వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది. పులివెందుల మండల పరిధిలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం ఐదు ఎంపీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పీఠం కూడా టీడీపీ ఖాతాలో చేరే అవకాశాలు స్పష్టమయ్యాయి. దీంతో పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏకగ్రీవాల్లో పుష్పనాథ్‌రెడ్డి కీలక పాత్ర.! పులివెందుల మండలంలోని కొత్తపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు పుష్పనాథ్‌రెడ్డి ఐదు ఎంపీటీసీ స్థానాల ఏకగ్రీవంలో కీలక పాత్ర పోషించారు. కొత్తపల్లి ఎంపీటీసీ స్థానానికి తాను ప్రాతినిధ్యం వహించడంతో పాటు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి సూచనల మేరకు మిగిలిన నాలుగు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టి, అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేసుకునే దిశగా కృషి చేశారు.  ఆయన ప్రయత్నాలు ఫలించడంతో మండలంలోని ఐదు స్థానాలూ టీడీపీకి దక్కాయి. పులివెందుల మండల పరిధిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఐదుగురు ఎంపీటీసీలు మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి నియామక పత్రాలను అందుకున్నారు.ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఈ. కొత్తపల్లి నుంచి మాడెం పుష్పనాథ్‌రెడ్డి, ఎర్రబల్లి-2 నుంచి కడపన శ్యామలాదేవి, ఎర్రబల్లి-1 నుంచి పండిటి రాజశేఖర్, రాగిమానుపల్లి నుంచి బండి సునీత, అచ్చవెల్లి గంగనపల్లి నుంచి మహమ్మద్ షరీఫ్ ఉన్నారు.  ఎంపీపీ ఎన్నికపై ఆసక్తి.! పులివెందుల మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాలనూ టీడీపీ ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో త్వరలో జరగనున్న ఎంపీపీ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఐదు స్థానాలూ ఒకే పార్టీకి దక్కడంతో ఎంపీపీ పదవి కూడా టీడీపీకే దక్కే అవకాశం ఉంది.పులివెందులలో గత నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో, ఎంపీపీ పీఠాన్ని టీడీపీ దక్కించుకోనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీపీ ఎన్నిక పూర్తయితే మండల పరిషత్‌లో అధికార మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.       [ Pulivendula Politics, YS Jagan Mohan Reddy, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, B Tech Ravi, Kadapa Political News, Pulivendula MPTC Elections, MPTC Unopposed Elections, TDP Victory, Pulivendula MPP Election, Kadapa Local Body Elections, Andhra Pradesh Politics, Coalition Alliance, Madem Pushpanath Reddy ]
ఏపీలో  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం హాట్ టాపిక్ గా మారాయి.  ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాలలో  పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల బెదిరింపులు, భౌతిక దాడుల వంటి సంఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ ఈ హింసాత్మక ఘటనలపై పరస్పర విమర్శలతో మాటల యుద్ధానికి దిగాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని దుయ్యబడుతోంది. అయితే అధికార  యంత్రాంగం మాత్రం శాంతిభద్రతలను కాపాడటానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.   వైసీపీ ఓటమి భయంతోనే  ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తున్నదనీ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నదనీ అధికార తెలుగుదేశం కూటమి విమర్శిస్తున్నది.   నామినేషన్ పత్రాలను చించివేయడం, ఎన్నికల అధికారులపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తుతోంది.  రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎన్నికల హింసకు, అక్కడ వేళ్లూనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. పార్టీలకతీతంగా కొన్ని ప్రాంతాలలో సాగే ఈ ఆధిపత్య పోరు, ఎన్నికల సమయానికి మరింత హింసాత్మకంగా మారడం కద్దు. ఇప్పుడూ అదే జరుగుతోంది. స్థానిక సంస్థల మీద పట్టు సాధించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వనరులు, కాంట్రాక్టులు, స్థానిక భూభాగాలపై ఆధిపత్యం దక్కుతుందన్న ఉద్దేశమే ఈ ఘర్షణలకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే నామినేషన్ల కేంద్రాల వద్ద పేపర్లు లాక్కోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు పునరావృతమవుతున్నాయి. గ్రామాల్లో బలమైన పట్టున్న నాయకులు తమ వర్గాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికలను ఒక యుద్ధ రంగంగా మారుస్తున్నారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని, సామాన్య ప్రజలు భయంతో ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితికి దారితీస్తోందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు కేవలం ఒక పార్టీకి లేదా ప్రభుత్వానికి సంబంధించినవి కావు; ఇవి మొత్తం రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న పరీక్ష. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల నిష్పక్షపాత వైఖరి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి వంటి అంశాలపై మరింత పకడ్బందీ విధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది. [Andhra Pradesh Local Elections, Political Clashes, Rayalaseema Factionalism, Election Related Unrest, Telugu One]
వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ పాలసీలను ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత  హిట్ అండ్ రన్ తరహా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్  బాధ్యతారహితంగా, ఒక క్రిమినల్ లిటిగెంట్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..  గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.   ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సాగిన దౌర్జన్యాలు, అబద్ధాలు, అరాచకాలను వివరిస్తూ.. అదే హింస... అవే అబద్ధాలు... అవే అరాచకాలు  అనే శీర్షికతో రూపొందించిన  బుక్‌లెట్  చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, పవిత్రమైన ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యతను   నొక్కిచెప్పిన ఆయన దేశంలో రాజ్యాంగబద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం,  సుపరిపాలన ద్వారా మాత్రమే నిజమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందని, విపక్షాల అరాచక రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనిఅన్నారు.   గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేశారన్న చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్  హోదాలో ఉన్న అధికారి కూడా తనకు ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి అరాచకాలకు వైసీపీ శ్రేణులు పాల్పడిందని చెప్పారు.  జగన్ అరాచక పాలనను భరించలేక జనం 2024 ఎన్నికల్లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చరిత్రాత్మక మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.   తమపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి ఆ విజయం ప్రతీక అన్న ఆయన.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని వివరించారు. ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ ఇంకా   పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తోందన్న చందరబాబు,  అభివృద్ధిని అడ్డుకోవడం, రాష్ట్రాన్ని అస్థిరపరచడం, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటి పద్ధతులనే వారు ఇప్పటికీ నమ్ముకున్నారన్నారు.   స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.    [CBN Say Jagan Criminal Litigant,   YCP Violence, Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Kriti Sanon and Varun Dhawan are teaming up for the Hindi-dubbed version of Hollywood horror thriller Obsession, which is set to premiere on JioHotstar on October 30 at 7 PM. The original uncut version will be available in both Hindi and English through the platform’s Peacock Hub. Kriti will lend her voice to Nikki, originally played by Inde Navarrette, while Varun will voice Bear, portrayed by Michael Johnston. The project marks Kriti’s debut as a voice actor dubbing for another performer, and she described the experience as both exciting and challenging. The actress said she was drawn to the film’s gripping, quirky and twisted storyline, adding that Nikki was unlike any character she had explored before. Varun, meanwhile, said dubbing for the film allowed him to examine the story from a different perspective and notice details he had missed while watching it earlier. Directed by Curry Barker, Obsession revolves around Bear, whose wish for his longtime crush Nikki to fall deeply in love with him leads to disturbing consequences. What begins as a romantic fantasy gradually transforms into a terrifying experience, making the film a supernatural horror story with an unsettling premise. The film was released in Indian theatres on May 29, following its earlier premiere at the Toronto International Film Festival. After its theatrical run, the uncut digital release will give Indian audiences an opportunity to experience the thriller in its original form, with the Hindi version bringing two familiar Bollywood voices to its lead characters. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నిత్య జీవితంలో ఒకరిపై ఒకరికి క్రష్ అనేది ఉండటం సహజం. కానీ ఒక హీరోపై నాకు క్రష్ అనేది ఉందని మిరాయ్, కొరియన్ కనకరాజు బ్యూటీ రితిక నాయక్ చెప్తే ఆ న్యూస్ నిమిషాల్లో వైరల్ గా  మారుతుంది.  నిన్న రితికా నాయక్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, సినీ విశేషాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ అంటే నాకు విపరీతమైన క్రష్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే నా జీవితపు అసలైన కల. నటించే అవకాశం వస్తే అది ఏలాంటి పాత్ర అయినా సరే, ఎంత చిన్నదైనా సరే వెంటనే అంగీకరిస్తాను. అల్లు అర్జున్ వేసే డ్యాన్సులు, స్క్రీన్ ప్రెజెన్స్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది కూడా చదవండి: ఆబ్సెషన్ ఓటిటి కోసం బాలీవుడ్ స్టార్స్: రసవత్తరంగా మారిన పరిణామాలు!        [Ritika Nayak About Allu Arjun, Ritika Nayak Birthday Special, Ritika Nayak, Allu Arjun crush, Ritika Nayak birthday, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]  
Nazriya Nazim has responded to the criticism surrounding her outfit at a promotional event in Dubai for her upcoming Tamil film Scene. The actress shared a cryptic Instagram story amid the criticism, writing, “May your delulu become trululu and your problems go byelulu, so you can finally chillulu.”  The playful message came after Nazriya faced criticism for wearing a green off-shoulder outfit at the film’s promotional event. Rather than issuing a direct statement, the actress also shared more pictures of herself in the same outfit, drawing attention to her response as the debate continued online.  While sections of social media criticised her choice of clothing, several others came out in her support, calling out the policing of women’s fashion choices. Her Scene co-star Naslen and director Jithu Madhavan also showed their support in the comments section of her Instagram post. The controversy comes as Nazriya faces renewed scrutiny over her public appearances, with some users also commenting on her expressions and personality. The episode has sparked a wider debate about the expectations placed on female actors and how their appearance often becomes a talking point beyond their professional work. Meanwhile, Scene marks Nazriya’s return to Tamil cinema after 12 years. Directed by Jithu Madhavan, the film stars Suriya in the lead role, with Naslen playing a key part. Nazriya has expressed happiness about being part of the project and praised Suriya and the director during the film’s Dubai promotions. Produced by Suriya and Jyotika under Zhagaram Studios and 2D Entertainment, Scene is scheduled to arrive in theatres on 6th November. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
People’s Star R. Narayana Murthy believes Hushaaru 2 goes beyond comedy, addressing unemployment and the erosion of workers’ rights while retaining its entertainment quotient. Speaking at the teaser launch, the actor said writer-director Sree Harsha Konuganti had given him such a good role that there was no question of convincing him to come aboard. Narayana Murthy pointed to the film’s underlying social concerns, highlighting how young people are losing their freedom and independence amid exploitative working conditions. He spoke about government-sector closures, the pressure on young employees in private and IT companies, and the dilution of labour protections. According to him, the film conveys that life should be about more than securing a job and earning money; it should also have meaning, freedom and self-respect. In the film, Rahul Ramakrishna and his friends start a business intended to benefit society, only to encounter dangerous adversaries in a forest. Narayana Murthy’s character stands by the youngsters, encouraging their efforts to do something meaningful for society and the oppressed. Comparing his role to Lord Krishna’s support for the Pandavas, the actor said the character becomes a friend and mentor to the young protagonists. He praised Harsha’s uncompromising approach to filmmaking and appreciated the work of cinematographer G. Srinivas Reddy, editor Vijay Vardhan Kavuri and art director Srikanth Ramisetty. Starring Rahul Ramakrishna, Ashok Galla, Dinesh Tej and others, Hushaaru 2 is written and directed by Sree Harsha Konuganti and produced by Rahul Varma, K. Veena Rani and K. Hanumanth Raju. Narayana Murthy expressed confidence that the film would connect with audiences by making them laugh while provoking thought. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి రితికా నాయక్‌కు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ దక్కింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘పవర్‌పేట’ సినిమాలో ఆమె పడమటవీధి జానకి పాత్రలో కనిపించనుంది. తాజాగా రితికా పుట్టినరోజు సందర్భంగా ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో రితికా నాయక్ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పడమటవీధి జానకి అనే పేరుతో ఆమె పాత్రను పరిచయం చేయడంతో సినిమాలో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి మొదలైంది. రితికాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్రబృందం ఈ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘మిరాయ్’, ‘కొరియన్ కనకరాజు’ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన రితికా.. ‘పవర్‌పేట’లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని గతంలో వచ్చిన వార్తలు కూడా అంచనాలను పెంచుతున్నాయి. ‘పవర్‌పేట’కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘రౌడీ ఫెలో’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఈసారి ప్రేమ, గౌరవం, రాజకీయాల నేపథ్యంలో కథను రూపొందిస్తున్నారు. సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రక్తంతో తడిసిన చదరంగం బోర్డు కనిపించడం కథలో అధికార పోరు, వ్యూహాలు, సంఘర్షణలకు ప్రాధాన్యం ఉండొచ్చనే సంకేతాలిచ్చింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సేనాపతి రవి అనే పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదలైన ఆయన గ్లింప్స్‌లో రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్ ఆకట్టుకుంది. థియేటర్‌లో మొదటి రోజు మొదటి ఆట సందడి నేపథ్యంలో ఆయన ఎంట్రీని చూపిస్తూ పాత్ర స్వభావంపై ఆసక్తి పెంచారు. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా, మధీ కెమెరా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   Powerpeta Ritika Nayak Birthday Glimpse   ఇది కూడా చదవండి: నారాయణమూర్తి సర్ప్రైజ్ ఎంట్రీ.. 'టెంపర్'ని కాదని ‘హుషారు 2’ చేయడానికి కారణమేంటి.?       [Powerpeta Ritika Nayak Glimpse, Ritika Nayak As Padamataveedhi Janaki, Ritika Nayak Birthday, Padamataveedhi Janaki, Ritika Nayak, Power Peta Movie, Sundeep Kishan, Krishna Chaitanya, Telugu Film News]  
హర్రర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' మూవీ వరల్డ్ వైడ్ గా సృష్టించిన సంచలనం తెలిసిందే. ఎటువంటి హడావిడి లేకుండా, హడావిడి బడ్జెట్ లేకుండా అంచనా వేయలేని క్యారెక్టర్స్ తీరుతో కథ, కథనాన్ని ఉత్కంఠభరితంగా చెప్పి నాలుగువేల కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ చిత్రం ఈ నెల 30 నుంచి ఓటిటి(జియో హాట్ స్టార్) వేదికగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు హిందీ ప్రేక్షకులని మరింతగా మెస్మరైజ్ చేయడానికి  వరుణ్ ధావన్, కృతి సనన్ ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ప్రధాన పాత్రలైన 'బేర్', 'నిక్కీ' క్యారెక్టర్స్ కి ఈ ప్రముఖ తారలు ప్రాణం పోశారు. ఒక మ్యూజిక్ స్టోర్ లో సాధారణ ఉద్యోగిగా పనిచేసే బేర్ క్యారక్టర్ కి వరుణ్ ధావన్,  సహోద్యోగి నిక్కీ కి కృతి తన గాత్రాన్ని అందించారు. ఇది కూడా చదవండి: హఠాత్తుగా మాయమైన నిధి అగర్వాల్: అసలు మ్యాటర్ తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో!      జియోహాట్‌స్టార్ లోని 'పీకాక్ హబ్' (Peacock Hub) వేదికగా అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుండటంతో ప్రేక్షకులు మరియు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వరుణ్ ధావన్ మరియు కృతి సనన్‌ల ప్రత్యేక వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనుంది.   [varun Dhawan And Kriti Sanon In Obsession, Varun Dhawan, Kriti Sanon, Obsession movie, JioHotstar,Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
The cult boys are back, and their latest business venture is taking them into a world of trouble they never signed up for! Following the success of the 2018 youth entertainer Husharu, writer-director Sree Harsha Konuganti returns with Husharu 2, bringing a fresh adventure that takes the gang from ambitious business plans to the unpredictable heartland of Chittragunj. The teaser captures their escalating predicament as the pursuit of a tequila dream leads to unexpected complications, a forest-bound escape and a final reveal that adds a prestigious surprise to the sequel. Having moved beyond the beer venture associated with the original, the five friends now set their sights on establishing what they envision as India’s first agave-based tequila distillery. Determined to rebuild their lives after losing everything during the COVID period, they head to Chittragunj in pursuit of a fresh beginning. But their plans soon run into trouble, turning an entrepreneurial expedition into an increasingly chaotic adventure. The teaser follows the gang as they navigate their predicament, with their journey taking an unexpected turn into the surrounding forest. Rather than revealing the full chain of events, the glimpse offers just enough to establish the sequel’s irreverent humour, adventurous spirit and unpredictable setting. Saving its biggest surprise for the closing moments, the teaser introduces veteran actor and filmmaker R. Narayana Murthy Garu. Known for his work as an actor and director, his appearance in Husharu 2 marks his first outing in a film directed by another filmmaker, a landmark addition to the project. The unexpected reveal lends the teaser a distinctive talking point while leaving audiences curious about his role in the boys’ unfolding adventure. Written and directed by Sree Harsha Konuganti, who also helmed the 2018 original, Husharu 2 features an ensemble comprising Rahul Ramakrishna, Ashok Galla, Ravi Anthony, Dinesh Tej, Sasidhar Kocharlakota, Vidhi Yadhav, Abhignya Vuthuluru, Bhagwan Tiwari, Jatin Goswami and Rajai Rowan. Produced by Rahul Varma, K. Veena Rani and K. Hanumant Raju, with Komatireddy Sharan Reddy as co-producer, the film is backed by Caveman Stories, HK Films and Kaliyuga Vaaradha Creations. G. Srinivas Reddy handles cinematography, Sunny M.R. is the music director, with additional music by Ram Miryala. Editing is by Vijay Vardhan Kavuri, while Srikanth Ramisetty oversees art direction. Having completed its major shooting schedules, Husharu 2 is currently in post-production and is targeting a year-end theatrical release. With its tequila-fuelled premise, escalating misadventures and an unexpected final reveal, the sequel sets up another unpredictable ride for the cult boys. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
టాలీవుడ్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా ‘హుషారు’. ఫ్రెండ్‌షిప్, లవ్, కామెడీతో యూత్‌ను ఆకట్టుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా ‘హుషారు 2’ రాబోతోంది. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఈసారి నవ్వులతో పాటు యాక్షన్ కూడా గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. ‘హుషారు 2’ టీజర్ ఆద్యంతం ఫన్‌తో సాగింది. స్నేహితుల మధ్య సరదా సన్నివేశాలు, యూత్‌ఫుల్ డైలాగ్స్ తో టీజర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. మొదటి భాగంలో ఉన్న ఫీల్‌ను కొనసాగిస్తూనే, ఈసారి మరింత ఎనర్జీతో కథను చెప్పబోతున్నట్లు కనిపిస్తోంది. కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉండటంతో ఈ సీక్వెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ పెరిగినట్టే అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ప్రత్యేక పాత్రలో నటించడం ఆసక్తికరంగా మారింది. టీజర్ చివరిలో "తమ్ముళ్లు వేట మొదలెడదామా?" అంటూ నారాయణమూర్తి ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.  సాధారణంగా ఇతర సినిమాల్లో ఆర్. నారాయణమూర్తి నటించరు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కీలక పాత్రలు ఆఫర్ చేసినా రిజెక్ట్ చేస్తుంటారు. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన 'టెంపర్' సినిమాలో పోసాని కృష్ణమురళి పోషించిన మూర్తి పాత్ర నారాయణమూర్తి కోసం రాసుకున్నదే. అయితే ఆ పాత్రను నారాయణమూర్తి సున్నితంగా తిరస్కరించారు. అలాంటి నారాయణమూర్తి ఇప్పుడు ‘హుషారు 2’ లాంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో నటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయంపై టీజర్ లాంచ్ ఈవెంట్ లో నారాయణమూర్తి స్పందించారు. దర్శకుడు గొప్ప పాత్ర రాశాడు, అందుకే నటించానని చెప్పారు. ‘హుషారు 2’లో నారాయణమూర్తిది ప్రత్యేక పాత్ర, అందునా మావోయిస్టు దళ నాయకుడి పాత్ర కావడంతోనే ఆయన అంగీకరించి ఉంటారు అనిపిస్తోంది. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సన్నీ ఎం.ఆర్. సంగీతం అందిస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కొచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ వుదులూరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌తో సినిమాపై ఆసక్తి పెంచిన మేకర్స్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఉన్నంతలో మనకున్నంతలో.. ‘భజగోవిందం’ పాట వెనుక ఉన్న గొప్ప అర్థం తెలుసా.?       [R Narayana Murthy In Husharu 2, Husharu 2 Teaser, Husharu 2 Movie, R Narayana Murthy, NTR Temper, Sree Harsha Konnuganti, Rahul Ramakrishna, Ashok Galla, Telugu Film News]  
నిధి అగర్వాల్.. నిండు చందమామని తలపించేలా ముగ్ధ మనోహర రూపంతో తొణికిసలాడుతూ ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన 'హరిహర వీరమల్లు'నే వన్ ఆఫ్ ది ఎగ్జంపుల్. ప్రీవియస్ మూవీ  ప్రభాస్ 'ది రాజాసాబ్' తో కూడా మెప్పించిన  నిది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ ఏమి రాకపోవడంతో నిధి పని అయిపోయిందా అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఆ రూమర్స్ కి దవడ వాసేలా అరడజను ప్రాజెక్ట్స్ ని ప్రకటించి ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌లలో ఒకరిగా నిధి దూసుకుపోతుంది. రాబోయే రెండేళ్ల కాలంలో ఆమె నటించిన మరియు నటిస్తున్న దాదాపు ఆరు చిత్రాలు వరుసగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని ప్రధాన భాషా పరిశ్రమలని కవర్ చేస్తూ మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్టులని తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆమె చేతిలో ప్రస్తుతం మూడు బాలీవుడ్ చిత్రాలు, ప్రముఖ 'స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్' నిర్మిస్తున్న తమిళ చిత్రం, తెలుగులో ఒక యంగ్ హీరో సినిమాతో పాటు ప్రతిష్టాత్మక లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఇది కూడా చదవండి:  వైలెన్స్ వద్దు, ఫ్యామిలీ చిత్రాలే ముద్దు:  పీచే మూడ్!       మరి  రాబోయే రెండేళ్లలో దాదాపు అరడజను సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు నిధి అగర్వాల్ సిద్ధమవుతుంది. దీన్ని బట్టి ఆమె పని అయిపోలేదు. ఇప్పుడు మరింత స్పీడ్ అయ్యిందని చెప్పవచ్చు.   [Nidhhi Agerwal Silences Rumours With Six Films, Nidhhi Agerwal, Hari Hara Veera Mallu, The Raja Saab, Nidhhi Agerwal upcoming movies, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]  
Ritika Nayak is playing leading lady inSundeep Kishan’s Powerpeta, with the makers introducing her as Padamataveeti Janaki through a first-look poster released on her birthday. Dressed in a traditional half-saree, Ritika appears graceful and composed, hinting at a character deeply connected to the film’s rustic setting. She has gone complete glamorous too having two to three sequences where she is playing in rain, comes out completely drenched in a shirt. Looks like the actress is showcasing the more glam side of her, not just sticking to the regular roles.  Following the success of Mirai and Korean Kanakaraju, Ritika has emerged as a promising choice for Telugu filmmakers. Her entry into Powerpeta brings another interesting dimension to the project, which brings Sundeep Kishan and director Krishna Chaitanya together for an action drama. With love, honour and politics at its core, the film promises a narrative driven by intense conflicts and strong character dynamics. The makers are mounting it on a grand scale, with Vijay Chilla and Shashi Devireddy producing the project. Mani Sharma is composing the music. The shoot is progressing rapidly, with 60% of the filming completed. The team is expected to announce further details about the film in the coming days.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చేతిలో పెట్టుకున్న వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడుతుండగా చెప్పాలనుకున్న విషయం హఠాత్తుగా గుర్తుకు రాకపోవడం, రోజువారీ పనులపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు నేడు చాలామందిలో సాధారణంగా కనిపిస్తున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, వయసు పెరగడం వంటి సాధారణ కారణాలతో పాటు శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించినప్పుడు కూడా మెదడు పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ B12 లోపం ఉంటే జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు స్పష్టంగా బయటపడతాయి. తరచూ చిన్న చిన్న విషయాలను మర్చిపోవడాన్ని కేవలం సాధారణ అలసటగా భావించి ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. విటమిన్ B12 అనేది మన నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీకి ఎంతో కీలకమైన పోషకం. దీని మోతాదు తగ్గితే నీరసం, విపరీతమైన బలహీనత నుంచి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, తీవ్రమైన జ్ఞాపకశక్తి సమస్యల వరకు పలు రకాల లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తాయి. అయితే మర్చిపోవడానికి ఈ ఒక్క విటమిన్ లోపమే ఏకైక కారణం కానప్పటికీ, దీని లోపాన్ని సకాలంలో గుర్తించి సరిదిద్దుకోవడం ఎంతో ముఖ్యం. శరీరంలో విటమిన్ B12 తగినంతగా లేకపోతే నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా అస్తవ్యస్తమవుతుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గడం, విషయాలను గుర్తుంచుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తడం, ఏదైనా విషయాన్ని ఆలోచించడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టడం, మెదడులో గందరగోళంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా కొందరిలో మానసిక స్థితిలో వేగంగా మార్పులు కూడా రావచ్చు. అయితే ఈ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు; విటమిన్ B12 లోపం ఉన్న ప్రతి ఒక్కరికీ జ్ఞాపకశక్తి సమస్యలు రావాలని నియమం లేదు, అలాగే జ్ఞాపకశక్తి తగ్గింది కదా అని కచ్చితంగా B12 లోపమే ఉందని నిర్ధారించలేం. నిద్రలేమి, తీవ్రమైన ఒత్తిడి, ఇతర పోషకాల లోపాలు, కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలకే దారితీస్తాయి. ఈ లోపం ఉన్నవారిలో తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికీ తరచూ విపరీతమైన అలసటగా అనిపించడం, శరీరంలో శక్తి పూర్తిగా తగ్గినట్లు ఉండటం ప్రధాన సంకేతం. B12 లోపం వల్ల శరీరంలో రక్తహీనత (అనీమియా) ఏర్పడే ప్రమాదం కూడా అధికంగా ఉంది. దీంతో పాటు చేతులు లేదా కాళ్లలో సూదులతో గుచ్చినట్లు అనిపించడం, అవయవాలు మొద్దుబారడం వంటి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. పని చేస్తున్నప్పుడు మనసు నిలకడగా లేకపోవడం, చిన్న విషయాలపై దృష్టి పెట్టలేకపోవడం, పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టి మానసిక అశాంతి కలగడం వంటివి జరుగుతాయి. విపరీతమైన చిరాకు, నిరుత్సాహం, బలహీనత, తల తిరగడం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా దీనితో పాటు ముడిపడి ఉంటాయి. పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు, మాంసం వంటి B12 లభించే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకునేవారిలో ఈ పోషక లోపం వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పూర్తిగా శాకాహారం లేదా వీగన్ ఆహార విధానాన్ని కఠినంగా అనుసరించే వారు ఈ విటమిన్ తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అయితే కొన్నిసార్లు ఆహారంలో తగినంత B12 తీసుకున్నప్పటికీ, జీర్ణవ్యవస్థ సమస్యల వల్ల శరీరం దాన్ని సరిగ్గా గ్రహించలేకపోవచ్చు. వయసు పెరగడం, కడుపు లేదా పేగులకు జరిగిన శస్త్రచికిత్సలు, కొన్ని రకాల మందులను దీర్ఘకాలంగా వాడటం కూడా B12 శోషణను దెబ్బతీస్తాయి. కాబట్టి పాలు, గుడ్లు, చేపలు వంటి సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.     Vitamin Deficiency Memory Loss, Forgetfulness Causes, Brain Fog Vitamin Link, Improve Cognitive Health, Vitamin B12 Deficiency Symptoms, Memory Enhancement Tips, Brain Health Nutrition.  
గర్భధారణ సమయం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైనది, అలాగే ఎన్నో శారీరక మార్పులతో కూడుకున్న అద్భుతమైన ప్రయాణం. ఈ సమయంలో తల్లి గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్న కొద్దీ, గర్భాశయంతో పాటు పొట్ట పరిమాణం క్రమంగా పెరుగుతుంది. ఈ సహజమైన మరియు అందమైన ప్రక్రియలో భాగంగా పొట్ట కింది భాగం, రొమ్ములు, తుంటి మరియు తొడలపై సన్నని గీతల్లాంటి గుర్తులు ఏర్పడడం సర్వసాధారణం. వీటినే మెడికల్ పరిభాషలో స్ట్రెచ్ మార్క్స్ అని పిలుస్తారు. కొందరిలో ఈ గుర్తులు లేత ఎరుపు లేదా గులాబీ రంగులో కనిపిస్తే, మరికొందరిలో ఊదా లేదా ముదురు గోధుమ రంగులో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రసవం పూర్తయి, బిడ్డను చేతిలోకి తీసుకున్న తర్వాత కూడా ఈ గుర్తులు అలాగే మిగిలిపోవడంతో చాలామంది తల్లులు ఆందోళన చెందుతుంటారు. వాటిని తగ్గించుకోవడానికి, చర్మాన్ని కోల్పోయిన కాంతిని తిరిగి తెచ్చుకోవడానికి వివిధ రకాల ఇంటి చిట్కాలు, నూనెలు మరియు క్రీములను ఆశ్రయిస్తుంటారు. గర్భధారణ సమయంలో చర్మాన్ని అత్యంత జాగ్రత్తగా మరియు ప్రేమతో చూసుకోవడం ద్వారా పొడిబారడం, చికాకు మరియు తీవ్రమైన దురద వంటి అసౌకర్యాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చర్మానికి తగినంత తేమను అందించే సహజ నూనెలు లేదా లోషన్లను క్రమం తప్పకుండా ఉపయోగించడం ఒక ఉత్తమమైన మార్గంగా నిలుస్తుంది. పొట్ట పెరుగుతున్న కొద్దీ చర్మంపై తీవ్రమైన ఒత్తిడి పడి, అది పొడిబారడం, బిగుతుగా మారడం, మరియు విపరీతమైన దురద రావడం జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా చర్మానికి పూర్తిగా సురక్షితమైన మాయిశ్చరైజర్‌ను వాడటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. కొంతమంది మహిళలు క్యాస్టర్ ఆయిల్, రోజ్‌హిప్ ఆయిల్ వంటి ప్రత్యేక నూనెలను కూడా ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ నూనెలు స్ట్రెచ్ మార్క్స్‌ను పూర్తిగా రాకుండా నివారిస్తాయని నిరూపించే బలమైన శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, చర్మపు ఉపరితల రక్షణకు మరియు మృదుత్వానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఏదైనా కొత్త నూనెను చర్మంపై వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం లేదా మీ గైనికాలజిస్ట్ సలహా తీసుకోవడం ఎప్పుడూ శ్రేయస్కరం. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమిటంటే, శరీరం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు తాగడం తల్లి ఆరోగ్యానికి ఎంతో అవసరం. తగిన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు మరియు రక్త ప్రసరణ సక్రమంగా సాగుతాయి. నీటితో పాటు కొబ్బరి నీరు, నీటి శాతం పుష్కలంగా ఉండే పుచ్చకాయ, బత్తాయి వంటి పండ్లను కూడా మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ఎక్కువ నీరు తాగడం వల్ల నేరుగా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడకుండా ఆపవచ్చని చెప్పడానికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా, శరీరం మరియు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. మూడవదిగా, చర్మం సాగే కొద్దీ వచ్చే దురదను ఎట్టి పరిస్థితుల్లోనూ గోళ్లతో గట్టిగా గోకకూడదు. దురదగా ఉన్నప్పుడు గోళ్లతో గీరడం వల్ల చర్మంపై గాయాలు, ఇన్‌ఫెక్షన్లు మరియు చికాకు ఏర్పడే ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి చర్మాన్ని ఎప్పుడూ గట్టిగా రుద్దకుండా, మృదువుగా నిమరాలి. ఒకవేళ దురద రాత్రిపూట లేదా అరచేతులు, అరికాళ్లలో విపరీతంగా కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ వైద్యులను సంప్రదించాలి. నాల్గవదిగా, మార్కెట్లో లభించే క్రీములు లేదా లోషన్లను ఎంచుకునేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. విటమిన్ E, హైల్యూరోనిక్ యాసిడ్ వంటి తేమను అందించే పదార్థాలు ఉన్న ఉత్పత్తులు చర్మానికి మంచివే అయినప్పటికీ, ఇవి మచ్చలను పూర్తిగా తొలగిస్తాయని చెప్పలేం. ముఖ్యంగా రెటినాల్ లేదా రెటినాయిడ్స్ ఉన్న ఉత్పత్తులను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు వాడకూడదు. ఐదవదిగా, గర్భధారణ సమయంలో బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పద్ధతిలో పర్యవేక్షించడం చాలా కీలకం. బిడ్డ ఎదుగుదల ఆధారంగా ఎంత బరువు పెరగాలనే దానిపై వైద్యుల సూచనలు పాటించడం ద్వారా చర్మంపై పడే అనవసరమైన అదనపు భారాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.     Pregnancy Stretch Marks, How To Reduce Stretch Marks, Postpartum Skincare Tips, Natural Oils For Stretch Marks, Prevent Stretch Marks During Pregnancy, Maternity Beauty Routine, Fade Stretch Marks Remedies.  
ఉదయం నిద్రలేచిన వెంటనే ఆరోగ్యకరమైన పానీయాలతో దినచర్యను ప్రారంభించాలని చాలామంది ఆశపడుతుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాలనుకునేవారి మనసులో మొదట మెదిలే పేరు అలోవెరా జ్యూస్ అనగా కలబంద రసం. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ అద్భుతమైన మొక్కను ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంగా భావిస్తుంటారు. అయితే, నిజంగానే ఉదయం పూట ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా? దీని వల్ల లభించే నిజమైన ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఏ లాభాలు మరియు నష్టాలు ఉంటాయి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఉదయం పూట పరగడుపున తగిన మోతాదులో కలబంద రసం సేవించడం ద్వారా మన శరీరానికి అనేక అద్భుతమైన ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అలోవెరా జ్యూస్ గట్ హెల్త్‌ను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన జీర్ణవ్యవస్థను సమర్థవంతంగా శుభ్రపరుస్తూ, దీర్ఘకాలికంగా వేధించే మలబద్ధక సమస్యను సమర్థవంతంగా దూరం చేస్తుంది. కలబందలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చి, రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనితో పాటు, మన శరీరంలో జీవక్రియ అనగా మెటబాలిజం వేగవంతం కావడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు కరిగి, బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి మరియు సంతృప్తికరమైన ఫలితం లభిస్తుంది. అయితే, ఈ జ్యూస్‌ను సేవించేటప్పుడు పాటించాల్సిన సరైన పద్ధతి చాలా ముఖ్యం. మీ ఇంట్లోనే ఉండే తాజా కలబంద మొక్క నుండి శుభ్రంగా గుజ్జును తీసుకుని, దానిలోని పసుపు రంగు రసం పూర్తిగా పోయేలా నీటితో 2 నుండి 3 సార్లు విధిగా శుభ్రం చేయాలి. కేవలం 10 నుండి 15 మి.లీ. జ్యూస్‌ను మాత్రమే ఒక గ్లాసు నీటిలో బాగా కలిపి తీసుకోవాలి. ఎప్పుడూ కూడా దీనిని చిక్కగా నేరుగా తీసుకోకూడదు. రుచి కోసం కావాలంటే కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ జ్యూస్ తాగిన గంట లేదా ముప్పావు గంట తర్వాతే ఏ ఇతర ఆహారమైనా తీసుకోవాలి. ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా అని ఆలోచిస్తే, ప్రతి పదార్థం అందరికీ ఒకేలా సరిపోవాలని లేదు. సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తీసుకుంటే కడుపులో మంట, కడుపునొప్పి లేదా విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే, తక్కువ రక్తపోటు లేదా మధుమేహం సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీనిని తీసుకోకూడదు. మార్కెట్లో లభించే ప్రాసెస్డ్ జ్యూస్‌లలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి అంత మంచివి కావు. ప్యాక్డ్ జ్యూస్‌లకు బదులుగా ఇంట్లోనే తాజా కలబంద గుజ్జును తక్కువ మోతాదులో సేవించడం చాలా మంచిది. ఏదేమైనప్పటికీ, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని తమ దినచర్యలో చేర్చుకోవడం ఎంతో అవసరం.     Aloe Vera Juice Empty Stomach, Morning Detox Drink, Aloe Vera Benefits For Digestion, Side Effects Of Aloe Vera, Weight Loss Juice, Healthy Morning Routine, Aloe Vera Juice Precautions.
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, నిద్రలేమి వంటి సమస్యలు మన రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొందరిలో నిరంతర ఆందోళన, బాధ, నిరాశ కారణంగా పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చు. అసలు మానసిక ఒత్తిడికి, శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సైకోథెరపీ ఎలా సహాయపడుతుంది? ఈ వీడియోలో డాక్టర్ శారదా దేవి గారు మానసిక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, సైకోథెరపీ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. మందులు మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్సలో సైకోథెరపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? మనసు, శరీరం మధ్య సంబంధం ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సైకోథెరపీ అంటే ఏమిటి? మానసిక సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఆలోచనలు మరియు భావోద్వేగాలను ఆరోగ్యకరంగా నిర్వహించుకోవడానికి సహాయపడే చికిత్సా విధానాల్లో సైకోథెరపీ ఒకటి. మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటం ద్వారా సమస్యలకు కారణమయ్యే ఆలోచనా విధానాలను గుర్తించడం, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులను నేర్చుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటి అంశాల్లో సహాయం పొందవచ్చు. సైకోథెరపీ ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది? చికిత్స ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు? అనే విషయాలను ఈ వీడియో వివరిస్తుంది. డిప్రెషన్, ఆందోళన, భయం ఎందుకు కలుగుతాయి? నిరంతర ఆందోళన, భయం, నిరాశ, భావోద్వేగ ఒత్తిడి వంటి సమస్యలు వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను, రోజువారీ పనులను ప్రభావితం చేయవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను సాధారణ బాధ లేదా తాత్కాలిక ఒత్తిడితో సమానంగా చూడకూడదు. వీటి వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. సమస్యలను గుర్తించడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో డాక్టర్ శారదా దేవి గారు వివరిస్తారు. మానసిక ఒత్తిడికి, శారీరక ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? మనసుపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు సంభవించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్ర, రోగనిరోధక వ్యవస్థ, రక్తపోటు వంటి ఆరోగ్య అంశాలపై ప్రభావం చూపవచ్చు. అయితే అధిక రక్తపోటు (BP)కు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి ఒక్కటే దానికి కారణమని భావించకూడదు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టవచ్చు. నిద్రలేమి ఎందుకు వస్తుంది? నిద్ర ఎందుకు ముఖ్యం? తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు నిద్రను దెబ్బతీయవచ్చు. ఈ విధంగా మానసిక ఆరోగ్యం, నిద్ర ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాలను గుర్తించి తగిన సహాయం పొందడం అవసరం. సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యల గురించి తెలుసుకోండి మానసిక ఆరోగ్య సమస్యలు ఒకే రకంగా ఉండవు. డిప్రెషన్, ఆందోళన, సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి పరిస్థితుల లక్షణాలు, వాటికి అవసరమైన చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. వీటి గురించి సరైన అవగాహన పెంపొందించుకోవడం, అపోహలకు దూరంగా ఉండటం, బాధితులను గౌరవంగా చూడటం ఎంతో ముఖ్యం. అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం సరైన మార్గం. శారీరక, భావోద్వేగ, సామాజిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, సంబంధాల్లో ఇబ్బందులు, జీవితంలో ఎదురయ్యే మార్పులు మన మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని గుర్తించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, విశ్రాంతికి సమయం కేటాయించడం, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ శారదా దేవి గారి వివరణ ద్వారా సైకోథెరపీ ప్రాముఖ్యత, మనసు-శరీరం మధ్య సంబంధం, ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు, నిద్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా వ్యక్తిగత చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి లేదా అధిక రక్తపోటు సమస్యలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా సూచించిన మందులను ఆపవద్దు.
ఇంటి బాధ్యతలను మోస్తూ, కుటుంబం  కోసం నిరంతరం శ్రమిస్తున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్ బాధ్యతల ఒత్తిడిలో పడి మహిళలు తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను, అనారోగ్య సూచనలను సాధారణంగా కొట్టిపారేస్తుంటారు. అయితే, మన శరీరం ప్రతి చిన్న విషయానికీ స్పందిస్తూ కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తూ ఉంటుంది. వాటిని సమయానికి గుర్తించి జాగ్రత్త పడకపోతే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అసలు కొందరు మహిళలు ఘాటైన వాసనలు పదే పదే చూడాలని ఎందుకు అనుకుంటారు? దీని వెనకున్న ఆరోగ్య సమస్య ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. ఘాటైన వాసనలు.. రోజూవారీ జీవితంలో మనలో చాలామందికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా అమృతాంజనం, విక్స్ లేదా నీలగిరి తైలం వంటి ఘాటైన వాసనలను పదే పదే పీల్చాలని అనిపించడం, లేదా వాటిని దగ్గరగా పెట్టుకుని చూడటం చేస్తుంటారు. అలాగే వంటగదిలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలను , మసాలా దినుసులను సాధారణ మోతాదు కంటే ఎక్కువగా, నేరుగా నమిలి తినాలనిపించడం లాంటి కోరికలు కలుగుతుంటాయి. ఇవి కేవలం సాధారణ రుచికి సంబంధించిన అలవాట్లు కాకపోవచ్చు. ఎందుకు ఈ అలవాట్లు..? వైద్య శాస్త్రం ప్రకారం, శరీరంలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ శాతం తగ్గినప్పుడు ఇలాంటి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. దీనిని 'పికా' (Pica) అనే ఆరోగ్య పరిస్థితిగా చెబుతారు. శరీరంలో రక్తం కొరత ఏర్పడినప్పుడు లేదా ఎర్ర రక్త కణాల నిర్మాణం మందగించినప్పుడు, మెదడుకు అందవలసిన పోషకాలు సరిగ్గా అందక ఇటువంటి వింతైన కోరికలు పుట్టుకొస్తాయి. మట్టి, సుద్ద, ఐస్ ముక్కలు తినాలనిపించడం ఎంత సాధారణమో, ఘాటైన వాసనలను పీల్చాలనిపించడం , మసాలా దినుసులను తినాలనిపించడం కూడా అదే కోవలోకి వస్తుంది. కారణాలు.. మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణాలు రకరకాలుగా ఉంటాయి. క్రమ పద్ధతిలో లేని జీవనశైలి, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావం, పోషకాహార లోపం,  విశ్రాంతి సరిగా లేకపోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ మోతాదు వేగంగా పడిపోతుంది. దీనివల్ల ఎప్పుడూ నీరసం, తలతిరగడం, శరీరం తెల్లగా మారడం, ఏకాగ్రత తగ్గడం, పనులపై ఆసక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి తోడు ఈ ఘాటైన వాసనలను పీల్చడం వల్ల లేదా మసాలా పదార్థాలను అధికంగా తినడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరికినట్లు అనిపించినా, అది దీర్ఘకాలంలో కడుపులో మంట, అల్సర్ , జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి వింత లక్షణాలు లేదా అలవాట్లు మీలో లేదా మీ చుట్టూ ఉన్న మహిళల్లో కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు. వెంటనే ఒకసారి వైద్యులను సంప్రదించి కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) పరీక్ష చేయించుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలము. పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, బీట్రూట్, దానిమ్మ పండ్లు, ఖర్జూరాలు, బెల్లం, వేరుశెనగలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన ఆలోచనలే మహిళల నిజమైన ఎదుగుదలకు, సాధికారతకు బలమైన పునాది వేస్తాయి.                                                                                                                                                  *రూపశ్రీ.
మన శరీరానికి ఎముకలు ఎంత బలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా ఎముకలు , దంతాలు పటిష్టంగా ఉండటంలో కాల్షియం  చాలా అవసరం. ఇది కేవలం ఎముకలను గట్టిపరచడమే కాకుండా, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, నరాల ద్వారా మెదడుకు సంకేతాలు అందడంలో , రక్తం గడ్డకట్టే ప్రక్రియలోనూ కీలకపాత్ర  పోషిస్తుంది. అయితే చాలా మంది రోజూ పాలు, పెరుగు లాంటివి తీసుకుంటున్నప్పటికీ, వారి శరీరానికి తగినంత కాల్షియం అందడం లేదని ఆందోళన చెందుతుంటారు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పొరపాట్లు ఉండటం వల్ల, అది శరీరంలో కలిసిపోవడానికి బదులుగా నీటిలా కరిగిపోయి వృథాగా బయటకు వెళ్లిపోతుంటుంది. అలా జరగడానికి కారణాలు ఏంటో.. ఆ ఆహారపు పొరపాట్లు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. విటమిన్-డి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపించడానికి ప్రధాన కారణాలలో విటమిన్ డి లేకపోవడం ఒకటి. మనం ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ, అది ఎముకలకు చేరాలంటే శరీరంలో తగినంత విటమిన్ డి ఉండటం చాలా అవసరం. ఒకవేళ విటమిన్ డి లోపిస్తే మాత్రం మనం తీసుకునే పోషకాలు పూర్తిగా శోషించబడవు. ఉదయం పూట ఎండలో కాసేపు గడపడం లేదా అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ డి లేకపోతే క్యాల్షియం శరీరంలో పూర్తిగా వృథా అయిపోతుంది. ఉప్పు.. మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువైతే అది ఎముకల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఉప్పులో ఉండే సోడియం  మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లేటప్పుడు, దానితో పాటు శరీరంలోని ముఖ్యమైన కాల్షియం కూడా కరిగిపోయి బయటకు వెళ్లిపోతుంది. చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ ఉంచిన పచ్చళ్ళు , అతిగా ఉప్పు ఉండే పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు క్రమంగా గుల్లబారే ప్రమాదం ఉంది. దీనితో పాటు అతిగా టీ లేదా కాఫీలు తాగే అలవాటు ఉన్నవారిలో కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది. కాల్షియం ఆహారాలు తీసుకోకపోవడం..   డైట్ లో కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్థాలను పూర్తిగా విస్మరించడం కూడా సమస్యను కలిగిస్తుంది. కేవలం ఏదో ఒకటి తింటున్నాము అనుకోకుండా పాలు, పెరుగు, పన్నీర్, ఆకుకూరలు, వివిధ రకాల గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరానికి అవసరమైన విభిన్న రకాల పోషకాలు అందాలంటే ఆహారంలో   వెరైటీగా  ఉండాలి. అవసరమైతే ఆహార నిపుణులను సంప్రదించి సరైన సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. ఆహారాలతో  పాటు ధూమపానం , మద్యం సేవించే అలవాట్లు కూడా ఎముకల బలాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యసనాలు శరీరంలో కొత్త ఎముకల తయారీని మందగించి, ఉన్న ఎముకలు వేగంగా బలహీనపడేలా చేస్తాయి. దీనివల్ల శరీరానికి అందే కాల్షియం పూర్తిగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ సమస్యలన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజూ కాసేపు నడక వంటి వ్యాయామాలు చేస్తూ, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                           *రూపశ్రీ.