మూత్రంలో నురుగు ఎక్కువ  కనిపిస్తోందా? ఈ నిజాలు తెలుసుకోండి..!

posted on: Jan 29, 2026 1:45PM


అనారోగ్యాలను నిర్థారించడానికి మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. కొందరికి మూత్రం చాలా పసుపు రంగులో వస్తుంది. మరికొందరికి లేత పసుపు రంగులో ఉంటుంది. ఇంకొందరికి కేవలం నీరు ఎలా ఉంటుందో అలా మూత్రం వస్తుంది.  అయితే కొందరు మూత్రంలో నురుగు గమనిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు కనిపించడం.. మూత్ర విసర్జన చేసిన కొన్ని సెకెన్లలోపు ఆ నురుగు క్లియర్ అయిపోతే అది ఆరోగ్యానికి ఏం చేయదు. కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం లో నురుగు  అలాగే ఉంటున్నట్టేతే దాన్ని లైట్ తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు. ఇంతకూ మూత్రంలో నురగ కనిపిస్తే కలిగే ప్రమాదం ఏంటి?  తెలుసుకుంటే..

మూత్రపిండాల వైఫల్యం..

నురుగుతో కూడిన మూత్రం   మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తుందని చెప్పలేం. కానీ ఇది ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. కొన్నిసార్లు శరీరంలో తేమ తక్కువ ఉండి శరీరం డీహేడ్రేషన్ కు లోనవ్వడం లేదా అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా మూత్రం  బలంగా ప్రవాహించడం వల్ల  తాత్కాలికంగా నురుగుగా మారుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని సీరియస్ గా  పరిగణించాలి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువకాలం నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటానికి సంకేతం కావచ్చని అంటున్నారు.

కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు..

కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళు,  ముఖం వాపు, అలసట,  బలహీనత, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం ఉండటం  లేదా దుర్వాసనతో కూడిన మూత్రం విసర్జించడం.  శ్వాస ఆడకపోవడం, చర్మం దురద, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి.

మూత్రంలో నురుగు ఉంటే ఈ వ్యాధులు కూడా ఉండవచ్చు..

నురుగు మూత్రం తరచుగా మూత్రపిండాల సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.  అధిక నురుగు మధుమేహం,  అధిక రక్తపోటును  సూచిస్తుంది. గుండె సమస్యలు, గర్భం, ఒత్తిడి,  మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా అధిక నురుగు మూత్రానికి కారణమవుతాయి.

తీవ్రమైన అనారోగ్యానికి మొదటి సంకేతం మూత్రంలోనే తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. నురుగు మూత్రం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, బలమైన వాసన,  మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

                             *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

google-ad-img
    Related Sigment News
    • Loading...