ఏపీ సీఎం చంద్రబాబుపై.. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన  అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే   అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి తెలుగుదేశం శ్రేణులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కాగా తాను చంద్రబాబును దూషించలేదనీ, తనను అడ్డగించి దుర్భాషలాడుతున్న వారిపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశాననీ అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా.. తాను అలా మాట్లాడి ఉండకూడదని కూడా చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై   అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలుగుదేశం నాయకుల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఇలా ఉండగా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన  అంబటి రాంబాబు ఇంటిని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చి  అంబటి రాంబాబు నివాసం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న అంబటి కారును, ఆయన వ్యక్తిగత కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రాళ్లతో దాడి చేయడంతో ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ముక్కలయ్యాయి. అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఇక్కడి నుండి కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు.దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి తెలుగుదేశంశ్రేణులను నియంత్రించారు. మరో వైపు అంబటి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఫైర్ అయ్యారు.  మంత్రి పార్థసారథి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య అంబటి వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. తక్షణమే అంబటి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.   
తెలంగాణ మాజీ సఎం, బీఆర్ఎస్ అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా  ఆదివారం (ఫిబ్రవరి 1) భారీ స్థాయిలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.   తెలంగాణ  తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల  కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరి స్తున్న అప్రజాస్వామిక, రాజ కీయ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా  ఆందోళనకు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులకు   ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా  12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.  అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో  మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.   రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను రాజకీయంగా వేధిస్తోందని, ఆయనను అవమానించేలా అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.  కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు ప్రజలే తగిన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.  
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ను కలవరపాటుకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నోటీసు విషయంలో ఎలా స్పందించాలి? ఏం చేయాలి అన్న విషయంపై ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అగ్రనేతలు విస్తృతంగా చర్చించారు. కేసీఆర్ సిట్ ఎదుట హాజరు కావాలా? న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అన్న విషయంపై ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.   సిట్ జారీ చేసిన నోటీసులపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై పలు కోణాల్లో వీరు చర్చించారు.  ముఖ్యంగా సిట్ కేసీఆర్ వాంగ్మూలం రికార్డు చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ తన వాంగ్మూలాన్ని ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో  కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.  ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే స్టేట్మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేయాలా? లేక సిట్ పేర్కొన్న ప్రదేశానికి హాజరై విచారణకు సహకరించాలా? అనే అంశంపై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తున్నది. ఇప్పటికే  నంది నగర్ నివాసంలో స్టేట్మెంట్ రికార్డు చేస్తామనీ, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో స్టేట్మెంట్ రికార్డు చేయలేమని సిట్ అధికారులు తేల్చిచెప్పడంపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  సిట్ వైఖరిని చట్టపరంగా ప్రశ్నించాలా? లేదా సమయం కోరుతూ నోటీసులకు స్పందించాలా? అనే అంశాలపై చర్చ జరిగిందని తెలుస్తోంది.   పార్టీ నేతలంతా  భవిష్యత్ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సిట్ నోటీసులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  కోర్టును ఆశ్రయించే అవకాశాలపై కూడా వీరి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు.  ఈ నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ రాజకీయంగా కీలక కేంద్రంగా మారగా, పార్టీ అగ్రనేత తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ALSO ON TELUGUONE N E W S
Prabhas has accepted multiple big projects like Fauji, Spirit and Kalki 2. He is shooting for Fauji and Spirit but currently, he is also being asked to start Kalki 2 from March. According to the latest buzz, he is going to start Fauji from February and take a break from Spirit for upcoming three months.  The reports have stated that he finished his recent schedule on 31st January and he is going to join Fauji sets and then from March, he is going to start Kalki 2. While fans are excited about Spirit releasing for 5th March, Fauji has been scheduled for Dusshera 2026 release.  Now, even Kalki 2 has to be started fast and the makers have requested him to start working in this as well. Mythri Movie Makers are producing the film Fauji and they are hoping for the movie to become a huge blockbuster after The Raja Saab disaster. Hanu Raghavapudi is directing the film.  Director Nag Ashwin is starting Kalki 2 with Kamal Haasan and Amitabh Bachchan while Prabhas will also join sets. Sandeep Reddy Vanga will start the next schedule with Prabhas for Spirit from May and the actor will give continuous dates to the film after Fauji completion, it seems.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Rattatataav, the peppy second single from the upcoming entertainer Funky, is out now and already making waves with its infectious energy. Composed by Bheems Ceciroleo, the song perfectly captures his signature massy beats, elevated further by Ram Miriyala’s high-octane vocals and Dev Pawar’s relatable, fun-filled lyrics. Packed with rhythm and attitude, Rattatataav delivers an instant kick, making it a sure-shot repeat favourite. The song also stands out visually, with the crackling chemistry between Vishwak Sen and Kayadu Lohar adding a fresh and youthful vibe. Their natural screen presence, combined with vibrant visuals and energetic choreography, makes the track highly appealing to today’s youth. Every element from music to visuals comes together seamlessly, amplifying the song’s celebratory mood. Earlier, the first single “Dheere Dheere” emerged as a chartbuster melody, setting high expectations for the album. With Rattatataav continuing the momentum, the FUNKY album is shaping up to be a complete musical treat. Adding to the buzz, the film’s teaser has already struck a chord with audiences, promising non-stop comedy and laughter.   Director KV Anudeep returns to his trademark comic universe, aiming to deliver an even bigger, louder, and crazier cinematic experience with his quirky storytelling and infectious humour. Music director Bheems Ceciroleo once again proves his flair for foot-tapping compositions, infusing the narrative with vibrant rhythms and catchy tunes. The film is produced by Naga Vamsi S and Sai Soujanya under the banners of Sithara Entertainments, Fortune Four Cinemas, and Srikara Studios is presenting the film. With quirky characters, a refreshing lead pair, peppy music and a director celebrated for comic chaos, FUNKY is all set to deliver unlimited entertainment on the big screen. The film is scheduled for a theatrical release on February 13, 2026, making it a perfect entertainer for the Valentine’s Day weekend. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The Konidela and Kamineni households are currently bathed in celebration as Ram Charan and Upasana prepare for a historic new chapter on January 31, 2026. Anticipation for the arrival of twins has reached a peak, and to mark this momentous occasion, the couple shared an intimate family portrait that exudes serenity and poise. The image captures a quiet strength as they stand together, ready to embrace the "double dhamaka" that awaits them. The portrait features the duo in coordinated black attire, reflecting a sophisticated and unified presence. Upasana looks radiant in a flowing gown that highlights her maternal journey, while Charan stands beside her with a calm, reassuring demeanor. Adding a heartfelt layer to the frame are their two loyal black dogs, who have been a constant part of their family narrative, now standing by as the household prepares to expand once more. With widespread reports suggesting the birth of a baby boy and a baby girl, the sense of joy among fans and the film community is palpable. This arrival marks the transition of their family into a group of five, following the birth of their daughter, Klin Kaara, in 2023. As the clock ticks toward the delivery, this snapshot remains a beautiful testament to a couple navigating parenthood with elegance, welcoming two new lives with open arms and steady hearts. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి -రిలీజ్ ఎప్పుడు! -ఆసలు ఉంటుందా -విజయ్ మాటల్లో ఆంతర్యం ఏంటి ఇళయ దళపతి 'విజయ్'(Vijay)నట విశ్వరూపాన్ని చూడాలనే అభిమానుల ఆశలకి గండి కొడుతు జన నాయగన్(Jana Nayagan)రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలీజ్ ఎప్పుడు ఉంటుందో  తెలియని పరిస్థితి. అభిమానులు అయితే రిలీజ్ ప్రకటన  స్టిల్ ఈ నైట్ ప్రీమియర్స్ నుంచైనా ఉండాలని తమ ఇష్టదైవాల్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తమ ఆరాధ్య దైవం విజయ్ నుంచి జన నాయగన్ పై ఒక ప్రకటన వచ్చింది. మరి విజయ్ ఏం చెప్పాడో చూద్దాం.   ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో విజయ్ మాట్లాడుతు జన నాయగన్  రిలీజ్ ఆగడం చాలా బాధగా ఉంది ముఖ్యంగా నా నిర్మాతలని చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఇదంతా నా వల్లే. రాజకీయ రంగంలోకి రాక ముందే వీటన్నిటికీ సిద్ధపడ్డాను అని చెప్పుకొచ్చాడు. జన నాయగన్ రిలీజ్ ఆగిన విషయాలని ఒకసారి గమనిస్తే మూవీలో రాజకీయపరమైన డైలాగ్స్ ఎక్కువ మోతాదులో ఉండటం, రాజకీయ నాయకులని విమర్శించడంతో సెన్సార్ అభ్యంతరం చెప్పి సర్టిఫికెట్ ని ఇవ్వలేదు. దీంతో రిలీజ్ ఆగింది. Also read:  డైరెక్టర్ తేజ కి షాక్.. కిడ్నాప్ కేసులో భార్య, కొడుకు పై కేసు నమోదు అక్కడ్నుంచి సెన్సార్, నిర్మాతల మధ్య చెన్నై లోని మద్రాస్ హైకోర్ట్(పేరు ఇదే) లో కేసు నడుస్తుంది. నిర్మాతలు సుప్రీం కోర్ట్ ని కూడా ఆశ్రయించగా మద్రాస్ హైకోర్ట్ లోనే తేల్చుకోమని చెప్పింది.ఈ క్రమంలో  ఈ నెల 21 న వచ్చిన హియరింగ్ లో తీర్పుని రిజర్వు లో ఉంచుతున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.   
తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్దర్శకులుగా చెప్ప్పుకోదగినవారిలో సింగీతం శ్రీనివాసరావు  ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలు, మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక విధంగా సినిమాలు రూపొందించడంలో సింగీతం చేసినన్ని ప్రయోగాలు మరో డైరెక్టర్ చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు. 94 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ ఒక యువకుడిలా ఆలోచించే ఆయన.. తన మనసులోని భావాలను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేకతను చూపిస్తారు.  50 ఏళ్ళకు పైగా దర్శకుడుగా ఉన్న సింగీతం శ్రీనివాసరావుతో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. SSR61గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పర్యవేక్షిస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.  సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తోందంటే అది ఖచ్చితంగా విభిన్న కథాంశంతో, అంతకు మించిన వైవిధ్యంతో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈసారి ఆయన ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నందమూరి బాలకష్ణతో చేసిన ఆదిత్య 369 పెద్ద విజయం సాధించడమే కాకుండా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారని ఎంతోకాలంగా వినిపిస్తున్నమాట.  ఇప్ప్పుడు వైజయంతి మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ సింగీతంతో సినిమా చేయబోతోందీ అంటే ఆదిత్య 369కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. పాన్ ఇండియా మూవీస్, భారీ యాక్షన్ సినిమాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో సింగీతం శ్రీనివాసరావు వంటి లెజండరీ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తోందీ అంటే అది తప్పకుండా అందరి మనసుల్ని తాకే సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ చిత్రాలుగా చెప్ప్పుకునే మాయాబజార్ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో సింగీతం శ్రీనివాసరావు పనిచేశారు. సంగీతంలో కూడా ప్రవేశం ఉన్న సింగీతంకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అందుకే తన సినిమాల్లోని పాటలన్నీ ఎంతో మధురంగా ఉంటాయి. 1972లో నీతి నిజాయతీ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన సింగీతం.. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. చివరగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా 2013లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్న సింగీతం నుంచి మరో దశ్యకావ్యం వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో 94 ఏళ్ళ వయసులోనూ తన 61వ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్న ఏకైక దర్శకుడు సింగీతం. 
The legacy of Singeetham Srinivasa Rao is reaching a new milestone as the legendary filmmaker embarks on his 61st project, popularly referred to as SSR61. At 94 years of age, his dedication to the craft remains a source of immense inspiration for the entire film fraternity. This ambitious venture, produced under the prestigious Vyjayanthi Movies banner, showcases the veteran director's undiminished energy and his commitment to pushing the boundaries of storytelling once again. A recently released BTS video offers a heartwarming glimpse into the daily operations on the film's set. Singeetham Srinivasa Rao is seen actively leading the team, providing precise instructions and overseeing every creative detail with the eye of a true master. His enthusiasm is particularly evident in his interactions with music composer Devi Sri Prasad, as they brainstorm innovative styles for the film’s soundtrack. Despite his legendary status and decades of experience, he approaches each scene with the curiosity and passion of a young filmmaker, proving that age is no barrier to creativity.   The project also highlights a unique cross-generational collaboration with Nag Ashwin, who is supporting the veteran director as a producer. Having often cited Singeetham's work as a primary influence on his own filmmaking style, Nag Ashwin’s involvement adds a layer of deep respect to the production. Inside reports state that the legend is doing a creative supervision while a young director is directing the film.  Well, the film is being crafted with meticulous care, focusing on a fresh narrative that is expected to resonate with modern audiences. As the shoot progresses at a steady pace, the industry watches with great anticipation to see the latest offering from a man who has consistently redefined the landscape of Indian cinema. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -సినీ వర్గాల్లో కలకలం -ఎందుకు తేజ భార్య, కొడుకు పై కేసు  -దీని వెనక కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా! -అసలు కేసు ఏంటి! తెలుగు సినిమాకి సరికొత్త ప్రేమ కథ చిత్రాలని అందించిన మేకర్ లో తేజ(Teja)కూడా ఒకరు. నేనే రాజు నేనే మంత్రి తో తనలో ఇంకో జోనర్ ఉందని నిరూపించాడు. రీసెంట్ గా తేజ భార్య ప్రణతి, కుమారుడు అమితోవ్ తేజ(Amitov Teja)పై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసారు. మరి ఆ కేసు డీటెయిల్స్ ఏంటో చూద్దాం.   మోతీనగర్‌ కి చెందిన ప్రణీత్ బ్యాంకు క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ విభాగంలో పనిచేస్తున్నాడు. క్రెడిట్ కార్డు అప్లికేషన్ విషయంలో గత సంవత్సరం అమితోవ్ తో ప్రణీత్‌ కి పరిచయమయ్యింది.ఆ తరువాత అమితోవ్, ప్రణీత్, అతని భార్య ముగ్గురు కలిసి షేర్ మార్కెట్‌ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ ప్రారంభించారు. తేజ తరఫున ప్రణీత్ ట్రేడింగ్ చేయగా దాదాపుగా 11 లక్షల నష్టం వచ్చింది.ఈ విషయం మొత్తం వ్యవహారంపై జూబ్లీ హిల్స్ పోలీసులకి  ప్రణీత్ ఫిర్యాదు చేస్తూ  నష్టాన్ని భర్తీ చేసేందుకు మరింత డబ్బు పెట్టాలని అమితోవ్ ఒత్తిడి తెచ్చాడు.   అందుకు నిరాకరించడంతో అమితోవ్ తల్లి, అనుచరులు కొంతమంది నన్ను అక్రమంగా నిర్బంధించి ఖాళీ పేపర్లు, చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. నా భార్యతో ఆస్తి కాగితాలపై కూడా సంతకాలు చేయించుకున్నారని ప్రణీత్ జూబ్లీ హిల్స్ పోలీసులకి  ఫిర్యాదు చేసాడు. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో నాంపల్లి కోర్టుని ఆశ్రయించి సదరు విషయాలన్నీ చెప్పడం జరిగింది. Also read:  ఓటిటి లోకి వచ్చేస్తున్నా.. డేట్ ఇదే !   ఈ విషయాన్ని పరిశీలించిన కోర్టు,అమితోవ్ అనుచరులు, తల్లిపై  కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులకి  ఆదేశాలు జారీ చేసింది.ఇక ఇదే వ్యవహారంలో పెట్టుబడి పేరిట ప్రణీత్, అతని భార్య 72 లక్షలు మోసం చేశారని అమితోవ్ సైతం ఇప్పటికే పోలీసులకి  ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అమితోవ్ తన తండ్రి దర్శకత్వంలోనే  హీరోగా ఎంట్రీ  ఇవ్వడానికి  సిద్దమవుతున్నాడు.    
ప్రతి వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ సంఖ్య ఎక్కువ. ఈమధ్యకాలంలో థియేటర్స్‌లో విడుదలైన కొన్ని రోజులకే భారీ సినిమాలు సైతం ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే కంటే ఓటీటీలో చూడడం బెటర్ అనే అభిప్రాయంతో ఉంటున్నారు. అందుకే ఓటీటీకి ఈ మధ్యకాలంలో మంచి క్రేజ్ వచ్చింది. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల కోసం ఎంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తారో అలాగే ఓటీటీల్లోని సినిమాల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.  ఈవారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు దాదాపు 30 వరకు ఉన్నాయి. అయితే అందులో ఆడియన్స్‌ని థ్రిల్ చేసే, ఎంటర్‌టైన్ చేసే సినిమాలు ఎక్కువ శాతం ఉన్నట్టు కనిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన రణవీర్ సింగ్ కొత్త సినిమా ‘దురంధర్‌’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 1350 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఇప్ప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.  భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దల్ దల్‌’. అమిత్‌రాజ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో హిందీతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. నివిన్ పౌలీ కీలక పాత్రలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ వేదికగా మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రోషన్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘ఛాంపియన్‌’. డిసెంబరులో థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటుతో ఉంది. కార్తి, కృతిశెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్‌’ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళ్‌లో విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్ప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమాను చూడొచ్చు. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్‌’ ఈటీవీ విన్‌లోకి వచ్చేసింది. ఆర్యన్ సుభాస్ ఎస్కే తెరకెక్కించిన ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, ఇండోనేషియన్, కన్నడ భాషలకు చెందిన దాదాపు 30 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇప్ప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం పండగనే చెప్పాలి.
  -థియేటర్స్ లో ఇంకా తగ్గని మన శంకర వరప్రసాద్ జోరు  -మరి ఓటిటి అప్ డేట్ ఏంటి! -ఈ డేట్ కి ఓకే అయ్యిందా! -జీ 5 నుంచి అధికార ప్రకటన రానుందా!   ఇక ఏ సంవత్సరం అయినా సంక్రాంతి రానివ్వండి. 2026 సంక్రాంతిని మాత్రం మెగా, విక్టరీ,అనిల్ రావిపూడి అభిమానులు,తెలుగు సినిమా ప్రేమికులు మర్చిపోలేరు. అంతలా మన శంకర వరప్రసాద్ గారు తన మాయాజాలంతో మెస్మరైజ్ చేసాడు. అచ్చ తెలుగువంటకాలతో భోజనం చేసి సుమారు సంవత్సరం అవుతున్న వ్యక్తికి  ఆహ్లాదకరమైన వాతావరణంలో అరిటాకు వేసి కమ్మని తెలుగు వంటకాలతో విత్ నెయ్యి, గడ్డ పెరుగుతో  భోజనం పెడితే ఎంతటి పరమానందాన్ని పొందుతాడో,మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara varaprasad Garu)చూసిన ప్రేక్షకుడు కూడా అంతే ఆనందపడుతున్నాడు. అందుకే సదరు ప్రేక్షకుడు మూడో వారం కూడా నిండకుండానే 350 కోట్ల గ్రాస్ దాకా కట్టబెట్టాడు.    ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు తెలుగు ప్రేక్షకుడికి మరింత దగ్గరయ్యేలా ఓటిటి వేదికగా రావడానికి ముస్తాబు అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ఫిబ్రవరి 11 నుంచి  స్ట్రీమింగ్ కానున్నట్టుగా సినీ సర్కిల్స్ టాక్. ఓటిటి  రైట్స్‌ని పొందిన z5  నుంచి అధికార ప్రకటన కూడా రెండు మూడు రోజుల్లో రావచ్చని అంటున్నారు. అయితే  తెలుగుతో పాటు ఇతర భాషల్లోను డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారనే టాక్ కూడా ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతుంది.   Also read:  కాంతార చాప్టర్ 1 మేకర్స్ తో మారుతి మూవీ !.. అణువిస్ఫోటనం పక్కా మరి థియేటర్స్ లో రఫ్ఫాడిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ఓటిటి లో రఫ్ఫాడించడం ఖాయం. ఈ నేపథ్యంలో ఓటిటి హిస్టరీ లో తన రికార్డుని ఏమేర ఉంచుకోబోతాడో చూడాలి. ప్రస్తుతానికి అయితే థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ నే రాబడుతుంది.    
The teaser of the upcoming film Amaravathiki Aahwanam was officially launched in Hyderabad by distinguished actor and producer Murali Mohan Garu, receiving an enthusiastic response from the film fraternity. The movie is set for a grand worldwide theatrical release on February 13th.   Produced by K Shankar Rao and R. Venkateswara Rao under the banner of Light House Cine Magic, the film is presented by G. Rambabu Yadav with production supervision by veteran producer Muppa Venkaiah Chowdary.   Directed by GVK, the film features Siva Kantamneni, Dhanya Balakrishna, Esther, Supritha, and Harish in lead roles, supported by senior actors Ashok Kumar, Bhadram, Gemini Suresh, and Nagendra Prasad in pivotal roles.  At the event, Ashok Kumar Said: “I acted in this film at the request of Producer Venkateswara Rao, my brother-in-law. Watching the final output, I feel the content is very strong. Director GVK has crafted a film that resonates with audiences across all sections. Gemini Suresh Said: “For the first time, I portrayed the role of a madman. Family dramas, entertainers, and horror films always connect with audiences, and I believe our film will too. Producer Prasanna Kumar Said: “The teaser is impressive. This film will certainly entertain audiences. My best wishes to the team.   Murali Mohan Garu Said: “The teaser itself evokes fear, showcasing the director’s talent. Small films are the lifeblood of the industry, and this one carries strong content. I wish the film great success. Producer Venkateswara Rao Said: Cinema has been our passion for over 30 years. This is our sixth production, made in the horror genre to appeal to all. We are confident audiences will support us during the grand release on February 13th. Esther (Lead Actress) Said: While shooting, we all felt like a family. The director’s passion and the producers’ commitment will surely bring success. The film blends horror with commercial elements that audiences will enjoy. Director GVK Said: “This project began with the encouragement of Producer Shankar Rao. Despite minor delays in VFX, the film was completed within budget and schedule. We are confident that audiences will appreciate the strong content. Hero Siva Kantamaneni Said: Director GVK completed the film on time and within budget. Esther, Dhanya, and Supritha shine in ghost roles, with Esther’s performance being a highlight. We hope our film finds success alongside other February releases. Event Attendees The teaser launch event of Amaravathiki Aahwanam witnessed the presence of several key members of the film’s technical and production team, adding to the grandeur of the occasion. Their participation highlighted the collaborative spirit behind the film and underscored the strong technical and creative foundation of the project. Release Date Amaravathiki Aahwanam will release worldwide on February 13th, promising audiences a gripping cinematic experience that combines horror with engaging commercial elements. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది. తల్లితండ్రులతో మొదలు..  పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు. వివేచనతో అనుకరణ ఉండాలి.. మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..  మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే.. "ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.                                  *నిశ్శబ్ద.
  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.
విజయం ప్రతి మనిషి జీవితంలో ఒక కలలా ఉంటుంది. దాన్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు.  చిన్న పిల్లల నుండి పెద్దల వరకు.. ఏదో ఒక విషయంలో విజయం సాధించాలని శ్రమిస్తూ  ఉంటారు.  అయితే.. కొందరు లక్ష్యాన్ని సాధిస్తారు,  మరికొందరు  విఫలం అవుతారు. నేను చాలా కష్టపడ్డాను, కానీ విజయం సాధించలేకపోయాను అని కొందరు అంటూ ఉంటారు.  అయితే విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు.. దానికి మరికొన్ని కూడా తోడవ్వాలి. చాలామంది కష్టపడి, దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ విజయం కోసం కష్టంతో పాటు మరికొన్ని చాలా ముఖ్యం.  అవేంటో తెలుసుకుంటే.. ఈసారి విజయం అంతు చూడొచ్చు.. తప్పు.. విజయం సాధించడానికి కష్టపడటం మంచి లక్షణమే అయినా,  కొందరు పైకి కష్టపడుతూ మరొకవైపు విజయం కోసం తప్పు చేస్తారు, అబద్దాలు చెప్తారు. అబద్దాన్ని ఆశ్రయించి విజయం సాధించాలని అనుకోవడం చాలా తప్పు.  అబద్దం వల్ల అప్పటికప్పుడు విజయం లభిస్తుందేమో కానీ.. దాని ప్రబావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ సరైన దారిలోనే విజయం కోసం ప్రయత్నించాలి. అహంకారం.. జీవితంలో ఏం సాధించినా,  ఎంత తెలివైన వ్యక్తి అయినా ఎప్పుడూ గర్వపడకూడదు.  అది ఒక వ్యక్తిని విజయవంతమైన వ్యక్తి అనే స్థాయి నుండి లాగి పడేస్తుంది.  ఎంత తెలివైన వ్యక్తికి అయినా ఫెయిల్యూర్ రుచి చూపించేది అహంకారమే.. అందుకే ఎట్టి పరిస్థితులలో ఎంత తెలిసినా,  ఎంత ఎదిగినా అహంకారం చూపించకూడదు. సోమరితనం.. విజయానికి అతిపెద్ద శత్రువు సోమరితనం. సోమరితనం ఉన్న వ్యక్తి విజయం వైపు  చురుగ్గా వెళ్లలేడు.  ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా,  ఎన్ని అవకాశాలు ఉన్నా.. అవి ఎక్కడికి పోవులే అనే నిర్లక్ష్యంతో ఉంటారు సోమరిపోతులు. అంతేకాదు.. సోమరిపోతులు ఏ పనిని మొదలు పెట్టినా దానిని సరిగా పూర్తీ చేయలేరు.  ఫలితంగా ఎప్పటికీ ఫెయిల్యూర్ సర్కిల్ లోనే ఉండిపోతారు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం,  ఆరోగ్యకరమైన జీవనశైలి, అన్నింటికంటే ముఖ్యంగా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి.  క్రమశిక్షణ ఉన్నప్పుడు జీవితంలో అన్ని ఒక ప్రణాళికలో జరిగిపోతూ విజయానికి దగ్గర చేస్తాయి. కోపం.. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఎప్పుడో చెప్పారు.  కోపంగా ఉన్నవారు.. వారు చేసే ప్రయత్నాలలో విఫలం అవుతూ ఉంటారు.  వారి కోపమే వారిని దెబ్బతీస్తూ ఉంటుంది. కోపంలో తీసుకునే నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి.  ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల మనిషి జీవితంలో తన సామర్థ్యాన్ని సరైన విధంగా వినియోగించుకోగలడు. అందుకే కోపాన్ని దూరంగా ఉంచాలి, కోపం వచ్చినప్పుడు నా శత్రువు దగ్గరకు వచ్చింది దానికి దూరంగా ఉండాలి అనుకోవాలి.  ఇది మనిషిని ప్రశాంత జీవనం వైపు నడిపిస్తుంది. దైవం.. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ప్రశాంతత లభించేది దైవ ఆరాధన వల్లే.. జీవితంలో విజయం సాధించాలంటే  సరస్వతి దేవి కృప,  వినాయకుడి అనుగ్రహం ఉండాలి.  వీరిద్దరి అనుగ్రహం ఉన్న వ్యక్తి ఎలాంటి పరిస్థితి అయినా తెలివిగా అధిగమించగలరు.   ప్రతిరోజూ సరస్వతి,  గణేషుడి ఆరాధన,   కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం వల్ల కోపాన్ని అధిగమించవచ్చు.                                *రూపశ్రీ.
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం,  ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు.  అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మూత్రం లీకేజి ఇందుకే.. వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం,  పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్  బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు   వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు మరో కారణం  ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా,  వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి,  మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి.. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి.  పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు,  కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి.  ఆహారంలో ప్రోటీన్‌ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా  కెగెల్ వ్యాయామాలు చేయాలి.  సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.   ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ  ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో  సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి  కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల  డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం  వల్ల డీహైడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి  కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా?  నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..  రోజుకు కచ్చితంగా ఇంత  నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా  వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు  గర్భంతో ఉండటం  లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం  వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన  నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి.  నీరు ఎక్కువగా తాగుతుంటే  వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల  మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా  శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే  కణాల లోపల నీరు చేరుతుంది.  ఇది శరీరం  వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా  లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు  మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు  ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి.  దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి.   ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా  అపానవాయువు, వికారం వంటి  సమస్యలు ఎదురవుతాయి.                                                                               *నిశ్శబ్ద.
అనారోగ్యాలను నిర్థారించడానికి మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. కొందరికి మూత్రం చాలా పసుపు రంగులో వస్తుంది. మరికొందరికి లేత పసుపు రంగులో ఉంటుంది. ఇంకొందరికి కేవలం నీరు ఎలా ఉంటుందో అలా మూత్రం వస్తుంది.  అయితే కొందరు మూత్రంలో నురుగు గమనిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు కనిపించడం.. మూత్ర విసర్జన చేసిన కొన్ని సెకెన్లలోపు ఆ నురుగు క్లియర్ అయిపోతే అది ఆరోగ్యానికి ఏం చేయదు. కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం లో నురుగు  అలాగే ఉంటున్నట్టేతే దాన్ని లైట్ తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు. ఇంతకూ మూత్రంలో నురగ కనిపిస్తే కలిగే ప్రమాదం ఏంటి?  తెలుసుకుంటే.. మూత్రపిండాల వైఫల్యం.. నురుగుతో కూడిన మూత్రం   మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తుందని చెప్పలేం. కానీ ఇది ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. కొన్నిసార్లు శరీరంలో తేమ తక్కువ ఉండి శరీరం డీహేడ్రేషన్ కు లోనవ్వడం లేదా అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా మూత్రం  బలంగా ప్రవాహించడం వల్ల  తాత్కాలికంగా నురుగుగా మారుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని సీరియస్ గా  పరిగణించాలి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువకాలం నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటానికి సంకేతం కావచ్చని అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు.. కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళు,  ముఖం వాపు, అలసట,  బలహీనత, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం ఉండటం  లేదా దుర్వాసనతో కూడిన మూత్రం విసర్జించడం.  శ్వాస ఆడకపోవడం, చర్మం దురద, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో నురుగు ఉంటే ఈ వ్యాధులు కూడా ఉండవచ్చు.. నురుగు మూత్రం తరచుగా మూత్రపిండాల సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.  అధిక నురుగు మధుమేహం,  అధిక రక్తపోటును  సూచిస్తుంది. గుండె సమస్యలు, గర్భం, ఒత్తిడి,  మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా అధిక నురుగు మూత్రానికి కారణమవుతాయి. తీవ్రమైన అనారోగ్యానికి మొదటి సంకేతం మూత్రంలోనే తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. నురుగు మూత్రం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, బలమైన వాసన,  మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...