కేసీఆర్ పై రాజకీయ వేధింపులు.. రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

posted on: Jan 31, 2026 4:37PM

తెలంగాణ మాజీ సఎం, బీఆర్ఎస్ అధినేత  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా  ఆదివారం (ఫిబ్రవరి 1) భారీ స్థాయిలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. 

 తెలంగాణ  తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల  కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరి స్తున్న అప్రజాస్వామిక, రాజ కీయ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా  ఆందోళనకు పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేణులకు   ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా  12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.  అలాగే నియోజకవర్గ కేంద్రాలు, మునిసిపాలిటీలలో  మోటార్‌సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని నిర్ణయించారు.  

రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను రాజకీయంగా వేధిస్తోందని, ఆయనను అవమానించేలా అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు.  కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు ప్రజలే తగిన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...