Home

»

Latest News

ప్రభాస్‌పైనే పీపుల్ మీడియా ఆశలు: రంగంలోకి ఎవరూ ఊహించని దర్శకులు.!

Nov 2, 2026 5:08PM

ఒకప్పుడు వరుస సినిమాలతో జోరు చూపించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. కొంతకాలంగా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అందుకే సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా ప్రభాస్‌తో భారీ హిట్ కొట్టి.. పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయాలని చూస్తోంది.

అయితే ప్రభాస్‌, పీపుల్ మీడియా చేతులు కలిపిన రెండుసార్లూ చేదు ఫలితాలే వచ్చాయి. 'ఆదిపురుష్' సినిమాను పీపుల్ మీడియా డిస్ట్రిబ్యూట్ చేయగా అది నిరాశపరిచింది. ప్రభాస్, మారుతి కాంబోలో 'ది రాజాసాబ్' సినిమాను నిర్మించగా అది కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

అయితే ఈ పరాజయాల తర్వాత కూడా ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. 2028లో ప్రభాస్‌తో మరో సినిమా తప్పకుండా చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఇటీవల వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది.

ప్రభాస్‌తో సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా విశ్వప్రసాద్ పలువురు దర్శకులతో కథలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనూహ్యంగా దర్శకుడు కరుణాకరన్ పేరు వినిపిస్తోంది. గతంలో ప్రభాస్, కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన 'డార్లింగ్' ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ లుక్స్, కామెడీ టైమింగ్, లవ్ ట్రాక్, సంగీతం.. ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయితే బాగుంటుందని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరోవైపు 'మిరాయ్' దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రభాస్‌కు ఓ థ్రిల్లర్ కథ వినిపించారని, ఆ కథకు ప్రభాస్ సానుకూలంగా స్పందించారనే ప్రచారం జరుగుతోంది. 

అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి 2' వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు 'సలార్ 2' కూడా లైనప్‌లో ఉంది. ఈ సినిమాల షెడ్యూల్స్‌ను బట్టి చూస్తే కొత్త ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించడం అంత సులభం కాదు. అందుకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేయబోయే సినిమా 2028లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి 'ఆదిపురుష్' పంపిణీ, 'ది రాజాసాబ్' నిర్మాణం.. ఇలా రెండు సందర్భాల్లోనూ ప్రభాస్‌తో కలిసి పనిచేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇప్పుడు మరోసారి ప్రభాస్‌తో సినిమా చేసి బలంగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి 'డార్లింగ్' కాంబినేషన్‌ను రిపీట్ చేస్తారా? లేక కార్తీక్ ఘట్టమనేనికి అవకాశం ఇస్తారా? అనేది చూడాలి.

ఇది కూడా చదవండి: ఓటీటీలోకి రణబాలి.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.!

 

 

 

[Prabhas Next Movie, Prabhas Karunakaran Movie, Darling Combination, Prabhas Karthik Ghattamaneni Movie, Prabhas, People Media Factory, Fauzi, Spirit, Kalki 2]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com