పశ్చిమ బెంగాల్ లో పొటిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని హౌస్ అరెస్టు చేశారంటూ టీఎంసీ నేతల ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  దక్షిణ 24 పరగణాల జిల్లా బారుయిపూర్‌లో హత్యాచారానికి  గురైన  12 ఏళ్ల బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి మమతా బెనర్జీ వెళ్లకుండా అడ్డుకునేందుకు ఆమెను హౌస్ అరెస్టు చేశారని టీఎంసీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రిని, ఆమె సొంత రాష్ట్రంలోనే కదలకుండా నిర్బంధించడం దారుణమని మండిపడుతున్నాయి.  కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని  మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద   భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.  మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను  టీఎంసీ ఎంపీలు ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, మహువా మొయిత్రా సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  బాధితురాలి కుటుంబాన్ని కలిసి పరామర్శించకుండా అడ్డుకోవడానికే  సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ మమతను హౌస్ అరెస్టు చేశారని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించి,   మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన సీనియర్ నాయకురాలి పట్ల   అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మహువా మొయిత్రా విమర్శించారు.   ఇలా ఉండగా,   బారుయిపూర్ లో మైనర్ బాలికపై హత్యాచార   ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే నలుగురు నిందితులను  అరెస్ట్ చేశారు. ఈ  కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్  ఏర్పాటు చేశామని, దోషులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ  గృహనిర్బంధం ఆరోపణలను   టీఎంసీ ఆడుతున్న రాజకీయ నాటకాలుగా  ప్రభుత్వం కొట్టిపారేసింది.   MC leaders allegations, West Bengal politics, Mahua Moitra, Baruipur case
  అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రాంతీయ సమీకరణాలు, నాయకుల వ్యక్తిగత చరిష్మా పార్టీల జయాపజయాలను శాసిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ (TDP) సీనియర్ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి రాజకీయ అడుగులపై ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆయన పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ఒకవైపు వినిపిస్తుండగా, టోన్ న్యూస్‌ ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి.  పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను చాటుకుంటూనే, తన భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు నాయుడు నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. రాజకీయ వ్యూహం మరియు అంతరార్థాలు ప్రభాకర్ చౌదరి సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ, జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవులను నిర్వహించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఆయనకు బలమైన క్యాడర్ మరియు ప్రజాదరణ ఉన్నాయి. తాజా పరిణామాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న శాసనమండలి (MLC) స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.  గతంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఇది ఒక రకంగా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచే వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మారే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని చెబుతూనే, తన సీనియారిటీకి మరియు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తగిన గుర్తింపు దక్కాలనే ఆకాంక్షను ఆయన బలంగా వినిపించారు. ఒకవేళ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తే చట్టసభల్లో ప్రజా సమస్యలపై గళమెత్తడానికి సిద్ధంగా ఉన్నానని, ఇవ్వకపోయినా ఒక సాధారణ కార్యకర్తలా పార్టీలోనే కొనసాగుతానని చెప్పడం వెనుక రాజకీయ పరిణతి కనిపిస్తుంది. రాజకీయ పరిణామాలు మరియు అంతస్సూత్రాలురాయలసీమ రాజకీయాల్లో ఒకప్పుడు ఉన్న ఫ్యాక్షనిజం తీరుపై, ప్రస్తుత స్వార్థపూరిత రాజకీయాలపై ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో ఫ్యాక్షనిజానికి కులం, మతం లేవని, గ్రూపుల మధ్య మాత్రమే వైషమ్యాలు ఉండేవని పేర్కొన్నారు. కానీ నేడు రాజకీయం కలుషితమై ఫ్యాక్షన్‌ను కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తులు ఎదిగే అవకాశం కనుచూపు మేరలో లేదని, సంప్రదాయ వారసత్వ పార్టీలే రాజ్యమేలుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో మార్పు రావడానికి మరింత సమయం పడుతుందనే వాస్తవాన్ని ఆయన అంగీకరించారు.  ఈ పరిణామాలు అనంతపురం జిల్లాలో టిడిపి అంతర్గత గ్రూపు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభాకర్ చౌదరికి తగిన ప్రాధాన్యత దక్కకుంటే జిల్లాలో పార్టీ క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు రాజకీయ ప్రభావంరానున్న రోజుల్లో ప్రభాకర్ చౌదరి భవిష్యత్తు పూర్తిగా టిడిపి అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే, అనంతపురం జిల్లాలో పార్టీ మరింత పుంజుకుంటుంది. ఒకవేళ అధిష్టానం ఆయనను విస్మరిస్తే, స్థానిక సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఆయన పార్టీ మారే యోచనలో లేనప్పటికీ, ద్వితీయ శ్రేణి నాయకులు మరియు అనుచరుల ఒత్తిడి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయానికైనా దారితీయవచ్చు. పూర్తి చర్చను టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్..  2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే..  2019 ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.  2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి  కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత  వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.   దీంతో   2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్  వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.  దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.   ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆ దిశగా ఇప్పటికే  జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.   Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone
ALSO ON TELUGUONE N E W S
రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ మోస్ట్ 'ఫౌజీ'. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ వాల్యూతో 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తుండగా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంతో, యుద్ధం  ప్రేమ అనే బలమైన భావోద్వేగాల చుట్టూ తిరిగే కధాంశాలతో తెరకెక్కుతుంది. తాజాగా  ఫౌజీ' పై స్టార్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ 'ఫౌజీ' నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ నాకు 'ఫౌజీ'కి సంబంధించిన కొన్ని కీలక రషెస్ (షూటింగ్ విజువల్స్) చూపించారు. ఆ విజువల్స్ చూసినప్పుడు నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. స్క్రీన్ మీద విజువల్స్ అంత అద్భుతంగా, రిచ్‌గా వచ్చాయి , హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. మనం ఊహించని స్థాయిలో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా రూపొందిస్తున్నారు అంటూ చిత్రబృందాన్ని ప్రశంసించారు. సాధారణంగా ప్రతి సినిమాను ఎంతో నిశితంగా గమనించే నాగవంశీ లాంటి అగ్ర నిర్మాత ఈ స్థాయి ఎలివేషన్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తుంది. Also read: Lenin: లెనిన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే తొలి మైల్‌స్టోన్ హిట్ అందుకోబోతుందా! డిసెంబర్‌లో  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ శరవేగంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకునట్టుగా తెలుస్తుంది. టీజర్ అండ్ ఫస్ట్ లుక్  కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.  సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మెలోడీలతో పాటు అంతకు మించిన గ్రాండియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌  సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.  Naga vamsi, prabhas, fauzi, hanuraghavapudi  
Prabhas' Fauzi has been carrying massive expectations ever since director Hanu Raghavapudi announced the ambitious period action drama. While the makers have maintained complete secrecy around the project, producer Naga Vamsi has now added more fuel to the anticipation with his latest comments. Speaking at a recent event, Naga Vamsi revealed that he got an opportunity to watch a few episodes of Fauzi and described the experience as "mind-blowing." Though he refrained from revealing any story details, his reaction has quickly gone viral among Prabhas fans, who are eagerly waiting for the film's first promotional material. The statement has generated fresh excitement because Vamsi is known for being selective with his praise. His comments suggest that Hanu Raghavapudi has crafted something visually rich and emotionally engaging, staying true to the director's signature storytelling style while mounting it on a much bigger scale with Prabhas. Fauzi is one of the most awaited films in Prabhas' lineup as it marks his first collaboration with Hanu Raghavapudi. The period drama is expected to present the pan-India star in a never-seen-before avatar, with grand production values from Mythri Movie Makers and an emotional narrative at its core. Imanvi is playing leading lady and huge ensemble cast is part of this huge actioner.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు ఐడెంటిటీని ప్రేక్షకుల్లోకి చొచ్చుకొని పోయేలా చేయగల నటి భాగ్యశ్రీ బోర్సే. రవితేజతో చేసిన తొలి చిత్రం 'మిస్టర్ బచ్చన్' ప్లాప్ అయినా ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించింది. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన కాంత, 'ఆంధ్రా కింగ్ తాలూకా' కింగ్ డమ్ ల పరిస్థితి కూడా అంతే. ఇలాంటి తరుణంలో  రేపు 10  న విడుదల కాబోతున్న 'లెనిన్' మూవీపైనే ఈ ముద్దుగుమ్మ తన ఆశలన్నీ పెట్టుకుంది. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే 'భారతి' అనే కీలకమైన రోల్ లో  కనిపించబోతోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాయలసీమ రగ్గడ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ కథలో మహాభారత ఛాయలు, ఫ్రెండ్‌షిప్, లవ్, రివోల్ట్ మరియు వార్ వంటి ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ కట్‌ను బట్టి స్పష్టమవుతోంది. "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు" అనే పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. అఖిల్ అక్కినేని మాస్ అవతార్‌తో పాటు ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే పాత్ర కూడా కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే బలమైన ఎమోషనల్ కోర్‌తో సాగుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని నాగార్జున, నిర్మాత నాగవంశీలతో పాటు చిత్ర బృందం మొత్తం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. స్క్రీన్ మీద అఖిల్ కనిపించడు, కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడని, రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక మహాభారతం ఇదని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. Also read: Rao bahadur: కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న రావు బహదూర్.. మూడురోజులకి ఎంతంటే! థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, "సోల్ ఆఫ్ లెనిన్", "జయ మంగళం" వంటి పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భాగ్యశ్రీ బోర్సే నటనకు, అందానికి మంచి మార్కులే పడుతున్నప్పటికీ బాక్సాఫీస్ సక్సెస్ అనేది ఆమెకు కెరీర్ పరంగా అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిల క్రేజీ ప్రాజెక్ట్ 'కాంత'తో పాటు తమిళంలో 'సేయోన్' వంటి సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ, తెలుగులో పూర్తి స్థాయి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే 'లెనిన్' విజయం ఆమెకు ఎంతైనా అవసరం. మరి లెనిన్  భాగ్యశ్రీ  కెరీర్‌లో ఫస్ట్ మైల్‌స్టోన్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.   
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధికారికంగా ప్రకటించారు. కానీ, ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. గత కొంత కాలంగా ఎలాంటి అధికారిక అప్‌డేట్స్ కూడా రాకపోవడంతో.. ఇక ఆ సినిమా అటక ఎక్కినట్లే అని అందరూ భావించారు.  మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు ఇప్పుడొక ఊహించని న్యూస్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ తన కొడుకు అరంగేట్రం కోసం ఒక పక్కా మాస్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. బాలయ్యకు సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు ఈ రేస్‌లోకి వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్.  ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ద్వారా మోక్షజ్ఞను గ్రాండ్ లాంచ్ చేయాలని బాలయ్య భావిస్తున్నాట. అందుకే బోయపాటి శ్రీను అయితేనే నందమూరి వారసుడిని వెండితెరపై అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించగలరని బాలయ్య బలంగా నమ్ముతున్నారు. ఈ ఊహించని కాంబినేషన్ వెనుక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'NBK ఫిలిమ్స్' బ్యానర్‌పైనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారట. మోక్షజ్ఞ కోసం బోయపాటి శ్రీను ఇప్పటికే ఒక అద్భుతమైన, హై-వోల్టేజ్ మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి బాలయ్యను ఒప్పించారని సమాచారం.  ఒకవేళ ఈ కాంబినేషన్ గనుక అధికారికంగా లాక్ అయితే, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై నందమూరి కాంపౌండ్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.     Nandamuri Mokshagna, Boyapati Srinu, Nandamuri Balakrishna, TeluguOne  
    కంటెంట్ ఉన్న సినిమాకి ప్రేక్షక పట్టాభిషేకం ఎలా ఉంటుందో నిరూపిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తున్నాడు రావు బహదూర్. సత్యదేవ్ విలక్షణ నటన, క్రేజీ డైరెక్టర్ వెంకటేష్  దర్శకత్వ ప్రతిభకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పణలో జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన    ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులని  సృష్టిస్తోంది.    మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 3.11 కోట్లు రాగా రెండు రోజుల్లోనే 5 కోట్ల మార్కుని అందుకుంది. మూడో రోజైన ఆదివారం థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ఓవర్సీస్ లోను అదే పరిస్థితి. దీంతో మూడు రోజుల  వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్  8.52 కోట్ల మార్కుని  తాకి సంచలనం సృష్టించింది.  తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ సినిమా అత్యధికంగా 2.80 కోట్ల వసూళ్లను సాధించి టాప్ ప్లేస్‌లో నిలవగా కర్ణాటకలో 33 లక్షలు, తమిళనాడులో 2 లక్షల కలెక్షన్లని  రాబట్టింది.  Also read: పెళ్లి రోజు గిఫ్ట్ అంటు విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్  ప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. సత్యదేవ్ నటించలేదని, జీవించాడని కొనియాడారు. ఈ సినిమా మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేయడం సినిమాకి  మరింత ప్లస్ అయింది. సత్యదేవ్ ఈ లుక్ కోసం ఏకంగా 70 రోజుల పాటు ప్రతిరోజూ 5 గంటల పాటు మేకప్ వేసుకోవడం ఆయన పడ్డ కష్టానికి, సినిమాపై ఉన్న అంకితభావానికి నిదర్శనం. ప్రస్తుతం ఈ సినిమా వీక్‌డేస్‌లోనూ మంచి హోల్డ్‌తో దూసుకుపోతోంది. హీరోయిన్ దీపా థామస్ పెర్ఫార్మ్ కి కూడా ప్రేక్షక లోకం బ్రహ్మ రధం పడుతుంది  
తనదైన హాస్యంతో, విలక్షణ నటనతో ఐదు తరాల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి 'పద్మశ్రీ' అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు సన్మాన కార్యక్రమ జరిగింది. ఈ సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ.. తన 48 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అరుదైన అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను ఎంతో ఓపెన్‌గా పంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు చోటివ్వలేదని స్పష్టం చేసిన రాజేంద్రప్రసాద్, ఈ మధ్య కాలంలో వస్తున్న సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఏమాత్రం పట్టించుకోనని అన్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కాలం నుండి నేటి తరం సూపర్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ వరకు ఐదు జనరేషన్ల హీరోలతో కలిసి ట్రావెల్ కావడం దేవుడు తనకు ఇచ్చిన గొప్ప ప్రసాదంగా ఆయన అభివర్ణించారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సైతం తనకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మాణంలో తాను నటించిన 'సేనాపతి' సినిమాను చూసి మెగాస్టార్ చిరంజీవి తన నటనను ఎంతగానో అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేదికపై రాజేంద్రప్రసాద్ తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'ఆ నలుగురు' సినిమా గురించిన ఒక షాకింగ్ సంఘటనను బయటపెట్టారు. ఈ క్లాసిక్ సినిమా చూసి లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు థియేటర్ నుండి బయటకు వస్తున్న సమయంలో తాను ఎదురుపడ్డానని చెప్పారు. అప్పుడు విశ్వనాథ్ గారు ఒక్కసారిగా తన చెంప మీద కొట్టారని, దాంతో మొదట తనకు ఏమీ అర్థం కాలేదని, సినిమా నచ్చలేదేమో అని భయపడ్డానని అన్నారు. అయితే వెంటనే విశ్వనాథ్ గారు తనను హగ్ చేసుకుని, "నీ దుంపతెగ.. సినిమా అంతా వెతికాను కానీ ఎక్కడా ఒక్క ఫ్రేమ్‌లో కూడా నాకు రాజేంద్రప్రసాద్ కనిపించలేదు, కేవలం ఆ పాత్ర మాత్రమే కనిపించింది.. నువ్వు నేర్చుకున్న నటనను పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నావ్.. గాడ్ బ్లెస్ యూ" అని మనస్ఫూర్తిగా దీవించారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. నటుడిగా ఎంతో మంది హృదయాలను గెలిచినప్పటికీ నిర్మాతగా మాత్రం తాను ఫెయిల్యూర్ అయ్యానని రాజేంద్రప్రసాద్ నిజాయితీగా ఒప్పుకున్నారు. తన భార్య విజయ చాముండేశ్వరి ప్రొడ్యూసర్‌గా మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో 'మేడమ్', 'రాంబంటు' చిత్రాలను నిర్మించామన్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'మేడమ్' చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా, నంది అవార్డుల్లో 'బెస్ట్ యాక్ట్రెస్' కేటగిరీలో తనకు స్పెషల్ జ్యూరీ అవార్డు తెచ్చిపెట్టిందని, ఆ అవార్డు కోసం లెజెండ్ ఏఎన్నార్ తన పేరును స్వయంగా రెఫర్ చేశారని గుర్తుచేసుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్మించిన 'రాంబంటు' సినిమా మాత్రం భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, ఆ సినిమా నష్టాలను పూడ్చడానికి అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనే ఉన్న తన అరెకరం భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తాను ప్రొడ్యూసర్‌గా పనికిరానని తేల్చుకుని, ఆ తర్వాత ఎప్పుడూ సినిమాలు నిర్మించలేదని స్పష్టం చేశారు.     Rajendra Prasad, Padma Shri, K Viswanath, TeluguOne  
Pradeep Ranganathan has taken an unconventional route for his debut as a producer by announcing his maiden production under the PR Show banner with a concept that is already generating curiosity. Instead of backing a film with a single filmmaker, he has introduced an "Alpha Unit" comprising six writer-directors, who have jointly written and are directing the project together. Headlined by Mamitha Baiju, the yet-to-be-titled film is positioned as a female-led action entertainer. The announcement video offers a glimpse into its intense premise, with Mamitha seen holding a blood-stained knife before hurling it at Ashwath Marimuthu, who appears to be playing a police officer. The story is said to revolve around a young woman taking on a police official, hinting at an action-driven conflict. Apart from Mamitha and Ashwath, the film also stars Shivaji Sontineni, Swasika and introduces newcomer Anamika Mahi. Music is being composed by Sai Abhyankkar, one of the most sought-after young composers in South cinema. While writer and director duos have become common in Indian cinema, a team of six filmmakers jointly directing a feature film is an unusual experiment. The move is reminiscent of the 1999 Tamil film Suyamvaram, which saw multiple directors collaborate on a single project, although that was made under a completely different format. Known for his fresh storytelling choices as an actor and filmmaker, Pradeep appears to be extending the same philosophy to his production ventures. With an ambitious collaborative filmmaking model and a promising action-oriented premise, the project has emerged as one of the more intriguing announcements from the Tamil film industry in recent times. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'గాడ్ ఆఫ్ వార్' (God of War). ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, కనీసం షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే అప్పుడే రాజకీయ వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హిందూ దేవుడు కార్తికేయుడు, తమిళ సంప్రదాయంలో 'మురుగన్'గా అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించబడే దేవుడి జన్మస్థలానికి సంబంధించిన అంశంపై చిత్రబృందం చేసిన కొన్ని వ్యాఖ్యలు తమిళనాడులో తీవ్రమైన రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇటీవల ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా అనౌన్స్ చేసిన సమయంలో, మేకర్స్ సినిమా కథకు సంబంధించిన కాన్సెప్ట్‌ను వివరిస్తూ ఒక ప్రకటన చేశారు. అందులో మురుగన్ దేవుడు మొదట ఉత్తర ప్రాంతంలో జన్మించారని, ఆ తర్వాతే కాలక్రమేణా దక్షిణాదితో ముడిపడిన దేవుడిగా మారారని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తమిళనాడులో పెను వివాదాన్ని రేకెత్తించాయి. తమిళ సంస్కృతిలో మురుగన్‌.. 'తమిళ కడవుల్' (తమిళుల దేవుడు)గా అత్యంత పవిత్రంగా భావించే సంప్రదాయం శతాబ్దాలుగా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చేసిన వ్యాఖ్యలు చారిత్రక, సాంస్కృతిక వాస్తవాలను పూర్తిగా వక్రీకరించేలా ఉన్నాయని అక్కడి ప్రజలు, పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సెన్సిటివ్ అంశంపై తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, దర్శకుడు, నటుడు సీమాన్ (Seeman) అత్యంత ఘాటుగా స్పందించారు. మురుగన్‌ను తమిళుల ఆరాధ్య దైవంగా భావించే సుదీర్ఘ సంప్రదాయాన్ని విస్మరించి, ఆయనను ఉత్తర భారతానికి చెందిన దేవుడిగా చూపించే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. కళ పేరుతో చరిత్రను, సాంస్కృతిక మూలాలను మార్చే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టే ఈ వివాదానికి మూల కారణమని, అది కోట్లాది మంది తమిళుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని సీమాన్ ఆరోపించారు. ఈ వివాదం ఇక్కడితో ఆగకుండా మరింత ముదిరింది. 'గాడ్ ఆఫ్ వార్' సినిమాను తమిళనాడులో విడుదల కాకుండా తమ పార్టీ శ్రేణులతో కలిసి ఖచ్చితంగా అడ్డుకుంటామని సీమాన్ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తెలుగు, తమిళం అనే తేడా లేకుండా రెండు భాషల్లోనూ ఈ చిత్ర ప్రదర్శనలను నిలిపివేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతామని ఆయన హెచ్చరించడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఈ స్థాయి రాజకీయ వేడి, హెచ్చరికలు రావడం సినీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నా, ఈ అంశంపై ఎన్టీఆర్ కానీ, దర్శకుడు త్రివిక్రమ్ కానీ లేదా చిత్ర నిర్మాతలు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. కథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. సినిమా ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉండటంతో, భవిష్యత్తులో ఈ సున్నిత అంశంపై చిత్రబృందం స్పష్టత ఇచ్చి వివాదానికి ముగింపు పలికే అవకాశం ఉందని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు.      Jr NTR, Trivikram, God of War, Controversy, TeluguOne  
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin). రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా జరిగిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో అఖిల్ అక్కినేని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.  దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉండటంపై తన మనసులోని బాధను, ఆవేదనను ఈ వేదికపై అఖిల్ ఫ్రాంక్‌గా పంచుకున్నారు. ఇటీవల వైజాగ్ ఈవెంట్ స్టేజ్ మీద సారీ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇవాళ కూడా అభిమానులకు క్షమాపణలు చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత రెండున్నర ఏళ్లుగా అభిమానులతో కమ్యూనికేట్ చేయలేకపోయానని, ముఖం చూపించలేకపోయాననే బాధ తన మైండ్‌లో ఎంతో బలంగా ఉండిపోయిందని అఖిల్ అన్నారు. కానీ ఇవాళ తను ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చానని, ఆ పాజిటివ్ ఎనర్జీనే ఈ 'లెనిన్' సినిమా అని స్పష్టం చేశారు.  ఈ సినిమాతో తాను కొత్తగా కనిపించాలని, ఎంతో బాగా నటనను ప్రదర్శించాలని కష్టపడినట్లు చెప్పారు. అయితే వీటన్నింటి వెనుక ఉన్న తన ఏకైక ఉద్దేశం ఒక్కటేనని.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తనను తమ ఇంటి బిడ్డగా భావించి, గుండెల్లో దాచుకోవాలని అఖిల్ ఆకాంక్షించారు. "నన్ను మీ ఇంటి వాడిని చేసుకోండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, అప్పుడే నేను ఎంతో సంతోషంగా ఉంటాను" అంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను కదిలించాయి. రెండు సంవత్సరాల క్రితం రాయలసీమ బిడ్డ అయిన దర్శకుడు మురళీ కిషోర్ (నందు) తనను కలిసి ఈ అద్భుతమైన కథను చెప్పాడని అఖిల్ గుర్తుచేసుకున్నారు. కథ విన్న వెంటనే నందుకు ఒక గట్టి హగ్ ఇచ్చి, "ఈ కథను ఇంకెవరికీ చెప్పకు, ఇది నాకోసమే రాశావు" అని అడిగినట్లు చెప్పారు. ఆ సమయంలో తన మైండ్‌లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ, బాధ అంతా ఆ కథలో కనిపించిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతటి గొప్ప దర్శకుడిని తనకు అందించినందుకు నందు తల్లిదండ్రులకు వేదికపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నమ్మకానికి తాము తిరిగి ఇచ్చే థాంక్స్ ఏంటనేది జూలై 10న థియేటర్లలో 'లెనిన్' సినిమా రూపంలో చూపిస్తామని, అది చూసి అందరూ ఆనందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రయాణంలో నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ తనకు అందించిన సపోర్ట్ మరువలేనిదని అఖిల్ కొనియాడారు. రెండేళ్ల క్రితం వంశీతో కలిసి పార్ట్‌నర్స్ లాగా వర్క్ చేద్దామని అనుకున్నామని, ఈ కథతో తమ మధ్య ఒక గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయిందని చెప్పారు. ఈ కథను తన తండ్రి నాగార్జున గారి వద్దకు తీసుకెళ్లినప్పుడు.. హిట్ కొట్టడం, బ్లాక్‌బస్టర్ కొట్టడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఇద్దరూ చేతులు కలిపిన క్షణాలను అఖిల్ గుర్తుచేసుకున్నారు. ఈ జర్నీలో ఎడిటర్ నవీన్ నూలి, డీఓపీ లియాన్ బ్రిటోతో పాటు ఎంతో మంది టెక్నీషియన్లు ప్రాణం పెట్టి పనిచేశారని, అందుకే ఇవాళ తాను ఎంతో వర్క్ సాటిస్ఫాక్షన్‌తో, నమ్మకంతో స్టేజ్ మీద నిలబడగలిగానని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S) ఈ సినిమాకు అద్భుతమైన ప్రాణం పోశాడని అఖిల్ ప్రశంసించారు. గత రెండు మూడు రోజులుగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) చూస్తున్నామని, థమన్ మ్యూజిక్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అన్నారు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ (భారతి) పాత్ర కోసం పడిన కష్టాన్ని తాను కళ్లారా చూశానని, ఆమె షాట్‌లో చూపిస్తున్న ఎనర్జీ చూసి తాము కూడా ఎంతో జాగ్రత్తగా, వళ్లు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు. సహనటులు శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ ఒక కుటుంబంలా కలిసి కష్టపడ్డారని, వారంతా తన గురించి మాట్లాడిన మంచి మాటలన్నీ ఈ సినిమా ఇచ్చిన గొప్పదనమేనని పేర్కొన్నారు. చివరగా తన తండ్రి నాగార్జున గారి వైపు చూస్తూ.. "నాన్నా.. ఇవాళ నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. ఈసారి జూలై 10న సినిమానే మాట్లాడుతుంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చే రియాక్షనే మన కష్టానికి సమాధానం చెబుతుంది. అప్పుడే నేను మళ్లీ మాట్లాడతాను" అంటూ అఖిల్ తన స్పీచ్‌ను ముగించారు.     Akhil Akkineni, Lenin Event, Tirupati, TeluguOne  
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రాయలసీమ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక తిరుపతి వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింగ్ అక్కినేని నాగార్జున వేదికపై చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాయి. ముందుగా కొండపై ఉన్న వేంకటేశ్వర స్వామికి, ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు తెలియజేస్తూ నాగార్జున తన ప్రసంగాన్ని ఎంతో ఎమోషనల్‌గా ప్రారంభించారు. ఈ సినిమా కథ తన వద్దకు వచ్చినప్పటి నుండి, సినిమా చూసే వరకు తనకు కలిగిన అనుభూతులను ఆయన పంచుకున్నారు. డైరెక్టర్ మురళీ కిషోర్ (నందు) మొదట ఈ కథ చెప్పడానికి తన వద్దకు వచ్చినప్పుడు, ఇది 'శ్రీరామాపురం' నేపథ్యంలో జరిగే కథ అని చెప్పగానే తనకు ఒక తెలియని సెంటిమెంట్ కనెక్ట్ అయిందని నాగార్జున వెల్లడించారు. ఎందుకంటే శ్రీరామాపురం అనేది అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన ఊరి పేరు అన్నారు. అందుకే ఆ పేరు వినగానే కథ వినాలనే కుతూహలం పెరిగిందని చెప్పారు. అలా నందు కథ చెప్పడం ప్రారంభించాక, అందులోని క్యారెక్టరైజేషన్స్, విభిన్నమైన ఎమోషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రపంచంలో ప్రేమను మించిన పెద్ద ఎమోషన్ లేదని, ప్రేమ కోసం రాజ్యాలు కూలిపోయాయని, యుద్ధాలు జరిగాయని చెబుతూ, ఈ 'లెనిన్' చిత్రంలో కూడా ఒక అద్భుతమైన ప్రేమకథ ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీ (భారతి) నటనను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. భారతి పాత్ర కోసం ఎన్ని యుద్ధాలైనా చేయొచ్చనేంతగా ఆమె అద్భుతంగా నటించిందని, ఆమె ఈ సినిమాకు హార్ట్ బీట్ లాంటిదని కొనియాడారు. అలాగే తనతో ఎప్పటి నుంచో జర్నీ ఉన్న శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ వంటి నటీనటులు ఈ సినిమాలో భాగం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వీరంతా సినిమాపై ఉన్న ప్రేమతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారని అభినందించారు. చిత్ర నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ గురించి మాట్లాడుతూ.. మీరు చింటూ అన్న అని పిలుస్తారు కదా అంటూ ఫ్యాన్స్ లో జోష్ పెంచారు. నాగవంశీకి మాస్ పల్స్ ఏంటో బాగా తెలుసని ప్రశంసించారు. నాగవంశీకి ఈ సినిమాపై ఎంతటి గట్టి నమ్మకం ఉందంటే, ఆంధ్రప్రదేశ్ టోటల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయనే చూసుకుంటున్నారని నాగార్జున అన్నారు. చివరగా తన కుమారుడు అఖిల్ అక్కినేని గురించి నాగార్జున మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అఖిల్ ఇప్పటివరకు అన్ని అర్బన్ క్లాస్ సినిమాలు చేశాడని, ఈ సీమ మట్టి కథలో, సీమ మనుషుల నేపథ్యంలో జరిగే రా అండ్ రస్టిక్ పాత్రకు అతను సెట్ అవుతాడా లేదా అని మొదట్లో తనకు చాలా పెద్ద భయం ఉండేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఇది సీమలో జరిగే ఒక 'మహాభారతం' లాంటి కథ అని అభివర్ణించారు. కానీ సినిమా చూసిన తర్వాత తాను మాత్రమే కాదు, అందరూ ఆశ్చర్యపోయేలా అఖిల్ అద్భుతంగా నటించాడని గర్వంగా చెప్పారు. స్క్రీన్ మీద మీకు అఖిల్ కనిపించడని, కేవలం 'లెనిన్' మాత్రమే కనిపిస్తాడని అన్నారు. థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రేక్షకులు లెనిన్ స్నేహాన్ని, అతని ప్రేమను, అతని పగను గుండెలకు హత్తుకుని ఇంటికి తీసుకెళ్తారని భరోసా ఇచ్చారు. తన తండ్రి ఏఎన్నార్ ఎప్పుడూ చెప్పే 'ప్రేక్షక దేవుళ్ల' ఆశీస్సులు తమకు ఉంటాయని నమ్ముతూ, "జూలై 10న వస్తున్నాం... మనవాడు గట్టిగా కొడుతున్నాడు" అంటూ నాగార్జున హై వోల్టేజ్ స్పీచ్‌తో అభిమానుల్లో పూనకాలు తెప్పించారు.     Akhil Akkineni, Lenin Event, Tirupati, Nagarjuna Speech, TeluguOne  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)