తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు. చెన్నై ఎందుకు వెనుకబడింది?: తమిళ ఓటర్లకు చంద్రబాబు సూటి ప్రశ్న. ప్రధాని మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష.. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ ప్రజలను కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన చెన్నైలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ప్రజలు మార్పును కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రగతి కోసం సుదూర లక్ష్యాలతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతమైన పాలన అందించే శక్తి కేవలం ఎన్డీయేకు మాత్రమే ఉందని, రాష్ట్రం ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వృద్ధి చెందాలంటే సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన నొక్కి చెప్పారు. చెన్నై నగరంపై తనదైన శైలిలో విశ్లేషణ చేసిన సీఎం చంద్రబాబు, ఒకప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నగరం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు వెనుకబడిందనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, ఐటీ రంగాలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చెన్నైలో మందగించాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలు పెట్టుబడులను ఆకర్షిస్తూ, వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని, కానీ చెన్నై ఆ పోటీలో వెనకపడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని విమానాశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మారుతున్న కాలానికి అనుగుణంగా చెన్నైకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సమర్థమైన పాలన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, తమిళనాడు మళ్లీ అగ్రపథంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, తమిళనాడు అభివృద్ధిపై చర్చ చేయడం, ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపునివ్వడంపై వివిధ వర్గాల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడు ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ..  ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.  అయితే..  ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా..  అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు   అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా  హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే..  పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది.  ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే..  అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన  జియోపాలిటికల్ జూదం  (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా..  తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై   అపనమ్మకమే   కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను  బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా  డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక  ఉపయోగకరమైన  వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన  ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్  గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.  అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు,  పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం,  మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.  శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు.    ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా..  దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి. -సీతారాం కంఠంనేని
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ  అన్నారు.  దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న  తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.    అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ..  ఆ విషయాన్ని   తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ..  చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.
ALSO ON TELUGUONE N E W S
The increasing acceptance of Malayalam cinema in the Telugu states is paving the way for more dubbed releases. The latest to join this trend is Vaala 2, the Telugu version of the Malayalam film Vaazha 2, which is scheduled to hit theaters on April 24. Directed by Savin SA and written by Vipin Das, the film's recent pre-release event focused heavily on the emotional and relatable core of the story. Producer Sahu Garapati, who is backing the Telugu release, shared a candid observation during the event. He stated that the film's climax is strong enough to transcend language barriers entirely. Recalling his own experience of watching the movie without subtitles, Sahu admitted that the emotional weight of the final scenes moved him to tears. This universal emotional connection was the primary reason he decided to bring the project to the Telugu audience. Actor Teja Sajja, who attended the event as a guest, pointed out the infectious energy visible in the film’s promotional material. He emphasized how the narrative relies heavily on themes of friendship and brotherhood rather than standard commercial tropes. Taking a moment to appreciate the local viewers, he noted that the Telugu audience consistently provides unmatched support and love for good content, regardless of the language.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
వెండితెరపై మెరిసే రంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా 'కాస్టింగ్ కౌచ్' అనే పదం ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు తాను స్వయంగా కళ్లారా చూసిన ఓ భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ జేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. తాను కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు చేస్తున్న సమయంలో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ను వివరించారు. అప్పట్లో ఒక టాప్ హీరోయిన్ తనకు, మరో నటుడు సురేష్‌కు మంచి స్నేహితురాలు. ఒకరోజు ఆమె మమ్మల్ని తన గెస్ట్ హౌస్‌కు భోజనానికి ఆహ్వానించింది. ముగ్గురం కలిసి సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో అనుకోకుండా ఎవరో డోర్ కొట్టారు. బయట ఉన్న వ్యక్తిని చూడగానే ఆ హీరోయిన్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. భయంతో వణికిపోతూ ఎలాగైనా కాపాడమని మమ్మల్ని వెంటనే మంచం కింద దాక్కోమని ప్రాధేయపడింది. వేరే దారి లేక జేడీ చక్రవర్తి, సురేష్ ఇద్దరూ మంచం కింద దాక్కున్నారు. లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి వారు షాక్‌కు గురయ్యారు. వయసులో ఆ హీరోయిన్‌కు తాత అంత ఉండే ఓ ముసలి నిర్మాత అక్కడికి వచ్చాడు. కనీసం సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి, ఆ హీరోయిన్‌తో ప్రవర్తించిన తీరు అత్యంత అసభ్యకరంగా ఉందని జేడీ ఆవేదన వ్యక్తం చేశారు. మంచం కింద ఉన్న తమకు పైన జరుగుతున్న సంభాషణలు విని ఒళ్లు గగుర్పొడిచిందని, ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి పరిస్థితుల్లో ఉందా అని ఆశ్చర్యపోయామని ఆయన తెలిపారు. ఆ నిర్మాత వెళ్లిన తర్వాత మంచం కింద నుంచి బయటకు వచ్చిన జేడీ, సురేష్‌ల‌ కళ్లలో నీళ్లు తిరిగాయట. కానీ ఆ హీరోయిన్ మాత్రం ఏమీ ఎరగనట్టుగా నవ్వుతూ కనిపించింది. "వాడు ముసలోడు.. వాడి దగ్గర భరించలేని వాసన వస్తుంది. కానీ ఏం చేస్తాం? వాడు పెద్ద ప్రొడ్యూసర్. ఈ ఫీల్డ్ లో కొనసాగాలంటే ఇలాంటివి భరించక తప్పదు" అని ఆమె నవ్వుతూనే తన బాధను వెళ్లగక్కిందని జేడీ గుర్తు చేసుకున్నారు. అవకాశాల కోసం, కెరీర్ కోసం ఇష్టం లేకపోయినా ఇలాంటి దారుణాలను భరించాల్సి వస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు. రామ్‌గోపాల్‌వ‌ర్మ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, 'శివ' సినిమాతో సంచలనం సృష్టించిన జేడీ, ఇప్పటికీ తనదైన శైలిలో సినిమాలు చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇండస్ట్రీలోని పలు సున్నితమైన అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం జేడీ చక్రవర్తి పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేసిన ఈ లేటెస్ట్ కామెంట్స్ ఇండస్ట్రీలో ఉండే పవర్‌ఫుల్ వ్యక్తుల ఆగడాలను మరోసారి ఎత్తిచూపాయి. మరి ఈ వివాదంపై ఇతర సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు మారాలని, మహిళా నటీమణులకు రక్షణ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఇప్పుడు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను మెప్పిస్తున్న సిద్ధూ, తాజాగా ఒక క్రేజీ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  'తొలిప్రేమ', 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి విజయవంతమైన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇటీవల వెండితెరపై ఎమోషనల్ కథలను హ్యాండిల్ చేస్తున్నవెంకీ, తొలిసారి ఓటీటీ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిద్ధూ ఎనర్జీకి, వెంకీ అట్లూరి మేకింగ్ స్టైల్ తోడైతే ఈ సిరీస్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో సిద్ధూ సరసన యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించనుంది. ఇప్పటికే పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మీనాక్షి, ఈ ప్రాజెక్టుతో డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతోంది. సిద్ధూ, మీనాక్షి, దర్శకుడు వెంకీ అట్లూరి.. ఈ ముగ్గురికీ ఇది తొలి వెబ్ సిరీస్ (Digital Debut) కావడం విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్ ఈ సిరీస్ పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఈ భారీ సిరీస్‌ను నిర్మిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సిరీస్‌ను ఒరిజినల్ కంటెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ చేయనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.  సిద్ధూ జొన్నలగడ్డ టైమింగ్, మీనాక్షి చౌదరి గ్లామర్, వెంకీ అట్లూరి డైరెక్షన్.. ఈ కలయిక ఓటీటీ ప్రియులకు ఒక మంచి ట్రీట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ తెరకెక్కిస్తున్న వెంకీ అట్లూరి.. ఆ తర్వాత ఈ సిరీస్ ను పట్టాలెక్కించనున్నట్లు వినికిడి.  
‘వాల్తేరు వీరయ్య’తో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘Mega 158’ (వర్కింగ్ టైటిల్) ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కాకాజీ’గా మెగాస్టార్ ఈ సినిమాకు ‘కాకాజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో చిరంజీవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, అందుకే ఈ వెరైటీ టైటిల్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే టైటిల్ వినిపించినప్పటికీ, ఇప్పుడు దాదాపు ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ టైటిల్ ఉంటుందని బాబీ భావిస్తున్నారట. బాలీవుడ్ స్టార్ ఎంట్రీ? ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏంటంటే.. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ కపూర్ ఇప్పటికే ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నటిస్తుండగా, ఇప్పుడు చిరు సినిమాలోనూ భాగం కాబోతుండటం విశేషం. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. అంతేకాకుండా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, విలక్షణ నటుడు అనురాగ్ కశ్యప్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కూతురి పాత్రలో ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ సారా అర్జున్ నటించనున్నట్లు టాక్. ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ స్టార్ట్! ఈ భారీ ప్రాజెక్టును ఏప్రిల్ 11న గ్రాండ్ లాంచ్ చేయగా, ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవిలోని మాస్ యాంగిల్‌ను పర్ఫెక్ట్‌గా చూపించిన బాబీ.. ఈసారి అంతకు మించిన యాక్షన్, బలమైన ఎమోషన్స్‌తో ‘కాకాజీ’ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్, ఇతర నటీనటుల వివరాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan),  డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్, చరణ్ రెమ్యునరేషన్ కి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలుగులోకి వచ్చాయి. రికార్డు రెమ్యునరేషన్! టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ రూ. 120 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్‌లోనే ఇది అత్యధిక రెమ్యునరేషన్ కావడం విశేషం. దీనితో ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ల సరసన వంద కోట్ల క్లబ్ హీరోల జాబితాలో చరణ్ కూడా చేరారు. ఈ సినిమాకి సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. షూటింగ్ ముగింపు.. గ్రాండ్ రిలీజ్ ఫిక్స్! 'పెద్ది' షూటింగ్ కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ ను మూవీ టీమ్ అధికారికంగా పంచుకుంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం మరో 6 రోజుల్లో మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా సెట్ లో రామ్ చరణ్, బుచ్చిబాబు దిగిన ఫోటోలను షేర్ చేశారు మేకర్స్. పెద్ది టాకీ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్యాచ్ వర్క్ తో పాటు, స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుందట. స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ రేపు(ఏప్రిల్ 22) స్టార్ట్ అవుతుందని వినికిడి. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్‌లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ, అవుట్‌పుట్ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందుకే ఈ చిత్రాన్ని జూన్ నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.  పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.   https://x.com/vriddhicinemas/status/2046553966218195327
"చదువుకోవడానికి వయసుతో పనిలేదుష అనే మాట మ‌నం త‌ర‌చూ వింటూ ఉంటాం. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రాన్స్. 68 ఏళ్ల వయసులో ఆయన ఏడో తరగతి పరీక్షలు రాసి, వార్తల్లో నిలవడమే కాకుండా కొన్ని వేల మందికి కొత్త ఆశను కల్పించారు. చదువుపై ఆయనకున్న మక్కువ, పట్టుదల ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. కేరళకు చెందిన ఇంద్రాన్స్ అసలు పేరు సురేంద్రన్ కొచ్చూవేలు. ఆయన బాల్యం అంత సులభంగా సాగలేదు. తీవ్రమైన పేదరికం కారణంగా ఆయన తన చదువును కేవలం నాలుగో తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడం కోసం కుట్టుపనిని వృత్తిగా ఎంచుకుని, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, అద్భుతమైన నటుడిగా ఎదిగారు. న‌టుడిగా 45 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకొని ఇప్ప‌టికీ సినిమాలు చేస్తున్న ఇంద్రాన్ త‌న కెరీర్‌లో 550 సినిమాల్లో వివిధ పాత్ర‌లు పోషించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, తన మనసులో ఎక్కడో ఒక మూల చదువు మధ్యలో ఆగిపోయిందనే అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఆ వెలితిని పూడ్చుకోవడానికి ఆయన వృద్ధాప్యంలో మళ్లీ పుస్తకాలు పట్టారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న "అక్షరాస్యత మిషన్" పథకం ద్వారా ఇంద్రాన్స్ తన విద్యాభ్యాసాన్ని పునఃప్రారంభించారు. తిరువనంతపురంలోని అట్టక్కులంగర ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఆయన ఏడో తరగతి సమానత్వ పరీక్షలకు హాజరయ్యారు. మలయాళం, ఇంగ్లీష్, హిందీ, సామాజిక శాస్త్రం, గణితం వంటి సబ్జెక్టుల్లో ఆయన పరీక్షలు రాశారు. సామాన్య విద్యార్థిలాగే బెంచీపై కూర్చుని పరీక్ష రాస్తున్న ఆయనను చూసి తోటి అభ్యర్థులు, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. ఏడో తరగతితోనే ఆయన ఆగడం లేదు. తనకు ఆరోగ్యం సహకరిస్తే, వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు కూడా రాస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే తాను ఈ ప్రయత్నం చేస్తున్నానని ఆయన వినమ్రంగా చెబుతున్నారు. "చదువుకోవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. కానీ పని ఒత్తిడి, సమయం లేకపోవడం వల్ల కుదరలేదు. ఇప్పుడు అక్షరాస్యత మిషన్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాను అంటున్నారు" ఇంద్రాన్స్‌.
Ram Charan has resumed shooting for his upcoming rural sports drama, Peddi, directed by Buchi Babu Sana. The actor recently shared a couple of pictures from the location on social media, featuring himself alongside the director. The production is currently in its final schedule, with principal photography expected to officially wrap up in six days. In the shared selfies, Ram Charan is seen sporting a rugged look with a thick beard, long hair, and sunglasses, which heavily aligns with the rural aesthetic of the film. He is dressed in a casual striped shirt, while Buchi Babu Sana is seen standing and smiling in the background. The film has been in active production for several months. Recently, the makers confirmed that Peddi will hit theaters in June 2026, a move intended to allow ample time for extensive post-production work.  With the final shooting schedule nearing completion next week, the team will soon transition entirely into the editing and dubbing phases. The conclusion of this extensive shoot marks a major milestone for the project as it prepares for its theatrical release next year. Janhvi Kapoor is playing leading lady role in this Venkata Satish Kilaru production.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage view
- కన్నీరు తుడిచిన కండల వీరుడు - ఆ తల్లికి కొండంత అండగా సోనూసూద్ - సోనూసూద్ ఫౌండేషన్ అద్భుతం చేసింది! వెండితెరపై విలన్‌గా మెప్పించే నటులు నిజజీవితంలో కూడా అదే స్థాయిలో క్రూరంగా ఉంటారని కొందరు భావిస్తారు. కానీ, తన నటనతో విలనిజాన్ని పండించి, తన వ్యక్తిత్వంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఏకైక నటుడు సోనూసూద్. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా వలస కూలీలకు అండగా నిలిచి 'మనుషుల్లో దేవుడు' అనిపించుకున్న సోనూ, తాజాగా మరోసారి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. చావు అంచుల్లో ఉన్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబంలో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళ్తే.. 'నీరా' అనే చిన్నారి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. ఆ బిడ్డను బ్ర‌తికించుకోవడానికి ఆ తల్లి తిరగని ఆసుపత్రి లేదు. వెళ్ళిన ప్రతిచోటా డాక్టర్లు 'రిస్క్ ఎక్కువ.. బ్ర‌తకడం కష్టం' అని చేతులెత్తేశారు. చివరకు ఆశలన్నీ వదులుకున్న ఆ తల్లి, తన బిడ్డను తీసుకుని ముంబైలోని సోనూసూద్ ఇంటికి చేరింది. కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లి ఆవేదన చూసి సోనూ చలించిపోయారు. తక్షణమే తన టీమ్‌ను అప్రమత్తం చేసి, మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ పర్యవేక్షణలో, జూపిటర్ ఆసుపత్రిలోని నిపుణులైన వైద్య బృందం నీరాకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఎందరో వద్దన్నా, సోనూ నమ్మకంతో ముందుకు సాగి ఆ చిన్నారికి పునర్జన్మ ప్రసాదించారు. సర్జరీ తర్వాత కోలుకున్న ఆ చిన్నారిని సోనూ ప్రేమగా ఎత్తుకుని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఎవరూ జీవితంపై ఆశ వదులుకోవద్దు.. మనం ఐక్యంగా ఉంటే ఏ యుద్ధాన్నైనా గెలవవచ్చు" అంటూ సోనూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. నిజానికి సోనూసూద్‌కు తెలుగు రాష్ట్రాలతో విడదీయలేని అనుబంధం ఉంది. తన భార్య సోనాలి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ కావడంతో ఏపీని తన రెండో ఇల్లుగా భావిస్తుంటారు. గత ఏడాది కూడా ఏపీకి నాలుగు అత్యాధునిక అంబులెన్స్‌లను అందించిన ఆయన, ఇక్కడి ప్రజలకు ఏ ఆపద వచ్చినా తాను ముందుంటానని ఎన్నోసార్లు నిరూపించారు. సినిమాల్లో సంపాదించిన పేరు ప్రఖ్యాతులతో పాటు, సమాజానికి తిరిగి ఇవ్వడం ఒక బాధ్యతగా ఆయన భావిస్తారు. సోనూ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'అందరు హీరోలు సినిమాల్లోనే ఉంటారు.. కానీ సోనూ మాత్రం మన మధ్యే ఉన్న నిజమైన హీరో" అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం వైద్య సహాయమే కాకుండా.. విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో కూడా ఎంతో మందికి ఆయన తన ఫౌండేషన్ ద్వారా ఆసరాగా నిలుస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం సోనూసూద్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఫతే' (Fateh) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా కూడా పరిచయమవుతున్నారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాజం పట్ల ఇంత బాధ్యతగా ఉండే వ్యక్తి చేసే సినిమాలకు కూడా మంచి విజయం లభించాలని సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.
'వీరసింహారెడ్డి' వంటి భారీ విజయం తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ ను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా 'చందమామ' కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఎంపికైనట్లు తెలుస్తోంది.  (NBK111) నయనతార అవుట్.. కాజల్ ఇన్? మొదట హిస్టారికల్ జానర్ లో ఈ సినిమాను రూపొందించాలి అనుకున్నారు. ఆ సమయంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత జానర్ చేంజ్ అవ్వడంతో, హీరోయిన్ ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య సరసన సరిగ్గా సరిపోయే హీరోయిన్ కోసం వెతికి చివరకు కాజల్ అగర్వాల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? గతంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన 'భగవంత్ కేసరి' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ వెండితెరపై కనిపించనుండటంతో 'సెంటిమెంట్' వర్కవుట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మాస్ యాక్షన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తొలుత చారిత్రక నేపథ్యంలో ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మార్చారు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2026 సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.  
1. 'డ్రాగన్' రిలీజ్ డేట్! ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027, జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అలాగే, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా 'ఫస్ట్ గ్లింప్స్'ను విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు.  2. బాలయ్య సరసన చందమామ! నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రానున్న 'NBK111' ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో 'భగవంత్ కేసరి' సినిమాలో బాలకృష్ణ, కాజల్ కలిసి నటించడం విశేషం. 3. రామ్ చరణ్ రెమ్యునరేషన్! పెద్ది సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సుమారు రూ. 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధికం కాగా.. రెమ్యునరేషన్ పరంగా వంద కోట్ల క్లబ్ హీరోల జాబితాలో చరణ్ చేరారు. 4. చిరు-బాబీ మూవీకి ‘కాకాజీ’ టైటిల్? బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘Mega158’ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ‘కాకాజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇదే టైటిల్‌పై వార్తలు వచ్చినప్పటికీ మూవీ టీమ్ స్పందించలేదు. భారీ యాక్షన్ ఎంటర్‌టైన్‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. 5. సిద్ధూ-మీనాక్షి జంటగా వెబ్ సిరీస్ సిద్ధూ జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి జంటగా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ రాబోతోంది. 'సార్', 'లక్కీ భాస్కర్' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. సిద్ధూ, మీనాక్షి, వెంకీ అట్లూరి ముగ్గురికీ ఇది తొలి డిజిటల్ అరంగేట్రం కావడం విశేషం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. 6. ప్రకాష్ రాజ్ పై నాగ మహేష్ ఫైర్! శ్రీరాముడు, సనాతన ధర్మంపై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ను.. నటుడు నాగ మహేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. నాస్తికత్వం పేరుతో హిందూ దేవుళ్లను, రామాయణాన్ని అవహేళన చేయడం ప్రకాష్ రాజ్ సంకుచిత స్వభావానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాజకీయ విభేదాలను మతంతో ముడిపెడుతూ సమాజంలో ప్రాంతీయ చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. 7. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌.. మాస్ ట్రీట్ రెడీ! ‘పెద్ది’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ పాట షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ప్రారంభం కానుంది. రామ్ చరణ్ మాస్ డ్యాన్స్‌కు సంయుక్త గ్లామర్ తోడవ్వడంతో.. ఇది సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 8. తండ్రిగా ప్రమోషన్ పొందిన తిరువీర్  టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తన రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులకు ఒక తీపి కబురు అందించారు. తనకు కుమారుడు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, తన బాబుకు 'అథర్వ్ రెడ్డి' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ, తమ జీవితంలోకి కొత్త అతిథి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. 9. ఏడో తరగతి ఎగ్జామ్స్ రాసిన నేషనల్ అవార్డు విన్నర్! ప్రముఖ మలయాళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ఇంద్రాన్స్ 68 ఏళ్ల వయసులో ఏడో తరగతి పరీక్షలు రాసి చదువుపై తనకున్న మక్కువను చాటుకున్నారు. చిన్నతనంలో పేదరికం కారణంగా నాలుగో తరగతితోనే ఆగిపోయిన తన చదువుని.. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ ద్వారా మళ్లీ ప్రారంభించారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు రాయడానికి కూడా  సిద్ధమవుతున్నారు. 10. 'జైలర్ 2' షూటింగ్ పూర్తీ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న 'జైలర్ 2' షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. సుమారు 13 నెలల పాటు నిర్విరామంగా చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ, నేడు అధికారికంగా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సెట్స్‌లో చిత్రబృందం భారీ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2026 సెకండాఫ్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
 ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది.  ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని  నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి.  ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. టాబ్లెట్ల మీద గీత.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట. గీతలు లేని టాబ్లెట్లు.. మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై  గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు. డిజైన్ మాత్రం కాదు.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు.  అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు  టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల  మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.                                 *రూపశ్రీ.
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన  పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే  కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా,  రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే.. ఇది గుర్తుపెట్టుకోవాలి.. మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క  కలపాలి. పరిశుభ్రత.. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు  రుచిని,  ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.. పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం  ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు.  వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. తీపి పెరుగు.. కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు.  తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు,  ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం,  సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.                               *రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా,  మంచి విద్యార్థులుగా,  మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే  చిన్న మార్పులు  పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.  దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల  పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మాట్లాడటం.. నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా  పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు  పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.  వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు.. పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు  విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు  సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది. స్క్రీన్ టైం.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం.  పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి. ఎంకరేజ్.. ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది. తమ పని తాము చేసుకోవడం.. పిల్లలకు వారి బ్యాగ్  వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం. పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.                                         *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, రాత్రి పూట సరైన సమయానికి నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రాత్రి 10 గంటలకు నిద్రపోవాలని  వైద్య నిపుణులు ఎందుకు చెబుతున్నారు? దీని వెనుక ఉన్న రహస్యాలేమిటో ఈ వీడియోలో చూద్దాం.  ముఖ్య అంశాలు: శరీర పునరుద్ధరణ: రాత్రి 10 నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మన శరీరంలో కణాల మరమ్మత్తు ప్రక్రియ వేగంగా జరుగుతుంది.  మెదడు ఆరోగ్యం: సరైన సమయానికి నిద్రపోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది, ఒత్తిడి (Stress) తగ్గుతుంది మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుంది.  యునానీ వైద్య విధానం: నిద్ర మరియు ఆరోగ్యంపై యునానీ వైద్య శాస్త్రం చెప్పిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు.  బరువు నియంత్రణ: సరైన నిద్ర జీవక్రియను (Metabolism) మెరుగుపరిచి, బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందో వివరించబడింది. మీరు నిత్యం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటే మీ నిద్ర సమయాన్ని మార్చుకోవాల్సిందే. ఈ వీడియో చూసి, రాత్రి 10 గంటల నిద్ర వల్ల కలిగే మరిన్ని లాభాలను తెలుసుకోండి! ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!) 🙏✨
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం చేస్తున్నారు. ఇక చాలా మంది మరొక అడుగు ముందుకు వేసి జీవితానికి కీలకం అయిన ఉద్యోగాలు,  ఆరోగ్యం,  రిలేషన్షిప్స్ వంటి విషయాలలో సలహాలు కూడా ఈ కృత్రిమ మేధస్సును ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది మనిషి లాగా తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయేది కాదు.. ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే చాలా మంది ఏఐ ను ఆరోగ్య సమస్యలకు సలహాలు తీసుకుని, స్వంత వైద్యం దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక బ్రిటీష్ వైద్య పత్రిక ఏఐ ను ఆరోగ్య సలహాలు అడగడం, ఆ సలహాలు పాటించడం వంటి విషయాల గురించి చాలా షాకింగ్ నిజాలు ప్రచురించింది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్య సమస్యల కోసం ఏఐ ను సలహా అడగడం ఎంత పెద్ద తప్పూ  అర్థమవుతుంది. ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం.. ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలలో సుమారు 50 శాతం తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్‌బాట్‌లు అందించే సమాచారం చాలా తప్పుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఏఐ బలహీనత.. జెమిని, డీప్‌సీక్, మెటా ఏఐ, చాట్‌జీపీటీ , గ్రోక్ వంటి ఏఐ సాధనాలపై విస్తృతమైన పరిశోధనను ఒక శాస్త్రవేత్తల టీమ్ నిర్వహించిందట.  ఈ ఏఐ ప్లాట్పామ్ లలో  ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలు పరిశోధకులు అడిగారట. క్యాన్సర్ , వ్యాక్సిన్‌ల వంటి అంశాలపై ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు కచ్చితమైనవిగా ఉన్నాయి. అయితే మూల కణాలు , పోషణ వంటి అంశాలలో ఏఐ బలహీనంగా ఉన్నట్లు తేలిందట. తప్పుడు సమాధానాలు.. ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య.. అది నిస్సంకోచంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తుందట. ఇది తరచుగా ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణను అందించదు. ఫలితంగా, వినియోగదారులు సరైన సమాచారం, తప్పు సమాచారాల  మధ్య తేడాను గుర్తించలేరు. ఏఐ చెప్పే తప్పు సమాధానాలనే నిజం అనుకుని చాలామంది పొరపాట్లు చేస్తారు. అసలు ఏఐ చెప్పే సమాధానాలు నమ్మేలా అనిపించవని,  సమస్యకు సంబంధం లేని సమాచారాన్ని ఇస్తుందని అంటున్నారు. గమనిక.. పైన పేర్కొన్న విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించినవి.                             *రూపశ్రీ.
ఇంట్లోనే లభించే ఆయుర్వేద మూలికలతో మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టండి! నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతోంది. అయితే, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మోకాళ్ళలో జిగురును పెంచడానికి మరియు నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలను ఈ వీడియోలో వివరించారు. ముఖ్యమైన చిట్కాలు మరియు పరిష్కారాలు: మోకాళ్ళలో జిగురు (Knee Pulp) పెరగడానికి: వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ళలో ఉండే సహజమైన జిగురు తగ్గిపోతుంటుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురై తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో సూచించిన సహజమైన ఔషధాల గురించి డాక్టర్ గారు వివరించారు. ఆయుర్వేద మూలికల ఉపయోగాలు: కరక్కాయ పొడి, వాము మరియు శొంఠి వంటి పదార్థాలు మన వంటింట్లోనే లభిస్తాయి. వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరంలోని వాత దోషాలు తగ్గి, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. జీవనశైలి మార్పులు: నొప్పులు తగ్గాలంటే కేవలం మందులే కాకుండా, తీసుకునే ఆహారం మరియు రోజువారీ వ్యాయామం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆయుర్వేద పద్ధతులను పాటించి చూడండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను తప్పక వీక్షించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా యూట్యూబ్  "TeluguOne Health" ఛానెల్ ను సందర్శించండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)