తెలుగువన్ ప్రత్యేకం వైసీపీ  అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరి, రాజధాని అమరావతిపై ఆయన తీసుకున్న నిర్ణయాలపై మైలవరం తెలుగుదేశం   ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వన్ న్యస్ చానల్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో  ఆయన  కుట్రలతో అమరావతిని చెడగొట్టాలని చూసేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. గతంలో  వైపీపీలో  తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ వివరంగా వెల్లడించారు. ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులు తలెత్తడం వల్లే తాను బయటకు వచ్చి, తన మద్దతుదారులు, శ్రేయోభిలాషుల సూచనల మేరకు తెలుగుదేశం పార్టీలో  చేరానన్నారు.  పారిశ్రామిక రంగానికి రావాల్సిన రాయితీలు, నిధుల విడుదల విషయంలో నాలుగేళ్లపాటు జగన్ ప్రభుత్వం  నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్  తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో తమకు కావలసిన కొందరికే నిధులు, రాయితీలు విడుదల చేశారన్నారు. ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సైతం జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడు నెలల కాలపరిమితి పేరుతో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తూ మోసం చేశారని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి అంశంపై జగన్మోహన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదనలు, ఆలోచనలు జుగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే కుట్రలతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించారని ధ్వజమెత్తారు.  అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని. జగన్   కాదు..  ఎవరు దిగివచ్చినా అమరావతిని మార్చడం సాధ్యపడే విషయం కాదని స్పష్టం చేశారు.   ఒక నగరం అభివృద్ధి చెందే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని, దానిని సహించలేక కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాలు రగల్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ హామీలు, రాజకీయ నాటకాలడే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవారు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినట్లేనని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.  రాబోయే రోజుల్లో ఓటు అనేది కేవలం ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తును నిర్మించే కీలక నిర్ణయమని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రతి వేదికపైనా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వసంత కృష్ణప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాలను ప్రజలు ఇప్పటికే గ్రహించారని, ఇకపై అభివృద్ధి నిరోధక రాజకీయాలకు ఏపీలో తావులేదని పునరుద్ఘాటించారు. Vasantha Krishna Prasad Interview, Mylavaram MLA Vasantha, YS Jagan Amaravati Comments, Jogi Ramesh Vasantha Krishna Prasad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థల అధినేత్రి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో శాసనసభలో తనపై వ్యక్తిగత విమర్శల చేసి, అవమానకరంగా వైపీపీ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ   భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా నాటి అసెంబ్లీ ఘటనను మహాభారతంలోని ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి వ్యవహారాలు, స్థానిక కార్యకర్తల సంక్షేమాన్ని పర్యవేక్షించేందుకు నారా భువనేశ్వరి మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా..  ఓ స్థానిక ఆలయాన్ని దర్శించారు. ఆ ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తరువాత నాటి పరిణామాలను గుర్తుచేసుకుంటూ, ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు ఏ పురుషుడికీ లేదన్నారు.  2021 నవంబరులో అసెంబ్లీ వేదికగా అప్పటి అధికార పక్ష నాయకులు ప్రతిపక్ష నేత చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేందుకు తన పేరును లేవనెత్తారన్న  భువనేశ్వరి, తన భర్తపై రాజకీయంగా పై చేయి సాధించలేక..  తనను అనవసరంగా రాజకీయ రచ్చలోకి లాగారన్నారు. అసెంబ్లీ వంటి పవిత్రమైన సభలో ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేయడం  దారుణమన్నారు. మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగిన సమయంలో శ్రీకృష్ణుడు అండగా నిలిచినట్లే, తమ కుటుంబానికి పరాభవం జరిగిన  సమయంలో రాష్ట్ర ప్రజలే దేవుడి రూపంలో అండగా నిలబడ్డారని భువనేశ్వరి చెప్పారు. ప్రతి మహిళకు తన గౌరవాన్ని కాపాడుకునే శక్తి ఉంటుందని, ఎవరూ వచ్చి రక్షించాల్సిన అవసరం లేదన్నారు. తమకు నిరంతరం మద్దతుగా నిలిచిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.  సాధారణంగా నారా భువనేశ్వరి వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాలకే పరిమితమవుతుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.   అయితే ఆలయ సందర్శన వేళ ద్రౌపది విగ్రహాన్ని చూడటంతో భువనేశ్వరి నాడు అసెంబ్లీలో తనపై వైసీపీయులు చేసిన వ్యాఖ్యలను గుర్తుకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.  ప్రత్యక్షంగా ఏ పార్టీ పేరూ ప్రస్తావించకుండానే భువనేశ్వరి  నాటి అధికార పక్ష తీరును తప్పుబడుతూ  చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. గతంలో చంద్రబాబు కూడా నాటి ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురై అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి కన్నీటిపర్యంతమైన సంగతి తెలిసేదే. ఐదేళ్ల క్రితం నాటి ఘటనను నారా భువనేశ్వరి మరల ప్రస్తావించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మహిళల ఆత్మగౌరవం, అసెంబ్లీలో నైతిక విలువలపై ఈ వ్యాఖ్యలు మరోసారి  చర్చకు దారితీశాయి.    Nara Bhuvaneswari,  Kuppam Tour,  AP Assembly Incident, Chandrababu Naidu Wife, Andhra Pradesh Politics, TeloguOne
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో అధికార తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడంపై వివాదం సృష్టించింది. గుంటూరులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో  ముచ్చటించడం, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓటింగ్ శైలి,   పార్టీ అంతర్గత నిర్ణయాలపై బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు అమరావతి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ అధిష్టానం దీనిపై వివరణ కోరడంతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. ఈ పరిణామాలపై ప్రముఖ అనలిస్ట్ విక్రమ్ పూలా తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగుదేశం విఫ్ గా ఉంటూనే బోండా ఉమా ఒకటిరెండు సార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాలను గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా వ్యాఖ్యలకు, ఆయన వ్యవహార శైలికి పెద్ద ప్రాముఖ్యత నివ్వాల్సిన అవసరం లేదన్నారు.  ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.  ఒకవైపు రాష్ట్రంలో అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి, భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి వంటి సంక్షేమ, ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉన్న వేళ బోండా ఉమా వైఖరి పార్టీకి ఒకింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. అయినంత మాత్రాన బోండా ఉమా వ్యవహారానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాపులకు క్లారిటీ ఉందన్న విక్రమ్ పోలా.. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన కాపు నాయకులు ఆ తరువాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత అక్కడ ఎలాంటి ప్రాముఖ్యతా లేక, ఇమడ లేక తిరిగి తెలుగుదేశం గూటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసిన విక్రమ్ పోలా.. బోండా ఉమా విషయానికి అనవసర ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరమన్నారు.   Bonda Uma controversy, TDP Kapu politics, Ambati Rambabu Bonda Uma, AP political developments, Tone News Telugu news
ALSO ON TELUGUONE N E W S
The much-awaited trailer of Ramayana has finally arrived, and it has exceeded the sky-high expectations surrounding the film. Directed by Nitesh Tiwari and backed by producers Namit Malhotra and Yash on a massive scale, the mythological epic promises a breathtaking cinematic experience. With DNEG handling the visual effects and music legends Hans Zimmer and AR Rahman joining forces, the film is clearly aiming for global standards. The trailer opens by establishing Yash's Ravana, showcasing his rise to power and conquest of the three worlds. From the spectacular battle between the Devas and Asuras to the stunning visuals of celestial beings and flying elephants, every frame reflects the makers' ambition. Yash's commanding screen presence and intense portrayal of Ravana instantly become one of the trailer's biggest highlights. Ranbir Kapoor impresses as Lord Ram with a calm, divine and dignified screen presence, while Sai Pallavi shines as Sita, bringing grace and serenity to the iconic character. Arun Govil's appearance as Dasaratha adds nostalgia, and Rakul Preet Singh's Surpanaka leaves a striking impression in the brief glimpses. Technically, Ramayana looks extraordinary. The world-class VFX, breathtaking production design, and the powerful background score by Hans Zimmer and AR Rahman elevate the visuals to another level. Nitesh Tiwari appears to have crafted the adaptation with immense respect for Valmiki's epic while presenting it on a scale rarely seen in Indian cinema. If the trailer is any indication, Ramayana has all the ingredients to become a landmark cinematic event. The first installment is set to hit theatres this Diwali, and anticipation has only grown stronger after this spectacular glimpse.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
నటీనటులు: టామ్ హాలండ్, జెండయా, సాడీ సింక్, జాకబ్ బాటలోన్, జోన్ బెర్న్తల్, ఫ్లోరెన్స్ పగ్, ట్రామెల్ టిల్మాన్, మైఖేల్ మాండో, మార్క్ రఫెలో సాంకేతిక వర్గం: మూల కథ: స్టాన్ లీ (Stan Lee), స్టీవ్ డిట్కో (Spider-Man comics) రచన: క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్ ఛాయాగ్రహణం: బ్రెట్ పావ్లాక్ సంగీతం: మైఖేల్ జియాకినో కూర్పు: నాట్ శాండర్స్, గినా సాన్సమ్, హ్యారీ యూన్ దర్శకత్వం: డెస్టిన్ డేనియల్ క్రెటన్ నిర్మాతలు: కెవిన్ ఫీజ్, అమీ పాస్కల్, అవి అరాద్, రాచెల్ ఓ'కానర్   స్పైడర్-మాన్ (Spider-Man) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన సూపర్ హీరోలలో ఒకరు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)లో టామ్ హాలండ్ పోషించిన స్పైడర్-మాన్ పాత్రకు అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. 'స్పైడర్-మాన్: నో వే హోమ్' తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం తీసుకున్న నిర్మాతలు, ఇప్పుడు 'స్పైడర్-మాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man Brand New Day) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.   కథ: డాక్టర్ స్ట్రేంజ్ చేసిన మ్యాజిక్ వల్ల పీటర్ పార్కర్ అంటే ఎవరో ప్రపంచం మొత్తం మర్చిపోతుంది. ఆ తర్వాత న్యూయార్క్‌లో ఒక సాధారణ సూపర్ హీరోగా తన జీవితాన్ని స్పైడర్-మాన్ (Tom Holland) ఎలా కొనసాగించాడనేది ఈ కథ. ఎంఐటీలో చదువుతున్న తన స్నేహితులు నెడ్ లీడ్స్ (Jacob Batalon), MJ (Zendaya) వ్లాగ్స్ చూస్తూ పీటర్ కాలం గడుపుతుంటాడు. ఆ తర్వాత అతను ఎన్‌వైపీడీ (NYPD), యూఎస్ డ్యామేజ్ కంట్రోల్ ( US Damage Control) కోసం ఫ్రీలాన్స్ డిటెక్టివ్‌గా మారతాడు. ఈ క్రమంలో జీన్ గ్రే (Sadie Sink) డ్యామేజ్ కంట్రోల్ ఆస్తులపై దాడి చేయడంతో అతనికి కొత్త ముప్పు ఎదురవుతుంది. ఆమెను పసిగట్టగల ఏకైక వ్యక్తి స్పైడర్-మాన్ మాత్రమే. మరోవైపు పీటర్ పార్కర్‌లోని మానవ డీఎన్‌ఏ కంటే సాలీడు లక్షణాలు ఎక్కువగా బయటపడటం మొదలవుతుంది. ఈ రెండు సమస్యలను అతను ఎలా సమతుల్యం చేసుకున్నాడు? ఈ అతిపెద్ద ముప్పును ఎదుర్కొని ఎలా గెలిచాడు? అనేది మిగతా కథ.   విశ్లేషణ: స్పైడర్-మాన్‌గా టామ్ హాలండ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ఈసారి అతన్ని ఎక్కువగా సూట్‌లోనే చూపించడంతో పాటు, ఆండ్రూ గార్ఫీల్డ్ (Andrew Garfield) తరహాలో అద్భుతమైన ఫ్లైట్ సీన్స్, పీఓవీ (POV) షాట్స్ డిజైన్ చేశారు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ టామ్ ఆకట్టుకున్నాడు. జెండయా, జాకబ్ బాటలోన్, జోన్ బెర్న్తల్, ఫ్లోరెన్స్ పగ్ (Florence Pugh), మార్క్ రఫెలో (Mark Ruffalo) తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. సాడీ సింక్ స్క్రీన్ ప్రెజెన్స్, నటన బాగున్నాయి. అయితే భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు తడబడినట్లు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో బలం లేకుండా, సులభంగా ముగించేసినట్లు అనిపిస్తుంది. పీటర్ పార్కర్ తన గుర్తింపును రహస్యంగా ఉంచుతూనే, ఓ సాధారణ యువకుడిగా, సూపర్ హీరోగా తన బాధ్యతలను ఎలా స్వీకరించాడనేది ముఖ్య కథాంశం.  కానీ ఈ బలమైన ఎమోషనల్ పాయింట్‌ను తెరపై చాలా తేలికగా చూపించారు. 'నో వే హోమ్' స్థాయిలో భావోద్వేగాలు ఈ సినిమాలో పండలేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా గత చిత్రాల స్థాయిలో లేవు. భావోద్వేగాలు పండాల్సిన స్థాయి లో లేవు.  అయినప్పటికీ, 'హోమ్‌కమింగ్' కంటే 'బ్రాండ్ న్యూ డే' మెరుగైన అనుభూతిని ఇస్తుంది. ఇది 'ఫార్ ఫ్రమ్ హోమ్' స్థాయికి సరిపోతుంది కానీ, 'నో వే హోమ్' అంత ఎపిక్‌గా గానీ, ఎమోషనల్‌గా గానీ అనిపించదు. మొత్తంగా చెప్పాలంటే, అభిమానులకు ఈ చిత్రం సరదాగా అనిపిస్తుంది కానీ, వారు ఆశించిన స్థాయిలో అద్భుత దృశ్యకావ్యంలా మాత్రం ఉండదు.   ప్లస్ పాయింట్స్: పీఓవీ (POV) స్పైడర్ స్వింగ్ సన్నివేశాలు. ఆంట్ మే సీన్స్. ఎంజే, స్పైడర్-మాన్ మధ్య వచ్చే సన్నివేశం. జీన్ గ్రే రివీల్. మైనస్ పాయింట్స్: రొటీన్ రైటింగ్. బలమైన ఎమోషన్స్ మిస్ అవ్వడం. కొన్ని యాక్షన్ సన్నివేశాలను తేలికగా తీసుకోవడం. హల్క్ యాక్షన్ సీన్  క్లైమాక్స్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది.   చివరి గా:  ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లే అభిమానులకు ఈ సినిమా సరదాగా అనిపిస్తుంది.   రేటింగ్: 2.75/5   గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో స్పందించగలరు.   Spider Man Brand New Day Movie Review and Rating in Telugu, Spider-Man: Brand New Day Movie Review in Telugu, Spider-Man: Brand New Day, Tom Holland, Zendaya, Sadie Sink, Jacob Batalon, Jon Bernthal, Florence Pugh, MCU, TeluguOne, TeluguOne Movie Reviews
Cast: Tom Holland, Zendaya, Sadie Sink, Jacob Batalon, Jon Bernthal, Florence Pugh, Tramell Tillman, Michael Mando, Mark Ruffalo   Crew:  Based on Spider-Man by Stan Lee, Steve Ditko Written by Chris McKenna, Erik Sommers Cinematography by Brett Pawlak Music by Michael Giacchino Edited by Nat Sanders, Gina Sansom, Harry Yoon Directed by Destin Daniel Cretton  Produced by Kevin Feige, Amy Pascal, Avi Arad, Rachel O'Connor   Spider-Man is one of the most loved superheroes in the world. His on-screen representations by MCU have been most successful and Tom Holland's take has become fan favourite. After Spider-Man No Way Home, the makers took five years gap to bring new iteration Spider-Man Brand New Day. Let's discuss about the movie released today.    Plot:  Spider-Man (Tom Holland) has to continue his life as a friendly neighborhood superhero in New York after Doctor Strange's spell has made everyone forget that he is Peter Parker. He keeps watching the vlogs of his friend Ned Leeds (Jacob Batalon) about MIT and MJ (Zendaya). He becomes an official freelance detective for NYPD and US Damage Control.  He faces a new threat with Jean Grey (Sadie Sink) attacking Damage Control assets and he is only one who can sense her. But his human DNA starts to give in to heightened Archanid DNA. He has to find a way to balance them both, accept and fight this biggest threat. Will he be able to find a way? Watch the movie to know more.    Analysis:  Tom Holland is good as Spider-Man as always. This time around the makers have tried to put him more in the suit and give Andrew Garfield style flight scenes with more POV shots. He is good in emotional scenes as well. Zendaya is good, Jacob Batalon, Jon Bernthal, Florence Pugh and Mark Ruffalo all give their best.  Sadie Sink looks brilliant and her acting capabilities are also good within the scope she had. But the problem lies in the makers not hitting emotional notes perfectly. It looks like they have chosen easy paths to escape complexity and too simplify the emotional weight.  The major evolution of Spider-Man is linked to him accepting the fact that he is Peter Parkar and a superhero. He cannot give up on one for another while his anonymous identity is being maintained. He cannot distance himself from everyone just to protect them from himself or dangers that his life could cause.  But this major emotional thread is treated lightly. While they did try to handle the weight of it in few scenes, it doesn't land as anticipated with similar gravitas as in New Way Home. The action sequences also doesn't land as perfectly as previous iteration.  Still, Brand New Day is a better experience than Spider-Man Homecoming. It is on par with Far From Home but as epic or as emotional and adventurous as No Way Home. On the whole, Brand New Day is fun to watch for fans but not the epic that they look forward to.    Positives:  POV Spider swing scenes.  Aunt May scenes.  MJ and Spider-Man scene  Jean Grey Reveal  Negatives:  Too Generic Writing  Avoidance of strong emotional core  Some action scenes being handled lightly  Underwhelming Hulk Sequence  Climax needed to be even stronger    Bottomline:  Fun to watch for fans with low expectations.    Rating: 2.75/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమైన చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కూడా తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యారు. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మొదటి నుంచీ సినీ వర్గాల్లోనూ, ఘట్టమనేని అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జయకృష్ణ ఘట్టమనేని నటనకు మంచి మార్కులే పడుతున్నాయి. ప్రధానంగా ఆయన గొంతు, వాయిస్ బేస్ చాలా బాగుందని, స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ తన పాత్రకు తగినట్లుగా కష్టపడ్డాడని, అయితే హావభావాల విషయంలో మరింత మెరుగుదల అవసరమని విశ్లేషిస్తున్నారు. మరొకవైపు హీరోయిన్ రాషా తడానీ తన గ్లామర్ తో పాటు నటనతోనూ మెప్పించిందని, మొదటి తెలుగు సినిమాకే మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి మెయిన్ మైనస్ దాని కథాకథనాలు అని ట్విట్టర్ రివ్యూస్ స్పష్టం చేస్తున్నాయి. దర్శకుడు అజయ్ భూపతి గత చిత్రాలైన 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం'లలో చూపించిన సాంకేతిక నైపుణ్యం, కొత్తదనం ఈ సినిమాలో పూర్తిగా లోపించాయని విమర్శలు వస్తున్నాయి.  ఫస్టాఫ్ అంతా పాట, దాని వెనుకే ఫైట్, మళ్లీ వెంటనే మరో పాట అనే రొటీన్, అవుట్ డేటెడ్ ఫార్ములాతో సాగిపోతుందని నెటిజన్లు పేర్కొన్నారు. ఫ్లాట్‌గా సాగే కథనం వల్ల ఎక్కడా ఉత్కంఠ గానీ, కొత్తదనం గానీ కనిపించదని విమర్శిస్తున్నారు. సెకండాఫ్ లోనైనా ఏదైనా మలుపు ఉంటుందేమోనని ఆశిస్తే, అది కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా రొటీన్ గానే సాగుతుందని అభిప్రాయపడుతున్నారు. అజయ్ భూపతి లాంటి విలక్షణ దర్శకుడి నుంచి ఇలాంటి రెగ్యులర్, రొటీన్ కథను అస్సలు ఊహించలేదని పలువురు నెటిజన్లు డిజప్పాయింట్ అయ్యారు.  మొత్తంమీద హీరోగా ఘట్టమనేని జయకృష్ణ పాస్ అయినప్పటికీ, అవుట్ డేటెడ్ కథాకథనాల వల్ల 'శ్రీనివాస మంగాపురం' థియేటర్లలో ప్రేక్షకులకు ఆశించిన స్థాయి వినోదాన్ని అందించలేకపోయిందని ట్విట్టర్ రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి.  మరి ఇండియా టాక్ కూడా ఇలాగే ఉంటుందో లేక దీనికి భిన్నంగా ఉంటుందో చూడాలి.     Srinivasa Mangapuram Review, Jayakrishna Ghattamaneni, Rasha Thadani, Ajay Bhupathi  
  ప్రేమ సినిమాలకి భారతీయ చిత్ర పరిశ్రమలో మరణమనేది లేకుండా చేసిన మూవీ  దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే. ఈ చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరణ్ జోహార్ ఆ తర్వాత దర్శకుడిగా మారి, ఇప్పుడు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా తన హవా కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ రోజు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని  సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. నేను  ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి, చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడానికి ఇద్దరు వ్యక్తులకి  కృతజ్ఞతలు చెప్పాలి. వారే ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత  ఆదిత్య చోప్రా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. జీవితంలో మొదటి మలుపు అర్ధరాత్రి 1 గంటకు  చోటుచేసుకుంది. ఆ సమయంలో  విదేశాలకు వెళ్ళి తన ఉన్నత చదువులను కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య చోప్రా ఫోన్ చేశారు. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' (DDLJ) చిత్రానికి సహాయ దర్శకుడిగా (అసిస్టెంట్ డైరెక్టర్) పనిచేయమని ఆదిత్య చోప్రా కోరారు. నీలో ఒక గొప్ప దర్శకుడి లక్షణాలు ఉన్నాయని, సినిమా రంగాన్ని వదిలి విదేశాలకు వెళ్తే జీవితంలో అతిపెద్ద పొరపాటు చేసినట్లవుతుందని గట్టిగా చెప్పారు. ఆ మాటలు నా గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయాన్నే నా తండ్రి, ప్రముఖ నిర్మాత యష్ జోహార్ వద్దకు వెళ్లాను. సరిగ్గా ఒక సంవత్సరం కాలం సినిమా సెట్స్‌పై గడపడానికి అనుమతి ఇవ్వాలని అడిగాను. దాంతో మా నాన్న 'బేటా... ఒక సినిమా సెట్‌పై ఏమి చేయాలో నీకు పూర్తిగా తెలుసా?" అని అడిగారు. దానికి  లేదు" అని బదులిచ్చాని . "మరి చెప్పిన ప్రతి పనినీ ఎంతో కష్టపడి చేస్తానని మాట ఇస్తావా?" అని అడగ్గా,  "ఖచ్చితంగా ఇస్తాను" అన్నాను . అప్పుడు నాన్న చిరునవ్వుతో, "అలా కష్టపడి పనిచేస్తే నువ్వు ఒక మంచి నిర్మాతవుతావు... కానీ ఒక గొప్ప దర్శకుడు కావాలంటే నీకు కావాల్సింది కేవలం అమితమైన ఆశయం, సినిమా పట్ల తీవ్రమైన మక్కువ (Passion) మాత్రమే" అని చెప్పాడు. Also read: చెన్నైలవ్ స్టోరీ దర్శకుడు రవి ఎవరు.. వైరల్ అవుతున్న న్యూస్   రెండవ మలుపు స్విట్జర్లాండ్‌లోని మంచు కొండలపై DDLJ షూటింగ్ సమయంలో జరిగింది. అక్కడ పర్వతాల అందాలను చూస్తూ ఉన్న నా వద్దకు షారుఖ్ ఖాన్ వచ్చి నిలబడ్డారు. "నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప డైరెక్టర్ అవుతావు, నీ మొదటి సినిమా నేనే చేస్తాను" అని షారుఖ్ చెప్పారు. మొదట షారుఖ్ చమత్కారంగా అంటున్నారేమోనని భావించినప్పటికీ, భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత షారుఖ్ తన మాటని  నిలబెట్టుకున్నారు. యష్ జోహార్‌తో మాట్లాడి కరణ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించారు. అలా 1998లో వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' (Kuch Kuch Hota Hai) చిత్రంతో దర్శకుడిగా మారాను.నేను ఈ రోజు ప్రపంచానికి కథలు చెప్పడానికి ఏకైక కారణం ఆది, భాయ్ నే అంటూ తన ట్వీట్ ముగించాడు. Karan Johar, Shah Rukh Khan, Aditya Chopra    
  ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమకి నిర్వచనం చెప్పిన మూవీ 'చెన్నై లవ్ స్టోరీ'.  ప్రేమ,ప్రేమించిన వారి సుఖమే కోరుకుంటుందనే పాయింట్ అయితే ఆడియెన్స్ కి బాగానే కనెక్ట్ అవుతుంది. క్లీన్ లవ్ స్టోరీగా  నిలవడంతో ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పడుతున్నారు.  దీంతో సోషల్ మీడియాలో చిత్ర దర్శకుడు నంబూరి రవి ఎవరనే చర్చ జరుగుతుంది. రవి నంబూరి 2008లో ఈసీఈ విభాగంలో బి.టెక్ పూర్తి చేసిన అనంతరం దాదాపు 4 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కార్పొరేట్ ఉద్యోగం చేశారు. అయితే, చిన్నతనం నుంచే పవన్‌ కళ్యాణ్ సినిమాలపైనా, వెండితెరపైనా ఉన్న అమితమైన ఇష్టంతో తనఉద్యోగానికి స్వస్తి చెప్పి, పరిశ్రమ వైపు అడుగులు వేశారు.  సినీ ప్రయాణంలో తొలి రోజుల్లో 2015లో 'భలే భలే మగాడివోయ్' షూటింగ్ సమయంలో దర్శకుడు మారుతితో ఏర్పడిన పరిచయంతో రవి స్క్రిప్ట్ రైటింగ్‌పై పూర్తి దృష్టి సారించారు. 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి', 'రోజులు మారాయి', 'ఉర్వశివో రాక్షసివో', 'భలే మంచి చౌక బేరం' వంటి చిత్రాలకు రైటర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి మంచి అనుభవం సంపాదించారు.  అనంతరం 'బేబి' సినిమా సమయంలో దర్శకుడు సాయి రాజేష్‌తో ఏర్పడిన అనుబంధం కెరీర్‌ని మలుపు తిప్పింది. సాయి రాజేష్ అందించిన ప్రత్యేకమైన కథను నిర్మాత ఎస్‌కేఎన్ సహాయంతో డైరెక్షన్ చేసే గొప్ప అవకాశాన్ని రవి దక్కించుకున్నాడు. Ravi Namburi, Chennai Love Story Director, Kiran Abbavaram, Sri Gouri Priya, Sai Rajesh      
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవార్టిస్ (Novartis) ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఔషధ తయారీ, వైద్య పరిశోధనలు (R&D), క్లినికల్ ట్రయల్స్ మరియు డిజిటల్ హెల్త్‌కేర్ సేవల్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హైటెక్ సిటీలోని ఈ సంస్థ యొక్క శాఖ ఈ నెల 29 తేదీన ‘పేరెంట్స్ డే’ ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ప్రఖ్యాత సినీ నటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మురళీమోహన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జొన్నలగడ్డ అనూరాధ, కన్సల్టెంట్ ఇంజనీర్ బి. యస్. రావు హాజరయ్యారు. కంపెనీ యాజమాన్యం తరఫున దీపక్, గన్పత్ ప్రాతినిధ్యం వహించారు.     Murali Mohan, Novartis, Parents Day  
అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెంటనే స్పందించారు. తన తల్లి పద్మజ సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి, సురేష్ పాటిల్ కి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు. అంతేకాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును స్వయంగా ఆయనే భరించి, సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అండగా నిలిచారు. అభిమానులకు అండగా ఉండటంలో వరుణ్ తేజ్ కి ఇది కొత్త విషయం కాదు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించగా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.     Varun Tej, Chiranjeevi, Pawan Kalyan, Janasena  
Varun Tej has once again demonstrated that his generosity goes far beyond the silver screen. The actor recently came to the rescue of a longtime fan leader who was battling a serious health issue, ensuring he received timely medical treatment and financial support. Suresh Patil, the Anantapur District President of Chiranjeevi Yuvatha and Gooty Town Janasena Party President, was diagnosed with a brain tumour.  Upon learning about his condition, Varun Tej immediately stepped in to help. Inspired by the humanitarian values of Megastar Chiranjeevi, the actor, along with the support of his mother Padmaja, personally coordinated with doctors at City Neuro Centre in Hyderabad to ensure the best possible treatment. Varun Tej oversaw the entire process, from arranging the hospital admission to making sure the surgery was carried out successfully. He also took care of all the medical expenses himself, relieving the family of any financial burden during the difficult period. The actor didn't stop there. He remained in regular touch with the doctors, monitored Suresh Patil's recovery, and continued supporting him until he was discharged from the hospital after making a full recovery. This is not the first time Varun Tej has stood by his fans during times of need. Only recently, he extended financial assistance to the family of a deceased fan in Anantapur. His latest gesture has once again highlighted his commitment to helping those who have supported him over the years, earning widespread appreciation from fans and well-wishers alike.
    యాంకరింగ్.. కళలోనే ఇమిడి ఉన్న మరో అద్భుతమైన ప్రక్రియ. కొన్ని వందల మందిని ఏక కాలంలో మెప్పించగలగాలి.  సినిమా  అభిమానులకి, ప్రేక్షకులకి మరింత చేరువ కావాలంటే యాంకరింగ్ ఎంతో పకడ్బందీగా ఉండాలి. అలాంటి యాంకరింగ్ గొప్ప తనం గురించి అందరూ నిత్యం చూస్తూనే ఉంటారు.   బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ తన గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అయితే ఈ గ్లామరస్ క్వీన్ ఒకప్పుడు సాధారణ టీవీ ఛానెల్ రిపోర్టర్‌గా, యాంకర్‌గా పనిచేసిందనే నిజం చాలామందికి తెలియదు. 1985 ఆగస్టు 11న బహ్రెయిన్‌లోని మనామాలో శ్రీలంక తండ్రి, మలేషియన్-కెనడియన్ తల్లికి జన్మించిన జాక్వెలిన్, బహుళ సంస్కృతుల నడుమ పెరిగింది. చిన్నతనం నుంచే గ్లామర్ రంగంపై ఆసక్తి ఉన్నప్పటికీ, ఆమె తన ప్రాథమిక విద్యను బహ్రెయిన్‌లో పూర్తి చేసి, ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన వెంటనే శ్రీలంకకు తిరిగి వచ్చిన జాక్వెలిన్, అక్కడ ఒక లోకల్ టీవీ ఛానెల్‌లో టీవీ రిపోర్టర్‌గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. అక్కడ 'లంకా బిజినెస్ రిపోర్ట్' అనే పాపులర్ షోకి యాంకర్‌గా వ్యవహరిస్తూనే, 'ది డైలీ మిర్రర్' అనే వారపత్రికలో బిజినెస్ కాలమిస్ట్‌గా కూడా వ్యాసాలు రాసేది. వార్తలు చదువుతూ, రిపోర్టింగ్‌లో బిజీగా ఉండే ఈ సుందరి జీవితంలో 2006వ సంవత్సరం ఒక ఊహించని పెద్ద మలుపు తిప్పింది. ఆ సంవత్సరంలో జరిగిన ప్రతిష్టాత్మక 'మిస్ యూనివర్స్ శ్రీలంక 2006' కిరీటాన్ని గెలుచుకుని, లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రపంచ మిస్ యూనివర్స్ పోటీలలో శ్రీలంక తరఫున ప్రాతినిధ్యం వహించింది. ఈ విజయంతో ఆమెకు మోడలింగ్ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. మోడలింగ్ అసైన్‌మెంట్ కోసం 2009లో ఇండియాకు వచ్చిన జాక్వెలిన్, దర్శకుడు సుజోయ్ ఘోష్ రూపొందించిన 'అలాడిన్' ఫాంటసీ మూవీ ఆడిషన్స్‌లో పాల్గొని కథానాయికగా ఎంపికైంది. ఈ తొలి చిత్రంతోనే ఆమె ఐఐఎఫ్ఏ (IIFA) బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డును సొంతం చేసుకుని సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇక 2011లో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మర్డర్ 2' సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనవిజయంతో జాక్వెలిన్ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన 'హౌస్‌ఫుల్ 2' (2012), 'రేస్ 2' (2013), 'హౌస్‌ఫుల్ 3' (2016), 'జుడ్వా 2' (2017) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టాయి. ముఖ్యంగా 2014లో సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'కిక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 3.75 బిలియన్లకు పైగా (రూ. 375 కోట్లకు పైగా) గ్రాస్ వసూళ్లను సాధించి, ఆమెను కమర్షియల్ బొనాంజాగా నిలబెట్టింది. కేవలం హిందీలోనే కాకుండా, 2019లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్-ఇండియా చిత్రం 'సాహో'లో 'బ్యాడ్ బై' అనే స్పెషల్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా రచ్చ చేసింది. ఆ తర్వాత కన్నడ బ్లాక్‌బస్టర్ 'విక్రాంత్ రోణ' (2022) చిత్రంలోనూ తన గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్‌తో కుర్రకారును అలరించింది. కేవలం సినిమాలే కాకుండా 'జలక్ దిఖ్లా జా 9' వంటి డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది. Also read: మధుబాల కూతురి పెళ్లి..తెలుగు వాళ్ళు అదృష్టవంతులు  అయితే జాక్వెలిన్ ప్రయాణం కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాలేదు. వ్యాపారవేత్తగా మారి శ్రీలంకలోని కొలంబోలో 'కేమా సూత్ర' అనే లగ్జరీ రెస్టారెంట్‌ను స్థాపించడమే కాకుండా, సొంతంగా యాక్టివ్‌వేర్ బ్రాండ్ 'జస్ట్ ఎఫ్'ను కూడా నడుపుతోంది. కొలంబో తీరానికి సమీపంలో ఒక ప్రైవేట్ దీవికి యజమానిగా నిలిచిన ఈ భామ, కోట్ల రూపాయల ఆస్తులతో లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను అనుభవిస్తోంది. కొన్నాళ్ల క్రితం సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో పేరు వినిపించి వార్తల్లో నిలిచినప్పటికీ, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో నేటికీ చెక్కుచెదరని క్రేజ్‌తో గ్లామర్ ఐకాన్‌గా వెలుగుతోంది. ఒక సాధారణ టీవీ రిపోర్టర్ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయిలో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రయాణం నిజంగా ఒక సినీ కథని తలపిస్తుంది.  Jacqueline Fernandez, Bollywood  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జపనీస్ పెంపకం.. ఇలా పెంచితే పిల్లలు చదువులో, ప్రవర్తనలో టాప్ లో ఉంటారట..! ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలను సరైన మార్గంలో నడిపించడం ఒక పెద్ద ఛాలెంజ్ అనుకోవచ్చు. అయితే పిల్లలు చురుగ్గా ఉంటూ, చదువులో కూడా రాణిస్తూ,  మంచి ప్రవర్తనతో ఉండటానికి జపనీస్ పెంపకం చాలా బాగా సహాయపడుతుందట. ఇంతకీ ఆ జపనీస్ పెంపకం చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. జపనీస్ పెంపకం.. జపనీస్ పెంపక విధానం బాధ్యతాయుతమైన, సున్నితమైన , స్వయం సమృద్ధిగల పిల్లలను తయారుచేయడంలో సహాయపడుతుందట.  పిల్లల భవిష్యత్తును బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. జపనీస్ పెంపకం చిట్కాలు..  బాధ్యతను నేర్పించడం.. జపాన్‌లో పిల్లలు చాలా చిన్న వయస్సు నుండే చిన్న పనులను స్వయంగా చేసుకోవడం నేర్చుకుంటారు. స్కూల్ బ్యాగులు సర్దుకోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లేదా చిన్న చిన్న ఇంటి పనులలో సహాయం చేయడం వంటివన్నీ వారి దినచర్యలో భాగం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, బాధ్యతా ఉండటాన్ని అభివృద్ధి చేస్తుంది. క్రమశిక్షణ..   జపనీస్ పెంపకంలో క్రమశిక్షణను కఠినంగా కాకుండా ఒక అలవాటుగా నేర్పిస్తారు. పిల్లలకు సమయానికి విలువ ఇవ్వడం, నియమాలను పాటించడం , ఇతరులను గౌరవించడం నేర్పిస్తారు. పాఠశాలల్లో, పిల్లలు తమ తరగతి గదులను కూడా స్వయంగా శుభ్రం చేసుకుంటారు. ఇది వారిలో సామూహిక బాధ్యతా భావాన్ని పెంపొందిస్తుంది. ఎమోషనల్ బాండింగ్..   జపనీస్ తల్లులు తమ పిల్లల బాల్యంలో వారితో గాఢమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంటారు. దీనిని 'అమాయే' అని పిలుస్తారు. దీనిలో పిల్లలు సురక్షితంగా , ప్రేమతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు. ఇది వారి మానసిక వికాసాన్ని మెరుగుపరుస్తుంది , వారు మరింత ఆత్మవిశ్వాసంగా మారడానికి సహాయపడుుతంది. టీమ్ వర్క్..   జపనీస్ సంస్కృతిలో పిల్లలకు టీమ్ వర్క్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం ,అందరూ కలిసి ఆలోచన చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి నేర్పిస్తారు. ఇది వారు సమాజంలో మరింత మెరుగ్గా కలిసిపోవడానికి సహాయపడుతుంది. స్క్రీన్ సమయం..   జపనీస్ తల్లిదండ్రులు తమ పిల్లలను మొబైల్ ఫోన్లు , టెలివిజన్‌కు దూరంగా ఉంచి, సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. చదవడం, ఆరుబయట ఆడుకోవడం , కళలలో నిమగ్నమవడం వారి దినచర్యలో భాగం. ఇది వారి సంపూర్ణ అభివృద్ధికి దోహదపడుతుంది. తప్పుల నుండి నేర్చుకోవడం..   ప్రతి చిన్న తప్పుకు పిల్లలను తిట్టే బదులు, వారికి సలహా ఇచ్చి, వారి తప్పుల నుండి నేర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికే ప్రాధాన్యత.. అక్కడ కేవలం మార్కుల మీదనే కాకుండా, నిజాయితీ, వినయం, సానుభూతి వంటి గుణాలపై దృష్టి పెడతారు. అందుకే అక్కడ చదువు కన్నా, వ్యక్తిత్వ నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది.                                     *రూపశ్రీ.  
టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండటం మంచిదేనా? జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "అంతా సర్దుకుంటుంది," "ఎప్పుడూ పాజిటివ్ గా  ఆలోచించు!".. ఇలా చాలా మంది  ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి.  కానీ మనస్తత్వవేత్తలు మాత్రం ఇది సరికాదు అంటున్నారు.  దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అని పిలుస్తారట.  ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. కష్టంలో  ఉన్నప్పుడు పాజిటివిటీ మాటలను  ఒక మెడిసిన్ లాగా ఉపయోగిస్తారు. కానీ ఇది కాలక్రమేణా మనిషిని ఒంటరిని చేస్తుందని మానసిక విశ్లేషణ నిపుణులు అంటున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. టాక్సిక్ పాజిటివిటీ అంటే.. సులభంగా చెప్పాలంటే టాక్సిక్ పాజిటివీటి  అంటే మనిషిలో ఉండే నిజమైన ఫీలింగ్స్ ను అంగీకరించకుండా వాటిని దాచడానికి ప్రయత్నించడం. ఈ రోజుల్లో, సోషల్ మీడియా కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా "బలంగా ఉండాలి" అనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా వైఫల్యాన్ని వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారు. అలా వ్యక్తం  చేయడం ఒక పెద్ద బలహీనత అని అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా, బలంగా కనిపించాలనే  తీవ్రమైన ఒత్తిడి  వ్యక్తిలో అపరాధ భావాన్ని మాత్రమే పెంచుతుంది. ఎమోషన్స్ అణిచివేత ప్రమాదం.. మనిషిలో ఉండే నిజమైన , ప్రతికూల భావోద్వేగాలను దాచుకోవడం చాలా హానికరం అని మానసిక పరిశోధనలు కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. తమ ఎమోషన్స్  ను అణచిపెట్టుకోవడానికి ప్రయత్నించే వ్యక్తులు అకస్మాత్తుగా భయాందోళనలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మనిషి తన నెగిటివ్ ఎమోషన్స్ ను నిరంతరం అణచివేస్తే, వారి ఒత్తిడి వేగంగా పెరుగుతుందట. ఇది సంబంధాలపైనా, మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యక్షంగా, చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందట. నిజమైన మానసిక బలం.. మనిషిలో ఉన్న ఎమోషన్స్ ను ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మానసిక బలం అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. విచార భావనలు ఎప్పుడూ తప్పు కాదు. వాటిని అణచివేయకుండా అర్థం చేసుకుని స్వీకరించడమే మనిషిని మానసికంగా దృఢంగా చేస్తుంది. నిజమైన మానసిక బలం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం కాదు, మనుషులుగా మనం కొన్నిసార్లు కుంగిపోవడం సహజమని అంగీకరించడమే. టాక్సిక్ పాజిటీవిటీ నుండి బయట పడటానికి సూచనలు.. విచారాన్ని బలహీనతగా భావించకూడదు.. ఎమోషన్స్ ను,  అభిప్రాయాలను  ఓపెన్ గా  వ్యక్తపరచాలి,  విచారాన్ని ఓటమిగా పరిగణించకూడదు. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం.. కష్ట సమయాల్లో ఆన్‌లైన్‌లో ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడానికి బదులుగా, మీరు బాగా నమ్మే వ్యక్తులతో   సమస్యలను నిష్కపటంగా పంచుకోవాలి. దీని వల్ల ఊరట లభిస్తుంది, భారం తగ్గినట్టు అవుతుంది. సలహా ఇవ్వడానికి బదులుగా వినాలి..   మీ చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, వారికి ఊరట ఇవ్వడానికి భరోసా మాటలు చెప్పడానికి బదులుగా వారి సమస్య ఏంటో మొదట ఓపికగా వినాలి.  తమ భాదను వెంటే చాలామంది మానసికంగా కుదటపడతారు, తిరిగి ధైర్యం కూడా తెచ్చుకుంటారు. "సానుకూల ఆలోచన"తో అస్సలు మార్చలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. అందువల్ల,  విచారాన్ని పూర్తిగా కొట్టిపారేయడం పాజిటివ్ మార్గం కాదు, అది ఆత్మవంచన. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ పాజిటివ్ గా ఉండాలని, పాజిటివ్ జరగలేదని బాధపడకూడదు.                            *రూపశ్రీ.  
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే దిండు మీద రాలిన జుట్టును చూసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి మరియు మన వ్యక్తిత్వానికి ప్రతీక. ఆడవారికైనా, మగవారికైనా ఒత్తైన కురులు ఉండాలని కోరుకోవడం సహజం. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. అసలు జుట్టు ఎందుకు రాలుతుంది? దీనికి పరిష్కారాలు ఏమిటి? డాక్టర్ల అభిప్రాయం ప్రకారం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను Expert Dermatologist Dr. Sunaina Shaik (MD, DNB Dermatology, FRGUHS Trichology) విషయాలు Video Link క్లిక్ చేసి తెలుసుకోండి.  మనం జుట్టుపై ఎందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి? (Why Should We?) జుట్టు రాలడం అనేది కేవలం పైకి కనిపించే సమస్య మాత్రమే కాదు, అది మన శరీరంలో ఉన్న అంతర్గత మార్పులకు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. • ఆత్మవిశ్వాసం: ఒత్తైన జుట్టు మన అందాన్ని పెంచడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. • ఆరోగ్య సూచిక: జుట్టు అధికంగా రాలుతుంటే అది మన శరీరంలో పోషకాహార లోపం (Vitamin D, Iron, Zinc) లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నాయని సూచిస్తుంది. • ముందస్తు జాగ్రత్త: ప్రారంభంలోనే జుట్టు రాలడాన్ని గమనించి తగిన చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో జుట్టు పల్చబడకుండా (Hair Thinning) చూసుకోవచ్చు. ఏం చేయకూడదు? (What Not To Do) తెలిసో తెలియకో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతాయి. వాటిని వెంటనే ఆపండి: 1. బిగుతైన హెయిర్ స్టైల్స్ (Tight Hairstyles): జుట్టును గట్టిగా లాగి ముడి వేయడం లేదా పోనీటైల్స్ వేయడం వల్ల 'ట్రాక్షన్ అలోపేషియా' (Traction Alopecia) వచ్చి నుదురు భాగంలో జుట్టు రాలిపోతుంది. 2. టైట్ హెల్మెట్లు వాడటం: మగవారిలో టైట్ హెల్మెట్లు వాడటం వల్ల కలిగే ఘర్షణ (Friction) జుట్టు షాఫ్ట్ బలహీనపడి విరిగిపోవడానికి కారణమవుతుంది. 3. ఇతరుల వస్తువులు వాడటం: ఒకరు వాడిన హెల్మెట్ లేదా దువ్వెన మరొకరు వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. 4. జంక్ ఫుడ్‌పై ఆధారపడటం: సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు అందాల్సిన ప్రోటీన్ అందదు. జుట్టును ఎలా సంరక్షించుకోవాలి? (How To) జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం పైన రాసే నూనెలు, సీరమ్స్ మాత్రమే కాదు, లోపలి నుండి పోషణ అవసరం. • సరైన డైట్ (High Protein Diet): జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. కాబట్టి మీ బరువులో ప్రతి కిలోగ్రాముకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం (ఉదాహరణకు 60 కేజీల బరువు ఉంటే 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి). మీ ఆహారంలో పన్నీర్, సోయా, చికెన్, చేపలు మరియు గుడ్లు ఉండేలా చూసుకోండి. • గింజలు మరియు విత్తనాలు (Nuts & Seeds): ప్రతిరోజూ గుప్పెడు నట్స్, గుమ్మడి గింజలు (Pumpkin Seeds), పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మరియు నువ్వులు తీసుకోవడం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. • ఒత్తిడి తగ్గించుకోండి: అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోండి. • స్కాల్ప్ పరిశుభ్రత: చెమట పట్టినప్పుడు జుట్టును తరచుగా వాష్ చేయడం మరియు హెల్మెట్ లోపల ఉండే ప్యాడింగ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: రోజుకు ఎన్ని వెంట్రుకలు రాలడం సహజం?  జ: సాధారణంగా రోజుకు 100 వెంట్రుకల వరకు రాలడం సహజమే. అయితే మీ జుట్టు పల్చగా ఉంటే, 50 వెంట్రుకలు రాలినా అది సమస్యగానే పరిగణించాలి. ప్ర: హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందా?  జ: కేవలం హెల్మెట్ వల్ల జుట్టు ఊడదు. కానీ టైట్ హెల్మెట్ వల్ల కలిగే ఘర్షణ మరియు చెమట వల్ల ఇన్ఫెక్షన్లు ఉంటే జుట్టు రాలవచ్చు. ప్ర: జుట్టు రాలడం మొదలైన వెంటనే చికిత్స తీసుకోవాలా?  జ: సాధారణంగా ఏదైనా స్ట్రెస్ లేదా అనారోగ్యం (జ్వరం వంటివి) వచ్చిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం మొదలవుతుంది. అది ఆరు నెలల వరకు ఉంటే పర్వాలేదు కానీ, ఏడాది కంటే ఎక్కువ కాలం విపరీతంగా రాలుతుంటే తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక ప్రయాణం. మనం తీసుకునే ఆహారం, మన జీవనశైలి మరియు మనం చేసే చిన్న చిన్న మార్పులే మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, మీ జుట్టును ప్రేమించండి. మీకు మరిన్ని ఆరోగ్య చిట్కాలు మరియు నిపుణుల సలహాలు కావాలా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ను క్లిక్ చేయండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా? అర్థరాత్రి వరకు మేల్కొని ఉండాల్సి వస్తుందా? ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఇన్సోమ్నియా (Insomnia) ఒకటి. ఉద్యోగ ఒత్తిడి, మానసిక ఆందోళన, మొబైల్ ఫోన్‌ను ఎక్కువసేపు ఉపయోగించడం, జీవనశైలిలో వచ్చిన మార్పులు వంటి అనేక కారణాల వల్ల నిద్ర సమస్యలు పెరుగుతున్నాయి. ఈ వీడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డా. సి. మంజులా రావు నిద్ర ఎందుకు పట్టదో, ఇన్సోమ్నియా రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఏమిటో, నిద్రలేమి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో సులభంగా వివరించారు. అలాగే ఎలాంటి మందులు లేకుండానే మంచి నిద్ర కోసం పాటించాల్సిన రోజువారీ అలవాట్లు, పడుకునే ముందు చేయాల్సిన చిన్న చిన్న మార్పులు, మానసిక ప్రశాంతతను పెంచే సూచనలు మరియు గాఢమైన నిద్ర కోసం ఉపయోగపడే సులభమైన చిట్కాలను కూడా ఈ వీడియోలో వివరించారు. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నిద్ర సమస్య ఉంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మంచి నిద్ర ఎంత ముఖ్యమో తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పిల్లల శారీరక మరియు మానసిక ఎదుగుదలలో సరైన పోషకాహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా Brain Development, Growth మరియు Immunity బలంగా ఉండాలంటే పిల్లలకు అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందాలి. అయితే చాలామంది తల్లిదండ్రులకు పిల్లలకు ఏ ఆహారం ఇవ్వాలి? ఏ వయసులో ఎలాంటి పోషకాలు అవసరం? Protein ఎంత ముఖ్యమనే విషయాలపై అనేక సందేహాలు ఉంటాయి. ఈ వీడియోలో ప్రముఖ Dietitian Srilatha పిల్లల ఆరోగ్యానికి అవసరమైన సమతుల్య ఆహారం గురించి సులభమైన తెలుగులో వివరించారు. Protein Deficiency వల్ల పిల్లల్లో ఎదుగుదల మందగించడం, కండరాల బలహీనత, తరచూ అనారోగ్యం, రోగనిరోధక శక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎలా వస్తాయో వివరించారు. అలాగే పిల్లల Brain Development కోసం Protein, Healthy Fats, Vitamins, Minerals, Iron, Calcium వంటి పోషకాల ప్రాముఖ్యతను తెలియజేశారు. రోజువారీ ఆహారంలో పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా చేర్చాలో కూడా సూచనలు అందించారు. పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఎదగాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి? Junk Food వల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఇంట్లోనే పోషక విలువలు అధికంగా ఉండే ఆహారం ఎలా అందించాలి? వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన ఈ వీడియో ద్వారా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన ఆహార సూచనలను తెలుసుకోండి.    
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.