్ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్. పదకొండేళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఐమాక్స్ సందడి చేయబోతోంది. అది కూడా ఒకప్పటి సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ఉన్న ప్రాంతంలోనే కావడం విశేషం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని పాత సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో నిర్మిస్తున్న ఏఎంబీ విక్టరీ సినిమాస్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేశ్ బాబు, వెంకటేశ్‌లకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ సిద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఐమాక్స్ విత్ లేజర్ స్క్రీన్ కాగా, మరొకటి 4DX స్క్రీన్. మిగిలిన ఐదు రెగ్యులర్ స్క్రీన్లు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మల్టీప్లెక్స్ డిసెంబర్ 18, 2026 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మొదటి సినిమాగా హాలీవుడ్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ ప్రదర్శించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కూడా చదవండి: వారణాసి నుంచి అఫీషియల్ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్కి బ్లాస్టింగ్ న్యూస్.! హైదరాబాద్‌లో ఐమాక్స్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ప్రసాద్స్. భారీ 70ఎంఎం స్క్రీన్‌పై సినిమాలు చూసేందుకు అప్పట్లో నగరంలోని ప్రేక్షకులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా సినీ అభిమానులు వచ్చేవారు. ముఖ్యంగా ‘అవతార్’, ‘ది డార్క్ నైట్’ వంటి హాలీవుడ్ సినిమాలను ఆ స్క్రీన్‌పై చూసిన అనుభూతిని ఇప్పటికీ చాలామంది గుర్తుచేసుకుంటుంటారు. అయితే 2014-15 మధ్య ప్రసాద్స్‌లో ఐమాక్స్ 70ఎంఎం ఫార్మాట్ నిలిచిపోయింది. ఆ తర్వాత అక్కడ పీసీఎక్స్ ఫార్మాట్‌లో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ప్రేక్షకులు ఐమాక్స్ అనుభవం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏఎంబీ విక్టరీ రూపంలో ఆ లోటు తీరనుంది. హైదరాబాద్‌లో ఐమాక్స్ తిరిగి రావడం కేవలం హాలీవుడ్ సినిమాల అభిమానులకే కాదు.. తెలుగు సినిమా ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో కొత్త ఐమాక్స్ స్క్రీన్‌పై ‘వారణాసి’ని చూసే అవకాశం కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని హకీంపేటలో ఏఎంబీ సినిమాస్ మరో ఐమాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళిక కూడా ఉంది. అయితే దాని ప్రారంభ తేదీపై ఇంకా స్పష్టత లేదు. అక్కడ 1.43:1 ట్రూ ఐమాక్స్ అనుభవం అందించే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి పదేళ్లకు పైగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ప్రేక్షకులకు ఐమాక్స్ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. డిసెంబర్ 18న ‘డ్యూన్ 3’తో ఈ కొత్త ప్రయాణం మొదలైతే.. ఆ తర్వాత ‘వారణాసి’ వంటి భారీ సినిమాలను ఈ ఫార్మాట్‌లో చూసే అవకాశం ఉండటంతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మీకు నచ్చవచ్చు:  రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌.. వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.? వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!       [IMAX Hyderabad, AMB Victory Cinemas, Mahesh Babu, Venkatesh, Varanasi]  
ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది..సినిమా లవర్స్  ఎప్పటికిప్పుడు రీఛార్జ్ చేసిన బ్యాటరీస్ లాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారా అని? వాళ్ల జోష్ కి కారణం  ప్రతి వారం కంటిన్యూగా వస్తున్న సినిమా పండుగ. నవంబర్ మూడో వారం కూడా ఎప్పటిలాగానే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరుకి  రంగం సిద్ధమైంది. గత వారం విడుదలైన భారీ చిత్రాల సందడి కొనసాగుతుండగానే, ఈ వారం సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని ముఖ్యమైన సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.   బాక్సాఫీస్ రేసుని ముందుగా ప్రారంభించబోతున్న చిత్రం 'ఈఎన్ఈ రిపీట్'. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు తరుణ్ భాస్కర్  తెరకెక్కించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ కామెడీ డ్రామా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా ఇప్పటికే జోరు చూపిస్తోంది. విడుదలైన మొదటి రోజుకే 120 షోల ద్వారా సుమారు 13,531 టికెట్లు అమ్ముడై 28.78 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, నాలుగు రోజులకు కలిపి మొత్తం 23,019 టికెట్లతో 42.17 లక్షల రూపాయల ప్రీ-సేల్స్ నమోదు చేసింది. ఇందులో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 76 శాతం బుకింగ్స్ నమోదవ్వడం విశేషం. ఇది కూడా చదవండి:తెలుగు హీరోకి 3 .5 కోట్ల కారు గిఫ్ట్ గా ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత: ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు! మరోవైపు  20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్  కీ రోల్స్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతి వ్యోమగామి కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయాణం, ఆమెకు అండగా నిలిచే కృష్ణ పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రతిష్టాత్మక సంస్థలు  గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మించడం అతి పెద్ద ప్లస్ పాయింట్. . అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'ఓం' (OM)  20 నే ల్యాండ్ అవుతుంది. డబ్బింగ్ అని అనుకోవడానికి కూడా లేదు. ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ధనుష్,  మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీ రోల్స్. అమరన్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు కావడం అతి పెద్ద ప్లస్ పాయింట్ లో ఒకటి. అమరన్ తర్వాత వస్తున్న మూవీ కూడా ఇదే. మరి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.   ఇక ఈ పోటీలో పలానా చిత్రం విజయాన్ని అందుకంటుందని సోషల్ మీడియాలో రకరకాల పేర్లు చెప్తున్నారు.  కానీ సినీ ప్రేమికులు మాత్రం ప్రతి సినిమా విజయాన్ని అందుకొని 'సినిమా' అనే మహత్తరమైన పదం గెలవాలని కోరుకుంటున్నారు.    మీకు నచ్చవచ్చు:నితిన్ కి హిట్టు వచ్చేసింది! మీకు నచ్చవచ్చు: ఆ హీరో వచ్చేసాడు: అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో ఓకే నా!   [Aakasamlo Oka Tara, ee Nagaranki emaindi 2, Om, Dhanush, Dulqwer, viswak]  
Marvel's Avengers: Doomsday is already creating an extraordinary buzz in India, even before its theatrical release. The film is witnessing an unusual trend with audiences rushing to book midnight and post-midnight shows almost a month in advance. The early opening of advance bookings itself is a significant development, with several screenings reportedly filling up quickly. However, the interest surrounding the film is also bringing another aspect of theatrical business into focus: ticket pricing. A multiplex in Navi Mumbai has reportedly listed a single ticket for Rs.4,300, marking an unprecedented price point for theatrical exhibition in India. The two developments indicate how Marvel's biggest franchise releases have evolved into major theatrical events. Fans are not just waiting for the first day of release but are competing to secure some of the earliest screenings, even at prices that would have seemed unthinkable for a regular movie outing. While midnight shows cater to audiences eager to experience the film before everyone else, premium ticket pricing reflects how exhibitors are attempting to capitalise on the enormous demand. The ticket price is an exceptional listing and does not represent the film's regular admission prices. Also Read: Robert Pattinson to play two famous detectives at same time! Interestingly, the enthusiasm is building well ahead of the December 17 release, suggesting that Avengers: Doomsday could become one of the biggest Hollywood theatrical openings in India. The film's release is also arriving amid growing competition for premium screens and large-format theatrical experiences. Ultimately, Avengers: Doomsday is creating a fascinating situation for the Indian exhibition industry. A film opening advance bookings a month early and commanding a reported Rs.4,300 for a single ticket demonstrates the extraordinary commercial power of established franchises. Whether this excitement translates into record-breaking box office numbers remains to be seen. Check Out:  Mirnalini Ravi marries Mahavishnu in Malaysia                      Nagarjuna says Aniesh arrived big time Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఇక నుంచి 'ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బ్యాండ్ మేళం ఏంటనే వర్డ్ ని చూసి జాలి, ఎగతాళి చెయ్యకండి. ఎందుకంటే ఆ బ్యాండ్ మేళం 3 .5 కోట్ల ఖరీదైన కారుని హీరోకి గిఫ్ట్ గా ఇచ్చేసింది. మరి పూర్తి మాటర్ పై లుక్ వేద్దాం. బాలీవుడ్‌లో ఒకానొక సమయంలో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలై, ఆ తర్వాత కాలంలో కల్ట్ క్లాసిక్‌గా మారిన చిత్రం ‘సనమ్ తేరీ కసమ్’. తెలుగు మూలాలున్న టాలెంటెడ్ హీరో హర్షవర్ధన్ రాణే, మావ్రా హొకేన్ జంటగా కనిపించిన ఈ రొమాంటిక్ డ్రామా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మొదట 2016 ఫిబ్రవరి 5న విడుదలై ఆశించిన వసూళ్లబి  సాధించలేకపోయింది. కానీ కాలక్రమేణా అభిమానులు,ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.  రీ-రిలీజ్ చేయగా, బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపించడంతో  నిర్మాత హర్షవర్ధన్ రాణేకి ‘ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా’ (Land Rover Defender Octa) ఎస్‌యూవీని కానుకగా అందించాడు. భారతీయ మార్కెట్లో ఈ సరికొత్త లగ్జరీ కారు ధర సుమారు 3.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిర్మాత తనకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రేంజ్ గిఫ్ట్ ఇవ్వడంతో హర్షవర్ధన్ రాణే ఫిదా అయిపోయాడు.  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నిర్మాత దీపక్ ముకుట్ తనకు కారు తాళాలు అందిస్తున్న ఫోటోని  షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.  గత ఏడాది ‘సనమ్ తేరీ కసమ్’ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని కోరుతూ తాను, పలువురు అభిమానులు ప్రొడ్యూసర్ ఆఫీస్ ముందు నిలబడిన క్షణాలని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. ఇది కూడా చదవండి: తిరుమల కొండపై నితిన్: ఈ సారి అలియాస్ రుక్మిణి తో హిట్టు పక్కా! రీ రిలీజ్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా  54.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లని సాధించడమే కాకుండా, ఇండియాలో ఏకంగా  42.28 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయపరిచింది. కేవలం రీ-రిలీజ్‌లోనే తొలి రోజు రూ. 4.25 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. మరి గుర్తుందిగా 'ఎప్పుడో అయిపోయిన పెళ్ళికి ఇప్పుడు బ్యాండ్ మేళం' అనే వర్డ్ కి ఎనలేని గౌరవం ఇవ్వాలని.   తెలుగులో ‘తకిట తకిట’, ‘అవును’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ వంటి చిత్రాల్లోహర్షవర్ధన్ కనిపించాడు. మీకు నచ్చవచ్చు:అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర తెరపైకి: ఆ అగ్ర హీరోతో! మీకు నచ్చవచ్చు: రామోజీ రావు గారి వెనక ఉన్న ఆ మూవీ కథ ఇదే!    [Harshvardhan Rane, Sanam Teri Kasam, Deepak Mukut, Land Rover]
సినిమా ఈవెంట్లలో అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ధనుష్ నటించిన ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలాంటి ఆసక్తికరమైన ఘటనే చోటుచేసుకుంది. ఈ వేడుకకు తన కుమార్తె ఆద్యతో కలిసి హాజరైన రేణు దేశాయ్.. యాంకర్ ఆమెను స్టేజ్‌పైకి ఆహ్వానించబోతుంటే వెంటనే వద్దంటూ వారించారు. దీంతో అసలు రేణు అలా ఎందుకు చేశారు? ఆద్యను స్టేజ్‌పైకి రానివ్వకపోవడానికి కారణమేంటి? అనే చర్చ మొదలైంది. నవంబర్ 16న హైదరాబాద్‌లో ‘ఓం’ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీలతో పాటు చిత్రబృందం హాజరైంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రేణు దేశాయ్ కూడా తన కుమార్తె ఆద్యతో కలిసి ఈ వేడుకకు వచ్చారు. ఈ క్రమంలో ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఆద్యను గమనించిన యాంకర్.. ఆమెను స్టేజ్‌పైకి పిలుద్దామని మైక్‌లో ప్రకటించారు. అయితే రేణు దేశాయ్ వెంటనే స్పందిస్తూ ఆద్య స్టేజ్‌పైకి రావాల్సిన అవసరం లేదని సూచించారు. అటు ఆద్య కూడా స్టేజ్‌పైకి రావడానికి ఇష్టపడనట్లు తల అడ్డంగా ఊపారు. ఈ చిన్న సంఘటన అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది. అయితే రేణు దేశాయ్ ఆద్యను స్టేజ్‌పైకి రానివ్వడానికి నిరాకరించడానికి అసలు కారణం ఏమిటనేది ఆమె స్వయంగా వెల్లడించలేదు. ఆద్య కూడా స్టేజ్‌పైకి రావడానికి ఆసక్తి చూపించకపోవడంతో రేణు ఆమె ఇష్టాన్ని గౌరవించి ఉండొచ్చని భావిస్తున్నారు.  నిజానికి రేణు దేశాయ్ తమ పిల్లలను స్టార్ కిడ్స్ లా కాకుండా సాధారణ పిల్లల్లాగే పెంచినట్లు గతంలోనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సినీ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి వారు సినిమాల్లోకి రావాలని లేదు.. వారికి నచ్చిన ఫీల్డ్ లో ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. తమ పిల్లలపై అనవసరమైన ఫోకస్ ఉండకూడదనే ఉద్దేశంతోనే రేణు దేశాయ్ ఈవెంట్ లో అలా చేశారు అనిపిస్తోంది. ఆద్య సైతం 'అసలు స్టేజ్‌పైకి నేను ఎందుకు?' అన్నట్టుగా రియాక్షన్ ఇవ్వడం విశేషం. ఇది కూడా చదవండి: శ్రీలీల ఓపెన్ కామెంట్స్.. చిన్న వయసులో తప్పులు చేశా.!       [OM Pre Release Event, Renu Desai, Aadhya Konidela, Pawan Kalyan]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
భారతదేశంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాలంలో అత్యంత చల్లని వాతావరణం ఉంటుంది. ఈ సీజన్‌లో ఉదయం నిద్రలేచి వ్యాయామశాలకు వెళ్లడం కొందరికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇప్పటికే అధిక బరువు ఉన్నవారికి బద్ధకంతో వ్యాయామాలు వాయిదా పడటం సర్వసాధారణం. అయితే ఎలాంటి కష్టతరమైన జిమ్ వర్కౌట్లు లేకుండానే, కేవలం చిన్నపాటి జీవనశైలి మార్పులతో ఈ చలికాలంలోనూ సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో హైడ్రేషన్ అనేది చాలా కీలకమైన అంశం. చలికాలంలో సాధారణంగా దాహం తక్కువగా అనిపిస్తుంది కాబట్టి, నీరు తాగడం తగ్గిపోతుంది. అయితే శరీరానికి తగినంత నీరు అందకపోతే డీహైడ్రేషన్ ఏర్పడి తరచుగా ఆకలిగా అనిపిస్తుంది. ఇది అనవసరమైన ఆహారాన్ని తీసుకోవడానికి దారితీసి బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో ఖచ్చితంగా తగినన్ని నీళ్లు తాగాలి. చల్లటి నీరు తాగడం కష్టంగా అనిపిస్తే గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం మంచిది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది కొవ్వు కరగడానికి సహాయపడి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అధ్యయనాల ప్రకారం, మీ శరీర ఉష్ణోగ్రత కంటే చల్లని నీరు తాగితే, శరీరం దానిని వేడి చేయడానికి సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో అవసరమైన క్యాలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి వీలైతే గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం చాలా ఉత్తమం. నీటితో పాటు కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలు శీతాకాలంలో బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో నీటితో పాటు పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు తేలికపాటి పానీయం కావాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక. అలాగే ఒక చిన్న బీట్‌రూట్‌తో తయారు చేసుకున్న రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే ఎంతో మంచిది. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది కూడా చదవండి:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి! చల్లని వాతావరణంలో చాలామంది కాఫీ, టీ ఎక్కువగా తాగుతుంటారు. అయితే చక్కెర, పాలు కలిపిన పానీయాలు బరువును పెంచే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా బ్లాక్ టీ, మందార టీ, ఊలాంగు టీ వంటి హెర్బల్ టీలను ఎంచుకోండి. కాఫీలో కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి బరువు తగ్గడం చాలా సులభమవుతుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఆకలి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో ఎక్కువగా వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాం. అలా కాకుండా ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చిన్నపాటి శారీరక శ్రమను చేస్తూ ఈ చిట్కాలను పాటిస్తే శీతాకాలంలో ఎదురయ్యే సవాళ్లను సులభంగా అధిగమించి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండవచ్చు. మీకు నచ్చవచ్చు:ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!                              ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర!       Winter Weight Loss, Control Weight In Winter, Winter Health Secrets, Fitness Tips For Cold Weather, Healthy Lifestyle Habits, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ కాంతివంతమైన, మచ్చలేని అందమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలుష్యభరిత వాతావరణం మరియు ఎండల కారణంగా చర్మం తన నిగారింపును కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. రసాయనాలతో కూడిన ఖరీదైన క్రీమ్‌లకు బదులుగా సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సంరక్షించుకోవచ్చు. అలాంటి అద్భుతమైన నేచురల్ క్లెన్సర్‌లలో పచ్చి పాలు ముందు వరుసలో ఉంటాయి. చర్మ సౌందర్యానికి పచ్చి పాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకోవడం ద్వారా సహజమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మ సంరక్షణలో పాలు ఒక అద్భుతమైన సహజ క్లెన్సర్‌లా పనిచేస్తాయి. ప్రతిరోజూ పాలతో ముఖాన్ని మర్దనా చేసుకోవడం వల్ల చర్మ రంధ్రాల్లో పేరుకున్న ధూళి, మలినాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సాధారణ పద్ధతి వల్ల చర్మం ఎప్పుడూ తాజాగా మరియు ఆరోగ్యంగా కనిపించేలా చేయడానికి సహాయపడుతుంది. రసాయన ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను నివారిస్తూ చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో పచ్చి పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పచ్చి పాలను రోజూ ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం లోతుగా పోషణ పొంది ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా, ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడకుండా నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా పాలను ముఖానికి పట్టించడం ద్వారా చర్మ ఛాయ మెరుగుపడుతుంది మరియు సహజమైన మెరుపు సొంతమవుతుంది. ముఖంపై మొటిమల వల్ల ఏర్పడే నల్లటి మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో పాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవిలో ఎండ కారణంగా చర్మం కందిపోయి నల్లబడటాన్ని తగ్గించడంలో ఇది చక్కటి పరిష్కారం. ఎండ వల్ల వచ్చే ట్యాన్‌ను తొలగించి, చర్మానికి పాత కాంతిని తీసుకురావడానికి పచ్చి పాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి:కాళ్లలో రక్తం, గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ఎంత ప్రమాదం? పల్మనరీ ఎంబాలిజం పూర్తి వివరాలు పచ్చి పాలలో ఉండే సహజ కొవ్వు పదార్థాలు చర్మానికి అవసరమైన తేమను నిరంతరం అందిస్తాయి. దీనివల్ల చర్మం ఎప్పుడూ మృదువుగా, సున్నితంగా ఉంటుంది. క్రమం తప్పకుండా పాలను వాడటం ద్వారా వృద్ధాప్య ఛాయలను కూడా సమర్థవంతంగా తగ్గించవచ్చు, తద్వారా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. పచ్చి పాలను ముఖానికి రాసుకునే సరైన పద్ధతి చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పచ్చి పాలు, దూది తీసుకోవాలి. దూది ఉండను పాలలో ముంచి, ముఖం అంతటా సమానంగా రాయాలి. పాలు సహజంగా ఆరిన తర్వాత, అదే దూదిని ఉపయోగించి మరోసారి పాలను రాయాలి. ఇలా 3 నుంచి 4 సార్లు అప్లై చేయాలి. సుమారు 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌కు స్వస్తి పలికి, ఇంట్లోనే దొరికే పచ్చి పాలను మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగం చేసుకోండి. కొద్ది రోజుల్లోనే మీ చర్మంలో స్పష్టమైన తేడాను గమనించవచ్చు. మీకు నచ్చవచ్చు:చలికాలం స్పెషల్: ఆరోగ్యకరమైన, క్యాప్సికం బజ్జీ తయారీ విధానం!                           పచ్చి బొప్పాయితో ,చర్మ సౌందర్యం మరియు, అసాధారణ ఆరోగ్య లాభాలు!       Raw Milk Skincare, Glowing Skin Remedies, Blemish Free Face, Kacha Dudh Benefits, Natural Beauty Tips, Skin Care Routine, Health Tips In Telugu.  
వాతావరణం మారినప్పుడు వచ్చే సీజనల్ ఫ్లూ, కోవిడ్ 19 లేదా మరేదైనా తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకినప్పుడు చాలా మందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన నీరసం రావడం సర్వసాధారణం. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే ఇవి వాటంతట అవే తగ్గిపోతాయని అందరూ భావిస్తారు. కానీ, కొన్నిసార్లు వైరస్‌లు కేవలం శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం కాకుండా, గుండెపై చాలా ప్రమాదకరమైన ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.   ఓపెన్ హార్ట్ జర్నల్  మరియు  కరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ కార్డియాలజీ జర్నల్ ల తాజా అధ్యయనాల ప్రకారం, కోవిడ్ 19 లేదా ఇతర తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్ల తర్వాత గుండె సమస్యలు తలెత్తే ముప్పు గణనీయంగా పెరుగుతుందని తేలింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు మన శరీరం సృష్టించే తీవ్రమైన వాపు ప్రక్రియ ఒక్కోసారి గుండె కండరాలను లేదా గుండె బయటి పొరను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల తర్వాత తలెత్తే ఈ గుండె సమస్యలను వైద్య పరిభాషలో మయోకార్డిటిస్ లేదా పెరికార్డిటిస్ అని పిలుస్తారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తినప్పుడు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వీటిని మామూలు ఫ్లూ లక్షణాలుగా లేదా సాధారణ నీరసంగా భావించి పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా గమనించాల్సిన మొదటి లక్షణం భంగిమను బట్టి పూర్తిగా మారిపోయే విచిత్రమైన ఛాతీ నొప్పి. వెల్లకిలా పడుకున్నప్పుడు ఛాతీలో నొప్పి మరింత పెరిగి, కొద్దిగా ముందుకు వంగినప్పుడు కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తే అది వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల గుండె పొర వాపునకు గురైందని అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టమైన సంకేతం కనిపిస్తే వెంటనే అప్రమత్తమై కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం ఎంతో ముఖ్యం. రెండవ అత్యంత కీలకమైన లక్షణం ఎటువంటి శారీరక శ్రమ లేకుండానే వచ్చే తీవ్రమైన ఆయాసం. ప్రశాంతంగా కూర్చున్న చోట కూడా శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడటం లేదా అర్ధరాత్రి హఠాత్తుగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మెలకువ రావడం గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతోందని సూచిస్తుంది. మూడవదిగా అస్థిరమైన హృదయ స్పందన లేదా గుండె దడ. ఒకవేళ జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కూడా మీ గుండె దడదడలాడుతున్నా లేదా విపరీతమైన వేగంతో కొట్టుకుంటున్నా అది తీవ్రమైన అరిథ్మియా సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయాల్లో గుండె పనితీరు అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి:కంటి చూపును, సహజంగా పెంచే సూపర్ ఫుడ్.. మునగాకు రహస్యాలు! నాల్గవ ముఖ్యమైన లక్షణం శరీరంలో నీరు చేరడం వల్ల వచ్చే వాపులు మరియు అకస్మాత్తుగా పెరిగే బరువు. గుండె బలహీనపడినప్పుడు శరీరంలో ద్రవాలు సరిగ్గా ప్రసరించక పేరుకుపోతాయి. దీనివల్ల చీలమండలు, పాదాలలో అకస్మాత్తుగా వాపులు రావడం, కేవలం 24 నుంచి 48 గంటల వ్యవధిలో హఠాత్తుగా బరువు పెరగడం జరుగుతుంది. ఇది గుండె వైఫల్యానికి స్పష్టమైన సంకేతం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐదవది విపరీతమైన నీరసం మరియు కళ్లు తిరగడం. ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా తీవ్రమైన నీరసం వేధించడం, నిలబడినప్పుడు కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పడం వంటివి జరిగితే అది రక్తపోటు పడిపోవడానికి సూచన. ఈ 5 కీలక హెచ్చరిక సంకేతాలను ఏ దశలోనూ తేలికగా తీసుకోకూడదు. ఛాతీ నొప్పి, తీవ్రమైన ఆయాసం, గుండె దడ, కాళ్ల వాపులు, విపరీతమైన నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంతావశ్యకం. సరైన సమయంలో స్పందించి తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండెకు జరిగే శాశ్వత నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యం విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉంటే వైరల్ ఇన్‌ఫెక్షన్ల తదనంతరం ఎదురయ్యే ప్రాణాంతక గుండె ముప్పుల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు. మీకు నచ్చవచ్చు:రోగనిరోధక శక్తిని పెంచే, క్యాప్సికమ్ గురించిన, ఆసక్తికర విషయాలు!                  కేలరీల ఖజానా, నల్ల శెనగలు.. చలికాలంలో ఇవి తింటే మీ శరీరానికి అసలైన శక్తి!       Heart Palpitations After Fever, Leg Swelling Symptoms, Post Viral Complications, Heart Risk Warnings, Cardiovascular Health News, Doctor Health Advice, Health Tips In Telugu.
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!