
సకల సమృద్ధి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. హీరో రాజీవ్ వర్మ, హీరోయిన్ మలైకా టి. వాసుపాల్ జంటగా నటిస్తున్నారు. ఈ జంటపై క్లాప్ చంద్రబోస్ కొట్టారు. ప్రొడ్యూసర్ కనుమూరి ప్రసాద్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చిత్ర దర్శకుడు గౌతమ్ ప్రసాద్ యల్లపు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
ఈ చిత్రంతో గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేను సైతం గౌతమ్ ప్రసాద్ యల్లపు అందిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, కుమనన్ అలియాస్ రమణ, జెమిని సురేష్, రమణ భార్గవ్, శివాజీ రాజా, ఆయూషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కనుమూరి ప్రసాద్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్‌కే సేనాపతి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
ఈ సినిమా తొలి షెడ్యూల్ ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని నాలుగు షెడ్యూల్స్‌లో ముగించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మిగిలిన షెడ్యూల్స్ కోనసీమ పరిసర ప్రాంతంలో జరుగనున్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమ కథా చిత్రం, కుటుంబం మొత్తం ఈ చిత్రాన్ని చూసి హాయిగా ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు చిత్రీకరిస్తున్నారు.






