
టాలీవుడ్లో లీకుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. పలు సినిమాల షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా నాని, సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’కు కూడా ఇదే సమస్య ఎదురైంది. ఢిల్లీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘ది ప్యారడైజ్’ తర్వాత నాని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తదుపరి ప్రాజెక్ట్ ‘బ్లడీ రోమియో’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని పలు బహిరంగ ప్రదేశాల్లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే పబ్లిక్ లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తుండటంతో స్థానికులు తమ ఫోన్లలో నాని లుక్‌ను, కొన్ని కీలక సన్నివేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి.
ఈ సినిమాలో నాని లుక్, గెటప్, బాడీ లాంగ్వేజ్‌కు సంబంధించిన విజువల్స్ బయటకు రావడం చిత్ర బృందానికి ఇబ్బందిగా మారింది. సినిమా కోసం దర్శకుడు సుజీత్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇలా ముందుగానే బయటకు వస్తే ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. అందుకే రాబోయే షెడ్యూల్స్‌లో షూటింగ్ ప్రదేశాల వద్ద మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘బ్లడీ రోమియో’లో నాని చెఫ్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ‘సాహో’, ‘ఓజీ’ చిత్రాలతో స్టైలిష్ యాక్షన్‌ను చూపించిన సుజీత్.. నాని కోసం ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించారన్న ఆసక్తి నెలకొంది.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2027 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: శింబు - నయనతార.. పదేళ్ల తర్వాత కలవబోతున్న క్రేజీ జోడి.!
[Bloody Romeo Shooting Videos Leaked, Nani Bloody Romeo Movie, Nani Sujeeth Movie, Bloody Romeo Shooting, Nani, Bloody Romeo, Sujeeth, Telugu Film News]





