కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సుదీర్ఘ కాలంగా సాగిన అంతర్గత అధికార పోరాటం తర్వాత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా  కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పీఠాన్ని అధిరోహించడానికి సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ వేదికగా జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 4 గంటల 10 నిమిషాలకు డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రాజకీయ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ ఇప్పుడు ఒకటే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అస్సలు డీకే శివకుమార్ జూన్ 3వ తేదీనే తన ప్రమాణ స్వీకారానికి ఎందుకు ఎంచుకున్నారు? ఆ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి? దీని వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డీకే శివకుమార్‌కు దైవభక్తి, జ్యోతిష్యంపై అపారమైన నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఏ చిన్న రాజకీయ నిర్ణయం తీసుకున్నా, ఏ పని ప్రారంభించినా గ్రహాల అనుకూలతను, శుభ ముహూర్తాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఈ నేపథ్యంలోనే సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు తన వ్యక్తిగత జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్‌ను సంప్రదించారు.  డీకే శివకుమార్ జాతక చక్రం ప్రకారం జూన్ 3వ తేదీన వచ్చే తిథి, నక్షత్రాలు ఆయనకు అఖండమైన యోగాన్ని, తిరుగులేని రాజకీయ సుస్థిరతను ఇస్తాయని ఆ జ్యోతిష్యుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 4:10 గంటల సమయం "అమృత ఘడియలు"గా తేల్చడంతో, ఆ శుభ ముహూర్తానికే డీకే శివకుమార్ మొగ్గు చూపారు. గతంలో అనేక రాజకీయ ఆపరేషన్లను విజయవంతం చేసిన డీకే, తన జీవితంలోనే అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు, ఈ జూన్ 3 ముహూర్తం వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీ షెడ్యూల్స్, ఆయన అందుబాటులో ఉండే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ తేదీని ఖరారు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం హైకమాండ్ కుదిర్చిన అంతర్గత "అధికార మార్పిడి" ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల తర్వాత ఈ మార్పు జరుగుతోంది. అందుకే ఈ వేడుకను పార్టీ జాతీయ ఐక్యతకు ప్రతీకగా మార్చాలని భావిస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా డీకే శివకుమార్ ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. జూన్ 3న జరిగే ఈ అధికారిక కార్యక్రమంలో డీకే శివకుమార్‌తో పాటు కేవలం 8 నుండి 10 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదొక సాదాసీదా వేడుకగా సాగనుంది. రాహుల్ గాంధీ మార్గదర్శకాల ప్రకారం ఈ నూతన కేబినెట్‌లో దళితులు, ఓబీసీలు, మైనారిటీ వర్గాలకు సింహభాగం ప్రాధాన్యత కల్పించనున్నారు.  అందులో భాగంగానే ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉంది. వీరిలో ఒకరు దళిత సామాజిక వర్గానికి, మరొకరు మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారని పార్టీ వర్గాల సమాచారం. రాబోయే 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మంత్రివర్గంలో యువ నాయకులకు, కొత్త ముఖాలకు ఎక్కువ అవకాశం ఇవ్వనున్నారు. మిగిలిన కేబినెట్ స్థానాలను జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత భర్తీ చేయనున్నారు. ఈ వ్యూహాత్మక అడుగులతో డీకే శివకుమార్ తన పాలనను సరికొత్తగా ప్రారంభించబోతున్నారు.  
  గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఎం సూచించారు. ఎస్ఐఆర్ వల్ల పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, వలస కార్మికుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు.  పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
  దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్... డీకే శివకుమార్‌గా ఫ్యామస్..   కర్ణాటక సీఎంగా  పదవి అధిరోహించబోతున్న కాంగ్రెస్ ట్రంప్ కార్డ్. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అపజయం ఎరుగని వ్యూహకర్తగా,  కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడైన 'ట్రబుల్ షూటర్'గా పేరుగాంచారు . నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవుల వరకు ఎదిగారు. కనకపుర ప్రాంతంలో ఆయనకున్న తిరుగులేని పట్టు కారణంగా ఆయనను 'కనకపుర బండ' అని కూడా పిలుస్తారు. 1980వ దశకంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ద్వారా డీకే శివకుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 1989లో తన 27వ ఏట సాథనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో ఎనిమిది సార్లు వరుసగా విజయం సాధించిన నేతగా రికార్డుల కెక్కారు.  1989 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ ఎన్నికల్లో సాథనూర్,  కనకపుర నియోజకవర్గాల నుండి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు.  ఎస్‌.ఎం. కృష్ణ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా, సిద్ధరామయ్య క్యాబినెట్‌లో ఇంధన శాఖ మంత్రిగా, ఆ తర్వాత భారీ నీటిపారుదల, వైద్య విద్యా శాఖల మంత్రిగా విజయవంతంగా పనిచేశారు. 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  2023 మే నెలలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా,  బెంగళూరు అభివృద్ధి, జలవనరుల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు సంక్షోభంలో పడినా డీకే శివకుమార్ ముందుండి పరిష్కరించేవారు. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది. 2002లో మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు, అక్కడి ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌లో ఉంచి ప్రభుత్వాన్ని కాపాడారు. అహ్మద్ పటేల్ గెలుపు కోసం గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2018లో  కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అన్నీ తానే అయి నడిపించారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్‌లో ముందుగా కుదిరిన అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగా, 2026 మే 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనితో, సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం శ్రమించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది. శివకుమార్ కర్నాటకలోని బెంగుళూరు సమీపంలోని కనకపురలో కెంపేగౌడ మరియు గౌర్ అమ్మ దంపతులకు జన్మించాడు . ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు.  ఆయనకు డీకే సురేష్ అనే తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు మరియు వారికి ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు మరియు ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది . డీకే భారతదేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరవ్వడం విశేషం.
ALSO ON TELUGUONE N E W S
స్టార్స్ లేకపోయినా పర్లేదు కంటెంట్ ఉంటే చాలు కోట్ల రూపాయల కలెక్షన్స్  మీ సినిమాకి వచ్చేలా చేసే బాధ్యత మాది అని ప్రేక్షకులు ముక్తకంఠంతో చెప్తున్నారు. కంటెంట్ కి ఉన్న కెపాసిటీ అది. ఇప్పుడు ఆ కంటెంట్ నే నమ్ముకొని మరాఠీ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన 'దేవూల్ బంద్ 2' సరికొత్త రికార్డులని సృష్టించే పనిలో ఉంది.   10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తిరస సోషల్ కామెడీ డ్రామా  విడుదలై తొమ్మిది రోజులు కూడా తిరగకముందే ఏకంగా 40 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యానికి  గురిచేస్తోంది. నటుడు మరియు దర్శకుడు ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, 2015 నాటి సూపర్ హిట్ మూవీ 'దేవూల్ బంద్'కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన వసూళ్ల వెనుక ప్రేక్షకుల నుండి లభిస్తున్న బలమైన మౌత్ టాక్ కీ రోల్  పోషిస్తోంది. మే 21న మహారాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,175 స్క్రీన్లలో కొత్త రకం పద్దతిలో  తెల్లవారుజామున 5:30 గంటల బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. ఉదయాన్నే ఆటలకే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం సినిమా విజయాన్ని ముందే సూచించింది. ఆ తర్వాత క్రమంగా పెరిగిన డిమాండ్ కారణంగా కేవలం కొన్ని రోజుల్లోనే మేకర్స్ మరో 600 స్క్రీన్‌లని అదనంగా జోడించాల్సి వచ్చింది. మొదటి ఆదివారం నాడే ఏకంగా 5.90 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, రెండవ శుక్రవారం నాటికి కూడా 3.19 కోట్ల వసూళ్లతో తన జోరును ఏమాత్రం తగ్గించుకోలేదు. ప్రస్తుతం40 కోట్ల మార్క్‌ని  దాటి దూసుకుపోతున్న ఈ చిత్రం, నానా పటేకర్ క్లాసిక్ హిట్ 'నటసామ్రాట్' పేరిట ఉన్న46 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్స్ రికార్డుని  దాటేందుకు కేవలం 6 కోట్ల దూరంలో నిలిచింది. రితేష్ దేశ్‌ముఖ్ నటించిన 'రాజా శివాజీ' 115 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ మరాఠీ చిత్రంగా 'దేవూల్ బంద్ 2' నిలిచింది. . స్నేహల్ తార్డే పోషించిన సంగీత పేగుడే అనే ఒక సామాన్య మహిళా రైతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నిత్యం అప్పులు, కష్టాలతో సతమతమయ్యే ఆమె, తన సమస్యలు తీర్చాలంటూ దేవుడిని వేడుకున్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనవుతుంది. ఒకరోజు నది ఒడ్డున ఉన్న చీమల పుట్టపై రాయి విసరడంతో, ఆమెకు సాక్షాత్తూ శ్రీస్వామి సమర్థ్ (మోహన్ జోషి) దర్శనమిస్తారు. ఆ తర్వాత స్వామి ఆమె గ్రామానికి వస్తారు. అయితే, ఆయన కేవలం ఆ మహిళకు మాత్రమే కనిపిస్తూ, ఇతరులకు కనిపించకపోవడంతో ఊరి జనం ఆమెకు పిచ్చి పట్టిందని భావిస్తారు. హాస్యం, భక్తితో పాటు మహారాష్ట్రలోని రైతుల ఆత్మహత్యల వంటి అత్యంత సున్నితమైన సామాజిక అంశాన్ని ఈ చిత్రం అద్భుతంగా స్పృశించింది. Also read: Karuppu: సూర్య, ఆర్ జె బాలాజీ మధ్య గొడవ.. ఇప్పటికి 300 కోట్లు అంట  ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను సీనియర్ నటుడు మోహన్ జోషి ఇటీవల పంచుకున్నారు. దర్శకుడు ప్రవీణ్ తార్డే పనిలో ఎంతగా లీనమైపోయారంటే, ఒక ఇండోర్ షెడ్యూల్ సమయంలో ఏకంగా 33 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా నిరవధికంగా షూటింగ్ చేస్తూనే పోయారు. లోపల లైటింగ్ సెటప్ అంతా ఒకేలా ఉండటం వల్ల బయట రాత్రి అవుతుందో, పగలు అవుతుందో ఎవరికీ అర్థం కాలేదు. దర్శకుడిని అడిగే ధైర్యం లేక అందరూ అలాగే పనిచేయగా, చివరకు 30 గంటలు దాటిన తర్వాత మోహన్ జోషి ధైర్యం చేసి సమయం గురించి గుర్తుచేశారు. దాంతో షాకైన దర్శకుడు, మరో రెండు షాట్లు తీసుకుని షూటింగ్‌ కి ప్యాకప్ చెప్పారు. అలాగే షూటింగ్ మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్‌లుగా వచ్చిన గ్రామస్థులు తమ పనులకు వెళ్లిపోతే, సెట్‌లోని డ్రైవర్లని , స్నేహితులని జూనియర్ ఆర్టిస్ట్ దుస్తుల్లో మార్చి షూటింగ్ పూర్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.         
Mahesh Babu's Athidhi re-release has turned out to be a major disappointment at the box office. Despite carrying the star's popularity and decent online buzz, the film failed to attract audiences to theatres in significant numbers. For the past few years, re-releases have become a successful trend in Telugu cinema. Several older films managed to generate strong openings, packed shows and impressive revenues by riding on nostalgia and fan celebrations. Encouraged by those results, many producers and distributors started bringing back older titles to theatres. However, Athidhi appears to have hit a wall. The film did not become a hit during its initial release but did find few takers online supporting it as an entertaining film with flaws. Hence, there was a discourse about it working well upon re-release but the lackluster turn-out has shown that people have moved on from the trend.  Industry observers point out that nostalgia alone may not guarantee theatrical success anymore. Audiences are becoming more selective and seem willing to return only for films that have built a strong cult following over the years. While it may be too early to declare the trend completely over, Athidhi's performance is certainly a warning sign. Going forward, re-releases may need more than just star value and social media hype to bring audiences back to theatres. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కరుప్పు(Karuppu)అలియాస్ వీరభద్రుడు(Veerabhadrudu)ఎంటైర్ తన కెరీర్ కే సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుందని సూర్య(Suriya)అసలు ఉహించి ఉండడు. కేవలం పదిహేను రోజులకే వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ ని సాధించిందంటే మాములు విషయమా చెప్పండి. అభిమానులు సంబరాలు చేసుకుంటున్న టైంలో దర్శకుడు ఆర్జే బాలాజీ కరుప్పుకి సంబంధించిన ఒక అత్యంత ఆసక్తికరమైన  షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఆర్జే బాలాజీ(RJ Balaji)మాట్లాడుతూ, షూటింగ్ సమయంలో సూర్య నాతో ఒక డైలాగ్ విషయంలో తీవ్రంగా విభేదించారు. మొదట్లో సూర్య సార్ ఆ పర్టిక్యులర్ డైలాగ్ చెప్పడానికి అస్సలు సిద్ధంగా లేరని, ఆ సీన్ వద్దే వద్దని గొడవపడ్డారు. తన కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా తానే ఆయన్ని చాలా బలవంతం చేశానని, తన గత హిట్ సినిమాలైన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) వంటి చిత్రాల ఉదాహరణలను చెప్పి ఎలాగోలా ఒప్పించాల్సి వచ్చింది. అయినప్పటికీ సూర్య సార్ మాత్రం ఆ డైలాగ్ మనకొద్దు అని పదే పదే చెప్తూనే వచ్చారు. దీనివల్ల ఇండస్ట్రీలో ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, రిలీజ్ కి వారం ముందే ఫైనల్ కట్ చూసిన తర్వాత కూడా సూర్య సార్ ఆర్జే బాలాజీ దగ్గరికి వచ్చి, ఆ డైలాగ్‌ను సినిమా నుండి పూర్తిగా తీసేయమని గట్టిగా పట్టుబట్టారు. "మన సినిమాల్లో ఇతరుల చిత్రాలని  గానీ, వారి వ్యక్తిగత విషయాలను గానీ ఎగతాళి చేయకూడదు, అది పద్ధతి కాదు" అని అన్నారు.వేరొకరిని నొప్పించడం ఇష్టం లేక అంతలా వాదించారు. ఆయన నిజంగానే చాలా గొప్ప సంస్కారం ఉన్న మంచి వ్యక్తి . అయితే నేను   మాత్రం మొండిగా నిలబడి మూకుత్తి అమ్మన్ కి దర్శకత్వం వహించింది నేను సార్.. నా నమ్మకాన్ని నమ్మండి, ఏమీ పర్లేదు, నేను చూసుకుంటా అని చెప్పి ఆ సీన్‌ని, డైలాగ్ ని  అలాగే ఉంచాం. Also read: kushboo: ఖుష్బూ కూతురి పెళ్లి.. మోదీ ఆశీస్సులు   చివరకి థియేటర్లలోకి సినిమా వచ్చాక నా  నమ్మకమే నిజమైంది. ఆ పర్టిక్యులర్ డైలాగ్‌కి థియేటర్లన్నీ చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయాయి. ప్రేక్షకులు ఆ సీన్‌ని చాలా బాగా  ఎంజాయ్ చేస్తున్నారని బాలాజీ ఆనందం వ్యక్తం చేశారు.  
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో కొన్ని దశాబ్దాల పాటు ఒక  వెలుగువెలిగిన సీనియర్ నటి, భారతీయ జనతా పార్టీ కీలక నేత ఖుష్బూ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. శ్రవణ్ శ్రీనివాసన్ అనే యువకుడితో అవంతిక వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ సుందర్ కుటుంబంలో పెళ్లి సందడి అప్పుడే మొదలైంది. కుటుంబంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ వివాహ వేడుకకి దేశంలోని ప్రముఖులను ఆహ్వానించే పనిలో పడ్డారు ఖుష్బూ దంపతులు. ఇందులో భాగంగానే వారు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అద్భుతమైన, మరపురాని క్షణాన్ని సొంతం చేసుకున్నారు. ఖుష్బూ ,ఆమె భర్త, కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుందర్ లు కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్‌లతో కలిసి ఢిల్లీలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఖుష్బూ దంపతులు తమ కుమార్తె వివాహ ప్రథమ ఆహ్వాన పత్రికని  మోదీకి స్వయంగా అందజేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, దేశ ప్రధాని తమ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించడం పట్ల ఖుష్బూ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. వివాహ పత్రికని  స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే నూతన వధూవరులైన అవంతిక, శ్రవణ్‌లను సాదరంగా ఆహ్వానించి, వారిని ఆశీర్వదించారు. ప్రధాని మోదీని కలిసిన ఈ అపురూప క్షణాలకు సంబంధించిన ఫోటోలను ఖుష్బూ సుందర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ 'ఎక్స్' వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఖుష్బూ సాంప్రదాయబద్ధమైన పింక్ కలర్ సిల్క్ శారీలో ఎంతో హుందాగా కనిపించగా, అవంతిక, శ్రవణ్ జంట ఎంతో క్యూట్‌గా మెరిసిపోయారు. ప్రధాని మోదీని కలవడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా ఖుష్బూ అభివర్ణించారు. దేశాన్ని నడిపించే అత్యంత బిజీ నాయకుడు తమ ఆహ్వానాన్ని మన్నించి, కాబోయే దంపతులను మనస్ఫూర్తిగా దీవించడం తమకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖుష్బూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ ఒక ప్రత్యేక నోట్ రాసుకొచ్చారు. "ఈరోజు ఢిల్లీలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుసుకునే అదృష్టం, గౌరవం మాకు లభించాయి. నా భర్త సుందర్, నేను కలిసి మా కుమార్తె రాబోయే వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికని అందించాం. ప్రధాని గారు ఎంతో ఆప్యాయంగా కాబోయే కొత్త జంటని ఆశీర్వదించారు. నిరంతరం దేశ సేవలో ఎంతో బిజీగా ఉండే షెడ్యూల్‌లోనూ మా కోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు మేము నిజంగా కృతజ్ఞులమై ఉంటాము. మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. వినమ్రతతో తలవంచుతున్నాము. థ్యాంక్యూ ప్రధానమంత్రి జీ" అంటూ రాసుకొచ్చారు. also read: The sheep detectives: 854 కోట్లు వసూలు చేసిన గొర్రెల మంద డిటెక్టివ్ కామెడీ.. అసలు మిస్ అవ్వకండి ఖుష్బూ, సుందర్ దంపతులకి ఇద్దరు కుమార్తెలు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమార్తె ఆనందిత ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, చిన్న కుమార్తె అవంతిక త్వరలోనే హీరోయిన్‌గా మలయాళ చిత్ర పరిశ్రమలో 'ఆరంభం' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేయబోతుంది.  
Yash's much-awaited Toxic is back in the spotlight, and industry gossip suggests that crash in OTT market is causing further delay in release of the project. According to the reports, the makers have spent record breaking budget for any Kannada film, looking at KGF franchise success. To recover, they estimated a significant number from OTT platforms but the current crash in market is not allowing for such multi-hundred crore deal to go through.  Hence, producers KVN Productions and Monster Mind Creations have, reportedly, decided to wait till a good OTT deal is finalised, to release the film. Even Yash, who is also one of the producers, has agreed to this settlement and he is even actively trying to find a Hollywood studio to distribute his film's English version in Overseas markets. For now, the gossip mongers state that the release of the film depends entirely on the OTT deal.  Directed by Geetu Mohandas the movie also stars Nayanthara, Kiara Advani, Rukmini Vasanth, Tara Sutaria and Huma Qureshi. The film has been carrying huge expectations ever since it was announced. Teaser did get huge response but trailer did not live up to the high expectations. There is no official confirmation regarding these reports, but the wait for Toxic continues for the time being.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కొన్ని చిత్రాలని చూడాలంటే పెట్టి పుట్టాలి. అలాంటి ఒక చిత్రమే ది షీప్ డిటెక్టివ్స్.     హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక విచిత్రమైన, అత్యంత వినూత్నమైన క్రైమ్ కామెడీగా పేరు తెచ్చుకున్న ఈ  చిత్రం ప్రపంచవ్యాప్తంగా  ఉన్న ప్రేక్షకులని  విశేషంగా ఆకట్టుకుంటోంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ థియేటర్లకి  రప్పిస్తున్న ఆ సినిమా పేరే 'ది షీప్ డిటెక్టివ్స్'. లీయోనీ స్వాన్ రాసిన 'త్రీ బ్యాగ్స్ ఫుల్' అనే ప్రసిద్ధ నవల ఆధారంగా, ప్రముఖ దర్శకుడు కైల్ బాల్డా తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ క్లాసిక్ 'బేబ్', మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'నైవ్స్ అవుట్' కలయికలా సాగుతుంది.  ప్రముఖ అమెజాన్ MGM స్టూడియోస్ సుమారు $75 మిలియన్ల భారీ బడ్జెట్‌తో, అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు  620 కోట్లకి పైగా వ్యయంతో ఈ విజువల్ వండర్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.మనుషులను బురిడీ కొట్టించే గొర్రెల మంద.. బాక్సాఫీస్ వద్ద 'ది షీప్ డిటెక్టివ్స్' సెన్సేషన్! మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ కేవలం కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో 90 మిలియన్ డాలర్స్ కి పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే 854 కోట్లుపై మాటే.  ఈ సినిమా కథాంశం చాలా విచిత్రంగా, అత్యంత సరదాగా సాగుతుంది. ఒక అందమైన పల్లెటూరి వాతావరణంలో జార్జ్ అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్‌మన్ ఈ జార్జ్ క్యారక్టర్ ని అద్భుతంగా పోషించాడ. జార్జ్‌కి తన మందలోని గొర్రెలంటే ప్రాణం. అతను ప్రతిరోజూ రాత్రి పూట ఆ గొర్రెలన్నింటినీ ఒకచోట కూర్చోబెట్టి, తనకు ఇష్టమైన రకరకాల డిటెక్టివ్ నవలలు, ఉత్కంఠభరితమైన క్రైమ్ స్టోరీలను పెద్దగా చదివి వినిపించేవాడు. పాపం, ఆ అమాయక గొర్రెల కాపరికి అస్సలు తెలియని విషయం ఏంటంటే, తన మందలోని గొర్రెలన్నీ సాధారణమైనవి కావు, అవి అత్యంత తెలివైనవి! జార్జ్ చదివే ప్రతి క్రైమ్ కథలోని ప్రతీ ముక్కా, ప్రతీ లాజిక్ ఆ గొర్రెలకు స్పష్టంగా అర్థమయ్యేది. అలా ప్రతిరోజూ రాత్రిళ్లు క్రైమ్ నవలలు వింటూ వింటూ, ఆ గొర్రెల మంద అంతా మనుషుల కంటే షార్ప్ గా ఆలోచించే పెద్ద పెద్ద డిటెక్టివ్ మైండ్స్ లా తయారవుతాయి. కథలో అసలైన మలుపు ఇక్కడే వస్తుంది. ఒకరోజు హఠాత్తుగా జార్జ్ తన సొంత పొలంలోనే అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తాడు. అక్కడికి వచ్చిన స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, అదొక సాధారణ ప్రమాదం అని తేల్చి చెప్పి కేసును క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ తమ యజమానిని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం, అత్యంత ప్లాన్డ్‌గా మర్డర్ చేశారని ఆ తెలివైన గొర్రెలకు వెంటనే అర్థమవుతుంది. తమను ప్రాణంగా చూసుకున్న యజమాని జార్జ్ మరణానికి ఎలాగైనా న్యాయం చేయాలని, ఆ హంతకుడిని తామే పట్టుకోవాలని ఆ గొర్రెలన్నీ కలిసి ఒక పటిష్టమైన డిటెక్టివ్ టీమ్‌గా ఏర్పడతాయి. అప్పటివరకు తాము విన్న డిటెక్టివ్ కథల నాలెడ్జ్ మొత్తాన్ని, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్‌ను ఉపయోగించి కేసు విచారణను స్వయంగా మొదలుపెడతాయి. అప్పటివరకు పచ్చటి మైదానాలకే పరిమితమైన ఆ గొర్రెలు, క్లూస్ వెతుక్కుంటూ మొదటిసారి మనుషుల ప్రపంచంలోకి, సిటీలోకి అడుగుపెట్టి చేసే హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. Also read: Peddi: పెద్ది ఓటీటీ డీల్ రికార్డు అమౌంట్!   టెక్నికల్ గా ఈ సినిమా హాలీవుడ్‌లో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది. ఇందులో గొర్రెల క్యారక్టర్ లని, వాటి హావభావాలని  సృష్టించడానికి ఉపయోగించిన హై-ఎండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత సహజంగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేశాయి. రాబోయే ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈ చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఖచ్చితంగా నామినేషన్ దక్కుతుందని సినీ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. ప్రముఖ అంతర్జాతీయ రివ్యూ వెబ్‌సైట్ రోటెన్ టొమాటోస్‌లో ఈ చిత్రానికి ఏకంగా 95% రేటింగ్ లభించింది. ఇది హ్యూ జాక్‌మన్ కెరీర్‌లోనే అత్యధిక రేటింగ్ సాధించిన సినిమాగా నిలవడం విశేషం. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ క్రైమ్ కామెడీ మిస్టరీ ఎంటర్‌టైనర్, తన థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఈ విజువల్ ఫీస్ట్‌ను అస్సలు మిస్ అవ్వకండి!     
Ajith Kumar's much-discussed AK64 with director Adhik Ravichandran is reportedly not going on floors anytime soon. With the project facing delays, fresh industry gossip suggests that Adhik could complete another film before returning to the Ajith starrer. According to buzz, the director recently met Nandamuri Balakrishna and narrated a storyline that reportedly impressed the actor. While there is no official confirmation yet, the possibility of a collaboration has started generating interest in trade circles. However, Balakrishna's schedule is already packed. The actor is expected to begin work on his next film with Gopichand Malineni, tentatively referred to as NBK111. Reports also suggest that discussions are underway with Vivek Athreya for a potential NBK112. With two projects already in the conversation, it remains to be seen where Adhik's proposal fits into Balakrishna's future lineup. On the other hand, fans are also waiting for clarity on Ajith Kumar's next acting venture. The actor is currently focused on The Gladiators, a documentary based on his racing journey that is being produced by Ajith himself and is gearing up for release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ముస్తాబవుతున్న సరికొత్త విజువల్ వండర్ ‘రాకా’ (RAAKA) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొనగా, తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి చిత్ర రచయిత నాగేంద్ర కాశీ పంచుకున్న కొన్ని సంచలన విషయాలు నెట్టింట ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. రచయిత నాగేంద్ర కాశీ ‘రాకా’ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ చిత్రం కేవలం ఒక సాధారణ సినిమాగా మిగిలిపోదని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పారు. ఇప్పటివరకు భారతీయ వెండితెరపై ఎవరూ ఊహించని, ఎన్నడూ చూడని ఒక సరికొత్త అద్భుత ప్రపంచాన్ని డైరెక్టర్ అట్లీ సార్ ఈ సినిమా ద్వారా సృష్టిస్తున్నారని ఆయన కొనియాడారు. సాధారణంగా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పడితేనే సీన్లలో ఎలివేషన్ వస్తుంది, ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. కానీ, ‘రాకా’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లోనే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా నటీనటుల పర్ఫార్మెన్స్, అట్లీ టేకింగ్ చూసినప్పుడు కలిగిన థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అద్భుతంగా ఉందని ఆయన వెల్లడించారు. సెట్స్‌లోనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే అంతటి గూస్‌బంప్స్ తెప్పించిన ఈ విజువల్స్, ఇక రేపు వెండితెరపై అద్భుతమైన రీ-రికార్డింగ్ తో కలిసి వస్తే థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని నాగేంద్ర కాశీ పేర్కొన్నారు. స్క్రీన్ పై ఈ చిత్రం ఒక భారీ బాక్సాఫీస్ బ్లాస్ట్ లా ఉండబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  పాన్ ఇండియా స్థాయిని మించి గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. నాగేంద్ర కాశీ ఇచ్చిన ఈ క్రేజీ లీక్ తో ఇండస్ట్రీ వర్గాలలో ‘రాకా’ సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.  
Premalu starring Naslen, Mamitha Baiju emerged as one of the biggest surprise blockbusters from Malayalam cinema and quickly built a strong fan base across languages. Naturally, talks about Premalu 2 generated huge excitement among audiences. However, the sequel is no longer moving forward. Actor Naslen has now revealed the reason behind the decision. In a recent interview, he stated that the team dropped the sequel idea because they were not satisfied with the screenplay. Rather than moving ahead with a script that failed to meet expectations, the makers decided to shelve the project. The revelation comes as a surprise to fans who were expecting the film's success to automatically lead to a franchise. Over the past several months, multiple theories had surfaced regarding the delay, including scheduling issues and other production-related challenges. Naslen's comments, however, make it clear that the decision was purely creative. The team reportedly felt the story was not strong enough to justify a sequel. In an industry where successful films are often rushed into follow-ups, many may view this as a sensible decision. While Premalu 2 might not happen anytime soon, the makers seem determined not to compromise on quality simply to cash in on the popularity of the original film. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఇప్పుడు ఎక్కడ ఏ ముగ్గురు కలిసినా రామ్ చరణ్ పెద్ది(Peddi)ని చూస్తుంటే మూవీ సూపర్ హిట్ అయ్యేలా ఉందని మాట్లాడుకుంటున్నారు. దీంతో జూన్ 4 రిలీజ్ డేట్ అయినా మూడు నుంచి ప్రదర్శితం కాబోయే ప్రీమియర్స్ కి రెడీ అవుతున్నారు. దీంతో థియేటర్లలోపెద్ది  సాధించే వసూళ్ల లెక్కలు ఎలా ఉంటాయనేది పక్కన పెడితే, విడుదలకు ముందే 'పెద్ది' సృష్టించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ రికార్డులు చూసి సినీ ప్రపంచం అవాక్కవుతోంది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారాల మధ్య టాలీవుడ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన పోటీ నెలకొంది. చివరికి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్' భారీ ధర చెల్లించి ఈ సినిమా డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. విశ్వసనీయ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి అన్ని ప్రధాన భాషల డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 130 కోట్ల బేస్ ప్రైస్ చెల్లించడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. టాలీవుడ్‌లో ఒక సింగిల్ స్టార్ సినిమాకి  ఈ స్థాయి భారీ ధర లభించడం నిజంగా ఒక సంచలనమనే చెప్పాలి. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 130 కోట్లు కేవలం ప్రారంభ రేట్ మాత్రమే. ఈ డీల్‌లో పెట్టిన ఒక ప్రత్యేకమైన బోనస్ క్లాజ్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలని  ఆశ్చర్యపరుస్తోంది. సినిమా థియేట్రికల్ రన్,బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగా ఈ ఓటీటీ డీల్ విలువ మరింత పెరిగేలా నిర్మాతలు వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ పక్కా స్కెచ్ వేశారు. ఈ ఒప్పందం ప్రకారం, 'పెద్ది' తెలుగు వెర్షన్  బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల మైలురాయిని దాటితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ నిర్మాతలకు అదనపు బోనస్ మొత్తాన్ని చెల్లిస్తుంది. అలాగే హిందీ వెర్షన్ 100 కోట్ల క్లబ్‌లో చేరితే మరో  బోనస్ లభిస్తుంది. ఒకవేళ హిందీ మార్కెట్ వసూళ్లు .200 కోట్ల మార్కును అధిగమిస్తే నెట్‌ఫ్లిక్స్ నుండి మరో స్థాయి భారీ చెల్లింపులు అందేలా అగ్రిమెంట్ చేశారు. Also read: Premalu: ప్రేమలు హీరో నస్లీన్ షాకింగ్ కామెంట్స్.. ఎందుకు ఈ పక్షపాతం  ఈ లెక్కన  ఉత్తరాది, దక్షిణాది మార్కెట్లలో వసూళ్ల జాతర జరిగితే, ఈ డిజిటల్ డీల్ విలువ బేస్ ప్రైస్ 130 కోట్లని దాటి వెళ్లే అవకాశం ఉంది. కేవలం ఓటీటీ మాత్రమే కాదు,  మ్యూజికల్ రైట్స్  దాదాపు రూ.50 కోట్లకు పైగా పలికినట్లు ఫిలిం నగర్ సమాచారం. రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' డిజిటల్ హక్కులు సుమారు 160 కోట్లకు అమ్ముడుపోయిన రికార్డు ఉంది. ఇప్పుడు 'పెద్ది' బేస్ ప్రైస్ దానికంటే కాస్త తక్కువగా కనిపించినప్పటికీ, థియేటర్ కలెక్షన్ల బోనస్ క్లాజులతో ఈ సినిమా ఫైనల్ డీల్ వాల్యూ గేమ్ ఛేంజర్ రికార్డులను కూడా బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జూన్ 4న థియేటర్లు కాస్తా స్టేడియంలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం,  విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు  అవేంటో తెలుసుకుంటే.. విడిపోవడం.. చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే  కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా  చూసుకోవచ్చు.  కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. అసలు సమస్య.. విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు  సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ  ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం. ప్రేమ.. ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే...  ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే.. పరిస్థితి.. విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి.  అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని  ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా  తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా,  భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం. మనసే కాదు.. ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది. స్పష్టత.. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే,  చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి  సరిగ్గా తెలియజేశారా? తమ  అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితం తమ చేతుల్లో నుండి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు తరచుగా ఇతరులను సంతోషపెట్టడానికి తమ కోరికలను, భావోద్వేగాలను అణచివేసుకుంటారు. ఈ అలవాటు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అమ్మాయిలకు విలువలు,  మంచి విద్య మాత్రమే కాదు.. ఎంత కష్టంలో అయినా నిలబడాలంటే.. ప్రతి తల్లి తన కూతురికి కొన్ని నేర్పించాలి. వాటిలో  ముఖ్యమైనది.. ఏదైనా కరెక్ట్ కాని విషయానికి " నో " చెప్పడం.  ఇలా ఏదైనా సరికాని విషయానికి నో చెప్పడం అమ్మాయిలను ఎందుకు బలంగా ఉంచుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. "నో" అని చెబితే.. ఒక అమ్మాయి 'కాదు' అని చెప్పడం నేర్చుకున్నప్పుడు, ఆమె సంబంధాలలో, వృత్తిలో , సమాజంలో తనను తాను గౌరవించుకోవడం కూడా నేర్చుకుంటుంది. ఈ ఒక్క అలవాటే ఆమెను మానసికంగా దృఢంగా, స్వయం సమృద్ధిగా , ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఇది  జీవితంలో ముందుకు సాగడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది.. ఆడపిల్ల తన ఇష్టాయిష్టాలను బయటకు  వ్యక్తపరిచినప్పుడు, ఆమె తన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది. తప్పుడు వ్యక్తుల నుండి దూరం.. మొహమాటంతోనో లేక ఇతరులను సంతోషపెట్టాలనో ప్రతి దానికి సరే అని చెప్పే అలవాటు.. ఎదుటివారు అమ్మాయిలను  స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 'కాదు' అని చెప్పడం  భద్రతను ఇస్తుంది. అమ్మాయిలకు ఏదైనా సరికాదు అనిపిస్తే మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం.. తన మనసులోని మాటను చెప్పడానికి భయపడని అమ్మాయి జీవితంలోని అతిపెద్ద నిర్ణయాలను కూడా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలదు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తన  స్వంత బౌండరీస్ ను నిర్దేశించుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది. బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.. స్పష్టమైన ఆలోచన , ముక్కుసూటితనం ఉన్న అమ్మాయిలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తారు. పొగరు, లెక్కలేనితనం.. ఇలాంటి మాటలు అనుకునేవారు కూడా ఉంటారు.  కానీ వ్యక్తిత్వం, మంచితనం,  నిర్ణయాలు సరిగా తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటే.. విమర్శించిన వారే మెచ్చుకునే రోజులు వస్తాయి. దీని వల్ల వ్యక్తిత్వం బలంగా మారుతుంది. ఎలా నేర్పాలి.. ఏదైనా విషయం సరికాదు అనిపిస్తే దానికి నో చెప్పడం ఎలా అనే విషయాన్ని తల్లులు తమ కూతురికి నేర్పాలి.  కానీ ఎలా నేర్పాలో కొందరికి అర్థం కాదు. తల్లి కూతురి దగ్గర స్నేహితురాలిగా ఉండి మనసు విప్పి మాట్లాడాలి.  దీనివల్ల కూతురి ఏ విషయాన్ని అయినా మనసు విప్పి పంచుకోగలుగుతుంది. అందరినీ సంతోషపెట్టడం కోసం అన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆడపిల్ల అభిప్రాయానికి, నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.  తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోయినా,  వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని వివరించి చెప్పాలి. తప్పు చేసినప్పుడు లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తిట్టడానికి బదులుగా వాటి పర్యావసానాలు వివరించి చెప్పాలి.  ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుండేదో.. ఎలా ఉండాలో చెప్పాలి. ఆడపిల్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు విషయం కాదని,  అది తన వ్యక్తిత్వాన్ని  తెలియజేస్తుందని వివరించాలి.  అప్పుడే అబిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండే తన వ్యక్తిత్వం మంచిగా ఉంటుందో వారికి అర్థమవుతుంది.                           *రూపశ్రీ.
  మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది.   మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా?  సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా?   సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి?  సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం.  కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166   మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!  మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు (Bad Gums) నిర్లక్ష్యం చేస్తే అవి మన శరీరంలోని ఇతర భాగాలపై కూడా తీవ్ర प्रभावం చూపుతాయి. ఈ ముఖ్యమైన విషయంపై ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సుధీర్ చౌదరి (Dentist, MDS) గారు అందించిన పూర్తి సమాచారం సరళమైన తెలుగులో ఈ వీడియో మీ కోసం... చిగుళ్ల సమస్యలకు ప్రధాన కారణాలు (Causes of Gum Diseases): ప్లేక్ మరియు టార్టార్ (Plaque & Tartar): మనం తినే ఆహార అవశేషాలు, నోటిలోని బ్యాక్టీరియా కలిసి పంటిపై ఒక జిగట పొరలా (Plaque) ఏర్పడతాయి. దీనిని సకాలంలో బ్రషింగ్ ద్వారా శుభ్రం చేయకపోతే అది గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. ఇది చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం. తప్పుడు బ్రషింగ్ విధానం: రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోవడం లేదా చాలా గట్టిగా పళ్ళను తోమడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. పోషకాహార లోపం: శరీరంలో ముఖ్యంగా విటమిన్ సి (Vitamin C) మరియు కాల్షియం లోపం వల్ల చిగుళ్లు బలహీనపడతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు: మధుమేహం (Diabetes) ఉన్నవారిలో, ధూమపానం (Smoking) అలవాటు ఉన్నవారిలో మరియు గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు (Symptoms of Gum Infection): బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టి పదార్థాలు (ఆపిల్ వంటివి) తింటున్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం కారడం (Bleeding Gums). చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు రావడం మరియు ముట్టుకుంటే నొప్పిగా ఉండటం. నోటి నుండి విపరీతమైన దుర్వాసన రావడం (Bad Breath). పళ్ళు కదలడం లేదా పళ్ళ మధ్య ఖాళీలు (Gaps) ఏర్పడటం. చిగుళ్లు పంటి పైభాగం నుండి కిందికి జారిపోవడం (Gum Recession). చిగుళ్ల సమస్యలు ఇతర ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? (Impact on Overall Health): చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. ఇది గుండె జబ్బులు (Heart Diseases), డయాబెటిస్ నియంత్రణ తప్పడం మరియు గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవాల (Premature Delivery) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నివారణ మరియు చికిత్స మార్గాలు (Prevention & Treatment): డెంటల్ స్కేలింగ్ (Scaling): ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించి పళ్ళను, చిగుళ్లను ప్రొఫెషనల్‌గా క్లీన్ (Scaling) చేయించుకోవాలి. దీనివల్ల పంటిపై పేరుకుపోయిన గట్టి టార్టార్ తొలగిపోతుంది. సరైన బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్: మృదువైన (Soft) బ్రష్ ఉపయోగించి, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ (Floss) ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు మరియు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గమనిక : చిగుళ్ల నుండి రక్తం రావడం అనేది సాధారణ సమస్య కాదు, అది ఒక హెచ్చరిక. కాబట్టి పంటి సమస్యలు రాకముందే జాగ్రత్త పడటం ఎంతో మేలు.    మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి రావడం, మరికొందరిలో విపరీతమైన మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఈ సమస్య ఉన్నవారిలో కనిపిస్తాయి. దీనివల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.  మరి ఈ ఐబీఎస్ సమస్య నుండి సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ఉపశమనం పొందాలి? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్య చిట్కాను వివరించారు.    ఐబీఎస్‌కు అద్భుతమైన 'మజ్జిగ' చిట్కా: ఆయుర్వేదం ప్రకారం ఐబీఎస్ లేదా 'గ్రహణి' వ్యాధికి మజ్జిగ (Buttermilk) ఒక సంజీవని లాంటిది. అయితే ఈ మజ్జిగను ఎలా తీసుకోవాలో డాక్టర్ గారు చక్కగా వివరించారు: పలుచని మజ్జిగ: పెరుగును బాగా చిలికి, వెన్న తీసేసి, తగినన్ని నీళ్లు పోసి పలుచని మజ్జిగను సిద్ధం చేసుకోవాలి. ఔషధాల మిశ్రమం: ఈ మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి (వేయించిన జీలకర్ర పొడి అయితే మరింత మంచిది), కొద్దిగా శొంఠి పొడి లేదా అల్లం రసం, మరియు రుచికి తగినంత సైంధవ లవణం (Rock Salt) వేసి బాగా కలపాలి. ఎప్పుడు తీసుకోవాలి?: ఈ ప్రత్యేకమైన మజ్జిగను రోజూ ఉదయం, మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా రోజంతటా కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటే పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది? మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జీర్ణవ్యవస్థను, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీలకర్ర మరియు శొంఠి జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు కడుపునొప్పిని తగ్గిస్తాయి. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, అటు విరేచనాలు, ఇటు మలబద్ధకం సమస్యలను అదుపులోకి తెస్తుంది. దీనితో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వల్ల ఐబీఎస్ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చని డాక్టర్ గారు సూచించారు.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! గమనిక: తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను నేరుగా సంప్రదించి, మీ శరీర తత్వానికి తగినట్లుగా చికిత్స పొందడం శ్రేయస్కరం.