రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.? కడప జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. నామినేషన్ల దశ నుంచే రాజకీయ వేడి రాజుకున్న నేపథ్యంలో.. పోలింగ్‌ రోజున ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు, అభ్యర్థులు పరస్పరం సవాళ్లు విసురుకుంటుండటంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతుందా? ఓటర్లు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోగలరా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ ఆధిపత్యం కోసం సాగుతున్న పోరులో సాధారణ ఓటరు ఇబ్బందులు పడకుండా చూడటం అధికార యంత్రాంగానికి కీలకంగా మారింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడంతోపాటు, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తేనే ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగుతుంది. కీలక ఘట్టం.. నేడే పోలింగ్‌.! నెలల తరబడి సాగిన రాజకీయ వ్యూహాలు, ప్రచారాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు ఆదివారం ఓటర్లు తమ తీర్పుతో సమాధానం చెప్పనున్నారు. కడప నగరపాలక సంస్థతోపాటు బద్వేల్‌, ఎర్రగుంట్ల, రాజంపేట, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. జిల్లావ్యాప్తంగా 4,39,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా.. 336 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో పోలింగ్‌ శాతంపైనా రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. పులివెందులలో టెన్షన్‌.. టెన్షన్‌.! జిల్లాలో అందరి దృష్టి పులివెందులపై కేంద్రీకృతమైంది. వైఎస్‌ జగన్‌ పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో అక్కడి భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, నేతల పరస్పర సవాళ్ల నేపథ్యంలో పోలింగ్‌ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. ప్రత్యర్థి పార్టీల నేతలు తమ బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో సుమారు 750 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఏఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. రాజకీయ శ్రేణుల మోహరింపు.. పోలీసులకు సవాల్‌.! ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, అనుచరులను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటర్లను సమన్వయం చేసుకోవడం, ప్రత్యర్థి వర్గాల కదలికలను గమనించడం వంటి పరిణామాలతో చివరి నిమిషం వరకు రాజకీయ వాతావరణం వేడిగా మారింది. అయితే, ఈ మోహరింపు పోలింగ్‌ కేంద్రాల వద్ద గుంపులు, వాగ్వాదాలు, ఘర్షణలకు దారితీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటం కీలకంగా మారింది. ఓటు వేయగలమా? ఓటర్లలో సందేహాలు.! స్థానిక రాజకీయ విభేదాలు, ప్రత్యర్థి వర్గాల మధ్య పోటీ నేపథ్యంలో కొందరు ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోగలమా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లపై ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, భయాందోళనలకు తావులేకుండా పోలింగ్‌ జరిగేలా చూడటం అధికారులకు ప్రధాన బాధ్యతగా మారింది. 560 పోలింగ్‌ కేంద్రాలు.. పటిష్ట భద్రత.! జిల్లావ్యాప్తంగా 272 ప్రాంతాల్లో మొత్తం 560 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 155 అత్యంత సమస్యాత్మక, 180 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అలాగే, 335 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, 138 ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు. ఎన్నికల విధుల నిర్వహణకు 3,864 మంది పోలింగ్‌ సిబ్బందితోపాటు 208 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ప్రతి ఓటూ కీలకమే.! పులివెందులలో రాజకీయ పోరు తీవ్రంగా ఉండటంతోపాటు జమ్మలమడుగు, కడప ప్రాంతాల్లోనూ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ ప్రక్రియను ప్రశాంతంగా ముగించడం పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఎక్కడా ఘర్షణలకు తావులేకుండా, ప్రతి ఓటరూ స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. భయాందోళనలు వద్దు.. స్వేచ్ఛగా ఓటేయండి.! ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నవంబర్‌ 1న బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమయ్యే ప్రజా తీర్పు నవంబర్‌ 3న ఓట్ల లెక్కింపుతో వెల్లడికానుంది. దీంతో కడప జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.       [ Kadapa Municipal Elections, AP Municipal Polls, Kadapa Elections 2026, Pulivendula Elections, YS Jagan Mohan Reddy, Jammalamadugu Elections, Kadapa Political Tension, Andhra Pradesh Politics, Municipal Polling, Election Security, Police Deployment, Sensitive Polling Stations, Voter Safety ]  
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఆయన రాజకీయ విమర్శలు, వ్యూహాలు, ప్రెస్ మీట్లే. ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, పార్టీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి ఆ తరువాత క్రమంగా పార్టీలో ప్రాభవం, పలుకుబడి కోల్పోయారు. దరిమిలా 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం తరువాత ఆయన పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమని ప్రకటించారు. అయితే కొద్ది కాలానికే రాజకీయ సన్యాసంపై యూటర్న్ తీసుకుని సొంత పార్టీ అంటూ ప్రకటనలు గుప్పించారు. పనిలో పనిగా జగన్ పై విమర్శలూ గుప్పించారు. విజయసాయి తొలి నుంచీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజాగా ట్రెండ్ మార్చారు. ఇన్ స్టా గ్రాం రీల్స్ తో సందడి చేస్తున్నారు.  ఇటీవల   సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విజయసాయి  రాజకీయ విషయాలకే పరిమితం కాకుండా, విభిన్న అంశాలపై  రీల్స్ రూపొందిస్తూ  నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. తాజాగా  తారకరత్న కుమార్తెతో కలిసి ఆయన ఇటీవల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్  అయ్యింది.    అయితే విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే రాజకీయాల్లోకి సొంత పార్టీతో రీఎంట్రీ ఇవ్వబోతున్న విజయసాయి, ఇలా రీల్స్ లో నెట్టింట, నెటిజనులలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.   [Vijay Sai Reddy Instagram reels, New Political Strategy, AP politics, videos, digital politics, Telugu One]
అర్నాబ్ పెను తుపాను ఆంధ్ర ప్రదేశ్ లో పెను విలయం సృష్టించింది. ఈ పెను తుపాను కారణంగా భారీ స్థాయిలో ఆస్తి, పంట నష్టం సంభవించింది. తుపాను హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా ప్రాణనష్టం కనిష్టానికి తగ్గంది కానీ ఆస్తి, పంట నష్టం అపారంగా వాటిల్లింది.  ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో జరిగిన నష్టానికి తగిన సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి న చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడంతో, కేంద్రం తక్షణమే స్పందించి సహాయ చర్యలను ముమ్మరం చేసింది. అర్నాబ్  ధాటికి తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉప్పాడ వంటి తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రతకు మత్స్యకారుల బోట్లు, వలలు, ఇతర పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న పలువు స్థానికులను, కార్మికులను రెస్క్యూ టీమ్స్   సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు రహదారులపై చెట్లు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది.   ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో సుమారు రూ. 4 వేల600 కోట్ల మేర ఆస్తి, పంట  నష్టం వాటిల్లింది.   గతంలో వచ్చిన హుద్‌హుద్, తిత్లీ వంటి తుఫానుల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందని అధికార వర్గాలు వెల్లడించాయి.   ఈ సంక్షోభం నుంచి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్లను పునరుద్ధరించడం, మునిగిపోయిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను సరిచేయడం వంటి అత్యవసర పనులకు   ప్రాధాన్యత ఇస్తున్నారు. మత్స్యకారులు కోల్పోయిన బోట్లకు, జీవనోపాధికి తగిన నష్టపరిహారం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తూ, వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచారు.  అయితే ఏపీని ఆదుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు రావడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  అర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు. ఇందుకు తమిళనాడు సర్కార్ క్షణం ఆలోచంచకుండా సరే అంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిపవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా ఎన్డీయే తరఫున ప్రచారం చేశారు. అంటే తమిళనాడు సీఎం విజయ్ కు, ఆయన పార్టీ టీవీకేకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఏపీ వినతికి తక్షణమే స్పందించి ఏపీకి తమిళనాడు విద్యుత్ సిబ్బందిని, అవసరమైన సామగ్రిని పంపేందుకు అంగీకరించారు.   అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో  విద్యుత్ పునరుద్ధరణ పనులకు సహాయపడటానికి తెలంగాణ కూడా విద్యుత్ సిబ్బందిని పంపింది.   ఎన్నికలలో రాజకీయ వైరం సహజమే కానీ, కానీ విపత్తు సహాయక చర్యలు దానికి రాజకీయ విభేదాలకు అతీతంగా ఉండాలన్న సందేశాన్నిఏపీ, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు తమ చేష్టల ద్వారా చాటాయి. రాష్ట్రల మధ్య సమైక్యతకు, పరస్పర సహకారానికి ఇటువంటి చర్యలు ఎంతగానో దోహదం చేస్తాయని పరిశీలకులు అంటున్నారు.   [Tamilnadu Telangana come forward Help AP, Cyclone Arnab, Damage, Andhra Pradesh, Chandrababu Naidu,Vijay, Revanth, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ విడుదల కావడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. అయితే పోస్టర్‌లో నెమలి పింఛం కనిపించడంతో సోషల్ మీడియాలో ఓ కొత్త ప్రచారం మొదలైంది. గుజరాతీ హిట్ మూవీ ‘లాలో: కృష్ణ సదా సహాయతే’కు ‘RC17’ రీమేక్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. నిజానికి ‘లాలో’ సినిమా తెలుగు రీమేక్‌పై గతంలోనే వార్తలు వచ్చాయి. ఆ రీమేక్‌లో రామ్ చరణ్ శ్రీకృష్ణుడిగా కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ‘RC17’ కాన్సెప్ట్ పోస్టర్‌లో నెమలి పింఛం కనిపించడంతో ఈ రెండు విషయాలను కలిపి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధం లేదనే విషయాన్ని గుర్తించాలని సినీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాతీ చిత్రం ‘లాలో’ 2025లో విడుదలైంది. కానీ రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా మార్చి 2024లోనే అధికారికంగా ప్రకటించారు. పైగా, ఆ ప్రకటనకు చాలా ముందు నుంచే ‘RC17’ కథపై సుకుమార్ అండ్ టీం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ‘లాలో’ను చూసి ‘RC17’ కథను సిద్ధం చేశారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. అంతేకాదు, ‘RRR’ ప్రమోషన్ల సమయంలోనే రాజమౌళి కూడా రామ్ చరణ్–సుకుమార్ సినిమా కథ గురించి తనకు తెలుసని చెప్పిన విషయం తెలిసిందే. అంటే ఈ ప్రాజెక్ట్ ఆలోచన, కథా చర్చలు చాలా ముందుగానే మొదలయ్యాయి. ఇక కాన్సెప్ట్ పోస్టర్‌లో నెమలి పింఛం ఉండటంతో సినిమాలో శ్రీకృష్ణుడి ప్రస్తావన ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఒక్క పోస్టర్ ఆధారంగా సినిమా కథను నిర్ణయించడం తొందరపాటే అవుతుంది. నెమలి పింఛం ఒక ప్రతీకగా మాత్రమే ఉండొచ్చు. దాని వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ఏమిటనేది మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. ‘పుష్ప’ సినిమాలతో సుకుమార్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ చరణ్‌కు కూడా ‘RRR’తో దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అలాంటి వీరిద్దరూ 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రెండోసారి చేతులు కలిపారంటే.. ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారో ఊహించుకోవచ్చు. ఇలా ఒక సినిమాను రీమేక్ చేస్తారంటే ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. మొత్తానికి నెమలి పింఛం కనిపించడంతో ‘లాలో’ రీమేక్‌ అనే చర్చ మొదలైనా.. ఈ రెండు సినిమాల మధ్య సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు. సుకుమార్ తనదైన శైలిలో రామ్ చరణ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. ఇది కూడా చదవండి: మూడు రోజుల్లో అన్ని కోట్లా.. పోస్టర్‌తో షాకిచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ టీమ్.! https://x.com/MythriOfficial/status/2116801748258201802       [RC17 Laalo Remake News, RC17 Concept Poster, Ram Charan Lord Krishna, Ram Charan Sukumar Movie, Laalo Telugu Remake, RC17 Movie, Ram Charan, Sukumar]  
అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులపై జరిగిన దాడి ఘటన తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేస్తోంది. తరగతి గదిలోనే ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై దాడి చేయగా, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో బాలిక కూడా గాయపడింది. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. తాజాగా నటుడు మంచు మనోజ్ కూడా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఓ తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మనోజ్ పేర్కొన్నారు. బాధిత బాలికలిద్దరూ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తన స్నేహితురాలిని కాపాడేందుకు ముందుకొచ్చిన బాలిక అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. ఆమెకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలని కోరారు. బాలికలకు ప్రాణాలను కాపాడే చికిత్స అందిస్తున్న వైద్యులకు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి, తరలింపు ప్రక్రియను సమన్వయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు, వైద్య బృందాలను అభినందించారు. బాధిత విద్యార్థుల కోసం 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సెలర్లను నియమించడం సంతోషకరమని పేర్కొంటూ, ఈ ఘటనతో ప్రభావితమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబాలకు నిరంతర మానసిక సహకారం అందించాలని కోరారు. మహిళలను వస్తువులుగా చూడటం, సరదా పేరుతోనైనా అగౌరవపరచడం ప్రమాదకరమైన ఆలోచనలకు దారితీస్తుందని మనోజ్ అభిప్రాయపడ్డారు. వేధింపులు, హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉండాలని, రోజువారీ జీవితంలో మహిళల పట్ల చూపించే అగౌరవాన్ని కూడా ప్రశ్నించాలని అన్నారు. మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలవుతుందని, పిల్లలు పెద్దల ప్రవర్తనను గమనిస్తుంటారని గుర్తుచేశారు. మనం కోరుకునే సురక్షితమైన సమాజం మన ఇళ్లలో మహిళలతో ఎలా వ్యవహరిస్తున్నామనే దాని నుంచే మొదలవుతుందని మంచు మనోజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.     [Manchu Manoj, Raptadu Incident, Manchu Manoj Emotional Post, Raptadu School Attack, Andhra Pradesh News, Women Safety, Manchu Manoj Instagram, Telugu Cinema News]
తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కసాండ్రా తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. గతంలో ఓ ప్రేమ బంధంలో తీవ్రంగా మోసపోయానని, ఆ సంఘటన తనను మానసికంగా కుంగదీసిందని వెల్లడించారు. 2020లో తన చివరి ప్రేమ బంధం ముగిసిపోయిందని, ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్న రెజీనా.. ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ గురించి మాట్లాడారు. 2020లో తన జీవితంలో ఎదురైన నమ్మకద్రోహం తీవ్రంగా బాధించిందని, ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపారు. ఆ మానసిక సంఘర్షణ నుంచి కోలుకోవడం అంత సులభం కాలేదని చెప్పారు. ఆ అనుభవం తర్వాత కొంతకాలం ప్రేమ, డేటింగ్ వంటి బంధాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ బాధ నుంచి బయటపడటానికి తనకు తాను సమయం కేటాయించుకోవడం, తనను తాను ప్రేమించుకోవడం అలవర్చుకున్నానని రెజీనా వివరించారు. ప్రేమలో విఫలమైనప్పుడు లేదా ఎవరైనా మోసం చేసినప్పుడు తమను తాము నిందించుకోవద్దని మహిళలకు సూచించారు. లైంగిక వేధింపులు, ఇతర చేదు అనుభవాలు ఎదురైనప్పుడు వాటిని మనసులోనే దాచుకోకుండా ధైర్యంగా బయటకు చెప్పుకోవాలని అన్నారు. బాధ కలిగినప్పుడు ఏడవాలనిపిస్తే ఏడవాలని, ఆ భావాలను అణచుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే తనను మోసం చేసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం రెజీనా వెల్లడించలేదు. గతంలోనూ తన రిలేషన్‌షిప్స్ గురించి బహిరంగంగా మాట్లాడిన ఆమె, ఇప్పుడు మరోసారి వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను పంచుకోవడంతో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెడుతూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు రెజీనా.     [Regina Cassandra, Regina Cassandra Breakup, Regina Cassandra Relationship, Regina Cassandra Heartbreak, Regina Cassandra Interview, Regina Cassandra Depression, Mookuthi Amman 2, Regina Cassandra Latest News]
King Nagarjuna is presenting Itllu Arjuna, starring debutant Aniesh and Anaswara Rajan, which has been generating good anticipation ahead of its theatrical release. The songs composed by star music director S Thaman have become chartbusters, while the glimpse and teaser have created curiosity around this new-age romantic entertainer.  Aniesh's decision to make his acting debut with a challenging mute character has also become an interesting talking point. The makers have now locked 4th November as the trailer release date and unveiled an intriguing new poster. It features Aniesh driving a car with a damaged windshield as Anaswara looks tense, with goons chasing them.  The action-packed visual hints at an intense conflict in the couple's journey and adds another layer of curiosity to the film's premise. Aniesh has caught attention through his expressions, dancing skills and chemistry with Anaswara, despite taking up a role that demands him to communicate without dialogues.  The film's promotional campaign, particularly the music and the new-guy-in-town approach, has helped build interest among audiences. Nagarjuna expressed his confidence on moving becoming a success and he decided to support the young team by becoming the presenter. Itllu Arjuna is releasing on 13th November.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం.47’ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధికారిక పోస్టర్‌ ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘బ్లాక్‌బస్టర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. శుక్రవారం (అక్టోబర్‌ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. వెంకటేశ్‌ కామెడీ టైమింగ్‌, త్రివిక్రమ్‌ మార్క్‌ సంభాషణలు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో వసూళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించగా.. నారా రోహిత్‌, నివేదా పేతురాజ్‌, సత్య, రావు రమేశ్‌, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌. రాధాకృష్ణ నిర్మించారు. తమన్‌ సంగీతం అందించారు. మొత్తానికి వెంకటేశ్‌–త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక సోమవారం నుంచి వచ్చే రోజుల్లో సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: బ్లడీ రోమియో.. మొత్తం లీక్ చేసేశారు పాపం.! https://x.com/haarikahassine/status/2117138436901802128       [Aadarsha Kutumbam Collections, Aadarsha Kutumbam 75 Crores, Aadarsha Kutumbam Box Office, Aadarsha Kutumbam House No 47, AK47 Box Office, Venkatesh, Trivikram, Srinidhi Shetty]  
సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్నారు. ఈ జంటపై క్లాప్ చంద్రబోస్ కొట్టారు. ప్రొడ్యూసర్ కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ చిత్రంతో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను సైతం గౌతమ్ ప్రసాద్ యల్లపు అందిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్‌కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.  ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని నాలుగు షెడ్యూల్స్‌లో ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షెడ్యూల్స్ కోనసీమ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమ కథా చిత్రం, కుటుంబం మొత్తం ఈ చిత్రాన్ని చూసి హాయిగా ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.  
టాలీవుడ్‌లో లీకుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. పలు సినిమాల షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా నాని, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’కు కూడా ఇదే సమస్య ఎదురైంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని పలు బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే పబ్లిక్ లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తుండటంతో స్థానికులు తమ ఫోన్లలో నాని లుక్‌ను, కొన్ని కీలక సన్నివేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సినిమాలో నాని లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్‌కు సంబంధించిన విజువల్స్ బయటకు రావడం చిత్ర బృందానికి ఇబ్బందిగా మారింది. సినిమా కోసం దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ఇలా ముందుగానే బయటకు వస్తే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. అందుకే రాబోయే షెడ్యూల్స్‌లో షూటింగ్ ప్రదేశాల వద్ద మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బ్లడీ రోమియో’లో నాని చెఫ్‌తో పాటు గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ‘సాహో’, ‘ఓజీ’ చిత్రాలతో స్టైలిష్ యాక్షన్‌ను చూపించిన సుజీత్.. నాని కోసం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారన్న ఆసక్తి నెలకొంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: శింబు - నయనతార.. పదేళ్ల తర్వాత కలవబోతున్న క్రేజీ జోడి.!       [Bloody Romeo Shooting Videos Leaked, Nani Bloody Romeo Movie, Nani Sujeeth Movie, Bloody Romeo Shooting, Nani, Bloody Romeo, Sujeeth, Telugu Film News]  
కోలీవుడ్‌లో ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన జంట శింబు, నయనతార. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయినప్పటికీ.. సినిమాల్లో మాత్రం మంచి జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'డ్యూడ్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కీర్తీశ్వరన్ తెరకెక్కించనున్న సినిమాలో శింబుకు జోడీగా నయనతారను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో 'అరసన్' సినిమా చేస్తున్న శింబు.. ఆ తర్వాత కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందట. ఇందులో శింబు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. శింబు, నయనతార దాదాపు పదేళ్ల తర్వాత కలిసి నటించినట్లవుతుంది. గతంలో వీరిద్దరూ 'వల్లవన్' (2006), 'ఇదు నమ్మ ఆళు' (2016) సినిమాల్లో కలిసి నటించారు. ముఖ్యంగా 'ఇదు నమ్మ ఆళు' తర్వాత మళ్లీ వీరిద్దరూ జోడీ కడతారనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.  ఇది కూడా చదవండి: NBK112 కోసం బాలకృష్ణ షాకింగ్ రెమ్యునరేషన్.!       [Simbu Nayanthara Reunion, Simbu Nayanthara Movie, Simbu New Movie, Nayanthara New Movie, Simbu, Nayanthara, Keerthiswaran, Telugu Film News]  
నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్నారు. ఒకప్పుడు ఆయన సినిమాల బడ్జెట్, మార్కెట్ గురించి చర్చ జరిగితే.. ఇప్పుడు పారితోషికం విషయంలోనూ ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే NBK112 సినిమా కోసం బాలయ్య భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే ప్రచారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.45 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ మార్కెట్ గణనీయంగా పెరిగింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' వంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో బాలయ్య సినిమాలకు ఉండే ఆదరణ నిర్మాతలకు మంచి నమ్మకాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ సినిమాకు రూ.45 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే నిజమైతే బాలకృష్ణ కెరీర్‌లోనే అత్యధిక పారితోషికాల్లో ఒకటిగా నిలవనుంది. ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమా చేస్తున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపైనా అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24, 2026న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. NBK112ను సుధాకర్ మిక్కిలినేని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: 800 కోట్ల క్లబ్‌లో ‘జైలర్ 2’.. కోలీవుడ్ 1000 కోట్ల కల నెరవేరుతుందా.?       [Nandamuri Balakrishna Remuneration, Balakrishna 45 Crore Remuneration, NBK112 Movie Update, Nandamuri Balakrishna, Koratala Siva, Gopichand Malineni, Dada Movie, Telugu Film News]  
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. విడుదలైన 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్ల మార్క్‌కు చేరువైంది. ఇప్పటికే రజినీకాంత్ గత చిత్రం '2.0' రికార్డును కూడా అధిగమించి.. అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా 17వ రోజు కలెక్షన్లలోనూ ఈ సినిమా మంచి జోరు చూపించింది. శనివారం ఒక్కరోజే ఇండియాలో రూ.9.35 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. శుక్రవారం వచ్చిన రూ.5.50 కోట్లతో పోలిస్తే దాదాపు 70 శాతం వృద్ధి కనిపించడం విశేషం. 17 రోజుల వసూళ్లను పరిశీలిస్తే.. ఇండియాలో ఈ సినిమా మొత్తం రూ.444.75 కోట్ల నెట్, రూ.520.35 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్‌లో రూ.270.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు రూ.790.85 కోట్లకు చేరుకున్నాయి. అంటే రూ.800 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడానికి మరో రూ.9.15 కోట్లు మాత్రమే అవసరం. మొత్తానికి 'జైలర్ 2' ఇప్పుడు రూ.800 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ఈ మైలురాయిని అందుకుంటే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లు వసూలు చేసిన తొలి తమిళ సినిమాగా అరుదైన రికార్డు సృష్టించనుంది.  ఇదే జోరు కొనసాగితే 'జైలర్ 2' మూవీ ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల మార్క్‌కు చేరువైనా ఆశ్చర్యంలేదు. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటివరకు పది సినిమాలు మాత్రమే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. అందులో తెలుగు, హిందీ, కన్నడ సినిమాలు ఉండగా.. తమిళ్ కి మాత్రం ఆ టార్గెట్ అందని ద్రాక్షలా మారింది. ఇప్పుడు 'జైలర్ 2' ఆ మార్క్‌ను అందుకుంటే హిస్టరీ అవుతుంది. ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ.!       [Jailer 2 800 Crore Club, Jailer 2 Day 17 Collection, Jailer 2 Box Office Collection, Jailer 2 1000 Crore Club, Jailer 2 Worldwide Gross, Jailer 2 Movie, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన శరీరానికి రోజూ తగినంత పోషకాహారం అందాలంటే నిత్యం ఏదో ఒక రూపంలో పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రతిరోజూ కాసిని మొలకవచ్చిన గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. కానీ ఆరోగ్యానికి ఎంత మంచివైనప్పటికీ, మొలకలను అలాగే తినమంటే పిల్లలు పెద్దగా సహించరు, ఇష్టపడకుండా మొండికేస్తుంటారు. వాళ్ళ కోసం కేవలం రెండు నిమిషాలు కేటాయించి కొంచెం రుచిగా మార్చితే చాలు, ఇలా గనుక చేశారంటే క్షణాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు. మరి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ రుచికరమైన మొలకల చాట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆరోగ్యకరమైన చాట్ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటంటే: ముందుగా మొలకెత్తిన శనగలు, పెసలు, సోయాబీన్స్ అన్నీ కలిపి ఒక కప్పు నిండుగా తీసుకోవాలి. అలాగే ఉల్లి, పన్నీర్, క్యారెట్, కొత్తిమీర తరుగు, టొమాటో ముక్కలు గుప్పెడు చొప్పున సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటుగా 2 పచ్చిమిర్చి, 3 స్పూన్లు సన్న కారప్పూస, రుచికి సరిపడా ఉప్పు, ముప్పావు స్పూన్ చొప్పున మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం తీసుకోవాలి. ఇంకా అర స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల చొప్పున దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలు సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక దీని తయారీ విధానం చాలా సులభం. ముందుగా గింజలన్నింటినీ ముందురోజు ఉదయం నానబెట్టి, రాత్రి సమయంలో ఆ నీళ్లను వంపేయాలి. అలా చేస్తే మరుసటి ఉదయానికి గింజలకు చక్కగా మొలకలు వస్తాయి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ వెడల్పాటి పాత్రలో పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లి, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర తరుగు, సన్న కారప్పూస వేయాలి. వీటికి తోడుగా తగినంత ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, వేయించిన పల్లీలను కూడా కలిపి బాగా మిక్స్ చేస్తే చాలు, నోరూరించే కరకరలాడే  మొలకల చాట్  క్షణాల్లో సిద్ధమైపోతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.     Sprouts Chaat Recipe, Healthy Evening Snacks, Protein Rich Indian Recipes, Weight Loss Snacks, Sprouted Moong Chaat, Quick Healthy Food Ideas, Cooking Tips In Telugu.
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది పౌష్టికాహారాన్ని సరిగ్గా తీసుకోలేక బలహీనపడుతున్నారు. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని అద్భుతమైన గింజలు, ఆహార పదార్థాల ద్వారా రోజూ శరీరానికి కావలసిన శక్తిని సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మన ఆరోగ్యానికి ఒక గొప్ప దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే ఈ గింజలు శరీరానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి. సాధారణంగా మనం తీసుకునే పండ్లు లేదా లీటర్ల కొద్దీ పాలు తాగినా లభించని శక్తి కేవలం గుప్పెడు ఈ గింజల ద్వారా లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. కేవలం 100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పు బాదం పప్పుకు సమానమైన శక్తిని, పోషకాలను అందిస్తూ శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది చికెన్, మటన్ కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని మరియు శక్తిని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. మన శరీర కణాల పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి విటమిన్ బి6 ఎంతో అవసరం. ఇది నరాల పనితీరును మెరుగుపరచడంలోనూ, జీర్ణకోశ సంబంధిత సమస్యలు దరిచేరకుండా నిరోధించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో ఎంజైములు, హార్మోన్లు సమృద్ధిగా ఉత్పత్తి కావడానికి విటమిన్ బి6 ఎంతగానో దోహదపడుతుంది. రక్తం ఉత్పత్తికి కూడా ఇది ఎంతో అవసరం. సాధారణంగా మనం తినే దంపుడు బియ్యం, మిల్లెట్స్ వంటి వాటిలో విటమిన్ బి6 ఉన్నప్పటికీ, వాటిని ఉడికించడం వల్ల అందులోని కొన్ని పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. అయితే, పొద్దుతిరుగుడు గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం వల్ల విటమిన్ బి6 ఎలాంటి నష్టం లేకుండా పూర్తిగా శరీరానికి అందుతుంది. ఇక చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి, అలాగే స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రాకుండా ఉండడానికి విటమిన్ ఇ అత్యంత కీలకం. ఇది శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షించడంలోనూ సహాయపడుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజువారీగా 15 మిల్లీగ్రాముల విటమిన్ ఇ అవసరం కాగా, బాదం పప్పులో 28 మిల్లీగ్రాములు ఉండగా, పొద్దుతిరుగుడు పప్పులో మాత్రం ఇది ఏకంగా 35 మిల్లీగ్రాముల వరకు లభిస్తుంది. అందుకే చాలా మంది సినిమా నటీనటులు యవ్వనంగా కనిపించడానికి ప్రత్యేకంగా విటమిన్ ఇ క్యాప్సూల్స్, లోషన్స్ వాడుతుంటారు. శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందిలో మెగ్నీషియం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పొద్దుతిరుగుడు గింజలు ఈ మెగ్నీషియం లోపాన్ని సమర్థవంతంగా నివారించి, ఈ ఖనిజాన్ని సమృద్ధిగా అందిస్తాయి. శరీరానికి అవసరమైన మెగ్నీషియంను పొందడానికి దీన్ని నంబర్ వన్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఈ గింజలను తీసుకోవడానికి సరైన విధానం ఏమిటంటే.. వీటిని ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం పూట పండ్లతో పాటు డిన్నర్‌లో తీసుకోవచ్చు. లేదా రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం అల్పాహారంలో మొలకలతో పాటు తినవచ్చు. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఒకవేళ ప్రయాణాలలో నానబెట్టడం సాధ్యం కాకపోతే, డ్రై రోస్ట్ చేసుకున్న విత్తనాలను కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో, అలాగే బరువు పెరగాలనుకునేవారు కాస్త ఎక్కువ మోతాదులో అంటే రోజుకు దాదాపు 25 నుండి 40 గ్రాముల వరకు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.     Sunflower Seeds Benefits, Energy Boosting Superfoods, Nutritious Seeds For Health, Sunflower Seeds For Stamina, Healthy Diet Tips, Immunity Boosting Foods, Health Tips In Telugu.
శరీరానికి సరైన పోషకాలు అందకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది పౌష్టికాహారాన్ని సరిగ్గా తీసుకోలేక బలహీనపడుతున్నారు. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన కొన్ని అద్భుతమైన గింజలు, ఆహార పదార్థాల ద్వారా రోజూ శరీరానికి కావలసిన శక్తిని సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds) మన ఆరోగ్యానికి ఒక గొప్ప దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే ఈ గింజలు శరీరానికి అద్భుతమైన పోషణను అందిస్తాయి. సాధారణంగా మనం తీసుకునే పండ్లు లేదా లీటర్ల కొద్దీ పాలు తాగినా లభించని శక్తి కేవలం గుప్పెడు ఈ గింజల ద్వారా లభిస్తుందంటే అతిశయోక్తి కాదు. కేవలం 100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పు బాదం పప్పుకు సమానమైన శక్తిని, పోషకాలను అందిస్తూ శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది చికెన్, మటన్ కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని మరియు శక్తిని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది. మన శరీర కణాల పనితీరుకు, మానసిక ఆరోగ్యానికి విటమిన్ బి6 ఎంతో అవసరం. ఇది నరాల పనితీరును మెరుగుపరచడంలోనూ, జీర్ణకోశ సంబంధిత సమస్యలు దరిచేరకుండా నిరోధించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే శరీరంలో ఎంజైములు, హార్మోన్లు సమృద్ధిగా ఉత్పత్తి కావడానికి విటమిన్ బి6 ఎంతగానో దోహదపడుతుంది. రక్తం ఉత్పత్తికి కూడా ఇది ఎంతో అవసరం. సాధారణంగా మనం తినే దంపుడు బియ్యం, మిల్లెట్స్ వంటి వాటిలో విటమిన్ బి6 ఉన్నప్పటికీ, వాటిని ఉడికించడం వల్ల అందులోని కొన్ని పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. అయితే, పొద్దుతిరుగుడు గింజలను రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం వల్ల విటమిన్ బి6 ఎలాంటి నష్టం లేకుండా పూర్తిగా శరీరానికి అందుతుంది. ఇక చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి, ముడతలు పడకుండా నిరోధించడానికి, అలాగే స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రాకుండా ఉండడానికి విటమిన్ ఇ అత్యంత కీలకం. ఇది శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల బారి నుంచి రక్షించడంలోనూ సహాయపడుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజువారీగా 15 మిల్లీగ్రాముల విటమిన్ ఇ అవసరం కాగా, బాదం పప్పులో 28 మిల్లీగ్రాములు ఉండగా, పొద్దుతిరుగుడు పప్పులో మాత్రం ఇది ఏకంగా 35 మిల్లీగ్రాముల వరకు లభిస్తుంది. అందుకే చాలా మంది సినిమా నటీనటులు యవ్వనంగా కనిపించడానికి ప్రత్యేకంగా విటమిన్ ఇ క్యాప్సూల్స్, లోషన్స్ వాడుతుంటారు. శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందిలో మెగ్నీషియం లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పొద్దుతిరుగుడు గింజలు ఈ మెగ్నీషియం లోపాన్ని సమర్థవంతంగా నివారించి, ఈ ఖనిజాన్ని సమృద్ధిగా అందిస్తాయి. శరీరానికి అవసరమైన మెగ్నీషియంను పొందడానికి దీన్ని నంబర్ వన్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఈ గింజలను తీసుకోవడానికి సరైన విధానం ఏమిటంటే.. వీటిని ఉదయం నీటిలో నానబెట్టి సాయంత్రం పూట పండ్లతో పాటు డిన్నర్‌లో తీసుకోవచ్చు. లేదా రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం అల్పాహారంలో మొలకలతో పాటు తినవచ్చు. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఒకవేళ ప్రయాణాలలో నానబెట్టడం సాధ్యం కాకపోతే, డ్రై రోస్ట్ చేసుకున్న విత్తనాలను కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు తక్కువ మోతాదులో, అలాగే బరువు పెరగాలనుకునేవారు కాస్త ఎక్కువ మోతాదులో అంటే రోజుకు దాదాపు 25 నుండి 40 గ్రాముల వరకు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.     Sunflower Seeds Benefits, Energy Boosting Superfoods, Nutritious Seeds For Health, Sunflower Seeds For Stamina, Healthy Diet Tips, Immunity Boosting Foods, Health Tips In Telugu.
ఉపవాసం అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తువచ్చేది ఏదో ఒక పూట భోజనం మానివేయడం లేదా దేవుడి పేరుతో చేసే పూజా కార్యక్రమాలు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం , మన పురాతన కాలం నాటి ఆచారాలు కూడా ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మనం పాటించే చిన్న ఉపవాస పద్ధతి శరీరం లోపల ఎన్నో అద్బుతమైన మార్పులకు కారణమవుతుంది. ఉపవాసం గురించి మూర్ఖంగా వాదించే వారు కూడా ఉంటారు.  అలాంటి వారు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోవాలి.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి.. శరీరానికి ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటే జీర్ణవ్యవస్థ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం, కణాల పనితీరు మందగించడం జరుగుతుంది. అదే మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణక్రియకు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతుంది. ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు.. బరువు నియంత్రణ.. మనం తినడం ఆపినప్పుడు శరీరం శక్తి కోసం మొదట గ్లూకోజ్ ను, ఆ తర్వాత నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల అనవసరమైన కొవ్వు సులభంగా కరిగిపోయి బరువు అదుపులోకి వస్తుంది.   రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఉపవాస సమయాల్లో శరీరం పాత , దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. కొద్దిసేపు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, మధుమేహం అదుపులో ఉండేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది. మెదడు చురుకుదనం.. ఉపవాసం ఉన్న సమయంలో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి , ఏకాగ్రత మెరుగుపడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజం తెలుసుకోవాలి.. అయితే ఉపవాసం అంటే రోజంతా పస్తులు ఉండమని కాదు. మన శరీర తత్వానికి తగినట్లుగా, నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతూ తేలికపాటి పద్ధతిలో ఉపవాసం ఉండటం మంచిది. ఒకసారి ఈ చిన్న అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే, అనారోగ్యాలొచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయి నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి  ఉపవాసాన్ని కేవలం ఆచారంలా కాకుండా ఆరోగ్య రహస్యంగా భావించి పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది.                                                                                                                                        *రూపశ్రీ.
రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? రక్త ప్రసరణ సరిగా జరగడం లేదా? రక్తనాళాల్లో బ్లాకులు ఎందుకు ఏర్పడతాయి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుందా? మన వంటింట్లోనే దొరికే నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు? ఈ చూర్ణంలో ఉపయోగించే దినుసులు ఏమిటి? వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఆయుర్వేద, వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వివరించారు. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి గల కారణాలు, కొలెస్ట్రాల్ సమస్యలు, రక్త ప్రసరణకు సంబంధించిన విషయాలు, నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణం తయారీ విధానం గురించి డాక్టర్ మధుసూదన శర్మ గారి వివరణను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రక్తనాళాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు, రక్త ప్రసరణ గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ వీడియోను చూడండి. ముఖ్య గమనిక: రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ఆయుర్వేద చూర్ణం లేదా ఇతర ఇంటి వైద్యాలను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపకూడదు. రక్తనాళాల్లోని బ్లాకులకు మందులు లేదా స్టెంట్ అవసరమా అనే విషయాన్ని వైద్యులే నిర్ణయించాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
 విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..! శరీరానికి కావాల్సిన విటమిన్లు , పోషకాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం సాధారణంగా కాల్షియం, ఐరన్ లేదా విటమిన్-సి వంటి వాటి గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉంటాము. కానీ మన శరీరంలో విటమిన్-డి పాత్ర ఎంత ముఖ్యమైనదో చాలా మందికి సరిగ్గా తెలియదు. ఎముకలను బలంగా ఉంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని అందరూ అనుకుంటారు. అయితే నేటి కాలపు వైద్యులు చెబుతున్న దాని ప్రకారం విటమిన్-డి మన శరీరంలోని ఎముకలకు మాత్రమే కాకుండా ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా చాలా అవసరం. ఎండలో తిరిగితే లభించే ఈ విటమిన్ లోపిస్తే దంపతులలో పిల్లలు పుట్టే అవకాశాలపై ప్రభావం పడుతుందా లేదా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో కలుగుతోంది. ఈ విషయంలో వైద్య నిపుణులు , పరిశోధనలు ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుంటే.. మన దేశంలో ఎండకు ఎటువంటి కొదవ ఉండదు. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి పుష్కలంగా లభిస్తుంది. అయినప్పటికీ మనలో చాలా మంది విటమిన్-డి లోపంతో బాధపడుతూ ఉంటారు. అందుకే ఆరోగ్య నిపుణులు దీనిని ఒక రకమైన సైలెంట్ సమస్యగా చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఎలాంటి పెద్ద లక్షణాలు లేకుండానే శరీరం లోపల ఉండి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇటీవలి కాలంలో జరిగిన పలు వైద్య అధ్యయనాలు ఈ విటమిన్ లోపానికి పురుషులు , మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలకు మధ్య గట్టి సంబంధం ఉందని వెల్లడించాయి. మహిళలకు.. మహిళల విషయంలో చూస్తే విటమిన్-డి లోపం వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. మహిళల నెలసరి క్రమంగా రావడానికి , అండాశయాల నుంచి ప్రతి నెల ఆరోగ్యకరమైన అండం విడుదల కావడానికి కొన్ని రకమైన హార్మోన్లు చాలా అవసరం. విటమిన్-డి మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తూ ఈ ప్రక్రియను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరంలో దీని స్థాయి తగ్గినప్పుడు హార్మోన్ల పనితీరు మందగించి అండాల నాణ్యత , సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఇది నేరుగా పూర్తిగా సంతానలేమికి కారణం కాకపోయినా గర్భం దాల్చడాన్ని కష్టతరం చేయడంలో మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. పురుషులకు.. పురుషుల ఆరోగ్యం విషయానికి వస్తే వారిలో కూడా సంతానోత్పత్తి సామర్థ్యంపై విటమిన్-డి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులలో వీర్యకణాల సంఖ్య, వాటి నాణ్యత , అవి కదిలే వేగం సక్రమంగా ఉండటంలో ఈ విటమిన్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుంది. పురుషుల శరీరంలో వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే చోట ప్రత్యేకమైన విటమిన్-డి రిసెప్టర్లు ఉంటాయి. ఇవి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని , వీర్యకణాల తయారీని నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరంలో విటమిన్-డి తగినంత లేకపోతే వీర్యకణాల నాణ్యత తగ్గిపోయి తద్వారా సంతానోత్పత్తి సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది.  ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఒక చిన్న రక్త పరీక్ష ద్వారా మన శరీరంలో విటమిన్-డి ఎంత మోతాదులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లోపం ఉన్నట్లు తేలితే ఆహారపు అలవాట్లలో , జీవనశైలీలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సరిదిద్దుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పూట కొంత సమయం ఎండలో గడపడం చాలా మంచిది. దీనితో పాటు గుడ్డు సొన, చేపలు, , విటమిన్-డితో కూడిన పౌష్టికాహారాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ లోపం చాలా ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా మేరకు తగిన సప్లిమెంట్లను వాడుకోవచ్చు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడమే ఎప్పుడూ మంచిది.                                                                                                                                           *రూపశ్రీ.