Home

»

Latest News

ఓటీటీలోకి రణబాలి: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.!

Nov 2, 2026 4:04PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్వయంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్ట్ పెట్టి.. ఆ తర్వాత దాన్ని డిలీట్ చేసింది. దీంతో ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా కావడంతో ‘రణబాలి’పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా వేదికగా ‘రణబాలి’ నవంబర్ 13, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది. అయితే పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పోస్టును తొలగించింది. అప్పటికే కొందరు నెటిజన్లు స్క్రీన్‌షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అంటే నవంబర్ 13న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైన ‘రణబాలి’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికీ మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే ఓటీటీ డేట్ బయటకు వస్తే.. కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మేకర్స్ సూచనతో నెట్‌ఫ్లిక్స్ ఆ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్ట్ ను డిలీట్ చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: షారుఖ్ ఖాన్ టాప్-10 సినిమాలు.. ఒక్కటి కూడా మిస్ అవ్వొద్దు.!

 

 

[Ranabaali OTT Release Date, Ranabaali Netflix Release, Ranabaali Movie OTT, Ranabaali Collections, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com